Latest Post

Tremendous Response for Gaalodu Teaser

 యాక్ష‌న్ మోడ్‌లో సుడిగాలి సుధీర్‌..గాలోడు టీజ‌ర్‌కి ట్రెమండ‌స్ రెస్పాన్స్‌



సుడిగాలి సుధీర్ ‍‍‍హీరోగా రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన `సాఫ్ట్‌వేర్ సుధీర్` సినిమా క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. మళ్లీ ఇదే క్రేజీ కాంబినేష‌న్‌లో ప‌క్కా మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా `గాలోడు` చిత్రం రూపొందుతోంది. గెహ్నా సిప్పి హీరోయిన్‌గా ప‌రిచ‌య‌మ‌వుతుండ‌గా  ప్ర‌కృతి స‌మ‌ర్ప‌ణ‌లో సంస్కృతి ఫిలింస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ మోష‌న్‌ పోస్ట‌ర్‌లో సుధీర్ మాస్‌లుక్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.


ఇటీవ‌ల `గాలోడు` మూవీ టీజ‌ర్‌ని హైద‌రాబాద్ కూక‌ట్‌ప‌ల్లిలోని ఓ అనాథాశ్ర‌మంలో విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌. సాఫ్ట్‌వేర్ సుధీర్‌గా క్లాస్ రోల్‌లో మెప్పించిన సుధీర్ గాలోడు టీజ‌ర్‌లో ప‌క్కా మాస్‌రోల్‌లో క‌నిపించి ఆశ్చ‌ర్య‌ప‌రిచాడు. ఒక నిమిషం క‌న్నా త‌క్కువ నిడివి ఉన్న టీజ‌ర్‌లో మాస్ అండ్ యాక్ష‌న్ స‌న్నివేశాల్లో అద‌ర‌గొట్టాడు. ``అదృష్టాన్ని నమ్ముకున్నవాడు కష్టాల పాలవుతాడు.. కష్టాన్ని నమ్ముకున్న వాడు అదృష్టవంతుడవుతాడు. కానీ నేను ఈ రెండిటిని నమ్ముకోను.. నన్ను నేను నమ్ముకుంటాను” అనే డైలాగ్ తో ఈ సినిమాలో సుధీర్ క్యారెక్ట‌ర్ ఎలా ఉండ‌బోతుందో  హింట్ ఇచ్చారు మేక‌ర్స్‌. ఇది పక్కా మాస్ మూవీ అని టీజర్ ద్వారా చెప్పకనే చెప్పిన చిత్ర‌ యూనిట్ స్పెషల్ విజువల్స్‌తో సినిమాపై ఆసక్తిని పెంచారు.


ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శకుడు రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల మాట్లాడుతూ - ``సుధీర్ హీరోగా నేను డైరెక్ట్ చేసిన ఫ‌స్ట్ మూవీ `సాఫ్ట్‌వేర్ సుధీర్` క‌మ‌ర్షియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. ఆ స‌క్సెస్ ఇచ్చిన ఉత్సాహంతోనే  స్వీయ ద‌ర్శ‌కత్వంలో `గాలోడు` సినిమాను నిర్మిస్తున్నాను. టీజ‌ర్ విడుద‌లైన రోజు నుండి ఈ రోజు వ‌ర‌కూ యూ ట్యూబ్‌లో ట్రెండింగ్‌లోనే ఉండ‌డంతో మాకు సినిమాపై మ‌రింత కాన్పిడెన్స్ పెరిగింది. యాక్షన్ అండ్‌ మాస్ ఎలిమెంట్స్‌తో రూపొందిన `గాలోడు` సినిమా కచ్చితంగా సుధీర్ కి టర్నింగ్ పాయింట్ అవుతుంది. రెండు పాట‌లు మిన‌హా టాకీపార్ట్ మొత్తం పూర్త‌య్యింది. ఆ రెండు పాట‌ల‌ను విదేశాల్లో చిత్రీక‌రించనున్నాం`` అన్నారు


సుడిగాలి సుధీర్, గెహ్నా సిప్పి, స‌ప్త‌గిరి, పృథ్విరాజ్, శ‌క‌ల‌క శంక‌ర్‌, స‌త్య క్రిష్ణ‌  త‌దిత‌రులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి

సినిమాటోగ్ర‌ఫి: సి రాం ప్ర‌సాద్‌

సంగీతం: భీమ్స్ సిసిరోలియో

ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్‌: బిక్ష‌ప‌తి తుమ్మ‌ల‌

స‌మ‌ర్ప‌ణ‌: ప్రకృతి

బేన‌ర్‌: సంస్కృతి ఫిలింస్‌,

ర‌చ‌న - ద‌ర్శ‌క‌త్వం: రాజ‌శేఖ‌ర్ రెడ్డి పులిచ‌ర్ల‌.

Vikrant Rona Gets A Whopping 100 cr offer on OTT

 Vikrant Rona Gets A Whopping 100 cr offer on OTT



With the Omicron scare a lot of movies are opting for a straight OTT release. One film that has said no to it and rejected an offer of 100 crores is Kichcha Sudeepa starrer Vikrant Rona. Vikrant Rona a pan world 3D film has been one of the most anticipated films in the country. From it’s title launch on The Burj Khalifa to getting Jacqueline Fernandez on board and even announcing a release in over 50 countries Vikrant rona has made all the right noises. According to sources, the team recently had a private screening to one of the biggest OTT giants. The visuals of the film is said to be matching Hollywood standards, with a genre that is never explored before in the Indian Film Industry. Praising Kichcha Sudeep’s performance as one of the best performances in this decade the source said the OTT has offered upto 100 crores for a direct release of Vikrant Rona on their platform. But the team has apparently said no to the offer.

When we reached out to Jack Manjunath, producer, Vikrant Rona he said ‘Yes, it is true that the offer was made, but Vikrant Rona is a big screen experience. The visuals that I have seen personally is something that the families and kids will enjoy on the big screen. The 3D experience is something that will have the audiences wanting for more. It is a film that deserves the biggest screens in the country purely for the cinematic experience it will give the audience’ Anup Bhandari, director, expressed his happiness at the offer, ‘It is a great offer, glad that the film is getting the kind of adulation it deserves. The 3D version of the film has shaped up really well and it is an experience for the 

Young Tiger Ntr Launched Ashish Rowdy Boys Trailer

 యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేతుల మీదుగా.. ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్ విడుదల



దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.  తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. శనివారం ఈ సినిమా ట్రైల‌ర్ యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా ..


యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ‘‘ తెలుగు ప్రేక్ష‌కుల‌కు అడ్వాన్స్‌గా భోగి, సంక్రాంతి, క‌నుమ శుభాకాంక్ష‌లు. ఇది నాకు నోస్టాల‌జిక్ డే. ఎందుకంటే ‘ఆది’ సినిమా స‌మ‌యంలో దిల్ రాజుగారితో, శిరీష్‌గారితో అసోషియేష‌న్‌ ఏర్ప‌డింది. మా శిరీష‌న్న కొడుకు, సోద‌ర స‌మానుడు ఆశిష్‌తో అప్ప‌టి వ‌ర‌కు ప‌రిచ‌యం లేదు. ఇప్పుడు త‌ను రౌడీ బాయ్స్ చిత్రంతో హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు. త‌న సినిమా ట్రైల‌ర్‌ను నేను రిలీజ్ చేయ‌డం ఎంతో ఆనందంగా ఉంది. ఈ సంద‌ర్భంగా రాజుగారితో, శిరీష్‌గారితో ఉండే జ‌ర్నీని గుర్తు చేసుకున్న‌ట్లు అయ్యింది. రౌడీ బాయ్స్ ట్రైల‌ర్‌ను లాంచ్ చేసే అవ‌కాశం ఇచ్చినందుకు వారికి ఈ సంద‌ర్భంగా థాంక్స్ చెప్పుకుంటున్నాను. ఆశిష్‌కి, డైరెక్ట‌ర్ శ్రీహ‌ర్ష‌కి అభినంద‌న‌లు. ఆశిష్ గురించి మాట్లాడితే మా ఇంట్లో వ్య‌క్తి గురించి నేను మాట్లాడుకుంటున్న‌ట్లు ఉంటుంది. ఆశిష్ ఎన్నో మంచి మంచి చిత్రాల్లో త‌ను భాగం కావాల‌ని ఆ దేవుడ్ని కోరుకుంటున్నాను. రౌడీ బాయ్స్ సినిమా ఘ‌న విజ‌యం సాధించాల‌ని కోవిడ్ స‌మ‌యంలో విడుద‌ల‌వుతున్న రౌడీ బాయ్స్ మంచి చిత్రంగా మ‌న‌కు గుర్తుండిపోవాల‌నుని కోరుకుంటున్నాను. ప్రేమ దేశం చూసిన ఎగ్జ‌యిట్‌మెంట్ వ‌చ్చింది. నాకే కాదు. మీ అంద‌రికీ కూడా అలాంటి ఎగ్జ‌యిట్‌మెంట్ క‌లుగుతుంద‌ని మ‌న‌సారా న‌మ్ముతున్నాను. వైవిధ్య‌మైన సినిమాల‌ను, మంచి సినిమ‌ల‌ను ఆద‌రించే మ‌న తెలుగు ప్రేక్ష‌కులు కొత్త టాలెంట్‌ను ఎంక‌రేజ్ చేస్తార‌నే న‌మ్మ‌కం ఉంది. కోవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తూ సినిమాను థియేట‌ర్స్‌లోనే చూసి సినిమాకు ఘన విజయాన్ని అందించాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


నిర్మాత‌లు దిల్ రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘మా ‘రౌడీ బాయ్స్’ ట్రైలర్‌ను విడుద‌ల చేసి యూనిట్‌కు అభినంద‌నలు తెలియ‌జేసిన మా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌గారికి థాంక్స్. ఈ సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న ‘రౌడీ బాయ్స్’ సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. యూత్ స‌హా అన్ని వ‌ర్గాల‌కు న‌చ్చే ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. విక్ర‌మ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రంలో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోయిన్‌గా న‌టించింది. ఇప్పటి వ‌ర‌కు విడుద‌లైన పాట‌ల‌కు, టీజ‌ర్‌కు మంచి స్పంద‌న వ‌చ్చింది. సంక్రాంతికి విడుద‌ల‌వుతున్న సినిమాను కూడా ప్రేక్ష‌కులు ఆశీర్వ‌దిస్తార‌నే న‌మ్మ‌కం ఉంది’’  అన్నారు.

INDRANI The First INDIAN SUPERGIRL Movie In Telugu

 INDRANI The First INDIAN SUPERGIRL Movie In Telugu



Stephen is debuting as a Director with an adventurous movie ‘*INDRANI*’ to be produced by Stanley SumanBabu* P under the banner *'Veronica * *Entertainments'* .The Story is Designed in a unique and never seen before concept on Telugu screen. The makers are gearing up to make this as a *INDIAN SUPERGIRL* film by incorporating all commercial elements, besides the action sequences. 


The filmmakers have informed that this Movie has Great scope for two other heroines who will travel throughout the story along with the main lead.


Stephen, who happens to be directing this film is trained at the New York Film Academy. The pre-production works have been completed. The Auditions for all Characters are in Process.


Well, The good news is that the team will be casting new talent, besides roping in some noted actors. Producer, Stanley Suman Babu P said that "The Title character *‘INDRANI’* will be played by a popular actress or a newcomer. We all have seen SUPERHERO films till date, but Veronica Entertainments is going to show the first *INDIAN SUPERGIRL*"


The film *INDRANI* will have some breath-taking stunts. Sai Kartheek’s music and Background Score is going to be one of the major highlights. Our own Chota K Prasad has taken the responsibility for editing this ambitious project


Banner: Veronica Entertainments

Producer: Stanley Suman Babu P

Director: Stephen

Music: Sai Kartheek

DOP: Charan Madhavaneni

Editor: Chota K Prasad

VFX Supervisor: Srikanth Shakamuri

PRO: Sai Satish, Parvatineni Rambabu

Director Anil Ravipudi Launched Kotha Kothaga First Look Poster

 అనిల్ రావిపూడి చేతుల‌మీదుగా విడుద‌లైన `కొత్త కొత్త‌గా..`ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్



ఫ‌న్ ఫిల్ ఎంట‌ర్‌టైన్మెంట్స్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.1గా బిజి గోవింద‌రాజు స‌మ‌ర్ప‌ణలో ఎం. ముర‌ళీధ‌ర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం `కొత్త కొత్త‌గా`..హ‌నుమాన్ వాసంశెట్టి ద‌ర్శ‌కుడు. అజ‌య్‌, విర్తి వ‌ఘాని,ఆనంద్ ప్ర‌ధాన‌ల పాత్ర‌ల్లో న‌టిస్తున్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు అనిల్‌రావిపూడి విడుద‌ల‌చేసి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ తెలిపారు. ఈ చిత్రానికి శేఖ‌ర్ చంద్ర సంగీత ద‌ర్శక‌త్వం వ‌హిస్తుండ‌గా ప్ర‌వీణ్ పూడి ఎడిట‌ర్ గా వ్య‌వ‌హరిస్తున్నారు.


తారాగ‌ణం: అజ‌య్‌, విర్తి వ‌ఘాని, ఆనంద్, కాశీ విశ్వ‌నాథ్‌, తుల‌సి, క‌ళ్యాణ్ న‌ట‌రాజ‌న్‌, ప‌వ‌న్ తేజ్, ఈ రోజుల్లో ఫేమ్ సాయి


సాంకేతిక వ‌ర్గం:

బ్యాన‌ర్‌: ఫ‌న్ ఫుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌

స‌మ‌ర్ప‌ణ‌: బిజి గోవింద‌రాజు

నిర్మాత‌: ముర‌ళీధ‌ర్ రెడ్డి ముక్క‌ర‌

ద‌ర్శ‌క‌త్వం: హ‌నుమాన్ వాసంశెట్టి

సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌

ఎడిట‌ర్: ప్ర‌వీణ్ పూడి

డీఓపి:  వెంక‌ట్‌

ఆర్ట్‌:  సురేష్ భీమ‌గాని

ఫైట్స్‌:  పృథ్వి శేఖ‌ర్‌

లిరిక్స్‌:  కాస‌ర్ల శ్యాం, అనంత శ్రీ‌రామ్‌, కృష్ణ చైత‌న్య‌, శ్రీ‌మ‌ణి


Sampoornesh babu Dhagad Samba movie song shooting Completed

 సంపూర్ణేష్ బాబు 'ధగడ్ సాంబ' మూవీ సాంగ్ చిత్రీకరణ పూర్తి...



ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్ బ్యానర్ పై  ఎన్.ఆర్.రెడ్డి దర్సకత్వంలో తెరకెక్కిన చిత్రం " ధగడ్ సాంబ"   బి.ఎస్ రాజు సమర్పణలో నిర్మాత అర్.ఆర్ నిర్మిస్తున్నారు. సంపూర్ణేష్ బాబు, సోనాక్షి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్ర షూటింగ్ పూర్తి చేసుకుంది. ఇటీవల  సారథి స్టూడియోలో చివరి పాట చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది ధగడ్ సాంబ సినిమా. ఇప్పటికే విడుదలైన ప్రోమోకు మంచి స్పందన లభిస్తోంది. కామెడీ యాక్షన్ తో పాటు సెంటిమెంట్ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే యాక్షన్ ఫైట్స్ సంపూర్ణేష్ ఈ సినిమాలో చేశారు. ఈ సినిమాలో సంపూని సరికొత్తగా చూస్తారు. మూవీలోని పాటల కోసం అద్భుతమైన సెట్స్ వెయ్యడం జరిగింది. పాటలకు సంపూర్ణేష్ తనదైన శైలిలో స్టెప్స్ వెయ్యడం జరిగింది. ధగడ్ సాంబ చిత్రంలో హీరోయిన్ సోనాక్షి నటన అదనపు ఆకర్షణ కానుంది. పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్ పూర్తి చేసుకొని త్వరలో చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొని వస్తామని చిత్ర దర్శక నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.

నటీనటులు:
సంపూర్ణేష్ బాబు, సోనాక్షి, జ్యోతి, చలాకి చంటి, మిర్చి మాధవి, ఆనందభారతి, పిడి.రాజు తదితరులు

బ్యానర్: ప్రవీణ క్రియేషన్స్ ప్రవేట్ లిమిటెడ్
నిర్మాత: ఆర్ఆర్
డైరెక్టర్: ఎన్.ఆర్.రెడ్డి
సమర్పణ: బిఎస్.రాజు
మ్యూజిక్: డేవిడ్.జి
కెమెరా: ముజీర్ మాలిక్
ఎడిటర్: కె.ఎ. వై.పాపారావు
డాన్స్: బి.బాలు
పిఆర్ఒ: లక్ష్మీ నివాస్

Rowdy Boys Releasing Grandly On January 14th

 సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఆశిష్ ‘రౌడీ బాయ్స్’ రిలీజ్‌


 

దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్.. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీహ‌ర్ష కొనుగంటి ద‌ర్శ‌క‌త్వంలో దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తోన్న చిత్రం ‘రౌడీ బాయ్స్’.  తెలుగు ప్రేక్ష‌కుల అభిరుచిగా త‌గిన‌ట్లు ఎన్నో స‌క్సెస్‌ఫుల్ చిత్రాల‌ను అందించిన దిల్‌రాజు, శిరీష్ ఫ్యామిలీ నుంచి హీరోగా ప‌రిచ‌యం అవుతున్నారు ఆశిష్‌(శిరీష్ త‌న‌యుడు). ఈ చిత్రాన్ని సంక్రాంతి సంద‌ర్భంగా జ‌న‌వ‌రి 14న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా... 

నిర్మాత‌లు దిల్‌రాజు, శిరీష్ మాట్లాడుతూ ‘‘‘రౌడీ బాయ్స్’ కాలేజ్ బ్యాక్ డ్రాప్‌లో సాగే యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్. మా ఫ్యామిలీ నుంచి ఆశిష్ హీరోగా పరిచయం అవుతుండటం చాలా హ్యాపీగా ఉంది. అలాగే మా బ్యానర్ వేల్యూస్‌ను దృష్టిలో పెట్టుకుని ‘రౌడీ బాయ్స్’ చిత్రాన్ని యూత్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా రూపొందించాం. సంక్రాంతి సందర్భంగా జనవరి 14న ఈ సినిమాను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఎప్ప‌టిలాగే ప్రేక్ష‌కులు మా హీరోని, బ్యాన‌ర్‌ని ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం. మొదటి సినిమా అయినప్పటికీ ఫుల్ ఎనర్జీతో ఆశిష్ చేసిన డాన్సులు, ఫెర్ఫామెన్స్ అందరినీ ఆకట్టుకుంటాయి. ఆశిష్‌తో పాటు విక్ర‌మ్ కూడా మంచి పాత్ర‌లో న‌టించాడు. ఇక అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో మాకు ఎంతో మంచి అనుబంధం ఉంది. ఆమె మా ఎస్‌వీసీ బ్యాన‌ర్లో చేసిన మూడో సినిమా. త‌న‌దైన న‌ట‌న‌తో మెప్పిస్తుంది. ఇక మ‌ది సినిమాటోగ్ర‌పీ, రాక్ స్టార్ దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతం సినిమాకు పెద్ద ఎసెట్‌గా నిలుస్తాయి’’ అన్నారు.




Music Director Anup Rubens Interview About Bangarraju

 


నాగార్జున గారు వర్క్ విషయం లో చాలా ఫ్రీడమ్ ఇస్తారు  - సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్‌



కింగ్ అక్కినేని నాగార్జున, యువసామ్రాట్ నాగచైతన్య, రమ్యకృష్ణ, కృతి శెట్టి కాంబినేషన్‌లో తెరకెక్కిన బంగార్రాజు సినిమా జనవరి 14న రాబోతోంది. అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన‌ ఈ చిత్రానికి నాగార్జున నిర్మాతగా వ్యవహరించారు. కళ్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇందులో నాగార్జున‌ గారు ఒక పాట‌ను ఆల‌పించారు. ఈ పాట‌ల‌కు సంగీత ద‌ర్శ‌కుడు అనూప్ రూబెన్స్ బాణీలు స‌మ‌కూర్చారు. ఈ సంద‌ర్భంగా అనూప్ రూబెన్స్ తో జ‌రిపిన‌ ఇంట‌ర్వ్యూ సారాంశం.


నాగార్జున గారితో సినిమా చేయ‌డం మీకు ల‌క్కీనా. నాగ్ సార్‌కు ల‌క్కీనా?

ఇది టీమ్ వ‌ర్క్‌. ల‌క్ అనేది దైవ నిర్ణ‌యం. నాగార్జున గారితో సినిమా చేయ‌డం ప్రోత్సాహంగా వుంటుంది. ఫ్రెండ్లీ వాతావ‌ర‌ణం క‌లుగుతుంది. ఆయ‌న‌తో నేనే కాదు ఎవ‌రు చేసినా ఫ్రీడమ్ ఇస్తారు. ప్ర‌తీ టెక్నిషియ‌న్ ఫీలింగ్ ఇదే. దానితో ఇంకాస్త బాధ్య‌త‌గా వుండాల‌నుకుంటారు. నాగార్జున సార్‌తో ఇంత‌కుముందు చేసిన‌ సినిమాలు హిట్ కావ‌డం కూడా ఓ భాగం.


కొత్త‌మంది హీరోల‌కు కొంత‌మంది సంగీత ద‌ర్శ‌కులు ఎక్కువ శ్ర‌ద్ధ పెడుతుంటారు ఇందులో నిజ‌మెంతా?

నాదృష్టిలో ఎఫర్ట్ అనేది అన్ని సినిమాల‌కు పెడ‌తాం. ఒక్కో హీరోతో సినిమా చేయ‌డం అనేది మాతృ సంస్థ‌లా ఫీల‌య్యే వాతావ‌ర‌ణం క‌నిపించ‌డ‌మే. మన‌కు ఏం కావాలో వారికి తెలుసు.వారు ఏం కోరుకుంటున్నారో మ‌న‌కు తెలుసు. ఇదంతా కాంబినేష‌న్ వ‌ల్లే జ‌రుగుతుంది. ద‌ర్శ‌కుడు, హీరో అనే కాంబినేష‌న్‌లు ఔట్‌పుట్ క్లారిటీ ఇవ్వ‌డానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయి. ఫైన‌ల్‌గా ఏ సినిమాకైనా ప‌డే క‌ష్టం ఒక్క‌టే.


సీక్వెల్‌కు సంగీతం క‌ష్టం అనిపించిందా?

ఇంత‌కుముందు చేసిన సోగ్గాడే చిన్నినాయ‌నా అనేది బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయింది. దానితో కాస్త ఒత్తిడి అనేది స‌హ‌జ‌మే. ఎందుకంటే దానితోనే కంపేర్ చేస్తుంటారు. అందుకే ఒక‌టికి ప‌దిసార్లు క్రాస్ చెక్ చేసుకుని మంచి ఔట్‌పుట్ ఇవ్వాల్సి వుంటుంది. నాగార్జున సార్ కూడా మ‌న‌కు ఓ బెంచ్ మార్క్ వుంద‌నేవారు. అలాగే ద‌ర్శ‌కుడు క‌ళ్యాణ కృష్ణ కూడా అంతే ఎఫర్ట్  పెట్టి చేశారు.


నాగార్జున గారితో పాట పాడించాల‌నే ఆలోచ‌న ఎవ‌రిది?

నేను `మ‌నం` సినిమా చేస్తుండ‌గా పియోరే.. సాంగ్‌ను ఆయ‌న లొకేష‌న్‌లో స‌ర‌దాగా పాడారు. ఆ వాయిస్ బాగా న‌చ్చింది. మీ వాయిస్ బాగుంది. ఓ పాట పాడండి అన్నా. అలా `సోగ్గాడే..లో డిక్క‌డిక్క‌డుండుం.. అనే ది ట్రై చేశాం. ఆ పాట‌ను ప్రేక్ష‌కులు బాగా ఆద‌రించారు. దానికి కొన‌సాగింపుగా పాడించాల‌ని బంగార్రాజులో పాడారు. ఈ పాట పాత్ర‌ప‌రంగా సంద‌ర్భానుసారంగా ఆయ‌న పాడితేనే మ‌రింత ఎఫెక్ట్ వుంటుంది. అలా సినిమాకు క‌లిసి వ‌చ్చింది. దానితో మొత్తం సాంగ్ ఆయ‌నే పాడేశారు.


పాట పాడ‌డం క‌ష్ట‌మేనా?

నాకు న‌టించ‌డం క‌ష్టం. ఎవ‌రి ప‌ని వారు చేయాలి. కానీ కొంత‌మంది ఏదైనా ప‌ట్టుద‌ల‌తో చేసి స‌క్సెస్ సాధిస్తారు.


ఈ సినిమాలో మీరు యూనిక్ గా  గ్ర‌హించింది ఏమిటి?

ఇది గ్రామీణ క‌థ‌. ఏ ఒక్క సాంగ్‌కూ పాశ్చ‌త్య ప‌రిక‌రాలు వాడ‌లేదు. సాంప్ర‌దాయంగా వుంటాయి. ప‌ల్లెటూరి ఫీల్‌ను క‌లిగిస్తాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా ఆహ్లాద‌క‌రంగా వుంటుంది. వెస్ట్ర‌న్ ప‌రిక‌రాలు చాలా త‌క్కువ‌గా వాడాం.


మొన్న నాగార్జున  గారు రిలీజ్ డేట్ ప్ర‌క‌టించేట‌ప్పుడు అంతా హ‌రీ బ‌రీగా వ‌ర్క్‌ జ‌రుగుతుంది అన్నారు. అప్పుడు మీ ప‌రిస్థితి ఎలా వుంది?


ఈ సినిమాకు రీరికార్డింగ్ ముందుగానే పూర్త‌యింది. ఒక‌ర‌కంగా చెప్పాలంటే త‌క్కువ స‌మ‌యంలోనే పూర్తి చేశాం. స‌హ‌జంగా పెద్ద సినిమాల‌కు టైం తీసుకోవాలి. కానీ ఈ సినిమాకు 12గంట‌లు ప‌నిచేయాల్సింది 20గంట‌లు ప‌నిచేశాం. అలా సాంకేతిక సిబ్బంది అంద‌రూ ప‌నిచేశారు. సినిమా కూడా నాలుగు నెల‌లోనే పూర్త‌యింది. ఇలా అంద‌రూ చేయ‌బ‌ట్టే అనుకున్న టైంలో వ‌చ్చింది.



అప్ప‌టికీ ఇప్ప‌టికీ క‌ళ్యాణ్ కృష్ణ‌లో మీరు ఏం గ్ర‌హించారు?

సోగ్గాడే.. సినిమా వ‌చ్చి ఐదేళ్ళయింది. అప్ప‌టికీ ఇప్ప‌టికే ద‌ర్శ‌కుడిలో టేకింగ్‌లోనూ ప‌రిణితి పెరిగింది. సంబాష‌ణ‌లు చాలా హార్ట్ ట‌చింగ్‌గా వుంటాయి. ద‌ర్శ‌కుడులో చాలా క్లారిటీ వుంది.


బంగార్రాజు ఆల్బ‌మ్ మీ అంచ‌నాల‌కు రీచ్ అయిందా?

ఇప్ప‌టికే మూడు పాట‌లు విడుద‌ల చేశాం. ల‌డ్డుండా.. జ‌నాల‌కు బాగా చేరువ‌యింది. `నా కోసం` అనే మెలోడి సాంగ్‌, త‌స్సాదియ్యా.. బాగా ఆద‌ర‌ణ పొందాయి. మూడు రోజుల్లో మ‌రో సాంగ్ రాబోతుంది.


గ‌తంలో అన్ని పాటలు ఒకేసారి వ‌చ్చేవి. ప్ర‌స్తుతం ఒక్కో పాట‌ను విడుద‌ల చేస్తున్నారు ఈ ప్ర‌క్రియ‌ అనేది  సినిమాకు ఏమేర‌కు హెల్ప్ అవుతుంది?


ఒక‌ర‌కంగా ప్ర‌స్తుతం ట్రెండ్ ను బ‌ట్టి ఇలా చేయ‌డ‌మే బెట‌ర్‌. బంగార్రాజులో తొలిపాట‌ను మూడు నెల‌ల నాడే విడుద‌ల చేశాం. అలాగే మిగిలిన పాటలు కూడా. ఇక ఒక్కో సాంగ్‌కు ఒక్కో ప‌త్రేక‌త వుంటుంది. దాని వ‌ల్ల అంద‌రూ విన‌గ‌లుగుతున్నారు. గ‌తంలో సీడీలు పెట్టుకుని వినేవారు. కానీ సోష‌ల్ మీడియా వ‌చ్చాక ఒక్కోపాట‌ను హాయిగా విన‌డానికి ఇష్ట‌ప‌డుతున్నారు. అందుకే మిలియ‌న్ల వ్యూస్ వ‌స్తున్నాయి. ఒక్కో పాట విడుద‌ల చేయ‌డంవ‌ల్ల కొంత‌మందినైనా ట‌చ్ చేస్తుంది. దాని వ‌ల్ల సినిమా చూడాల‌నిపిస్తుంది.

 

సిద్ శ్రీ‌రామ్ క‌ల‌యిక ఎలా అనిపిస్తుంది?

ఆయ‌న పాడిన మొద‌టి సాంగ్  5 మిలియ‌న్ కు చేరువ‌యింది. మూడు పాట‌లు పాడించాను. ఇంత‌కుమందు `మంచిరోజులు వ‌చ్చాయి`లో కూడా పాడాడు. ఆయ‌న గాడ్ గిఫ్టేడ్ సింగ‌ర్‌. ఆయ‌న వాయిస్‌లో తెలీని సోల్ వుంటుంది. ఏ పాట పాడినా ఆహ్లాద‌క‌రంగా వుంటుంది. నాకు అది ప్ల‌స్ అయింది. నేను మెలోడీనే ఇష్ట‌ప‌డ‌తాను. ఆయ‌న అవే పాడ‌తారు.


మీకు బాణీలు రావాలంటే ప్రేర‌ణ క‌లిగించే అంశాలేమిటి?

ముందు క‌థ‌. ఆ త‌ర్వాత నేను ప్ర‌యాణాలు చేస్తున్న‌ప్ప‌డు ష‌డెన్‌గా ఓ ఆలోచ‌న వ‌స్తుంది. అ ప్రేర‌ణ‌లో బాణీలు కూరుస్తుంటాను.


కోవిడ్ వ‌ల్ల ప‌నివిధానంలో ఇబ్బంది అనిపించిందా?

క‌ష్ట‌ప‌డేవారికి ఎక్క‌డున్నా ఒక్క‌టే. పూర్తి లాక్‌డౌన్‌లో ఇంటిలో కుటుంబంతో గ‌డిపే స‌మ‌యం దొరికింది.


త‌దుప‌రి సినిమాలు?

`శేఖ‌ర్` సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా వుంది. దానికి బ్యాక్ గ్రౌండ్   స్కోర్ చాలా కీల‌కం. బాగా వ‌చ్చింది. త‌ర్వాత  విక్ర మ్ కె. కుమార్ సినిమా వుంది.



Superstar Mahesh Babu Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama

 Superstar Mahesh Babu, Dulquer Salmaan Released Adivi Sesh Major’s First Single Hrudayama



Actor Adivi Sesh’s first Pan India film Major is getting ready for its release. Currently, the film is in last leg of post-production. Directed by Sashi Kiran Tikka, the film was shot simultaneously in Telugu, Hindi and it will also be released in Malayalam.


The film’s musical promotions begin with first single Hrudayame is out now. Superstar Mahesh Babu launched the song in Telugu, while Dulquer Salmaan released it in Malayalam.


Hrudayame, as the title suggests, is a romantic song on the lead pair- Adivi Sesh and Saiee Manjrekar. Sricharan Pakala has come up with a cool and mellifluous number, while sensational singer Sid Sriram brings special charm with his expressive singing.


While Major is on duty at the border, his sweetheart has been waiting to meet him. They share their feelings through love letters. They even share their photographs which show month and year on them. The visuals show both memorizing their past and unforgettable time together, since their schooling days. Words can’t describe when they finally meet at the costume party. The song has so much love and it shows the beautiful love story of Major and Isha.


Bringing to screen the untold story of Major Sandeep Unnikrishnan, the multilingual film 'Major' traces the journey of Major Sandeep from childhood, teenage, glorious years in the army to the tragic events of the Mumbai attack where he martyred, touching upon the different aspects of his being.


Mounted on a large scale, the team earlier shared the teaser, with a surge of emotions, the visually stunning teaser struck a chord with the audience generating anticipation for the film.


Sobhita Dhulipala, Saiee Manjrekar, Prakash Raj, Revathi and Murli Sharma are the other prominent cast of the filmproduced by Sony Pictures Films India in association with Mahesh Babu's GMB Entertainment and A+S Movies.


Kiran - GA 2 Say Vinaro Bhagyamu Vishnu Katha

Kiran - GA 2 Say Vinaro Bhagyamu Vishnu Katha



GA2 Pictures have made it a habit to set up new projects with young actors. After scoring a hit with Most Eligible Bachelor, the production house is now close to announcing a new project.


GA2 Pictures have announced that they are collaborating with young hero Kiran Abbavaram for a youthful entertainer titled Vinaro Bhagyamu Vishnu Katha. 


GA2 has apparently readied a youthful subject and they have signed Kiran Abbavaram for the male lead role and kashmira pardeshi for the female lead role.


The film will be directed by Murali Kishore Abburi, produced by Bunny Vas and Allu aravind presents


More details about the cast, crew, and the director are likely to be announced soon. 

GA2 pictures Kiran Abbavaram Ka7 Launch Details

 జనవరి 7న అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2, కిరణ్ అబ్బవరం సినిమాకు ముహూర్తం..



వరస విజయాలతో దూసుకుపోతున్న ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2. ఈ సంస్థ నుంచి ఇప్పటి వరకు వచ్చిన భలే భలే మగాడివోయ్, గీత గోవిందం, టాక్సీ వాలా, ప్రతిరోజూ పండగే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ అద్భుతమైన విజయాలు అందుకున్నాయి. ఈ నిర్మాణ సంస్థలో సినిమా అంటే పక్కా హిట్ అనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లోనూ కలిగించారు నిర్మాతలు. తాజాగా గీతా ఆర్ట్స్ 2 నిర్మాణ సంస్థ నుంచి ప్రొడక్షన్ నెం 7గా కిరణ్ అబ్బవరం హీరోగా ఓ సినిమాకు ముహూర్తం పెడుతున్నారు. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో వస్తున్న ఈ సినిమా ముహూర్త కార్యక్రమాలు జనవరి 7 ఉదయం 10.19 నిమిషాలకు ఫిల్మ్ నగర్ దైవ సన్నిధానంలో జరగనున్నాయి. హీరో కిరణ్ అబ్బవరంకు కూడా ఇది 7వ సినిమా కావడం గమనార్హం. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు చిత్రయూనిట్ తెలియజేయనున్నారు.


నటీనటులు: కిరణ్ అబ్బవరం


టెక్నికల్ టీమ్:

నిర్మాణ సంస్థ: జీఏ 2 పిక్చర్స్

సమర్పణ: అల్లు అరవింద్

Samantha's Yashoda movie Pivotal Second Schedule Begins!

 Samantha's Yashoda movie Pivotal Second Schedule Begins!



Samantha’s exciting next, a new-gen bilingual thriller ‘Yashodha’ directed by Talented Director Duo Hari - Harish heads to the second schedule of shoot.


With the stellar cast like Varalaxmi Sarathkumar & Unni Mukundan onboard, Senior producer Sivalenka Krishna Prasad is producing it under the prestigious Sridevi Movies banner.


While the team has wrapped up the first schedule and commenced the next schedule at a brisk pace, maker Sivalenka Prasad says "We’re very much excited about this project & so making it at an uncompromised production value. As of now, the second schedule of the film that includes emotional scenes between the lead cast & Kalpika, Divya, Priyanka Sharma, Madhurima are commencing on a highly productive note. Heading this schedule till Sankranthi, we're aiming to release it even in Kannada, Malayalam & Hindi simultaneously”


Renowned actors Rao Ramesh, Murali Sharma, Sampath Raj & Shatru are playing the major roles in this movie.


Producer: Sivalenka Krishna Prasad

Directors: Hari and Harish

Music: Mani Sharma

Cinematography: M Sukumar

Editor: Marthand K Venkatesh

Art: Ashok

Fights: Venkat

Dialogues: Pulagam Chinnarayana, Dr.Challa Bhagya Lakshmi 

Lyrics: Ramajogaiah Sastry

Line Producer: Vidya Sivalenka

Creative director: Hemambar Jasthi


AthidhiDevobhava Will Not Disappoint

 


అతిథి దేవో భవ ఏ ఒక్కరినీ కూడా నిరాశ పరచదు - అఖండ నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి



ఆది సాయి కుమార్ హీరోగా నువేక్ష హీరోయిన్‌గా ‘అతిథి దేవో భవ’ అనే సినిమాను డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ తెరకెక్కించారు. రాం సత్యనారాయణ రెడ్డి సమర్ఫణలో శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ మీద రాజాబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించిన ఈ చిత్రం జనవరి 7న విడుదల కాబోతోంది. ఈ సందర్బంగా చిత్రయూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ కార్యక్రమంలో..


మిర్యాల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఫ్యామిలీ మెంబర్స్ సినిమా తీస్తే మంచిదే తీస్తారు.. చెడ్డది తీయరని నాకు తెలుసు. మొన్నే ఈ సినిమాను తీశాను. డీసెంట్ ఇన్నోసెంట్ లవ్ స్టోరీ. మంచి ఎంటర్టైన్మెంట్ కామెడీ ఉంది. సప్తగిరి గారు సినిమాను వేరే లెవెల్‌కు తీసుకెళ్తారు. ఓ రెండు మూడు నిమిషాలుండే దొంగ కారెక్టర్ చాలా బాగుంది. రోహిణి గారు బాగా చేశారు. ఆదిని చూస్తే చాలా ఎనర్జిటిక్‌గా కనిపిస్తారు. ఇందులో అవన్నీ చాలా కంట్రోల్ చేసుకున్నాడు. పాత్రకు ఎంత కావాలో అంత చేశాడు. ఇలాంటి సినిమాలకు ప్రమోషన్లు, సోషల్ మీడియా వ్యూస్ అవసరం లేదు. ఈ సినిమాకు వచ్చిన ఏ ఒక్కరినీ కూడా నిరాశ పర్చదు. అందరికీ నచ్చుతుంది. సినిమా నచ్చిన వాళ్లు ఓ పది మందికి చెప్పండి. నచ్చకపోతే 20 మందికి చెప్పండి. ఎందుకంటే సినిమాను నేను చూశాను. అందరికీ నచ్చుతుంది. చిన్న సినిమాలు మౌత్ టాక్‌తోనే ముందుకు వెళ్తాయి. ఈ సినిమాను అందరూ ఆదిరస్తారని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘ఆది సినిమా కోసం ఇలా రావడం చాలా ఆనందంగా ఉంది. సాయి కుమార్‌తో నా ప్రయాణం చాలా ఏళ్లది. నా మొదటి సినిమా వందేమాతరం నుంచి సాయి కుమార్‌తో ప్రయాణం చేస్తున్నాను.ఆదికి పెద్ద సక్సెస్ రావాలని దేవుడిని ప్రార్థిస్తున్నాను. శేఖర్ చంద్ర చెప్పినట్టు మంచి స్టోరీ ఉంటేనే మంచి సంగీతం వస్తుంది. ఈ మ్యూజిక్ వింటుంటే సినిమా బాగుంటుందని అర్థమవుతోంది. సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


జీవిత మాట్లాడుతూ.. ‘సాయి కుమార్ గారు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైకి వెళ్లారు. అందులో శివానీ నటిస్తోంది. మీ పిల్లల దగ్గర నేనుంటాను.. నా పిల్లల దగ్గర మీరు ఉండండి అని సాయి కుమార్ అన్నారు. అందుకే ఇక్కడికి వచ్చాం. సాయి కుమార్ గారి ఫ్యామిలీతో మాకు ఉన్న అనుబంధం ఇప్పటిది కాదు. ఆది కూడా మా అబ్బాయిలాంటి వాడే. ఆది మొదటి సినిమా పెద్ద సక్సెస్ అయింది. మాకు చాలా సంతోషమేసింది. ఆది కష్టపడే తత్వానికి ఇంకా పెద్ద సక్సెస్ రావాలి. అది త్వరలోనే రానుంది. నాగేశ్వర్ అద్బుతంగా తెరకెక్కించారు. శేఖర్ చంద్ర గారి సంగీతం బాగుంది. భాస్కర భట్ల గారి సాహిత్యం, పాటలు ఎప్పుడూ బాగుంటాయి. ఆది పర్ఫామెన్స్ ఇంకా ఇంప్రూవ్ అయినట్టు అనిపించింది. ఎమోషనల్ పాత్రలో ఆది బాగా నటించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ అవ్వాలి. అఖండ సినిమాతో మిర్యాల రవీందర్ రెడ్డి గారు సక్సెస్ కొట్టారు. సక్సెస్ అనేది మీ ఫ్యామిలీలోనే ఉంది. ఈ సినిమా కూడా విజయం సాధించాలి’ అని అన్నారు.


కార్తికేయ మాట్లాడుతూ.. ‘ఇప్పుడిప్పుడే ఒమిక్రాన్ అనే భయం మొదలైంది. కానీ తెలుగు ప్రేక్షకులు సినిమాలను ఎప్పుడూ ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. మామూలుగా అయితే జనవరి 7న ఆర్ఆర్ఆర్ రావాలి. ఆ సినిమా ఎంత హిట్ అయ్యేదో అతిథి దేవో భవ కూడా అంతే పెద్ద హిట్ అవుతుంది. నేను కొంచెం ఆదిగారిలా కనిపిస్తాను. రాజా విక్రమార్కలో సాయి కుమార్ గారితో నటించాను. ఆది గారి అమ్మ కూడా అలానే అన్నారు. అందుకే ఆదిని చూసినప్పుడు నాకు సోదరభావం కలుగుతుంది. నేను ఒక్క మెసెజ్ పెట్టడంతోనే ఆది గారు నా రిసెప్షన్‌కి వచ్చారు. ఆది గారు ఫైట్స్, సాంగ్స్‌కు ఫేమస్. కానీ ఇందులో ఎమోషన్ కూడా బాగా చేశాడనిపిస్తోంది. ట్రైలర్ చూస్తుంటే సినిమా హిట్ అవుతుందని అర్థమవుతోంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


ఆది సాయి కుమార్ మాట్లాడుతూ.. ‘నటించడం చాలా సులభం. కానీ ఇలా మాట్లాడటం అంటేనే కష్టం. ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. ట్రైలర్ విడుదల చేసిన నాని గారికి థ్యాంక్స్. కార్తికేయ బ్రో చాలా కష్టపడతాడు. మా నిర్మాతలు ఎంతో కష్టపడి సినిమాను తీశారు. డైరెక్టర్, సినిమాటోగ్రఫర్ ఇలా అందరూ కష్టపడి సినిమాను తీశాం. మంచి సినిమాను తీశామని నమ్మకం ఉంది. మా సినిమాను ఆదరిస్తారని నమ్ముతున్నాను. సప్తగిరి గారు కల్మషం లేని మనిషి. నాకు ఆయన చాలా ఇష్టమైన వ్యక్తి. ఆయన ఇంకా సినిమాలు చేయాలి. మా హీరోయిన్ నువేక్ష, నా మధ్య కెమిస్ట్రీ బాగుంటుంది. ఆడియో మంచి హిట్ అయింది. సినిమా కూడా అలానే ఆదరిస్తారని కోరుకుంటున్నాను. అఖండ సినిమా పెద్ద హిట్ అయింది. ఇక్కడకు వచ్చినర నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి గారికి థ్యాంక్స్. నా సినిమాను కూడా అందరూ ఆదరించాలి. ఆర్ఆర్ఆర్ పోస్ట్ పోన్ అయిందని చాలా బాధపడ్డాను. కానీ అదే రోజున ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పడంతో షాక్ అయ్యాను. మౌత్ టాక్ బాగుంటే సినిమాను ఆదరిస్తారు. తప్పకుండా సినిమా చూసి ఆదరిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.


డైలాగ్, స్క్రీన్ ప్లే రైటర్ రజినీ మాట్లాడుతూ.. ‘మమ్మల్ని ఆశీర్వందించేందుకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. మూవీ చూసే వాళ్లకు పిచ్చి ఉంటుందని అంటారు. కానీ తీయాలంటే అంతకు మించి పిచ్చి ఉండాలి. ఇష్టపడితే ఎంత కష్టమైనా కష్టంగా అనిపించింది. అతిథి అంటే తిథి, నక్షత్రం చూడకుండా వస్తారు. మీరు అతిథుల్లా వచ్చి మా సినిమాను ఆశీర్వదించండి. మేం ఎంత కష్టపడి చేసినా కూడా ఫలితం ప్రేక్షకుల చేతుల్లో ఉంటుంది. మా ముగ్గురు బ్రదర్స్ వల్లే నేను ఇక్కడ ఉన్నాను. మా ఆయన వంద శాతం కష్టపడి సినిమా చేశారు. సినిమా కోసం ప్రతీ ఒక్కరూ కష్టపడి చేశారు. ఎవరు ఎన్ని చెప్పినా కూడా శేఖర్ చంద్ర గారు వింటూనే ఉంటారు. భాస్కర భట్ల గారికి అలా సిట్యువేషన్ చెబితే పాట రాసేవారు. ఆది గారిని ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూస్తారు. లుక్స్ పరంగా, యాక్టింగ్ పరంగా కొత్తగా ఉంటారు. సప్తగిరి కామెడీ సినిమాకు హైలెట్ అవుతుంది. రోహిణి గారు సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అన్ని ఎమోషన్స్ ఈ సినిమాలో ఉంటాయి. సినిమా కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు.


డైరెక్టర్ పొలిమేర నాగేశ్వర్ మాట్లాడుతూ.. ‘మా నిర్మాత రాజాబాబు ఆడియెన్స్‌లో వింటారు. పట్టుబట్టి చేయించుకుంటారు. ఆయన మా నిర్మాత అని గర్వంగా చెప్పుకుంటాను. మరో నిర్మాత అశోక్ రెడ్డి గారికి థ్యాంక్స్. ఆది గారు ఇది వరకు చేసిన జానర్ల కంటే ప్రత్యేకంగా ఉంటుంది. ఈ సారి కచ్చితంగా హిట్ కొడతామని ఆశిస్తున్నారు. అమర్ గారి ఫోటోగ్రఫీ అద్బుతంగా వచ్చింది. సప్తగిరి కామెడీ సినిమాకు హైలెట్. రోహిణి గారి పాత్ర బాగుంటుంది. ఫస్ట్ హాఫ్ అంతా కామిక్‌గా ఉంటుంది. సెకండాఫ్ కొత్తగా ఉంటుంది. నువేక్ష బాగా చేసింది. ఈవెంట్‌కు వచ్చిన రవీందర్ రెడ్డి గారికి, హీరో కార్తికేయకు థ్యాంక్స్’ అని అన్నారు.


భాస్కరభట్ల మాట్లాడుతూ.. ‘ఆది నాకు సొంత తమ్ముడి కంటే ఎక్కువే. అందరికీ రాసిన దాని కంటే ఆది కాస్త గుప్పెడంత ఎక్కువ రాస్తాను. దర్శకుడు మంచి సందర్భం చెప్పారు. శేఖర్ చంద్ర మంచి బాణీలు ఇచ్చారు. సంక్రాంతి బోణీ ఈ సినిమాతో మొదలవ్వాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.


నిర్మాత రాధామోహన్ మాట్లాడుతూ.. ‘మిర్యాల రవీందర్ రెడ్డి గారు నాకు మంచి స్నేహితుడు. వాళ్ల కుటుంబ సభ్యులే ఈ సినిమాను నిర్మించారు. ఆర్ఆర్ఆర్ రావాల్సిన టైంకు అతిథి దేవో భవ రావడం అందరికీ సర్ ప్రైజ్. ఆదితో ఆల్రెడీ ఓ సినిమా చేశాం. మళ్లీ జనవరి 22న ఇంకో సినిమా స్టార్ట్ చేయబోతోన్నాం. ఆది అద్భుతమైన నటుడు. ఈ సినిమా హిట్ అయితే మాకు కూడా ప్లస్ అవుతుంది. ట్రైలర్ చూస్తే బాగుందనిపిస్తోంది. అందరికీ ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.


సప్తగిరి మాట్లాడుతూ.. ‘మిర్యాల రవీందర్ రెడ్డి గారు అఖండతో మంచి సక్సెస్ కొట్టారు. మళయాలంలో జోసెఫ్ సినిమా చూశాను. ఆ సినిమా రాజశేఖర్ గారికి కరెక్ట్‌గా సరిపోతుంది. ఆదితో నా కాంబినేషన్ ఎప్పుడూ బాగుంటుంది. ఆయనతో నటించినప్పుడు నాకు స్పేస్ దొరుకుతుంది. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. ఎంటర్టైన్మెంట్ ఎలా ఉన్నా.. ఎమోషన్ బాగుంటుంది. మీ సక్సెస్ కోసం నేను ఎదురుచూస్తున్నాను’ అని అన్నారు.


బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘సినిమా చాలా బాగా వచ్చిందని విన్నాను. జనవరి 7న రాబోతోన్న అతిథి దేవో భవ సినిమా మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. శేఖర్ చంద్ర, భాస్కర్ భట్ల కాంబినేషన్‌లో ఎన్నో హిట్లు ఇచ్చాం. లక్కీ మీడియా బ్యానర్‌ కోసం నిన్ను చూడగానే అనే పాటను నా దగ్గరే ఏడాదిగా ఉంచుకున్నాను. ఈ సినిమా కోసం ఇచ్చేశాను. అది పెద్ద హిట్ కానుంది. సంక్రాంతి కంటే ముందే రాబోతోన్న ఈ మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


తీస్ మార్ ఖాన్ నిర్మాత తిరుపతి రెడ్డి మాట్లాడుతూ.. ‘రాజశేఖర్ గారంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఓ సినిమా చేయాలి. కానీ కుదర్లేదు. నాగేశ్వర్‌ నాకు చాలా ఏళ్ల నుంచి తెలుసు. ముందుగా ఆయనతోనే సినిమా చేయాలి. కానీ టైం కుదర్లేదు. ఈ సినిమా మంచి హిట్ అవుతుంది. మీతో మళ్లీ ఒక సినిమా చేస్తాను. ఆదికి ఇది మంచి సినిమా  అవుతుంది. మా రాబోయే సినిమాకు ఇది ప్లస్ అవుతుంది’ అని అన్నారు.


విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. ‘ప్రేమ కావాలి సినిమా జరుగుతున్న సమయం నుంచి ఆదిగారు నాకు తెలుసు. మేం కలిసి సినిమాను చేయాలని అనుకున్నాం. మంచి నటుడు, మంచి డ్యాన్సర్. ఆయనకు రావాల్సినంత సక్సెస్ ఇంకా రాలేదు. ఈ సినిమాతో అది రావాలి. డైరెక్టర్ నాగేశ్వర్‌తో నాకు చాలా ఏళ్ల నుంచి అనుబంధం ఉంది. ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి’ అని అన్నారు.


శేఖర్ చంద్ర మాట్లాడుతూ.. ‘చిత్రయూనిట్ సహకారం వల్లే సాంగ్స్ ఇంత బాగా వచ్చాయి. కథ, సందర్భంగా బాగుండటం వల్లే పాటలు చక్కగా కుదిరాయి. భాస్కర భట్ల గారి సాహిత్యం బాగుంది. మా ఈ ప్రయాణాన్ని చాలా ఎంజాయ్ చేశాం. పాటలు పాడిన ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నాను’ అని అన్నారు.



Suresh Productions Obtain Telugu Dubbing Rights And Remake Rights Of Maanaadu In All Indian Languages

 Suresh Productions Obtain Telugu Dubbing Rights And Remake Rights Of Maanaadu In All Indian Languages



Tollywood’s leading production house Suresh Productions has been making numerous projects right now which are in different stages of production and post-production. They are also lining up some exciting movies.


Interim, Suresh Productions owned by Suresh Babu obtained Telugu dubbing rights and also remake rights of Tamil blockbuster movie Maanaadu in all Indian languages. They will be associating with Asian Cinemas for Telugu version of the movie.


Simbu played the protagonist, while Kalyani Priyadarshan appeared as female lead and SJ Suryah essayed antagonist in the sci-fi action thriller helmed by Venkat Prabhu.


Produced by Suresh Kamatchi, Maanaadu hit the big screens on November 25 in 2021 and ended up as one of the highest grossing movies in the year.


Suresh Productions will soon announce details of remake version of Maanaadu in different languages.

Ashoka Galla Has Done Humour With Ease In Hero: Sriram Aditya

 Ashoka Galla Has Done Humour With Ease In Hero: Sriram Aditya



Superstar Krishna's grandson, Mahesh Babu’s nephew and Guntur MP Jayadev Galla’s son Ashok Galla is getting introduced as hero with an upcoming film Hero Hero directed by Sriram Adittya and produced by Padmavathi Galla under Amara Raja Media & Entertainment banner.


The film is all set for a grand release worldwide on January 15th for this Pongal. The team hold a press meet today and it was attended by Ashok Galla, Nidhhi Agerwal, Sriram Aditya, Jayadev Galla, Padmavathi Galla and Adiseshagiri Rao.


Adiseshagiri Rao informed that his brother superstar Krishna suggested to release the movie for Sankranthi. He further said that Hero is a pucca commercial entertainer with all the ingredients incorporated in it.



Nidhhi Agerwal said, “Though Ashok is a newcomer, he’s a very talented guy. His dancing and acting are exceptional. It’s not at all like Hero is his very first movie. He indeed pulled off the role efficiently. Director Sriram Aditya is a perfectionist. Though I played doctor in this film as well, my character is completely different from iSmart Shankar’s.”


Sriram Adittya said, “Adiseshagiri Rao gave us the push to release the film for Sankranthi. I have been waiting to release the movie. We’ve seen films getting postponed for last couple of weeks. Given it’s a wholesome entertainer, Sankranthi is the perfect date for Hero. Jagapathi Babu will get an award for this film. Naresh has done a superb job. When I first met Ashok, I I got confidence after seeing his smile. However, he surprised me with his acting. You’ll all surprise for sure. One thing I can assure you all, you don’t believe it’s his first movie. He has done humour with ease. Ashok has become a brother to me. There’s completely positive atmosphere during the making. There will be whistle worthy scenes for superstar fans. It’s a perfect festival movie.”


Ashok Galla said, “I have been waiting incessantly for the release of this film. It’s a dream come true for me. As the movie is releasing for Sankranthi, our energy reached next level. I’m happy that Krishna and Mahesh Babu fans are loving Rap Song. We all worked like a family. If the audience love the movie, it’s like we hit the bullseye.”


Veyi Subhamulu Kalugu Neeku Movie Pre Release Event Held Grandly

 “వేయి శుభములు కలుగు నీకు” ప్రి రిలీజ్ ఈవెంట్..జనవరి 7 న గ్రాండ్ రిలీజ్ 



జామి లక్ష్మీ ప్రసన్న సమర్పణలో జయ దుర్గాదేవి మల్టీ మీడియా పతాకం పై శివాజీ రాజా గారి అబ్బాయి విజయ్ రాజా  మరియు తమన్నా వ్యాస్ హీరో హీరోయిన్లు గా రామ్స్ రాథోడ్ దర్శకత్వంలో  తూము నరసింహా పటేల్ మరియు జామి శ్రీనివాస రావులు సంయుక్తంగా కలసి నిర్మిస్తున్న చిత్రం “వేయి శుభములు కలుగు నీకు”.ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల 7 న విడుదల వుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లో ప్రి రిలీజ్ ఈవెంట్ వేడుక ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా దర్శకుడు వీర భద్రం చౌదరి, హీరో ఆకాష్ పూరి,,బిగ్ బాస్ విన్నర్ సన్నీ, మరియు విశ్వ, మేఘామ్స్ శ్రీహరి, తదితరులు అంతా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ చిత్రం గొప్ప విజయం సాధించాలని వహిత్ర యూనిట్ కు బెస్ట్ విషెస్ తెలియజేశారు.అనంతరం జరిగిన పాత్రికేయుల సమావేశంలో



దర్శకుడు వీర భద్రం చౌదరి మాట్లాడుతూ..ఈ చిత్ర ట్రైలర్ చాలా బాగుంది. ఫాదర్ & సన్  ల సెంటిమెంట్ అనేది ప్రతి కుటుంబం లో ఉంటుంది.కాబట్టి ఈ సినిమా ప్రతి ఫ్యామిలీ కి కనెక్ట్ అవుతుంది. మంచి కథతో RRR తేదీ రోజున  ప్రేక్షకుల ముందుకు  వస్తుంది. దర్శకుడు రామ్స్ రాథోడ్ తో ఇలాంటి మంచి కంటెంట్ ఉన్న సినిమాను నిర్మిస్తున్న తూము నరసింహ పటేల్, జామి శ్రీనివాసరావు లకు ఈ సినిమా గొప్ప విజయం సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ.. టీం అందరికీ అల్ ద బెస్ట్ అన్నారు.


హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ.. ఈ చిత్ర టీజర్,ట్రైలర్ అమేజింగ్ గా ఉంది.ఇందులో మీ అందరి హార్డ్ వర్క్ కనిపిస్తుంది.తను ఇలాగే మంచి మంచి సినిమాలు తీయాలని కోరుతున్నాను. ఈ నెల 7 న వస్తున్న ఈ సినిమా దర్శక, నిర్మాత లకు మంచి పేరు తీసుకు రావాలని కోరుతున్నాను అన్నారు.


బిగ్ బాస్ 5 విన్నర్ సన్నీ మాట్లాడుతూ.. శివాజీ రాజా గారు అందరికీ ఇష్టమైన వ్యక్తి తను నిన్ను తెరపై చూడాలి అనుకున్నాడు.కానీ మచ్ఛా.. తెరపై నీ డ్యాన్స్ అదిరింది మచ్ఛా..దీని వెనుక ఎంత హార్డ్ వర్క్ ఉందొ తెలుస్తుంది. దర్శక,నిర్మాతలు ఎక్కడా కాంప్రమైజ్ కుండా తీశారని ట్రైలర్,పాటలు,ఫైట్స్ చూస్తే తెలుస్తుంది


బిగ్ బాస్ విశ్వ మరియు నటుడు మేఘామ్స్ శ్రీహరి మాట్లాడుతూ.. విజయ్ రాజా డ్యాన్స్ చేస్తున్నపుడు సైడ్ నుండి చూస్తుంటే అఖిల్ లా అనిపిస్తున్నావు.తను చేస్తున్న ఈ సినిమా గొప్ప విజయం  సాధించాలని అన్నారు.


చిత్ర దర్శకుడు రామ్స్ రాథోడ్ మాట్లాడుతూ..  ‘వేయి శుభములు కలుగు నీకు’. చిత్రంలో ఫాదర్ & సన్ ల మీద సాగె సెంటిమెంట్ సాంగ్ చూస్తే.. తండ్రి కొడుకు ల మధ్య ఇంత రిలేషన్ ఉంటుందా అనేలా అద్భుతంగా ఉంటుంది.ఈ సాంగ్ ను చూసిన వారంతా ఆ సాంగ్ కు కనెక్ట్ అవుతారు.వీరబద్రం గారి మేలు ఏప్పటికీ మరచిపోలేము. ఈ సినిమాకు మాకు చక్కటి హీరో దొరికాడు. మేము రమ్మన్న టైం కంటే ముందే సెట్ లో ఉండేవాడు.అంత డెడికేటెడ్ గా వర్క్ చేయడం జరిగింది. హీరోయిన్ చక్కటి పెర్ఫార్మన్స్ ఇచ్చింది. మ్యూజిక్ డైరెక్టర్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు ఇందులోని పాటలన్నీటికీ మంచి వ్యూస్ వచ్చాయి. టెక్నీషియన్స్,అరిస్టు లు అందరూ బాగా సపోర్ట్ చేస్తూ సహరించడం తో సినిమా చాలా బాగా వచ్చింది. నేను చెప్పిన కథను నన్ను నమ్మి  నిర్మాతలు ఖర్చుకు వెనుకాడకుండా బడ్జెట్ కు కాంప్రమైజ్ కాకుండా తీశారు.ఇంత మంచి సినిమా చేసే అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో ఈ పండుగ వాతావరణంలో ఈ నెల 7 న వస్తున్న మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

.


చిత్ర నిర్మాతలు తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. జనవరి 7 న ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా చిత్రం “వేయి శుభములు కలుగు నీకు” .మంచి కంటెంట్ తో  సస్పెన్స్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ చిత్రాన్ని ఎంతో కష్టపడి  బడ్జెట్ గురించి ఆలోచించకుండా తీశాము దీనిలో ఉన్న ఐదు సాంగ్స్ ఉంటాయి.అన్ని పాటలకు మిలియన్ వ్యూస్ వచ్చాయి.  ఫుల్ యాక్షన్, థ్రిల్లర్ గా వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ.  థ్రిల్లర్ మూవీ. ఈ రోజుల్లో మంచి సినిమా కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమా ఒక్క సెన్సార్ కట్ లేకుండా మాకు సెన్సార్ ఇచ్చారు. మా చిత్రానికి చూసి ఆశీర్వదించాలని కోరుతున్నాం



చిత్ర హీరో విజయ్ రాజా మాట్లాడుతూ..నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన పెద్దలకు, నా మిత్రులకు,  ధన్యవాదాలు. ఈ చిత్రానికి వీరభద్రం గారి సపోర్ట్  ఎంత ఉందనేది మా టీం కు మాత్రమే తెలుసు. మా చిత్ర దర్శకుడు చాలా కష్టపడి మంచి కంటెంట్ ఉన్న సినిమా తీశాడు.ఈ చిత్ర షూటింగ్ టైం లో కోవిడ్ సమస్య వున్నా కూడా నాలాంటి చిన్న హీరోకు ఇంత బడ్జెట్ అవసరమా అని చూడకుండా చిత్ర నిర్మాతలు అనుకున్న దానికంటే ఎక్కువ కర్చుపెట్టారు.ఏ హీరో హీరోకైనా ఇలాంటి నిర్మాతలే కావాలని కోరుకుంటారు. ఇంతమంచి సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు. హీరోయిన్ తమన్నా మరియు ప్రియలు చాలా బాగా చేశారు. దర్శకుడు చక్కటి కథను సెలెక్ట్ చేసుకొని మాతో మంచి చిత్రాన్ని చేశారు.జాన్ 7 న వస్తున్న మా సినిమాను అందరూ ఆధరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు


చిత్ర హీరోయిన్ తమన్నా వ్యాస్ మాట్లాడుతూ.. ఇందులోని పాటలు నాకు మంచి పేరు తీసుకొచ్చాయి. ఇలాంటి మంచి చిత్రంలో నటించే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అన్నారు.


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారంతా చిత్ర యూనిట్ బెస్ట్ విషెస్ తెలియజేశారు



నటి నటులు

విజయ్ రాజా , శివాజీ రాజా, తమన్నా వ్యాస్, ఢీ ఫేం ఫాల్గుణి,  సత్యం రాజేష్, జ్ఞాన ప్రియా, వెంకట్ నారాయణ, సన, అనంత్, షాయాజి షిండే,  శ్రీకాంత్ అయంగార్, రోహిణి, జబర్దస్త్  అప్ప రావు, జబర్దస్త్ మురళి, రేసింగ్ రాజు, కోట యశ్వంత్ తదితరులు.


 సాంకేతిక నిపుణులు 


బ్యానర్ : జయ దుర్గ దేవి మల్టీ మీడియా

టైటిల్ : “వేయి శుభములు కలుగు నీకు”

నిర్మాత : తూము నరసింహ పటేల్,  జామి శ్రీనివాసరావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : విక్రమ్ రమణ

స్క్రీన్ ప్లే, దర్శకత్వం : రామ్స్ రాథోడ్

కథ, మాటలు : శ్రీనాథ్ రెడ్డి

కెమెరా : కె బుజ్జి

సంగీతం : గ్యాని

ఆర్ట్ డైరెక్టర్ : బి జగన్

కో డైరెక్టర్ : ప్రకాష్

కాస్ట్యూమ్ : ఎల్ . కిశోరె కుమార్

ఎడిటర్ :వినోద్

పి.ఆర్.ఓ : హర్ష

DJ Tillu Lyrical Video Out Now

Come, shake a leg with DJ Tillu for Ram Miriyala's groovy dance number Tillu Anna DJ Pedithe 



DJ Tillu, starring Siddhu Jonnalagadda and Neha Shetty in the lead roles, is a mad-cap thriller directed by debutant Vimal Krishna and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Ahead of the film's release on January 14 for the Sankranti season, Tillu Anna DJ Pedithe, a fast-paced party number was launched today and has caught the fascination of music lovers.


Staying true to Siddhu's character as a local Hyderabadi DJ in the film, the number is high on energy and brims with a folksy flavour unique to Telangana. One of the most happening playback singers in the tinsel town, Ram Miryala, has sung and composed the song penned by popular lyricist Kasarla Shyam, synonymous with delivering one chartbuster after the other.


'Lalaguda Amberpeta Mallepalli Malakpeta..Tillu anna dj pedithe tilla tilla aadalaa...Mallesanna dawath la bannu gaani baarat la.. Tillu anna digindu ante dinchak dinchak dhunkalaa,' the song, filled with apt local references and boasting of great rhythm, takes off on an exuberant note, with an irresistibly catchy musical hook. Besides Siddhu's energetic dance moves, the lyrical video offers a colourful sneak-peek into traditions, festivals that are integral to the life of a Hyderabadi. The composer does a fine job in seamlessly blending this indie-musical flavour into a mainstream film.


"The director wanted me to write a song that'll mirror Siddhu's characterisation in the film and sent across a catchy tune. I was instantly drawn to the number that captured the musical spirit of Hyderabad perfectly. I was reminded of those typical arrogant local guys across Hyderabadi streets and hence thought it would be apt to start the song with the names of various areas in the city," lyricist Kasarla Shyam says. 


"The hook line was written keeping fans in mind and my job was made easier when I noticed Siddhu's attitude in the film. The lines just flowed organically. I'm happy with the response to the song promo and quite eager to know what audiences have to say about the full song too. I am satisfied I could do my bit to lift the spirits of audiences with a kickass dance number. Bhanu's choreography does complete justice to its energy levels," he adds. 


It's evident that DJ Tillu and its wacky universe has resonated with young audiences from the stills and the promos, including the recently launched teaser. The film is further bolstered by the presence of music director S Thaman, who's come on board to compose the background score. Composer Sri Charan Pakala is also part of the project. Directed by debutant Vimal Krishna, the film has a formidable supporting cast, comprising Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas.



Cast & Crew: 


Stars: Siddhu, Neha Shetty, Prince Cecil, Brahmaji, Pragathi and Narra Srinivas


Story & Screenplay by: Vimal Krishna & Siddhu

Dialogues: Siddhu

Art Director: Avinash Kolla

Music Director: Sri Charan Pakala

Editor: Navin Nooli

DOP: Sai Prakash Ummadisingu.     

Executive Producer: Dheeraj Mogilineni

Producer: Suryadevara Naga Vamsi

Director: Vimal Krishna

Banner: Sithara Entertainments

Presenter: PDV Prasad

Rashmika Mandanna unveils Kolakalla Chinnadi from Chittam Maharani, song gets thumping response 

 Rashmika Mandanna unveils Kolakalla Chinnadi from Chittam Maharani, song gets thumping response 





Presented by Little Thoughts Cinemas, Chittam Maharani, a film featuring Yajurved, Rachana, Sunil, and others in lead roles is up for theatrical release. The film is directed by A Kasi. JS Manikanta, Prasad Reddt TR are producing the film. 


The makers have dropped the Kolakalla Chinnadi song from the film’s audio album and this song was unveiled by happening beauty Rashmika Mandanna. 


Talented singer Ram Miryala crooned this song and it has all the right ingredients to become a chartbuster. Creative filmmaker Sukumar unveiled the first look of the film and it had already received a thumping response. 


Gowra hari is composing the music for the film while Karthik Srinivas is handling the editing.  Suresh Siddhani is the dialogue writer. More details about the project will be out soon.

Aadi SaiKumar Interview About AthidhiDevobhava

 నా నటన. అతిధి దేవోభవ లో అందరినీ మెప్పిస్తుంది.. ఆది



ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటించిన అతిథి దేవోభవ' జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. శ్రీనివాస సినీ క్రియేషన్స్‌పై రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల నిర్మించారు. పొలిమెర నాగేశ్వర్ దర్శకత్వం వహించిన ఇందులో నువేక్ష కథానాయిక. బుధ‌వారంనాడు  హీరో ఆది చిత్రం గురించి ప‌లువిష‌యాలు తెలియ‌జేశాడు.

 

- నా నటన అందరికి నచ్చుతుందని ఆశిస్తున్నాను. స్క్రిప్ట్‌లో అంతర్లీన భావోద్వేగ అంశం ఉంది. నా రాబోయే సినిమాలు డిఫరెంట్ జోనర్‌లకు చెందినవి. సినిమాలు బాగా చేస్తాయనే నమ్మకం ఉంటేనే ఒప్పుకుంటున్నాను.


- నా సినిమాల్లో కొన్ని రిలీజ్ డేట్ ఆల‌స్యం కారణంగా నష్టపోయాయి. 'రఫ్', 'చుట్టాలబ్బాయి' చిత్రాలకు సరైన డేట్స్ వచ్చాయి.


- ఇక తాజా సినిమా ఎగ్జిక్యూషన్ పార్ట్‌ని దర్శకుడు చాలా బాగా హ్యాండిల్ చేసిన 'అతిథి దేవోభవ'పై నాకు నమ్మకం ఉంది. పాటలు కూడా సినిమాలో బాగా వర్కవుట్ అవుతాయి. శేఖర్ చంద్ర గారి పాటలు మరియు BGM చాలా బాగా వచ్చాయి. భవిష్యత్తులో మళ్లీ ఆయనతో కలిసి పనిచేయాలనుకుంటున్నాను.


- రోజురోజుకు కరోనా కేసులు పెరిగిపోతున్న వేళ మా సినిమా తెరకెక్కుతున్న మాట వాస్తవమే. వచ్చే శనివారం రెండో శనివారం కావడంతో వారాంతంలో కలెక్షన్లు పెరుగుతాయని ఆశిస్తున్నాను.


కొత్త సినిమాలు

- ఇక 'తీస్ మార్ ఖాన్స‌లో (పాయల్ రాజ్‌పుత్ కథానాయికగా నటించింది. ఫ్యామిటీ ఎమోషనల్ ప్లాట్ పాయింట్‌తో కూడిన పూర్తి కమర్షియల్ సినిమా. పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వీఎఫ్‌ఎక్స్‌తో కూడిన 'అమరన్ ఇన్ ది సిటీ' అనే ఫ్రాంచైజీ సినిమా చేస్తున్నాను. అవికా గోర్ కూడా నటించిన కంటెంట్ ఆధారిత సినిమా ఇది. 'బ్లాక్' ఒక థ్రిల్లర్, దీని షూటింగ్ పూర్తయింది. క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ 'సిఎస్‌ఐ సనాతన్' షూటింగ్ 10 రోజుల్లో పూర్తవుతుంది. సంక్రాంతికి కొత్త సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఇది రొమాంటిక్ సినిమా. 'జంగిల్' తెలుగు-తమిళ చిత్రం, దీని అవుట్‌పుట్ అద్భుతంగా ఉంది

Varalaxmi Sarathkumar On Board For Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107

 Varalaxmi Sarathkumar On Board For Nandamuri Balakrishna, Gopichand Malineni, Mythri Movie Makers #NBK107



Natasimha Nandamuri Balakrishna and successful director Gopichand Malineni who both delivered blockbusters with their last respective films will be joining forces to offer a mass treat. Billed to be a pucca mass and commercial film, Tollywood’s leading production house Mythri Movie Makers will be bankrolling the project prestigiously.


Shruti Haasan plays heroine opposite Balakrishna in the movie, that will have a powerful antagonist to be played by Sandalwood Star Duniya Vijay on his Tollywood debut. Tentatively titled #NBK107, the film will have significance for all the actors.


Varalaxmi Sarathkumar who has become busy in Tollywood after her powerful performance in Gopichand Malineni’s Krack comes on board to play a strong role in #NBK107 as well. The actress who stunned with her performance in Krack is delighted to be part of this high budget entertainer.


The film in the combination of the mass hero and the mass director is going to provide a full meal treat for masses. The director readied a powerful script for Balakrishna to present him in a never seen before look and the story is based on true incidents.


Naveen Yerneni and Y Ravi Shankar will be producing the film on massive scale.


Gopichand Malineni’s films are technically high in standard. And, he is taking extra care for #NBK107, in terms of artists and technicians to associate for the project.


S Thaman renders soundtracks, while Rishi Punjabi will handle the cinematography. Acclaimed writer Sai Madhav Burra provides dialogues, while National Award-Winning Craftsman Navin Nooli takes care of editing and AS Prakash is the production designer. Chandu Ravipati is the executive producer for the film that will have fights by Ram-Lakshman duo.


Regular shoot of the movie will begin from this month.


Cast: Nandamuri Balakrishna, Shruti Haasan, Duniya Vijay, Varalaxmi Sarathkumar


Technical Crew:

Story, Screenplay & Direction: Gopichand Malineni

Producers: Naveen Yerneni, Y Ravi Shankar

Banner: Mythri Movie Makers

Music Director: Thaman S

DOP: Rishi Punjabi

Editor: Navin Nooli

Production Designer: AS Prakash

Dialogues: Sai Madhav Burra

Fights: Ram-Lakshman

CEO: Chiranjeevi (Cherry)

Co-Director: Kurra Ranga Rao

Executive Producer: Chandu Ravipati

Line Producer: Bala Subramanyam KVV

Publicity: Baba Sai Kumar

Marketing: First Show

PRO: Vamsi-Shekar