Latest Post

Producer Vishnu Induri Interview About Talaivi

 తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను.  - నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి



సినీ నటి, దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెరకెక్కిన‌ చిత్రం ‘తలైవి’. బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్, జయలలిత పాత్ర పోషించగా.. విలక్షణ నటుడు అరవింద్ స్వామి ఎంజీఆర్ క్యారెక్టర్‌లో కనిపించారు. ఏఎల్ విజయ్ డైరెక్ట్ చేశారు. ‘తలైవి’ సినిమాను తమిళ్, తెలుగు, హిందీ భాషల్లో సెప్టెంబర్ 10న సినిమా విడుదల కాగా.. విజయవంతంగా ప్రదర్శించబడుతోంది. ఈ సందర్భంగా నిర్మాత విష్ణువర్దన్ ఇందూరి మీడియాతో ముచ్చటించారు.


తలైవి సినిమా విజయం పట్ల ఎంతో సంతోషంగా ఉన్నాను. మంచి సినిమా చేశాను అనే ప్రశంసలు కూడా వచ్చాయి. అదే సమయంలో పెట్టిన డబ్బుల కంటే ఎక్కువే వెనక్కి వచ్చాయి. అలా వ్యాపారపరంగా లాభాలు కూడా వచ్చాయి. మొత్తానికి తలైవి సినిమా ఇంత పెద్ద సక్సెస్ అవ్వడం ఆనందంగా ఉంది.


నాన్ థియేట్రికల్ రైట్స్‌‌తో బడ్జెట్ మొత్తం రికవరీ అయింది. సినిమాకు పెట్టిన ఖర్చు కంటే ఎక్కువే వచ్చింది. మల్టీప్లెక్స్ అసోసియేషన్ వల్ల థియేటర్ల సమస్య ఏర్పడింది. కానీ నిర్మాతగా నా పరంగా చూస్తే నేను తీసుకున్న నిర్ణయం సరైనదే. ఏ నిర్మాత కూడా తన సినిమాను వారం ముందే అందరికీ చూపించరు. కానీ నేను చూపించాను. నా సినిమా మీద నాకున్న నమ్మకం అదే. ఏ టెన్షన్ లేకుండా రిలీజ్ రోజు హాయిగా నిద్రపోయాను. ఎందుకంటే మేం థియేటర్ రెవెన్యూ మీద ఆధారపడలేదు. తీసుకున్న ఫైనాన్స్ కట్టి సినిమా రిలీజ్ చేయాలంటే నా ముందు ఆప్షన్ అదే. నా నిర్ణయాన్ని మా టీం మొత్తం సమర్థించింది. ఇలాంటి సమయంలో సినిమాను తీయడం కష్టం అనుకుంటే.. రిలీజ్ చేయడం మరింత కష్టం.


సినిమాను థియేటర్ కోసమే తీశాం. ఎన్నో ఓటీటీ ఆఫర్లు వచ్చాయి. కానీ మా మొదటి ప్రాధాన్యం థియేటర్లే. కానీ పరిస్థితుల వల్లే ఇలా చేయాల్సి వచ్చింది. దాంతో నాన్ థియేట్రికల్ రెవెన్యూ బాగానే వచ్చింది. ఇలాంటి సమయంలో సినిమా హిట్ అయిందా? లేదా? అని బాక్సాఫీస్ లెక్కల్ని పట్టి చెప్పలేం. పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చాయా? లేదా? మన సినిమాను ఎంత ఎక్కువ మంది చూశారు అనేది పరిగణలోకి తీసుకోవాలి. ఆ విషయంలో మేం సక్సెస్ అయ్యాం.


మా సినిమాకు క్రియేటివ్ ప్రొడ్యూసర్ బృందా వల్లే ఈ సినిమా ప్రారంభమైంది. జయలలిత గారు చనిపోయినప్పుడు రెండు మూడు రోజులు తిండి తినలేదు.. నిద్రపోలేదు. ఆమె బతికి ఉన్నప్పుడు బృంద అంత కనెక్ట్ అవ్వలేదేమో కానీ జయలలిత చనిపోయిన తరువాత మాత్రం చాలా కనెక్ట్ అయింది. జయలలిత గురించి ప్రపంచం తెలుసుకోవాలనేది ఆమె ఐడియా. అయితే ప్రాంతీయ చిత్రంగా కాకుండా పాన్ ఇండియన్ మూవీగా తీయాలని అనుకున్నారం. తమిళ భావాలు కనిపించాలనే ఉద్దేశ్యంతో విజయ్‌ను దర్శకుడిగా తీసుకున్నాం. ఇక ఇలాంటి కథను రాయాలంటే.. విజయేంద్ర ప్రసాద్ కంటే గొప్ప వారు ఎవరని అనుకున్నాం. ఇక కంగనాను హీరోయిన్‌గా తీసుకున్నప్పుడు అందరూ బ్యాడ్ చాయిస్ అని అన్నారు.


జయలలిత సినిమాలో ఆమె కంటే ఎక్కువగా ఎంజీఆర్ పాత్ర ఉంటుంది. అంత ఇంపార్టెంట్ రోల్ కాబట్టే అరవింద్ స్వామిని తీసుకున్నాం. తక్కువ సీన్లు ఉన్నా కూడా ఇంపాక్ట్ కనిపించాలని అనుకున్నాం. అయితే కరోనా దెబ్బ పడటంతో బడ్జెట్, క్యాస్టింగ్ అన్నింటిని తగ్గించేద్దామని అన్నారు. కానీ మా నిర్మాతలు అందరూ సపోర్ట్ చేశారు. జయలలిత ఎన్ని కష్టాలు పడ్డారో గానీ.. సినిమాను తీయడానికి, రిలీజ్ చేయడానికి ఎన్నో కష్టాలు పడ్డాం.


కంగనా రనౌత్ తమిళ నాడులో అంతగా తెలియదు. మొదట్లో అందరూ నెగెటివ్ కామెంట్ చేశారు. కానీ సినిమా చూశాక ప్రతీ ఒక్కరూ నాడు చేసిన ట్వీట్లను రీ ట్వీట్ చేస్తూ.. క్షమాపణలు చెబుతున్నారు. మేం తప్పుగా అనుకున్నాం.. మీ నిర్ణయమే సరైనది అని చెబుతున్నారు. అది నాకు సంతోషంగా అనిపిస్తోంది. మంచి సినిమా చేశామని వస్తోన్న ప్రశంసలు నిర్మాతగా నాకు సంతోషాన్ని ఇస్తోంది.


తలైవి సినిమా ఎలాంటి విమర్శలు రావడం లేదు. మొదట్లో సినిమాపై జయలలిత కుటుంబ సభ్యులు కేస్ వేశారు. కానీ సినిమా చూశాక వారి నిర్ణయం మారింది. జయలలితకు ఇంత కంటే గొప్ప నివాళిని ఎవరూ ఇవ్వలేరు అని అన్నారు. ఆమె మేనళ్లుడు దీపక్ ఫోన్ చేసి అభినందించాడు. తమిళ నాడులో స్క్రీన్లు పెంచే యోచనలో ఉన్నాం. రోజురోజుకూ థియేటర్లో జనాలు పెరుగుతున్నాయి. మొదటి సారి సింగిల్ స్క్రీన్‌లో సినిమా చూశామని అందరూ చెబుతున్నారు. ఇక కొంత మంది అయితే రెండు వారాల్లో ఓటీటీలో వస్తుంది కదా? అని అనుకుంటూ ఉంటారు.


నాకు బయోపిక్స్ అంటే ఇష్టం. కథలో ఏదైనా ఫీల్ ఉంటేనే చెప్పాలనిపిస్తుంది. ఇంకా మూడు నాలుగు చిత్రాలు ప్లాన్ చేశాం. హిందీలో మంచి లైనప్స్ ఉన్నాయి. త్వరలోనే అన్ని వివరాలు చెబుతాను. కపిల్ దేవ్ బయోపిక్ 1983 పెద్ద సినిమా. థియేటర్ రిలీజ్ కోసం ఎదురుచూస్తున్నాం.


ఒకరిని గొప్పగా చూపించేందుకు మరొకరిని తక్కువ చూపించాల్సిన అవసరం లేదు. మా సినిమా కథ అది కాబట్టి అలా తీశాం. అవతల ఉన్న కరుణానిధి కూడా గొప్ప వ్యక్తి. కరుణానిధి, ఎంజీఆర్ ఇద్దరూ కూడా పరిస్థితుల వల్ల అపొజిషన్ అయిపోయారు.


సోషల్ మీడియా మీద ఓ సినిమా చేయాలని అనుకుంటున్నాను. దాని పేరు ట్రెండింగ్. ఓ పెద్ద దర్శకుడు ఆ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్యాన్ ఇండియా వైడ్‌గా విడుదల చేస్తాం. ప్రధానమంత్రి అధికారి కార్యాలయం చుట్టూ తిరిగే మరో కథను తెరకెక్కిస్తున్నాం. ఆజాద్ హింద్ అనే దేశభక్తి సినిమాను కూడా ప్లాన్ చేస్తున్నాం.

Tremendous Response for Love Story Trailer

 "లవ్ స్టోరి" ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ , 24న థియేటర్ లలో రిలీజ్



సంతోషం, బాధ, ప్రేమ, ఉద్యోగం, కుటుంబం...ఇలా జీవితంలోని రంగుల చిత్రాన్ని

చూపిస్తూ సాగింది "లవ్ స్టోరి" సినిమా ట్రైలర్. ఇవాళ రిలీజైన "లవ్

స్టోరి" ట్రైలర్ దర్శకుడు శేఖర్ కమ్ముల ట్రేడ్ మార్క్ తో కనిపించింది.

నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా రూపొందిన "లవ్ స్టోరి" సినిమా ఈనెల 24న

థియేటర్ లలో ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా ట్రైలర్ విడుదల చేశారు.


"లవ్ స్టోరి" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే... నాగ చైతన్య తెలంగాణ ప్రాంతానికి

చెందిన రేవంత్ ఓ మిడిల్ క్లాస్ కుర్రాడుగా కనిపించాడు. లోన్ తీసుకొని

బిజినెస్ చేయడం ద్వారా లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకునే  డ్యాన్సర్ రేవంత్ గా

నాగచైతన్య ను చూపించడంతో ఈ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. మరో వైపు బీటెక్

పూర్తి చేసి ఎలాగైనా సాఫ్ట్ వేర్ జాబ్ సాధించాలనే యువతి మౌనికగా సాయి

పల్లవిని చూపించారు. అయితే.. మౌనికలో దాగి ఉన్న డ్యాన్సింగ్ టాలెంట్ ని

గుర్తిస్తాడు రేవంత్. ఆమెను మంచి డ్యాన్సర్ అవ్వాలని ప్రోత్సహిస్తాడు. ఈ

క్రమంలో ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడడం.. ఆ స్నేహం ప్రేమగా మారడం.. ఒక ప్రేమ

అంటే అడ్డంకులు మామూలే కదా. వీరి ప్రేమకు కూడా అడ్డంకులు ఏర్పడడం.. ఆ

అడ్డంకులను దాటుకుని వీళ్లు ఎలా ఒకటయ్యారు అనేదే ఈ లవ్ స్టోరీ

అనిపిస్తుంది. చైతన్య తెలంగాణ యాసలో మాట్లాడడం బాగుంది. అలాగే నేచురల్

బ్యూటీ సాయిపల్లవి కూడా పాత్రకు తగ్గట్టుగా అదరగొట్టేసింది అనిపిస్తుంది.

మనకు లోన్లు ఇవ్వరు.. రెంటుకు రూములు ఇవ్వరు.. పిల్లనిస్తార్రా..

బతుక్కోసం ఈ ఉరుకులాట నాతో కాదింక.. చస్తే చద్దాం.. కానీ తేల్చుకొని

చద్దాం వంటి డైలాగ్స్ యూత్ కి బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. మిడిల్

క్లాస్ యువకుడిగా నాగ చైతన్య కెరీర్ లోనే బెస్ట్ పెరఫార్మన్స్ ఇచ్చాడని

చెప్పచ్చు. టోటల్ గా ఒక్కమాటలో చెప్పాలంటే... లవ్ స్టోరీ ట్రైలర్

అదిరింది. హిట్ పక్కా... అనేట్టు ఉంది.


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్

సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్

రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు,

దేవయాని,ఉత్తేజ్ ఇతర కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్

కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,

పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర

రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

Akhil Akkineni Most Eligible Bachelor Leharaayi Lyrical video Released

 అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ రొమాంటిక్ ‘లెహరాయి’ సాంగ్ ప్రోమో విడుదల..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి రొమాంటిక్ లెహరాయి సాంగ్ ప్రోమో విడుదలైంది. లెహరాయి లెహరాయి గుండెలోని ఆశలన్నీ ఎగిరాయి అంటూ సాగే ఈ పాటను తనదైన శైలిలో అద్భుతంగా ఆలపించారు సిద్ శ్రీరామ్. సెప్టెంబర్ 15న ఫుల్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు విడుదలైన ప్రోమోలో అఖిల్, పూజ హెగ్డే రొమాన్స్ అదిరిపోయింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు. ప్ర‌ముఖ మ్యూజిక్ ఛాన‌ల్ ఆదిత్య మ్యూజిక్ ద్వారా ఈ సినిమా ఆడియో విడుద‌ల అవుతుంది.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Vijaya Raghavan Pre Release Event Held Grandly

 కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి చూసేలా రూపొందిన క‌మ‌ర్షియ‌ల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ ‘విజ‌య రాఘ‌వ‌న్‌’ త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంది: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో విజ‌య్ ఆంటోని



‘న‌కిలీ, డా.సలీమ్‌, బిచ్చగాడు, భేతాళుడు, ఇంద్రసేన, రోషగాడు, కిల్లర్‌’ వంటి చిత్రాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సంపాదించుకున్న హీరో విజయ్‌ ఆంటోని. ఈయన హీరోగా.. ‘మెట్రో’ వంటి డిఫరెంట్‌ మూవీని తెరకెక్కించిన డైరెక్టర్‌ ఆనంద కృష్ణన్‌ తెరకెక్కించిన‌ చిత్రం ‘విజయ రాఘవన్‌’.  ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్‌ సమర్పణలో చెందూర్ ఫిల్మ్‌ ఇంటర్నేషనల్‌ బ్యానర్‌పై టి.డి.రాజా, డి.ఆర్‌.సంజయ్‌ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మించారు.  ‘కోడియిల్ ఒరువ‌న్‌’ పేరుతో త‌మిళంలో రూపొందిన ఈ చిత్రాన్ని శ్రీకరి ఫిలింస్ బ్యానర్‌పై ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి తెలుగులో విడుద‌ల చేస్తున్నారు. ‘విజ‌య రాఘ‌వ‌న్‌’  పేరుతో తెలుగులో సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా  ఆదివారం హైద‌రాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో బిగ్ టిక్కెట్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా....



రైట‌ర్ భాష్య‌శ్రీ మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌, అనువాదంలో వ‌ర్క్ చేసిన అంద‌రూ సినిమా గ్యారంటీ హిట్ అని చెప్పారు. క‌చ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుంది. ఈ సినిమాలో ప‌నిచేసే అవ‌కాశం ఇచ్చినందుకు థాంక్స్‌. ఈ సినిమాలో విజ‌య రాఘ‌వ‌న్‌గా న‌టించిన విజ‌య్ ఆంటోనిగారు ఓ ట్యూష‌న్ మాస్ట‌ర్‌. త‌న అమ్మ క‌న్న క‌ల‌ను నేర‌వేర్చ‌డానికి ఓ ప్రాంతానికి వ‌స్తాడు. ఆయ‌న పాత్ర‌లో చాలా డైమ‌న్ష‌న్స్ ఉంటాయి. చాలా విభిన్నంగా ఉండే సినిమా’’ అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ నివాస్ కె.ప్ర‌స‌న్న మాట్లాడుతూ ‘‘మంచి క‌థ‌కు త‌గ్గ సాంగ్స్ కుదిరాయి. అవ‌కాశం ఇచ్చిన విజ‌య్ ఆంటోనిగారికి, దర్శక నిర్మాతలకు థాంక్స్’’ అన్నారు. 


శ్రీకరి ఫిలింస్ అధినేతలు ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డి మాట్లాడుతూ ‘‘విజయ్ ఆంటోనిగారికి థాంక్స్‌. ఆనంద్ కృష్ణ‌న్‌గారు అద్భుత‌మైన క‌థ‌తో సినిమా చేశారు. సినిమా చాలా బాగా వ‌చ్చింది. సినిమాపై కాన్ఫిడెన్స్‌గా ఉన్నాం. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న మా సినిమాను థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


చిత్ర దర్శకుడు ఆనంద కృష్ణ‌న్ మాట్లాడుతూ ‘‘దర్శకుడిగా నా తొలి చిత్రం ‘మెట్రో’ తెలుగులో విడుదలై మంచి ఆదరణను దక్కించుకుంది. ఇది నా రెండో సినిమా. ఇది కూడా తెలుగులో భారీగా విడుదలవుతుండటం హ్యాపీగా ఉంది. తెలుగులో గ్రాండ్‌గా సినిమా విడుద‌ల‌వుతుంది. ఐఏఎస్ ఆఫీస‌ర్ కావాల‌నుకునే ఓ యువ‌కుడి క‌థే ఇది. జీవితంలో ఎన్నో సాధించాల‌నుకునే హీరో, త‌న త‌ల్లి కోరిక‌ను తీర్చాల‌నుకుంటాడు. ఆ క్ర‌మంలో కొన్ని స‌మ‌స్య‌ల్లో చిక్కుకుంటాడు. వాటి నుంచి త‌నెలా బ‌య‌ట‌ప‌డ‌తాడు అనేదే ఈ చిత్రం. ఇదొక ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. అంతే కాకుండా.. స‌మాజంలో మ‌న‌కు ఎదుర‌య్యే రాజ‌కీయ ప‌ర‌మైన ఇబ్బందులను ఎలా హ్యాండిల్ చేయాల‌నే సందేశం కూడా ఇస్తుంది. ఇలాంటి ఓ సినిమాను చేసే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత‌లకు, విజ‌య్ ఆంటోనిగారికి థాంక్స్‌. నివాస్ చాలా మంచి సంగీతాన్ని అందించారు. హీరోయిన్ ఆత్మిక చాలా మంచి రోల్‌ను క్యారీ చేసింది. సెప్టెంబ‌ర్ 17న విడుద‌ల‌వుతున్న సినిమాను ఆద‌రించండి’’ అన్నారు. 


రామచంద్రరాజు మాట్లాడుతూ‘‘సెప్టెంబర్ 17న విజయ రాఘవన్ థియేటర్స్‌లో విడుద‌ల‌వుతుంది. మంచి సినిమా. దాన్ని థియేట‌ర్స్‌లో చూసి ఎంక‌రేజ్ చేయండి. ఆనంద కృష్ణ‌న్‌, విజ‌య్ ఆంటోనిగారికి, నిర్మాత‌ల‌కు థాంక్స్‌’’ అన్నారు. 


ఇన్ఫినిటీ ఫిల్మ్‌ వెంచర్ క‌మ‌ల్ మాట్లాడుతూ ‘‘విజయ్ రాఘవన్ సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురావ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. సెప్టెంబ‌ర్ 17న థియేట‌ర్స్‌లో మెప్పించ‌డానికి రాబోతున్నాం. ప్రేక్ష‌కులు సినిమాను స‌క్సెస్ చేయాల‌ని కోరుకుంటున్నాం’’ అన్నారు. 


హీరోయిన్ ఆత్మిక మాట్లాడుతూ ‘‘మంచి సినిమాలను తెలుగు ప్రేక్ష‌కులు ఎప్పుడూ ఆద‌రిస్తారు. అలాంటి ఓ మంచి మూవీ విజ‌య రాఘ‌వ‌న్ సెప్టెంబ‌ర్ 17న మీ ముందుకు రాబోతుంది. సినిమాను థియేట‌ర్స్ చూసి విజ‌యాన్ని అందించండి. సినిమా త‌ప్ప‌కుండా మిమ్మ‌ల్ని మెప్పిస్తుంది’’ అన్నారు. 


హీరో విజ‌య్ ఆంటోని మాట్లాడుతూ ‘‘‘కిల్లర్’ సినిమా తర్వాత ప్యాండ‌మిక్ కార‌ణంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను క‌లుసుకునే అవ‌కాశ‌మే లేకుండా పోయింది. ఈ గ్యాప్ త‌ర్వాత విజ‌య రాఘ‌వన్ వంటి సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌టం హ్యాపీగా ఉంది. టాలెంటెడ్ డైరెక్ట‌ర్ ఆనంద కృష్ణ‌న్ సినిమాను తెర‌కెక్కించారు. ఆయ‌న ఇంత‌కు ముందు మెట్రో అనే సినిమాను తెర‌కెక్కించారు. చాలా మంచి ద‌ర్శ‌కుడు. విజ‌య రాఘ‌వ‌న్ సినిమాను నిర్మించిన రాజాగారు, క‌మ‌ల్‌గారు, ప్ర‌దీప్‌గారికి, ధ‌నంజ‌య‌న్‌గారికి ఇత‌రుల‌కు థాంక్స్‌. బాగా ఖ‌ర్చు పెట్టి ఓ మంచి క‌మ‌ర్షియ‌ల్ సినిమా చేశారు. అలాగే తెలుగులో సినిమాను విడుద‌ల చేస్తున్న శ్రీక‌రి ఫిలింస్ ర‌విచంద్రా రెడ్డి, శివారెడ్డిల‌కు థాంక్స్‌, అభినంద‌న‌లు. ఓ ఎడిట‌ర్‌గా కూడాఈ సినిమాను చాలా సార్లు చూశాను. సినిమాలో చాలా ఎమోష‌న్స్ ఉన్నాయి. ప్రేక్ష‌కుల‌ను సినిమా డిస్పాయింట్ చేయ‌దు. బిచ్చ‌గాడు ఓ అమ్మ‌క‌థ అయితే, విజ‌య రాఘ‌వ‌న్ ఓ అమ్మ క‌ల‌ను నేర‌వేర్చే చిత్రం. అంద‌రూ మీ ఫ్యామిలీతో క‌లిసి చూడొచ్చు. నివాస్ ప్ర‌స‌న్న అద్భుత‌మైన సంగీతాన్నిఅందించారు. త‌న‌తో మ‌రిన్ని సినిమాలు చేయాల‌ని అనుకున్నాను. రామ‌చంద్ర‌రాజుగారికి థాంక్స్‌. భాష్య‌శ్రీగారు మంచి సంభాష‌ణ‌లు, పాట‌లు అందించారు. సినిమా త‌ప్ప‌కుండా పెద్ద హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం ఉంది’’ అన్నారు. 



న‌టీన‌టులు:

విజయ్‌ ఆంటోని, ఆత్మిక, రామచంద్రరాజు, ప్రభాకర్ తదితరులు 


సాంకేతిక వ‌ర్గం:

రచన, దర్శకత్వం: ఆనంద కృష్ణన్‌

నిర్మాతలు: టి.డి.రాజా, డి.ఆర్‌. సంజయ్‌ కుమార్‌

 సహ నిర్మాతలు: కమల్ బోరా, లలిత ధనంజయన్‌, బి.ప్రదీప్‌, పంకజ్‌ బోరా, ఎస్‌.విక్రమ్‌ కుమార్‌

సినిమాటోగ్రఫీ: ఎన్‌.ఎస్‌.ఉదయ్‌కుమార్‌

మ్యూజిక్‌: నివాస్‌ కె.ప్రసన్న

ఎడిటర్‌: లియో జాన్‌ పాల్‌

Maro Prasthanam Heroine Muskan Seth Interview

 నేను ఛాలెంజ్ గా తీసుకుని చేసిన సినిమా "మరో ప్రస్థానం" - హీరోయిన్ ముస్కాన్ సేథి




"పైసా వసూల్", "రాగల 24 గంటల్లో" చిత్రాల్లో నటించి తన అందంతో, అభినయంతో ఆకట్టుకున్న అందాల కథానాయిక ముస్కాన్ సేథి. సినిమాలతో పాటు బాలీవుడ్ లో పలు వెబ్ సిరీస్ లో నటించి మెప్పించిన ముస్కాన్ సేథి "మరో ప్రస్థానం" సినిమాలో తనీష్ సరసన నటించింది. ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ మూవీని జానీ తెరకెక్కించారు. వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. "మరో ప్రస్థానం" చిత్రాన్ని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెల 24న "మరో ప్రస్థానం" మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా..


* హీరోయిన్ ముస్కాన్ సేథి మాట్లాడుతూ*... మరో ప్రస్థానం మూవీ నాకు వెరీ వెరీ స్పెషల్ మూవీ. కొన్ని సీన్స్ లో లెంగ్తీ డైలాగులు ఉండేవి. కొన్ని రోజులు డే అండ్ నైట్ షూట్ కూడా చేయడం జరిగింది. ఇది ఒక ఎమోషనల్ ఫిల్మ్. ఇందులో నేను యాక్షన్ సీన్స్ లో కూడా నటించడం జరిగింది. ఫస్ట్ టైమ్ ఇటువంటి క్యారెక్టర్ చేయడం వలన నాకు చాలా ఛాలెంజింగ్ గా అనిపించింది. అయితే.. డైరెక్టర్ జానీ సార్ చాలా బాగా హెల్ప్ చేశారు. డైలాగుల విషయంలో ప్రామిటింగ్ చెప్పడం.. కొన్ని సీన్స్ లో ఎలా నటించాలో యాక్ట్ చేసి చూపించడం.. జరిగింది. 


జానీ సార్ అలా ప్రతిదీ డీటైల్ గా చెప్పడం వలనే నేను ఈ క్యారెక్టర్ ను చేయగలిగాను. ఈ సందర్భంగా జానీ సార్ కి మనస్పూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నాను. ఈ కథ విషయానికి వస్తే.. రఫ్ అండ్ రగ్గడ్ ఫిల్మ్. ఇది చాలా ఇంట్రస్టింగ్ గా ఉంటుంది. మరో విషయం ఏంటంటే.. ఈ కథ అంతా ఒక రోజులోనే జరుగుతుంది. ప్రతి సీన్ చాలా రియలిస్టిటిక్ గా ఉంటుంది. ఫైట్ మాస్టర్ శివ గారి నేతృత్యంలో షూట్ చేసిన యాక్షన్ సీన్స్ చాలా బాగా వచ్చాయి. ఆయన మా అందర్నీ చాలా బాగా గైడ్ చేశారు. టోటల్ గా చెప్పాలంటే.. ఈ సినిమా అనేది నాకు డిఫరెంట్ ఎక్స్ పీరియన్స్ ఇచ్చింది. ఖచ్చితంగా ఆడియన్స్ కి మరో ప్రస్థానం నచ్చుతుందని ఆశిస్తున్నాను. అలాగే ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నాను. అన్నారు.

Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out

 Sai Raam Shankar, SS Murali Krishna’s Resound First Look Out



Hero Sai Raam Shankar who took some break is making comeback with a proper commercial film being directed by debutant SS Murali Krishna. Rashi Singh is playing the female lead, while Aravind Krishna will be seen in a vital role.


Today, on the occasion of Sai Raam Shankar’s birthday, title and first look poster of the movie have been unveiled. The film gets a powerful and mass-appealing title- Resound. Star directors Gopichand Malineni and Bobby have launched the first look poster and wished the entire team all the luck.


Coming to first look poster, Saai Ram Shankar can be seen sitting in a chair and smoking a beedi, after a heavy action with cops in a police station. The poster looks as powerful as the title. This indeed indicates Saai Ram Shankar’s action-packed role in the film tipped to be an out and out action entertainer.


A joint production venture of J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy, Resound will comprise an ensemble cast in important roles. It is being made under the banners of Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts.


Cinematography and music are handled by Saiprakash Ummadisingu and Sweekar Agasthi respectively. Sagar.u is the editor of the movie which is done with its shoot and post-production works are underway.


Cast: Sai Raam Shankar, Rashi Singh, Aravind Krishna, Posani Krishna Murali, Ajay Gosh, Kasi Vishwanath, Adhurs Raghu, Pinky (Sudeepa), Venu, Lavanya Reddy, Pawan Suresh, Raja Reddy, Yamini, Srinivas Sagar, Manivardhan etc.


Technicians:

Director - SS Murali Krishna

Producers: J. Suresh Reddy B Ayyappa Raju and NVN Raja Reddy

Banners: Sri Amuratha Harini Creations, Sri Saranam Ayyappa Creations and Real Reel Arrts

DOP - Saiprakash Ummadisingu

Music - Sweekar Agasthi

Editor - Sagar.u

Stunts - Stunt Naba - Shivaraj Master

Choreography - Vijay Pollaki

Lyrics - Rehman

Art - Vijay Krishna

Designs - Sudhir

PRO – Vamsi-Shekar

Naa Chelive From Chakori Out Now

 Naa Chelive From Chakori Out Now



Here comes the first melody from Chakori. Titled Naa Chelive, this soothing melody is crooned by the man in form, Sid Sriram.


Naa Chelive is powered by a Leander Lee's pleasant composition and Sid Sriram's soulful vocal renditions. The lyrics are deep and meaningful as well.


Chakori is directed by Satya Dhanekula and produced by Devi Satyanarayana.


Chakori has Noel Sean, Mehaboob, and Sumeeta Bajaj in the lead roles.


Production: Aasta Cine Creation

Producer: Devu Satyanarayana

Written & Director: Satya Dhanekula  

Starring: Noel Sean, Mehaboob, Sumeeta Bajaj

Music: Leander Lee

Editor: Kranthi

DOP: Prashanth Neelam

PRO: Eluru Srinu, Meghasyam

Gully Rowdy Trailer Launched By Megastar Chiranjeevi

 మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసిన ‘గ‌ల్లీ రౌడీ’ ట్రైల‌ర్‌.. సెప్టెంబ‌ర్ 17న సినిమా గ్రాండ్ రిలీజ్‌



కోవిడ్ సెకండ్ వేవ్ ప్రభావం తగ్గుముఖం పట్టిన తర్వాత సినిమా థియేట‌ర్స్‌లో చాలా సినిమాలు వ‌చ్చాయి. ప్రేక్ష‌కుల‌ను న‌వ్వించాయి. అయితే మేం ఏకంగా న‌వ్వులతో సెప్టెంబ‌ర్ 17న‌ దాడి చేయ‌బోతున్నాం అని అంటున్నారు ‘గ‌ల్లీరౌడీ’ అండ్ టీమ్‌. యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి బాక్సాఫీస్ వ‌ద్ద సెన్సేష‌న‌ల్ హిట్ సాధించిన ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాల స‌క్సెస్‌లో  కీల‌క పాత్ర‌ను పోషించిన స్టార్ రైట‌ర్  కోన వెంక‌ట‌న్ ‘గల్లీ రౌడీ’ చిత్రానికి స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హిరించ‌డ‌మే కాకుండా స్క్రీన్‌ప్లే అందించారు. కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో సీమ‌శాస్త్రి, సీమ‌ట‌పాకాయ్‌, దేనికైనా రెఢీ, ఈడోర‌కం ఆడోర‌కం వంటి స‌క్సెస్‌ఫుల్ చిత్రాల డైరెక్ట‌ర్ జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ ‘గల్లీ రౌడీ’ చిత్రాన్ని నిర్మించారు.  


 ప‌క్కా హిలేరియ‌స్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా అన్ని ఎలిమెంట్స్ ఉన్న విందుభోజ‌నంలా ప్రేక్ష‌కుల‌ను సంతోష‌పెట్ట‌డానికి సెప్టెంబ‌ర్ 17న మీ ద‌గ్గ‌రున్న థియేట‌ర్స్‌లో గ‌ల్లీరౌడీ సంద‌డి మొద‌లు కానుంది. ఈ న‌వ్వుల సంద‌డికి శాంపిల్ ఎలా ఉంటుందో చూపించడానికి మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా ట్రైల‌ర్‌ను విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. 

‘‘నీకు తెలిసిన రౌడీ ఎవ‌రైనా ఉన్నారా? అని వైవా హ‌ర్ష‌ను హీరోయిన్‌ అడిగితే నా ఫ్రెండే పెద్ద రౌడీ అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ మొద‌ల‌వుతుంది. 
సందీప్ కిష‌న్ ప‌రిచయం ఓ రేంజ్‌లో ఎంట‌ర్‌టైనింగ్‌గా అనిపిస్తుంది. అదే హీరోయిన్ ‘ఇత‌ను నిజంగానే రౌడీనా?’  అని ప్ర‌శ్నిస్తే.. ‘రోజూ  పులిగోరు అవీ ఇవీ పెడ‌తావు క‌దా అవెక్క‌డ’ అంటూ వైవాహ‌ర్ష ప్ర‌శ్నించ‌డం దానికి బ‌దులుగా సందీప్ ‘మొదటిసారి కాఫీషాప్‌కు వ‌స్తున్నా క‌దా, కాస్త క్లాస్‌గా ఉందామని’ అని బ‌దులిస్తాడు. దానికి రివ‌ర్స్‌గా వైవా హ‌ర్ష ‘ఏసుకోరా రౌడీ అంటే ఎవ‌రూ న‌మ్మ‌ట్లేదు’ అని చెప్పే డైలాగ్‌తోనే హీరో క్యారెక్ట‌ర్ ఏంటి?  త‌ను ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఫేస్ చేస్తున్నాడ‌నే విష‌యం రివీల్ అవుతుంది. 

హీరోయిన్ నేహాశెట్టి ప్రేమలో హీరో ఆమె వెంటపడటం.. 
‘వాడు రౌడీ.. వాళ్ల నాన్న రౌడీ... వాళ్ల తాత రౌడీ.. ’ అంటూ హీరో గురించి హీరోయిన్ బిల్డప్ ఇవ్వడం 
రౌడీలను సందీప్ కిషన్ చితక్కొట్టడం

‘పోలీసులు నాపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తే నాకు పాస్‌పోర్ట్ కూడా రాదు క‌దా.. ’అని సందీప్ కిష‌న్ అంటే ‘ఒక్క పాస్ పోర్ట్ ఏంటి?  రేష‌న్ కార్డ్ కూడా రాదు’ అంటూ వైవా హ‌ర్ష చెప్పే డైలాగ్ వింటే హీరోకి రౌడీ కావ‌డం కంటే బ‌య‌ట దేశాల‌కు వెళ్లాల‌నే డ్రీమ్ ఉండ‌టం. కానీ ప్రేమ కోసం రౌడీ మారుతాడ‌నే సంగ‌తి అర్థ‌మ‌వుతుంది. 
బాబీ సింహ పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో క‌నిపిస్తున్నాడు. త‌ను రౌడీల‌ను ఎన్‌కౌంటర్ చేయ‌డం 
కామెడీ కోణంలో సాగే రాజేంద్ర ప్ర‌సాద్‌, స‌హా ప్ర‌తి పాత్ర ఎంట‌ర్‌టైనింగ్‌లోనే సాగుతుంది’’



ట్రైలర్‌లోనే ఈ రేంజ్ కామెడీ  ఉంటే, ఇక సినిమా ఎలా ఉండ‌బోతుందోన‌నే ఆస‌క్తి ప్రేక్ష‌కుల్లో క్రియేట్ చేసేలా ట్రైల‌ర్ ఆస‌క్తిక‌రంగా, ఎంట‌ర్‌టైనింగ్‌గా క‌నిపిస్తుంది. న‌ట‌కిరిటీ రాజేంద్ర ప్ర‌సాద్ ఇందులో ఇంపార్టెంట్ రోల్‌ను పోషించిన ఈ చిత్రంలో కోలీవుడ్ యాక్టర్ బాబీ సింహ ఓ కీలక పాత్రలో నటించారు. 


న‌టీన‌టులు: 
సందీప్ కిష‌న్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, బాబీ సింహ, నేహా శెట్టి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, వైవా హ‌ర్ష‌, త‌దిత‌రులు

సాంకేతిక నిపుణులు
బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేష‌న్‌, ఎం.వి.వి.సినిమా
స‌మ‌ర్ప‌ణ‌: కోన వెంక‌ట్‌
ద‌ర్శ‌క‌త్వం: జి.నాగేశ్వ‌ర్ రెడ్డి
నిర్మాత‌: ఎం.వి.వి.స‌త్య‌నారాయ‌ణ‌
స‌హ నిర్మాత‌:  జి.వి
సంగీతం: చౌర‌స్తా రామ్‌, సాయికార్తీక్‌
స్క్రీన్ ప్లే: కోన వెంక‌ట్‌
క‌థ‌: భాను
ఎడిట‌ర్‌: ఛోటా కె.ప్ర‌సాద్‌
స్టైలిష్ట్‌: నీర‌జ కోన‌
పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Gem Releasing on September 17th

యాక్షన్ ప్యాక్డ్ "జెమ్" ట్రైలర్ విడుదల, 17న థియేటర్ లలో సినిమా రిలీజ్




విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "జెమ్". ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న "జెమ్" చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా  "జెమ్" సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.


"జెమ్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో ట్రైలర్ నిండిపోయింది. హీరో విజయ్ రాజా, హీరోయిన్ రాశీ సింగ్, విలన్ అజయ్ క్యారెక్టర్ ల చుట్టూ మెయిన్ కథంతా ఉన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ నక్షత్రది కీ రోల్ గా కనిపిస్తోంది. విజయ్ రాజా చేసిన ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో "జెమ్" సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. విజయ్ రాజా ను మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టే అంశాలన్నీ "జెమ్" లో ఉన్నాయని తెలుస్తోంది.


ఈ చిత్రానికి సంగీతం - సునీల్ కశ్యప్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత - పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం - సుశీల సుబ్రహ్మణ్యం.

Jai Bhajarangi Teaser Launched

 కె.జి.యఫ్ రేంజ్ లో నిర్మించిన మరో కన్నడ చిత్రం భజరంగి 2 ..  తెలుగులో 'జై భజరంగి' గా టీజర్ విడుదల



బాహుబలి సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ రావడంతో కన్నడ భాషలో నిర్మించిన  ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం 'జై భజరంగి'. 'కరుండా చక్రవర్తి' డా.శివ రాజ్ కుమార్  హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ,  తెలుగు భాషలలో లో ఒకే సారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్  హీరోగా నటించిన   'భజరంగి' 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై  బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో 'భజరంగి 2' అయితే తెలుగులో 'జై భజరంగి' టైటిల్ తో  విడుదల అవుతుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ  బాలాజీ వీడియో  అధినేత నిరంజన్ పన్సారి  'జై భజరంగి' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ సెప్టెంబర్ 11న  శనివారం రాత్రి విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ : " "గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా ప్రసిద్ధ  సంస్థ  'శ్రీ  బాలాజీ వీడియో'   ఇప్పటివరకు షుమారు 400 చిత్రాలకు పైగా  వీడియో  హక్కులను పొందివున్నాము. ఇప్పటివరకు  మేమిచ్చే వీడియో నాణ్యత ను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగు లో మగధీర సినిమా తో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా  పరిచయం చేసాము. అదే విధంగా మేము స్థాపించిన 'శ్రీ బాలాజీ మూవీస్' యు ట్యూబ్ ఛానల్ కూడా  1 కోటి 35 లక్షల వీక్షకులు కలిగి వున్నారు. తాజాగా  డా. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన  'జై భజరంగి'  చిత్రం తో టాలీవుడ్  నిర్మాణరంగం లోకి అడుగుపెట్టడం జరిగింది. 2013 లో  కన్నడ భాష లో విడుదలైన 'భజరంగి'  శివ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఆ  సక్సెస్ ని పునస్కరించుకుని ప్రస్తుతం వున్నా ట్రెండ్ ప్రకారం   'భజరంగి 2' గత 2019 లో  షూటింగ్ ప్రారంభించారు. ఈ రెండేళ్ళు  కరోనా క్రైసెస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలశ్యం అయింది. భజరంగి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది. టెక్నికల్ గా బాహుబలి, కె.జి.యఫ్ లకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన మంచి ఫాన్సీ రేట్ తో  'జై భజరంగి' తెలుగు లో విడుదల చేయడానికి శ్రీ బాలాజీ వీడియో సంస్థ నిర్మాణ రంగం లోకి రావడం  జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి రోజున టీజర్ కూడా విడుదల చేసాము. కన్నడ తెలుగు భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు.


నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే  తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్:  శ్రీ బాలాజీ వీడియో

సంగీతం : అర్జున్ జన్య,

సినిమాటోగ్రఫర్:  స్వామి జె. గౌడ,

ఎడిటర్: దీపు యస్ కుమార్,

కాస్ట్యూమ్స్ :యోగి జి.  రాజ్  

ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్,  

ఆర్ట్ డైరెక్టర్:  రవి శాంతే హక్కులూ,

మాటలు :ఏ. సెల్వమ్,

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ప్రేమ్ కుమార్,  

నిర్మాత: నిరంజన్ పన్సారి,

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష

Nabha Natesh Interview About Maestro


‘మాస్ట్రో’లో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది - హీరోయిన్‌ నభా నటేష్



నితిన్‌, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో.  శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి  ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న  సంద‌ర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు  కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది.


ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగానటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను.


కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా  జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి.


కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఏ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది.


కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది.


రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. కచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.


లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌‌‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు.


డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను.


లాక్డౌన్ తరువాత ఇండియాలోనే మొదటి సారి షూటింగ్ చేసింది మేమే. సోలో బతుకే సో బెటర్ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది.


మన తెలుగు సినిమాకు ఉండే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. మన వారి కోసం ఎన్నో మార్పులు చేర్పులు  చేశాం. పాటలు కూడా కనెక్ట్ అయ్యేలానే పెట్టాం. మన తెలుగు ఆడియెన్స్ రీచ్ వేరు. ఒరిజినల్ సినిమాను చూసినా కూడా ఇది కూడా చూస్తారు. కొత్త చిత్రాల కోసం మన వాళ్లు ఎదురుచూస్తున్నారు. అదే మాకు అడ్వాంటేజ్. నేను కూడా ఇంకా ఈ సినిమాను చూడలేదు. ఎంతో ఎదురుచూస్తున్నాను.


 భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను.


నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు, చిత్రయూనిట్ మొత్తం, తమన్నా ఇలా అందరూ ఎంతో సహకరించారు.

Aaradugula Bullet Releasing in October

అక్టోబర్ లో  హీరో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌` రిలీజ్..


గోపీచంద్ - న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్... త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.

తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా

సాంకేతిక విభాగం
దర్శకుడు: బి గోపాల్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మ
ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌
స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీ
డైలాగ్స్‌: అబ్బూరి రవి
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌
పిఆర్ఒ: వంశీ - శేఖ‌ర్‌

 

Plan B Releasing September 17th

 సెప్టెంబర్ 17 న విడుదల అవుతున్న ఇన్వెస్టిగేటివ్ వండర్ ' ప్లాన్ బి'



కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న చిత్రం "ప్లాన్-బి". థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఎంతో థ్రిల్ కి గురయ్యే విధంగా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్స్ కి, టీజర్ ,  ట్రైలర్ కి మంచి స్పందన రాగ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠభరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది.అయన కూడా ఈ సినిమా టీజర్ ఎంతో క్యూరియాసిటీగా ఉంది. సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నారు.. ఇక టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ని, అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుంది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. 

నటీనటులు : 

మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ,  షాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర,  చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్, 


సాంకేతిక నిపుణులు : 

డివోపి : వెంకట్ గంగాధరి
మ్యూజిక్ : స్వర
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :  శక్తికాంత్ కార్తీక్
ఎడిటర్ : ఆవుల వెంకటేష్
యాక్షన్ : శంకర్ ఉయ్యాల
ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్
ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి
డిటియస్ : రాధాకృష్ణ
డిఐ కలరిస్ట్ : ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్
సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం; కెవి రాజమహి, నిర్మాత; ఎవిఆర్.

Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

 Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched



Saraswathi Creations has announced its second production with Vikas Vasishta of Cinema Bandi fame playing the lead role and first timer Sree Chaitu directing it. Telugu girl Bindu Madhavi is the main heroine and Pooja Ramachandran will be seen in a vital role.


The yet to be titled movie to be produced by Dr Bhaskar Rao Annadata has been launched today with a muhurtham event. Producer Bhaskar Rao Annadata handed over the script to director. While Singer Sunitha sounded the clapboard for the muhurtham shot, Sree Chaitu directed it.


Billed to be a feel-good love story, the film’s regular shoot commences from 14th of this month in and around Hyderabad.


Sagar YVV and Jithin Mohan will crank the camera, while Sunil Kashyap is the music director. Rajendra Kovera is providing screenplay and Kotagiri Venkatesawar Rao is the editor.


Cast: Vikas Vasishta, Bindu Madhavi, Pooja Ramachandran, Sameer, Madhumani, Sana, Jabardasth Rajamouli, Baahubali Kiran, Naga Durga, Srinivasulu and others.


Technical Crew:

Story, Additional Screenplay & Direction – Sree Chaitu

Producer - Dr Bhaskar Rao Annadata

Banner: Saraswathi Creations

Screenplay – Rajendra Kovera

Music - Sunil Kashyap

DOP - Sagar YVV and Jithin Mohan

Editor - Kotagiri Venkatesawar Rao

Costume Designer: Rekha Boggarapu

Casting Director: Pushpa Bhaskar

Art – Brahmanath A Patil

Choreography: Satyam

Lyrics – Suddala Ashok Teja & Vishwanath

Production Manager: Jagan

Production Controllers: Sunny, Venkat Reddy

PRO: Vamsi-Shekar

Mangli Song Launched from 1997

 1997చిత్రంలోని మంగ్లీ సాంగ్ విడుదల !

 


డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన .. ''ఏమి బతుకు ...'' అనే సాంగ్ ని  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరి  లతో పాటు తదితర చిత్ర  యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  


ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకుడిగా  చేసిన మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను చేసిన బ్లేడ్ బాబ్జి సినిమాలో మోహన్ నటించాడు. అప్పటినుండి తనతో ఈ అనుబంధం కొనసాగుతుంది. మోహన్ స్కూల్, హాస్పిటల్ రంగాల్లో సూపర్ సక్సెస్ సాధించాడు.  ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే సినిమా రంగంలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు తెలుసు, చాలా పవర్ ఫుల్ కథతో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అని షాక్ అయ్యాను.  కథ విషయంలో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేసాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా రెండు పాత్రలు బాగా చేసాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట విన్నాను. చాలా ఎమోషన్ అయ్యాను. నిజంగా చాలా ఆలోచింపచేసేలా ఉండే సాంగ్ ఇది. ముక్యంగా మనసులు కదిలించే సాంగ్ ఇది. సామజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రజల్లో చైతన్యం తేవాలంటే కేవలం అది సినిమాలవల్లే సాధ్యం అని లెనిన్ మహనీయుడు చెప్పాడు. అందుకే ఇలాంటి సమస్యలను ప్రజలదగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్. ఈ సినిమాతో మోహన్ తప్పకుండా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకుంటాడు అన్నారు.

 

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. అతను నాకు కొడుకు లాంటివాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అలాగే ఇందులో ఓ సాంగ్ యాడ్ చేద్దామని మోహన్ అన్నాడు .. సరే అని చెప్పడంతో తానే ఈ సాంగ్ అద్భుతంగా రాసాడు. ఈ పాటకు మంగ్లీ అయితేనే న్యాయం చేస్తుందని అనిపించి ఆమెతో పాడించాం. మంగ్లీ గొంతులో నుండి వచ్చిన ఈ సాంగ్ మరో రేంజ్ కి వెళ్ళింది. తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు.


హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా విషయంలో చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా రాజా రవీంద్ర గారికి, ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసినందుకు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ గారికి, హీరో విశ్వక్ సేన్ గారికి, అలాగే దర్శకుడు వర్మ గారికి, అలాగే ప్రముఖ నటులు  ప్రకాష్ రాజ్ గారికి .. వారితో పాటు  కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు.  ఈ సినిమా విషయంలో షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఇందులో ఓ సాంగ్ పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ముందు కోటి గారికి చెప్పాను.  సరే అనడంతో ఈ సాంగ్ ని నేనే రాసాను ఈ పాట విన్న కోటి గారు ఈ పాటను మంగ్లీ తో పాడించాలనిచెప్పడంతో ఆమెతో పాడించాం .. పాట చాలా బాగా వచ్చింది. ప్రతి  కదిలించే సాంగ్ ఇది. తప్పకుండా వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ ని పెట్టించేందుకు మళ్ళీ షూటింగ్ చేయకుండా షూట్ చేసిన సన్నివేశాలే వాడాము. పాటకు ఆ సీన్స్ బాగా సింక్ అయ్యాయి. ఈ పాటను మంగ్లీ పాడడంతో ఈ సాంగ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.  


T-Series Dil Raju Productions' 'HIT - The First Case' begins with a Mahurat Pooja

 T-Series & Dil Raju Productions' 'HIT - The First Case' begins with a Mahurat Pooja!



The much anticipated Hindi remake of HIT which stars Rajkummar Rao and Sanya Malhotra has begun the film's journey with a mahurat pooja ceremony.


Present at this auspicious occasion were actor Rajkummar Rao, producers Dil Raju, Bhushan Kumar, Kuldeep Rathore, and director Dr. Sailesh Kolanu.


'HIT - The First Case' tells the story of a cop who is on the trail of a missing woman.


Produced by Bhushan Kumar, Dil Raju, Krishan Kumar, and Kuldeep Rathore, the film is directed by Dr. Sailesh Kolanu.

Director Sampath Nandi Interview About Seetimaarr

 హీరో గోపీచంద్‌, ఆయ‌న అభిమానులు సంతోషపడేలా ‘సీటీమార్’  సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడిగా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను:  డైరెక్ట‌ర్ సంప‌త్ నంది



ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట‌ర్వ్యూ విశేషాలు...

* యూనానిమస్ రెస్పాన్స్ వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు ప‌డ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
* బాలీవుడ్‌లోని సినిమాల‌తో క‌లిపి పోల్చి చూసి ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అవి నిర్మాత‌లు తెలియ‌జేస్తారు.
* ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ క‌థ అనుకున్న త‌ర్వాత దాన్ని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చేద్దామ‌ని అనుకున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్ష‌న్ సినిమా చేశాన‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చెప్పాను. యాక్ష‌న్ మూవీ చేయ‌డానిక‌నే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాను. దానికి ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌, వాళ్లు ఓ ఉద్దేశం కోసం పోరాడ‌టం.. వంటి ఎమోష‌న్స్‌కు అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ గురించి, అందులోని యాక్ష‌న్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. 
*గౌత‌మ్ నంద త‌ర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనో, రివేంజ్ ఫార్మేట్‌లోనో సినిమా చేయాల‌నుకున్నాను. అలాంటి స‌మ‌యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్  కాన్సెప్ట్ ఐడియాకు వ‌చ్చింది.  క‌బ‌డ్డీ ఇండియాలో పెద్ద మాస్ గేమ్‌. అలాంటి మాస్ గేమ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే బావుంటుంద‌నిపించింది. అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుకున్నాను. 
* బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత అంత మంచి డైలాగ్స్ ఈ సినిమాకు కుదిరాయని అంటున్నారు. 
* నాకు కూడా గ‌త ప‌దేళ్ల‌లో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా ఆయ‌న ఫ్యాన్స్ దాహం తీర్చింది. ఏ డైరెక్ట‌ర్‌కు అయినా ఓ హీరో , ఫ్యాన్స్‌ ఫీల‌య్యే సినిమా చేస్తే దాన్ని క‌న్నా గర్వంగా ఫీల‌య్యే క్ష‌ణ‌మే ఉండ‌దు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మోడ్‌లో ఉన్నాను
* ఒక క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం అంద‌రం క‌లిసిపోతుంటాం. ఇక్క‌డ గొడ‌వ‌లు ప‌డే మ‌నం అమెరికా వెళ్ల‌గానే ఇండియ‌న్స్ అనే భావ‌న వ‌స్తుంది. అలాగే ఉత్త‌రాదికి వెళ్లిన‌ప్పుడు తెలుగువాళ్ల‌మ‌నే ఫీలింగ్‌తో క‌లిసిపోతాం. 
* నేను డైలాగ్స్ రాసుకునే స‌మ‌యంలోనే ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకుపోవాల‌నేదే నా ఉద్దేశం. అందుకే ముందు ఒక‌లా చూపించినా, క్లైమాక్స్‌లో అంద‌రూ క‌లుసుకుని క‌ప్ కొట్టుకొచ్చేలా చూపించాను. 
* ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్‌ చేయ‌డానికి ఇర‌వై రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్‌ను రెండు భాగాలుగా తీశాను. దాన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కులు మెప్పించేలా ఎడిట్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. 
* ఇండియా, పాకిస్థాన్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్పుడు, చివ‌రి వ‌ర‌కు మ‌నం గెలుస్తామా లేదా? అనిపించిన‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్‌కు మూడు రోజులు ఉన్న‌ప్పుడు అర‌గంట కంటే ఎక్కువసేపు నిద్ర‌పోలేదు. 
* ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే నిర్మాత‌లు మాకు స‌పోర్ట్‌గా నిలిచారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌మైతే ఉండింది. కానీ తెలియ‌ని భ‌య‌మొక‌టి లోలోప‌ల ర‌న్ అవుతుండింది. వినాయ‌కుడు మా భ‌యాల‌ను ప‌టాపంచ‌లు చేసేశాడు. 
* ఇది హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ప్రేక్ష‌కుల విజ‌యంగా భావిస్తున్నాను. థియేట‌ర్‌కు ప్రేక్ష‌కులు రావాల‌ని అనుకోవ‌డంతో ఈ స‌క్సెస్ ద‌క్కింది. 
* త‌మ‌న్నాగారితో హ్యాట్రిక్ విజ‌యం సాధించడం హ్యాపీ. అలా కుదిరిపోయింది. 
* ఓటీటీ అనేది మంచి ఫ్లాట్‌ఫామ్ అన‌డంలో సందేహం లేదు. సినిమా చేసేట‌ప్పుడు అది థియేట‌ర్ మూవీనా, ఓటీటీ మూవీనా అని ప్లాన్ చేసుకుని చేస్తే బావుంటుంది. 
* నెక్ట్స్ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాను.

Priyuraalu in Sony Liv on September 17th

 సెప్టెంబర్ 17న సోని లివ్ లో "ప్రియురాలు" సినిమా స్ట్రీమింగ్




పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రియురాలు". రామరాజు సినిమా పతాకంపై రామరాజు, అజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే "ప్రియురాలు" చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు.


"ప్రియురాలు" చిత్ర ట్రైలర్ శనివారం విడుదలైంది. లవ్ ఈజ్ రొమాన్స్, లవ్ ఈజ్ హానెస్ట్, లవ్ ఈజ్ డైలెమా అంటూ ప్రేమ వివిధ స్వభావాలను ట్రైలర్ లో పేర్కొంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్, లవ్ మేకింగ్ విజువల్స్ చూపించారు. ఎక్స్టా మారిటర్ అఫైర్స్, ఎక్స్ట్రా మారిటల్ లవ్ అని చెబుతూ ట్రైలర్ ముగించారు. రెండు జంటల మధ్య సాగే సరికొత్త ప్రేమ బంధాన్ని ప్రియురాలు మూవీలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగులోకి వచ్చిన కొత్త ఓటీటీ సోని లివ్ లో ప్రియురాలు సినిమా ఈ నెల 17న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.


శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశీ, సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - మహి పి రెడ్డి, ఎడిటర్ - సాయి రేవంత్, కథ - శ్రీ సౌమ్య, సహ నిర్మాతలు - గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు, నిర్మాతలు - రామరాజు, అజయ్ కర్లపూడి, దర్శకత్వం - రామరాజు

Akhil Akkineni Most Eligible Bachelor Leharaayi Lyrical video on September 15th

 సెప్టెంబర్ 15న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Tammareddy Bharadwaja Pressmeet About CCT

 చిరంజీవి గారి సంకల్పం వల్లే కార్మికులకు వాక్సిన్ అందింది : తమ్మారెడ్డి భరద్వాజ   

( సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ సెకండ్ డ్రైవ్ )



కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం సి సి సి కమిటీ బ్లడ్ బ్యాంకు లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు. 


ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ప్రపంచం అంతా సంవత్సరం న్నర నుండి అతలాకుతలం అయిపోతుంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అలాంటి సమయంలో చిరంజీవి గారు స్పందించి కరోనా సమయంలో సినిమా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది.  అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసారు. ఆ తరువాత సినిమా కార్మికులకు వ్యాక్సినేషన్ కూడా వేయిస్తున్నారు. ఇప్పటివరకు 4000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ఈ రోజు వరకు ఈ సెకండ్ డోస్ కార్యక్రమం అందరు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్ళందరూ వాక్సిన్  తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజు షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరు ఖాళి లేని పరిస్థితి.  ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీసీసీ కమిటీ చేపట్టిన ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవ్వడమే కాదు అందరు స్వతహాగా వాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీం, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. 


దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ ..  కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో , ఛాంబర్ ఆధ్వర్యంలో, 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన సీసీసీ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 5000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోస్ సక్సెస్ ఫుల్ గా నడిచింది.. ఇప్పుడు రెండో డోస్ కూడా ఇస్తున్నారు.. కాబట్టి  సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. ఈ వాక్సిన్ కార్యక్రమం వినాయక చవితి రోజు హాలిడే ఉంటుంది.. ఆ తరువాత శని, ఆదివారాల్లో వాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఆదివారం తో ఈ డ్రైవ్ ముగుస్తుంది కాబట్టి.. సీసీసీ ఆధ్వర్యంలో మొదటి డోస్ వేసుకున్న వారంతా సెకండ్ డోస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను.  అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.


చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ .. వల్లభనేని అనిల్ మాట్లాడుతూ .. కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే.  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసి, వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో మీరు వాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ లాక్ డౌన్ పడడంతో .. సినిమా కార్మికులకు ఎలాగైనా వాక్సిన్ వేయిచాలని నిర్ణయించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నాను. 


దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ .. సీసీసీ అనేది చిరంజీవి గారి మనసులోంచి వచ్చిన ఆలోచన. దానికి మమ్మల్ని అందరిని కలిపి టీం గా ఫార్మ్ చేసి అందరికి సహాయం చేయడానికి అవకాశం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి బ్లడ్ అందించాం . ఎవరికి ఎప్పుడు అవసరమైన సరే బ్లడ్ బ్యాంకు నుండి సహాయం అందుతుంది. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు.. గత ఏడాది వినాయక చవితి ముందు సరుకులతో పాటు బెల్లం, సేమియా కూడా అందించమని చెప్పారు.. అంటే అందరు కూడా పండగ చేసుకోవాలని ఆలోచన ఆయనది. నిజంగా అయన ముందు చూపు అంత గొప్పది. కరోనా వాక్సిన్ కోసం అయన ప్రభుత్వం, ప్రయివేట్ వారితో ఎంతగా మాట్లాడారో నాకు తెలుసు.. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ మద్యే ఆక్సిజన్ కూడా అందించారు.. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అన్నారు.