Home » » Good Response For Nuvena

Good Response For Nuvena 'నువ్వేనా' సీజన్‌ 1కు ట్రెమండస్‌ రెస్పాన్స్‌.. సంక్రాంతికి సీజన్‌ 2 షూటింగ్‌ ప్రారంభం


శ్రీనివాస్ అనంతనేని , ప్రమీల హీరోహీరోయిన్లుగా.. రామ్‌కుమార్‌ వంగోజు దర్శకత్వంలో పవన్ సిద్దార్థ క్రియేషన్స్ పతాకంపై..  ట్రై యాంగిల్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన వెబ్‌ సిరీస్‌ 'నువ్వేనా'. టూ టౌన్ లవ్ స్టోరీ అనేది ట్యాగ్‌లైన్‌తో రూపుదిద్దుకున్న ఈ వెబ్ సిరీస్ సీజన్ -1 ఇటీవలే అమెజాన్ ప్రైమ్‌ వీడియో, mx ప్లేయర్, ఎయిర్‌టెల్‌ ఎక్స్‌ట్రీమ్‌ ద్వారా విడుదలై  మంచి  స్పందనను రాబట్టుకుంటోన్న తరుణంలో సీజన్‌2ను సంక్రాంతి నుంచి తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా నిర్మాత శ్రీనివాస్ అనంతనేని తెలియజేశారు.


ఈ సందర్భంగా దర్శకుడు రామ్‌కుమార్‌ వంగోజు మాట్లాడుతూ.. '' 'నువ్వేనా' సీజన్‌ 1లోని ఒక పాటను ఎల్లిపోకే ... ఫేమ్ సింగర్ దిలీప్ దేవగన్ పాడగా మంచి రెస్పాన్స్‌ వచ్చింది. అదే స్థాయిలో రెండో సాంగ్ కూడా ప్రేక్షకులని ఆకట్టుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా వెబ్‌ సిరీస్‌ నువ్వేనకి పనిచేసిన సినిమాటోగ్రఫర్ మహిషేర్ల, సంగీతాన్ని అందించిన సన్నీ AR, ఎడిటర్ వీరు, సాహిత్యం అందించిన నరేష్‌ల ఎఫర్ట్ మరవలేనిది. సంక్రాంతికి 'నువ్వేనా' సీజన్ -2 షూటింగ్‌ ప్రారంభిస్తాము. ఇందులో నూతన నటీనటులకు అవకాశం కల్పించనున్నాము. సీజన్‌ 1ని ఆదరించిన ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు..'' అని తెలిపారు.


శ్రీనివాస్‌ అనంతనేని, ప్రమీల ప్రధాన తారాగణంగా తెరకెక్కిన ఈ వెబ్‌ సిరీస్‌కి సంగీతం: సన్నీ ఏ.ఆర్‌, ఎడిటింగ్‌: వీరు, సినిమాటోగ్రఫీ: మహీ షేర్లా, పాటలు: నరేష్‌, సింగర్‌: దిలీప్‌ దేవగన్‌, పీఆర్వో: బిఎస్‌ వీరబాబు, నిర్మాత: శ్రీనివాస్‌ అనంతనేని, రచన-దర్శకత్వం: రామ్‌కుమార్‌ వంగోజు.


Share this article :