Latest Post

Music School 4th Schedule Completed in Goa

 మ్యూజిక్‌ స్కూల్‌ నాలుగో షెడ్యూల్‌ గోవాలో పూర్తి!




శ్రియ శరణ్‌, శర్మణ్‌ జోషి, షాన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న సినిమా మ్యూజిక్‌ స్కూల్‌. పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా నాలుగో షెడ్యూల్‌ని ఇటీవల గోవాలో పూర్తి చేశారు పాపారావు బియ్యాల. బ్రహ్మాండమైన టూరిస్ట్ ప్లేసుల్లోనూ, బీచ్‌ బ్యాక్‌డ్రాప్‌లలోనూ ఈ సినిమాలోని కీలకమైన టాకీ పోర్షన్‌ని కంప్లీట్‌ చేశారు డైరక్టర్‌. గోవాలో పూర్తి చేసిన ఈ షూటింగ్‌తో దాదాపు 95 శాతం చిత్రీకరణ పూర్తయినట్టే.

మ్యూజిక్‌ స్కూల్‌లో తన పోర్షన్‌ని పూర్తి చేసిన షాన్‌ మాట్లాడుతూ ''మ్యూజిక్‌ స్కూల్‌కి షూటింగ్‌ చేస్తున్నంత సేపు చాలా అద్భుతంగా అనిపించింది. నటీనటులు, సాంకేతిక నిపుణులు అందరం పెద్ద కుటుంబంలోని వ్యక్తుల్లాగా కలిసిపోయాం. సరదాగా గడిపాం. ముఖ్యంగా, మాతో పనిచేసిన పిల్లలు ఎప్పుడూ ఉత్సాహంగా, ఉరకలేస్తూ ఉండేవారు. వాళ్లందరినీ మిస్‌ అవుతానని మాత్రం కచ్చితంగా చెప్పగలను. సినిమా రూపుదిద్దుకున్న విధానాన్ని తెరమీద చూడాలనే ఆతృత ఉంది. సినిమా రిలీజ్‌కి రెడీకాగానే పనిచేసిన అందరినీ రీ యూనియన్‌ పార్టీలో కలుసుకోవాలని ఉంది. అప్పటిదాకా పాపారావుగారికి, మిగిలిన టీమ్‌ అందరికీ నా బెస్ట్ విషెస్'' అని అన్నారు.

ఇళయరాజా రికార్డింగ్‌ స్టూడియోలో ఓ పాట పాడుతున్న సమయంలోనే ఈ సినిమాలోని పాత్రకు షాన్‌ పర్ఫెక్ట్ గా సూట్‌ అవుతారనే అభిప్రాయానికి వచ్చారు డైరక్టర్‌ పాపారావు బియ్యాల. ఫ్లామ్‌బోయ్‌ తరహా వ్యక్తి కేరక్టర్‌కి షాన్‌ పర్ఫెక్ట్ గా సూటయ్యారు. ఈ చిత్రంలో సెకండ్‌ లీడ్‌గా చేస్తున్న ఓజు బారువా, గ్రేసీ గోస్వామి కూడా ఈ షెడ్యూల్‌లోనే తమ పార్ట్ ని కంప్లీట్‌ చేశారు. ఈ టీన్‌ డుయోకి సినిమాలో చాలా స్పెషల్‌ ప్లేస్‌ ఉంది. సినిమా చూసిన ప్రతి ఒక్కరూ వాళ్లని అభినందిస్తారనేది దర్శకుడి మాట.

వెటరన్‌ కేరక్టర్‌ ఆర్టిస్టులు బెంజమిన్‌ గిలానీ, సుహాసిని మూలేని డైరక్ట్ చేసిన అనుభూతి గొప్పదని అంటారు దర్శకుడు పాపారావు. ఆయన మాట్లాడుతూ ''గొప్ప విషయపరిజ్ఞానం కలిగిన వారిద్దరితో పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. గోవా సీనిక్‌ బ్యూటీని మా సినిమాటోగ్రాఫర్‌ కిరణ్‌ డియోహాన్స్ అత్యంత సుందరంగా కేప్చర్‌ చేశారు. మా సినిమాలో ఈ ఫోర్త్ షెడ్యూల్‌ చాలా స్పెషల్‌. అంత ప్రత్యేకమైన షెడ్యూల్‌ని గోవాలో చిత్రీకరించడం చాలా ఆనందంగా అనిపించింది. మన దేశంలో చూడగానే ఆకట్టుకునే విజువల్‌ స్ట్రైకింగ్‌ స్టేట్స్ లో గోవా తొలి స్థానాన్ని ఆక్రమిస్తుంది. ఆ అందాన్నంతా మా సినిమాలో చూపించాం. హైదరాబాద్‌లో ఫైనల్‌ పాటను ఎప్పుడెప్పుడు తెరకెక్కిస్తామా? అని ఆతృతగా వెయిట్‌ చేస్తున్నాం'' అని అన్నారు.

యామిని ఫిల్మ్స్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. ఆయనే రచయిత. మ్యూజిక్‌ స్కూల్‌ని హిందీ, తెలుగులో తెరకెక్కిస్తున్నారు. ఇళయరాజా సంగీతం సమకూర్చారు. కిరణ్‌ డియోహాన్స్ సినిమాటోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.

షర్మన్‌ జోషి, శ్రియా శరణ్‌, షాన్‌, సుహాసిని మూలే, ప్రకాష్‌ రాజ్‌, బెంజిమిన్‌ గిలాని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, వినయ్‌ వర్మ, మోనా అంబెగోయెంకర్‌, గ్రేసీ గోస్వామీ, ఓజు బారువా, బగ్స్ భార్గవ, మంగళ భట్‌, ఫణి ఎగ్గొట్టి, వాక్వర్‌ షేక్‌, ప్రవీణ్‌ గోయల్‌, రజినీష్‌, కార్తికేయ, రోహన్‌ రాయ్‌, ఒలివియ చరణ్‌, వివాన్‌ జైన్‌, సిదీక్ష, ఆద్య, ఖుషీ నటీనటులు.

Organic Mama Hybrid Alludu Movie Launched

 అంగరంగ వైభవంగా ప్రారంభమైన "ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు" 



కుటుంబం అంతా కలిసి చూసేలా ఎన్నో ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ వంటి సూపర్ డూపర్  హిట్ చిత్రాలను రూపొందించి ప్రేక్షకుల్లో తనకంటూ ఒక సపరేట్ బ్రాండ్ ఇమేజ్ సొంతం చేసుకున్న దర్శకుడు ఎస్వీ. కృష్ణారెడ్డి. చాలా కాలం గ్యాప్ తర్వాత ఆయన మెగా ఫోన్ పట్టి నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఆర్గానిక్ మామ.. హైబ్రీడ్ అల్లుడు వంటి వైవిధ్యమైన టైటిల్ తో అవుట్ అండ్ అవుట్ ఫ్యామిలీ ఎంటెర్టైనెర్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. బిగ్ బాస్ ఫేమ్ సోహైల్ హీరోగా మజిలీ ఫేమ్ అనన్య హీరోయిన్ గా అమ్ము క్రియేషన్స్ సమర్పణలో ప్రముఖ నిర్మాణ సంస్థ కల్పన చిత్ర పతాకంపై కోనేరు కల్పన ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నటకిరీటి డా. రాజేంద్ర ప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, వరుణ్ సందేశ్, రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర వంటి ఎందరో ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఈ చిత్రం ప్రారంభోత్సవం సోమవారం నాడు ఏప్రిల్ 18న హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. పూజా కార్యక్రమాల అనంతరం నటకిరీటి డాక్టర్ రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్ హీరోయిన్ అనన్య లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ క్లాప్ నివ్వగా ప్రముఖ నిర్మాత కె.అచ్చిరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. 

అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్, హీరో సోహైల్, హీరోయిన్ అనన్య, ఎస్వీ కృష్ణ రెడ్డి, నటులు సునీల్, వరుణ్ సందేశ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ, అప్పారావు, నటి హేమ, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, చిత్ర నిర్మాత కోనేరు కల్పన, హీరో సత్య దేవ్,, ప్రముఖ నిర్మాతలు కె. ఎస్. రామారావు,శివ రామ్ కృష్ణ, జెమిని కిరణ్, ఏ ఎం రత్నం, బేక్కం వేణుగోపాల్, డైరెక్టర్  రవికుమార్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. 


నటకిరీటి డా. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ.. "కృష్ణారెడ్డి నాతో  కొబ్బరి బొండాం, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, వంటి సూపర్ హిట్ చిత్రాలను తీశారు. ఆ చిత్రాలు ఇప్పటికీ టీవీలో వచ్చినప్పుడల్లా ప్రేక్షశకులను అలరిస్తాయి.. ఎంతో మంది ఫోన్స్ చేసి అభినందిస్తుంటారు.ఎన్నో చక్కని పాత్రలు రాసి నటుడిగా నన్ను బ్రతికుండేలా చేసిన ప్రతి ఒక్కరికీ నా కృతజ్ఞతలు. మళ్ళీ చాలా కాలం తర్వాత ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వంలో నటిచడం చాలా హ్యాపీగా వుంది. కుటుంభం అంతా కలిసి ఎంజాయ్ చేసేలా నేటి ట్రెండ్ కి తగ్గట్లుగా ఈ చిత్రం ఉంటుంది. కామిడీ, సెంటిమెంట్, ఎమోషన్స్ అన్నీ ఈ చిత్రంలో ఉంటాయి. చాలా రోజుల తర్వాత ఫామిలీ ఆడియెన్స్ అంతా కలిసి చూసే ఒక చక్కని సినిమా రాబోతుంది. వందశాతం ఈ సినిమాని  ప్రతి ఒక్కరూ హాయిగా నవ్వుకొని ఎంజాయ్ చేసేలా ఉంటుంది.. అన్నారు. 


ప్రముఖ నిర్మాత సి. కళ్యాణ్ మాట్లాడుతూ.. మద్రాస్ లో బిగినింగ్ స్టేజ్ నుండి ఎస్వీ కృష్ణారెడ్డి తెలుసు.. ఇద్దరం ఒకే రూమ్ లో వుండే  అంత ఫ్రెండ్షిప్ మా ఇద్దరి మధ్య వుంది. . తర్వాత ఆయన డైరెక్టర్ గా సినిమాలు తీసేప్పటినుండి  నేను సినిమా చేయమని అడిగే వాడ్ని. అయన చేద్దాం సార్ అనేవాడు. ఇప్పటికి మా వైఫ్ కల్పన ద్వారా  ఆ కోరిక తీరింది. కల్పన చిత్ర బ్యానర్ కి ఒక ప్రత్యేకత వుంది. కృష్ణ గారు విజయనిర్మల ఫస్ట్ కాంబినేషన్లో అత్తగారు కొత్త కోడలు సినిమాని కల్పన ఫాదర్ నిర్మించారు. అలాంటి బ్యానర్ లో కల్పన ఇండివిడ్యుల్ ప్రొడ్యూసర్ గా  ఈ సినిమా చేస్తున్నారు. ప్రతిఒక్కరి మనసులో గుర్తుంచుకునే డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి. ఆయన  డైరెక్షన్ లో ఈ సినిమా రావడం చాల హ్యాపీగా వుంది. అలాగే రాజేంద్ర ప్రసాద్ తో  ఏడు సినిమాలు చేశాను.. అన్ని సినిమాలు ఏ హీరోతో చేయలేదు. ఆర్గానిక్   మామ.. హైబ్రీడ్ అల్లుడు టైటిల్ వింటేనే సినిమా పొటెన్షియాలిటీ ఏంటో తెలుస్తుంది. ఈ సినిమా సోహైల్ కి దక్కడం అతని అదృష్టం. సునీల్, వరుణ్ సందేశ్ ఈ సినిమాలో మంచి పాత్రలు పోషిస్తున్నారు.  గ్యారెంటీగా ఈ సినిమా సూపర్ హిట్ అని ఓపెనింగ్ లోనే ప్రూవ్ అవుతోంది. ఈ సినిమా తర్వాత కృష్ణారెడ్డి గారు సంవత్సరానికి రెండు మూడు సినిమాలు చేసేంత బిజీగా ఈ సినిమా పేరు తెస్తుందని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను..   సోహైల్, అనన్య క్యూట్ పెయిర్. వాళ్ళ కాంబినేషన్ చక్కగా కుదిరింది. ఎంతో మంది స్టార్ కాస్ట్ ఈ చిత్రంలో నటిస్తున్నారు. ఈరోజునుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం.. అన్నారు. 


చిత్ర దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. దాదాపు ఆరేళ్ళ గ్యాప్ తర్వాత ఈ సినిమా చేస్తున్నాను. చాలా మంది కలిసినప్పుడల్లా మీ మార్క్ కామిడీ చిత్రాలు రావటం లేదు.. అలాంటి సినిమాలు చూసి చాలా కాలం అయింది అని అంటున్నారు. నాకు అదే ఫీలింగ్ కలిగింది. అప్పటినుండి మంచి కథలు రాసుకుంటూ సరైన ప్రొడ్యూసర్ కోసం వైట్ చేశాను.అచ్చిరెడ్డి గారి సలహా మేరకు కల్పన గారు ఈ సినిమా చేయడానికి ముందుకొచ్చారు. ఎక్కడ కాంప్రమైజ్ అవకుండా ఆర్టిస్టుల్ని,టెక్నీషియన్స్ ని అందర్నీ ప్రొవైడ్ చేసి ఈ చిత్రాన్ని చాలా గ్రాండ్ గా నిర్మించడానికి ప్లాన్ చేసారు. అలాగే  సి.కళ్యాణ్ గారు దెగ్గరుండీ ఈ ఓపెనింగ్ గ్రాండ్ గా ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషం అనిపించింది. ఆయనది వెరీ గుడ్ అండ్ బిగ్ హ్యాండ్. చాలా గొప్పగా కళ్యాణ్ ఈ ఓపెనింగ్ జరపడం నేను ఎప్పటికీ మర్చిపోలేను. సోహైల్, అనన్య చక్కగా సెట్ అయ్యారు. అలాగే వరుణ్ సందేశ్ ఒక గెస్ట్ పాత్ర చేస్తున్నాడు. అఖండ వంటి బిగ్ హిట్ తరువాత  రాంప్రసాద్ మా సినిమాకి ఫోటోగ్రఫీ అందిస్తున్నారు. అలాగే సునీల్ ఫోన్ లో క్యారెక్టర్ చెప్పగానే నేను చేస్తున్నాను సార్ అన్నాడు. అలాగే ఎంతోమంది ఈ ప్రారంబోత్సవానికి వచ్చి వారి బ్లెస్సింగ్స్ ఇవ్వడం నేను దీవెనులుగా భావిస్తున్నాను. నేను అమెరికాలో ఒక ఇంగ్లిష్ ఫిలిం చేశాను.. అక్కడ మూడేళ్లు పట్టింది ఆ సినిమా చేయడానికి. నాకు అక్కడ వుండబుద్ది కాలేదు. మళ్ళీ మన తెలుగు సినిమాలు చేయాలనీ ఇక్కడికి వచ్చాను. తెలుగు ప్రేక్షకుల ఆదరణ ఎప్పుడు మనసుకి నిండుగా తృప్తిగా ఉంటాయి. అవే కావాలని కోరుకుని ఈ సినిమా స్టార్ట్ చేయడం జరిగింది. 


హీరో సోహైల్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణారెడ్డి గారి డైరెక్షన్ లో ఈ సినిమా చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను.. ఈ పాత్రకి నేను యాప్ట్ అని  నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణరెడ్డి గారికి, నిర్మాత కల్పనా గారికి నా థాంక్స్. కుటుంభం అంతా కలిసి చూసే చిత్రాలు వచ్చి చాలా కాలం అయింది. ఒకప్పుడు ఫ్యామిలీతో వెళ్లి థియేటర్ లో సినిమా చూసి పండగ చేసుకునేవారు.. అలాంటి సినిమా ఇది. సినిమా అంతా కలర్ ఫుల్ గా ఉంటుంది. అంతలా ఈ ప్రాజెక్ట్ ని డిజైన్ చేశారు కల్పనా గారు. వరుణ్ సందేశ్ అన్నతో నేను కొత్త బంగారులోకం లో యాక్ట్ చేశాను.. ఈ చిత్రంలో ఒక గెస్ట్ పాత్ర వుంది అని చెప్పగానే పెద్దమనసుతో చేయడానికి ఒప్పుకున్నాడు. అలాగే సునీల్ గారు కూడా మంచి యూనిక్ క్యారెక్టర్ చేస్తున్నాడు. రాజేంద్రప్రసాద్ వంటి లెజండ్రీ యాక్టర్ తో చేయడం నా అదృష్టం. ఇవాళ నా బర్త్ డే. ఈరోజు  సినిమా ఓపెనింగ్ జరగడంచాలా హ్యాపీగా వుంది. పుట్టినరోజుల, పార్టీలు జరుపుకోకుండా చదువు కోసం  ఒక పది శాతం ఒక ఛారిటీకి ఇవ్వాలని డిసైడ్ అయ్యాను.. అన్నారు. 


సునీల్ మాట్లాడుతూ.. నేను  వేషాల కోసం ఫిలిం నగర్ లో తిరిగే రోజుల్లో ఒకసారి నేను నడుచుకుంటూ వెళ్తుంటే అచ్చిరెడ్డి గారు కారు ఆపి ఎక్కడికి వెళ్తున్నావ్ అమ్మా అని.. దిల్సుఖ్ నగర్ సార్ అన్నాను. అయన కారు ఆపి  ఎక్కించుకొని ఖైరతాబ్ వరకు వచ్చి నన్ను డ్రాప్ చేశారు. అక్కడనుండి స్టార్ట్ అయి ఇక్కడి వరకు వచ్చాను.. మా పూలరంగడు సినిమా ఆ రేంజ్ లో రావడానికి అచ్చిరెడ్డి గారు కారణం. నేను లైఫ్ లో ఫస్ట్ కలిసిన వ్యక్తి డైరెక్టర్ గా కృష్ణరెడ్డి గారు. ప్రొడ్యూసర్ గా అచ్చిరెడ్డి గారు. మళ్ళీ వాళ్ళ సమక్షంలో ఈ సినిమా చేస్తున్నందుకు చాలా హ్యాపీగా వుంది. ఇప్పటివరకు నేను చేయనటువంటి క్యారెక్టర్.. చాలా వెరైటీ క్యారెక్టర్ ఈ చిత్రంలో చేస్తున్నాను. ఈ మధ్య కామెడీ ల్లో నాకు మంచి ఫుడ్ దొరకలా. ఇందులో మంచి ఫుడ్ దొరికింది అని కథ వినగానే అర్ధం అయింది. నా కామిడి టైమింగ్ చూసి విపరీతంగా నవ్వుకుంటారు. ఒకప్పుడు సినిమా చూడాలని అమ్మని  మేము అడిగేవాళ్ళం..కృష్ణారెడ్డి గారి సినిమా వస్తే అమ్మే తీసుకెళ్లేది. అలంటి ఫామిలీ చిత్రాలు చూసే రోజులు రావాలి అది ఈ సినిమా తెస్తుంది. సంవత్సరానికి మూడు సినిమాలు కృష్ణారెడ్డిగారు తీయాలని అందర్నీ అలరించాలని.. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.. అన్నారు.


వరుణ్ సందేశ్ మాట్లాడుతూ.. సోహైల్ చిన్నప్పటినుండి పరిచయం. ఈ సినిమాలో చిన్న కామియో రోల్ చేస్తున్నాను. కృష్ణారెడ్డి గారి సినిమాలు చిన్నప్పటినుండి చూస్తున్నాను. ఇప్పుడు ఆయన డైరెక్షన్లో సినిమా చేయడం చాలా హ్యాపీగా వుంది అన్నారు. సోహైల్ నా సినిమాల్లో నటించాడు. ఇప్పుడు అతని సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాను. చిన్న క్యారెక్టర్ అయినా ఇంపార్టెంట్ వున్నా క్యారెక్టర్.. సినిమా తప్పకుండా అలరిస్తుంది అన్నారు. 


నటి హేమ మాట్లాడుతూ.. చాలా సంవత్సరాల తరువాత ఒక ఓపెనింగ్ గ్రాండ్ గా జరగడం చాలా హ్యాపీగా వుంది. సినిమా సూపర్ హిట్ అనే వైబ్స్ కనిపిస్తుంది. ఈ చిత్రంలో మదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు. మా లేడీ ప్రొడ్యూసర్ కల్పనా గారు సక్సెస్ ఫుల్ నిర్మాత అవ్వాలి అన్నారు. 


హీరోయిన్ అనన్య మాట్లాడుతూ.. మజిలీ లో ఒక క్యారెక్టర్ చేశాను. తెలుగులో ఇది నా సెకండ్ ఫిలిం. హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ ఫిలిం. ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ గారికి నా స్పెషల్ థాంక్స్ అన్నారు. 


ప్రముఖ నిర్మాత కె. అచ్చిరెడ్డి మాట్లాడుతూ.. కృష్ణారెడ్డి గారితో ఫస్ట్ నుండీ జర్నీ చేస్తున్నాను. ఇవాళ కృష్ణారెడ్డి గారి సినిమా ప్రారంభం అయింది. ఈ రోజు కోసం మాతో పాటు  కొన్ని లక్షలమంది వెయిట్  చేస్తున్నారు. ఎక్కడికి వెళ్లినా కృష్ణారెడ్డి గారి సినిమాలు రావట్లేదు. ఆయన సినిమాలు తియ్యాలని అడుగుతున్నారు. కృష్ణారెడ్డి గారు కూడా అంతకుమించిన జోష్ తో వున్నారు. ప్రేక్షకులకి నచ్చేలా.. అందరు ఎంజయ్ చేసేలా సినిమా తియ్యాలని మంచి కథలు రాసుకున్నారు. అందరికి నచ్చే సినిమా చెయ్యాలని ఆయనకీ తపన వుంది. టాలెంట్, క్రియేటివీటి ఆయనలో ఎంతో వుంది. అది తెలిసే నేను డైరెక్టర్ గా ఆయన్ని ఎంకరేజ్ చేశాను. ఇప్పటివరకు ఓక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఆయన టాలెంట్ చూసారు. ఈ అనుభవాలతో ఆయన మరింత మెరుగుపరుచుకుని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ టాలెంట్ ని ఇప్పుడు బయటపెట్టబోతున్నారు. నాలుగేళ్లుగా మంచి స్కిప్టులు చేసుకొని మంచి సినిమాలు చేయబోతున్నారు. ఎంటర్టైన్మెంట్ ఆయన మార్క్ బ్రాండ్ మిస్ అవకుండా ఈ సినిమా చేస్తున్నారు. ఇంత మంచికథతో కల్పనా గారు సినిమా తీయడానికి ముందుకు వచ్చారు. అలాగే మార్కెట్ లో ఎంతో బ్రాండ్ వున్నా సి. కళ్యాణ్ గారు కొండంత అండగా వుండి ఈ సినిమాని సపోర్ట్ చేస్తున్నారు. కృష్ణారెడ్డి ఆలోచనలకి తగ్గట్లు ఎలాంటి ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ ఉంటే సినిమా ఎంత అద్భుతంగా వస్తుందో నాకు బాగా తెలుసు. నేను ఎలా అయితే ఆలోచిస్తానో నాకంటే బెటర్ గా కల్పన గారు ప్లాన్ చేసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు.సోహైల్ క్యారెక్టర్ చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది. వరుణ్ సందేశ్ పాత్ర కూడా చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఈ చిత్రంలో రాజేంద్రప్రసాద్ కుష్బూ, సూర్య, హేమ, సునీల్, ఆలీ చాలా మంది ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. అందరి క్యారెక్టర్స్ ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. రష్మీ ఒక గ్లామరస్ పాత్రలో నటిస్తుంది. అందరికి నచ్చే సినిమా అవుతుంది. అన్నారు. 


కెమెరా మెన్ రాంప్రసాద్ మాట్లాడుతూ.. ఎస్వీ కృష్ణరెడ్డి గారితో పెళ్ళాం ఊరెళితే సినిమా చేశాను. నేను చేసిన ఫస్ట్ పిక్టర్లు అన్ని హిట్ అయ్యాయి. అలాగే కల్పన గారు నిర్మిస్తున్న ఈ ఫస్థ సినిమా కూడా హిట్ అవుతుందని నమ్ముతున్నాను. మంచి కథతో ఆడియెన్స్ ఎంజాయ్ చేసేలా ఈ సినిమా ఉంటుంది అన్నారు. 


సోహైల్, అనన్య జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో డా.రాజేంద్రప్రసాద్, కుష్భు, ఆలీ, సునీల్, ప్రత్యేక పాత్రలో వరుణ్ సందేశ్, ప్రత్యేకపాత్రలో రష్మీ, హేమ, అజయ్ గోష్, రాజా రవీంద్ర, సూర్య, ప్రవీణ్, వైవా హర్ష, జబర్దస్త్ రాఘవ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ: సి. రాంప్రసాద్, ఎడిటింగ్; ప్రవీణ్ పూడి, ప్రొడక్షన్ డిజైనర్: ఎఎస్. ప్రకాష్, కొరియోగ్రఫీ: సుచిత్ర, సాహిత్యం: చంద్రబోస్, భాస్కరభట్ల, అనంత్ శ్రీరామ్, పి .ఆర్.ఓ: సురేష్ కండేటి, ఫైట్స్ :వెంకట్, స్టిల్స్: మనిషా ప్రసాద్, ప్రొడక్షన్ కంట్రోలర్: కె. ఉదయ్ భాస్కర్, ప్రొడక్షన్ ఎగ్జికుటివ్: కొండయ్య, చీఫ్-కొడైరెక్టర్: ప్రణవానంద్, చీఫ్-అసోసియేట్ డైరెక్టర్: సెల్వ కుమార్, అసోసియేట్ డైరెక్టర్స్: కె.కళ్యాణ్, వి.రత్న ప్రభాకర్, సురపు ఈశ్వర్, అసిస్టెంట్ డైరెక్టర్: డా. కె. సంకల్ప్, కాస్ట్యూమ్ చీఫ్; వెంకట్, మేకప్ చీఫ్: నాగు, నిర్మాత కోనేరు కల్పన, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, సంగీతం, దర్శకత్వం: ఎస్వీ కృష్ణారెడ్డి.

Saidhulu Trailer Launched

 మేజర్ చిత్ర దర్శకుడు దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా సైదులు ట్రైలర్ లాంచ్ !!!



కె.ఎమ్ ప్రొడక్షన్స్ ప‌తాకంపై  బాబా పి.ఆర్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతోన్న చిత్రం సైదులు.  రంజిత్ నారాయణ్ కురుప్, ముస్కాన్ అరోరా హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం

 షూటింగ్ పూర్తి చేసుకుంది. 


హ‌క్కుల కోసం, స్వేచ్ఛ కోసం ఒక ఊరి జ‌నం చేసిన తిరుగుబాటు నేప‌థ్యంలో ఈ చిత్ర క‌థ ఉండబోతుంది. కరీంనగర్ పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర షూటింగ్ జరిగింది. 1980 లో తెలంగాణ నేపధ్యంలో జరిగిన కథ ఇది. ఒక కీలక పాత్రలో సీనియర్ నటుడు బెనర్జీ నటించారు. 


ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఆదివారం గ్రాండ్ గా జరిగింది. ఈ కార్యక్రమంలో మేజర్ చిత్ర దర్శకుడు శశి కిరణ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అలాగే దర్శకుడు చంద్ర మహేష్, దర్శకుడు నెలుట్ల ప్రవీణ్ చంద్ర పాల్గొన్నారు. 



డైరెక్టర్ శశి కిరణ్ మాట్లాడుతూ...

సైదులు సినిమా ట్రైలర్ రియాలిటీకీ దగ్గరగా ఉంది. ఇలాంటి సినిమాలు ఆడాలి మరిన్ని రావాలి. చిత్ర యూనిట్ సభ్యులందరికి బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను అన్నారు.


ఈ సందర్భంగా నిర్మాత మరబత్తుల బ్రహ్మానందం మాట్లాడుతూ...

డైరెక్టర్ బాబా చెప్పిన కథ నచ్చి ఈ సినిమా చేశాం. ఆయన సినిమాను  బాగా తీశారు. సినిమా మంచి విజయం సాధించి డైరెక్టర్ కు మంచి పేరుతో పాటు మరెన్నో అవకాశాలు తెచ్చిపెట్టాలని కోరుకుంటున్నాను. 


డైరెక్టర్ బాబా పి.ఆర్ మాట్లాడుతూ...

సైదులు చిత్రం తెలంగాణలో జరిగిన ఒక కథ. ఈ కథను వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా తెరకెక్కించడం జరిగింది. ఈ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణులకు నటీనటులకు ధన్యవాదాలు. మా సినిమా అందరికి చేరేలాగా సాయపడాలని విజ్ఞప్తి చేశారు.




హీరో: రంజిత్ నారాయణ్ కురుప్, హీరోయిన్: ముస్కాన్ అరోరా


ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః పి.య‌స్ మ‌ణిక‌ర్ణ‌న్‌

సంగీతం:ఎన్.ఎస్.ప్రసు

లిరిక్స్: ఎమ్. బ్రహ్మానందం

కో-డైర‌క్ట‌ర్:ప‌వ‌న్ ల‌క్ష్మ‌ణ్‌ 

ఎడిటింగ్: బొంతల నాగేశ్వర్ రెడ్డి

కాస్ట్యూమ్స్: వి.ప‌ద్మ‌

ఆర్ట్:రమేష్

ప్రొడ‌క్ష‌న్ మేనేజ‌ర్: చంద్రారెడ్డి

ప‌బ్లిసిటీ డిజైన‌ర్: వివ రెడ్డి 

నిర్మాత: మరబత్తుల బ్రహ్మానందం 

ర‌చ‌న‌- ద‌ర్శ‌క‌త్వం: బాబా.పి.ఆర్‌.

Arsa Life Care Pvt Ltd new entrant in Pharma sales clinics & health care

 ఫార్మా సేల్స్ మరియు క్లినిక్స్ లోకి అడుగుపెడుతున్న ఆశ్ర లైఫ్ కేర్ ప్రేవేట్ లిమిటెడ్ !!!




కొత్త టెక్నాలజీ ను ఉపయోగించుకొని  ప్రస్తుతం ఉన్న డిమాండ్లకు అనుకూలంగా కంపెనీల నుండి మెడిసిన్ ను కొని తక్కువ ధరకు జనాలకు మెడిసిన్ అందే విధంగా క్లినిక్స్ మరియు స్పెషాలిటీ సెంటర్స్ న్యాచురల్ మెడిసెన్స్ ద్వారా మార్కెట్ లోకి అడుగు పెడుతున్న అశ్ర లైఫ్ కేర్ ప్రవేట్ లిమిటెడ్. 



పది వేల క్లినిక్స్ ను ప్రారంభం చేయనుంది ఈ అశ్ర సంస్థ. డీలర్ షిప్ రూపంలో దేశ వ్యాప్తంగా ఈ ఇయర్ లోపు 300 క్లినిక్స్ పెట్టనున్నారు. ఈ 300 క్లినిక్స్ తెలంగాణ లో ప్రారంభం కానున్నాయి. 


క్రిటికల్ కేర్ డివిజన్ లో కూడా ప్రవేశించనున్న అశ్ర ప్రవేట్ లిమిటెడ్. హైదరాబాదు లోని ప్రధాన మల్టి స్పెషాలిటీ హాస్పిటల్స్ లో క్రిటికల్ కేర్ విభాగానికి అశ్ర ప్రవేట్ లిమిటెడ్ మెడిసెన్స్ మరియు ఇంజక్షన్స్ ను సరఫరా చేస్తోంది.


అశ్ర ప్రవేట్ లిమిటెడ్ సంస్తలో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 4 ఉన్నారు. ఆన్ బోర్డ్ డాక్టర్స్ 12 మంది అలాగే సేల్స్ టీమ్ 40 మెంబెర్స్ వర్క్ చేస్తున్నారు. 



అశ్ర ప్రవేట్ లిమిటెడ్ ఛైర్మెన్ కల్పన ఠాకూర్ మరియు డైరెక్టర్ అరుణ్ ఠాకూర్ ఈ సంస్థను ముందుకు తీసుకొని వెళుతున్నారు.

The IPL – Lalit Modi Saga by Boria Majumdar

Simon & Schuster India to publish Maverick Commissioner: The IPL – Lalit Modi Saga by Boria Majumdar



Simon & Schuster Indiaannounced today that it will publish Maverick Commissioner: The IPL – Lalit Modi Sagaby Boria Majumdar on 20th May,which will be adapted to a feature film by Vishnu Vardhan Induri, the producer of Thalaivi and 83 Films.


 


Author and noted journalist, Boria Majumdar said, “The success of the IPL has been Indian cricket’s single biggest contribution to the game in the last decade and a half. And this success hasn’t come easy. At the time of its creation all that Commissioner Lalit Modi had to show for was an idea. He was selling a vision and no more. How did the IPL happen? What are the backstories and how it subsequently went wrong for Modi? Years of research and hundreds of interviews have resulted in this book. And most importantly this is my first book which is being turned into a feature film. So all I will say is I am delighted and hope the readers enjoy reading this untold story.”


Speaking about the book, Vishnu Vardhan Induri added, “Winning the 1983 World Cup was just the tip of the iceberg. No one in the world could believe that a few years down the line India would rule the world of cricket. Almost a quarter century later came the Neil Armstrong moment of cricket. Formation of the biggest cricket league in the world—the Indian Premier league. It changed the cricketing world forever. The book Maverick Commissioner: The IPL – Lalit Modi Saga by India's ace sports journalist Boria Majumdar is a fascinating account of the creation of the world’s biggest cricketing mela IPL and insights about the man behind the show—Lalit Modi. Elated to announce that we are adapting this amazing book into a feature film.”


Rahul Srivastava, MD, Simon & Schuster India further added, “If you are a cricket fan you want to know more about the IPL and Lalit Modi. How it all happened and then what went wrong. In this extraordinary blow by blow account of those years, the story is pieced together like never before. We, at Simon & Schuster India, are delighted to publish Maverick Commissioner: The IPL – Lalit Modi Saga and expand our association with Boria. The book will soon be made into a feature film.”


 


About the book:


 


The Indian Premier League. Its mere mention forces cricket fans across the world to sit up and take notice. World cricket’s most valued property has only grown stronger with time. Conceived and implemented by Lalit Modi in 2008, the IPL has forever revolutionised the way cricket is marketed and run globally. Modi had built and orchestrated the tournament by his own rules and after the stupendous success of the IPL, the same rules were questioned by the administration. Modi was subsequently banned for life.


 


How and why did it happen? What went on behind the scenes? How did it all start to go wrong between Modi and the others? Are there secrets that will never come out? This book is all about everything you never got to know. Each fact corroborated by multiple sources who were in the thick of things, Maverick Commissioner is a riveting account of the IPL and the functioning of its founder, Lalit Kumar Modi. Did Modi have a long telephone conversation with a BCCI top brass the day he left India for good? What really was discussed? Is Lalit Modi the absent present for the IPL and Indian cricket? 


 


Soon to be made into a film by Vishnu Induri’sVibri Motion Pictures, Maverick Commissioner documents things exactly as they happened. No holds barred and no questions left out. It doesn’t judge Lalit Modi. All it does is narrate his story. Who is the real Lalit Modi? Let the readers decide.  


 


Author bio:


 


Boria Majumdar, a Rhodes scholar, is recognized as one of India’s most influential commentators. Having covered international sport between 2002 and 2022, he is also the Founder of RevSportz, a multi-sport, multi-language digital platform. Majumdar has written more than 1,500 columns on sports over the last 20 years, and has authored or co-authored multiple books, including Eleven Gods and a Billion Indians, Olympics: The India Story (with Nalin Mehta) and Playing It My Way—Sachin Tendulkar’s autobiography. His show Backstage WithBoria is one of India’s most watched sports chat shows.


Ante Sundaraniki Teaser On April 20th

 Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Teaser On April 20th



Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the leading production house Mythri Movie is making huge noise with its unique promotional content. The first song of the movie scored by Vivek Sagar became a superhit, while posters and Homam video garnered massive buzz.


The makers came up with teaser date and announcing the same, they have released two posters. It shows the lead pair getting married following both Hindu and Christian traditions. As is known, Nani is playing a Brahmin named Sundar, while Nazriya will be seen as a Christian Leela.


While they look class and stylish in western outfits, the lead pair appear gorgeous in traditional wear. The teaser of the movie will be dropped on April 20th.


Niketh Bommi handled the cinematography, while Raviteja Girijala is the editor for the film.


Adade Sundara is the title of the Tamil version, while Aha Sundara is the title for Malayalam version of the movie releasing simultaneously in three languages on June 10th.


Cast: Nani, Nazriya Fahadh, Nadhiya, Harshavardhan, Rahul Ramakrishna, Suhas and others.


Technical Crew:


Writer, Director: Vivek Athreya

Producers: Naveen Yerneni & Ravi Shankar Y

Banner: Mythri Movie Makers

CEO: Cherry

Music Composer: Vivek Sagar

Cinematographer: Niketh Bommi

Editor: Raviteja Girijala

Production Design: Latha Naidu

Publicity Design: Anil & Bhanu

PRO: Vamsi Shekar

F3 Second Single To Be Out On 22nd April

 Venkatesh, Varun Tej, Anil Ravipudi,Dil Raju's Sri Venkateswara Creations F3 Second Single To Be Out On 22nd April



First and theme song of F3 starring Victory Venkatesh and Mega Prince Varun Tej turned out to be a chartbuster. Rockstar Devi Sri Prasad scored an energetic number that featured the lead cast of the movie. Directed by blockbuster maker Anil Ravipudi, the film features Tamannaah Bhatia, Mehreen Pirzada and Sonal Chauhan playing the female leads. As part of musical promotions, the team will be releasing second single Woo Aaa Aha Aha on 22nd April.


The poster sees ‘rope pulling’ game between the male and female leads of the movie. While one side, we can see Tamannaah, Mehreen and Sonal Chauhan pulling the rope, the other side Varun Tej alone pulls the rope, wherein Venkatesh is seen encouraging him. Venkatesh and Varun Tej look cool, while Tamannaah, Mehreen and Sonal look glamorous here.


Nata Kireeti Rajendra Prasad and Sunil are the other prominent cast of the movie, where Pooja Hegde will be seen shaking her leg in a Party song.


Dil Raju is the presenter, while Shirish is producing the movie on Sri Venkateswara Creations banner. Sai Sriram cranks the camera, while Tammiraju is the editor. Harshith Reddy is the co-producer.


The film F3 is ready to create laughing riot in theatres on May 27th.


Cast: Venkatesh, Varun Tej, Tamannaah Bhatia, Mehreen Pirzada, Rajendra Prasad, Sunil, Sonal Chauhan, Pooja Hegde (special appearance) etc.


Technical Crew:

Director: Anil Ravipudi

Presenter: Dil Raju

Producer: Shirish

Banner: Sri Venkateswara Creations

Co-Producer: Harshith Reddy

Music: Devi Sri Prasad

DOP: Sai Sriram

Art: AS Prakash

Editing: Tammiraju

Script Coordinator: S Krishna

Additional Screenplay: Adi Narayana, Nara Pravee

Murali sharma to debut in kannada with Kabja film directed by J Chandru

 జె చంద్రు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న కబ్జా చిత్రంతో మురళీ శర్మ కన్నడ రంగప్రవేశం



మురళీ శర్మ తన కన్నడ అరంగేట్రం "కబ్జా"లో "వీర్ బహద్దూర్" అనే పాత్రను పోషిస్తున్నట్లు దర్శకుడు జె చంద్రు వెల్లడించారు.


ఈ చిత్ర తారాగణంలో ప్రముఖ నటులు ఉపేంద్ర, కిచ్చా సుదీప, శ్రియ శరణ్ ఉన్నారు. హిందీ, మరాఠీ, తెలుగు, తమిళం మరియు మలయాళంలో న‌టించిన‌ మురళీ శర్మ ఇప్పుడు కన్నడ చిత్ర పరిశ్రమలోకి "కబ్జా"తో అరంగేట్రం చేస్తున్నారు. చిత్రనిర్మాతలు ఇప్పుడు పాన్ ఇండియా సినిమాల‌వైపు మొగ్గుచూపుతున్నారు. గతంలో కంటే మేక‌ర్స్ కంటెంట్‌పై ఎక్కువ నమ్మకంతో ఉన్నారు. ఇతర పాన్ ఇండియా చిత్రాలకు అనుగుణంగా "కబ్జా" కూడా వాటిలో ఒకటిగా రూపొందుతోంది. ఈ పీరియాడికల్ డ్రామా ప్రకటించినప్పటి నుంచి చిత్రంపై ప‌రిశ్ర‌మ‌లో క్రేజ్ ఏర్ప‌డింది.


మురళి శ‌ర్మ ఇప్ప‌టివ‌ర‌కు 200ల‌కుపైగా చిత్రాలలో నటించారు మరియు త‌న న‌ట‌న‌లో భిన్న‌మైన పార్శాల‌ను చూపిస్తూ ఎల్లప్పుడూ ప్రశంసలు అందుకున్నారు. త‌ను  ప్రధానంగా వెండితెర‌పై పోలీసు పాత్ర పోషించడంలో ప్రసిద్దిగాంచారు.


ఈ సంద‌ర్భంగా చిత్ర దర్శకుడు జె చంద్రు మాట్లాడుతూ.. "మురళి శ‌ర్మ‌ తెలుగు, హిందీ ప్రేక్షకుల్లో విశేష ఆదరణ పొందారు. `అల వైకుంఠపురములో` ఆయన చేసిన పాత్ర ఆయనకు ఎంతో పేరు ప్ర‌ఖ్యాతుల్ని తెచ్చిపెట్టింది. మా సినిమాలో కీలకమైన పాత్రలో నటించేందుకు ఆయనను సంప్రదించాలని నిర్ణయించుకుకోవ‌డానికి ఇదే కారణం. చిత్ర క‌థ‌లో రాజ బహద్దూర్ కుటుంబానికి చెందిన వీర బహద్దూర్ పాత్ర‌ను ఆయ‌న పోషిస్తున్నారు.


దీనిపై మురళి శ‌ర్మ స్పందిస్తూ, "నాకు కన్నడ మాట్లాడటం రాదు కాబట్టి నేను మొదట్లో కొంచెం భయపడ్డాను. క‌న్న‌డ‌లో న‌టించ‌డం అంద‌మైన అనుభూతి క‌లిగింది.  అందుకు క్రెడిట్ అంతా దర్శకుడు జె చంద్రుకే చెందుతుంది.  క‌థ‌లో కీల‌క‌మైన పాత్ర‌తోపాటు  పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్, ఇప్పికే కొన్ని చ‌క్క‌టి స‌న్నివేశాల్లో న‌టించాను.  అవి చాలా బాగా వచ్చాయి, పాత్ర‌ప‌రంగా దర్శకుడు సంతోషంగా ఉన్నాడు కాబట్టి నేనూసంతోషంగా ఉన్నాను  అన్నారు.


ఈ చిత్రానికి సంబంధించిన ఒక భారీ షెడ్యూల్‌ను ఇటీవలే పూర్తిచేసిన‌ట్లు ఫిలిం మేక‌ర్స్‌ తెలిపారు. దీంతో దాదాపు 85% సినిమాను పూర్తి చేశాం. మరో భారీ షెడ్యూల్ చేయాల్సివుంది. త‌దుప‌రి షెడ్యూల్‌ దాదాపు 20 రోజుల షూటింగ్ చేయ‌నున్నాం. ఈ షెడ్యూల్లో మరికొందరు కొత్త నటీనటులు పాల్గొన‌నున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసి ఈ ఏడాదిలోనే సినిమాను విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌ని తెలిపారు.

Boot cut Balaraju Glimpse Released

 బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల‌



సోహెల్‌, అన‌న్య (వ‌కీల్‌సాబ్ ఫేమ్‌) హీరో హీరోయిన్లుగా న‌టిస్తున్న చిత్రం బూట్ క‌ట్ బాల‌రాజు. ల‌క్కీ మీడియాతో క‌లిసి గ్లోబ‌ల్ ఫిలిమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్ర‌మిది. బెక్కెం బ‌బిత స‌మర్ప‌ణ‌లో బెక్కెం వేణుగోపాల్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి శ్రీ కొన్నేటి ద‌ర్శ‌కుడు. సోమ‌వారంనాడు సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా చిత్ర యూనిట్ బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేసింది.


`రింగు రింగు రూపాయ్ బిళ్ళ రూపాయి దండ‌.. అంటూ సాగే పాట‌తోపాటు సోహెల్ యాక్ష‌న్ సీన్స్ ఆక‌ర్ష‌ణీయంగా వున్నాయి. దానికితోడు ఊరికి ఒక మంచి ప‌ని చేసినావ్‌ర్రా అంటూ ఒక‌రు అడిగితే.. సోహెల్ చెప్పే స‌మాధానం ఫుల్ ఎంట్‌టైన్ చేస్తుంది. ఈరోజు విడుద‌లైన గింప్స్ మంచి ఆద‌ర‌ణ చూర‌గొంటుంది.

ఈ సంద‌ర్భంగా చిత్ర నిర్మాత బెక్కెం వేణుగోపాల్ మాట్లాడుతూ, ర‌చ‌యిత ఫ‌ణి, రాకేష్‌, అశోక్ కుమార్ టీమ్‌గా ఫామ్ అయి మంచి క‌థ‌ను అందించారు. 9నెల‌లుగా క‌థ‌ను రెడీ చేసి షూటింగ్‌కు వెళ్ళాం. ఏక‌ధాటిగా సాగిన షూటింగ్ ముగింపు ద‌శ‌కు చేరుకుంది. ఈరోజు సోహెల్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా బూట్ క‌ట్ బాల‌రాజు గ్లింప్స్ విడుద‌ల చేశాం. కుటుంబంతో క‌లిసి హాయిగా చూడ‌త‌గ్గ సినిమా అవుతుంది. త్వ‌ర‌లో మ‌రిన్ని వివ‌రాలు తెలియ‌జేస్తామ‌ని అన్నారు.


సోహెల్ మాట్లాడుతూ, క‌థ బాగుంటే అన్నీ క‌లిసి వ‌స్తాయి. బిగ్‌బాస్‌లో వ‌చ్చిన పేరు వేరు. సినిమా ద్వారా వ‌చ్చే పేరు వేరు. అందుకే న‌న్ను న‌మ్మి థియేట‌ర్‌కు వ‌చ్చే ప్రేక్ష‌కుల‌కు మంచి ఎంట‌ర్‌టైన్ మెంట్ ఇచ్చేలా కృషి చేస్తున్నాన‌ని అన్నారు.

తారాగ‌ణంః సొహెల్‌, అన‌న్య త‌దిత‌రులు

సాంకేతిక‌తః కెమెరాః గోకుల్‌, సంభాష‌ణ‌లుః ఫ‌ణి, రాకేష్‌, అశోక్ కుమార్, సంగీతంః భీమ్స్‌, సాహిత్యంః కాస‌ర్ల శ్యామ్‌, స‌మ‌ర్ప‌ణః బెక్కెం బ‌బిత, నిర్మాత‌లుః బెక్కెం వేణుగోపాల్, బాష‌, ద‌ర్శ‌క‌త్వంః శ్రీ కొన్నేటి.

Kanmani Rambo Khatija KRK Releasing on April 28th

 కన్మణి రాంబో ఖతీజా’ తెలుగు హక్కుల‌ను సొంతం చేసుకున్న గాయ‌త్రి ఫిలింస్‌.. ఏప్రిల్ 28 భారీ ఎత్తున రిలీజ్‌కు స‌న్నాహాలు





సైరా నరసింహా రెడ్డి, ఉప్పెన వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్ష‌కులకు ద‌గ్గ‌రైన కోలీవుడ్ స్టార్, మ‌క్క‌ల్ సెల్వ‌న్ విజ‌య్ సేతుప‌తి హీరోగా న‌య‌న తార‌, స‌మంత హీరోయిన్స్‌గా విఘ్నేష్ శివ‌న్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘కన్మణి రాంబో ఖతీజా’. ఈ సినిమాను ఏప్రిల్ 28న భారీ లెవ‌ల్లో విడుద‌ల చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. రీసెంట్‌గా విడుద‌లైన రెండు రెండు.. అనే పాట‌కు అమేజింగ్ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ రెస్పాన్స్ చూస్తే కామ‌న్ ఆడియెన్స్ సినిమా కోసం ఎంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నార‌నే సంగ‌తిని మ‌నం అర్థం చేసుకోవ‌చ్చు. 


అంత‌కు ముందు విడుద‌లైన ‘కన్మణి రాంబో ఖతీజా’ టీజ‌ర్‌, రీసెంట్‌గా విడుద‌లైన ‘టు టు..’ సాంగ్‌తో సినిమాపై ఉన్న అంచ‌నాలు మ‌రింత పెరిగాయి. తాజాగా ఈ సినిమా తెలుగు థియేట్రిక‌ల్ హ‌క్కుల‌ను గాయ‌త్రి దేవి ఫిలింస్ సంస్థ ద‌క్కించుకుంది. ఏప్రిల్ 28న రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘కన్మణి రాంబో ఖతీజా’ చిత్రాన్ని భారీ ఎత్తున విడుద‌ల చేయ‌డానికి గాయ‌త్రి ఫిలింస్ అధినేత స‌తీష్ స‌న్నాహాలు చేస్తున్నారు. 


సినిమా: కన్మణి రాంబో ఖతీజా

నిర్మాణం: 7 స్క్రీన్‌ స్టూడియో, రౌడీ పిక్చర్స్

నిర్మాత: లలిత్‌ కుమార్‌

రచన-దర్శకత్వం: విఘ్నేష్‌ శివన్‌

సంగీతం: అనిరుద్‌ రవిచంద్రన్‌

కెమెరా: ఎస్‌ఆర్‌ కదిర్‌

విజయ్‌ కార్తిక్‌ కన్నన్‌

ఎడిటర్‌: శ్రీకర్‌ ప్రసాద్‌

ఆర్ట్: వ్వేత సెబాస్టియన్‌

యాక్షన్‌: దిలీప్‌ సుబ్బరాయన్‌

ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: మయిల్‌వాగనన్‌ కె.ఎస్‌.

లైన్‌ ప్రొడ్యూసర్‌: గుబేందిరన్‌ వీకే.

పి.ఆర్‌.ఓ:  వంశీ కాకా

Sunainaa to headline female-centric movie “Regina”

 Sunainaa to headline female-centric movie “Regina”

 


Sunainaa to headline female-centric movie “Regina”

 

Sunainaa who wowed us all with powerful performances in films such as “Neerparavai” and one of her most recent effort in the anthology “Sillu Karupatti”, is making her comeback with a multilingual movie titled as “Regina”, touted to be a female-centric film.

 

The movie is bankrolled by debutante producer Sathish Nair of “Yellow Bear Production LLP” from Coimbatore.

 

The feature is directed by Domin DSilva, who has in the past, thrown his weight behind films such as “Paipin Chuvattile Pranayam” and “Star”. Elaborating on the film, DSilva says that the movie will be a female-centric stylish thriller. “It is about an ordinary homemaker achieving extraordinary things, just like a fish moving against the flow. Regina will be an engaging thriller,” he said further.

 

Sathish Nair is the music composer for the movie. He will be scoring music for the feature, banking on his earlier experience of working on singles that have been released through his label “SN Musicals”. The lyrics for the songs are penned by Yugabarathi, Vivek Velmurugan, Vijayan Vincent and Ijaz.R

 

Pavan K Pavan is the director of cinematography while Kamarudin is the art director. Toby John will do the editing while the costumes will be by Aegan.

 

Regina is a multilingual shot in Tamil and released in Hindi, Malayalam and Telugu.

#YELLOWBEARPRODUCTIONLLP #regina #ReginaTheMovie

Ghani To premiere on Aha From April 22nd

aha announces streaming date of Mega Prince Varun Tej’s latest action family drama Ghani. To premiere on April 22nd  



aha right after releasing a young comedy entertainer "DJ Tillu" and a powerful blockbuster "Bheemla Nayak", yet again announced another action family drama "Ghani", starring Mega Prince Varun Tej, Saiee Manjrekar, Suniel Shetty, Upendra Rao, Naveen Chandra, Jagapathi Babu and Nadhiya in the lead roles.


100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment, has been successful in keeping up its promise as every Friday new release and is entertaining its audiences every Friday with new and fresh content.


Ghani an action-packed family drama is written and directed by Kiran Korrapati, music by S Thaman and produced by Allu Bobby & Sidhu Mudda


aha announced the movie through an action promo. The motion poster shows Mega Prince Varun Tej in a never seen before avatar, showcasing the marvellous efforts that has gone in making this film. 


aha is also home to some of the biggest Telugu releases, including Bheemla Nayak, DJ Tillu, Unstoppable with NBK, Krack, Bloody Mary, Telugu Indian Idol, Senapathi, Sarkaar, The American Dream, SR Kalyanamandapam, Love Story, Manchi Rojulochaie, Romantic, Most Eligible Bachelor, Chaavu Kaburu Challaga, 11th Hour, Naandhi, 3 Roses, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Sarkaar, Parinayam, Orey Baammardhi, Cold Case, Alludu Gaaru, and Ichata Vahanamulu Nilupa Radu.

A Pure Love Story filming with Andhra Kashmir 'Lambasingi' backdrop

 A Pure Love Story filming with Andhra Kashmir 'Lambasingi' backdrop



A Pure Love Story on the name of Andhra's Kashmir 'Lambasingi' is being presented by Successful director Kalyan Krishna.


Stepping into production post the success of Bangarraju, director Kalyan Krishna backs this soulful content directed by Naveen Gandhi.


Introducing Bharath in lead role, Big Boss fame Divi is playing female lead in this film bankrolled by Anand Tanneeru under Concept Films Banner. A Pure Love Story is the caption.


King Nagarjuna launched the enchanting first single 'Nachesinde Nachesinde' from the movie today and it received immense response online already.


Crooned by Singing sensation Sid Sriram in R.R. Dhruvan's music, Kasarla Shyam penned  soulful lyrics to it.


Speaking on the occasion King Nagarjuna says, "Encouraging young and new talent my director Kalyan Krishna is presenting Lambasingi. Big Boss fame Divi is playing the lead. Listen to its First song Nachesinde Nachesinde from the movie. All the best to entire team"


Director Naveen Gandhi says, "Story is based on the backdrop of Lambasingi, a place in Vizag. The first single Nachesinde Nachesinde features the depth of love between the lead actors. Happy to know that Sid Sriram's voice, Kasarla Shyam's lyrics and R.R. Dhruvan's music are immensely loved by audience instantly. Wrapped up the entire shoot in Lambasingi and headed to Post production works already. More updates will be revealed soon."


Besides Bharat, Divi, Vamshi Raj, Kittayya, Nikhil Raj, Janardhan, Anuradha, Madhavi, Naveen Raj Sankarapu, Pramod, Ramana, Paramesh, Sandha and others played crucial roles.


Story, Screenplay, Dialogues, Direction: Naveen Gandhi

Presents: Kalyan Krishna Kurasala

Producer: Anand Tanneeru

Banner: Concept Films

DOP: K Bujji

Music: RR Druvan

Lyrics: Kasarla Shyam

Choreography: V. Archanaa Ram

Editor: K. Vijay Vardhan

PRO: Pulagam Chinnarayana


Simbu sings Bullet song for Ram Pothineni's The Warriorr

 Simbu sings Bullet song for Ram Pothineni's The Warriorr 



The Warriorr, Ram Pothineni and ace director N Lingusamy's upcoming Telugu-Tamil bilingual film, will have a special song crooned by leading Kollywood star Simbu aka STR. 


The 'Bullet' song set to tune by Devi Sri Prasad is a power-packed one that will be an absolute treat to listen and watch, says the team confidently.  


Simbu, a good friend of Ram Pothineni, Lingusamy and Devi Sri Prasad, has sung many songs in Tamil and he has given his best to Bullet in The Warriorr. 


The stylish dance number is going to be one of the many highlights of the movie, which is gearing up for a grand worldwide theatrical release on July 14. 


Aadhi Pinisetty, who is popular in both Kollywood and Tollywood, plays the antagonist in The Warriorr, while Krithi Shetty, one of the most happening young actresses of the south, plays the heroine.


Earlier known as RAPO19, the title of the film was revealed in style recently. Along with a poster that featured Ram Pothineni as a police officer wielding a gun with a tough look and with cops surounding him, the title of the movie was unveiled as The Warriorr. 


And, to mark Valentine’s Day, the first look poster of the film’s heroine Krithi Shetty was released on February 14. It featured her as Whistle Mahalakshmi in a trendy look. And, on Maha Sivarathri day, the menacing first look of Aadhi was released.


According to the movie's team, the film will surpass the anticipations and will be one of the memorable police stories of south Indian cinema. The Warriorr comes after the massive success of iSmart Shankar of Ram Pothineni. Akshara Gowda will be seen in an important role in this flick. 


Produced by Srinivasaa Chitturi under Srinivasaa Silver Screen banner, The Warriorr is expected to be a feather in the production house's hat after the success of its sports drama Seetimaarr.

Ashoka vanam Lo Arjuna kalyanam Releasing on May 6th

 విశ్వక్ సేన్ ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’ .. మే 6న గ్రాండ్ రిలీజ్‌



‘ఫ‌ల‌క్‌నుమా దాస్’ నుంచి పాగ‌ల్ వ‌రకు వైవిధ్య‌మైన క‌థా చిత్రాల‌తో మెప్పిస్తున్న యంగ్ హీరో విశ్వక్ సేన్ క‌థానాయ‌కుడిగా న‌టించిన తాజా చిత్రం ‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’. ప్ర‌ముఖ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్ స‌మర్ఫ‌ణ‌లో ఎస్‌వీసీసీ డిజిట‌ల్ బ్యాన‌ర్‌పై బాపినీడు, సుధీర్ ఈద‌ర‌ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమాను మే6 విడుద‌ల చేస్తున్న‌ట్లు మేక‌ర్స్ అనౌన్స్ చేశారు.


‘‘‘అశోకవ‌నంలో అర్జున క‌ళ్యాణం’  ప్ర‌మోష‌న్స్‌ను డిఫ‌రెంట్‌గా చేస్తున్నాం. విశ్వక్ సేన్ పాత్ర యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు చేసిన సినిమాల‌కు భిన్న‌మైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ అల్లం అర్జున్ కుమార్ పాత్రను పోషిస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్ప‌టికే విడుద‌లైన టీజ‌ర్‌తో పాటు పాటలకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కులు మెచ్చేలా హిలేరియ‌స్‌గా ఉంటుంది’’ అని మేకర్స్ తెలిపారు.


 ఈ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనింగ్ చిత్రానికి.. సూప‌ర్ హిట్ మూవీ  ‘రాజావారు రాణిగారు’ మూవీ డైరెక్టర్ రవి కిరణ్ కోలా కథ- మాట‌లు, స్క్రీన్ ప్లే అందించ‌డం విశేషం. విద్యా సాగ‌ర్ చింతా చిత్రాన్ని తెర‌కెక్కించారు. జై క్రిష్ ఈ సినిమాకు సంగీతం సమకూరుస్తున్నారు.  ప‌వి కె.ప‌వ‌న్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్న ఈ చిత్రానికి  విప్ల‌వ్ ఎడిట‌ర్‌. ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.


న‌టీన‌టులు:


విష్వ‌క్ సేన్‌, రుక్స‌ర్ థిల్లాన్ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


ద‌ర్శ‌క‌త్వం:  విద్యాసాగ‌ర్ చింతా

స‌మ‌ర్ప‌ణ‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్‌

కథ, మాటలు, స్క్రీన్ ప్లే : ర‌వి కిర‌ణ్ కోలా

బ్యాన‌ర్‌: ఎస్‌.వి.సి.సి.డిజిట‌ల్‌

నిర్మాత‌లు:  బాపినీడు, సుధీర్ ఈద‌ర‌

సినిమాటోగ్ర‌ఫీ:  ప‌వి కె.ప‌వ‌న్‌

సంగీతం:  జై క్రిష్‌

ర‌చ‌న‌:  ర‌వికిర‌ణ్ కోలా

ఎడిట‌ర్‌:  విప్ల‌వ్‌

ప్రొడ‌క్ష‌న్ డిజైన‌ర్‌:  ప్ర‌వ‌ల్య దుడ్డిపూడి

పి.ఆర్‌.ఓ :  వంశీ కాకా


Telugu Indian Idol contestants pay a moving tribute to the legendary singer S.P. Balasubrahmanyam

 Telugu Indian Idol contestants pay a moving tribute to the legendary singer S.P. Balasubrahmanyam, leave S. Thaman and playback singer Kalpana emotional.



Striking a chord among the audiences with its melodious troupe of finalists, Telugu Indian Idol has managed to create a space among youth and families alike. While all the Top 11 contestants have nonetheless exhibited great talent and skill, the judges and host- their feedback and chemistry have left fans celebrating the show more than ever. The show is currently making headlines for its musical tribute to the stalwart of playback singing Late Shri S.P Balasubrahmanyam. The SPB tribute episode streams this weekend- 15th and 16th April- 9 PM onwards.


 “I feel so emotional, especially after listening to participants sing songs like O Priya Priya. He has a special place in all our hearts and this episode has only made me reminisce about him even more” expressed Kalpana, who is the special guest on the show.


The episode is sure to take the viewers on a heartwarming nostalgic ride as the contestants perform song superhit and evergreen SPB numbers like Kanyakumaari, Ammadu Appachi etc in duets. Furthermore, The Judges – S Thaman, Kalpana and singer Karthik reveal some of most interesting stories about SPB- about how this one-time SPB recorded an entire song in a single take. They also discuss the thought behind compositions and lyrics of the songs Mani Sharma and SPB made.


The show’s rise to fame in a short while has caused a lot of social media chatter and led to more than 15 Lakh votes for the participants. This week’s episode will also see its second elimination as the competition enters into an intense phase, with the final Top 10 contenders left to prove their mettle to be the Telugu voice of the world’s biggest stage.  


aha's trailblazing moves like bringing Indian Idol in Telugu for the first time ever and releases like Unstoppable, Bheemlanayak, Most Eligible Bachelor stand testimony of how it's managed to become Telugu vaari kotha alaavatu.


Nikhil Garry BH Pan India Film Titled SPY

 Nikhil, Garry BH, Ed Entertainments Pan India Film Titled SPY



Young and promising hero Nikhil Siddhartha’s 19th film being directed by Pacy editor Garry BH of Goodachari, Evaru and HIT fame and produced by K Raja Shekhar Reddy on Ed Entrainments with Charan Tej Uppalapati as CEO gets a powerful title.


Depicting Nikhil’s character, the movie is titled as SPY. What grabs our attentions is the intriguing way of the title design. Guns, bullets, sniper gun scope are used to design the title with bold letters. Dressed in black t-shirt, black Jacket and black cargo pants and Classic Aviators, Nikhil looks super stylish, as he walks elegantly with a short gun in his hand. He looks aptly as SPY in the poster. The kickass title poster creates great impact and generates enough interest on the movie.


SPY marks first Pan India release for Nikhil who will be seen in a completely different avatar and character. The film will have its theatrical release worldwide for Dasara, 2022 in Telugu, Hindi, Tamil, Kannada and Malayalam languages. “Attacking theatres this Dasara 2022,” announced the makers.


Producer K Raja Shekhar Reddy has also provided story, while Garry BH also takes care of editing.

Iswarya Menon is playing the leading lady opposite Nikhil in this flick billed to be a complete action-packed spy thriller being made on a large scale.


This high budget entertainer will have association of some prominent technical crew. Hollywood technician Julian Amaru Estrada is the cinematographer, while a Hollywood stunt director is overseeing the action sequences. Sricharan Pakala renders soundtracks for the film.Arjun Surisetty handles art department, while Ravi Anthony is the production designer


 Charantej Uppalapati is handling the entire production as CEO of banner Ed Entertainments which is bankrolling the project. Along with this project, the production house is also planning to do 2 more projects this year, one among them is with DJ Tillu fame director Vimal Krishna.


Cast: Nikhil Siddhartha, Iswarya Menon, Abhinav Gomatam, Sanya Takur, Jisshu SenGupta, Nitin Mehta, Ravi Varma & Others  


Technical Crew:

Director & Editor: Garry BH

Story & Producer: K Raja Shekhar Reddy

CEO: Charantej Uppalapati 

Presents: Ed entertainments 

Writer: Anirudh Krishnamurthy

Music Director: Sricharan Pakala

DOP: Julian Amaru Estrada

Art Director: Arjun Surisetty

Costumes: Raaga Reddy, Akhila Dasari , Sujeeth Krishnan 

Production Designer: Ravi Anthony

PRO: Vamsi-Shekar

Happy birthday to Natraj Master



 అన్‌స్టాపబుల్‌ బాలయ్యబాబులాంటి బడాబడా హీరోలకి జీ ఛానల్‌, మా ఛానల్‌, ఈటీవీ, జెమినిలాంటి ఛానల్స్‌లోని పెద్ద పెద్ద షోలకి ఎన్నో ఏళ్లు గా కొరియోగ్రఫీ చేస్తూ పేరు తెచ్చుకున్నాడు నటరాజ్‌ మాస్టర్‌. ఈరోజు అతని పుట్టినరోజు సందర్భంగా అతని శిష్యగణం అతని ద్వారా డ్యాన్‌ నేర్చుకున్నవాళ్లు, అతని సాయం పొందిన వాళ్లు నటరాజ్‌ బిగ్ బాస్‌ లో ఉన్నా  బయట నుంచి అందరూ అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. నటరాజ్‌ భార్య నీతూ మాస్టర్‌, కూతురు బేబీ లక్ష్య నటరాజ్‌కి శుభాకాంక్షలు తెలిపారు.

ఇదంతా ఇలా ఉండగా బిగ్‌బాస్‌ ఓటీటీలోని ఇంటి సభ్యుల మధ్య పోటీ పెంచుతూ, కలిసి ఆట ఆడుతున్నవారి మధ్య పోటీ పెంచి వేడి కలిగిస్తూ, విడిపోయి గొడవలు పడుతున్న సభ్యుల మధ్య పెంచిన గొడవలు చల్లార్చే టాస్క్‌లు పెడుతూ ఆటని మంచి రసవత్తరంగా ఆడిస్తున్నాడు. క్యారెక్టర్‌ ఉన్నవాడైనా సరే బిగ్‌బాస్‌ టాస్క్‌లతో ఓర్పు, సహనం వదిలేసి రియల్‌ కటౌట్‌ పక్కన పెట్టి చెట్టుకింద కెళితే గంధర్వుడు కాస్త రాక్షసుడిలా మారినట్లు మారుతున్నారు. కానీ గూగుల్‌ ఓటింగ్‌లలో జరిగే ఫేక్‌ ఓటింగ్‌లనే బయట అందరు గుడ్డిగా నమ్మి ఫాలో అవుతున్నా, ఆ రియల్‌ ఓట్లు మటుకు ఆ బిగ్‌బాస్‌కే తప్ప మరెవరికీ తెలియదు అనేదే సత్యం. అతని లెక్కే చివరికి గెలుస్తుంది అనేది వాస్తవం. బాగా కంటెంట్ ఇచ్చే వారు నలుగురు లేదా ఐదుగురు మాత్రమే అందులో నటరాజ్ ఒకడు . ఇలా కంటెంట్ ఇచ్చే నటరాజ్ లాంటి వాళ్లపై కడుపు మంట మీద బయట పెయిడ్ కామెంట్స్ రాసే వర్గం చెడు చల్లుతూ బిజీగా ఉన్నారు.బిగ్ బాసూ నీ రూటే వేరయా.

'Neeku Naaku Rasunte' Movie launched

 'Neeku Naaku Rasunte' launched

Makers are targeting to create a world record



Yash Entertainments is producing a movie titled 'Neeku Naaku Rasunte'. Presented by Yash Raj, the film is directed by 'Gana' maker KS Varma. What is unique about the project is that its director Varma is taking care of the maximum number of crafts in order to create a world record.


Starring Eshwar, Sai Vikranth, Rishi and Surya in the lead, the film's song recording is on. The banner Yash Entertainments was also launched today by producers Sravanthi Palagani and Abhishek Avala at Hyderabad's Film Chamber.


Speaking on the occasion, guest and playback singer Sunitha said, "By setting up the banner, the producers have won half the battle. Varma garu is immersed in 24 crafts with the aim of making it to the Guinness Book of World Records. I hope this one becomes a very novel experiment. I wish the entire unit all the best. This is the first time that I have sung a song live for a film. It's a record for me personally. I wish the director and producers all the best."


Director KS Varma said, "The film will be released in Telugu, Tamil, Kannada, Malayalam, and Hindi. Artists from all languages are working. I am handling all 24 crafts myself. Live recording has been done. I am confident that the audience will embrace the film and recognize the hard work. A prominent National Award-winning actress is going to act in our movie."


Producers Sravanthi Palagani and Abhisehk Avala said, "Yash Raj Films has made films that Indians can be proud of. That's why I have picked the name for our banner. Yash Raj is also my son's name. It's a lucky name. We had to make a movie in 2020 itself. But we didn't find a suitable story. We liked our director Varma garu's story and decided to produce the project. We are confident that the story is strong enough. That's why we are producing the movie. Talented technicians have been chosen. We are planning to produce three movies this year. And new talents will be given a platform. 'Neeku Naaku Rasunte' will go on the floors in May. It will be shot in Hyderabad, Araku, Vizag, Mangalore, Ooty, Chennai and other places."


Actors Eshwar, Sai Vikranth, Rishi and Surya said, "We thank the producers and the director for this opportunity. We have been journeying with the team for the past 6 months. Our director is multi-talented. We are feeling at home."


Other cast members:


Satyaraj, Suman, Ali, Raghu Babu, Gautham Raju, Tanikella Bharani, Uttej and others.


Crew:


Banner: Yash Entertainments

Producers: Sravanthi Palagani and Abhishek Avala

24 crafts, director: KS Varma

Music programmer: TR Krishna Chetan

Cinematographer: Hemanth BM

Action Director: Kanishka Sharma

Art Director: Nani

Editor: Antony

Executive Producer: Suresh Babu

Manager: Mohan Kumar M, Mohan Raj

Co-Directors: RV Suresh, P Jagannadh Reddy

PRO: Vadde Marenna

Acharya Pre Release Event To be held on April 23rd

 మెగాస్టార్ చిరంజీవి, మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా స్టార్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య ’ .. ఏప్రిల్ 23న ప్రీ రిలీజ్ ఈవెంట్



మెగాస్టార్ చిరంజీవి. మెగాప‌వ‌ర్‌స్టార్ రామ్‌చ‌ర‌ణ్ హీరోలుగా డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం ‘ఆచార్య‌’. శ్రీమ‌తి సురేఖ కొణిదెల స‌మ‌ర్ప‌ణ‌లో కొణిదెల ప్రొడ‌క్ష‌న్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రాన్ని ప్ర‌పంచ వ్యాప్తంగా ఏప్రిల్ 29 విడుద‌ల చేస్తున్నారు. ఏప్రిల్ 23న ఆచార్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైద‌రాబాద్‌లో నిర్వ‌హిస్తున్నారు. ఈ సంద‌ర్బంగా ...


చిత్ర నిర్మాత‌లు నిరంజ‌న్ రెడ్డి, అన్వేష్ రెడ్డి మాట్లాడుతూ ‘‘మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా స్టార్ డైరెక్టర్ కొరటాల శివగారు రూపొందిస్తోన్న చిత్రం ‘ఆచార్య’. సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి మెగా ఫ్యాన్స్‌, సినీ ప్రేక్ష‌కులు అంద‌రూ చిరంజీవిగారు, రామ్ చ‌ర‌ణ్‌గారు పూర్తిస్థాయి చిత్రంలో క‌లిసి న‌టిస్తే ఎలా ఉంటుందో చూడాల‌ని ఎదురు చూశారు. రీసెంట్‌గా విడుద‌లైన ట్రైల‌ర్‌కు ఎక్స్‌ట్రార్డిన‌రీ రెస్పాన్స్ వ‌చ్చింది. ఈ ట్రైల‌ర్‌కి వ‌చ్చిన రెస్పాన్స్‌ను బ‌ట్టే సినిమాపై ఉన్న అంచ‌నాల‌ను ఊహించాం. ఎక్స్‌పెక్టేష‌న్స్‌ను మించేలానే సినిమాను రూపొందించాం. ఏప్రిల్ 29న మూవీ రిలీజ్ అవుతుంది. ఏప్రిల్ 23న గ్రాండ్ లెవ‌ల్లో హైద‌రాబాద్ వేదిక‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హించ‌బోతున్నాం.


స‌న్నివేశాల్లో న‌ట‌న‌, డాన్సులు, డైలాగ్స్‌, యాక్ష‌న్ స‌న్నివేశాలు ఇలా అన్ని ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేస్తాయి. ఆచార్య చిత్రం కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఎంత ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నారో మేం కూడా అంతే ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాం’’ అన్నారు.