Latest Post

PEDDHANNA Producers PRESSMEET

 ఈ దీపావ‌ళికి క్లాస్, మాస్ అంతా కలిసి చూసే సినిమా ‘పెద్దన్న’ - నిర్మాత‌లు నారాయణ్ దాస్ నారంగ్, సురేష్ బాబు



సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయిన పెద్దన్న సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4న రాబోతోంది. టాలీవుడ్‌ డిస్ట్రిబ్యూషన్ రంగంలో అగ్రగామి అయిన ఏసియన్ ఇన్ ఫ్రా ఎస్టేట్స్ ఎల్ఎల్‌పి సంస్థ, సురేష్ బాబు, దిల్ రాజు కలిసి ఈ చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీగా విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో..


నారాయణ్ దాస్ నారంగ్ మాట్లాడుతూ.. ‘మా మీద నమ్మకం ఉంచి పెద్దన్న చిత్రాన్ని విడుదల చేసేందుకు మాకు అవకాశం ఇచ్చిన సన్ టీవీ వారికి, రజినీకాంత్‌కు ధన్యవాదాలు. సినిమా సూపర్ హిట్ అవుతుంది. రజనీకాంత్ గారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.


సురేష్ బాబు మాట్లాడుతూ.. ‘పెద్దన్న సినిమా అన్నాత్తెకు డబ్బింగ్‌గా రాబోతోంది. మేం ఈ సినిమాను ఎందుకు తీసుకున్నామా? అని అందరికీ అనుమానం రావొచ్చు. కరోనా తరువాత ఇప్పుడు  ప్రేక్షకులు థియేటర్లోకి వస్తున్నారు. ఇలాంటి సమయంలో ఓ పెద్ద సినిమాను తీసుకొస్తే ఇంకా బాగుంటుందని అనుకున్నాం. ఈ చిత్రంలో మనకు వింటేజ్ రజినీకాంత్ గారు కనిపిస్తున్నారు. మనం ఎలా అయితే రజినీకాంత్‌ను చూడాలని అనుంటామో అలానే దర్శకుడు శివ చూపించారు. ఇందులో  ఎమోషన్ కూడా ఉంది. అన్నాచెల్లెళ్ల బంధం అద్భుతంగా ఉంది. జగపతి బాబు, కుష్బూ, మీనా, నయనతార ఇలా అందరూ చక్కగా నటించారు. ఫుల్ మీల్స్ లాంటి సినిమా. క్లాస్ మాస్ ఫ్యామిలీ అందరూ చూడగలిగే సినిమా. అందరూ థియేటర్‌కు వచ్చి చూసే సినిమా. ఈ సినిమాను పెద్ద సక్సెస్ చేస్తారని, చేయాలని కోరుకుంటున్నాను. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని పెద్ద ఎత్తున రిలీజ్ చేస్తున్నాం. ఇకపై కూడా మేం కలిసే సినిమాలు చేస్తాం. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా మాకు నచ్చిన చిత్రాలను కలిసే విడుదల చేస్తాం. ఈ సినిమా కథను శివ నాకు చెప్పాడు. ఇలాంటి సమయంలో కమర్షియల్ చిత్రమైతే ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడం సులభం అవుతుంది. కరోనా పట్ల ఎప్పుడూ అప్రమత్తంగానే ఉండాలి. కానీ మన డైలీ రొటీన్ జీవితాన్ని మాత్రం ఆపకూడదు. దీపావళికి పెద్దన్న సినిమాను భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్నామ’అని అన్నారు.

Anubhavinchu Raja Movie Releasing on November 26th

 ఫ్యామిలీ అంతా రెండు గంటలు హ్యాపీగా నవ్వుకునేలా  ‘అనుభవించు రాజా’ సినిమా ఉంటుంది - నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ‌



యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం శ్రీను గవిరెడ్డి దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ అనుభవించు రాజా సినిమాలో న‌టిస్తున్నారు .ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై.లి., శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి సంయుక్తంగా నిర్మిస్తోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 26న ఈ సినిమా విడుదల కాబోతోన్న అధికారికంగా ప్రకటించారు మేక‌ర్స్‌. ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత సునిల్ నారంగ్ పాల్గొన్నారు.


నిర్మాత సుప్రియ యార్ల‌గ‌డ్డ‌ మాట్లాడుతూ.. ‘ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. నవంబర్ 26న ఈ  సినిమా రాబోతోంది. చిన్న సినిమా అనేది ఇండస్ట్రీని కాపాడుతుంది. ఆ చిన్న సినిమాను ఎలా కాపాడుకోవాలనేది ఎవ్వరికీ తెలియడం లేదు. రెండేళ్ల క్రితం దర్శకుడు కథ చెప్పారు. చాలా బాగా నచ్చింది. అందరూ చెబుతుంటారు కదా? అని అనుకున్నాం కానీ తొమ్మిది నెలలు తిరిగాడు. ఇక అప్పుడు ఫిక్స్ సినిమా తీయాలని ఫిక్స్ అయ్యాను. అయితే చిన్న సినిమాను ఎలా తీయాలని నేను అనుకున్నాను. రాజ్ తరుణ్‌తో ఉయ్యాలా జంపాల సినిమా తీసినప్పుడు ఎంతో సంతృప్తి చెందాను. ఓ చిన్న సినిమాను తీశాం. ఎంతో మందిని తెరకు పరిచయం చేశా. అసిస్టెంట్ అవుదామని వచ్చిన రాజ్ తరుణ్ ఉయ్యాలా జంపాల సినిమాతో హీరో అయ్యాడు. అలానే ఈ సినిమా కూడా తీయాలని అనుకున్నాను. ఈ చిత్రం కోసం నేను ఏం చేయలేదు. అంతా శీనుయే చేశాడు. ఒక్క ఆర్టిస్ట్, టెక్నీషియన్‌తో నేను మాట్లాడలేదు. సినిమా అంతా అతనే భుజాన వేసుకున్నాడు. అందరూ దర్శకుడికి అండగా ఉన్నందుకు థ్యాంక్స్. రెండు గంటలు సినిమా చూసి అందరూ నవ్వుకునేలా ఉంటుంది. ఎంతో ముచ్చటగా ఉంటుంది. నవంబర్ 26న మా సినిమా రాబోతోంది.అందరూ తప్పక చూడండి’ అని అన్నారు.


డైరెక్టర్ శ్రీను గవిరెడ్డి మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ సూడియోస్, శ్రీ వెంకటేశ్వర ఎల్ఎల్‌పీ లాంటి పెద్ద బ్యానర్స్‌లో సినిమా చేయడంతో ఇప్పుడు నాకు దర్శకుడిగా అనుభవించు రాజా అని అనిపిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన టీజర్, పాటలను బట్టి సినిమా ఎలా ఉండబోతోందో అందరికీ అర్థమవుతుంది. కమర్షియల్, కామెడీ నేపథ్యంలో రాబోతోంది. ఓ భీమవరం కుర్రాడు.. వాడి లైఫ్‌లో జరిగే ఇన్సిడెంట్‌ల నేపథ్యంతో తెరకెక్కించాం. రాజ్ తరుణ్ బయట చాలా సైలెంట్‌గా ఉంటాడు.. కానీ తెరపై చాలా బాగా నటించాడు. ఈ సినిమాకు ప్రతీ ఒక్కరూ నాకెంతో సపోర్ట్ చేశారు ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్. కశిష్ ఖాన్ చాలా బాగా నటించింది. ఇంత వరకు ఆమెకు సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేయలేదు. అలా మీడియాకు ఒకేసారి చూపించాలని అనుకున్నాను.’ అని అన్నారు.


అజయ్ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణలో సినిమా చేయడం ఎప్పుడూ ఆనందమే. ఈ అవకాశం ఇచ్చిన సుప్రియ మేడంకు థ్యాంక్స్. నవంబర్ 26న మా సినిమా రాబోతోంది. కచ్చితంగా అందరూ ఎంటర్టైన్ అవుతారు’ అని అన్నారు.


హీరోయిన్ కశిష్ ఖాన్ మాట్లాడుతూ.. ‘ఇది నాకు మొదటి చిత్రం. ఈ అవకాశం ఇచ్చినందుకు సుప్రియ మేడం, డైరెక్టర్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమా ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాను. ఈ జర్నీ ఎంతో అద్భుతంగా ఉంది’ అని అన్నారు.


హీరో రాజ్ తరుణ్ మాట్లాడుతూ.. ‘అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఇది నా మూడో చిత్రం. అనుభవించు రాజా నవంబర్ 26న విడుదల కాబోతోంది. నాతో డ్యాన్సులు చేయించేందుకు కష్టపడ్డ విజయ్ మాస్టర్‌కు, ఫైట్లు చేయించేందుకు కష్టపడ్డ సతీష్ మాస్టర్‌కు అందరికీ థ్యాంక్స్. హీరోయిన్ కశిష్ ఖాన్ అద్భుతంగా సహకరించారు. కెమెరా వెనుక ఉన్నాడు కాబట్టి బతికిపోయాం. లేదంటే పెద్ద కమెడియన్ అయ్యేవాడు. సీనియర్ ఆర్టిస్ట్ అయినా కూడా మాతో ఎంతో కలిసిపోయాడు అజయ్. అందరికీ థ్యాంక్స్.  ఫ్యామిలీ అంతా కలిసి వచ్చి ఓ రెండు గంటలు నవ్వుకునేలా ఉంటుంది. మా చిత్రాన్ని దయచేసి థియేటర్లో చూడండి’ అని అన్నారు.


నటీనటులు: రాజ్ తరుణ్, కశిష్ ఖాన్, పోసాని కృష్ణమురళీ, ఆడుకాలమ్ నరేన్, అజయ్, సుదర్శన్, టెంపర్ వంశీ, ఆదర్శ్ బాలకృష్ణ, రవి కృష్ణ, భూపాల్ రాజు, అరియానా



సాంకేతిక బృందం

రచయిత, దర్శకత్వం : శ్రీను గవిరెడ్డి

నిర్మాత : సుప్రియ యార్లగడ్డ

బ్యానర్స్ : అన్నపూర్ణ స్టూడియోస్ ప్రై. లి., శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి

సంగీతం : గోపీ సుందర్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఆనంద్ రెడ్డి కర్నాటి

సినిమాటోగ్రఫర్ : నాగేష్ బానెల్

ఎడిటర్ : చోటా కే ప్రసాద్

లిరిక్స్ : భాస్కర భట్ల

ఆర్ట్ డైరెక్టర్ : సుప్రియ బట్టెపాటి,  రామ్ కుమర్

కొరియోగ్రఫర్ : విజయ్ బిన్నీ

ఫైట్ మాస్టర్ : రియల్ సతీష్

క్యాస్టూమ్ డిజైనర్ : రజినీ.పి

కో డైరెక్టర్ : సంగమిత్ర గడ్డం

పీఆర్వో : వంశీ-శేఖర్

Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s #RT70 Announced

 Ravi Teja, Sudheer Varma, Abhishek Nama’s #RT70 Announced



Mass Maharaja Ravi Teja has been hectic busy with three projects. Today, the actor’s 70th film has been announced. Creative director Sudheer Varma will be directing #RT70 to be produced in a grand manner by Abhishek Nama under Abhishek Pictures and RT Teamworks.


The poster reads the popular quote: “Heroes don’t exit”. The poster also sees statues of sages doing different acts, gods etc., and it tells a story. The announcement poster itself creates curiosity. The makers through the poster have also announced to reveal title and first look on November 5th at 10:08 AM.


Srikanth Vissa who’s associated with few exciting projects as writer has penned a powerful story for the movie. Known for his stylish and exceptional taking expertise, Sudheer Varma will be presenting Ravi Teja in a never seen before role in the movie.


#RT70 is billed to be an action thriller with a novel concept. Some prominent actors and noted craftsmen will be part of the project.


Cast: Ravi Teja


Technical Crew:

Director: Sudheer Varma

Producer: Abhishek Nama

Banner: Abhishek Pictures, RT Teamworks

Story: Srikanth Vissa

PRO: Vamsi-Shekar

Raja Vikramarka Producers Interview

 



కార్తికేయ కెరీర్‌లో 'రాజా విక్రమార్క' బిగ్గెస్ట్ హిట్ అవుతుంది! 

- సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత '88' రామారెడ్డి.  


సినిమా నిర్మించడానికి డబ్బు ఒక్కటే ఉంటే సరిపోదు. చక్కటి అభిరుచి కూడా ఉండాలి. 'రాజా విక్రమార్క' టీజర్ చూస్తే... సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత '88' రామారెడ్డి అభిరుచి తెలుస్తుంది. కార్తికేయ గుమ్మకొండ నటనతో కొత్త తరహా కమర్షియల్ సినిమాను నిర్మాతలు ప్రేక్షకులకు అందిస్తున్నారనేది అర్థమైందని, నిర్మాణ విలువలు ఉన్నత స్థాయిలో ఉన్నాయని పలువురు ప్రేక్షకులు ప్రశంసించారు. 


కార్తికేయ గుమ్మకొండ హీరోగా శ్రీ సరిపల్లిని దర్శకుడిగా పరిచయం చేస్తూ... ఆదిరెడ్డి .టి సమర్పణలో '88' రామారెడ్డి నిర్మించిన సినిమా 'రాజా విక్రమార్క'. ఈ నెల 12న సినిమా విడుదల కానుంది. దీపావళి కానుకగా సోమవారం సినిమా ట్రైలర్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు ఆదిరెడ్డి .టి, నిర్మాత '88' రామారెడ్డితో ఇంటర్వ్యూ.....  


ప్రశ్న: హాయ్ ఆదిరెడ్డి గారు, రామారెడ్డిగారు... ముందు మీ గురించి చెప్పండి!


ఆదిరెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని రాయవరం మండలంలో గల వెదురుపాక గ్రామం. ప్రముఖ సంగీత దర్శకులు దేవిశ్రీ ప్రసాద్ గారిది మా ఊరే.  డిగ్రీ వరకూ మా ఊరిలో చదువుకున్నాను. తర్వాత వ్యాపారం నిమిత్తం విజయనగరం జిల్లా వెళ్లాను.  

'88' రామారెడ్డి: మాది తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు మండలంలో గల కొంకుదురు గ్రామం.  ఎస్వీ కృష్ణారెడ్డిగారు మా ఊరివాసులే. 


ప్రశ్న: ఇద్దరిదీ తూర్పు గోదావరి జిల్లా. ముందునుంచి పరిచయం ఉందా? సినిమాల్లోకి వచ్చాక కలిశారా?

ఆదిరెడ్డి: వ్యాపారంలో మేమిద్దరం స్నేహితులం. మా గ్రామాలు కూడా పక్కన పక్కనే. సినిమాల్లోకి రాకముందు నుంచి స్నేహం ఉంది. 

'88' రామారెడ్డి: ముందు వ్యాపారంలో కలిశాం. ఆ తర్వాత మా మధ్య దూరపు చుట్టరికం కూడా ఉందని తెలిసింది. పదేళ్లకుగా పైగా మా బంధం కొనసాగుతోంది. 


ప్రశ్న: వ్యాపారం వేరు... సినిమా నిర్మాణం వేరు. అభిరుచులు కూడా కలవాలి కదా!

ఆదిరెడ్డి, '88' రామారెడ్డి: ఇద్దరి అభిరుచులు ఒక్కటే. అందుకని, సినిమా చేశాం. మా ఇద్దరికీ ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవిగారు. మా ఇద్దరికీ నిర్మాతల్లో డాక్టర్ రామానాయుడుగారు ఆదర్శం. 


ప్రశ్న: ఈ సినిమా ఎలా మొదలైంది?

'88' రామారెడ్డి: వినోద్ రెడ్డిగారు అని మా ఊరిలో ఓ డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. 200ల సినిమాల వరకూ డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఆయన ద్వారా ఈ కథ నా దగ్గరకు వచ్చింది. మా ఆదిరెడ్డిగారికి చెప్పాను. ఇద్దరికీ నచ్చడంతో సినిమా ప్రారంభించాం. నిర్మాతగా 'రాజా విక్రమార్క' నా తొలి సినిమా. మా ఆదిరెడ్డిగారు ఇంతకు ముందు కొన్ని సినిమాలు డిస్ట్రిబ్యూషన్ చేశారు. ఓ సినిమా విడుదల చేసిన అనుభవం ఉంది. 


ప్రశ్న: ఆదిరెడ్డిగారు... ఇంతకు ముందు ఏయే సినిమాలు చేశారు?

ఆదిరెడ్డి: ఉత్తరాంధ్రలో 'బాద్ షా', 'గబ్బర్ సింగ్', 'గ్యాంబ్లర్' తదితర సినిమాలు చేశా. పంపిణీదారుడిగా శ్రీకాంత్ గారు నటించిన 'రంగా... ది దొంగ' నా తొలి సినిమా. ఆ తర్వాత ధనుష్, కీర్తీ సురేష్ జంటగా నటించిన 'రైల్' సినిమా తెలుగు హక్కులు తీసుకున్నాను. తెలంగాణ, ఆంధ్రాలో రిలీజ్ చేశా. నిర్మాతగా నా తొలి చిత్రమది. 'రాజా విక్రమార్క'... నిర్మాతగా నా రెండో సినిమా. ఆల్రెడీ గతంలో సినిమాలు చేసిన అనుభవం ఉండటంతో మంచి సినిమా చేయాలని కొంత విరామం తీసుకున్నాను. 

 


ప్రశ్న: ఫస్ట్ లుక్, టీజర్ విడుదలైన తర్వాత ఎటువంటి స్పందన లభించింది?

'88' రామారెడ్డి: టీజర్ విడుదల చేసినప్పుడు రెండు మూడు మిలియన్ వ్యూస్ వస్తాయని అనుకున్నాం. కానీ, ఫైవ్ మిలియన్ వ్యూస్ క్రాస్ చేసింది. వ్యూస్ పక్కన పెడితే... టీజర్ చాలా స్టయిలిష్, రిచ్ గా ఉందని చెబుతున్నారు. హాలీవుడ్ స్టయిల్ లో ఉందని కొందరు ఫోనులు చేయడం సంతోషంగా ఉంది. మా దర్శకుడు  శ్రీ సరిపల్లి హాలీవుడ్  సినిమాలకు వర్క్ చేశాడు. ఆ అనుభవంతో మన తెలుగు ప్రేక్షకుల అభిరుచిని దృష్టిలో పెట్టుకుని సినిమా చేశాడు. 

ఆదిరెడ్డి: మా సినిమా ఫస్ట్ లుక్ విడుదల చేయకముందు నుండి మంచి బజ్ నెలకొంది. హిందీ రైట్స్ ను 3.25 కోట్లకు కొనుగోలు చేశారు. తమిళ ప్రేక్షకుల నుండి ఫస్ట్ లుక్, టీజర్ కు అద్భుత స్పందన లభిస్తోంది. టీజర్ విడుదలైన తర్వాత టాప్ క్లాస్ అని చెబుతున్నారంతా. 


ప్రశ్న: ట్రైలర్ ఎలా ఉండబోతుంది?

ఆదిరెడ్డి, '88' రామారెడ్డి: ట్రైలర్ మాత్రమే కాదు... సినిమా కూడా ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్టు ఉంటుంది. న్యూ ఏజ్ స్టయిలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. హీరో కార్తికేయ ఎన్ఐఏ అధికారిగా కనిపిస్తారు. సినిమాలో వినోదం, ప్రేమ కూడా ఉంటాయి. 


ప్రశ్న: కార్తికేయ గురించి...

ఆదిరెడ్డి, '88' రామారెడ్డి: హీరోగా వందకు రెండొందల శాతం కష్టపడతారు. వ్యక్తిగా అయితే... ఆయన గురించి మాటల్లో చెప్పలేం. అంత మంచి మనిషి. కరోనా రెండు దశలను దాటుకుని మా సినిమా ఇంత బాగా వచ్చిందంటే దానికి కారణం కార్తికేయ. మాకు ఎంతో సపోర్ట్ ఇచ్చారు.


ప్రశ్న: కార్తికేయ సినిమాల్లో మీకు నచ్చినది?

'88' రామారెడ్డి: ఆయన చేసిన ప్రతి సినిమా నాకు ఇష్టమే. అన్నిటి కంటే 'గ్యాంగ్ లీడర్' చాలా ఇష్టం. అందులో ఆయన నటన చాలా చాలా బావుంటుంది. అంతకు మించి మా 'రాజా విక్రమార్క'లో నటించారు. కార్తికేయ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు... ఈ సినిమా మరో ఎత్తు. సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటారు. 

ఆదిరెడ్డి: రామారెడ్డిగారు చెప్పినట్టు... సినిమా విడుదలైన తర్వాత కార్తికేయ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడతారు. అంతబాగా నటించారు. ఇక, కార్తికేయగారి సినిమాల్లో 'ఆర్ఎక్స్ 100' ఇష్టం. '90ఎంఎల్' కూడా నచ్చింది. 'గుణ 369' అయితే నాతో పాటు మా కుటుంబ సభ్యులు అందరికీ ఇష్టం. 


ప్రశ్న: కరోనా కాలంలో ఓటీటీలో విడుదల చేయాలనుకున్నారా? ఇప్పుడు థియేటర్లలో విడుదల పరంగా చేయాలని  ఏమైనా?

ఆదిరెడ్డి: థియేట్రికల్ అనుభూతి ఇవ్వడం కోసం తీసిన చిత్రమిది. అందుకని, ఓటీటీలో విడుదల చేయాలని ఎప్పుడూ అనుకోలేదు. థియేటర్లలో విడుదల పరంగా మాకు ఇబ్బందులు ఏమీ లేవు. ఆంధ్రాలో కొన్ని ఏరియాలు అమ్మేశాం. కొన్ని ఏరియాలు మా దగ్గరే ఉన్నాయి. వాటికి కూడా మంచి ఆఫర్లు వస్తున్నాయి.

'88' రామారెడ్డి: సినిమా మీద మాకు ఎంత కాన్ఫిడెన్స్ ఉందంటే... నైజాం ఏరియాలో సొంతంగా మేమే విడుదల చేస్తున్నాం. కార్తికేయ కెరీర్ లో ఈ సినిమా బిగ్గెస్ట్ హిట్ అవుతుంది.  


రామారెడ్డిగారి పేరు ముందు '88' అని ఉంటుంది. ఎందుకు? అని అడిగితే... నాలుగు సినిమాల తర్వాత చెబుతానని అన్నారు. అదేంటో మీకు తెలుసా?

ఆదిరెడ్డి: నాలుగు సినిమాల తర్వాత చెప్పరేమో (నవ్వులు). ఆయన కొన్ని విషయాలు సీక్రెట్ గా ఉంచుతారు. 


ప్రశ్న: 'రాజా విక్రమార్క' తర్వాత మీరు చేయబోయే సినిమా?

రామారెడ్డి: రెండు బౌండ్ స్క్రిప్ట్స్ కూడా రెడీగా ఉన్నాయి. త్వరలో వివరాలు వెల్లడిస్తాం. 

ఆదిరెడ్డి: అన్నీ కుదిరితే... 'రాజా విక్రమార్క' సక్సెస్ మీట్ లో కొత్త సినిమా ప్రకటిస్తాం. 



GA2 Pictures New Movie Launched

 అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చర్స్ బ్యానర్ లో బ‌న్నీవాసు, విద్య మాధురి నిర్మాత‌లుగా కరుణ కుమార్ దర్శకుడిగా నూత‌న‌ చిత్రం ప్రారంభం.. 



మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ 2 పిక్చ‌ర్స్ బ్యానర్ లో బన్నీ వాసు, విద్య మాధురి నిర్మాతలుగా నూత‌న చిత్రం ప్రారంభమైంది. వ‌రుస స‌క్సెస్ ఫుల్ సినిమాల‌తో తాజాగా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకొని విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను నిర్మిస్తున్న సినీ నిర్మాణ సంస్థ‌గా ఇమేజ్ అందుకున్న జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ నుంచి ప్రొడ‌క్ష‌న్ 7గా ఈ నూత‌న చిత్రం రాబోతుంది.  పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో ప్రేక్ష‌కాధ‌‌ర‌ణ అందుకున్న ద‌ర్శ‌కుడు క‌ర‌ణ్ కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్ర‌ముఖ హీరోయిన్ అంజ‌లి, ప్ర‌ముఖ న‌ట‌లు రావు ర‌మేశ్, ప్రియ‌ద‌ర్శీ ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైర‌క్ట‌ర్ మెలోడీ బ్ర‌హ్మా మ‌ణిశ‌ర్మ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఫిల్మ్ న‌గ‌ర్ దైవ స‌న్నిధానంలో పూజా కార్య‌క్ర‌మాల‌తో ఈ సినిమా మొద‌లైంది, అల్లు అన్విత క్లాప్ ఇచ్చి ఈ సినిమాను ప్రారంభించారు, అల్లు అరవింద్ గారు కెమెరా స్విచ్ఛ్ ఆన్ చేశారు. ఈ సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు చిత్ర యూనిట్.


నటీనటులు: 



ప్రియదర్శి, అంజలి, రావు రమేష్..


టెక్నికల్ టీమ్: 


దర్శకుడు: కరుణ కుమార్

సమర్పణ: అల్లు అరవింద్

బ్యానర్: GA 2 పిక్చర్స్

నిర్మాతలు: బన్నీ వాస్, విద్య మాధురి

సంగీతం: మణిశర్మ

స‌హ‌నిర్మాత: బాబు

ఎడిటర్: నవీన్ నూలి

సినిమాటోగ్రఫర్: అరుల్ విన్సెంట్

ఆర్ట్ డైరెక్టర్: ఆశిష్ తేజ్

పీఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Virgin Story Movie Teaser Release

"వర్జిన్ స్టోరి" సినిమా యువతరానికి నచ్చుతుంది - టీజర్ విడుదల

కార్యక్రమంలో దర్శకుడు శేఖర్ కమ్ముల




నిర్మాత లగడపాటి శిరీష శ్రీధర్ తనయుడు విక్రమ్ హీరోగా నటిస్తున్న సినిమా

వర్జిన్ స్టోరి. గతంలో రుద్రమదేవి, రేసు గుర్రం, నా పేరు సూర్య నా ఇల్లు

ఇండియా వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి పేరు తెచ్చుకున్నారు విక్రమ్.

ప్రస్తుతం ఆయన దిల్ రాజు నిర్మిస్తున్న రౌడీ బాయ్స్ లో కీరోల్ ప్లే

చేస్తున్నారు. విక్రమ్ హీరోగా చేస్తున్న డెబ్యూ మూవీ వర్జిన్ స్టోరి.

కొత్తగా రెక్కలొచ్చెనా..అనేది క్యాప్షన్. రామలక్ష్మి సినీ క్రియేషన్స్

పతాకంపై లగడపాటి శిరీష శ్రీధర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రదీప్

బి అట్లూరి వర్జిన్ స్టోరి చిత్రంతో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం

అవుతున్నారు. హీరో విక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ విడుదల

కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. స్టార్ డైరెక్టర్

శేఖర్ కమ్ముల ఈ కార్యక్రమంలో  అతిథిగా పాల్గొని టీజర్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా నిర్మాత లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ...


లగడపాటి శ్రీధర్ మాట్లాడుతూ.. నాకు దర్శకుడు శేఖర్ కమ్ముల అంటే చాలా

ఇష్టం. ఆయన హ్యాపీడేస్ చిత్రాన్ని నేనే ప్రొడ్యూస్ చేయాల్సింది.

కుదరలేదు. గోదావరి సినిమా చూశాక శేఖర్  గారికి సన్మాన సభ పెట్టి

సత్కరించాను. ఇవాళ మా అబ్బాయి మూవీ వర్జిన్ స్టోరి టీజర్ రిలీజ్ కు ఆయన

రావడం సంతోషంగా ఉంది. వర్జిన్ స్టోరి ఒక నావెల్ స్టోరి. టీ20 సినిమా అని

చెప్పొచ్చు. అంటే టీనేజ్ ప్రేక్షకుల నుంచి 20 ఇయర్స్ వరకు ఆడియెన్స్ కు

బాగా కనెక్ట్ అయ్యే చిత్రమిది. ఇవాళ్టి యువత నిజమైన ప్రేమ కోసం

వెతుకుతున్నారు. ఒక అమ్మాయి మంచి అబ్బాయి కోసం, అబ్బాయి మంచి అమ్మాయి

కోసం, వాళ్ల స్నేహం,  ప్రేమను కోరుకుంటున్నారు. అలాంటి వాళ్లందరి మనసులకు

అద్దం పట్టే సినిమా అవుతుంది. యువత మనోభావాలను చూపించే అంశాలన్నింటినీ

వర్జిన్ స్టోరి చిత్రంలో చక్కగా చూపించారు  దర్శకుడు ప్రదీప్. త్వరలోనే

థియేటర్ లలో మా చిత్రాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. అన్నారు.


లగడపాటి శిరీష శ్రీధర్ మాట్లాడుతూ...నిజమైన ప్రేమ దక్కాలంటే వేచి చూడాలి.

ఆ సహనం ఉన్న వాళ్లకే అది దక్కుతుందని చెప్పే చిత్రం వర్జిన్ స్టోరి.

ఇందులో ఎక్కడా సందేశాలు ఉండవు, చూస్తున్నంతసేపు కంప్లీట్ గా ఎంజాయ్ చేసే

సినిమా ఇది. మా అబ్బాయి హీరోగా అరంగేట్రం చేస్తుండటం సంతోషంగా ఉంది. ఒక

యూనిక్ కాన్సెప్ట్ మూవీ ఇది. లైఫ్ లో మన చుట్టూ, మనకు తెలిసిన సందర్భాలు

ఈ సినిమాలో మీకు కనిపిస్తాయి. థియేటర్లకు వచ్చి మా సినిమాను చూసి బ్లెస్

చేయండి. అన్నారు.



దర్శకుడు ప్రదీప్ బి అట్లూరి మాట్లాడుతూ..దర్శకుడు శేఖర్ కమ్ముల గారి

సినిమాలు చూసి ఇన్ స్పైర్ అవుతుంటాను. వర్జిన్ స్టోరి సినిమాను నా

జీవితంలో జరిగిన ఓ వాస్తవ ఘటన ఆధారంగా రూపొందించాను. విక్రమ్ లాంటి

ప్యాషన్ ఉన్న హీరో నా ఫస్ట్ సినిమాకు దొరకడం అదృష్టం. ప్రతి సీన్ కు సాధన

చేసేవాడు. తన పూర్తి ప్రయత్నంతో నటించేవాడు. విక్రమ్ కు హీరోగా మంచి పేరు

వస్తుంది. అన్నారు.



నటుడు చైతన్య కృష్ణ మాట్లాడుతూ...వర్జిన్ స్టోరి ఒక యూత్ ఫుల్ లవ్

స్టోరి. మీ లైఫ్ ఇందులో చూసుకుంటారు. విక్రమ్ కు ఆల్ ద బెస్ట్

చెబుతున్నా. నిర్మాత శ్రీధర్ గారికి సినిమాలంటే ప్రాణం. ఆయన మంచి కథలు,

కాన్సెప్ట్ లను వదులుకోరు. వర్జిన్ స్టోరి ఆయన నమ్మకాన్ని నిలబెడుతుంది.

అన్నారు.



దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ...శ్రీధర్ గారు నాకు చాలా కాలంగా

స్నేహితులు. ప్యాషనేట్ ప్రొడ్యూసర్. ఆయనకు సినిమాలంటే ఇష్టం. నేనే కాదు

ఎవరు మంచి సినిమా చేసినా ఫోన్ చేసి అభినందిస్తుంటారు. ఫిల్మ్ స్కూల్ లో

చదివిన వాళ్లు బయటకొచ్చి యంగ్ టాలెంట్  తో సినిమాలు చేస్తుంటారు. నేనూ

అలాగే చేశాను. ఇప్పుడు ప్రదీప్ కూడా కొత్తవాళ్లతో తన తొలి సినిమా

చేస్తున్నారు. వర్జిన్ స్టోరి టీజర్, పాటలు చూశాను. చాలా బాగున్నాయి.

విక్రమ్  చక్కగా నటించాడు. యూత్ ఆడియెన్స్ కు వర్జిన్ స్టోరి సినిమా

నచ్చుతుందని నమ్ముతున్నాను. సినిమా టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్. అన్నారు.



విక్రమ్, సౌమిక, పాండియన్, రిషిక ఖన్నా, వినీత్ బవిశెట్టి తదితరులు ఇతర

పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం - అచు రాజమణి, సినిమాటోగ్రఫీ -

అనీష్ తరుణ్ కుమార్, ఎడిటర్ - గ్యారీ, సాహిత్యం - భాస్కర భట్ల, అనంత్

శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రాఘవేంద్ర, నిర్మాతలు - లగడపాటి

శిరీష్, శ్రీధర్, రచన దర్శకత్వం - ప్రదీప్ బి అట్లూరి.


Heroine Mehreen Interview About Manchi Rojulu Vachayi

 హీరోయిన్ మెహరీన్ ఇంటర్వ్యూ



సంతోష్ శోభన్, హీరోయిన్ మెహ్రీన్ జంటగా మహానుభావుడు లాంటి సూపర్ హిట్ సినిమా తర్వాత మారుతి కాంబినేషన్‌లో వస్తున్న  సినిమా“మంచి రోజులు వచ్చాయి”. టాక్సీవాలా తర్వాత ఎస్ కే ఎన్ నిర్మాణంలో వస్తున్న సినిమా ఇది. మారుతి, యూవీ, SKN అంటే సూపర్ హిట్ కాంబినేషన్. ఈ కాంబోలో ఇప్పుడు వస్తున్న ఈ  సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని విడుదల కు సిద్ధమైన సందర్భంగా హీరోయిన్ మెహ్రీన్  మీడియాతో మాట్లాడారు



యువి క్రియేషన్స్, యస్.కె.యన్, మారుతీ గార్ల మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఇది చాలా మంచి సబ్జెక్టు మారుతి గారు కాన్సెప్ట్  చాలా బాగుంటాయి .నా లైఫ్ లో  కనెక్ట్ అయిన ఫస్ట్ మూవీ ఇది.ఇంత మంచి టీం తో  చాలా ఎంజాయ్ చేస్తూ..వర్క్ చేయడం జరిగింది. ఈ సినిమాలో  పద్దు క్యారెక్టర్ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పాత్ర చేస్తున్నాను.ఈ సినిమాన మారుతి గారు స్టైల్ లో ఫుల్ ఎంటర్టైనర్ జోనర్లో ఉంటుంది.


ఇది ఒక కాలనీలో జరిగే కథ ఇది.ఇలాంటి కథలు ప్రతి ఇంట్లో జరుగుతుంటాయి.అలాంటి స్టోరీని కథగా తీసుకొని ఎంటర్టైన్మెంట్ రూపకంగా ప్రేక్షకులకు చూపించడం జరుగుతుంది.ఈ సినిమాలో మేము చూయించిన సీన్స్, స్విచ్వేషన్స్ కోవిడ్ టైం లో చాలా మందికి జరిగాయి. .


నేను చేసిన F2, F3 సినిమాలలో చేసిన పాత్రలకంటే ఇందులో నేను చేస్తున్న పాత్ర డిఫరెంట్. నేను నార్మల్గానే చాలా ఫన్నీగా ఉంటాను. అందువల్ల నేను చేసే క్యారెక్టర్స్ లలో అల్లరి అయినా, కామెడీ అయినా చేయడం నాకు చాలా ఈజీ అనిపిస్తుంది.ఇందులో కూడా నా క్యారెక్టర్ మంచి ఎమోషన్స్ తో ఫుల్ అండ్ ఎంటర్టైన్మెంట్స్ ప్యాకేజ్డ్ గా  ఉంటుంది.


సంతోష్ నటన పరంగా చాలా బాగా పెర్ఫార్మన్స్  చేశాడు. అజయ్ ఘోష్ గారు ఫాదర్ గా నటిస్తుండగా విలన్ క్యారెక్టర్ లో అజయ్ గారు ఇలా అందరూ కూడా చాలా  బాగా పెర్ఫార్మ్ చేశారు.క్యారెక్టర్ పరంగా నాకే డౌట్ ఉన్న మారుతి గారి దగ్గరికెళ్లి  సలహాలు తీసుకున్నాను. అందువల్ల నేను చాలా ఈజీ చేయగలిగేదాన్ని



కథ మీద నమ్మకంతో  యు.వి.క్రియేషన్స్ మారుతి గారి మీద నమ్మకంతో ఈ కథ కూడా వినకుండా ఈ సినిమా చేయడానికి ఒప్పుకున్నాను. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ లాంటి సినిమా తర్వాత ఇందులో నాకు ఇది మంచి రోల్ ఇచ్చారు. నేను చేసే ప్రతి సినిమా చిన్న సినిమా పెద్ద సినిమా అంటూ ఏమీ ఉండదు నాకు అవకాశం వచ్చిన సినిమాలన్నీ పెద్ద సినిమాలుగానే భావిస్తాను.



కోవిడ్ టైంలో కూడా కోవిడ్ ప్రికాషన్స్ పాటిస్తూ మేము సినిమా షూట్ చేయడం జరిగింది. అలాగే

కోవిడ్ కారణంగా చాలా మంది హెల్త్ పరంగా చాలా ఇబ్బంది పడ్డారు. అందులో నేను కూడా వున్నాను.నాకు మా మదర్ కి కోవిడ్ వచ్చింది. వన్ మంత్ తర్వాత మేము రికవరీ అయ్యాము. ఈ సినిమా కోసం మేమంతా కష్టపడి చేశాము సినిమా బాగా వచ్చింది.నా గురించి సోషల్ మీడియా లో వచ్చే కామెంట్స్ ను పాజిటివ్ అయినా నెగటివ్ అయినా  ఈక్వల్ గా తీసుకుంటాను.


మహానటి లో చేసిన కీర్తి సురేష్ క్యారెక్టర్ ,ఓ బేబీ సినిమాలో సమంత చేసిన క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం.ఇలాంటి క్యారెక్టర్స్ వస్తే నాకు చేయాలని ఉంది. కన్నడలో శివరాజ్ గారితో ఒక సినిమా చేస్తున్నాను.ఆ సినిమా అయిన తర్వాత వేరే సినిమాలు ఉన్నాయి. తెలుగులో కూడా కొన్ని స్టోరీస్ వింటున్నాను. వాటిని డిసెంబర్ నుంచి స్టార్ట్ చేస్తాను వాటి వివరాలు త్వరలో తెలియజేస్తాను అని అన్నారు.


Eakam Movie Review

 Eakam Movie Review 

 Eakam Movie Review

check out the review of Eakam movie Presented by Boyapati Raghu
Produced by Sanskriti Productions and Dreams Entertainments.

Story


This movie Revolves  Around Five characters Anand (Abhiram) Tanikella Bharani (Appayya Panthulu) Aditi Michael (Divya) Kalpika Ganesh (Nitya) Dayanand Reddy (David) Bigg Boss 5 Frame Shweta Verma (Nirvana) This Five Persons has five different Stories How this Five Persons Comes together Forms the main story 

Anand, who lost his family at an early age, wanders in search of something in this world as a result he comes away from his lover and become Jobless .Divya Lost her Father and Her Dream is to Run a Coffee shop Appayya Panthulu perform Pooja and Stay in Grave Yard David Joins In Coffee shop as Employee. Nirvana wants to Stay with Her Boy Friend
What is connection Between these Five Persons Why Anand Behaves in Different way ? What Exactly Appayya Panthulu do ?what was the reason for David to work in the Divya Coffee Shop?whether Nithya Anand finally met or not Forms the Rest of the story

 

Plus points:

Story

Characters

Music

Direction

Screen play

Minus points:

Slow pace Narration 


Even though Major Actors are New they has  Given their best Tanikella Bharani (Appayya Panthulu) has done perfect Justification  Aberaam  Verma role is good he has given his best his combination scenes with Tanikella Bharani came out very well 

Dayanand Reddy played villain role which came out very well 

 Aditi Michael (Divya) Kalpika Ganesh (Nitya) justified their roles 

Shweta Verma (Nirvana) and rest of the cast has given their best 

Technical Aspects 

At first we must appreciate producers For their production values  even though its a small film quality wise its good and also we appreciate team Eakam for Grabbing International Awards for this film . Jose Franklin Has given good songs and Ultimate background score which has taken the movie to Next level  Iqbal Azmi Cinematography is very good he show  cased Each and every Frame very well srinivas thota Editing is good He tried his best to give perfect Cut Now coming to Director B Varun Vamsi  he has taken new kind of story and his Narration is good perfect Engaging to audience 

His dialogues are good if the more has more Racy screenplay then the movie is going to be much Better  Rest of the Crew and  Departments given their Best 


Verdict 

On whole Eakam is a Decent Attempt  Give a Try this weekend 


Telugucinemas.in Rating 3.25 








Icon Star Allu Arjun Launched Pushpaka Vimanam Trailer

 "పుష్పక విమానం" ట్రైలర్ నాకు బాగా నచ్చింది, సినిమా ష్యూర్ హిట్ అవుతుంది - 'ఐకాన్ స్టార్' అల్లు అర్జున్




యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ నటించిన కొత్త చిత్రం "పుష్పక విమానం". గీత్ సైని, శాన్వి మేఘన నాయికలుగా నటించారు. నూతన దర్శకుడు దామోదర ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. స్టార్ హీరో విజయ్ దేవరకొండ సమర్పిస్తున్న ఈ మూవీ ని 'కింగ్ అఫ్ ది హిల్' ఎంటర్ టైన్మెంట్స్ మరియు టాంగా ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించాయి. గోవర్ధన్ రావు దేవరకొండ,విజయ్ మట్టపల్లి ,ప్రదీప్ ఎర్రబెల్లి లు నిర్మాతలుగా  వ్యవహరించారు. నవంబర్ 12న థియేటర్ లలో రిలీజ్ కు రెడీ అవుతున్న "పుష్పక విమానం" చిత్ర ప్రచార కార్యక్రమాలు ఊపందుకున్నాయి. తాజాగా హైదరాబాద్ లోని ఓ హోటల్లో "పుష్పక విమానం" సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం ఘనంగా జరిగింది. ట్రైలర్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విడుదల చేసి చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఈ సందర్భంగా 


*నటుడు కిరీటి మాట్లాడుతూ*...పుష్పక విమానం అంటే ఎంత మంది ఎక్కి కూర్చున్నా, మరొకరికి స్థానం ఉంటుంది. అలా ఈ సినిమా ప్రొడక్షన్ లోనూ ఎంతమంది టాలెంటెడ్ ఆర్టిస్టులు ఉన్నా, ఇంకొకరికి అవకాశం ఉంటుంది. "పుష్పక విమానం" చిత్రంలో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం ఇచ్చినందుకు ఆనంద్ దేవరకొండకు థాంక్స్. అలాగే విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ లాంటి ఇద్దరు బంగారు కొండలను ఇండస్ట్రీకి ఇచ్చిన వాళ్ల నాన్నగారికి థాంక్స్. అన్నారు.


*నటుడు గిరిధర్ మాట్లాడుతూ*...నాకు ఈ చిత్రంలో నేను చేసిన క్యారెక్టర్ ను కంప్లీట్ గా ఎంజాయ్ చేశాను. ఆనంద్ దేవరకొండ, నరేష్, హర్షవర్థన్ కాంబినేషన్ లో నేను చేసిన సీన్స్ ఆడియెన్స్ కు బాగా నచ్చుతాయి. "పుష్పక విమానం"  కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.


నటుడు అభిజీత్ మాట్లాడుతూ..ఆనంద్ దేవరకొండ నటుడిగా ఇప్పటికే ప్రూవ్  చేసుకున్నారు. ఆయనకు తన కెరీర్ మీద ఎంత ప్యాషన్ ఉందో చూస్తున్నాం. ఈ  "పుష్పక విమానం" చిత్రంతో ఆనంద్ లోని కామిక్ టైమింగ్, యాక్టింగ్ టాలెంట్ మరింతగా ప్రేక్షకులకు తెలుస్తాయి. ఈ చిత్రంలో నేను ఓ మంచి క్యారెక్టర్ చేశాను. అది ట్రైలర్ లో చిన్న గ్లింప్స్ లా వేశారు. మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అన్నారు.


*కొరియోగ్రాఫర్ ఆట సందీప్ మాట్లాడుతూ*...ఒక కొరియోగ్రాఫర్ గా చాలా ఆడియో ఫంక్షన్స్ లో స్జేజి పర్మార్మెన్స్ లు చేశాను. విజయ్ దేవరకొండ ఫస్ట్ ఫిల్మ్ ఆడియో విడుదల కార్యక్రమానికి కూడా నేను ఫర్మార్మ్ చేశాను. అప్పుడు విజయ్ చెప్పేవారు, సందీప్ నువ్వు మంచి కొరియోగ్రాఫర్ అవుతావు అని. ఇవాళ వాళ్ల ప్రొడక్షన్ లో వస్తున్న చిత్రంలో నేను కొరియోగ్రాఫర్ గా పనిచేయడం చాలా సంతోషంగా ఉంది. స్వామి రారా అనే పాట మనం ఎప్పటినుంచో వింటున్నాం. ఈ చిత్రంలో స్వామి రారా పాట కొత్తగా ఉంటుంది. ఆ పాటకు శాన్వి మేఘనా నెక్ట్ లెవెల్ డాన్సులు చేసింది. అని అన్నారు.


*గీత రచయిత ఫణికుమార్ రాఘవ్ మాట్లాడుతూ*...ఈ చిత్రంలో అహ అని సాగే పాటను రాశాను. ఆ పాటలో ఆనంద్ దేవరకొండ క్యారెక్టర్ పటే పాట్లు, చేసే అల్లరి తెలుస్తాయి. ఈ పాట ఎంత క్రేజీగా ఉంటుందో సినిమా అంతకన్నా ఆసక్తికరంగా ఉంటుంది. "పుష్పక విమానం" మూవీలో పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది. అన్నారు.


*నిర్మాత విజయ్ మట్టపల్లి మాట్లాడుతూ*...మా పుష్పక విమానం సినిమాను సపోర్ట్ చేసేందుకు వచ్చిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారికి థాంక్స్. గోవర్థన్ రావు దేవరకొండ గారు లేకుంటే ఈ పుష్పక విమానం సినిమా లేదు, మా టాంగా ప్రొడక్షన్ లేదు, ఇ‌వాళ నేను ఈ స్టేజి మీద నిర్మాతగా నిల్చునే వాడిని కాదు. ఆయన నాకు గురువు, తండ్రి లాంటి వారు. లైఫ్ లో ఎదగాలంటే ఎలా ఉండాలో విజయ్ కు చెప్పినట్లే నాకూ చెప్పేవారు. అలా 15 ఏళ్లుగా గోవర్థన్ గారితో పరిచయం ఉంది. పుష్పక విమానం సినిమా మంచి కాన్సెప్ట్ తో చేశాం. ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుంది. నవంబర్ 12న థియేటర్ లలో చూడండి. అన్నారు.


*దర్శకుడు దామోదర మాట్లాడుతూ*...మా సినిమా ట్రైలర్ రిలీజ్ వేడుకకు వచ్చిన అల్లు అర్జున్ గారికి ఆయన ఫ్యాన్స్ కు, మా రౌడీ స్టార్ విజయ్ కు, ఆయన ఫ్యాన్స్ కు థాంక్స్.  ఏ ఇంట్లో అయినా పెళ్లి వేడుకకు ముందు కార్డు మనకు చాలా ఇష్టమైన వారికి ఇస్తారు, లేదా దేవుడి దగ్గర పెడతారు. అలా పుష్పక విమానం సినిమా ఫస్ట్ కార్డు అల్లు అర్జున్ గారికి ఇచ్చాం. ఆయన ట్రైలర్ రిలీజ్ చేస్తున్నారని తెలిసి, సోషల్ మీడియాలో ఆయన ఫ్యాన్స్ ఎంతోమంది ఆల్ ద బెస్ట్ చెప్పారు. ఒక మంచి సినిమాను సపోర్ట్ చేయడం అల్లు అర్జున్ గారి మంచితనానికి నిదర్శనం. ఒక దర్శకుడిగా కథ బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. పుష్పక విమానం సినిమా ఒక కామెడీ థ్రిల్లర్. ఈ చిత్రంలో చిట్టిలంక సుందర్ అనే క్యారెక్టర్  లో ఆనంద్ దేవరకొండ నవ్విస్తాడు ఏడిపిస్తాడు. అల్లు అర్జున్ కు ఆర్య, విజయ్ దేవరకొండకు అర్జున్ రెడ్డిలా ఆనంద్ యాక్టింగ్ టాలెంట్ ను సుందర్ క్యారెక్టర్ చూపిస్తుంది. విజయ్ నిర్మాతగా పూర్తి స్వేచ్ఛను ఇచ్చి చేయించారు. గోవర్థన్ గారి వల్లే నేను ఈ సినిమాకు దర్శకత్వం చేయగలిగాను. ఒకే రోజు సినిమా చేశారా అన్నంత కంటిన్యుటీతో సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంది. మీ టైమ్ మా సినిమాకు ఇవ్వండి, మీకు ఎంటర్ టైన్ మెంట్ గ్యారంటీ.  అన్నారు.


*నాయిక గీత్ సైని మాట్లాడుతూ*...డాన్స్ వచ్చు కాబట్టి సినిమాల్లోకి వచ్చానని అల్లు అర్జున్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. నేను కూడా ఆయనలాగే. నాకూ డాన్స్ అంటే చాలా ఇష్టం. డాన్స్ కోసం సినిమా కెరీర్ ఎంచుకున్నాను. పుష్పక  విమానం ట్రైలర్ కు మీరు ఇస్తున్న రెస్పాన్స్ కు సంతోషంగా ఉంది. సినిమా చూస్తే ఇంతకంటే పదిరెట్లు ఎంటర్ టైన్ అవుతారు. నవంబర్ 12న మీ దగ్గర్లోని థియేటర్ లలో పుష్పక విమానం ల్యాండ్ అవుతుంది తప్పకుండా చూడండి. అన్నారు.


*నాయిక శాన్వి మేఘనా మాట్లాడుతూ*...ఇక్కడున్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికంటే నేనే ఆయనకు పెద్ద అభిమానిని అని చెప్పగలను. ఆయనంటే అంత ఇష్టం. మా సినిమా ట్రైలర్ రిలీజ్ కు అల్లు అర్జున్ గారు గెస్ట్ గా వస్తున్నారని తెలిసి నిద్రపట్టలేదు. పుష్పక విమానం ఒక మంచి కథ. ఈ కథకు లైఫ్ ఇచ్చిన నిర్మాతలు, ప్రతి ఒక్క టెక్నీషీయన్ కు థాంక్స్ చెబుతున్నా. నవంబర్ 12న థియేటర్లో ఇచ్చి పడేస్తున్నాం. రెడీగా ఉండండి. అన్నారు.



*హీరో ఆనంద్ దేవరకొండ మాట్లాడుతూ*...ఈ స్టేజి మీద బన్నీ అన్న, మా అన్న విజయ్ మధ్యలో నా సినిమా పోస్టర్ ఉండటం హ్యాపీగా ఉంది. పుష్పక విమానంలో చిట్టిలంక సుందర్ అనే క్యారెక్టర్ ప్లే చేశాను. గవర్నమెంట్ స్కూల్ టీచర్ అతను. వచ్చే జీతంలో సగం దాచుకుని, పెళ్లి చేసుకుంటాడు. హాయిగా హనీమూన్ కు వెళ్లి, లైఫ్ లో సెటిల్ అవ్వాలని అనుకునే టైమ్ లో ఆయన భార్య లేచిపోతుంది. చిట్టిలంక సుందర్ భార్య దొరికిందా లేదా నవంబర్ 12న థియేటర్లలో చూద్దాం. పుష్పక విమానం సినిమా ఎంటర్ టైనింగ్ గా ఉంటుంది, థ్రిల్లింగ్ గా ఉంటుంది. అల్లు అర్జున్ అన్న మీకు టైమ్ ఉన్నప్పుడు మా సినిమా చూడాలని కోరుతున్నా. ఇక్కడికి వచ్చినందుకు చాలా థాంక్స్. అన్నారు.


*హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ*...పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి లాంటి స్క్రిప్టులు, తరుణ్ భాస్కర్, సందీప్ రెడ్డి వంగ లాంటి ప్రతిభ గల దర్శకులు పక్కనే ఉన్నా నిర్మాతలు ఎవరూ లేక ఆ సినిమాలు చేయలేని పరిస్థితిని చూశాను. ఆ కష్టాలు చూసిన అనుభవంతో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి అనే సొంత ప్రొడక్షన్ కంపెనీ పెట్టాను. నా కింగ్ ఆఫ్ హిల్ ఎంటర్ టైన్ మెంట్స్ లో రెండో ప్రాజెక్ట్ పుష్పక విమానం. దామోదర నాకు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా నుంచీ తెలుసు. ఆయన అప్పుడు రైటర్ గా కథలు రాసేవారు. నాకు ఓ కథ చెప్పారు నచ్చింది, సినిమా చేద్దామనే ఆలోచన ఉండేది. ఆ స్నేహం అలా కంటిన్యూ అయ్యింది. దామోదర మా ప్రొడక్షన్ లో సినిమా చేయడం హ్యాపీగా ఉంది. ఒక నిర్మాతగా దామోదర వర్క్  పట్ల చాలా సంతృప్తిగా ఉన్నాను. మంచి కథ కాబట్టి నాన్న గోవర్థన్, తమ్ముడు ఆనంద్  ఈ ప్రాజెక్ట్ చేయాలని పట్టుబట్టారు. ఈ కథలో హీరో క్యారెక్టర్ కు చాలా కష్టాలుంటాయి. అతనికి కష్టాలు గానీ మనకు నవ్వొస్తాయి. సునీల్ క్యారెక్టర్ ఈ సినిమాకు ఓ పిల్లర్. గీత్ సైని, శాన్వి మేఘనా సూపర్బ్ గా నటించారు. బన్నీ అన్న మా సినిమా ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా సంతోషంగా ఉంది. చిన్నప్పుడు మా నాన్నతో కలిసి డాడీ అనే సినిమా చూశాను. ఆ సినిమాలో బన్నీ అన్న చేసిన డాన్సులు ఫిదా అయ్యాను. ఆర్య సినిమా చూసినప్పుడు అల్లు అర్జున్ పర్మార్మెన్స్, డాన్సులు చూసి అద్భుతంగా చేశాడు అనిపించింది. అప్పటి నుంచి అల్లు అర్జున్ గారంటే బాగా ఇష్టం. ఆ తర్వాత అల్లు అరవింద్ గారి వల్ల మేము మరింత దగ్గరయ్యాం. బన్నీ అన్న, మహేష్ గారు లాంటి స్టార్స్ సినిమా ఫంక్షన్ లో నా గురించి మాట్లాడటం కలా నిజమా అనిపించేది. అన్నా, మీ టాలెంట్, లక్ ఈ టీమ్ కు కూడా ఉండాలి. వీళ్లు మంచి సినిమాలు చేయాలి. తెలుగు సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు బెస్ట్ స్టేజ్ లో ఉంది. బన్నీ అన్న పుష్ప, ఆర్ఆర్ఆర్, ప్రభాస్ గారు చేస్తున్న సినిమాలు తెలుగు సినిమా గ్రేట్ నెస్ చూపిస్తున్నాయి. అల్లు అర్జున్ అన్న వర్క్ చూసి ప్రతి రోజూ ఇన్ స్పైర్ అవుతుంటా. పుష్ప సినిమాకు మీరు పడిన కష్టం చూస్తుంటే మనం కూడా ఇలా కష్టపడాలి అని అనిపిస్తుంటుంది. మాకు ఎప్పుడూ ఇన్సిపిరేషన్ గా మీరు ఉండటం సంతోషంగా ఉంది. మీరు, సుకు సార్ కలిసి పుష్పలో ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టించారు.  బన్నీ అన్నను పుష్పరాజ్ గానే చూస్తున్నా. ఆ సినిమా చూసేందుకు వెయిట్ చేస్తున్నా. పుష్పక విమానం నవంబర్ 12న రిలీజ్ అవుతుంది. థియేటర్ లలో చూసేయండి. నిన్న పునీత్ అన్నను కోల్పోయాం. ఆయనను రెండు మూడు గంటలు మాత్రమే కలిశాను. నిన్నటి నుంచి మనసులో ఆయన ఆలోచనే ఉంటూ వస్తోంది. జీవించి ఉన్నంతకాలం సంతోషంగా ఉందాం, ప్రేమిద్దాం, స్నేహంగా ఉందాం. లవ్ యూ ఆల్. అన్నారు.

 


*ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాట్లాడుతూ*....పుష్ప ఫర్ పుష్పరాజ్ ..ఈ టైటిల్, ఈ కాన్సెప్ట్, ఈ కార్యక్రమం అదిరింది. ఇక్కడున్న ప్రతి ఒక్కరికీ కంగ్రాంట్స్. పుష్పక విమానం ట్రైలర్ చాలా బాగుంది. నేను రిలీజ్ చేయకున్నా ఇదే విషయం ట్వీట్ చేసేవాడిని. పుష్పక విమానం ట్రైలర్ నాకు బాగా నచ్చింది. మీ అందరికీ తెలుసు నాకు సినిమా నచ్చకుంటే ఆ సినిమా ఫ్రెండ్స్ సినిమా అయినా, మా వాళ్లదైనా నేను ఎక్కువగా మాట్లాడను. నచ్చితే మాత్రం వీలైనంత సపోర్ట్ చేస్తుంటా. పుష్పక విమానం సినిమా ట్రైలర్ చూశాక..సినిమా మీద మంచి అభిప్రాయం ఏర్పడింది. సినిమా విజయవంతం అవుతుందనే వైబ్స్ తెలుస్తున్నాయి. అందుకే ఈ టీమ్ కు ఆల్ ద బెస్ట్ కాకుండా అడ్వాన్స్ కంగ్రాట్స్ చెబుతున్నాను. విజయ్ దేవరకొండను ప్రేమిస్తాను. అతను సెల్ఫ్ మేడ్ యాక్టర్. నటుడిగా ఎవడే సుబ్రహ్మణ్యం, పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి..ఇలా ప్రతి సినిమాకు ఒక్కో మెట్టు ఎదుగుతూ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడు. సొంతంగా కష్టపడి పైకొచ్చే వాళ్లను నేను అభిమానిస్తాను. విజయ్ ఎదుగుదల నా విజయం అనుకుంటాను. అతనికి పేరొస్తే సంతోషించే వాళ్లలో నేనూ ఉంటాను. నువ్వూ ఇంకా పేరు తెచ్చుకుంటాడని నమ్మకముంది. విజయ్ కు మంచి మనసు, మేధస్సు ఉన్నాయి. పాజిటివ్ గా ఆలోచిస్తాడు. ఇంటెలిజెంట్ గా ఉండేవాళ్లు అందరితో సరదాగా ఉండలేరు. కానీ విజయ్ ఇంటెలిజెంట్ అయినా స్నేహంగా, కలుపుగోలుగా ఉంటాడు. విజయ్ లా ఇంత తక్కువ టైమ్ లో స్టార్ అయిన నటుడిని చూడలేదు. విజయ్ తన సినిమాల ఫలితం ఎలా ఉన్నా, విభిన్నమైన సినిమాలే చేస్తాడు. విజయ్ నాకు పంపే రౌడీ క్లోత్స్ చాలా ఇష్టం. కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని మీరు సొంత ప్రొడక్షన్ పెట్టడం నిజంగా మంచి విషయం. ఎంతోమంది టాలెంట్ పీపుల్ కు అవకాశాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. విజయ్ పైకొస్తుంటే మీకు అసూయగా ఉండగా అని అప్పట్లో నన్ను ఒకరు అడిగారు. నేను అన్నాను ఎందుకు అసూయ, మనకంటే ఒకరు ముందు పరిగెడితే అతన్ని చూసి ఇన్స్ పైర్ అవ్వాలి గానీ అసూయ పడొద్దని చెప్పా. అలా విజయ్ ఎదుగుతుంటే అతన్ని చూసి నేనూ స్ఫూర్తిపొందుతా. అలా కష్టపడి ఎదిగేవాళ్లు మరింత ముందుకు వెళ్లాలని కోరుకోవాలి కూడా. పుష్పక విమానం సినిమాతో మీరు హిట్ కొట్టారనే అనుకుంటున్నా. కోవిడ్ టైమ్ లో రిలీఫ్ ఇచ్చే సినిమా ఇది. ఈ చిత్రంలో మేఘనా, గీత్ లాంటి తెలుగు అమ్మాయిలు నటించడం చూసేందుకు బాగుంది. ఆనంద్ తన కంఫర్ట్ జోన్ నుంచి బయటకొచ్చి ఈ సినిమాలో నటించాడు. ట్రైలర్ లో అతన్ని చూస్తుంటే ఆకట్టుకునేలా నటించాడు. విజయ్ తనలో ఎలా స్ట్రెంత్ గుర్తుంచాడో అలాగే నీలో బలమేంటో తెలుసుకుని ఎదగాలని కోరుకుంటున్నా. పునీత్ గారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన అకస్మాత్తుగా వెళ్లిపోవడం దిగ్భ్రాంతికి గురి చేసింది. అన్నారు.

The Wrong Swipe Releasing on November 1st

 రైట్ టైమ్ లో రిలీజవుతున్న 'రాంగ్ స్వైప్'


# డా.రవికిరణ్ ప్రతిభకు

నిలువుటద్దం పట్టిన "రాంగ్ స్వైప్"



    డాక్టర్ రవికిరణ్ గడలి దర్శకత్వంలో 'మెరూన్ వాటర్స్ ఎక్స్ లెన్స్" పతాకంపై డాక్టర్ ప్రతిమారెడ్డి నిర్మించిన సందేశభరిత వినోదాత్మక చిత్రం "రాంగ్ స్వైప్". క్షణిక సుఖం కోసం పక్క దారి పడితే... ఎటువంటి విపరిణాలను ఎదుర్కోవలసి వస్తుందో ఎంటర్టైనింగ్ వేలో చూపించే ఈ ఇండిపెండెంట్ ఫిల్మ్ "ఊర్వశి ఓటిటి" ద్వారా నవంబర్ 1న విడుదల కానుంది.

    స్వతహా డాక్టర్ అయిన రవికిరణ్... సినిమా మాధ్యమం పట్ల విపరీతమైన ప్యాషన్ తో.. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, సంభాషణలు స్వయంగా సమకూర్చుకుని, దర్శకత్వం వహించడంతోపాటు... ఛాయాగ్రహణం కూడా అందించడం విశేషం. అంతేకాదు, ఈ చిత్రంలో ఓ ముఖ్య పాత్ర కూడా పోషించారు. డాక్టర్ ఉదయ్ రెడ్డి, డాక్టర్ శ్రావ్యనిక, రాధాకృష్ణ, అనికా ప్రేమ్ ముఖ్యపాత్రలు పోషించారు.

      నిర్మాత డాక్టర్ ప్రతిమారెడ్డి మాట్లాడుతూ... "లిమిటెడ్ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రాన్ని మా డైరెక్టర్ డాక్టర్ రవికిరణ్ చాలా గొప్పగా తీర్చిదిద్దారు. అన్నీ తానే అయి ముందుండి నడిపించారు. మెసేజ్ కి ఎంటర్టైన్మెంట్ జోడించి రూపొందిన "రాంగ్ స్వైప్" అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది. కబీర్ రఫీ సంగీతం ఈ చిత్రానికి ఆయువుపట్టు" అన్నారు!!


Pushpa Sami Sami Song Creating New Records

 సౌత్ ఇండియాలో ఆల్ టైమ్ రికార్డులు తిరగ రాసిన అల్లు అర్జున్ సామి సామి లిరికల్ సాంగ్..

 


ఐకాన్ సార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప: ది రైజ్ సినిమాలోని మూడో పాట సామీ సామీ ఈ మధ్య విడుదలైంది. విడుదలైన మరుక్షణం నుంచి ఈ పాట రికార్డులు తిరగరాస్తోంది. అత్యధిక వ్యూస్ అత్యంత వేగంగా సాధించిన పాటగా సౌత్ ఇండియాలో సరికొత్త చరిత్ర సృష్టించింది సామి సామి సాంగ్.


విడుదలైన 24 గంటల్లోనే 9 మిలియన్ వ్యూస్ సాధించి సౌత్ ఇండియాలో కొత్త రికార్డు సృష్టించింది. మరే లిరికల్ వీడియోకు అయినా 24 గంటల్లో వచ్చిన అత్యధిక వ్యూస్ ఇవే.


పుష్ప సినిమాలోని మొదటి పాట దాక్కో దాక్కో మేక 24గంటల్లో 8.3 మిలియన్ వ్యూస్ దక్కించుకుంది. ఇప్పుడు ఆ రికార్డును సామీ సామీ తిరగరాసింది. అత్యధిక వ్యూస్ సాధించిన మొదటి 6 టాలీవుడ్ లిరికల్ వీడియో సాంగ్స్ లో 4 అల్లు అర్జున్ ఖాతాలో ఉన్నాయి.


ఇందులో మొదటి రెండు స్థానాల్లో సామి సామి,  దాక్కో దాక్కో మేక ఉన్నాయి. ఆ తర్వాత రాములో రాముల (7.37 million views), శ్రీవల్లి (7 million views) లిరికల్ వీడియోలు ఉన్నాయి. సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కిస్తున్న పుష్ప: ది రైజ్ డిసెంబర్ 17న విడుదల కానుంది.

First Lyrical Of Nani’s Shyam Singha Roy On 6th November

 Rise Of Shyam, First Lyrical Of Nani’s Shyam Singha Roy, On 6th November



As of now, the makers of Natural Star Nani’s highly anticipated film Shyam Singha Roy have released first look posters, and few other stills from the movie. That was enough for the movie to garner enormous interest among movie buffs.


Now, they are about to kick-start musical promotions of the film directed by the very talented Rahul Sankrityan and produced on a massive scale by Venkat Boyanapalli under Niharika Entertainments as Production No 1.


Lyrical Video of first single- Rise Of Shyam will be out on 6th November. As the title suggests, the song will give emphasis to the character of Shyam played by Nani. In the poster, Nani as a Bengali guy is seen sitting in chair with ferocity in his eyes.


His sitting style and the way he holds cigarette give all the raise to the character. This is Royal Bengali Avatar of Nani and the song scored by Mickey J Meyer is surely going to give perfect start to the audio promotions of the movie.


Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian are the heroines in the film that has original story by Satyadev Janga. Sanu John Varghese is the cinematographer, while Naveen Nooli is the editor.


National Award winner Kruti Mahesh and the very talented Yash master choreographed songs of the film.


Rahul Ravindran, Murali Sharma and Abhinav Gomatam will be seen in important roles in the film.


To be high on VFX, Shyam Singha Roy will be arriving in theatres in all south languages- Telugu, Tamil, Kannada and Malayalam on December 24th for Christmas.


Cast: Nani, Sai Pallavi, Krithi Shetty, Madonna Sebastian, Rahul Ravindran, Murali Sharma, Abhinav Gomatam, Jishu Sen Gupta, Leela Samson, Manish Wadwa, Barun Chanda etc.


Technical Crew:

Director: Rahul Sankrityan

Producer: Venkat Boyanapalli

Banner: Niharika Entertainment

Original Story: Satyadev Janga

Music Director: Mickey J Meyer

Cinematography: Sanu John Varghese

Production Designer: Avinash Kolla

Executive Producer: S Venkata Rathnam (Venkat)

Editor: Naveen Nooli

Fights: Ravi Varma

Choreography: Kruti Mahesh, Yash

PRO: Vamsi-Shekar


Abhishek Agarwal Arts and SVC LLP’s Mighty Collaboration

 Abhishek Agarwal Arts and SVC LLP’s Mighty Collaboration To Offer High Quality Content Movies



A big announcement was made on the occasion of Abhishek Group Chairman Tej Narayan Agarwal’s birthday. Two of the oldest business families of Hyderabad tie up to make high quality content movies, under the guidance of Asian Cinemas Group’s Chairman Narayan Das K Narang.


We are talking about the mighty collaboration of Abhishek Agarwal Arts and Sree Venkateswara Cinemas LLP (SVC LLP- A Unit Of Asian Group). Well, Sunil Narang, Puskur Ram Mohan Rao and Abhishek Agarwal are joining hands to offer us some exciting content.


Both Abhishek Agarwal Arts and SVC LLP, who always strive to give good movies, are individually making different genre movies with young and star heroes. The two popular production houses together will be producing big movies and the complete details of the same will be announced in due course.


It’s a great combination of young and senior filmmakers and we can except content oriented and commercial entertainers from them.

Manchi Rojulu Vachayi Pre Release Event Held Grandly

 మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ - మ్యాచో హీరో గోపీచంద్, సంద‌డిగా సాగిన మంచి రోజులు వ‌చ్చాయి ప్రీ రిలీజ్ ఈవెంట్



సంతోష్ శోభన్, మెహరీన్ కౌర్ జంటగా వరుస విజయాలతో దూసుకుపోతున్న మారుతి తెరకెక్కిస్తున్న సినిమా మంచి రోజులు వచ్చాయి. నవంబర్ 4న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. యాక్షన్ హీరో గోపీచంద్, అల్లు అరవింద్ గారు ముఖ్య అతిథులుగా వచ్చిన ఈవెంట్ విశేషాలు ఏంటో చూద్దాం..


హీరో సంతోష్ శోభన్ మాట్లాడుతూ.. "కేవలం నా టాలెంట్ నమ్మి మళ్లీ మళ్లీ నాకు అవకాశాలు ఇస్తున్న యు.వి.కాన్సెప్ట్స్ కు జీవితాంతం రుణపడి ఉంటాను. ఈ స్టేజ్ ఎక్కడానికి ఎంతో కష్టపడ్డాను. మంచి రోజులు వచ్చాయి ఖచ్చితంగా అందరినీ అలరిస్తోంది. నవంబర్ 4న థియేటర్స్ అన్నీ నవ్వులతో నిండిపోవాలి అని కోరుకుంటున్నాను.." అని తెలిపారు.


హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. " మారుతి సినిమా అంటే నవ్వులు గ్యారెంటీ. అంత ఖచ్చితంగా ఎలా చెబుతున్నాను అనేది రేపు సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశాను.. మీకు కూడా రేపు నవంబర్ 4న థియేటర్లలో అది తెలుస్తుంది. సినిమా అంతా పగలబడి నవ్వడం ఖాయం. మంచి రోజులు వచ్చాయి పెద్ద విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.." అని తెలిపారు.


దర్శకుడు మారుతి మాట్లాడుతూ.. "కరోనా తర్వాత అందరు తెలియకుండానే ఒక భయంలోకి వెళ్లిపోతున్నారు. ఆ భయం మీద ఎందుకు సినిమా చేయకూడదు అనే ఐడియా నాకు వచ్చింది. అది వచ్చిన వెంటనే 20 రోజుల్లో కథ రాసి.. 30 రోజుల్లో సినిమా తీశాను. ముందు నా పేరు వేసుకోకూడదు అనుకున్నాను. కానీ ఒక మంచి విషయం చెబుతున్నప్పుడు దాని ఫలితం కూడా మనమే తీసుకోవాలని అల్లు అరవింద్ గారితో మాట్లాడి ఈ నిర్ణయం తీసుకున్నాను. సాధారణంగా ఒక పెద్ద సినిమా చేస్తున్నప్పుడు చిన్న సినిమా చేయాలి అంటే నిర్మాతలు ఒప్పుకోరు. కానీ నేనేం చేసినా కూడా నా వెనక మంచి మనుషులు ఉన్నారు. ఆ ధైర్యంతోనే మంచి రోజులు వచ్చాయి సినిమా మీ ముందుకు తీసుకు వస్తున్నాను. ఈ సినిమా సరదాగా చేసినా.. సీరియస్ విషయం ఉంది. ఖచ్చితంగా నవంబర్ 4న థియేటర్లలో మీరు ఈ సినిమా చూసి నవ్వుతారు.. ఎంజాయ్ చేస్తారు అని నమ్ముతున్నాను.." అని తెలిపారు.


నిర్మాత అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ.." సినిమా వాళ్లకు మంచి రోజులు రావడం అంటే జనం థియేటర్స్ కు వచ్చి ఆశీర్వదించడం. ఈ మధ్య విడుదలైన రెండు మూడు సినిమాలకు అలాంటి మంచి రోజులు చూపించారు. నేను ఓటిటి ఓనర్ అయ్యుండి కూడా సినిమాను తెరమీదే చూడండి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. మారుతి నాకు బన్నీ ఫ్రెండ్ గా తెలుసు. మా ఇంట్లో కుర్రాడి కింద చూస్తాం. ఎంటర్టైన్మెంట్ లోనే సందేశం ఇచ్చే దర్శకుడు మారుతి. శోభన్ నీ గురించి పేపర్ బాయ్ ఈవెంట్ లోనే చెప్పాను. నువ్వు గీతా ఆర్ట్స్ లో సినిమా చేయాలి. ఎంత బ్యాక్ గ్రౌండ్ ఉన్న ఇండస్ట్రీలో టాలెంటు లేకపోతే ఎత్తుకోదు. నీకు చాలా టాలెంట్ ఉంది. మెహరీన్ నువ్వు స్వీట్ హార్ట్. స్టార్ హీరోలు ముందుకొచ్చి చిన్న సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నారు. అది చాలా మంచి సంప్రదాయం. ఇప్పుడు ఇండస్ట్రీకి చాలా అవసరం. మంచి రోజులు మనకు ముందున్నాయి.." అని తెలిపారు.

Varudu Kaavalenu Grand Success Meet

Varudu Kaavalenu is a perfect entertainer to enjoy with your family and friends: Naga Shaurya



The cast and crew of Varudu Kaavalenu, the family entertainer starring Naga Shaurya, Ritu Varma in lead roles, that has opened to housefull crowds across the globe, came together for a success meet held at Hotel Avasa in Hyderabad on Saturday. The film was directed by Lakshmi Sowjanya and produced by Suryadevara Naga Vamsi under Sithara Entertainments. Overjoyed with the verdict of the critics and audiences across all age groups, the team expressed its happiness to crowds for recognising their efforts and interacted with the media. 


Lyricist Rambabu, who wrote the song Kola Kalle for Varudu Kaavalenu, said, "I'm delighted that the film is receiving a blockbuster response everywhere. The film is a neat, clean family entertainer and we're happy that audiences have accepted it wholeheartedly. I congratulate the film director Lakshmi Sowjanya for scoring a hit with her very first film. The comedy track in the film has reminded many of Jandhyala's (garu) films. Ganesh Kumar Ravuri's dialogues are receiving applause everywhere. I'm happy to have penned the lyrics for such a wonderful song. The team, composers Vishal Chandrasekhar, Thaman deserve credit for the success. I hope the audience showers more love on our film in the days to come."


Actor Arjun, who played a supporting role in the film, shared, "This success has doubled the joy for our producer Naga Vamsi (garu), who has also earned a National Award for Jersey in the previous week. I'm happy that this is my second film in a prestigious banner and hope to star in many more projects with them. I've worked with director Lakshmi Sowjanya for an ad before and it feels gratifying that she kept me in mind for a crucial role in Varudu Kaavalenu. My key takeaway from the film is the association with Naga Shaurya, he's been a constant source of emotional support when the chips were down."


Actress Himaja, who entertained audiences as Selfie Sarala, stated, "I am so happy for my director Sowjanya, producer Naga Vamsi (garu) and team for delivering a successful film. I didn't have to work very hard for my role because it was an extension of my personality. I wake up to messages on my mobile in the morning and my world revolves around social media, videos and updates in the virtual world. I didn't feel like I was acting on the screen."


Choreographer Vijay, who worked on the song Kola Kalle in the film, mentioned, "It takes immense courage for producers to trust their film and release it in the theatres during a pandemic. It's great that they've scored a hit and drew audiences to halls in this situation. We as a team are very happy that audiences are liking the film. The producer Naga Vamsi (garu) has always encouraged me since the beginning and has consistently given me opportunities to work in his banner. I thank Naga Shaurya and director Lakshmi Sowjanya for their rest in my abilities."


Dialogue writer Ganesh Kumar Ravuri, who drew praise from all corners for his wit and impactful one-liners, added, "This box-office success was possible only because of the teamwork. And it is China Babu garu (producer S Radha Krishna) who is the pillar behind the film, bringing this cast and crew together. It's humbling that he took note of my skill as a writer during my stint as a media person and gave me this opportunity. I congratulate the director Lakshmi Sowjanya. It's not easy to impress our producer Naga Vamsi (garu) and that he was so confident about its result, makes this success sweeter."


Director Lakshmi Sowjanya said, "I feel blessed that media and audiences are lapping up our film big time. Many may call me 'akka', but I can say Naga Shaurya is a true brother in my life - he has been a rock through my journey with the film and has supported me all times as a thorough professional. Our producer (Naga Vamsi) knows exactly what he wants from a film and his mind always revolves around cinema - that's the reason behind his success. Ritu Varma played a role that has a lot of similarities to her real-life personality as well, that's why the dignity in the role came through. I owe this hit to my dialogue writer Ganesh, my crew Ramesh, Sharath, Srivatsava. My phone hasn't stopped ringing since yesterday with appreciatory calls."


Actor Naga Shaurya shared, "The media fraternity has supported me like family always. I've always trusted the film to do well in theatres and I feel happy to go one step closer to family audiences again. It's a film that everyone can forget their worries and enjoy with their families. I'm glad to move beyond my lover boy image and take up different roles. Full credit to the director, cast and crew who've been an integral part of the making."


Producer S Naga Vamsi added, "We're happy to have introduced an immensely capable director like Lakshmi Sowjanya into the industry. I am grateful to audiences for appreciating our film and hope they gather in bigger numbers at the theatres ahead of the festive season."


Actor Praveen and screenplay writer Sharath thanked the crowds for their unanimously positive responses and asked them to shower more love for the film in the coming days. The team observed a minute's silence in the meet, in memory of Kannada star Puneeth Rajkumar, who passed away owing to a heart attack on Friday.

Varudu Kaavalenu Movie Review



Check out the review of Varudu Kaavalenu Starring Naga Shaurya, Ritu Varma, Nadhiya,Murali Sharma, Vennela Kishore Directed by  Lakshmi Sowjanya Produced Suryadevara Naga Vamsi under Sithara Entertainments Banner Vishal Chandrashekhar, S. Thaman composed Music Naveen Nooli is the Editor 


Story:

Varudu Kaavalenu is the film Based on Marriage Concept of Present Youth now coming to Detail Story Bhumi(Ritu Varma) is Happy going Girl and Not Intrested in Getting Marriage Now  Akash(Naga Shourya) Falls in Love With Her but She Rejects his Love What is the Reason Behind that Rejection ? How Akash Reacts to it Forms the Rest of the story 

Coming to Plus Points  Varudu Kaavalenu has Lot many Beautiful Scenes  with good sensible concepts with good Matured Script  and surely It will be Engaging to Youth 

Naga Shaurya Performance is good he has shown good Variation in his work He looks so handsome his performance in Emotional Scenes came out very well he has given his best surely this film will be his career best  Ritu Varma has done decent job her performance is Ultimate she has got good role to showcase her Performance she delivered her best  She looks beautiful in  sarees surely she will get more and more films after this movie 

Sapatagiri comedy is good  Vennela Kishore role is Entertaining. Nadhia has done proper Justice to her role Himaja,Murali Sharma and others has done perfect Justification to their Respective roles 


TECHNICAL ASPECTS 

coming to Technical Aspects  we must appreciate producers for their production values. Cinematography is very good movie is so colorful. Dialogues are good debutante Ganesh Ravuri Contribution need special Mention he has given sensible and perfect dialogues director Lakshmi Sowjanya made her Decent Debut She has done good research her writing is good and narration is Matured  Music is perfect  on whole Varudu Kaavalenu is Technically Sound 

Verdict:

Finally I can say Varudu Kaavalenu is a decent Film with good Content Emotions what not it has good package of Entertainment surely this film will not disappoint you Except Slow pace Narration Every Thing is good  and Perfect Entertainer  Don't Miss to Watch this Weekend 

Telugucinemas.in Rating 3.25/5 


A new feel-good web series Alludu Garu, first episode to premiere on aha from October 29

 A new feel-good web series Alludu Garu, first episode to premiere on aha from October 29



100% Telugu streaming platform aha, a household name for Telugu entertainment in the digital space, is coming up with a new web series, Alludu Garu, a feel-good family drama, starring Abhijeeth Poondla, Dhanya Balakrishna, Y Kasi Viswanath, Sudha and Shalini Kondepudi in key roles. The entertaining show directed by Jayanth Gali (known for Love Life and Pakodi) and produced by Tamada Media sheds new light on the complications of modern-day relationships. Bru is the Presenting sponsor for the show. The first episode is slated to release on October 29.

Alludu Garu is a coming-of-age story that revolves around a newly married couple Ajay (Abhijeeth Poondla) and Amulya (Dhanya Balakrishna). It hilariously focuses on the plight of Ajay, who is forced to stay with his clingy in-laws Ashok (Y Kasi Viswanath), Nalini (Sudha) in a conservative household. Despite his initial reluctance, Ajay tries hard to meet their expectations and fit into the family, keeping his contrasting world views aside. While his struggles will tickle your funny bones without a doubt, you are sure to empathise with his plight. Will Ajay still manage to stay sane?

"aha has made it a habit to deliver one hit show after the other in multiple genres, from Tharagathi Gadhi Daati to Kudi Yedamaithe to The Baker and The Beauty. We're sure Alludu Garu will be an equally promising addition to our diverse content library of Telugu web originals and movies. The show has the potential to strike a chord with audiences across all age groups, for it's a relevant take on relationships within a middle-class household in a lighter vein. We're happy to collaborate with Bru and are hopeful to continue our wonderful association in future. " Ajit Thakur, CEO of aha, shared.

 “Being a regional OTT player, we are the one-stop-shop for fulfilling all entertainment needs with convenience of local language connect. Accordingly, our partnership with brands allows us to create more engaging formats. We are delighted to partner with Bru in this. As our roadmap is to find unique stories of the Telugu land that are relatable to the constantly progressing audience and fans, we look forward to continue our associations.” Nitin Burman, Head Non-Subscription Revenue, aha, added.

aha, delivering on its promise of providing 'Anthuleni Prema, Anthuleni Vindodam' to viewers, is also home to some of the biggest Telugu releases in 2021, including Krack, 11th Hour, Zombie Reddy, Chaavu Kaburu Challaga, Naandhi, In the Name of God, Needa, Kala, aha Bhojanambu, One, Super Deluxe, Chathur Mukham, Kudi Yedamaithe, Tharagathi Gadhi Daati, The Baker and the Beauty, Maha Ganesha, Parinayam, Orey Baammardhi, Cold Case and Ichata Vahanamulu Nilupa Radu.

Skylab Trailer on November 1st

 నవంబర్ 1న స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ  స్కైలాబ్‌’ ట్రైలర్ విడుదల




స‌త్య‌దేవ్‌, నిత్యామీనన్, రాహుల్ రామ‌కృష్ణ ప్ర‌ధాన తారాగ‌ణంగా డా.రవి కిరణ్‌ సమర్పణలో బైట్‌ ఫ్యూచర్స్‌, నిత్యామీనన్‌ కంపెనీ పతాకాలపై విశ్వక్ ఖండేరావు దర్శకత్వంలో పృథ్వీ పిన్నమరాజు నిర్మిస్తోన్న చిత్రం ‘స్కైలాబ్‌’. 1979 లో సాగే పీరియాడిక్ మూవీ ఇది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను న‌వంబ‌ర్ 1న విడుద‌ల చేస్తున్నారు. అలాగే సినిమా నిర్మాణానంత‌ర కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు విశ్వక్ ఖండేరావు మాట్లాడుతూ ‘‘1979 సంవ‌త్సరంలో మన తెలుగు రాష్ట్రంలో బండ లింగపల్లి అనే గ్రామంలో కొన్ని విచిత్ర‌మైన ప‌రిస్థితులు జరిగాయి. అమెరికా స్పేస్ స్టేష‌న్ నాసా ప్రయోగించిన స్పేస్ స్టేష‌న్ స్కైలాబ్ భూమిపై పడుతుందని, భూమి నాశనమైపోతుందని వార్తలు వచ్చాయి. ఆ సమయంలో ప్రపంచమంతా అసలేం జరగబోతుందోనని ఊపిరి బిగపట్టి ఎదురుచూడసాగారు. వార్తాపత్రికలు ఈ వార్తను ప్రముఖంగా కవర్‌ చేశాయి. ఈ నేప‌థ్యంలో ఆ గ్రామంలో  ఉండే గౌరి, ఆనంద్‌, రామారావుల జీవితాల్లో స్కైలాబ్‌ వల్ల ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయనే విషయాలను ఎంటర్‌టైనింగ్‌గా చెప్పే ప్ర‌య‌త్న‌మే ఈ చిత్రం. 


ఇందులో ఆనంద్‌గా స‌త్య‌దేవ్‌, గౌరీగా నిత్యామీనన్,సుబేదార్ రామారావుగా రాహుల్ రామ‌కృష్ణ క‌నిపించ‌నున్నారు. వీరి పాత్ర‌ల‌కు సంబంధించిన లుక్స్‌ను విడుద‌ల చేశాం. ఆర్టిసులు స‌హా అద్భుత‌మైన న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు కుదిరారు. అనుకున్న ప్లానింగ్‌లోనే సినిమాను పూర్తి చేశాం. ఇప్పుడు సినిమా పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్యక్ర‌మాలు జ‌రుగుతున్నాయి. మెసడోనియన్ సింఫనీ ఆర్కెస్ట్రాతో సినిమాలో థీమ్స్‌ను రికార్డ్ చేయించాం.న‌వంబ‌ర్ 1న ఈ సినిమా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేస్తున్నాం.  త్వ‌ర‌లోనే సినిమాను థియేట‌ర్స్‌లో సినిమాను విడుద‌ల చేసేలా ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:

నిత్యామీన‌న్‌, స‌త్య‌దేవ్‌, రాహుల్ రామ‌కృష్ణ, తనికెళ్ల భరణి, తులసి, విష్ణు, అనుష త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:


మాట‌లు, స్క్రీన్‌ప్లే, ద‌ర్శ‌క‌త్వం: విశ్వక్ ఖండేరావు

నిర్మాత: పృథ్వీ పిన్నమరాజు

సహ నిర్మాత: నిత్యామీనన్‌

సినిమాటోగ్రఫీ: ఆదిత్య జవ్వాది

ఎడిటర్‌:  రవితేజ గిరిజాల

మ్యూజిక్‌: ప్ర‌శాంత్‌ ఆర్‌.విహారి

ప్రొడక్షన్‌ డిజైన్‌:  శివం రావ్‌

సౌండ్ రికార్డిస్ట్‌‌:  నాగార్జున త‌ల్ల‌ప‌ల్లి 

సౌండ్‌ డిజైన్‌: ధ‌నుష్ న‌య‌నార్‌

కాస్ట్యూమ్స్‌: పూజిత తడికొండ

పి.ఆర్‌.ఒ:  వంశీ కాక


Vuriki vutharana Releasing on November 19th

 



ఈగిల్ ఐ ఎంటర్టైన్మెంట్స్  బ్యానర్ పై  వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య  నిర్మిస్తోన్న చిత్రం `ఊరికి ఉత్త‌రాన‌`.  న‌రేన్ హీరోగా ప‌రిచ‌య‌మవుతున్నాడు. దీపాలి శర్మ హీరోయిన్ గా న‌టిస్తోంది. స‌తీష్ అండ్ టీమ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. వ‌రంగ‌ల్ లో జ‌రిగిన ఓ య‌థార్థ సంఘ‌ట‌నకు ఆధారంగా రూపొందుతోన్న ఈ చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 19న విడుద‌ల‌కు సిద్ధ‌మైంది.

ఈ సంద‌ర్భంగా నిర్మాత వ‌న‌ప‌ర్తి వెంకటయ్య మాట్లాడుతూ...`` మా చిత్రం అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని న‌వంబ‌ర్ 19న గ్రాండ్ గా రిలీజ్ కు సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే విడుద‌లైన మా చిత్రంలోని రెండు పాట‌ల‌కు, టీజ‌ర్ కు మంచి రెస్పాన్స్  వ‌స్తోంది. పాట‌లకు , టీజ‌ర్ కు మంచి వ్యూస్ వ‌చ్చాయి.  మిగ‌తా పాట‌లు, ట్రైల‌ర్ త్వ‌ర‌లో రిలీజ్ చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం`` అన్నారు.


    రామరాజు, మల్లేశం ఫేం ఆనంద చక్రపాణి,అంకిత్ కొయ్య, ఫణి, జగదీష్ లు ప్రధాన పాత్రల్లో  న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్ర‌ఫీః శ్రీకాంత్ అరుపుల‌;  సంగీతంః భీమ్స్ సిసిరోలియో- సురేష్ బొబ్బిలి;  సాహిత్యంః సురేష్ గంగుల‌, పూర్ణాచారి;  పీఆర్వోః వంశీ-శేఖ‌ర్‌; ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : మాల్యా కందుకూరి ; కో-ప్రొడ్యూస‌ర్ః రాచాల యుగంధర్ ; నిర్మాతః వ‌న‌ప‌ర్తి వెంక‌ట‌య్య‌, ద‌ర్శ‌క‌త్వంః స‌తీష్ అండ్ టీమ్

Minnal Murali in Netflix Trailer Release

 ఫ్లిక్స్లో రాబోతోన్న సూపర్ హీరో ‘మిన్నల్ మురళి’ ట్రైలర్ విడుదల

బసిల్ జోసెఫ్ దర్శకత్వంలో టోవినో థామస్ నటించిన మిన్నల్ మురళి చిత్రం నెట్ ఫ్లిక్స్లో డిసెంబర్ 24న రాబోతోంది.



అక్టోబర్ 28, 2021: నెట్ ఫ్లిక్స్లో రాబోతోన్న మిన్నల్ మురళి  చిత్రంతో క్రిస్మస్ మరింత సందడిగా మారనుంది. జైసన్ అనే వ్యక్తి జీవిత చరిత్ర ఆధారంగా ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. ఓ సాధారణ వ్యక్తి నుంచి అతింద్రీయ శక్తులను సాధించిన సూపర్ హీరో (మురళి) కథే మిన్నల్ మురళి. ఈ చిత్రాన్ని సోపియా పాల్ వీకెండ్ బ్లాక్ బస్టర్స్ బ్యానర్ మీద నిర్మిస్తుండగా.. బసిలో జోసెఫ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక మాలీవుడ్ ఐకాన్ టోవినో థామస్.. సూపర్ హీరో మిన్నల్ మురళి పాత్రను పోషిస్తున్నారు. గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.డిసెంబర్ 24న ఈ మూవీ ప్రీమియర్ కాబోతోంది. ఈ చిత్రంలో మళయాలంలో రుపొందినప్పటికీ .. తమిళ, తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో డబ్ కానుంది.

దర్శకుడు బసిల్ జోసెఫ్ మాట్లాడుతూ.. ‘సూపర్ హీరోల్లాంటి కల్పిత కథలంటే నాకు చాలా ఇష్టం. కామిక్ బుక్స్ నుంచి మొదలుకొని వచ్చిన ప్రతీ సూపర్ హీరో చిత్రమంటే నాకు ఇష్టం. ఓ సూపర్ హీరో కథతో ఆడియెన్స్ అందరినీ ఆకట్టుకోవాలనే కల ఉండేది. అది ఈ మిన్నల్ మురళీ సినిమాతో నెరవేరుతోంది. ఈ అవకాశం ఇచ్చినందుకు వీకెండ్ బ్లాక్ బస్టర్స్, టోవినో, నెట్ ఫ్లిక్స్ వారికి థ్యాంక్స్’ అని అన్నారు.

టోవినో థామస్ మాట్లాడుతూ.. ‘మిన్నల్ మురళీ అనే చిత్రం ఆద్యాంతం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. సినిమా చివరి క్షణం వరకు ఎంగేజ్ చేస్తుంది. నేను ఈ చిత్రంలో జైసన్ అక మిన్నల్ మురళీ పాత్రను పోషించాను. మెరుపును తాకడం వల్ల అతీంద్రియ శక్తులు లభిస్తాయి. ఈ పాత్రను పోషించడం నాకు ఎంతో సవాల్గా మారింది. బసిల్ జోసెఫ్ విజన్ అనితర సాధ్యమైంది. ఆయన విజన్ను ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

వీకెండ్ బ్లాక్ బస్టర్స్ నుంచి సోఫియా పాల్ మాట్లాడుతూ.. ‘ఇది వరకు ఎన్నడూ చేయనిది, ఎంతో గొప్ప సినిమా తీస్తున్నామని మాకు ముందే తెలుసు.ఇలాంటి కష్టకాలంలోనూ ఎంతో చక్కగా సినిమాను పూర్తి చేశాం. ఇది మాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. టీం అంతా కలిసి కష్టపడి చేయడంతోనే సినిమా తీయడం సాధ్యమైంది. ఈ రెండేళ్ల ప్రయాణంలో ప్రతీ ఒక్కరూ ఎంతో కష్టపడి రాత్రి పగలు అని తేడా లేకుండా పని చేశారు. సూపర్ హీరో మిన్నల్ మురళీ సినిమాను మీరంతా చూడాలని కోరుకుంటున్నా’ అని అన్నారు.

చెడు మీద మంచి చేసిన యుద్దాన్ని మిన్నల్ మురళి చిత్రంలో చూడవచ్చు. అది కూడా కేవలం నెట్ ఫ్లిక్స్లోనే.

దర్శకుడు : బసిల్ జోసెఫ్

నటీనటులు  : టోవినో థామస్, గురు సోమసుందరం, హరిశ్రీ అశోకన్, అజు వర్గీస్

రచయిత, స్క్రీన్ ప్లే, మాటలు  : అరున్ ఏ ఆర్, జస్టిన్ మాథ్యూస్

పాటలు  :  మను మంజిత్

సంగీతం  :  షాన్ రెహ్మాన్, , సుషిన్ శ్యామ్