Latest Post

Director VV Vinayak Launched Teeram Trailer

 సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి.వినాయక్ చేతులమీదుగా "తీరం" ట్రైలర్ విడుదల!!



నూతన యువకథా నాయకులు  శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు హీరోలుగా క్రిష్టెన్ రవళి, అపర్ణ హీరోయిన్స్ గా అనిల్ ఇనమడుగు స్వీయ దర్శకత్వంలో యల్ యస్ ప్రొడక్షన్స్ సమర్పణలో అఖి క్రియేటివ్స్ వర్క్స్ బ్యానర్ పై  అభిరుచిగల నిర్మాత యం. శ్రీనివాసులు నిర్మించిన ఔట్ అండ్ ఔట్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ చిత్రం "తీరం" ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.. కాగా  ఈ చిత్రం ట్రైలర్ ని సెన్షేషనల్ డైరెక్టర్ వి.వి. వినాయక్ విడుదల చేసి చిత్ర యూనిట్ కి అభినందనలు తెలిపారు.. ఈ కార్యక్రమంలో హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు, మరో హీరో శ్రావణ్ వైజిటి, కెమెరామెన్ శ్రావణ్ జి.కుమార్, నటుడు అజాస్, సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బొలేమోని, నిర్మాత యం. శ్రీనివాసులు పాల్గొన్నారు.. 


హీరో కమ్ డైరెక్టర్ అనిల్ ఇనమడుగు మాట్లాడుతూ.. కొత్తవాళ్ళం అని చూడకుండా  అడిగిన వెంటనే మంచి మనసుతో మా తీరం సినిమా ట్రైలర్ రిలీజ్ చేసిన గొప్ప దర్శకులు వినాయక్ గారికి మా కృతజ్ఞతలు.. ఇక సినిమా   ప్రెజెంట్ యూత్ కి తగ్గట్లుగా ట్రెండీగా ఈ చిత్రాన్ని తీయటం జరిగింది.. యూత్ కి కావాల్సిన అన్ని ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి.. అలాగే ఫ్యామిలీ ఆడియెన్స్ అందరూ ఎంజాయ్ చేసే విధంగా తీరం చిత్రాన్ని తెరకెక్కించాం. సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఉంటూనే అంతర్లీనంగా ఒక చక్కని సందేశం ఈ చిత్రంలో చూపించటం జరిగింది.. కచ్చితంగా ప్రేక్షకులకు తీరం సినిమా నచ్చుతుంది మా టీమ్ అందరం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. మా సినిమా చూసి పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాం .. అన్నారు. 


మరో హీరో శ్రావణ్ వైజిటి మాట్లాడుతూ.. " తీరం సినిమా చాలా బాగా వచ్చింది.. అందరం చాలా నమ్మకంతో ఉన్నాం.. ఈ చిత్రాన్ని అనిల్ సుపెర్బ్ గా చిత్రీకరించారు.. సాంగ్స్ అన్నీ హిట్ అయ్యాయి.. శ్రవణ్ కెమెరా విజువల్స్ ఫెంటాస్టిక్ గా ఉంటాయి.. వినాయక్ గారి లాంటి పెద్ద దర్శకులు మా చిన్న సినిమా ట్రైలర్ లాంఛ్ చేయడం చాలా హ్యాపీగా ఉంది.. మా టీమ్ అందరి తరుపున ఆయనకి మా ధన్యవాదాలు.. ఈ తీరం చిత్రాన్ని ఆదరించి పెద్ద సక్సెస్ చేయాలని ప్రేక్షకులను అభ్యర్ధిస్తున్నాను.. అన్నారు. 


సినేటెరియా గ్రూప్ సిఇఓ వెంకట్ బోలేమోని మాట్లాడుతూ.. " తీరం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఒక అద్భుతమైన ప్రేమకథా చిత్రం. కొత్త కంటెంట్ తో అనిల్ ఇనమడుగు ఈ సినిమాని రూపొందించాడు.. డిఫరెంట్ కథా చిత్రాలను ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. అలాగే ఈ తీరం చిత్రాన్ని కూడా ఆదరిస్తారనే నమ్మకం ఉంది.. అన్ని పనులు పూర్తిస్థాయిలో కంప్లీట్ చేశాం.. ఈ నెల 29న తీరం సినిమాని విడుదల చేస్తున్నాం.. ఏపీ, తెలంగాణాలోనే కాకుండా తమిళ్, కన్నడలో కూడా రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నాం.. అన్నారు..


 *శ్రావణ్ వైజిటి, అనిల్ ఇనమడుగు, క్రిస్టెన్ రవళి, అపర్ణ, మై విల్లేజ్ షో అనిల్, శ్రావ్య, రాగి, అజాస్ తదితరులు నటించిన ఈ చిత్రానికి మ్యూజిక్: ప్రశాంత్ బిజె, కెమెరా; శ్రావణ్ జి.కుమార్, కో-డైరెక్టర్స్; మోహన్ మర్రిపల్లి, రాకేష్ మాధవన్, ప్రభు ఆకాశవాణి, ఎడిటింగ్; శ్రావణ్ జి.కుమార్, సింగర్స్; ఎస్పీ బాలు, ధనుంజయ్, దివ్య ఐశ్వర్య, సాయి చరణ్, ప్రశాంత్ బీజే, పి. ఆర్. ఓ; జిల్లా సురేష్. నిర్మాత; యం. శ్రీనివాసులు, రచన- దర్శకత్వం; అనిల్ ఇనమడుగు.*

Super-hit movie 'Sridevi Soda Center' to stream on ZEE5

 Super-hit movie 'Sridevi Soda Center' to stream on ZEE5



ZEE5 Telugu to streaming it as a Diwali gift


ZEE5 is the one platform that brings out a variety of entertainment formats: web series, direct-to-digital releases, original movies, digital releases. It has been dishing out content for the entertainment of worldwide viewership in various languages: from Hindi to Telugu, Tamil, Kannada, Malayalam, Marathi, Bengali to Gujarati. ZEE5 is just a click away on a mobile, tablet, desktop, laptop -- be it in a lockdown or otherwise. From last year's 'Amrutha Ramam', '47 Days' and 'Meka Suri' to this year's 'Battala Ramaswamy Biopic, 'NET' and the most recent 'Alanti Sitralu', ZEE5 has given us a number of direct-to-digital releases. ZEE5 has been offering a unique sort of content.


And ZEE5 has been presenting theatrical hits as well to its patrons. For Dasara, Sree Vishnu-starrer 'Raja Raja Chora' started streaming and it has been a big hit. For Diwali, Sudheer Babu's recent hit 'Sridevi Soda Center' is going to be streamed on ZEE5.


The content-oriented film stars Sudheer Babu and Anandhi in lead roles. Directed by Karuna Kumar and produced by Vijay Chilla and Shashi Devireddy, the film received audiences' applause when it was released in theatres.


How far does an honour-obsessed father go? What kind of ordeals does a man, who falls in love with a woman from a different caste, face? These issues have been portrayed in 'Sridevi Soda Center' in a moving fashion. Critics and audiences lauded it as a great feature film wherein honour is a key theme. ZEE5 is happy to be streaming it as a post-theatrical digital release.


The team of 'Sridevi Soda Center' is elated that India's No. 1 OTT platform is releasing their movie.


Starring Sudheer Babu and Anandhi in lead roles, the film also features Pavel Navageethan, VK Naresh, Raghu Babu, Ajay, Sathyam Rajesh, Harsha Vardhan, Saptagiri, Kalyani Raju, Rohini, Sneha Gupta, Rohini, and others.


Technical Team:


Banner: 70mm Entertainments

Producers: Vijay Chilla, Shashi Devireddy

Written & Directed by: Karuna Kumar

Story Writer: Nagendra Kasi

Music Director: Mani Sharma

Cinematographer: Shamdat Sainuddin

Editor: Sreekar Prasad

Production Designers: Ramakrishna & Monica

Choreographers: Prem Rakshith, Vijay Binni, Yashwanth

Action Directors: Dragon Prakash, KNR (Nikhil), Real Sathish

Lyricists: Sirivennela Seetharama Sastry, Kalyana Chakravarthy, Kasarla Shyam.

Rajesh Touchriver directs controversial film 'Dahini: The Witch'

 Rajesh Touchriver directs controversial film 'Dahini: The Witch'



Tanishtha Chatterjee and JD Chakravarthi are playing lead roles in an upcoming film titled 'Dahini', which is directed by National Award winner Rajesh Touchriver. Also featuring Ashique Hussain, Badrul Islam, Angana Roy, Riju Bajaj, Jagannath Seth, Sruthy Jayan, Dilip Das, and Dattatreya, the film is produced by Orion Pictures International Pvt. Ltd. and SunTouch Productions. Human Rights activist and Padma Shree recipient Sunitha Krishnan and Pradeep Narayanan are jointly producing it. Currently, post-production works are on.


Rajesh's movies are usually inspired by true incidents. It has been his style from the beginning. His movies so far have highlighted a range of social evils. 'Dahini', which is touted to be a bold film, touches upon a subject of human rights concern. The film is about the scourge of witch-hunting, which manifests as gender-based violence. Women become victims of witch-hunting in property disputes or in cases where they are hated for not conforming to societal gender norms.


Shot in Odisha's Mayurbhanj district (where witch-hunting is said to be rampant), the film is close to reality. At the time of researching for the film, the writing department was shocked to know various facts. The audience are sure to be surprised as well. According to the National Crime Records Bureau (NCRB), approximately 2937 women were killed in India between 2001 and 2019 on suspicion of practicing witchcraft. In the year 2019 alone, 102 people were killed. However, only six States have specific legislations which empower police to mention witchcraft as a motive for murder, while witch-hunting is observed in over 17 States. It's evident that the real number of cases could be much higher than the reported numbers. According to government figures, an Indian woman is killed every other day after being suspected of witchcraft. As per the Odisha High Court, in 2021 alone 4 women were murdered every month in Odisha in the name of witchcraft. As per a UN Report, over 25,000 women were murdered in less than 16 years between 1987-2003 in the name of witch-craft in India. Most of these women were single women or widows.  


Through 'Dahini', the makers are seeking to raise awareness about the evil. Talking about the movie, Sunitha Krishnan says, "Even in the modern-day, gender-based violence and savagery are going on. It's unfortunate that we are yet to acknowledge the extent of this gross human rights violation. Our film attempts to expose the existence of the centuries-old evil with the aim of encouraging collective action."


Producer Pradeep Narayanan said, "How are thousands of women being witch-hunted in today's India? Our film is a poignant attempt to openly talk about the shocking issue. I feel fortunate to have produced the movie."


PRO: Surendra Naidu-Phani Kandukuri (Beyond Media); Cinematographer: Noushad Shereef; Production Designer: Sunil Babu; Sound Designer: Ajith Abraham George; Background Score: George Joseph; Editor: Sasi Kumar; Dialogue Writer: Ravi Punnam; Special Make-up Design Artist: NG Roshan; Music: Dr. Gopal Shankar; Story, screenplay, direction: Rajesh Touchriver. 

Prabhas Doing Unique Roles in Upcoming Films

 అయిదు సినిమాల్లో విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్న‌ రెబల్‌స్టార్ ప్ర‌భాస్ 



బాహుబ‌లి సీరీస్ త‌రువాత ప్ర‌పంచం లో వున్న తెలుగు వారే కాకుండా సినిమా అభిమానులంతా ప్రేమించే హీరో రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. ప్ర‌త్యేఖంగా భార‌త‌దేశం లో ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా అన్ని రాష్ట్రాల్లో  అభిమానుల్ని సంపాదించుకున్న పాన్ ఇండియన్‌ స్టార్. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కెరీర్ గ్రాఫ్ పెరిగిన తీరు చూస్తుంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. వ‌రుస‌గా మూడు చిత్రాలు 1000 కోట్ల గ్రాస్ వసూలు చేసిన స్టార్ అయిన‌ప్ప‌టికీ ఏమాత్రం గ‌ర్వం లేకుండా అందరితో చాలా వినమ్రంగా, వినయంగా డార్లింగ్ అంటూ ప్రేమ‌గా మాట్లాడుతూ ఉంటారు. సౌత్ నుండి నార్త్ వెళ్ళి స్టార్ గా నిల‌దొక్కుకున్న హీరోగా ప్ర‌భాస్ కి ప్ర‌త్యేఖ స్థానం వుంది. ఆయ‌న నార్త్ ప్రేక్ష‌కుల అభిమానాన్ని పొందట‌మేకాకుండా నార్త్ స్టార్స్, డైర‌క్ట‌ర్స్ ప్రేమ‌ని కూడా సొంతం చేసుకున్నారు. సాహో చిత్రం సౌత్ కి ధీటుగా నార్త్ లో కూడా క‌లెక్ష‌న్లు అందుకోవ‌డ‌మే దీనికి నిద‌ర్శ‌నం.



అయిదు సినిమాలు అయిదు విభ‌న్న‌మైన జాన‌ర్లు అయిదు ప్రాత‌ల్లో రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 


కెరీర్ పరంగా ఇప్పుడు టాప్ స్పీడ్ లో వున్న‌ ప్రభాస్ 2025 వ‌ర‌కు ఫుల్ బిజీగా ఉండ‌నున్నారు. ప్రస్తుతం 5 సినిమాలతో ప్రేక్ష‌కుల్ని, అభిమానుల్ని అల‌రించేందుకు రెడీ అవుతున్నారు. 5 డిఫ‌రెంట్ జాన‌ర్స్ లో న‌టిస్తూ 5 విభన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌బోతున్నారు.  మరీ ముఖ్యంగా 2022 మొత్తం ప్రభాస్ నామ సంవత్సరంగా మారబోతుంది. 


ఎవ‌రూ ఆ విక్ర‌మాదిత్య‌...! ప్రేమ‌క‌థ‌తో సిద్ధ‌మైన రాధేశ్యామ్


2022 జ‌న‌వ‌రి 14న ల‌వ‌ర్ బాయ్ గా చాలా గ్యాప్ త‌రువాత గొప్ప ‌ప్రేమ‌క‌థ‌తో రాధే శ్యామ్ గా రానున్నారు, ఈ సినిమాను యూవీ క్రియేష‌న్స్ వారు రాధ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ ఇందులో చాలా స్టైలిష్ గా కనిపించ‌నున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన రాధేశ్యామ్ పోస్ట‌ర్ల‌కి, గ్లిమ్ప్స్ వీడియోకి దేశ‌వ్యాప్తంగా విశేషాద‌ర‌ణ ల‌భించింది. అక్టోబ‌ర్ 23న ప్ర‌భాస్ పుట్టిన రోజు సంద‌ర్భంగా రాధేశ్యామ్ టీజ‌ర్ విడుద‌ల అవ్వ‌నుంది


ఫుల్ మాస్ అండ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ స‌లార్


ఛ‌త్ర‌ప‌తి త‌రువాత ఓ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో ప్ర‌భాస్ న‌టిస్తున్న మూవీ స‌లార్, ఈ సినిమాను సైతం 2022లో ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కేజీఎఫ్ సిరీస్ ద‌ర్శ‌కుడ ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమా హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ గా సిద్ధం చేస్తున్నారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ అభిమానుల‌కి ఫుల్ కిక్ ఇచ్చే సినిమాగా స‌లార్ రెడీ అవుతుంది



తొలిసారిగా శ్రీరాముడి పాత్ర‌లో ప్ర‌భాస్


కెరీర్ లో తొలిసారిగా మైథిలాజిక‌ల్ జాన‌ర్ లో తెర‌కెక్కుత‌న్న సినిమాలో న‌టిస్తున్నారు రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్. ఆధిపురుష్ అనే టైటిల్ తో 3డిలో రామాయ‌ణాన్ని భార‌త‌దేశ సినీ ప్రేక్ష‌కుల‌కి అందించ‌డానికి ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ టీ సిరీస్ పూనుకుంది. ఆ బాధ్య‌త‌ను ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఓం ప్ర‌కాశ్ రౌత్ కి అప్ప‌గించింది. ఓం ద‌ర్శ‌క‌త్వంలో సిద్ధం అవుతున్న ఈ సినిమాలో ప్ర‌భాస్ శ్రీరాముడిగా క‌నిపించబోతున్నారు. దేశ‌వ్యాప్తంగా ఈ సినిమా పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.‌


సైన్స్ ఫిక్ష‌న్ ప్ల‌స్ యాక్ష‌న్ ప్రాజెక్ట్ కే


మ‌హాన‌టి సినిమాతో నేష‌న‌ల్ ఐడెంటి సొంతం చేసుకున్న ద‌ర్శ‌కుడు నాగ అశ్విన్, రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కోసం ప్రాజెక్ట్ కే అనే, ఓ సైన్స్ ఫిక్ష‌న్ స్టోరీని సిద్ధం చేశారు. బిగ్ స్క్రిన్ పై ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి ఓ విజువ‌ల్ ట్రీట్ ఇచ్చే మూవీగా ప్రాజెక్ట్ కే రెడీ అవ్వ‌నుంది. అందాల‌తార దీపికా ప‌దుకొణే ఈ సినిమాలో ప్ర‌భాస్ స‌ర‌స‌న న‌టిస్తోంది, బిగ్ బి అమితాబ్ మ‌రో కీల‌కమైన పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు.


వైవిధ్య‌మైన క‌థ‌తో స్పిరిట్


ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా ఓ డిఫ‌రెంట్ స్టోరీని ప్ర‌భాస్ కోసం రెడీ చేశారు. స్పిరిట్ అనే టైటిల్ ని ఈ చిత్రానికి క‌న్ఫార్మ్ చేశారు. రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ 25వ సినిమాగా స్పిరిట్ ప్రేక్ష‌కుల ముందుకి రాబోతుంది. 8 భాష‌ల్లో ఈ చిత్రాన్ని విడుద‌ల చేయ‌బోతున్నారు. 


ఒక వైపు పర్సనల్ లైఫ్ మ‌రియు ప్రోఫెష‌న‌ల్ లైఫ్‌ రెండింటిని సరిగ్గా బ్యాలెన్స్ చేస్తూ కోట్లాది మంది అభిమానాన్ని వారి ప్రేమ‌ని సంపాదించుకున్నారు. రెబ‌ల్‌స్టార్ ప్ర‌భాస్‌ పుట్టినరోజు అంటే తెలుగు సినిమా అభిమాన‌ల‌కు పండగ రోజు. ఇలాంటి పుట్టిన రోజులు ప్ర‌భాస్ ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.. వ‌రుస‌గా 5 పాన్ ఇండియా చిత్రాలు చేస్తున్న హీరోగా ఇండియ‌న్ సినిమా లో ప్ర‌త్యేఖ‌స్ధానం సొంతం చేసుకున్న రెబ‌ల్ స్టార్ ప్ర‌భాస్ కి జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు

Tremendous Response for Chill Bro Mangli Song

 చిల్ బ్రో నుంచి మంగ్లీ పాడిన బొడ్రాయి పాట‌కు అనూహ్య స్పంద‌న‌



అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ లో ప్రొడ‌క్ష‌న్ నెంబ‌ర్ 1గా రాబోతున్న మూవీ చిల్ బ్రో. మొద‌టి సినిమా అయినప్ప‌టికీ నిర్మాతగా శ్రీను చెంబేటీ ఈ సినిమాను అత్యంత ప్ర‌తిష్ఠాత్మ‌కంగా నిర్మించారు. సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు ముఖ్య తారాగ‌ణంగా న‌టిస్తున్న ఈ సినిమాను ల‌వ్ అండ్ ఫ్యామిలీ ఎంట‌ర్ టైనర్ గా ద‌ర్శ‌కుడు కుంచం శంక‌ర్ తెర‌కెక్కిస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌లైన చిల్ బ్రో ప‌బ్లిసిటీ కంటెంట్ కి ప్రేక్ష‌కులు నుంచి అనూహ్య‌మైన స్పంద‌న ల‌భించింది. ఈ నేప‌థ్యంలో పముఖ గాయ‌ని మంగ్లీ పాడిన బొడ్రాయి అంటూ సాగే పాట‌ను చిత్ర బృందం విడుద‌ల చేశారు. మంగ్లీ వాయిస్ కి, మ్యూజిక్ డైరెక్ట‌ర్ సురేశ్ బొబ్బిలి ఇచ్చిన ట్యూన్స్ వెర‌సీ ఈ పాట ప్ర‌స్తుతం ట్రెండ్ అవుతుంది. మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌లైంది. అతి త్వ‌ర‌లో ఈ చిత్రాన్ని విడుదల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్న‌ట్లుగా నిర్మాత శ్రీను చెంబెటీ తెలిపారు.



న‌టీన‌టులు


సూర్య శ్రీనివాస్, ప‌వ‌న్ కేసి, రూపిక‌, ఇందు


సాంకేతిక నిపుణులు


బ్యాన‌ర్ - అరుణోద‌య ప్రొడ‌క్ష‌న్


నిర్మాత - శ్రీను చెంబేటి


దర్శ‌క‌త్వం - కుంచం శంక‌ర్


మ్యూజిక్ - సురేశ్ బొబ్బిలి

Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati

 Naga Shaurya Is Back With Varudu Kavalenu: Rana Daggubati



~ Proud To Be Part Of Varudu Kavalenu: Naga Shaurya

~ Varudu Kavalenu Trailer Launch Was Fun-Filled Event


Successful production house Sithara Entertainments is producing Naga Shaurya and Ritu Varma-starrer Varudu Kavalenu. The film marks the directorial debut of Lakshmi Sowjanya and is all set for grand theatrical release on 29th October, 2021. The trailer of the film was unveiled last night in Hyderabad in a grand event which had the attendance of Rana Daggubati. The event was fun-filled and thoroughly entertaining with Naga Shaurya, director Lakshmi Sowjanya and producer Naga Vamsi interacting with the social influencers and answering their funny questions.


Speaking at the event, Rana Daggubati said, "Naga Shaurya is a symbol for good guy. The proverb that comes to one's mind about Shaurya is 'Ramu is a good boy'. 'Varudu Kavalenu' is a great title and it is apt for Shaurya. Even if one doesn't reveal the hero's name, looking at the title we can expect that Naga Shaurya is the hero of the film. Trailer is interesting and promising. Theatres are back. Movies are back. Naga Shaurya is also back with 'Varudu Kavalenu'. I wish all the best for the entire team. Today, I didn't come here as a guest. I came for my 'Bheemla Nayak' producer Naga Vamsi. I came from straight from the shooting location. I'm sure he will score success with 'Varudu Kavalenu' too."


Talking at the trailer launch, Naga Shaurya said, "During Chalo success party, director Sowjanya Akka came to me and asked me whether I would do a film if I like her story. She had told me the storyline of 'Varudu Kavelnu' and I was mighty impressed. After hearing the whole story, I decided that the movie is going to be a big hit. On paper itself, movie is a hit. I'm sure the movie will be big hit on big screens as well. Initially I had thought it was a small movie. But with the addition of a prestigious banner like Sithara Entertainments, the film has become bigger. Producers Chinna Babu Garu and Naga Vamsi Garu are very passionate. They understand the cinema well. They don't confine a budget to a film based on the hero. They provide budget to the film based on its story and the scale required for the story. Chinna Babu Garu is a true maker. He knows best what all a film requires. 'Varudu Kavalenu' caters to all sections of audiences. The film is well balanced such that both family audiences and youth audiences would enjoy thoroughly. The film has really shaped up well. Final output is very good and we're all quite confident of the film's success. All the characters in the film really look fresh. Thanks to Ganesh Ravuri's dialogues which are appealing. The credit for showing me handsome on screen goes to our Cinematographer Vamsi Pachipulusu. His camera work is so nice such that I fell in love with myself after seeing me on screen. Music composer Vishal Chandrasekhar has delivered good tunes. Director Sowjanya Akka has made it so easy and comfortable for me. She has loved the film a lot. Finally, her dreams are turning into real with this movie. Ritu Varma has acted so well. She couldn't make it to the today's event as she is busy shooting for another movie. I'm really proud to choose the story of 'Varudu Kavalenu' and being part of the film. Thanks to Rana Daggubati Anna for coming all the way and releasing our film's trailer."


Responding to some funny questions posed by onlookers and social influencers who attended the trailer launch event, Naga Shaurya said, "I'm very cool in real-life. I'm okay even if my future wife is dominating. At the same time, I won't adjust in all the matters. I know very well when to reverse. I have reduced 16 kilos of my weight from my previous film. This is the change and uniqueness you can see in me on screen in 'Varudu Kavalenu'. It is a classic film where family audiences can enjoy it to the core."


Speaking after the trailer launch, Producer Naga Vamsi said, "Family entertainments have always been top of our priority. We at Sithara Entertainments were fortunate to taste successes with this genre. 'Varudu Kavalenu' is a family entertainment with commercial touch. It will appeal to family audiences as well as youth audiences. There is a suspense element in the second half of the film which will stand out. Youth will connect to that suspense element."


Director Lakshmi Sowjanya thanked Rana Daggubati for gracing the event and launching the film's trailer. Dialogue writer Ganesh Ravuri said Bhumi and Akash are well-designed characters who are perfect match. He said that the characters are so pleasant to watch on screen. He said the film has fun, emotions and good music in right proportions. "After listening to the story, hero Naga Shaurya Garu said the movie will be a blockbuster. He is right. The outside talk about the film is also the same. Ritu Varma has never played such character. She is perfect for Bhumi's character. Nadiya's role is very crucial in the film. I thank my producers for giving me this opportunity to pen dialogues in the film," said dialogue writer Ganesh Ravuri.


Song writer Rambabu Gosala, who penned the song 'Kola Kalle Ila', said he has penned good lyrics for the song. He said music director Vishal Chandrasekhar has done magic with music. He said Sid Sriram has sung the song nicely. Rambabu added that lead actors Naga Shaurya and Ritu Varma are looking glamorous in this song. He said Sithara Entertainments is encouraging him and thanked them for their support.


Comedian Sapthagiri said, "Those who missed my comedy will get a feast with my character in 'Varudu Kavalenu'. Especially, second-half will have out-and-out entertainment. The word 'lag' will play significant role in the film which everyone will enjoy on screen. My character is a tailor-made one and the director, producers wanted me to play it. I thank them."


Music composer Vishal Chandrasekhar shared, "Songs in 'Varudu Kavalenu' have come out really well. Singers and musicians have given their best. The two songs composed by Thaman are so nice. I'm glad to be part of this film."


Naga Shourya and Ritu Varma as a leading pair, Nadiya, Murali Sharma, Vennela Kishore, Praveen, Ananth, Kiriti Damaraju, Rangasthalam Mahesh, Arjun Kalyan, Vaishnavi Chaitanya, Siddiksha are the main leads.


For this movie

Dialogues: Ganesh Kumar Ravuri,

Cinematographer: Vamsi Patchipulusu,

Music : Vishal Chandrashekhar

Editor: Navin Nooli

Art: A.S Prakash

PRO: Lakshmivenugopal

Presents by: P.D.V Prasad

Produced by: Surya Devara NagaVamsi

Story- Direction:Lakshmi Sowjanya

Darja First Look Launched

 మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించిన ‘దర్జా’ టైటిల్ లుక్ పోస్టర్



శ్రీ కామినేని శ్రీనివాస్ సమర్పణలో, పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సునీల్, అనసూయ ప్రధాన పాత్రలలో ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రం ‘దర్జా’. సలీమ్ మాలిక్ దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ చిత్రానికి శివశంకర్ పైడిపాటి నిర్మాత. ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా రవి పైడిపాటి వ్యవహరించనున్నారు. ఈ చిత్రం ఇటీవలే పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్ర టైటిల్ లుక్ పోస్టర్‌ను మాజీ హెల్త్ మినిస్టర్ కామినేని శ్రీనివాస్ ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘శివ శంకర్ నాకు అన్ని విషయాల్లో చేదోడు వాదోడుగా ఉంటాడు. ఆయన నిర్మిస్తోన్న ‘దర్జా’ చిత్ర టైటిల్ లుక్ చాలా బాగుంది. ఈ చిత్రయూనిట్‌కు ఈ సినిమా మంచి పేరు తీసుకురావాలని కోరుతున్నాను..’’ అన్నారు.


ఈ సందర్భంగా దర్శకనిర్మాతలు మాట్లాడుతూ.. ‘‘మా చిత్ర టైటిల్ లుక్‌ని విడుదల చేసిన శ్రీ కామినేని శ్రీనివాస్‌గారికి ధన్యవాదాలు. సీనియర్ నటీనటులు, నూతన నటీనటుల కలయికలో ఈ చిత్రం తెరకెక్కనుంది. హైదరాబాద్, భీమవరం, మచిలీపట్నం వంటి ప్రదేశాలలో షూటింగ్ జరపనున్నాం. ప్రస్తుతం రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కే ఈ చిత్రంలో సునీల్, అనసూయ పాత్రలు హైలెట్‌గా ఉంటాయి. చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేయనున్నాం..’’ అని తెలిపారు.


సునీల్, అనసూయ, అక్సాఖాన్, షమ్ము, సత్యనారాయణరాజు (సత్తిపండు), షకలక శంకర్, సుధ, సూర్య, మిర్చి హేమంత్, ఛత్రపతి శేఖర్, షేకింగ్ శేషు, జబర్దస్త్ నాగిరెడ్డి, సమీర్ తదితరులు నటిస్తోన్న ఈ చిత్రానికి

కెమెరా: దర్శన్,

సంగీతం: రాప్ రాక్ షకీల్,

ఎడిటర్: ఎమ్.ఆర్. వర్మ,

కథ: నజీర్,

మాటలు: పి. రాజేంద్రకుమార్,

ఎగ్జిక్యూటీవ్ ప్రొడక్షన్ మేనేజర్: బందర్ బాబీ,

స్ర్కిఫ్ట్ కో ఆర్డినేటర్: పురుషోత్తపు బాబీ,

పీఆర్ఓ: బి. వీరబాబు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌: రవి పైడిపాటి,

నిర్మాత: శివశంకర్ పైడిపాటి,

స్ర్కీన్‌ప్లే-దర్శకత్వం: సలీమ్ మాలిక్.


Hero Sriram Interview

 



వాస్త‌వ ఘ‌ట‌న‌ల ఆధారంగా రూపొందిన "అస‌లేం జ‌రిగింది" సినిమా tomorrow థియేట‌ర్ల‌లో విడుద‌ల కానుంది.  గ‌తంలో 'ఒక‌రికి ఒక‌రు' సినిమాలో న‌టించిన శ్రీ‌రామ్ ఈ సినిమాతో మ‌ళ్లీ హీరోగా తిరిగొస్తున్నారు. ఇంత‌కుముందు సినిమాటోగ్రాఫ‌ర్‌గా చేసిన ఎన్‌వీఆర్ ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌గా మైనేని నీలిమా చౌద‌రి, కొయ్యాడ కింగ్ జాన్స‌న్ క‌లిసి ఎక్సోడ‌స్ మీడియా ప‌తాకంపై నిర్మించారు. సంచితా ప‌దుకొనే హీరోయిన్‌గా న‌టించింది. గ్రామీణ నేప‌థ్యంతో కూడిన ఈ సినిమా స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ ల‌వ్‌స్టోరీగా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఇందులో ప్రేమ‌, స‌స్పెన్స్, యాక్ష‌న్.. అన్నీ రంగ‌రించి ఉంటాయి. సినిమా గురించి మీడియా ప్ర‌శ్న‌ల‌కు హీరో శ్రీ‌రామ్ ఇలా చెప్పారు..


ఈ ప్రాజెక్టు చేయాల‌ని ఎందుకు అనిపించింది?

రాఘ‌వ (ఎన్‌వీఆర్‌) మంచి ద‌ర్శ‌కుడు, క‌థ‌కుడు. అస‌లేం జ‌రిగింది సినిమా క‌థ నాకు చెప్పేట‌ప్పుడే దాంతో ప్రేమ‌లో ప‌డిపోయాను. క‌థ వినేట‌ప్పుడే ఇది మంచి ప్రాజెక్టు అయినా, ఇందులో చాలా ప‌రిమితులుంటాయ‌ని అర్థ‌మైంది. సినిమాలు చేయ‌డంలో ఈ బృందం మొత్తం చాలా ఉత్సాహంగా ఉండి, నిజాయితీగా ప్ర‌య‌త్నాలు చేస్తుంద‌ని నాకు తెలియ‌డంతో.. ఇందులో చేసి తీరాల‌ని నిర్ణ‌యించుకున్నాను.


డ‌బ్బింగ్‌లో తెలంగాణ యాస చెప్ప‌డం క‌ష్టం అనిపించిందా?

ఇంత‌కుముందు నా సినిమాల‌కు తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకునేట‌ప్పుడు కొన్ని ప‌దాలు ఇలా కాదు, అలా అనాల‌ని చెప్పేవారు. నాకు హైద‌రాబాదీ తెలుగు బాగా వ‌చ్చు. అది తెలంగాణ యాస‌కు ద‌గ్గ‌ర‌గా ఉండ‌టంతో నా ప‌ని సులువైంది. హైద‌రాబాదీని కావ‌డంతో ఈ సినిమా డ‌బ్బింగ్ చెప్ప‌గ‌లిగాను. అదొక్క‌టే కాదు, తెలంగాణ ప‌ల్లెల్లో షూటింగ్ జ‌ర‌గ‌డంతో ఇప్ప‌టివ‌ర‌కూ ఎప్పుడూ చూడ‌ని ప్రాంతాల‌కు వెళ్ల‌గ‌లిగాను. నాపై న‌మ్మ‌కం ఉంచినందుకు నిర్మాత జాన్స‌న్ కు కృత‌జ్ఞ‌త‌లు.


చెన్నై నుంచి ఇక్క‌డ‌కు షూటింగ్ రావ‌డం ఇబ్బంది అనిపించ‌లేదా?

మొద‌ట్లో అంద‌రూ అలాగే అనుకున్నారు. కానీ చ‌క‌చ‌కా సింగిల్ టేక్‌ల‌లోనే షాట్ల‌న్నీ ఓకే అవుతున్న తీరు చూసి మా యూనిట్ అంతా ఆశ్చ‌ర్య‌పోయింది. మ‌రిన్ని తెలుగు సినిమాలు చేయాల‌ని అంద‌రూ కోరారు. నిజంగానే అవ‌కాశాలొస్తే త‌ప్ప‌కుండా తెలుగు సినిమాలు చేస్తా. రొమాన్స్, ప్రేమ, ఫిక్ష‌న్.. అన్నీ క‌ల‌గ‌లిసి ఉన్న ఈ సినిమాలో పాట‌ల్లోని సాహిత్యం నాకు చాలా బాగా న‌చ్చింది.


కొత్త హీరోయిన్‌తో చేయ‌డం ఇబ్బంది కాలేదా?

సంచిత సినిమాల‌కు కొత్తే అయినా చాలా క‌ష్ట‌ప‌డి ప‌నిచేసే త‌త్వం ఆమెది. భాష తెలియ‌క‌పోయినా, త‌న శాయ‌శ‌క్తులా క‌ష్ట‌ప‌డింది. ఈ సినిమా షూటింగ్ బాగా వేడివాతావ‌ర‌ణంలో జ‌ర‌గ‌డం, కొన్నిసార్లు అస‌లు గ్యాప్ లేకుండా చేయ‌డం.. ఇలాంటివి ఎన్నో ఉన్నా అన్నింటినీ సుల‌భంగా త‌ట్టుకుంది. కొన్ని లొకేష‌న్లు అస‌లు అమ్మాయిల‌కు స‌రిపోయేవి కావు. అయినా ఆమె ముందుకు రావ‌డం నాకు చాలా న‌చ్చింది.


సినిమా గురించి ఏమంటారు?

ప్ర‌తి ఒక్క‌రూ త‌ప్ప‌కుండా చూసి తీరాల్సిన సినిమా ఇది. టీం మొత్తం చాలా నిజాయితీగా ప‌ని చేసింది. అందుకే ఈ సినిమా చాలా ఆహ్లాద‌క‌రంగా ఉండ‌బోతోంది.

Natasimha Balakrishna Launched Jetti Movie Trailer

 'నటసింహం' బాలకృష్ణ చేతుల మీదుగా జెట్టి సినిమా ట్రైలర్ విడుదల




నందిత శ్వేతా, మాన్యం కృష్ణ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న సినిమా

"జెట్టి". తెలుగు, తమిళ, కన్నడ,  మలయాళ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల

ముందుకు రానుంది. వర్ధిన్ ప్రొడక్షన్స్ పతాకంపై వేణు మాధవ్ కె ఈ

చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సుబ్రమణ్యం పిచ్చుక దర్శకుడు. త్వరలో

విడుదలకు సిద్ధమవుతున్న "జెట్టి" సినిమా  ట్రైలర్ ను నటసింహం బాలకృష్ణ

విడుదల చేశారు. ట్రైలర్ బాగుందన్న ఆయన..చిత్ర బృందానికి ఆల్ ద బెస్ట్

చెప్పారు.


"జెట్టి" ట్రైలర్ చూస్తే...నా ఆశ కంటే మా నాన్న ఆశయం ముఖ్యం హీరోయిన్

చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ప్రారంభమైంది. ఊరికి జెట్టిని తీసుకురావాలనే

తండ్రి ఆశయాన్ని సాధించేందుకు కూతురుగా రాజీలేని పోరాటం చేస్తుంది.

జెట్టి వల్ల పర్యాటకం పెరిగి ఊరు బాగుపడుతుంది. జనం బాగుపడటం ఇష్టంలేని

విలన్లు జెట్టి కాదు కదా మట్టిని కూడా తీసుకురానివ్వం అంటూ

అడ్డుపడుతుంటారు. హీరో మాన్యం కృష్ణ మాన్యం అనే పాత్రలో నటించారు. అతని

సహాయంతో ఈ ప్రతినాయకుల స్వార్థాన్ని నాయిక ఎలా ఎదుర్కొంది, వీళ్లంతా

ఊరికి జెట్టిని తీసుకొచ్చారా లేదా అనేది ఆసక్తికరంగా ఉండబోతోంది. సినిమా

మత్స్యకార జీవనం, స్థితిగతులు, వారి జీవనంలోని భావోద్వేగాలను సహజంగా

చూపించినట్లు ట్రైలర్ ద్వారా తెలుస్తోంది.



ఈ సందర్భంగా నిర్మాత వేణు మాధవ్ మాట్లాడుతూ...మా "జెట్టి" సినిమా ట్రైలర్

ను నటసింహం బాలకృష్ణ గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. ఆయన ట్రైలర్ చూసి

బాగుందని ప్రశంసించడం ఎంతో ప్రోత్సాహాన్ని ఇచ్చింది. మా యూనిట్ అందరి

తరుపున బాలకృష్ణ గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. ఓ మత్య్సకార గ్రామంలో

జరిగిన ఘటనలను ఆధారంగా తీసుకుని "జెట్టి" సినిమాను నిర్మించాం.

మత్య్సకారుల జీవన విధానాలను, వారి కట్టుబాట్లను, ఇప్పటి వరకూ వెండితెరమీద

కనిపించని జీవితాలను చక్కగా చిత్రీకరించారు మా దర్శకుడు సుబ్రమణ్యం

పిచ్చుక. త్వరలోనే థియేటర్ లలో "జెట్టి" సినిమాను మీ ముందుకు

తీసుకొస్తాం. అన్నారు.


నటీ నటులు : నందిత శ్వేత‌, మాన్యం కృష్ణ , క‌న్న‌డ కిషోర్, మైమ్ గోపి,

ఎమ్ య‌స్ చౌద‌రి, శివాజీరాజా, జీవా, సుమ‌న్ షెట్టి తదితరులు


సాంకేతిక నిపుణులు : బ్యానర్ : వర్ధని ప్రొడక్షన్స్, మ్యూజిక్ :

కార్తిక్ కొండ‌కండ్ల‌, డిఓపి:  వీర‌మ‌ణి, ఆర్ట్ ః ఉపేంద్ర రెడ్డి,

ఎడిటర్:  శ్రీనివాస్ తోట‌, స్టంట్స్: దేవరాజ్ నునె, కోరియోగ్రాఫర్ :

అనీష్, పబ్లిసిటీ డిజైనర్:  సుధీర్, డైలాగ్స్ ః శ‌శిధ‌ర్, పిఆర్ ఓ :

జియస్ కె మీడియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్ః పండ్రాజు శంక‌ర్రావు ,

నిర్మాత ః వేణు మాధ‌వ్,  క‌థ‌, స్క్రీన్ ప్లే, డైరెక్ష‌న్ ః

సుబ్ర‌హ్మ‌ణ్యం  పిచ్చుక.

MISSING movie promotional song launched by Dir Krish

 దర్శకుడు క్రిష్ విడుదల చేసిన “మిస్సింగ్” సినిమా ప్రమోషనల్ సాంగ్

ఈ నెల 29న థియేటర్లలో సినిమా విడుదల



హర్షా నర్రా, నికీషా రంగ్వాలా, మిషా నారంగ్ హీరో హీరోయిన్లుగా నటించిన

సినిమా “మిస్సింగ్”. ఈ చిత్రాన్ని బజరంగబలి క్రియేషన్స్ పతాకంపై భాస్కర్

జోస్యుల, లక్ష్మీశేషగిరి రావు నిర్మించారు. “మిస్సింగ్” చిత్రంతో శ్రీని

జోస్యుల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి

చేసుకున్న “మిస్సింగ్” చిత్రం  ఈనెల 29న థియేటర్లలో రిలీజ్ అయ్యేందుకు

రెడీ అవుతోంది. గురువారం చిత్ర ప్రమోషనల్ సాంగ్ ఖుల్లమ్ ఖుల్లాను ప్రముఖ

దర్శకుడు క్రిష్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్

లో


హీరో హర్షా నర్రా మాట్లాడుతూ...మా “మిస్సింగ్” సినిమాలోని ప్రమోషనల్

సాంగ్ ఖుల్లమ్ ఖుల్లా ను రిలీజ్ దర్శకుడు క్రిష్ గారికి చాలా థాంక్స్.

అనురాగ్ కులకర్ణి బాగా పాడాడు. అంతా కొత్తవాళ్లం చేసిన ప్రయత్నమిది.

తప్పకుండా మీకు నచ్చేలా ఉంటుంది. థియేటర్ లలో ఈనెల 29న విడుదల చేసేందుకు

రెడీ అయ్యాం. థియేటర్ లోనే ఎందుకు అంటే, మిస్సింగ్ మూవీని థియేటర్ లో

చూసే ఎక్సీపిరియన్స్ వేరుగా ఉంటుంది. మా సినిమాలోని విజువల్స్, సౌండింగ్,

మేకింగ్ థియేటర్స్ కే కరెక్ట్. మంచి థ్రిల్లర్ మూవీ చేశాం. ఫ్యామిలీ అంతా

చూసేలా సినిమా ఉంటుంది. కమర్షియాలిటీ కోసం అడల్ట్ సీన్స్, ఇతర అంశాలు

సినిమాలో ఉండవు. సినిమా చూశాక మీకు నచ్చితే పది మందికి చెప్పండి. సినిమా

బాగుందని తెలియాలంటే మౌత్ టాక్ ఇంపార్టెంట్. మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న

మీడియాకు థాంక్స్. అన్నారు.


నటుడు అశోక్ వర్థన్ మాట్లాడుతూ...ఇటీవల క్రిష్ గారి సినిమా కొండపొలంలో

నటించాను. నాకు అవకాశం ఇచ్చిన క్రిష్ గారికి థాంక్స్. అలాగే మా మిస్సింగ్

సినిమా ప్రమోషనల్ సాంగ్ రిలీజ్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు చెబుతున్నాం.

మిస్సింగ్ సినిమాను మా దర్శకుడు శ్రీని జోస్యుల సూపర్బ్ గా

తెరకెక్కించారు. సినిమా అంతా బాగుంటుంది, కొన్ని సీన్స్ అయితే అద్భుతంగా

వచ్చాయి. చిన్న సినిమాకు ప్రేక్షకుల మౌత్ టాక్ చాలా ముఖ్యం. మీకు నచ్చితే

మీ ఫ్యామిలీని తీసుకుని మిస్సింగ్ సినిమాకు రండి. అన్నారు.


హీరోయిన్ నికీషా మాట్లాడుతూ...మిస్సింగ్ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది.

థియేటర్ లలో మిమ్మల్ని కలుసుకునేందుకు వెయిట్ చేస్తున్నాము. ఈ సినిమాలో

మిస్ అయ్యేది నేనే. నాకోసం హీరో సహా మిగతా వాళ్లంతా సెర్చ్ చేస్తుంటారు.

సినిమా మీకు థ్రిల్లింగ్ ఎక్సీపిరియన్స్ ఇస్తుంది. తప్పకుండా థియేటర్ కు

వచ్చి మిస్సింగ్ మూవీ చూడండి. అన్నారు.


హీరోయిన్ మిషా నారంగ్ మాట్లాడుతూ...మా మిస్సింగ్ మూవీకి మీరు ఇస్తున్న

టైమ్ అండ్ సపోర్ట్ కు థాంక్స్. ఇదొక యూనిక్ సబ్జెక్ట్ ఉన్న సినిమా.

మిస్సింగ్ సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. థ్రిల్లింగ్, రొమాన్స్,

సస్పెన్స్ ఇలా మీకు నచ్చే అన్ని ఎలిమెంట్స్ తో సినిమాను తెరకెక్కించారు

దర్శకుడు శ్రీని. మా టీమ్ కోసం మీ దగ్గర్లోనే థియేటర్ లలో ఈనెల 29న

మిస్సింగ్ చూడండి. అన్నారు.


సూర్య, ఛత్రపతి శేఖర్, రామ్ దత్, విష్ణు విహారి, అశోక్ వర్థన్, వినోద్

నువ్వుల తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సాహిత్యం -

వశిష్ఠ శర్మ, కిట్టు విస్సాప్రగడ, శ్రీని జోస్యుల, మేకప్ - వెంకటేష్ బాల,

కాస్ట్యూమ్స్ -  టీఎస్ రావు, ప్రొడక్షన్ డిజైనర్ - దీక్ష రెడ్డి,

కాస్ట్యూమ్స్ డిజైనర్ : శ్రుతి కిరణ్, ఆర్ట్ - దార రమేష్ బాబు, పైట్స్ -

పి. సతీష్, డాన్స్ - బంగర్రాజు, జీతు, స్టిల్స్ - గుంటూరు రవి,

ప్రొడక్షన్ కంట్రోలర్ - బి సి చౌదరి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - సాయి

కె కిరణ్, ఎడిటర్- సత్య జి, సంగీతం - అజయ్ అరసాడ, సినిమాటోగ్రఫీ - జనా.

డి, పీఆర్వో - జీఎస్ కె మీడియా, నిర్మాతలు - భాస్కర్ జోస్యుల, లక్ష్మీ

శేషగిరిరావు నర్రా, కథా మాటలు స్క్రీన్ ప్లే దర్శకత్వం - శ్రీని జోస్యుల.

Suhas Family Drama in Sony Liv on October 29th

 ఈ నెల 29న 'సోని లివ్' లో సుహాస్ "ఫ్యామిలీ డ్రామా" విడుదల



ఎగ్జైటింగ్ కంటెంట్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తున్న సోని లివ్ ఓటీటీ

మరో థ్రిల్లింగ్ మూవీని రిలీజ్ చేయబోతోంది. ఆ చిత్రమే సుహాస్ హీరోగా

నటించిన "ఫ్యామిలీ డ్రామా". కలర్ ఫొటో చిత్రంతో విజయాన్ని అందుకున్న యువ

నటుడు సుహాస్ కొత్త సినిమా "ఫ్యామిలీ డ్రామా" ఈ నెల 29న సోని లివ్ లో

స్ట్రీమింగ్ కానుంది. మెహెర్ తేజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

"ఫ్యామిలీ డ్రామా" చిత్ర ట్రైలర్ ను 'సోని లివ్' రిలీజ్ చేసింది. ఆ

ట్రైలర్ ఎలా ఉందో చూస్తే..


బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఆసక్తికరంగా సాగింది ఫ్యామిలీ డ్రామా

ట్రైలర్.  ‘ఈత రానివాడు సముద్రాన్ని తిట్టుకుంటే ఎంత అసహ్యంగా ఉంటుందో..

వినడం రానివాడు సంగీతం గురించి మాట్లాడినా అంతే అసహ్యంగా ఉంటుంది’ అని

సుహాస్‌ చెప్పిన డైలాగ్‌ మెప్పిస్తుంది.  సుహాస్‌ హత్యలు చేసే

సన్నివేశాలు ఉత్కంఠ పెంచాయి. ప్రతి చిన్న విషయానికి తండ్రి బూతులు

తిడుతున్నాడనే కారణంగా ఇల్లు వదిలి వెళ్లిపోయిన ఓ అబ్బాయి, తన ఇంట్లో

పరిస్థితులు నచ్చక బయటకి వచ్చేసిన ఓ అమ్మాయి.. ఈ ఇద్దరూ ఎలా కలిశారు?

వీరికి సుహాస్ ఎలా సాయపడ్డాడు? అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతున్నట్టు

ట్రైలర్‌ చూస్తే అర్థమవుతుంది. టెక్నికల్ అంశాలతో పాటు ఆర్టిస్టుల

పర్మార్మెన్స్ లు ఇంటెన్స్ గా ఉన్నాయి.


మ్యాంగో మాస్‌ మీడియా సమర్పణలో తేజా కాసరపుతో కలిసి మెహెర్‌ తేజ్‌ ఈ

చిత్రాన్ని నిర్మించారు. తేజ కాసరపు, పూజా కిరణ్‌, అనూష నూతుల, శ్రుతి

మెహర్‌, సంజయ్‌ రథా తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సంగీతం:

అజయ్‌, సంజయ్‌, ఛాయాగ్రహణం: వెంకట్‌ ఆర్‌. శాఖమూరి, దర్శకత్వం - మెహెర్

తేజ్.


Sonal Chouhan Joined F3 Shoot

 వెంకటేష్, వరుణ్ తేజ్, అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ‘ఎఫ్ 3’ షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన్



ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్ 3 సినిమాతో  ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందించేందుకు రెడీ అవుతున్నారు. ఎఫ్2లో ఉన్నట్టుగానే విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తమ పాత్రలను పోషిస్తున్నారు. ఇక సునీల్ మాత్రం కొత్తగా ఈ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. దిల్ రాజు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ మీద శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.


తమన్నా, మెహరీన్‌లు  హీరోయిన్లుగా నటిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు మరింత గ్లామర్ డోస్‌ను  ఇచ్చేందుకు హీరోయిన్ సోనాల్ చౌహాన్‌ను కాస్టింగ్ లోకి తీసుకున్నారు. ప్రస్తుతం జరుగుతున్న షెడ్యూల్‌లోనే సోనాల్ చౌహాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు. ఈ మేరకు మేకర్స్ సోనాల్ చౌహాన్ పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది.


హైద్రాబాద్‌లో గత కొన్ని రోజుల క్రితం ప్రారంభించిన ఈ సుధీర్ఘ షెడ్యూల్‌తో  దాదాపు ముఖ్య తారాగణం పాల్గొంటున్నారు.


రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ ఎఫ్ 3 కోసం సూపర్ హిట్ ఆల్బమ్‌ను  రెడీ చేశారు. సాయి శ్రీరామ్ కెమెరామెన్‌గా,  తమ్మిరాజు ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. హర్షిత్ రెడ్డి కో ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.


నటీనటులు : వెంకటేష్, వరుణ్ తేజ్, తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్, సునీల్, సోనాల్ చౌహాన్ తదితరులు


సాంకేతిక బృందం


డైరెక్టర్ : అనిల్ రావిపూడి

సమర్పణ : దిల్ రాజు

నిర్మాత : శిరీష్

బ్యానర్ : శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్

కో ప్రొడ్యూసర్ : హర్షిత్ రెడ్డి

సంగీతం : దేవీ శ్రీ ప్రసాద్

కెమెరామెన్ : సాయి శ్రీరామ్

ఆర్ట్ : ఏఎస్ ప్రకాష్

ఎడిటింగ్ : తమ్మిరాజు

స్క్రిప్ట్ కో ఆర్డినేటర్ : ఎస్ కృష్ణ

అడిషనల్ స్క్రీన్ ప్లే : ఆది నారాయణ, నారా ప్రవీణ్

Kiran Abbavaram’s “Sammathame” First Glimpse Out

 Kiran Abbavaram’s “Sammathame” First Glimpse Out



Young and energetic hero Kiran Abbavaram has been attempting distinctive subjects. While his first film Raja Vaaru Rani Gaaru was a rustic romantic drama, his second movie SR Kalyanamandapam was a romantic action drama. His first two films were commercial hits. Now, Kiran Abbavaram comes up with a musical romantic entertainer “Sammathame” story of which is set in urban backdrop.


Title and first look poster of “Sammathame” received tremendous response and today the makers released first glimpse of the film. It shows contrasting characters of the lead pair. While Kiran Abbavaram is cool and soft guy, his colleague Chandini Chowdary is very chill out type. She drinks and smokes, much to his surprise.


Understanding his disquiet, Chandini comes up with a game plan of making conversations using song lyrics. She puts in a condition that one who sings instead of expressing their feelings through songs loses the game. Then, they are seen making conversations using some melodious and romantic songs which gives a whole new experience to audience.


Kiran Abbavaram and Chandini Chowdary are super cool in their respective roles. Director Gopinath Reddy came up with a different love story and the first glimpse has full of positive vibes. Cinematography by Sateesh Reddy Masam and background score by Sekhar Chandra compliments each other.


Produced by Kankanala Praveena under UG Productions banner, “Sammathame” is nearing completion. Only small shooting schedule is left pending. The makers are planning to release the movie soon.


Cast: Kiran Abbavaram, Chandini Chowdary and others.


Technical Crew:

Story, Screenplay, Direction: Gopinath Reddy

Producer: Kankanala Praveena

Banner: UG Productions

Music Director: Sekhar Chandra

DOP: Sateesh Reddy Masam

Editor: Vilpav Nyshadam

Art Director: Sudheer Macharla

PRO: Vamsi-Shekar

Rowdy Boys Preme Akasam Song Launched by Vijay Deverakonda




Preme Aakasamaithe' song from 'Rowdy Boys' released by Rowdy hero Vijay Deverakonda 


Producer Dil Raju and Aditya Music have collaborated for 'Rowdy Boys', which is presented by Smt. Anitha on Sri Venkateswara Creations. Directed by Sree Harsha Konuganti, the film is produced by Dil Raju and Shirish. Ashish, who is the son of Shirish, comes from the family of the two producers, who have made a number of successful films loved by the audience. On Wednesday, a song titled 'Preme Aakasamaithe' from the movie was released at an event. Rowdy hero Vijay Deverakonda graced the occasion as the chief guest. 


Speaking on the occasion, Vijay Deverakonda said, "I have known the director, Ashish, and Anupama Parameswaran for many years. I am happy to be releasing a song from their movie today. I have known Harsha since even before 'Pelli Choopulu'. He happened to narrate the story of 'Husharu', his first movie, to me back then. He is someone who understands the tastes of young audiences. I am confident that 'Rowdy Boys' will connect with them. I hope this film becomes a big hit. Anupama is a very good performer. The first film is always special. Ashish must be enjoying this special feeling. He is an actor with loads of curiosity in him. Dil Raju garu and Shirish garu, who are the actual 'rowdy boys', are not ordinary. They have made it big in the film industry coming from Nizamabad. They are fighters who are always into theatrical releases and collections. They are now producing movies on a pan-India scale. I wish that Ashish makes them proud. They are an inspiration to me. I am waiting to do a mind-blowing movie with Raju garu. It will be announced soon. 'Rowdy Boys' is coming out on November 19 and I wish the team all the best."


Producer Dil Raju said, "'Rowdy Boys' is a pakka youthful movie. The first song (title track) and teaser have been a hit. The story takes place in the backdrop of a college. You have to watch the movie to know the sort of romantic content in the movie. The title is apt for the nature of the movie. My journey with Vijay Deverakonda has been interesting. I happened to not notice him properly when he attended the audition of 'Kerintha'. I couldn't meet him. They tried to screen 'Pelli Choopulu' to me but I was in Australia at that time. He later scored a cult hit with 'Arjun Reddy'. At an event of 'Geetha Govindam', the response that he was getting made me say that he has got the fame of the range that Pawan Kalyan garu has got among youths. Vijay is a youthful star of the Pawan Kalyan variety. He is now going to become a pan-India hero with 'Liger'. I wish him all the best. We have been introducing newcomers mostly. Director Harsha has designed the movie as per his taste. Devi Sri Prasad's music is amazing. There are six songs in total. This is our banner's third movie with Anupama. She behaves like a newcomer. She supported us by adjusting dates. When Ram Charan saw the song 'Preme Aakasamaithe', he was surprised looking at how Anupama has evolved as an actor. Ashish is looking like a guy next door in our movie. Our movie will be released in theatres on November 19. It was planned to be a Dasara release. We are confident that the performances, dances and entertainment in 'Rowdy Boys' will engage the audience."


Ashish said, "I thank Vijay anna for being here despite his being busy. We are eagerly waiting for his movie, 'Liger'. Even though Anupama is a star heroine, she supported us totally. Director Harsha has made a very good film. We thank him for that. The visuals are superb, thanks to the cinematographer. Our movie will arrive at cinemas on November 19." 


Director Sree Harsha Konuganti said, "I thank Vijay Deverakonda for releasing the song today. He had released a song from 'Husharu' as well and he is a lucky charm. Devi Sri Prasad garu has given superb music. This is a love song and it's superb. The chemistry between Ashish and Anupama is of a different level. The credit goes to Anupama." 


Anupama Parameswaran said, "I thank the audience for their support. Special thanks to Vijay Deverakonda. I will talk about the movie after its release in theatres. I thank the producers for this opportunity."


Tej Korrapati, Karthik Ratnam, Pranith, Komali, Raccha Ravi and others also participated in the event. 

Sesi Preetham Life of 3 Movie Nuvvu Naku Nachave song Released

 శ‌శి ప్రీత‌మ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న  'లైఫ్‌ ఆఫ్ 3` నుండి `నువ్వు నాకు న‌చ్చావే` వీడియో సాంగ్ విడుద‌ల‌



ప్రముఖ సంగీత దర్శకుడు, యాడ్‌ ఫిల్మ్‌ మేకర్‌ శశి ప్రీతమ్‌ దర్శకుడిగా పరిచయమవుతున్న చిత్రం

'లైఫ్‌ ఆఫ్ 3`. స్నేహాల్‌ కామత్‌, వైశాలి, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ ప్రధాన పాత్రల్లో నటించారు. శ‌శి ప్రీత‌మ్ ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే అందించడంతో పాటు ఛాయాగ్రహణ, సంగీత, దర్శకత్వ బాధ్యతలను కూడా  నిర్వర్తించారు. ఆయ‌న కూతురు ఐశ్వర్య కృష్ణ ప్రియ నిర్మించారు. ఇప్ప‌టికే విడుద‌లైన ఫ‌స్ట్‌లుక్ పోస్ట‌ర్‌కి మంచి రెస్పాన్స్ వ‌చ్చింది. తాజాగా ఈ చిత్రం నుండి నువ్వు నాకు న‌చ్చావే పాట‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్‌..


``స‌రికొత్త రాగాలెందుకు వ‌చ్చాయి..ఎద‌లోన భావాలెందుకు తెచ్చాయి. రంగుల‌లో రంగుని ఎందుకు పెంచాయి..ముందెన్న‌డు తెలియ‌ని హాయిని పంచాయి..నువ్వేనా దీనికి మూలం..తెలియ‌ని ఈ ఆరాటం.. తెలిసింది...ఈ క్ష‌ణ‌మే నీతో ఉంటేనే...న‌వ్వు నాకు న‌చ్చావే..న‌వ్వు నాకు న‌చ్చావే..న‌వ్వు నాకు న‌చ్చావే..న‌చ్చావే``అంటూ ఆహ్లాదంగా సాగే ఈ పాట‌కు శ‌శి ప్రీత‌మ్ మ‌రోసారి అంద‌మైన బాణీల‌ను స‌మ‌కూర్చారు. ఎన్‌సీ కారుణ్య ఆల‌పించారు. ఈ పాట ప్ర‌స్తుతం సంగీత ప్రియుల్ని అల‌రిస్తూ సోష‌ల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. 


శ‌శి ప్రీత‌మ్ మాట్లాడుతూ - ``ఈ కథ ప్ర‌ధానంగా ముగ్గురు వ్యక్తుల జీవితం గురించి ఉంటుంది. సినిమా ప‌రిశ్ర‌మకు చెందిన ముగ్గురు వ్య‌క్తులు దర్శకుడు, రచయిత మరియు నటుడి జీవితంలో జ‌రిగే సంఘ‌ట‌న‌ల ఆధారంగా సినిమాను తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఇది హార‌ర్ ఎలిమెంట్స్‌తో కూడిన సస్పెన్స్ క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ స్టోరీ. సినిమా ఆధ్యంతం ఉత్కంఠ‌భ‌రితంగా సాగుతుంది``అన్నారు


తారాగ‌ణం: స్నేహాల్‌ కామత్‌, సంతోష్‌ అనంతరామన్‌, చిన్నికృష్ణ, వైశాలి, సౌజ‌న్య వ‌ర్మ‌, సీవీఎల్‌, లోహిత్ కుమార్‌, వైభ‌వ్ సూర్య‌, జోసెఫ్ సుంద‌ర్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:

కో- ప్రొడ్యూస‌ర్: దుశ్యంత్ రెడ్డి

అసోసియేట్ ప్రొడ్యూస‌ర్: అశోక్ బ‌డ్డి & డా. పెరుమ‌ళ్లు మ‌లినేని

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: విశ్వ‌నాథం వి

నిర్మాత‌: ఐశ్వ‌ర్య కృష్ణ ప్రియ‌

సంగీతం, సినిమాటోగ్ర‌ఫి, స్టోరి, స్క్రీన్ ప్లే, ద‌ర్శ‌క‌త్వం: శ‌శి ప్రీత‌మ్

Street Light Releasing on November 12th

 ప్రపంచ వ్యాప్తంగా నవంబర్ 12 న తెలుగు,హిందీ భాషల్లో విడుదలవుతున్న "స్ట్రీట్ లైట్"



 *మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్".ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం ట్రైలర్, టీజర్, పాటలకు ప్రేక్షకులనుడి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం నవంబర్ 12న దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో థియేటర్లలలో ప్రేక్షకుల తీసుకు వస్తున్నారు. ఈ సందర్భంగా* 


 *చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..* ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నాము. సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ సినిమాను దీపావళికి తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము. ఈ సినిమా ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు. 


 *చిత్ర దర్శకుడు విశ్వ మాట్లాడుతూ* .దీపావళికి తెలుగు, హిందీ భాషల్లో రిలీజ్ కానున్న " స్ట్రీట్ లైట్" మూవీ ని మూవీ మాక్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత మామిడాల శ్రీనివాస్ గారు ఒకేసారి  తెలుగు,హిందీ భాషలలో  నిర్మించారు. ఈ స్ట్రీట్ లైట్ సినిమాని దీపావళి సందర్భంగా నవంబర్ 12న థియేటర్లలలో రిలీజ్  చేస్తున్నారు.ఈ సినిమా కథ విషయానికి వస్తే ఒక రాత్రి స్ట్రీట్ లైట్ కింద విభిన్న వ్యక్తుల వింత పోకడలను సునిశితమైన రీతిలో వినోదాత్మకంగా చూపిస్తూ, పగలు మంచివాళ్ళుగా చెలామణి అవుతూ రాత్రి కాగానే సెక్సువల్ పర్వషన్స్ తో ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడుకుంటున్నారో, అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ఏవిధంగా ప్రతీకారం తీర్చుకుంది అనే 'రివెంజ్ డ్రామా' కథాంశంతో స్ట్రీట్ లైట్ చిత్రం రూపొందించడం జరిగింది.మంచి మేకింగ్ వాల్యూస్ తో వైవిధ్యభరితమైన సినిమాను రూపొందించి నందుకు సెన్సార్ సభ్యులు అభినందించారు.మంచి కాన్సెప్ట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికీ తప్పకుండా నచ్చుతుందని అన్నారు. .



*నటీనటులు* :

తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు. 


*సాంకేతిక నిపుణులు* 

దర్శకత్వం : విశ్వ

నిర్మాత: మామిడాల శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ : రవి సి కుమార్,

మ్యూజిక్ : విరించి,

ఎడిటర్ : శివ వై ప్రసాద్,

ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,

ఫైట్స్ : నిఖిల్,

కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్,

స్టూడియో : యుఅండ్ఐ.

పిఆర్ ఓ : మధు వి.ఆర్

Mr Premikudu Releasing on October 29th

 ఈ నెల 29న విడుద‌లకు సిద్ధ‌మైన  ప్ర‌భుదేవా `మిస్ట‌ర్ ప్రేమికుడు`



              ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్’ త‌మిళ చిత్రం ఇటీవ‌ల విడుద‌లై విజ‌యం సాధించి మంచి వ‌సూళ్లు రాబ‌ట్టింది.  ఈ చిత్రాన్ని శ్రీ తార‌క‌రామ పిక్చ‌ర్స్ ప‌తాకంపై ఎమ్ .వి. కృష్ణ స‌మ‌ర్ప‌ణ‌లో వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి  తెలుగులో కి ‘మిస్ట‌ర్ ప్రేమికుడు’ పేరుతో అనువ‌దించారు.  అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకున్నఈ చిత్రం ఈ నెల 29న  గ్రాండ్ గా రిలీజ్ కానుంది.  

   ఈ సంద‌ర్భంగా నిర్మాతలు వి.శ్రీనివాస‌రావు, గుర్రం మ‌హేష్ చౌద‌రి  మాట్లాడుతూ.. .`` ప్ర‌భుదేవా, అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని న‌టించ‌గా త‌మిళంలో రూపొంది ఘ‌న విజ‌యం సాధించిన `చార్లిచాప్లిన్` చిత్రాన్ని తెలుగులో `మిస్ట‌ర్ ప్రేమికుడు` పేరుతో అనువ‌దిస్తున్నాం. ఇప్ప‌టికే అనువాద కార్య‌క్ర‌మాలు పూర్త‌య్యాయి. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాట‌లతో పాటు సెకండాఫ్ లో వ‌చ్చే స‌న్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిల‌వ‌నున్నాయి. ప్ర‌భుదేవ ప‌ర్ఫార్మెన్స్, డాన్స్ తో పాటు అదాశ‌ర్మ‌, నిక్కిగ‌ల్రాని అందం, అభిన‌యం సినిమాకు ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌నుంది. చాలా కాలం త‌ర్వాత ప్ర‌భుదేవ త‌ర‌హా హాస్యంతో పాటు ఆయ‌న డాన్స్ ని మ‌రోసారి చేయ‌బోతుంది. సినిమాను   ఈ నెల 29న గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నాం. ప్రేక్ష‌కులు మా చిత్రాన్ని ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నాం`` అన్నారు.


Sandhya Raju Interview About Natyam

 క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా నాట్యం సినిమాను తెర‌కెక్కించాం -  సంధ్యారాజు



ప్రముఖ  కూచిపూడి డ్యాన్స‌ర్ సంధ్యారాజు నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న సినిమా ‘నాట్యం’. రేవంత్ కోరుకొండ దర్శకత్వంలో నిశృంకళ ఫిల్మ్‌ పతాకంపై రూపొందిన ఈ సినిమా ఈ నెల 22న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది..ఈ సంద‌ర్భంగా హీరోయిన్ సంధ్యారాజు నాట్యం సినిమా గురించి చెప్పిన‌ విశేషాలు...


చిన్నప్పటి నుంచి నాట్యం అంటే నాకు ప్రాణం. ప్రతీ రోజూ నాకు నాట్యం గురించి ఆలోచనలే  ఉంటాయి. సినిమా ద్వారా ఇంకా దగ్గరకు రావొచ్చనే ఆలోచనతోనే ఈ ప్రాజెక్ట్ ఎంచుకున్నాను. నాట్య ప్రదర్శనలు చేస్తే ఎప్పుడూ ఒకే సెక్షన్ పీపుల్స్ చూస్తుంటారు. కానీ ఒక్క షార్ట్ ఫిల్మ్ ద్వారానే నాట్యం గురించి ఎంతో మందికి చెప్పాం. చాలా రీచ్ అయింది. అప్పుడు సినిమా మాధ్యమానికి ఉన్న శక్తి ఏంటో అర్థమైంది. అందుకే ఈ సినిమాను తీశాను.


నాకు చిన్నప్పటి నుంచి సినిమా ప్రపంచం గురించి తెలీదు. నా ధ్యాస అంతా ఎప్పుడూ కూడా నాట్యం మీదే ఉండేది. నాట్య ప్రధానంగా ఎన్నో సినిమాలు వచ్చాయి. కే విశ్వనాథ్ వంటి వారు గొప్ప చిత్రాలు చేశారు. నాట్యం అంటే కాళ్లు చేతులు కదపడం కాదు.. దాని ద్వారా ఓ కథను చెప్పడం అనే మా దర్శకుడి ఆలోచన ఈ చిత్రంలో కనిపిస్తుంది. ఈ నాట్యం ద్వారా జనాల్లో ఆలోచనలు రేకెత్తించొచ్చు. పాత కాలంలో నాట్యం అనేది కూడా ఓ సినిమాలాంటిదే.


నాట్యం చిత్రంలో రెండు మూడు కథలు అంతర్లీనంగా ఉంటాయి. గురు శిష్యుల సంబంధాన్ని చూపిస్తాం. క్లాసికల్ డ్యాన్సర్లకు ఉండే హద్దులను చూపిస్తాం. వెస్ట్రన్ డ్యాన్స్, క్లాసికల్ డ్యాన్స్‌కు మధ్య ఉన్న తేడా ఏంటి? అని ఇలా రెండు మూడు ట్రాక్‌లు జరుగుతూ ఉంటాయి. నాట్యం అనేది ఊరి పేరు. దాని చుట్టూ ఉండే మూఢ నమ్మకాలు కూడా సినిమాలో ఉంటాయి. కమర్షియల్ సినిమాలానే ఉంటుంది.


మంచి కంటెంట్ ఎక్కడ తీసినా అందరికీ రీచ్ అవుతుంది. మనం వేరే వాళ్లను కాపీ చేస్తే అది కాపీలానే ఉంటుంది. మనలోని యూనిక్ పాయింట్‌ను తీస్తే అందరూ ప్రశంసిస్తారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు ఈ సినిమాను చూశారు. అభినందించారు. ఆరోగ్య సమస్యల వల్ల ఐదు నిమిషాలే సినిమా చూస్తాను అని అన్నారు. కానీ సినిమా మొదలైన తరువాత.. పూర్తయ్యే వరకు చూస్తూనే ఉండిపోయారు. ఆ తరువాత నన్ను సత్కరించారు.


చిరంజీవి గారు ఇంకా మా సినిమా చూడలేదు. సినిమా బ్యాక్ గ్రౌండ్ నుంచి కాకుండా.. వ్యాపార రంగం నుంచి నేను రావడం, ఇలా సినిమా తీయడం, నటించడం ఆయనకు బాగా నచ్చింది. మా టీజర్ ఆయన చూశారు. బాగా నచ్చింది. మమ్మల్ని ప్రశంసించారు.


చిన్నప్పుడు అందరి తల్లిదండ్రుల్లానే నన్ను కూడా రకరకాల క్లాసులకు పంపించారు. పదేళ్లప్పుడు వెంపటి చినసత్యం గారి శిక్షణను చూసి అక్కడే ఉండిపోయాను. నా జీవితాన్ని కళలకే అంకితం చేయాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. కామర్స్ చదువు, ఫ్యాక్టరీలు చూసుకో అని ఇంట్లోవాళ్లు చెప్పారు. కానీ మనసంతా కూడా నాట్యం మీదే ఉండిపోయింది. కానీ కుటుంబ సభ్యులు ఎప్పుడూ కూడా నన్ను నిరుత్సాహపరచలేదు. పెళ్లి తరువాత కూడా మెట్టింట్లో వాళ్లంతా కూడా నన్ను ఎంకరేజ్ చేశారు.


క్లాసికల్ డ్యాన్స్‌తో టచ్ లేని వాళ్లకు కూడా ఇంట్రెస్ట్ వచ్చేలా డిజైన్ చేశాం. దాని కోసం మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. స్టోరీకి తగ్గట్టుగా కొరియోగ్రఫినీ చేశాం. కానీ ఆ పాటతో పాటుగా స్టోరీ కూడా ముందుకు వెళ్తుంది.  రొహిత్ పూర్తిగా వెస్ట్రన్ డ్యాన్సర్. అలా అన్ని రకాల డ్యాన్సులు ఇందులో ఉంటాయి.


నిర్మాతగా, నటిగా వ్యవహరించడం చాలా కష్టంగా అనిపించింది. ప్రొడక్షన్ టీం, లొకేషన్ టీం, అన్ని డిపార్ట్మెంట్‌లతో కలిసి పని చేస్తూ వచ్చాను. అలా హీరోయిన్‌లా ఎక్కడా ఉండలేకపోయాను. సినిమాను పూర్తి చేసి థియేటర్‌కు పట్టుకురావడం చాలా కష్టంగా అనిపించింది.


నాట్య ప్రదర్శన ఇచ్చినప్పుడు జనాలు మెచ్చుకుంటే ఇంకా చేయాలనిపిస్తుంది. అలానే ఈ సినిమాను జనాలు చూసి ఆదరిస్తే.. ఇంకా ఇలాంటి సినిమాలు చేసేందుకు మాకు ప్రొత్సాహానిచ్చినట్టు అవుతుంది.


నాట్యం ప్రధానంగా ఓ షార్ట్ ఫిల్మ్ చేశాం. దానికి చాలా ఆదరణ వచ్చింది. ఎంతో మంది ఫోన్ చేసి అభినందించారు. ఆ షార్ట్ ఫిల్మ్ వల్ల మా జీవితాలు మారిపోయానని అన్నారు. అలా అప్పుడు మాకు ఈ సినిమా మీద ధైర్యం వచ్చింది.


నాట్య ప్రదర్శన ఇవ్వడానికి తెర ముందు నటించడానికి చాలా తేడా ఉంటుంది. కెమెరా ముందు ఎలా ఉండాలనేది దర్శకుడు ముందే చెప్పారు. కథ, పాత్ర, ఆ మాటలు అర్థం చేసుకుని నటించాలి. కెమెరా కేవలం మన మొహాలను మాత్రం క్యాప్షర్ చేయదు. మనలోని భావాలను కూడా పట్టేస్తుంది. కెమెరాకు ఆ శక్తి ఉంది.


మళయాలంలో యూటర్న్ సినిమాను చేశాను. కానీ అది అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఇక నాట్యం సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల వల్లే ఇంత గ్యాప్ వచ్చింది. వేరే సినిమాల్లో అవకాశం వచ్చినా చేస్తాను. కానీ కమర్షియల్ చిత్రాలను చేయను. డబ్బులు ఎక్కువగా ఇస్తారు కదా? అని ఏది పడితే అది చేయను. ఆ హీరోతో చేస్తే మార్కెట్ పెరుగుతుందనే స్ట్రాటజీలతో సినిమాలు చేయను. మంచి కథ, పాత్ర వస్తే చేస్తాను. జాతీయ అవార్డు సాధించే సత్తా ఉన్న పాత్రలు వేస్తాను. అమ్మాయిలకు లీడ్ కారెక్టర్స్ చేయాలనిపించే పాత్రలే చేస్తాను.


నేను చేసిన షార్ట్ ఫిల్మ్‌కు, ఈ సినిమాకు సంబంధం లేదు. ఇందులో నాట్యం అనే ఊరిలో సితార అనే పాత్రలో కనిపిస్తాను.


సినిమా పరిశ్రమ గురించి బయట ఏవేవో అంటారు. ఇక్కడ పాలిటిక్స్, నెగెటివిటీ ఎక్కువ ఉంటుందని అంటారు. కానీ ఇక్కడ చాలా మంచి వారున్నారు. మంచి కంటెంట్‌తో వస్తే ఆదరిస్తారు. పెద్ద స్టార్స్‌ కూడా చిన్నవాళ్లను ఎంకరేజ్ చేస్తుంటారు. అలా చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు మాకు టైం కేటాయించడం వల్ల మా జీవితమే మారిపోయింది.


మా గురువు వెంపటి చినసత్యం గారు చేసినట్టు చేస్తే చాలు అని అందరూ అనుకుంటున్నారు. కానీ ఆయన ఆ తరంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా నాట్యాన్ని చేశారు. ఇప్పుడు ఈ తరానికి తగ్గట్టుగా కూచిపూడి నాట్యంలో మార్పులు తీసుకురావాలనే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.

Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12

 Kicha Sudeep, Shiva Karthik, Good Cinema Group’s K3 Kotikokkadu Releasing On November 12



Kannada star Kicha Sudeep needs no special introduction for Telugus. He is very much familiar for audience here for his mass appealing roles in several films. Now, Sudeep is gearing up for release of a mass action entertainer K3 Kotikokkadu directed by Shiva Karthik.


K3 was released on 15th of this month in Kannada to massive response with 40.5 Cr Gross in just 4 days and the film is expected to become one of the biggest hits for Sudeep, as per trade experts of Sandalwood. The Telugu version of the film is scheduled for release on November 12th.


The film’s theatrical trailer that presented Sudeep in a role with two different shades got tremendous response. Madonna Sebastian played the leading lady opposite Sudeep in the film that will feature Shraddha Das in an important role.


Good Cinema Group will be releasing K3 Kotikokkadu in Telugu.


Cast: Kicha Sudeep, Madonna Sebastian, Shraddha Das, Ravi Shankar, Nawab Shah and others.


Technical Crew:

Director: Shiva Karthik

Producer: Shreyas Srinivas and Devendra DK

Banner: Good Cinema Group

Presents: Spandana Pasam, Swetan Reddy

Dialogues: K Rajesh Vaarma

DOP: Shekar Chandru

Music: Arjun Jenya

Editor: Praveen Antony

10th Class Dairies First Look Launched

 గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న 'టెన్త్ క్లాస్ డైరీస్' ఫ‌స్ట్‌లుక్‌ విడుదల చేసిన క్రిష్ జాగర్లమూడి 



దర్శకుడి ఊహను అర్థం చేసుకుని... అంతే అందంగా ప్రేక్షకులకు తన కెమెరా కంటితో చేరవేసేది ఛాయాగ్రాహకులే. సినిమా మేకింగ్‌లో సినిమాటోగ్రాఫర్ పాత్ర చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఊహ, కెమెరా కన్ను ఒకరిదే అయితే? స్టోరీ టెల్లింగ్, సినిమా లుక్ హై స్టాండ‌ర్డ్స్‌లో ఉంటాయి. గతంలో మెగాఫోన్ పట్టిన సినిమాటోగ్రాఫర్స్ మంచి సినిమాలు అందించారు. దర్శకులుగా మారిన ఛాయాగ్రాహకుల జాబితాలో ఇప్పుడు 'గరుడవేగ' అంజి కూడా చేరనున్నారు. ‘ది అంగ్రేజ్ ‘, ‘సీతా రాముడు' సినిమాటోగ్రాఫ‌ర్‌గా పరిచయమైన ఆయన... తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ సినిమాలకు పని చేశారు. దర్శకరత్న దాసరి నారాయణరావు, రామ్ గోపాల్ వర్మ, శ్రీనివాసరెడ్డి తదితర దర్శకుల ఊహలను వెండితెరపై ఆవిష్కరించారు. ఇప్పుడు ఓ సినిమాకు దర్శకుడిగా, ఛాయాగ్రాహకుడిగా రెండు బాధ్యతలు నిర్వర్తించారు. 


'గరుడవేగ' అంజి దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ఛాయాగ్రాహకుడిగా ఆయన 50వ చిత్రమిది. అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్ పతాకాలపై అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. ఇందులో శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివబాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీరాజా ఇతర ప్రధాన తారాగణం. 


'టెన్త్ క్లాస్ డైరీస్' ఫ‌స్ట్‌లుక్‌ను ప్రముఖ దర్శకులు క్రిష్ జాగర్లమూడి ఈ రోజు విడుదల చేశారు. ముఖ్య తారాగణం అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఈ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. త్వరలో టీజర్, డిసెంబ‌ర్‌లో సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. 


నిర్మాతలు అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం మాట్లాడుతూ "విజయదశమికి మా సినిమా టైటిల్ వెల్లడించాం. చాలామంది ఫోన్లు చేసి 'టెన్త్ క్లాస్ డైరీస్' అనగానే... ఒక్కసారి మా టెన్త్ క్లాస్ రోజులు గుర్తు చేసుకున్నామన్నారు. ప్రేక్షకులందరినీ నోస్టాల్జియాలోకి తీసుకువెళ్లే చిత్రమిది. ఈ సినిమా విడుదలైన తర్వాత అవికా గోర్ అంటే 'టెన్త్ క్లాస్ డైరీస్' గుర్తుకు వస్తుంది. అంతలా పాత్రలో లీనమై అవికా గోర్ నటించారు. కీలక పాత్రలో శ్రీరామ్ సైతం ప్రేక్షకులకు గుర్తుండే పాత్రలో కనిపిస్తారు. కథ ప్రకారం హైదరాబాద్, చిక్ మంగళూరు, రాజమండ్రి, అమెరికాలో షూటింగ్ చేశాం. ప్రస్తుతం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. టైటిల్‌, ఫ‌స్ట్‌లుక్‌కు లభిస్తున్న స్పందన మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది. త్వరగా డబ్బింగ్, మిగతా పనులు పూర్తి చేసి... డిసెంబ‌ర్‌లో చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం" అని అన్నారు.


'గరుడవేగ' అంజి మాట్లాడుతూ "కమర్షియల్ హంగులతో పాటు కొత్తదనం ఉన్న సినిమా 'టెన్త్ క్లాస్ డైరీస్'. ప్రతి ఒక్కరి జీవితంలో టెన్త్ క్లాస్ అనేది ఒక టర్నింగ్ పాయింట్. స్నేహం, ఆకర్షణ, ప్రేమ, జీవిత లక్ష్యాలు, ఎన్నెన్నో కలలు... అన్నిటికీ పునాది టెన్త్ క్లాస్‌లో పడుతుంది. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినా టెన్త్ క్లాస్ రోజులను ఎవరూ మర్చిపోలేరు. ప్రతి ఒక్కరికీ టెన్త్ క్లాస్ రోజులను గుర్తు చేసే విధంగా... స్నేహం, ప్రేమ, ఆకర్షణ, ఆకాంక్షలను స్పృశిస్తూ తీసిన చిత్రమిది. ప్రేక్షకుల హృదయానికి హత్తుకునే విధంగా సినిమా ఉంటుంది. మా నిర్మాతలు, టెక్నికల్ టీమ్ సహకారంతో అనుకున్న విధంగా సినిమా వచ్చింది. అందరికీ నచ్చుతుంది" అని అన్నారు.


'టెన్త్ క్లాస్ డైరీస్'

తారాగణం: శ్రీరామ్, అవికా గోర్, శ్రీనివాసరెడ్డి, 'వెన్నెల' రామారావు, అర్చన (వేద), హిమజ, శివ బాలాజీ, మధుమిత, 'సత్యం' రాజేష్, భాను శ్రీ, నాజర్, శివాజీ రాజా, రాజశ్రీ నాయర్ , సత్యకృష్ణ, రూపలక్ష్మి, 'తాగుబోతు' రమేష్, 'చిత్రం' శ్రీను, గీతా సింగ్, రోహిణి (జబర్దస్త్), 'జెమినీ' సురేష్, 'ఓ మై గాడ్' నిత్య, రాహుల్, 'కంచెరపాలెం' కేశవ, ప్రేమ్, భవ్య, కావేరి , అంబటి శ్రీను, జీవన్ (జబర్దస్త్), భాష, కేఏ పాల్ రాము, గణపతి (జబర్దస్త్), రాకేష్ (జబర్దస్త్), కమల్, మహేష్ మచిడి


సాంకేతిక నిపుణుల వివరాలు:

కథ : రామారావు, స్క్రీన్ ప్లే - డైలాగ్స్: శ్రుతిక్, లిరిక్స్: చైతన్య ప్రసాద్, కాసర్ల శ్యామ్, సురేష్ గంగుల, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే, విజయ్ బిన్నీ, సన్నీ, ఫైట్స్: స్టంట్స్ జాషువా, పబ్లిసిటీ డిజైనర్: అనంత్, ప్రొడక్షన్ కంట్రోలర్: నరేన్ జి సూర్య, మేకప్: నారాయణ, కాస్ట్యూమ్స్: శ్రీదేవి కొల్లి, కో-డైరెక్టర్: విజయ్ కామిశెట్టి, ఆర్ట్ డైరెక్టర్: కృష్ణ, ఎడిటర్: ప్రవీణ్ పూడి, మ్యూజిక్ డైరెక్టర్: సురేష్ బొబ్బిలి, కో-ప్రొడ్యూసర్: రవి కొల్లిపర, నిర్మాతలు: అచ్యుత రామారావు .పి, రవితేజ మన్యం, సినిమాటోగ్రఫీ & దర్శకత్వం : 'గరుడవేగ' అంజి.