Home » » Hero Nikhil launched Seethannapeta Gate Teaser

Hero Nikhil launched Seethannapeta Gate Teaser

 


క్రేజీ  హీరో నిఖిల్ చేతుల మీదుగా ‘‘ సీతన్న పేట గేట్’’ టీజర్ విడుదల


 యు అండ్ ఐ   స్టూడియోస్ ప్రవేట్ లిమిటెడ్

సినిమా పతాకంపై ఎ. పద్మనాభ రెడ్డి  నిర్మాణంలో రాజ్ కుమార్ దర్శకునిగా పరిచయం చేస్తూ  వాస్తవ సంఘటనలు ఆధారంగా విజయవాడ బ్యాక్ డ్రాప్ లో రూపోందిన  క్రైమ్ సస్పెన్స్ డ్రామా‘సీతన్న పేట గేట్.  మనిషి లోని నేర ప్రవృత్తిని ఇతి వృత్తంగా వాటి పర్యవసానాలను వళ్ళు గగుర్పొడిచే విధంగా తెరకెక్కిన ‘సీతన్నపేట గేట్’ . ఈ సినిమ టీజర్ ని హీరో నిఖిల్ లాంఛ్ చేసారు.  సమాజంలో జరిగే కొన్ని నేరాలు గురించి విన్నా, చదివినా నమ్మశక్యం కాకుండా ఉంటాయి.. అలాంటి కొన్ని సంఘటనలను తెరమీదకు తీసుకొచ్చిన చిత్రం ‘సీతన్న పేట గేట్.  ఈ మూవీ టీజర్ ని హీరో నిఖిల్ లాంఛ్ చేసి టీం ని అభినందించారు. కొన్ని సీన్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయని మెచ్చుకున్నారు.. ఈ సినిమా కథ, కథనాలను తెలుసుకొని సినిమా విజయం పట్ల నమ్మకం వ్యక్తం చేసారు. ఈ రియలిస్ట్ కథలో మెయిన్ లీడ్స్ గా యశ్వన్, వేణు, కిస్లీ చౌధరి, సురభి తివారి నటిస్తున్నారు. 


ఈ సందర్బంగా దర్శకుడు వై రాజ్ కుమార్ మట్లాడుతూ:‘‘  సీతన్న పేట గేట్ చిత్రానికి సపోర్ట్ చేసిన నిఖిల్ గారికి పెద్ద థ్యాంక్స్.. టీజర్ ని లాంఛ్ చేయడానికి అడగగానే ముందుకు వచ్చారు. ఆయన సపోర్ట్ ని ఎప్పటికీ మర్చిపోలేను.. దర్శకుడిగా నాకు సపోర్ట్ చేసిన నిఖిల్ గారికి ఎప్పటికీ రుణ పడి ఉంటాను. నేను చూసిన, విన్న సంఘటనలనే కథగా మలచుకున్నాను. నా ప్రయాణం లో చాలా ఒడిదుడుకులున్నాయి.. కానీ టీజర్ చూసి నిఖిల్ గారు మెచ్చుకోవడంతో నా కష్టం మరిచిపోయాను.. సినిమా అవుట్ పుట్ కూడా చాలా బాగా వచ్చింది. ఈజీ మనీ వెంట పరుగులు పెట్టే జీవితాలను  తెరమీదకు తెచ్చాను..

 నేర ప్రవృత్తిని పురికొల్పే ఆశలు మనిషిని ఎలాంటి దారిలోని తీసుకెళ్తాయి అనే సంఘటనలను చాలా రియలిస్టిక్ గా చేయడం జరిగింది. క్రైమ్ సస్పెన్స్ డ్రామా గా తెరకెక్కిన ఈ మూవీ తప్పకుండా  ప్రేక్షకుల ఆదరిస్తారనే నమ్మకం ఉంది. దర్శకుడిగా తొలి ప్రయత్నం అయినా నాకు టెక్నిషన్స్ అందించిన సహాకారం మరిచిపోలేను.విజయవాడ నేపథ్యంలో క్రైమ్ కథ అనగానే గుణదల, క్రిష్ణలంక మాత్రమే కాదు.. ఎవరికీ తెలియని నేర చరిత్ర కలిగిన ‘సీతన్నపేట గేట్’ ఉంది. ఈ కథకు బీజం ఆ ప్రాంతంలోని కథలే కారణం.   నేటి తరం ఆలోచనలు ఎంత వేగంగా  ఉంటున్నాయో అందరికీ తెలుసు.. ఆవేగం వెనక ప్రమాదాలను వాస్తవికంగా చూపించడం జరిగింది. ఈ కథలో ఉన్న ప్రేమకథ కూడా కొన్ని రియల్ ఇన్సిడెంట్స్ నుండి తీసుకున్నదే. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రోడక్షన్ పనులు కంప్లీట్ చేసుకుంది’’ అన్నారు. 


నటీ నటులు:

యశ్విన్, వేణు, కిస్లీ ఛౌదరి,  సురభి తివారి, సుధిక్ష, అనుష జైన్, రఘుమారెడ్డి తదితరులు నటిస్తున్నారు.


సాంకేతిక వర్గం:

మ్యూజిక్: ఎన్ ఎస్. ప్రసు, స్టంట్స్: వింగ్ చున్ అంజి, ఎడిటర్ : శివ శర్వాని, సినిమాటోగ్రఫి: చిడతల నవీన్, కొరియోగ్రఫీ: అనిష్, లిరిక్స్: మనికంఠ శంకు, డైలాగ్స్: రవి భయ్యవరపు, డిఐ: పురుషోత్తమ్. డిటియస్: పద్మారావు. పి.ఆర్ .ఓ : జియస్ కె మీడియా నిర్మాత : ఎ. పద్మ నాభ రెడ్డి 

దర్శకత్వం : వై రాజ్ కుమార్.


Share this article :
 
Copyright © 2015. TeluguCinemas.in | Telugu Cinemas - All Rights Reserved
Thank You Visit Again