Latest Post

Team Ravanasura Wishes Sushanth On His Birthday

 Team Ravanasura Wishes Sushanth On His Birthday



Mass Maharaja Ravi Teja and Creative director Sudheer Varma’s unique action thriller Ravanasura has completed an important and lengthy shooting schedule. Alongside Ravi Teja, Sushanth who is playing a vital role also participated in the shoot.


Today, it’s Sushanth’s birthday. Wishing him on the occasion, the team has released a brand-new poster. Sushanth appears ferocious, as he gives serious gaze here. Blue yes, long hair and beard add more intensity to the character.


Abhishek Nama is producing the movie grandly under Abhishek Pictures and RT Teamworks. Ravi Teja plays a lawyer in the movie that will star a total of five heroines- Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar and Poojitha Ponnada.


Srikanth Vissa who’s associated with few exciting projects as a writer has penned a powerful and a first of its kind story for the movie. Some prominent actors and noted craftsmen are part of the project.


Harshavardhan Rameswar and Bheems together provide music for the film, while Vijay Kartik Kannan handles the cinematography and Srikanth is the editor.


Cast: Ravi Teja, Sushanth, Anu Emmanuel, Megha Akash, Faria Abdullah, Daksha Nagarkar, Poojitha Ponnada, Rao Ramesh, Murali Sharma, Sampath Raj, Nitin Mehta (Akhanda fame), Satya, Jaya Prakash and others.


Technical Crew:

Director: Sudheer Varma

Producer: Abhishek Nama

Banner: Abhishek Pictures, RT Teamworks

Story, Screenplay & Dialogues: Srikanth Vissa

Music: Harshavardhan Rameswar, Bheems

DOP: Vijay Kartik Kannan

Editor: Srikanth

Production Designer: DRK Kiran

CEO: Potini Vasu

Makeup Chief: I Srinivas Raju

PRO: Vamsi-Shekar


Producer Abhishek Agarwal Interview About Kashmir Flies

ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు పాదాభివందనాలు - నిర్మాత అభిషేక్ అగర్వాల్



వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో `ది కశ్మీర్ ఫైల్స్` చిత్రాన్ని నిర్మించిన అభిషేక్ అగర్వాల్ ప్రపంచంలోని హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు చిత్రాన్ని అంకితం ఇస్తున్నట్లు ప్రకటించారు. దేశంలో ఈ సినిమా విడుదలైన అన్నిచోట్ల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ సందర్భం గా అభిషేక్ అగర్వాల్ హైదరాబాద్ లో తన సంస్థ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు విషయాలను తెలియజేశారు.


- ముందుగా ఈ సినిమాను ఆదరిస్తున్న యావత్ ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పటికే ఈ సినిమా 100 కోట్ల క్లబ్ లో చేరింది. ఇంత ఆదరణ చూపిస్తున్న ప్రతి హిందూ పండిట్ లకు, ప్రేక్షకులకు పాదాభివందనాలు తెలియజేస్తున్నా.

- సినిమా విడుదలకు ఐదురోజుల ముందు ఒక మహిళ ఢిల్లీ నుంచి 20 వేల రూపాయలతో టికెట్ పెట్టుకుని నన్ను వెతుక్కుంటూ మరీ హైదరాబాద్వచ్చి  కలిసింది. వచ్చీ రాగానే తెగ ఏడ్చేసింది. నాకు ఈ సినిమా గురించి చెప్పడానికి మాటలు రావడంలేదు. 32 ఏళ్ళ నుండి మా పండిట్ ల గురించి ఎవ్వరూ మాట్లాడలేదు. నా కుటుంబం ఆ టైంలో ఎంతో సఫర్ అయింది అంటూ ఆమె జ్ఞాపకాలు తెలియజేసింది.

- అదే రోజు రాత్రి కశ్మీర్ పండిట్ ల తో జూమ్ మీటింగ్ ఏర్పాటు చేశాం. 2 వేల మంది పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ థ్యాంక్ యూ సార్ అని చెప్పారు.


- సినిమా అనేది కమర్షియల్. కానీ 5 లక్షల మంది కశ్మీర్ పండిట్ ల బాధలు, సమస్యలను 32 ఏళ్ళనాటివి బయటకు తెచ్చాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

- ముఖ్యంగా యూత్ కు బాగా కనెక్ట్ అయింది. ఇలాంటి సంఘటనలు జరిగాయా! అంటూ ఇవి చూస్తుంటే మాకే సిగ్గేస్తుందంటూ ఫీలింగ్ ను వ్యక్తం చేశారు.

- ఈ సినిమా చేసేటప్పుడు ఆర్టికల్ 370 గురించి రీసెర్ఛ్  చేశాం.. మూడు నెలలపాటు యు.ఎస్., కెనడ, దక్షిణాఫ్రికా మొదలైన ప్రదేశాలు తిరిగి అక్కడున్నవారి నుంచీ ఫీడ్ బ్యాక్ తీసుకున్నాం.


-  హిందీలో ఇది నా తొలి సినిమా. దీనికి సీక్వెల్ అనేది వుండదు.

- వివేక్ కథ చెప్పాకే నాకు సినిమా చేయాలనే ఆలోచన వచ్చింది.

 - ఇది ప్రజల సినిమా. ఇతర సినిమాలు అదే టైంలో విడుదలైనా వారి ఇష్టం మేరకు ఆయా సినిమాలు చూస్తారు. మాది చిన్న సినిమా. అందుకే పెద్దగా పబ్లిసిటీ కూడా ఇవ్వలేదు. చిన్న సినిమా కాబట్టి ఎవరూ సపోర్ట్ చేయరని తెలుసు. కానీ సినిమా విడుదలయ్యాక అన్ని చోట్లనుంచి, ముఖ్యంగా తెలుగు చలన చిత్రరంగంలో ఎంతోమంది అభినందలు కురిపించారు.

- అందుకే ఈ సినిమా పరంగా ఏదైనా అభినందలు వుంటే అది కశ్మీర్ పండితులకు చెల్లుతుంది. వారికే ఈ సినిమా అంకితం.

- ప్రధాని మోడీగారిని కలవడం అనేది యాదృశ్చికంగా జరిగింది. ఒకరోజు ఆయన ఆఫీసునుంచి ఫోన్ వచ్చింది. వెళ్ళి కలిశాం. ఆయనతో గడిపిన క్షణాలు మర్చిపోలేను.

- ఈ సినిమా తర్వాత పర్యావసనాలు ఏమైనా వుంటే ఛాలెంజ్ గా తీసుకున్నాం. సినిమా తీసేటప్పుడు కొంత ఫేస్ చేశాను. విడుదలకుముందు కొంత ఫేస్ చేశాను. ఇలాంటి సమస్యలు వస్తాయనే ముందుగా ప్రిపేర్ అయ్యాను.

- కరెక్ట్గా చెప్పాలంటే నిజాయితీగా తీస్తే భయపడాల్సిన అవసరంలేదు. నేను ఏదైనా తప్పుగా చూపిస్తే ప్రజలే సపోర్ట్ చేయరు.

- త్వరలో దేశంలో అన్ని భాషల్లో డబ్ చేసే ఆలోచన వుంది. తెలుగులోకూడా డబ్ చేయబోతున్నాం.

- మా సినిమాకు అస్సాం, యు.పి., గుజరాత్, మధ్యప్రదేశ్, హర్యానా, కర్నాటకతోసహా మొత్తం  9 రాష్ట్రాలలో టాక్స్ మినహాయింపు వచ్చింది.

- ఇంకా ఈ సినిమాలో చెప్పలేని కొన్ని విషయాలున్నాయి. ఏది ఏమైనా 370 ఆర్టికల్ వరకే సినిమా తీశాం. ఆ తర్వాత కంటిన్యూ చేసే ఆలోచన ప్రస్తుతం లేదు.

- ఈ సినిమాలో నాతోపాటు నా కుటుంబసభ్యులు, స్టాఫ్ కూడా ఎంతో సపోర్ట్ చేశారు. 24గంటలు వారు ఈ సినిమాకు పనిచేశారు.

 

- ఈ సినిమా థియేటర్లో తర్వాత ఓటీటీలోకూడా విడుదలకాబోతుంది.


- ఈ సినిమాలో అనుపమ్ ఖేర్ కశ్మీర్ పండిట్ గా నటించారు. ఆయన పాత్రలో లీనమై పోయారు. ఆయనేకాదు చాలమంది నటీనటులు ఫీల్ అయి చేశారు. రాత్రి పూటా ఆ పాత్రలో మమేకం అయి నిద్ర సరిగ్గా పట్టేదికాదు వారికి.

- షూటింగ్ జరుగుతుండగా అనుపమ్ ఖేర్ ను అక్కడి హిందువులు డిన్నర్కు ఆహ్వానించేవారు. 90 ఏళ్ళ వృద్ధురాలు కూడా తను ఇంటిదగ్గర వండి భోజనం తీసుకువచ్చేది. ఇలా ఎంతోమంది హిందువులును కలిసి వారితో షేర్ చేసుకున్న సంగతులు నిర్మాతగా నాకు సంతృప్తినిచ్చాయి.


- ఈ సినిమాను అందరూ పర్సనల్ గా తీసుకుని నటించారు. దర్శకుడు పూర్తి క్లారిటీతో సినిమా తీశాడు.


- నా కొత్త సినిమాలు.

రవితేజ తో నా డ్రీమ్ ప్రాజెక్ట్.. టైగర్ నాగేశ్వర రావు చేస్తున్నా. ఆ తర్వాత అబ్దుల్ కలాం బయోపిక్ చేయబోతున్నాం. అదేవిధంగా దర్శకుడు వివేక్తో ఢిల్లీ ఫైల్స్ అనే సినిమా ఆలోచనలో వుంది. అని తెలిపారు.



Shoot of Narne Nithiin's launch vehicle 'Sri Sri Sri Raja Vaaru' done, first look unveiled

 Shoot of Narne Nithiin's launch vehicle 'Sri Sri Sri Raja Vaaru' done, first look unveiled



Thanks to his passion for acting, Narne Nithiin, after equipping himself with all skills that are necessary to face the camera, is all set to make his debut with Sri Sri Sri Raja Vaaru, a family entertainer with a difference.


The film, produced on Sri Vedakshara Movies banner,  by Ramarao Chinthapalli and MS Reddy. It is directed by Vegesna Satish, who carved a niche for himself with the award winning 2017 film Shathamanam Bhavati. 


The makers have released the first look of 'Sri Sri Sri Raja Vaaru' today. The creatively designed poster is set in the backdrop of a temple festival. Narne Nithiin, who has been shown in side pose, is sporting a rugged look with a checked full-hand shirt, jeans pant and sports shoes. 


He is lighting a cigarette with all intensity in his face and the still is from a stunt scene. Authenticity has been maintained in the poster with artistes dressed like Gods adding more flavour it. 


The logo of the movie adds more to the curiosity, as the letters have been designed like cigarettes. The movie's shoot is over and post production works are going on in full swing.


In the days to come, the makers are set to reveal more interesting details about the movie and are planning a grand release. For the uninitiated, Narne Nithiin is the brother of NTR Junior's wife Lakshmi Pranathi.

Mirnaa Menon Debut to TFI with Production No 10 Of Sri Sathya Sai Arts

 Introducing Mirnaa Menon To Telugu Film Industry With Production No 10 Of Sri Sathya Sai Arts Starring Aadi Saikumar as lead and directed by debutant Phani Krishna Siriki



Producer KK Radhamohan of Sri Sathya Sai Arts is producing an out and out entertainer as Production No 10 from the banner with young and talented hero Aadi Saikumar playing the lead role and debutant Phani Krishna Siriki directing it. Lakshmi Radhamohan presents the yet to be titled film.


The film’s shoot is presently underway with the team canning scenes involving the prominent cast. Recently, Digangana Suryavanshi came on board to play the lead heroine opposite Aadi Saikumar in the movie. Now, Mirnaa Menon is roped in to play another heroine in the movie. This film marks Telugu debut for Mirnaa who previously starred in few films in Malayalam and Tamil. Both the heroines will have their own importance in the movie.


Coming to technical crew, music for the film is scored by RR Dhruvan, while Satish Mutyala takes care of cinematography. Giduturi Satya, Kolikapogu Ramesh and Rama Krishna supervise editing, art and stunts respectively.


Title and other details of the movie will be revealed soon.


Cast: Aadi Saikumar, Digangana Suryavanshi, Mirnaa Menon and others


Technical Crew:

Presents: Lakshmi Radhamohan

Production Banner: Sri Sathya Sai Arts

Producer: KK Radhamohan

Writer, Director: Phani Krishna Sariki

Music: RR Dhruvan

DOP: Satish Mutyala

Art: Kolikapogu Ramesh

Editor: Satya Giduturi

Action: Rama Krishna

Choreography: Jithu,Harish

Production Controller: MS Kumar

Production Executive: M Srinivasa Rao (Gaddam Srinu)

PRO: Vamsi-Shekar

Designer: Ramesh Kothapalli

Sushanth onboarded for ZEE5's Original web series

 Sushanth onboarded for ZEE5's Original web series



Sushanth starts shooting for the Kolla Entertainments production


Hyderabad, March 18th, 2022: Legendary actor Akkineni Nageshwara Rao's grandson, King Nagarjuna's nephew and the actor of such films as 'Kalidasu', Sushanth, has been doing films for many years. Soon after he made his acting debut, Sushanth went on to pick the right set of films. He has delivered impact through titles such as 'Current', 'Adda', 'Dongata', 'Aatadukundam Raa' and 'Chi La Sow'. He has catered to both class and mass audiences alike. Sushanth played a memorable character in 'Ala Vaikunthapurramuloo', which had him in a classy part. 'Ichata Vaahanamulu Nilupa Raadu', which was released during the pandemic, is another of his hits.


These days, the actor is evincing interest in OTT as well. Thanks to his enthusiasm to try out new genres/formats, Sushanth is currently doing a web series under ZEE5. The streaming giant's product is being shot at a fast pace currently. Praveen Kolla of Kolla Entertainments is producing it. Directed by Lakshmi Sowjanya, the production works are going on smoothly.


ZEE5 team has welcomed the actor, who is showing interest in both films and OTT, in a grand way onto the set. The First Look poster of Sushanth was today unveiled, marking the actor's birthday.


We see the talented actor in a dashing pose with a police jeep placed in the backdrop. Going by the poster, he is essaying the role of a cop in the ZEE5 Original.

Anu shooting Completed

షూటింగ్ పూర్తి చేసుకున్న హర్రర్ థ్రిల్లర్ అను. !!!




తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న చిత్రం అను. ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు హీరో హీరోయిన్లు గా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. త్వరలో చిత్ర ట్రైలర్ విడుదల కానుంది. హొలీ సందర్భంగా ఈ చిత్రంలోని లిరికర్ సాంగ్ ఏమైంది ఏమో సాంగ్ ను విడుదల చేశారు. సాంగ్ బాగుందని అందరూ అంటున్నారు. ఈ మూవీలో మిగిలిన సాంగ్స్ త్వరలో విడుదల కానున్నాయి. 



హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఫన్ ఎలిమెంట్స్ బాగుంటాయని చిత్ర యూనిట్ తెలిపారు. కథ, కథనాలు బాగున్న సినిమాలను ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా అను సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని నమ్మకం ఉందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. దర్శకుడు భీమినేని శ్రీనివాస్, మరియు దేవి ప్రసాద్ ఈ చిత్రంలో మంచి పాత్రల్లో నటించారు. సినిమా ఔట్ ఫుట్ బాగా వచ్చింది. త్వరలో రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తామని యూనిట్ సభ్యులు తెలిపారు. 



బ్యానర్: తేజస్వి క్రియేటివ్ వర్క్స్

నటీనటులు: ప్రశాంత్ కార్తిక్, మిష్టి చక్రవర్తి, కార్తిక్ రాజు, ఆమని, భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ తదితరులు 

సంగీతం: గంటసాల విశ్వనాధ్

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సందీప్ గోపిశెట్టి

Rambo on Sets From March 28th

 "ర్యాంబో"గా రచ్చ చేయనున్న "ఉడుంబు"

# టైటిల్ పాత్రలో 

యువ హీరో ఆశిష్ గాంధి!!



# గంగపట్నం శ్రీధర్ నిర్మాణం- 

రత్నాకరం అనిల్ రాజు దర్శకత్వంలో

మార్చి 28 నుంచి సెట్స్ పైకి!!


      మలయాళంలో మంచి విజయం సాధించిన "ఉడుంబు" తెలుగు రీమేక్ రైట్స్ ప్రముఖ నిర్మాత గంగపట్నం శ్రీధర్ సొంతం చేసుకోవడం తెలిసిందే. టి.సి.ఎస్.రెడ్డి సమర్పణలో శ్రీవిఘ్నేష్ కార్తీక్ సినిమా పతాకంపై నిర్మాణమవుతున్న ఈ చిత్రానికి "ర్యాంబో" అనే టైటిల్ పెట్టారు. యువ కథానాయకుడు ఆశిష్ గాంధీ టైటిల్ పాత్ర పోషించనున్నాడు. దర్శకత్వ శాఖలో విశేష అనుభవం కలిగిన యువప్రతిభాశాలి "రత్నాకరం అనిల్ రాజు" ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం కానున్నాడు. తమ తమ శాఖలలో నిష్ణాతులైన స్టార్ టెక్నిషియన్స్ "ర్యాంబో" చిత్రానికి పని చేస్తున్నారు. 

     హోలీ పండుగను పురస్కరించుకుని "ర్యాంబో" ఫస్ట్ లుక్ విడుదల చేశారు. మార్చి 28 నుంచి సెట్స్ కు వెళ్లనున్న ఈ క్రేజీ చిత్రానికి ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. 

యువ సంగీత సంచలనం సునీల్ కశ్యప్ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి సాంగ్స్: రామజోగయ్య శాస్త్రి, డైలాగ్స్: రైటర్ మోహన్, డాన్స్: శేఖర్ మాస్టర్, ఫైట్స్: స్టంట్ జాషువా, సినిమాటోగ్రఫీ: శ్యామ్ కె.నాయుడు, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరావు, సమర్పణ: టి.సి.ఎస్.రెడ్డి, నిర్మాత: గంగపట్నం శ్రీధర్, స్క్రీన్ ప్లే-దర్శకత్వం: రత్నాకరం అనిల్ రాజు!!

1st song from Mukha Chitram Launched by S THAMAN

 సంగీత దర్శకుడు థమన్ చేతుల మీదుగా "ముఖచిత్రం" సినిమాలోని 'క్లాస్ రూమ్లో...' లిరికల్ సాంగ్ 



వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్ ప్రధాన

పాత్రల్లో నటిస్తున్న సినిమా "ముఖచిత్రం". కలర్ ఫొటో మూవీతో హిట్ కొట్టిన

దర్శకుడు సందీప్ రాజ్ ఈ సినిమాకు కథ స్క్రీన్ ప్లే, మాటలు

అందిస్తున్నారు. కాల భైరవ సంగీత దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ఎస్

కేఎన్ సమర్పణలో పాకెట్ మనీ పిక్చర్స్ పతాకంపై ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల

ముఖచిత్రం సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాతో గంగాధర్ అనే కొత్త

దర్శకుడు తెలుగు ఇండస్ట్రీకి పరిచయమవుతున్నాడు. ఫన్ అండ్ ఇంటెన్స్

డ్రామాగా తెరకెక్కుతున్న ఈ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

గురువారం ముఖచిత్రం సినిమాలోని క్లాస్ రూమ్ లో లిరికల్ సాంగ్ ను సంగీత

దర్శకుడు థమన్ విడుదల చేశారు. పాట చాలా బాగుందన్న థమన్ చిత్రబృందానికి

బెస్ట్ విశెస్ తెలిపారు.


ఈ పాట ఎలా ఉందో చూస్తే...నువ్వెక్కడుంటే నేనక్కడుండా నువ్వంటే నాకు ఎంత

ఇష్టమో. ప్రతి ఒక్క చోటా అతుక్కు పోతా నీ నుంచి దూరం ఎంత కష్టమో. మాథ్స్

లో నీ ఊసులేగా, సైన్స్ లో నీ ఊహలేగా..ప్రేమగా నీ కలలు కన్నా, పాటమే

తలకెక్కదన్నా, నిండుగా నిను చదువుకుంటున్నా...క్లాస్ రూములో

మనం..కారిడార్ లో మనం..ఆటపాటలో మనం..అన్ని వైపులా మనం..లంచ్ బ్రేక్ లో

మనం..లాస్ట్ బెంచ్ లో మనం..బ్లాక్ బోర్డులో మనం...ఏకమైన మనసులం.. ఇలా

విద్యార్థి జీవితపు ప్రేమకథను అందంగా రచించారు రామజోగయ్యశాస్త్రి.

కాలభైరవ సంగీతాన్ని సమకూర్చడంతో పాటు సింధూరి విశాల్ తో కలిసి పాడారు.

దర్శకుడు సందీప్ రాజ్ "కలర్ ఫొటో" సినిమాలో తరగది గది దాటి పాట సూపర్

హిట్ అయ్యింది. ఇప్పుడు ఆయన కథ స్క్రీన్ ప్లే మాటలు అందిస్తున్న

ముఖచిత్రం సినిమాలోనూ క్లాస్ రూమ్ లో పాట ఆ ఫీల్ తోనే సాగుతూ

ఆకట్టుకుంటోంది.

నటీనటులు - వికాస్ వశిష్ట, ప్రియ వడ్లమాని, చైతన్య రావ్, అయేషా ఖాన్


సాంకేతిక నిపుణులు - సంగీతం - కాల భైరవ, ఎడిటింగ్ - పవన్ కళ్యాణ్, సమర్పణ

- ఎస్ కేఎన్, నిర్మాతలు - ప్రదీప్ యాదవ్, మోహన్ యల్ల, కథ స్క్రీన్ ప్లే

మాటలు - సందీప్ రాజ్, దర్శకత్వం - గంగాధర్.

Nazriya Nazim’s Zeroth Look As Leela Thomas InAnte Sundaraniki Is Out Now

 Nazriya Nazim’s Zeroth Look As Leela Thomas In Nani, Vivek Athreya, Mythri Movie Makers Ante Sundaraniki Is Out Now





Natural Star Nani’s rom-com entertainer Ante Sundaraniki being directed by Vivek Athreya under the prestigious Mythri Movie banner is scheduled for its theatrical release on June 10th. Shoot of the movie was already wrapped up and post-production works are presently underway.


Nazriya Nazim is playing leading lady opposite Nani and Ante Sundaraniki marks her Tollywood debut. Introducing Nazriya as Leela Thomas, the makers have revealed her zeroth look poster. She’s a photographer sailing in her ocean of dreams, as she is lost in deep thoughts here. She appears in trendy outfit carrying a camera in her hand. The actress, however, looks gorgeous in the poster.


Vivek Sagar scores music, while Niketh Bommi cranks the camera and Raviteja Girijala is the editor for the film.


Cast: Nani, Nazriya Fahadh, Nadhiya, Harshavardhan, Rahul Ramakrishna and others.


Technical Crew:


Writer, Director: Vivek Athreya

Producers: Naveen Yerneni & Ravi Shankar Y

Banner: Mythri Movie Makers

CEO: Cherry

Music Composer: Vivek Sagar

Cinematographer: Niketh Bommi

Editor: Raviteja Girijala

Production Design: Latha Naidu

Publicity Design: Anil & Bhanu

PRO: Vamsi Shekar

Stand Up Rahul Pre Release Event Held Grandly

రాజ్ త‌రుణ్‌ కు తొలిసినిమాలా వుంది - స్టాండప్ రాహుల్` ప్రీ రిలీజ్ వేడుకలో వ‌రుణ్ తేజ్‌



ప్రేమిస్తే వారికోసం నిలబడాలి అని స్టాండప్ రాహుల్

హీరో రాజ్ తరుణ్, వ‌ర్ష బొల్ల‌మ్మ జంట‌గా న‌టించిన సినిమా `స్టాండప్ రాహుల్`.  కూర్చుంది చాలు అనేది ట్యాగ్‌లైన్‌. శాంటో మోహన్ వీరంకి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమాను డ్రీమ్ టౌన్ ప్రొడక్షన్స్ అండ్ హైఫైవ్ పిక్చర్స్ బ్యానర్ల‌పై నంద కుమార్ అబ్బినేని, భరత్ మాగులూరి నిర్మించారు. సిద్దు ముద్ద స‌మ‌ర్ప‌కులు. అన్ని కార్య‌క్ర‌మాలు ముగించుకుని హోలీ కానుక‌గా ఈనెల 18న విడుద‌ల‌కాబోతుంది. ఈ సంద‌ర్భంగా బుధ‌వారం రాత్రి జూబ్లీహిల్స్‌లోని జె.ఆర్‌.సి. కన్వెన్షన్ లో ప్రీ రిలీజ్ వేడుక జ‌రిగింది. ముఖ్యతిథి గా విచ్చేసిన వ‌రుణ్‌తేజ్‌, ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి తో క‌లిసి బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు.

అనంత‌రం వ‌రుణ్ తేజ్ తెలుపుతూ, సిద్దు ఈ క‌థ‌ను శాంటో ద్వారా నాకూ వినిపించారు. ద‌ర్శ‌కుడిలో చాలా క్లారిటీ వుంది. ట్రైల‌ర్‌ లో ఆ విష‌యాన్ని చ‌క్క‌గా చెప్పాడు. నేను, రాజ్ త‌రుణ్ ఒకేసారి కెరీర్‌ను మొద‌లు పెట్టాం. ఇప్ప‌టికీ అలానేవున్నాడు. త‌ను మంచి న‌టుడు. త‌న తొలి సినిమాలా వుంది స్టాండప్ రాహుల్. త‌న క‌ష్టానికి ఫ‌లితం ద‌క్కుతుంది. వ‌ర్ష మిడిల్‌క్లాస్ మెలోడీస్ చూశాను. త‌న‌కు భ‌విష్య‌త్ వుంది. ఇంద్ర‌జ చ‌క్క‌గా న‌టించారు. కెమెరా విజువ‌ల్స్‌, సంగీతం బాగా ఆక‌ట్టుకున్నాయి. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి మాట్లాడుతూ, స్టాండప్ కామెడీ ద్వారా న‌వ్వించ‌డం క‌ష్టం. ఇందులో కామెడీనేకాదు చాలా అంశాలున్నాయ‌ని చిత్ర యూనిట్ చెబుతోంది. రాజ్‌ త‌రుణ్  ఉయ్యాల ‌జంపాల టైంలో వున్న‌ట్లుగా  వున్నాడు. ఇంద్ర‌జ‌గారి సినిమాలు చూశాను. త‌ను మంచి న‌టి. ద‌ర్శ‌కుడు శాంటోకి ఆల్ ది బెస్ట్‌. ట్రైల‌ర్‌ లోనే ఏది వుండ‌బోతుందో క్లారిటీగా చెప్పేశాడు. శ్రీ‌క‌ర్ సంగీతం బాగుంది. అంద‌రి కృషికి ఫ‌లితం ద‌క్కుతుంద‌ని న‌మ్మ‌క‌ముంది. ఈ స్టేజీమీద కొంద‌రు స్టాండప్ కామెడీ చేశారు. ఇది చూస్తుంటే నా కాలేజీలో ఓసారి ర‌ఘుబాబుగారు చేసిన జోక్ గుర్తుకువ‌స్తుంది. దాన్ని నేను కాలేజీలో స్కిట్‌ గా చేశాను. అదే నాలో ద‌ర్శ‌కుడు వున్నాడ‌నే గుర్తించే లా చేసిందంటూ.. బ‌స్‌ లో ఓ ప్ర‌యాణీకుడు సీటులో కూర్చోకుండా అటూ ఇటూ న‌డుస్తూ ఎలా గ‌మ్యానికి చేరాడ‌నేది చెప్పి అంద‌రినీ న‌వ్వించారు.

రాజ్ త‌రుణ్ మాట్లాడుతూ, నాకు ఎప్ప‌టికీ గుర్తిండిపోయే సినిమా ఇది. అగ‌స్త్య రెండేళ్ళు ఈ సినిమాకే ప‌నిచేశాడు. ఇంద్ర‌జ‌, ముర‌ళీశ‌ర్మ‌, వెన్నెల కిశోర్ మొద‌లైన‌వారితో ప‌నిచేయ‌డం గొప్ప‌గా వుంది. ఇందులో నేను బాగా న‌టించానంటే కార‌ణం వ‌ర్ష‌. ద‌ర్శ‌కుడు శాంటోతో ప‌నిచేయ‌డం హ్యాపీగా వుంది. సినిమా మాకు న‌చ్చింది. మీకూ న‌చ్చుతుంది. ఫ్యామిలీడ్రామాతో కూడిన రామ్‌కామ్ సినిమా ఇద‌ని` తెలిపారు.

ఇంద్ర‌జ మాట్లాడుతూ, యువ‌త‌కు క‌నెక్ట్ అయ్యే విష‌యాలు ఈ సినిమాలో చాలా వున్నాయి. స‌హ‌జంగా పెద్ద‌లు పిల్ల‌ల‌ను స‌రైన దారిలో పెడ‌తారు. ఈ సినిమాప‌రంగా వ‌ర్ష‌, రాజ్ త‌రుణ్‌ను స‌రైన దారిలో పెడుతుంది. పెద్ద‌లేకాదు. యూత్‌కూడా ఇప్పుడు స‌రైన మార్గంలో వెళుతున్నారు. అదేవిధంగా స‌హ‌జీనం అనే అంశాన్ని చాలా డిటైల్డ్‌గా ఇందులో చెప్పారు. అందుకే యూత్ బాగా క‌నెక్ట్ అవుతారు. ఈ సినిమా చూశాక చాలా విష‌యాలు తెలుసుకుంటారు. మాకూ పురుషుల‌తోపాటు స‌మాన‌మైన బ‌ల‌మైన పాత్ర‌లు ఇస్తే చేయ‌గ‌ల స‌త్తావుంది. ఆ దిశ‌గా రాయాల‌ని ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కులు, ర‌చ‌యిత‌ల‌కు తెలియ‌జేస్తున్నాన‌ని అన్నారు.

ద‌ర్శ‌కుడు శాంటో మాట్లాడుతూ, మా ఫ్యామిలీకి సినిమారంగంతో అనుభంలేదు. వారు ఇప్పుడు న‌న్ను ఇలా చూస్తున్నందుకు చాలా సంతోషంగా వుంది. ఇది కామెడీ ఫిలిం అని చేయ‌లేదు. మ‌నం దేన్నైనా స‌రే ఇష్ట‌ప‌డితే ఎవ‌రినైనా ప్రేమిస్తే వాళ్ళ కోసం నిల‌బ‌డాలి, పోరాటం చేయాల‌ని చెప్పే క‌థ ఈ సినిమా. అందుకే స్టాండ‌ప్ కామెడీ నేప‌థ్యాన్ని ఎంచుకున్నా. రాజ్ త‌రుణ్ బాగా స‌హ‌క‌రించారు. నేను అంత‌కుముందు షార్ట్ ఫిలింస్ చేశాను. క‌రోనావ‌ల్ల ఇంకా బాగా రాయ‌డానికి స‌మ‌యం కుదిరింది. వ‌ర్ష మంచి న‌టి. ఈ సినిమాలో చాలా జోక్స్ వ‌ర్ష చెప్పిన‌వే. శ్రీ‌రాజ్ విజువ‌ల్స్ బాగా చూపించాడు. ఇంద్ర‌జ‌తోపాటు అంద‌రూ బాగా న‌టించార‌ని అన్నారు.

`మార్చి 18న  థియేట‌ర్‌కు వ‌చ్చి ఎంజాయ్ చేయండని` నిర్మాత భ‌ర‌త్ పేర్కొన్నారు. `రాజ్ త‌రుణ్ చూపించే విధానం కొత్త‌గా వుంటుంది. శాంటో క్లారిటీగా ఈ సినిమా చెప్పాడు. రేపు అంద‌రూ థియేట‌ర్ల‌లో చూసి ఆనందించండి` అని మ‌రో నిర్మాత నంద కుమార్ అబ్బినేని అన్నారు.

స‌మ‌ర్ప‌కుడు సిద్దు తెలుపుతూ, ఈ క‌థ విన‌గానే న‌చ్చి భ‌ర‌త్‌, నందుకు హెల్ప్ చేసేలా చేయ‌గ‌లిగానన్నారు.

వ‌ర్ష బొల్ల‌మ్మ తెలుపుతూ, 96లో విజ‌య్‌సేతుప‌తితో ఓ సినిమా చేశాను. ప్రేక్ష‌కుల‌కు మంచి సినిమా ఇస్తే వారే మ‌న‌ల్ని త‌మ‌వారిగా చేసుకుంటార‌నే కొన్ని విష‌యాలు ఆయ‌న్నుంచి నేర్చుకున్నాను. ఈ సినిమాలో బాగా న‌టించానంటే అందుకు కార‌ణం రాజ్ త‌రుణ్ స‌హ‌కార‌మే. ద‌ర్శ‌కుడు శాంటోకి క‌థ‌పై పూర్తి అవ‌గాహ‌న వుంది. ముఖ్య అతిథి వ‌రుణ్ తేజ్‌నుద్దేశించి..`గ‌ని` చూడ్డానికి మీ మ‌నీ పెట్టుకుని సిద్ధంగా వుండంటూ. ఉత్సాహ‌ప‌రిచారు.

భీమ్లా నాయ‌క్ ద‌ర్శ‌కుడు సాగ‌ర్ కె. చంద్ర మాట్లాడుతూ, శాంటో నాకు స్నేహితుడు. అరేబియ‌న్ కాన్సెప్ట్ మీద సినిమా చేయాలంటే బాగా తెలిసివుండాలి. శాంటో దాన్ని బాగా తీశాడ‌నిపిస్తుంది. ట్రైల‌ర్‌లో చూస్తుంటే రాజ్‌త‌రుణ్ పాత్ర బాగా చేసిన‌ట్లుగా వుంది అన్నారు.

`గ‌ని` ద‌ర్శ‌కుడు కిర‌ణ్ కొర్ర‌పాటి తెలుపుతూ, నిన్న‌నే ఈ సినిమా చూశాను. బాగా వ‌చ్చింది. నిర్మాత‌లు మంచి సినిమా తీశారు. రాజ్ త‌రుణ్ టైమింగ్‌, స్ట‌యిల్ చాలా బాగుంది. ఇంద్ర‌జగారికి మంచి రీఎంట్రీ అవుతుంద‌ని ఆశిస్తున్నాన్నా. అంద‌రికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు.

ఇంకా సంగీత ద‌ర్శ‌కుడు  శ్రీ‌క‌ర్ అగ‌స్తీ, కెమెరామెన్ శ్రీ‌రాజ్ ర‌వీంద్ర‌న్, కొరియోగ్రాఫ‌ర్  ఈశ్వ‌ర్ మాట్లాడుతూ చిత్రం విజ‌య‌వంతం కావాల‌ని ఆకాంక్షించారు. అలాగే స్టాండ‌ప్ కామెడీ పెర్‌ఫార్మ‌ర్స్‌, రైట‌ర్స్ అయిన రాజ‌శేఖ‌ర్‌,  హృద‌య్‌ రంజ‌న్‌, సందేశ్ త‌మ స్టాండ‌ప్ కామెడీని ప్ర‌ద‌ర్శించారు. అనంత్ శ్రీ‌రామ్ రాసిన  `అలా ఇలా` పాటను గాయ‌ని స‌త్య యామిని పాడి అల‌రించారు. రోల్ రైడా, గీత ర‌చ‌యిత ర‌ఘురామ్ కూడా మాట్లాడారు.


T3 is Creating New Trend

 కరీంనగర్ టు రాజమండ్రి

వయా లండన్!!



"టీ-3"తో ట్రెండ్ సెట్ చేస్తున్నాడు!!


కప్పుకు రూపాయి మాత్రమే మార్జిన్

రుచి-నాణ్యత-సంతృప్తిలకు 

ప్రధమ ప్రాధాన్యం!!


"టీ" ప్రియుల మనసులు

హోల్ సేల్ గా దోచుకుంటున్న

కరీంనగర్ కుర్రాడు *"కిరణ్ బైరెడ్డి"*


     అతను పుట్టింది దిగువ మధ్య తరగతి వ్యవసాయ కుటుంబంలోనే అయినా.... అతని ఆలోచనలు మాత్రం అత్యున్నత శ్రేణికి చెందినవి. డిగ్రీ వరకు కరీంనగర్ లో చదివి.... విజయవాడలో "ఐ.సి.డబ్యూ.ఎ.ఐ" చేసి... లండన్ లో "ఎమ్.బి.ఎ" పట్టా పుచ్చుకుని... అక్కడ నాలుగన్నరేళ్లు కొన్ని కొలువులు

చేసినా అతనికి కోరిన సంతృప్తి దొరకలేదు. "ఇక ఇక్కడ పొడిచింది చాల్లే" అని సొంతూరు వచ్చేశాడు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ అయిన అతని అర్ధాంగి కూడా అందుకు అభ్యంతరం చెప్పలేదు. "నీ మెంటాలిటీకి మోనోటనీగా ఉండే ఉద్యోగాలు సరిపడవులే" అంటూ ఫుల్ సపోర్ట్ చేసింది.

      లండన్ లో ఉండగా పరిచయం అయిన మిత్రుడి ఆహ్వానం మేరకు ఒకపరి "రాజమండ్రి" వచ్చిన ఈ కరీంనగర్ కుర్రాడికి.. ఆ ప్రాంతం, అక్కడి గాలి, నీరుతోపాటు మనుషులూ విపరీతంగా నచ్చేశారు. వాళ్ళ వెటకారం మాటున దాగి ఉండే మమకారానికి ఫిదా అయిపోయాడు.  ఆరునూరైనా అక్కడే సెటిల్ అయిపోవాలని నిర్ణయించేసుకున్నాడు. "చలో రాజమండ్రి" అంటూ అక్కడ వాలిపోయాడు. 

     "ఏం చేయాలా?" అన్న ఆలోచనలు చేస్తూ... స్వతహాగా టీ ప్రియుడైన ఆ యువకుడు... రాజమండ్రి మరియు పరిసర ప్రాంతీయలకు గల "టీ ప్రియత్వం" పసిగట్టేశాడు. "టీ కొట్టు"తో కనికట్టు చేయాలని ఫిక్సయిపోయాడు.  రాజమండ్రిలో ఉన్న 113 టీ స్టాల్స్ లో... వాతాన్నిటికంటే కడు భిన్నంగా... తన టీ కొట్టు ఉండాలని భావించాడు. అందుకోసం ఏకంగా పి.హెచ్.డి లాంటిది చేశాడు. "టైమ్-టేస్ట్-ట్రీట్" అనే నినాదంతో "టీ-3" పేరుతో "టీ స్టాల్" స్టార్ట్ చేశాడు.

      లండన్ లో ఎమ్.బి.ఎ చేసి... అక్కడ ఒక స్థాయి ఉద్యోగాలు చేసి... ఇప్పుడు "టీ కొట్టు" పెట్టడమేంటని అతని భార్య నెత్తీనోరు కొట్టుకోలేదు. "నీ వెనుక నేనున్నాను" అంటూ తోడ్పాటు అందించేందుకు కొంగు బిగించింది అతని బీటెక్ భార్య. కప్పుకు రూపాయి మార్జిన్ ఉంటే చాలు. ఒకసారి మన దగ్గర టీ తాగాక... టీ తాగితే ఇక్కడే తాగాలి అని ఫిక్స్ అయ్యేలా తన "టీ" ఉండాలనే వజ్ర సంకల్పంతో... రాజమండ్రి-తిలక్ రోడ్ దిగువ రోడ్డు-వి.ఎల్.పురంలో టీ స్టాల్ కు శ్రీకారం చుట్టాడు. 10 రూపాయల నుంచి 50 రూపాయలవరకు... ప్రపంచస్థాయి ప్రమాణాలతో... 23 రకాల ఫ్లేవర్స్ లో టీ అందిస్తూ... ఆరు నెలల వ్యవధిలో దేవిచౌక్ లో సెకండ్ బ్రాంచ్ స్టార్ట్ చేశాడు. ఇప్పుడు ఉభయ గోదావరి జిల్లాల్లో తన "టీ సామ్రాజ్యాన్ని" విస్తరించేందుకు విస్తృత స్థాయిలో ప్రణాళికలు వేస్తున్నాడు.

     ఇప్పటికే 20 మందికి ఉపాధి కల్పిస్తూ... భవిష్యత్తులో కనీసం 2 వేల మందికి జీవనాధారం కావాలన్న ఉక్కు సంకల్పంతో ఉరకలు వేస్తున్న ఈ కరీంనగర్ కోహినూర్ పేరు "కిరణ్ బైరెడ్డి". అతనికి అన్ని విధాలా అండదండలందిస్తున్న అతని అర్ధాంగి పేరు "వినీష బైరెడ్డి". 


*రాజమండ్రి రుణం*

*ఎప్పటికీ తీర్చుకోలేను!!*


      రాజమండ్రితోపాటు... అక్కడి చుట్టుపక్కల ప్రాంతాలవారంతా "టీ-౩"తో చిక్కని రుచికరమైన అనుబంధాన్ని పెంచుకోవడం వెనుక తను చేసిన రీసెర్చ్ ఎంతో ఉందంటారు కిరణ్ బైరెడ్డి. మన దేశంలో వివిధ రాష్ట్రాల్లో లభించే 140 రకాల టీ పౌడర్స్ నుంచి... పాతిక రకాలు ఎంపిక చేయడానికి తాను చాలా కష్టపడ్డానని, ఖర్చు పెట్టానని చెబుతారు కిరణ్. కేరళ, అస్సాం, పశ్చిమ బెంగాల్, గుజరాత్, వైజాగ్ లలో లభించే వందల టీ పొడుల నుంచి అత్యుత్తమమైనవి గ్రహించి... దానికి తనదైన ఫార్ములా మేళవించి చేసిన ప్రయత్నానికి భగవంతుని కరుణ తోడవ్వడంతో చాలా తక్కువ కాలంలోనే "టీ-3" ఒక ట్రెండ్ సెట్టర్ గా మారి... అందరి దృష్టినీ ఆకర్షిస్తోందని అంటారు. 

      ప్రాంతీయ బేధం చూపకుండా... తనను ఇంతగా ఆదరిస్తున్న రాజమండ్రివాసులకు జీవితాంతం రుణపడి ఉంటానని చెబుతూ ఒకింత ఉద్వేగానికి లోనయ్యే కిరణ్... తన విజయంలో తన శ్రీమతి సహాయ సహకారాలు... తల్లిదండ్రుల తోడ్పాటు ఎంతైనా ఉందని పేర్కొంటారు. సరదాగా ఓ నాలుగు రోజులుండి వెళ్లిపోదామని వచ్చిన నేను... నాలుగు కాలాలపాటు ఇక్కడే ఉండిపోయేందుకు సిద్ధపడతానని కలలో కూడా అనుకోలేదు. ఇక్కడి మనుషుల స్వచ్ఛత, వారు చూపే ప్రేమ, ఆదరణలకు నేను ఫిదా అయిపోయాను. ఉభయ గోదావరి జిల్లాల్లో "టీ-3"ని విస్తరించడం ఇప్పుడు నా ముందున్న కర్తవ్యం అంటారు బైరెడ్డి.

      నేను స్వతహాగా టీ ప్రియుడ్ని. రోజుకు అయిదారుసార్లు టీ తాగకపోతే ఏదో వెలితిగా ఉంటుంది. అయితే మనం తాగే టీ మనకు మరింత ప్రేరణ ఇవ్వాలి... రోజంతా ఉత్సాహాన్ని ఇవ్వాలనే పట్టుదలతో నేను చేసిన వందల, వేల ప్రయోగాలు సత్పలితాలు ఇవ్వడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని అంటారు కిరణ్. ప్రస్తుతం రెండు స్టాల్స్ నిర్వహిస్తున్న కిరణ్ కు... ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బిజినెస్ కూడా ఉంది. టీ స్టాల్ తో ట్రెండ్ సృషించడానికి ముందు నుంచే ఆయన రాజమండ్రిలో ఆ బిజినెస్ నిర్వహిస్తున్నారు. "నా టీ స్టాల్ కు రెగ్యులర్ గా వచ్చి టీ సేవించేవాళ్ళు ఎప్పటికీ రొటీన్ ఫీలవ్వకూడదు... అందుకే ఎప్పటికప్పుడు ఫార్ములాలు మారుస్తూ... మరింత రుచికరంగా ఉండేందుకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటాను" అని చెబుతున్న కిరణ్ బైరెడ్డిని... తక్కువ ఖర్చు... ఎక్కువ లాభం గడించగల "ఫ్రాంచైజీల" కోసం...

95021 57052

నంబర్ లో సంప్రదించవచ్చు!!

Actress Jyothi Swaroopa Interview

 "నాన్న ఎందుకో వెనకబడిపోయాడు" 

షార్ట్ ఫిల్మ్ తెచ్చిన గుర్తిపుతో 

వడివడిగా ముందుకు సాగుతున్న

వర్ధమాన క్యారక్టర్ ఆర్టిస్ జ్యోతి స్వరూప!!



      క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మెల్లగా తనకంటూ మంచి పేరు తెచ్చుకుంటూ ముందుకు సాగుతోంది "జ్యోతి స్వరూప". "తెర మీద కనిపిస్తే చాలనుకున్నా.... కానీ చూస్తుండగానే పాతిక సినిమాలు చేసేశాను" అంటూ సంతృప్తి వ్యక్తం చేస్తోంది. "నాన్న ఎందుకో వెనకబడిపోయాడు" అనే షార్ట్ ఫిల్మ్ తో తన ప్రతిభను నిరూపించుకున్న జ్యోతి స్వరూపకు అయ్యప్ప కటాక్షం జత కలిసింది. సుమన్ హీరోగా నటించిన వందో చిత్రం "అయ్యప్ప కటాక్షం" తర్వాత నుంచి ఆమె కెరీర్ ఓ గాడిన పడింది. "వకీల్ సాబ్, భీష్మ" వంటి భారీ చిత్రాలు-  "ఏక్ మినీ కథ, పటారుపాలెం ప్రేమకథ" వంటి బడ్జెట్ చిత్రాలు ఆమెకంటూ చిన్న గుర్తింపు తెచ్చాయి. ప్రస్తుతం జ్యోతి స్వరూప నటించిన ఐదారు చిత్రాలు విడుదలకు సిద్ధమవుతుండగా... నాలుగయిదు చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. 

     "నేనెప్పుడూ శ్రమను నమ్ముతాను. నోరు మంచిదయితే ఊరు మంచిదవుతుందనే మాటను అనుసరిస్తాను. నేను ఇండస్ట్రీకొచ్చి అయిదేళ్ళవుతోంది. ఇప్పటికి 23 సినిమాలు చేశాను. అయితే... ఇవన్నీ నా కెరీర్ కి పునాదులుగా మాత్రమే భావిస్తాను. ఈ పునాదులపై భారీగా ఓ బహుళ అంతస్తుల భవనం నిర్మించుకోవాలనే అత్యాశ నాకు లేదు కానీ... నా కెరీర్ కి చల్లని నీడనిచ్చే చిన్న గూడు కట్టుకుంటాననే నమ్మకం మాత్రం ఉంది" అంటున్న జ్యోతి స్వరూప తన ప్రయత్నంలో విజయం సాధించాలని కోరుకుందాం!!

Tremendous Response for Ghani Trailer

 మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'గని' టైలర్ కు విశేష స్పందన ..



మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఎప్రిల్ 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. దీనికి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ పాల్గొన్నారు.


నిర్మాతల్లో ఒకరైన సిద్ధ ముద్ద గారు మాట్లాడుతూ..' ఈ సినిమాకు నాకు అవకాశం వచ్చింది వరుణ్ తేజ్. నన్ను, దర్శకుడు కిరణ్, బాబి.. ముగ్గురిని బాగా సపోర్ట్ చేసాడు వరుణ్. కోవిడ్ టైమ్స్ లో కూడా ధైర్యం ఇచ్చాడు. ఇక అల్లు అరవింద్ గారు మాకు ఎప్పుడూ అండగా ఉన్నారు. సినిమా మీకు ఖచ్చితంగా నచ్చుతుంది..' అని తెలిపారు.


దర్శకుడు కిరణ్ కొర్రపాటి మాట్లాడుతూ..' నాది వరుణ్ తేజ్ ది ఐదేళ్ల జర్నీ. బాక్సింగ్ నేపథ్యంలో ఒక కథ కావాలి అని తయారు చేసాము. అల్లు అరవింద్ గారి లాంటి నిర్మాత అండగా ఉన్నప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. సినిమాలో ఎంత పెద్ద నటీనటులు కావాలనుకున్న ఆయన వెంటనే అరేంజ్ చేశారు. అలా ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, జగపతిబాబు లాంటి వాళ్ళు వచ్చారు. ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ చాలా కష్టపడ్డాడు. రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటించాడు. మా ఐడియాలను స్క్రీన్ మీద తీసుకురావడానికి ఫైట్ మాస్టర్స్ కూడా చాలా కష్టపడ్డారు. ప్రేక్షకులకు కూడా మా కష్టం కనిపిస్తుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధిస్తుంది..' అని తెలిపారు.


నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ..' బాక్సింగ్ అనేది చాలా కాంప్లికేటెడ్ తో కూడుకున్న ఎమోషనల్ కథ. ఈ నేపథ్యంలో సినిమా చేస్తాము అని చెప్పినప్పుడు ఎందుకు తీసుకున్నారో అనుకున్నాను. ఆ తర్వాత కేవలం బాక్సింగ్ మీద నడిచే 2,3 ఇంగ్లీష్ సినిమాలు చూశాను. ఈ సినిమా గురించి ప్రతి విషయం దగ్గరుండి చూసుకున్నాడు వరుణ్ తేజ్. దర్శకుడు కిరణ్ తో కూర్చుని ఏమేం కావాలో అన్నీ సిద్ధం చేసుకున్నాడు. అల్లు బాబి సిద్ధూ ముద్ద ఇద్దరు మంచి స్నేహితులు వాళ్లకు ఏదైనా మంచి సినిమా చేయాలి అని తన స్నేహితుడు కిరణ్ ను దర్శకుడిగా పరిచయం చేశాడు వరుణ్ తేజ్. బాక్సింగ్ ఉన్నా కూడా ఇది పూర్తిగా ఫ్యామిలీ డ్రామా. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కిన సినిమా. ఖచ్చితంగా దీన్ని చూడటానికి కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు రావాలి. వస్తారు అని నమ్మకం కూడా ఉంది. ఇందులో కేవలం వరుణ్ తేజ్ హీరోగా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా 50 శాతం కంటే ఎక్కువ బాధ్యత తీసుకున్నాడు. వాళ్ళు అందరూ బాగుండాలని కోరుకున్నాడు. ఈ టీమ్ అంతా కలిసి చేసిన ప్రయత్నం కచ్చితంగా విజయం సాధిస్తుంది..' అని తెలిపారు.


హీరో వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ' సినిమా అంటే నాకు చాలా ఇష్టం. సినిమా కోసం ఏదైనా చేస్తాను. కరోనా సమయంలో కూడా కష్టపడి ఈ సినిమా చేశాము. కచ్చితంగా ఇది మనల్ని అలరిస్తుంది అని నమ్ముతున్నాను. గద్దలకొండ గణేష్ సినిమా ముందు నుంచే యూఎస్ లో బాక్సింగ్ ప్రాక్టీస్ మొదలు పెట్టాను. రేపొద్దున సినిమా చూస్తున్నపుడు ఎవరికీ ఫేక్ గా కనిపించకూడదు అని ఎన్నో రోజులు ప్రాక్టీస్ చేసిన తర్వాత సినిమా మొదలు పెట్టాను. సినిమాలో ఉపేంద్ర గారు, సునీల్ శెట్టి గారు, జగపతి బాబు గారు, నదియా గారి ఇలాంటి సీనియర్లతో వర్క్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమా కచ్చితంగా మళ్లీ అలరిస్తుందని నమ్ముతున్నాను..' అని తెలిపారు.


నటీనటులు: 

వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు

టెక్నికల్ టీమ్:

దర్శకుడు: కిరణ్ కొర్రపాటి

నిర్మాతలు: సిద్దు ముద్ద, అల్లు బాబీ

బ్యానర్స్: అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ 

సమర్పకుడు: అల్లు అరవింద్

సినిమాటోగ్రపీ: జార్జ్ సి విలియమ్స్

ఎడిటర్: మార్తాండ్ కే వెంకటేష్

సంగీతం: థమన్

పిఆర్ఓ: వంశీ కాక, ఏలూరు శ్రీను

Lyrical Of Bullet La Song From Kiran Abbavaram’s “Sammathame” Out

 Lyrical Of Bullet La Song From Kiran Abbavaram’s “Sammathame” Out



Young and energetic hero Kiran Abbavaram has been attempting distinctive subjects. He is now coming up with a musical romantic entertainer “Sammathame” which is set in urban backdrop.


Title and first look poster and then first glimpse of the movie raised expectations. Lyrical video of first single too became a chartbuster. Today, they have unveiled lyrical video of a soothing romantic melody Bullet La. Sekhar Chandra rendered a breezy and beautiful number and the instrumentation is impressive. Kiran and Chandini's pairing looks fresh and adorable.


Director Gopinath Reddy came up with a different love story and seems like he has good taste in music. Like the first single, this one too is an instant hit.


Produced by K Praveena under UG Productions banner, “Sammathame” is presently in post-production phase. Cinematography is by Sateesh Reddy. The makers are planning to release the movie soon.


Cast: Kiran Abbavaram, Chandini Chowdary and others.


Technical Crew:

Story, Screenplay, Direction: Gopinath Reddy

Producer: Kankanala Praveena

Banner: UG Productions

Music Director: Sekhar Chandra

DOP: Sateesh Reddy Masam

Editor: Vilpav Nyshadam

Art Director: Sudheer Macharla

PRO: Vamsi-Shekar


Prasanth Varma Teja Sajja HANU-MAN Celebrates 100th Day Of Shoot

 Prasanth Varma, Teja Sajja, Primeshow Entertainment’s HANU-MAN Celebrates 100th Day Of Shoot



Young and talented actor Teja Sajja and Creative director Prasanth Varma’s first Pan-Indian superhero film HANU-MAN is nearing completion. Meanwhile, the team celebrated 100th day of shoot. It’s many people’s hard work and team effort to offer best cinematic experience to movie buffs.


It’s the most challenging work for almost all the cast and technical crew worked for the movie, given superhero movies involve high intense action sequences and the superhero performs some critical feats. These are being shot without the use of any dupes for the hero. Teja was required to be on the ropes for 8 hours straight for several days. It’s not just the hours, but bruises and injuries during these times are common too. A lot beyond what is finally seen on screen goes behind creating this experience.


Amritha Aiyer is the female lead, while popular production house Primeshow Entertainment is producing the movie on grand scale and big stars and top-grade technicians are associating for it. Varalaxmi Sarathkumar is playing an important role in the movie.


Since it is a superhit combination and moreover HANU-MAN generated lot of buzz with its promos, the film has made massive non-theatrical business.


K Niranjan Reddy is producing the movie, while Smt Chaitanya presenting it. Asrin Reddy is the executive producer, Venkat Kumar Jetty is the Line Producer while Kushal Reddy is the associate producer. Dasaradhi Shivendra takes care of cinematography.


Four young and talented composers- Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh are providing sound tracks for the film.


Cast: Teja Sajja, Amritha Aiyer, Varalaxmi Sarathkumar and others


Technical Crew:

Writer & Director: Prasanth Varma

Producer: K Niranjan Reddy

Banner: Primeshow Entertainment

Presents: Smt Chaitanya

Screenplay: Scriptsville

DOP: Dasaradhi Shivendra

Music Directors: Anudeep Dev, Hari Gowra, Jay Krish and Krishna Saurabh

Executive Producer: Asrin Reddy

Line Producer: Venkat Kumar Jetty

Associate Producer: Kushal Reddy

Production Designer: Srinagendhra Tangala

PRO: Vamsi-Shekar

Costume Designer: Lanka Santhoshi


Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Second Single Penny To Be Out On March 20th

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata Second Single Penny To Be Out On March 20th



Superstar Mahesh Babu’s highly anticipated film Sarkaru Vaari Paata being directed by Parasuram is currently being shot in Hyderabad. The production works of the movie are nearing completion. Meanwhile, the team is promoting the movie like never before, although there is enough time for the film’s theatrical release.


S Thaman rendered soundtracks and first single Kalaavathi has set new benchmarks in terms of record views. The enchanting melody has already crossed 90 million views and it is set to cross 100 M mark very soon.


The makers today announced to release second single Penny from the film on March 20th. The announcement poster presents Mahesh Babu in a dashing avatar. He looks serious here.


Since the first song became such a big hit, everyone is anticipating with bated breath for the second single arriving in another 3 days.


Keerthy Suresh playing the female lead in the filmwhich is jointly being produced by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta under Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners.


R Madhi handles the cinematography, while Marthand K Venkatesh is the editor and AS Prakash takes care of art department.


Sarkaaru Vaari Paata is coming as summer attraction on May 12th.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:

Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

VFX Supervisor – Yugandhar

PRO :Vamsi-Shekar 

#69 Samskar Colony Releasing on March 18th

 "#69 సంస్కార్ కాలనీ" చిత్రం యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది.  మార్చి 18న విడుదల - నిర్మాత బాపిరాజు



లక్ష్మీ పిక్చర్స్, ఆదిత్య సినిమా పతాకంపై ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్ ప్రధాన పాత్రల్లో పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో బి బాపిరాజు, ముతికి నాగ సత్య నారాయణ సంయుక్తంగా కలిసి నిర్మిస్తున్న చిత్రం "#69 సంస్కార్ కాలనీ . అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని మార్చి 18న విడుదలకు సిద్ధమైంది. మధుర మ్యూజిక్ లో విడుదలైన పాటలు, ట్రైలర్స్ కి అనూహ్య స్పందన వచ్చింది. సోషల్ మీడియా లో 100 మిలియన్ వ్యూస్ తో ట్రేండింగ్ లో ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్చి 18న 300 థియేటర్స్ లో #69 సంస్కార్ కాలనీ విడుదల అవుతుంది.


ఈ సందర్భంగా నిర్మాత బాపి రాజు గారు మాట్లాడుతూ "ఎస్తర్ నోరోన్హా ప్రధాన పాత్రలో నటించిన #69 సంస్కార్ కాలనీ చిత్రం మార్చి 18 న 300 థియేటర్స్ పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది. మేము విడుదల చేసిన ట్రైలర్స్ కి పాటలకి, సోషల్ మీడియా లో 100 మిలియన్ పైగా వ్యూస్ తో అనూహ్య స్పందన వచ్చింది. ఇండస్ట్రీ మరియు డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి మంచి స్పందన వచ్చింది. మధుర ఆడియో లో విడుదలైన పాటలకి మంచి స్పందన వచ్చింది, ప్రవీణ్ ఇమ్మడి సంగీతం, గమన్ శ్రీ ,యక్కలి  రవీంద్రబాబు గార్ల సాహిత్యం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఎస్ వి శివరాం గారి సినిమా పనితనం ప్రతి ఫ్రేమ్ లో కనిపిస్తుంది. ఆధునిక సమాజంలో మానవ సంబంధాలు గురించి అందమైన కథ తో రొమాంటిక్ సన్నివేశాలతో చాలా గొప్పగా చెప్పారు దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి గారు. ఈ సినిమా ఆద్యంతం ప్రేక్షకులని ఎంటర్టైన్ చేస్తుంది. యూత్ ప్రేక్షకులతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ కి కూడా నచ్చుతుంది. ఎస్తర్ గారు పోషించిన వైశాలి పాత్ర ప్రేక్షకులని మేపిస్తుంది అని ఆశిస్తున్నాను. మా సినిమా ప్రతి ఒక్కరు చూడాలి" అని కోరుకున్నారు.




నటీనటులు

ఎస్తర్ నోరోన్హా, రిస్వి తిమ్మరాజు, అజయ్, భద్రం,శిల్పా నాయక్  ,రామన్, Fm బాబాయ్,సముద్రం వెంకటేష్ తదితరులు


సాంకేతిక నిపుణులు

బ్యానర్ : లక్ష్మీ పిక్చర్స్

డైలాగ్స్, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ : పి.సునీల్ కుమార్ రెడ్డి

ప్రొడ్యూసర్స్ : బి బాపిరాజు, ముతికి నాగ సత్యనారాయణ

 స్టోరీ : గాయత్రీ స్వాతి మంత్రిప్రగడ

మ్యూజిక్ : ప్రవీణ్ ఇమ్మడి

డి ఓ పి : ఎస్ వి శివరాం

ఎడిటర్ : కృష్ణ మండల

లిరిక్స్ : గమన్ శ్రీ ,యక్కలి  రవీంద్రబాబు

సింగర్స్ : ఎస్తర్, శ్రీ ప్రసన్న , శ్రీనివాస్ యాదవ్

విఎఫ్ఎక్స్ : శ్యామ్ కుమార్ పి

కలరిస్ట్  : పురుషోత్తం

సౌండ్ ఇంజనీర్ : విష్ణువర్ధన్ కాగిత

పి ఆర్ ఓ : పాల్ పవన్

Wings Miss India and Mr India Contest 2022 in Pan India Level

పాన్  ఇండియా లెవెల్లో వింగ్స్ మిస్ ఇండియా అండ్ మిస్టర్ ఇండియా 2022 కాంటెస్ట్




మోడలింగ్ రంగంలో ఎదగాలన్న కల, మిస్టర్ ఇండియా, మిస్ ఇండియా, మిసెస్ ఇండియా అవ్వాలన్న లక్ష్యం మీలో ఉందా అయితే మీకోసం మేమున్నాం అంటూ అవకాశాలు అందించేందుకు రెడీ అయింది వింగ్స్ మోడల్ హబ్. ఇప్పటివరకు కేవలం హైద్రాబాద్ లో నిర్వహించిన ఈ కార్యక్రమం ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఇండియాలో ఉన్న అన్ని రాష్ట్రాల వారితో ఈ మిస్టర్ అండ్ మిస్ ఇండియా కాంపిటీషన్ నిర్వహించి ఫైనల్ గా హైద్రాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. ఈ సందర్బంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ పోస్టర్ లాంచ్ కార్యక్రమం మంగళవారం హైద్రాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిధులుగా హీరోయిన్ చాందిని, జబర్దస్త్ కమెడియన్స్ హైపర్ ఆది, కిరాక్ ఆర్పీ, మహేష్, కృతిక మిస్సెస్ ఇండియా 2018, జాహ్నవి, మిస్ తెలంగాణ అంజు, హరి, శాంతి భూషణ్, మనోజ్, పవన్,  అర్జున్ తోపాటు  తదితర ప్రముఖులు పాల్గొన్నారు.


ఈ సందర్బంగా ఈ మిస్ ఇండియా, మిస్టర్ ఇండియా పోస్టర్ ని హైపర్ ఆది, హీరోయిన్ చాందిని విడుదల చేసారు. అనంతరం హీరోయిన్ చాందిని మాట్లాడుతూ.. నేను తెలుగులో చాలా సినిమాలు చేస్తున్నాను. నేను రధం, దీక్సూచి రెండు సినిమాలు చేశాను..  ప్రస్తుతం ఫోర్టీన్ డేస్ లవ్ సినిమా చేస్తున్నాను. వింగ్స్ మోడల్ హబ్ బ్రోచర్ లాంచ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ వేదిక చాలా మంది టాలెంట్ ఉన్నవాళ్లకు మంచి ప్లాట్ ఫార్మ్ అని నా అభిప్రాయం, కాబట్టి టాలెంట్ ఉన్నవాళ్లు తప్పకుండా మీ ప్రయత్నాన్ని ఈ వేదిక ద్వారా సక్సెస్ చేసుకోండి, ఈ కార్యక్రమం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


మనోజ్ వీరగోని మాట్లాడుతూ .. ఈ కార్యక్రమం చేయడానికి నాకు సపోర్ట్ చేస్తున్న టీం ఇక్కడ ఉంది. వీళ్ళ సపోర్ట్ లేకుంటే నేను ఏదీ చేయలేను. ఇప్పటి వరకు హైదరాబాద్ లో చేసిన ఈ కార్యక్రమాన్ని ఇకపై పాన్ ఇండియా లెవెల్లో చేయాలని ప్లాన్ చేసాం. ఈ కార్యక్రమం గురించి చెప్పగానే బాలీవుడ్ స్టార్ అర్బాజ్ ఖాన్ గారు బాగుంది అని సపోర్ట్ అందిస్తున్నారు. ఈ వేడుకలో ఆయనకూడా పాల్గొంటారు. ఆయనే మాకు మెంటర్,  మే 29న  హైద్రాబాద్ లో గ్రాండ్ ఫినాలే జరుగుతుంది, చాలా గ్రాండ్ గా జరిగే కార్యక్రమం ఇది.


కృతిక మాట్లాడుతూ .. మనోజ్ వీరగోని మిస్టర్ తెలంగాణా గా ఎంపిక అయినప్పటినుండి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాడు. అతను చాలా ప్యాషన్ తో ఈ ఈవెంట్ నిర్వహిస్తున్నాడు. ఈ సారి మిస్, అండ్ మిస్టర్ ఇండియా ను పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. తప్పకుండా ఈ ప్రోగ్రాం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అన్నారు.


జాహ్నవి మాట్లాడుతూ .. చాలా ఆనందంగా ఉంది.. మనోజ్ వీరగోని ఈసారి పాన్ ఇండియా లెవెల్లో ఈ ప్రోగ్రాం చేయడం నిజంగా చాలా గర్వాంగా ఉంది. తప్పకుండా మనోజ్ చేస్తున్న ప్రయత్నం చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను అన్నారు.


హైపర్ ఆది మాట్లాడుతూ .. ముందుగా మనోజ్ అన్నకు థాంక్స్ చెప్పాలి. వింగ్స్ మోడల్ హబ్ ఆధ్వర్యంలో ఇంతవరకు హైద్రాబాద్ లో కార్యక్రమాలు చేసాడు , ఈ సారి పాన్ ఇండియా లెవెల్లో అన్ని రాష్ట్రాల నుండి మోడల్స్ ని తీసుకొచ్చి మే 29న హైదరాబాద్ లో జరిగే గ్రాండ్ ఫినాలే లో ఫైనల్ విన్నర్ ని ఎంపిక చేస్తారు. ఈ వింగ్స్ హబ్ నిర్వహిస్తున్న ఈ ఈవెంట్ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమానికి సురేష్ కొండేటి సపోర్ట్ ఇచ్చాడంటే చాలు.. ఆయన ద్వారా ఎన్నో సినిమాలు ఆడిన సందర్భాలు ఉన్నాయి.


సురేష్ కొండేటి మాట్లాడుతూ.. మిస్ ఇండియా గా ఎన్నికయిన చాలా మంది హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యారు. అలాగే ఈ వింగ్స్ ద్వారా ఏర్పాటు చేస్తున్న మిస్ అండ్ మిస్టర్ ఇండియా గా చాలా మంది పాల్గొనాలని, అలాగే ఇందులో విన్నర్ అయినవాళ్లకు సినిమాల్లో కూడా చాలా అవకాశాలు వస్తాయి. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మనోజ్ కు ఆల్ ది బెస్ట్ అన్నారు.


ఈ కార్యక్రమంలో కిర్రాక్ ఆర్పీ, మహేష్ లతో పాటు తదితరులు తమ అభిప్రాయాలూ తెలిపారు. 


Love on Director Sukumar and Pushpa 2

 అభిమానంతో సుకుమార రూపం



హీరోకు ఫ్యాన్స్‌  ఉంటారు.. హీరోయిన్స్‌కి ఫ్యాన్స్‌ ఉంటారు.. రాజకీయ నాయకులకు ఫ్యాన్స్‌ ఉంటారు.. కానీ దర్శకునికి ఒక హీరో అభిమాని అయితే. . దాని ఫలితం ఎలా ఉంటుంది? ఆయన మీద ఉన్న అభిమానం వ్యక్తీకరిస్తే ఏ రేంజ్‌లో ఉంటుంది అని చెప్పడానికి ఇదొక నిదర్శనం. వివరాల్లోకి వెళితే, సువీక్షిత్‌ బొజ్జా అనే నవ హీరో ఎన్నో ఏళ్లుగా దర్శకుడు సుకుమార్‌కి వీరాభిమాని. పాన్‌ ఇండియా చిత్రం ‘పుష్ప’తో భారతదేశం గర్వించదగ్గ దర్శకులలో ఒకరిగా నిలిచిన  సుకుమార్‌ పై ఉన్న ప్రేమతో, అభిమానంతో.. ఇప్పటి వరకు ఏ అభిమాని కూడా చేయని ఓ గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టాడు. దానిని విజయవంతంగా పూర్తి చేశాడు. ‘దూరదర్శిని’ అనే సినిమాలో హీరోగా నటిస్తున్న సువీక్షిత్‌.. తన సొంత గ్రామమైన ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లాలోని బోరెడ్డిగారి పల్లి గ్రామంలో.. ఆయన సొంత వ్యవసాయం భూమిలో రెండున్నర ఎకరాల భూమిలో దర్శకుడు సుకుమార్‌ రూపాన్ని వచ్చేటట్లు వరి పంటతో సాగు చేశారు. దాదాపు 50 రోజుల వ్యయప్రయాసలతో.. ఆ పంటను సుకుమార్‌ రూపానికి తీసుకువచ్చాడు. ఇలా అభిమానాన్ని చాటుకున్న సువీక్షిత్‌ అందరి దృష్టిని ఆకర్షించి హాట్‌ టాపిక్‌గా మారాడు. ఈ సాగుచేసిన పంట భూమిని ఆ రూపానికి తీసుకువచ్చిన తర్వాత.. డ్రోన్‌ కెమెరాలతో చిత్రీకరించడంతో పాటు.. సుకుమార్‌ పేరు మీద ఓ ప్రత్యేక పాటను రెడీ చేశాడు. సుకుమార్‌ రూపంతో పాటు.. ‘పుష్ప 2’ అని కూడా వరిసాగు చేయడం.. అల్లు అర్జున్‌ అభిమానులను ఆకట్టుకుంటోంది. తాజాగా ఈ సాంగ్‌ను, వీడియోను చూసిన సుకుమార్‌ ‘‘నా నోట మాట రావడం లేదు.. నా కళ్లు చెమర్చాయి. ఓ మనిషి మీద ఇంత అభిమానం ఉంటుందా?..’’ అంటూ అందరి సమక్షంలో సువీక్షిత్‌ని అభినందించారు.  


15years For Jagadam

ప్రసిద్ధ హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ కెమెరా ఎక్విప్‌మెంట్‌తో తీసిన 'జగడం'...

రామ్ - సుకుమార్ చిత్రానికి 15 ఏళ్ళు!



థియేటర్ నుంచి ప్రేక్షకులు బయటకు వచ్చిన తర్వాత గుర్తుండే సినిమాలు కొన్ని ఉంటాయి. విడుదలైన కొన్నేళ్ళ తర్వాత కూడా మర్చిపోలేని చిత్రాలు ఉంటాయి. అందులో హీరో నటన, దర్శకత్వ ప్రతిభ, సన్నివేశాలు, పాటల గురించి ఇతరులు మాట్లాడుకునేలా ఉంటాయి. అటువంటి చిత్రమే 'జగడం'.


ఉస్తాద్ రామ్ పోతినేని కథానాయకుడిగా క్రియేటివ్ జీనియస్ సుకుమార్ దర్శకత్వం వహించిన సినిమా 'జగడం'. సరిగ్గా ఇదే రోజున... 2007లో మార్చి 16న విడుదల అయ్యింది. సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి పదిహేనేళ్ళు పూర్తయింది. కానీ, సినిమాపై క్రేజ్ ఇంకా తగ్గలేదు. మాస్ సీన్స్, ముఖ్యంగా సుకుమార్ తీసిన హీరో ఎలివేషన్ సీన్స్, మోస్ట్ ఇంపార్టెంట్ రామ్ యాక్టింగ్ ఇప్పటికీ ప్రేక్షకుల హాట్ ఫేవరెట్. దేవిశ్రీ ప్రసాద్ పాటలు? మ్యూజిక్ లవర్స్ ప్లే లిస్ట్‌లో ఉంటాయి! సినిమా డీవీడీ? బాలీవుడ్ దర్శకుల లైబ్రరీల్లో ఉంటుంది. అప్పట్లో స్టీవెన్ స్పీల్‌బ‌ర్గ్‌ తన సినిమాలకు ఏ కెమెరా ఎక్విప్‌మెంట్ ఉపయోగించారో, 'జగడం' సినిమాకూ అదే ఎక్విప్‌మెంట్ ఉపయోగించారు. సూపర్ 35 ఫార్మాట్‌లో షూట్ చేశారు. చాలా మంది టెక్నీషియన్స్‌కు రిఫరెన్స్‌గా నిలిచిన చిత్రమిది.


రామ్‌కు 'జగడం' రెండో సినిమా. ఇప్పుడు సినిమా, రామ్ పెర్ఫార్మన్స్ చూస్తే... కొత్త హీరో చేసినట్టు ఉండదు, ఎంతో ఎక్స్‌పీరియ‌న్స్ ఉన్న హీరోగా కనిపిస్తారు. "జగడం చేసే సమయానికి రామ్‌కు 17 ఏళ్ళు. రాలేదని, చేయలేననే మాటలు అతడి నోటి వెంట వినలేదు. ఏం చేయాలని చెప్పినా... పది నిమిషాల్లో ప్రాక్టీస్ చేసి చేసేవాడు. షార్ప్, బ్రిలియెంట్ యాక్టర్. షూటింగ్ చేసేటప్పుడు రామ్‌ను చూస్తే వండర్ బాయ్ అనిపించాడు. ఇండస్ట్రీలో రామ్ మంచి స్థాయికి వస్తాడని అప్పుడే అనుకున్నాను. ఈ రోజు అదే ప్రూవ్ అయ్యింది" అని సుకుమార్ చెప్పారు.  


రామ్ - సుకుమార్ కాంబినేషన్‌లో మరో సినిమా కోసం ప్రేక్షకులు ఎప్పటి నుంచో వెయిటింగ్. 'జగడం'ను రీమేక్ చేస్తే? ఇద్దరి అభిమానులు, ప్రేక్షకుల కోరిక ఇది! 


'పుష్ప'తో సుకుమార్ మాస్ ఏంటనేది పాన్ ఇండియా ప్రేక్షకులకు తెలిసింది. అయితే... తెలుగు ప్రేక్షకులకు సుకుమార్ మాస్ గురించి తెలుసు. ఆల్రెడీ 'జగడం' చూశారు కదా! ఇక, రామ్ గురించి నార్త్ ఇండియన్స్, పాన్ ఇండియా ప్రేక్షకులకు ఆల్రెడీ తెలుసు. ఆయన తెలుగు సినిమాలను హిందీలో డబ్బింగ్ చేస్తుంటే మిలియన్స్ కొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ప్రస్తుతం 'ది వారియర్' చేస్తున్న రామ్, ఆ తర్వాత బోయపాటి శ్రీను దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమా చేస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో 'జగడం' రీమేక్ చేస్తే... నెక్స్ట్ లెవల్ ఉంటుందని చెప్పవచ్చు. 


సుకుమార్‌కు కూడా 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. రామ్‌తో ఇంకో సినిమా తీయాలని ఉంది. ఇద్దరి కలయికలో తప్పకుండా సినిమా వస్తుంది. "రామ్‌తో సినిమా చేయాలని ఎప్పటి నుంచో ఉంది. త్వరలో తప్పకుండా చేస్తా. యాక్చువల్లీ... ఇప్పటి రామ్‌తో మళ్ళీ 'జగడం' రీమేక్ చేయాలని ఉంది. ఇప్పటి రామ్‌తో మళ్ళీ జగడం చూసుకోవాలని ఉంది" అని సుకుమార్ చెప్పారు. ఆయన అభిమానులు, రామ్ అభిమానులు, ఇద్దరి అభిమానులు 'జగడం' రీమేక్ కోసం వెయిట్ చేస్తున్నారు.