Latest Post

Gem Releasing on September 17th

యాక్షన్ ప్యాక్డ్ "జెమ్" ట్రైలర్ విడుదల, 17న థియేటర్ లలో సినిమా రిలీజ్




విజయ్ రాజా, రాశీ సింగ్, నక్షత్ర హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "జెమ్". ఈ చిత్రాన్ని మహాలక్ష్మీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పత్తికొండ కుమార స్వామి నిర్మించారు. సుశీల సుబ్రహ్మణ్యం దర్శకత్వం వహించారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న "జెమ్" చిత్రం ఈ నెల 17న థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకొస్తోంది. తాజాగా  "జెమ్" సినిమా ట్రైలర్ ను చిత్ర యూనిట్ విడుదల చేశారు.


"జెమ్" ట్రైలర్ ఎలా ఉందో చూస్తే...పవర్ ప్యాక్డ్ యాక్షన్ తో ట్రైలర్ నిండిపోయింది. హీరో విజయ్ రాజా, హీరోయిన్ రాశీ సింగ్, విలన్ అజయ్ క్యారెక్టర్ ల చుట్టూ మెయిన్ కథంతా ఉన్నట్లు తెలుస్తోంది. మరో హీరోయిన్ నక్షత్రది కీ రోల్ గా కనిపిస్తోంది. విజయ్ రాజా చేసిన ఫైట్స్, రొమాంటిక్ సీన్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి. పంచ్ డైలాగ్స్ వంటి కమర్షియల్ ఎలిమెంట్స్ తో "జెమ్" సినిమా తెరకెక్కినట్లు ట్రైలర్ ద్వారా అర్థమవుతోంది. విజయ్ రాజా ను మంచి కమర్షియల్ హీరోగా నిలబెట్టే అంశాలన్నీ "జెమ్" లో ఉన్నాయని తెలుస్తోంది.


ఈ చిత్రానికి సంగీతం - సునీల్ కశ్యప్, ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ - ఐ ఆండ్రూ, పీఆర్వో జీఎస్కే మీడియా, నిర్మాత - పత్తికొండ కుమారస్వామి, దర్శకత్వం - సుశీల సుబ్రహ్మణ్యం.

Jai Bhajarangi Teaser Launched

 కె.జి.యఫ్ రేంజ్ లో నిర్మించిన మరో కన్నడ చిత్రం భజరంగి 2 ..  తెలుగులో 'జై భజరంగి' గా టీజర్ విడుదల



బాహుబలి సక్సెస్ తో దక్షిణాది చిత్రాలకు క్రేజ్ రావడంతో కన్నడ భాషలో నిర్మించిన  ‘కె.జి.యఫ్’ సృష్టించిన ప్రభంజనం అంతా ఇంతా కాదు. సౌత్‌లో చిన్న సినీ పరిశ్రమగా ఉన్న శాండిల్‌వుడ్ నుంచి వచ్చిన ‘కె.జి.యఫ్: చాప్టర్ 1’ దేశ వ్యాప్తంగా సినీ ప్రేమికుల్ని కట్టి పడేసింది. ఇండియన్ బాక్సాఫీసు వద్ద కాసుల వర్షం కురిపించింది. సౌత్ నుంచి వచ్చిన సినిమాల్లో ‘బాహుబలి’ తరవాత ఆ స్థాయిలో అలరించిన ఏకైక చిత్రం ‘కె.జి.యఫ్’. అదే స్థాయిలో కన్నడ సినీ పరిశ్రమ నుండి వస్తున్న మరో అత్యంత భారీ చిత్రం 'జై భజరంగి'. 'కరుండా చక్రవర్తి' డా.శివ రాజ్ కుమార్  హీరోగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ చిత్రం కన్నడ,  తెలుగు భాషలలో లో ఒకే సారి విడుదలకు సిద్ధమౌతోంది. డా.శివ రాజ్ కుమార్  హీరోగా నటించిన   'భజరంగి' 2013 లో కర్ణాటక రాష్ట్రం లో 212 థియేటర్లలో విడుదలై  బాక్స్ ఆఫీస్ వద్ద సంచలం సృటించింది. ఆ చిత్రానికి కొనసాగింపుగా కన్నడలో 'భజరంగి 2' అయితే తెలుగులో 'జై భజరంగి' టైటిల్ తో  విడుదల అవుతుంది. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలను వీడియో రైట్స్ దక్కించుకుని విడుదల చేసిన శ్రీ  బాలాజీ వీడియో  అధినేత నిరంజన్ పన్సారి  'జై భజరంగి' చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన టీజర్ సెప్టెంబర్ 11న  శనివారం రాత్రి విడుదల అయ్యింది.

ఈ సందర్భంగా నిర్మాత నిరంజన్ పన్సారి మాట్లాడుతూ : " "గత 35 ఏళ్లుగా వీడియో రంగం లో వున్నా ప్రసిద్ధ  సంస్థ  'శ్రీ  బాలాజీ వీడియో'   ఇప్పటివరకు షుమారు 400 చిత్రాలకు పైగా  వీడియో  హక్కులను పొందివున్నాము. ఇప్పటివరకు  మేమిచ్చే వీడియో నాణ్యత ను గుర్తించి టాలీవుడ్ ప్రముఖులు మమ్మల్ని ప్రోత్సహించారు. తెలుగు లో మగధీర సినిమా తో బ్లూ రే డిస్క్ ని మా సంస్థ ద్వారా  పరిచయం చేసాము. అదే విధంగా మేము స్థాపించిన 'శ్రీ బాలాజీ మూవీస్' యు ట్యూబ్ ఛానల్ కూడా  1 కోటి 35 లక్షల వీక్షకులు కలిగి వున్నారు. తాజాగా  డా. శివ రాజ్ కుమార్ హీరోగా నటించిన  'జై భజరంగి'  చిత్రం తో టాలీవుడ్  నిర్మాణరంగం లోకి అడుగుపెట్టడం జరిగింది. 2013 లో  కన్నడ భాష లో విడుదలైన 'భజరంగి'  శివ రాజ్ కుమార్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ చిత్రం. ఆ  సక్సెస్ ని పునస్కరించుకుని ప్రస్తుతం వున్నా ట్రెండ్ ప్రకారం   'భజరంగి 2' గత 2019 లో  షూటింగ్ ప్రారంభించారు. ఈ రెండేళ్ళు  కరోనా క్రైసెస్ కారణంగా చిత్ర షూటింగ్ ఆలశ్యం అయింది. భజరంగి చిత్రానికి దర్శకత్వం వహించిన ఏ హర్ష ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.  ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ చివరి దశలో వుంది. టెక్నికల్ గా బాహుబలి, కె.జి.యఫ్ లకు ఏ మాత్రం తగ్గకుండా భారీ బడ్జెట్ తో నిర్మించడం వలన మంచి ఫాన్సీ రేట్ తో  'జై భజరంగి' తెలుగు లో విడుదల చేయడానికి శ్రీ బాలాజీ వీడియో సంస్థ నిర్మాణ రంగం లోకి రావడం  జరిగింది. ఈ సందర్భంగా నిన్నటి రోజున టీజర్ కూడా విడుదల చేసాము. కన్నడ తెలుగు భాషలలో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాము" అన్నారు.


నటీనటులు: డా. శివరాజ్ కుమార్, భావన మీనన్, శృతి, సౌరవ్ లోకేష్, శివరాజ్ కె ఆర్ పెటే  తదితరులు

సాంకేతిక బృందం

బ్యానర్:  శ్రీ బాలాజీ వీడియో

సంగీతం : అర్జున్ జన్య,

సినిమాటోగ్రఫర్:  స్వామి జె. గౌడ,

ఎడిటర్: దీపు యస్ కుమార్,

కాస్ట్యూమ్స్ :యోగి జి.  రాజ్  

ఫైట్స్:డా. రవి వర్మ, విక్రమ్ మోర్,  

ఆర్ట్ డైరెక్టర్:  రవి శాంతే హక్కులూ,

మాటలు :ఏ. సెల్వమ్,

ఎక్సిక్యూటివ్ ప్రొడ్యూసర్  :  ప్రేమ్ కుమార్,  

నిర్మాత: నిరంజన్ పన్సారి,

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: ఏ. హర్ష

Nabha Natesh Interview About Maestro


‘మాస్ట్రో’లో నా పాత్ర కొత్త‌గా ఉంటుంది - హీరోయిన్‌ నభా నటేష్



నితిన్‌, నభా నటేష్, తమన్నా ప్రధాన పాత్రల్లో రూపొందిన చిత్రం మాస్ట్రో.  శ్రేష్ఠ్ మూవీస్‌ పతాకంపై రాజ్‌ కుమార్‌ ఆకేళ్ళ సమర్పణలో ఎన్‌.సుధాకర్‌రెడ్డి, నిఖితా రెడ్డి  ఈ మూవీని నిర్మించారు. ఈ సినిమాకు మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించారు. సెప్టెంబర్ 17న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రాబోతోన్న  సంద‌ర్భంగా హీరోయిన్ నభా నటేష్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..


అంధాదున్ సినిమా విడుదలైనప్పుడు చూశాను. అది బాలీవుడ్‌కు టర్నింగ్ పాయింట్ లాంటి సినిమా అని చెప్పుకోవచ్చు. అప్పట్లో అంధాదున్ గురించి చాలా వినిపించింది. ఈ రీమేక్‌లో ఆఫర్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది. జనాలు ఇప్పుడు  కొత్త సినిమాలు చూసేందుకు ఇష్టపడుతున్నారు. అలాంటి చిత్రంలో నాకు కూడా అవకాశం రావడం హ్యాపీగా అనిపించింది.


ఇది నా మొదటి రీమేక్ సినిమా. అది నాకు భయంగా అనిపించింది. రాధికా ఆప్టే అద్బుతంగానటించింది. కానీ అది నేను ఎలా చేయగలను? అని భయం వేసింది. కానీ మళ్లీ సినిమా చూడకూడదు..ప్రభావితం అవుతాను అని అనుకున్నాను.


కరోనా పీక్స్‌లో ఉన్న సమయంలోనే షూటింగ్ ప్రారంభించాం. మేమే మొదటగా సెట్‌కు వెళ్లామనుకుంటాను. అప్పుడు రెస్టారెంట్, పబ్ సీన్స్ చేశాం. ఎంతో మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు ఉండేవారు. షాట్ చేసేసి మేం పరిగెత్తే వాళ్లం. మా  జాగ్రత్తలు మేం తీసుకునేవాళ్లం. అంధుడిగా నితిన్ అద్భుతంగా నటించారు. మా సీన్స్, సాంగ్స్ బాగా వచ్చాయి.


కరోనా సమయంలో నావి రెండు సినిమాలు విడుదలయ్యాయి. ఇది మూడో సినిమా. ఇది వరకే నాకు ఓటీటీ భయం ఉండేది. ఏ సినిమా ఓటీటీలో వస్తుంది అని అనుకున్నాను. ఇంకా థియేటర్ల సమస్య ఉంది. కానీ ఇప్పుడు ఓటీటీలో అయితే అందరూ చూసేందుకు అవకాశం ఉంది.


కథను మాత్రం తీసుకుని దర్శకుడు తన విజన్‌తో సినిమాను తీశారు. దానికి దీనికి సంబంధం ఉండదు. నా పాత్రలో ఎన్నో మార్పులు చేర్పులు చేశారు. తెలుగు చిత్రంలానే ఉంటుంది. కథలోని జీవం మాత్రం అలానే ఉంటుంది.


రీమేక్ చేయడం ఇదే మొదటి సారి. కచ్చితంగా పోలికలు ఉంటాయి. మూవీ చూసిన తరువాత జనాలు ఎలాంటి రియాక్షన్ ఇస్తారనేది చూడాలి. నా పాత్రను ఒరిజినల్ దాంతో ఎలా పోలుస్తారు? అని ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నాను.


లాక్డౌన్ సమయంలో సినిమాలు చూడటమే నా పని. ఫస్ట్ వేవ్‌‌‌లో చాలా కంటెంట్ వచ్చింది. అన్ని భాషల చిత్రాలు చూశాను. కానీ ఈ సారి మాత్రం అంతగా కుదరలేదు. సినిమా షూటింగ్‌లతో బిజీగా ఉన్నాను. పైగా కంటెంట్ కూడా అంతగా రాలేదు.


డబ్బింగ్ చెప్పే ప్రయత్నం చేశాను. కానీ కుదరలేదు. నేను బెంగళూరులో ఉంటున్నాను.. రావడం వెళ్లడం.. ఈ కరోనా నిబంధనలు.. ఇలా టైం కుదరలేదు. అందుకే డబ్బింగ్ చెప్పలేకపోయాను. తదుపరి చిత్రాల్లో కచ్చితంగా డబ్బింగ్ చెబుతాను.


లాక్డౌన్ తరువాత ఇండియాలోనే మొదటి సారి షూటింగ్ చేసింది మేమే. సోలో బతుకే సో బెటర్ సినిమాను కూడా రిలీజ్ చేశాం. అప్పుడు భయభయంగానే చేశాం. వీలైనంత తక్కువ మందితో, అన్ని జాగ్రత్తలు తీసుకుని చేశాం. కానీ ఇప్పుడు అంత భయం లేదు. అలవాటు అయింది.


మన తెలుగు సినిమాకు ఉండే ఆడియెన్స్ ఎప్పుడూ ఉంటారు. మన వారి కోసం ఎన్నో మార్పులు చేర్పులు  చేశాం. పాటలు కూడా కనెక్ట్ అయ్యేలానే పెట్టాం. మన తెలుగు ఆడియెన్స్ రీచ్ వేరు. ఒరిజినల్ సినిమాను చూసినా కూడా ఇది కూడా చూస్తారు. కొత్త చిత్రాల కోసం మన వాళ్లు ఎదురుచూస్తున్నారు. అదే మాకు అడ్వాంటేజ్. నేను కూడా ఇంకా ఈ సినిమాను చూడలేదు. ఎంతో ఎదురుచూస్తున్నాను.


 భవిష్యత్తు ప్రాజెక్ట్‌ల గురించి అధికారికంగా ప్రకటించేంత వరకు ఇప్పుడే ఏమీ చెప్పలేను. అన్ని రకాల పాత్రలను చేయాలని ఉంది. అన్ని రకాల జానర్లలో సినిమాలు చేస్తున్నాను. అది నాకు చాలా ఆనందంగా ఉంది. మాస్ట్రోలోనూ కొత్తగా కనిపిస్తాను. సినిమా చూశాక జనాలు కూడా అదే అంటారు. ఇంకా కొత్త పాత్రలను చేయాలని అనుకుంటున్నాను.


నితిన్‌తో పని చేయడం ఎంతో సరదాగా ఉంటుంది. ఎప్పుడు షూటింగ్ ప్రారంభించాం.. ఎప్పుడు పూర్తి చేశామో కూడా తెలియకుండా గడిచింది. దర్శకుడు, చిత్రయూనిట్ మొత్తం, తమన్నా ఇలా అందరూ ఎంతో సహకరించారు.

Aaradugula Bullet Releasing in October

అక్టోబర్ లో  హీరో గోపీచంద్ ‘ఆరడుగుల బుల్లెట్‌` రిలీజ్..


గోపీచంద్ - న‌య‌న‌తార హీరో హీరోయిన్లుగా బి. గోపాల్‌ దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ ఎంటర్టెనర్ ‘ఆరడుగుల బుల్లెట్‌’. జయబాలజీ రీల్‌ మీడియా ప్రైవేట్‌ లిమిలెట్‌ పతాకంపై తాండ్ర రమేష్‌ నిర్మించిన ఈ చిత్రాన్ని అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. గోపిచంద్, న‌య‌న‌తార కాంబినేష‌న్‌, బి. గోపాల్ మేకింగ్, వ‌క్కంతం వంశీ క‌థ‌, మ‌ణిశ‌ర్మ మ్యూజిక్ ఈ చిత్రానికి మేజర్ హైలెట్స్... త్వరలోనే ఈ మూవీ ప్రమోషన్స్ ను కిక్ స్టార్ట్ చేయబోతున్నారు.

తారాగణం: గోపీచంద్, నయనతార, ప్రకాష్‌రాజ్, బ్రహ్మానందం, అభిమన్యు సిన్హా

సాంకేతిక విభాగం
దర్శకుడు: బి గోపాల్‌
మ్యూజిక్‌ డైరెక్టర్‌: మణిశర్మ
ఫొటోగ్రాఫర్‌: బాలమురగన్‌
స్రిప్ట్‌ రైటర్‌: వక్కంతం వంశీ
డైలాగ్స్‌: అబ్బూరి రవి
ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు
ప్రొడ్యూసర్‌: తాండ్ర రమేష్‌
పిఆర్ఒ: వంశీ - శేఖ‌ర్‌

 

Plan B Releasing September 17th

 సెప్టెంబర్ 17 న విడుదల అవుతున్న ఇన్వెస్టిగేటివ్ వండర్ ' ప్లాన్ బి'



కేవీ రాజమహి దర్శకత్వంలో ఏవీఆర్ మూవీ వండర్స్ బ్యానర్ పై ఏవీఆర్ నిర్మిస్తోన్న చిత్రం "ప్లాన్-బి". థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ప్రేక్షకులు ఎంతో థ్రిల్ కి గురయ్యే విధంగా తెరకెక్కిన ఈ సినిమా లో శ్రీనివాస్ రెడ్డి, సూర్య వశిష్ట హీరోలుగా నటిస్తుండగా డింపుల్ హీరోయిన్ గా చేస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం యొక్క పోస్టర్స్ కి, టీజర్ ,  ట్రైలర్ కి మంచి స్పందన రాగ ప్రేక్షకులను ఎంతో ఉత్కంఠభరిచే విధంగా ఈ సినిమా తెరకెక్కింది. మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్ కీలకపాత్రలు పోషించిన ఈ సస్పెన్స్, క్రైమ్, థ్రిల్లర్ సినిమా టీజర్ ని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ విడుదల చేయగా దీనికి మంచి స్పందన వచ్చింది.అయన కూడా ఈ సినిమా టీజర్ ఎంతో క్యూరియాసిటీగా ఉంది. సినిమా కోసం ఎంతో ఎదురు చూస్తున్నాను అన్నారు.. ఇక టీజర్ తోనే ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తి ని, అంచనాలను ఏర్పరుచుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 17 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. ధియేటర్ లలో ఎంతో ఘనంగా విడుదల కాబోతున్న ఈ సినిమా ఇన్వెస్టిగేటివ్ వండర్ చిత్రంగా అందరిని రెండు గంటలు చాలా థ్రిల్ కి గురి చేస్తుంది. సినిమా కూడా అద్భుతంగా వచ్చింది అని దర్శక నిర్మాతలు చెప్తున్నారు. 

నటీనటులు : 

మురళి శర్మ, రవిప్రకాష్, అభినవ్ సర్దార్, కునాల్ శర్మ,  షాని, సబీనా, నవీనారెడ్డి, మీనా వాసు, రాజేంద్ర,  చిత్రం శ్రీను, దయానంద రెడ్డి, డెబోరా, బన్ను, వర్ధన్ పెరుర్, 


సాంకేతిక నిపుణులు : 

డివోపి : వెంకట్ గంగాధరి
మ్యూజిక్ : స్వర
బ్యాక్ గ్రౌండ్ స్కోర్ :  శక్తికాంత్ కార్తీక్
ఎడిటర్ : ఆవుల వెంకటేష్
యాక్షన్ : శంకర్ ఉయ్యాల
ఆర్ట్ : కృష్ణ చిత్తనుర్
ప్రొడక్షన్ డిజైనర్ : సతీష్ దాసరి
డిటియస్ : రాధాకృష్ణ
డిఐ కలరిస్ట్ : ప్రసాద్ ల్యాబ్స్ ప్రేమ్
సౌండ్ ఎఫెక్ట్స్ : రఘునాథ్.కె
కథ-స్క్రీన్ ప్లే-మాటలు-దర్శకత్వం; కెవి రాజమహి, నిర్మాత; ఎవిఆర్.

Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched

 Vikas Vasishta, Sree Chaitu, Saraswathi Creations Production No 2 Launched



Saraswathi Creations has announced its second production with Vikas Vasishta of Cinema Bandi fame playing the lead role and first timer Sree Chaitu directing it. Telugu girl Bindu Madhavi is the main heroine and Pooja Ramachandran will be seen in a vital role.


The yet to be titled movie to be produced by Dr Bhaskar Rao Annadata has been launched today with a muhurtham event. Producer Bhaskar Rao Annadata handed over the script to director. While Singer Sunitha sounded the clapboard for the muhurtham shot, Sree Chaitu directed it.


Billed to be a feel-good love story, the film’s regular shoot commences from 14th of this month in and around Hyderabad.


Sagar YVV and Jithin Mohan will crank the camera, while Sunil Kashyap is the music director. Rajendra Kovera is providing screenplay and Kotagiri Venkatesawar Rao is the editor.


Cast: Vikas Vasishta, Bindu Madhavi, Pooja Ramachandran, Sameer, Madhumani, Sana, Jabardasth Rajamouli, Baahubali Kiran, Naga Durga, Srinivasulu and others.


Technical Crew:

Story, Additional Screenplay & Direction – Sree Chaitu

Producer - Dr Bhaskar Rao Annadata

Banner: Saraswathi Creations

Screenplay – Rajendra Kovera

Music - Sunil Kashyap

DOP - Sagar YVV and Jithin Mohan

Editor - Kotagiri Venkatesawar Rao

Costume Designer: Rekha Boggarapu

Casting Director: Pushpa Bhaskar

Art – Brahmanath A Patil

Choreography: Satyam

Lyrics – Suddala Ashok Teja & Vishwanath

Production Manager: Jagan

Production Controllers: Sunny, Venkat Reddy

PRO: Vamsi-Shekar

Mangli Song Launched from 1997

 1997చిత్రంలోని మంగ్లీ సాంగ్ విడుదల !

 


డా.మోహన్, నవీన్ చంద్ర, శ్రీకాంత్ అయ్యంగార్, మ్యూజిక్ డైరెక్టర్ కోటి ప్రధాన పాత్రల్లో, డా.మోహన్ స్వీయదర్శకత్వంలో ఈశ్వర పార్వతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న బిన్నమైన కథా చిత్రం 1997. ఈ చిత్రానికి సంబందించిన ఫస్ట్ లుక్ ఇటీవలే విడుదలై మంచి క్రేజ్ తెచ్చుకుంది. తాజాగా శనివారం హైదరాబాద్ లో ఈ సినిమాలో సింగర్ మంగ్లీ పాడిన .. ''ఏమి బతుకు ...'' అనే సాంగ్ ని  ప్రముఖ సంగీత దర్శకుడు కోటి విడుదల చేసారు. ఈ కార్యక్రమంలో హీరో మోహన్, రామరాజు, దర్శకుడు దేవి ప్రసాద్, నందమూరి హరి  లతో పాటు తదితర చిత్ర  యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.  


ఈ సందర్బంగా దర్శకుడు దేవి ప్రసాద్ మాట్లాడుతూ .. ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించి, దర్శకుడిగా  చేసిన మోహన్ తో నాకు ఫ్రెండ్షిప్ ఉంది. నేను చేసిన బ్లేడ్ బాబ్జి సినిమాలో మోహన్ నటించాడు. అప్పటినుండి తనతో ఈ అనుబంధం కొనసాగుతుంది. మోహన్ స్కూల్, హాస్పిటల్ రంగాల్లో సూపర్ సక్సెస్ సాధించాడు.  ఆయనకు సినిమా అంటే ప్యాషన్. అందుకే సినిమా రంగంలో నటుడిగా ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పుడు హీరోగా, దర్శకుడిగా ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా గురించి నాకు తెలుసు, చాలా పవర్ ఫుల్ కథతో ఆకట్టుకునేందుకు వస్తున్నాడు. ఈ కథ చెప్పినప్పుడు నేను షాక్ అయ్యా. ఇంత గొప్ప ఆలోచన ఎలా వచ్చింది అని షాక్ అయ్యాను.  కథ విషయంలో అన్ని ఎమోషన్స్ ఉండేలా ప్లాన్ చేసాడు. ఒక నటుడిగా, దర్శకుడిగా రెండు పాత్రలు బాగా చేసాడు. లేటెస్ట్ గా ఈ సినిమాలో మంగ్లీ పాడిన పాట విన్నాను. చాలా ఎమోషన్ అయ్యాను. నిజంగా చాలా ఆలోచింపచేసేలా ఉండే సాంగ్ ఇది. ముక్యంగా మనసులు కదిలించే సాంగ్ ఇది. సామజిక సమస్యల నేపథ్యంలో తెరకెక్కిన సినిమా ఇది. ప్రజల్లో చైతన్యం తేవాలంటే కేవలం అది సినిమాలవల్లే సాధ్యం అని లెనిన్ మహనీయుడు చెప్పాడు. అందుకే ఇలాంటి సమస్యలను ప్రజలదగ్గరికి చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు మోహన్. ఈ సినిమాతో మోహన్ తప్పకుండా దర్శకుడిగా మంచి సక్సెస్ అందుకుంటాడు అన్నారు.

 

సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ.. ‘‘మోహన్ గారితో చాలా మంచి అనుబంధం ఉంది. అతను నాకు కొడుకు లాంటివాడు. అప్పటి నుంచి తనతో అదే అనుబంధం కొనసాగుతోంది. మోహన్ ఈ కథ చెప్పగానే చాలా బాగా నచ్చింది. ఈ కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. చాలా మంచి పాయింట్ తీసుకుని మోహన్ చేస్తున్న ప్రయత్నం సక్సెస్ అవ్వాలి, అలాగే ఇందులో ఓ సాంగ్ యాడ్ చేద్దామని మోహన్ అన్నాడు .. సరే అని చెప్పడంతో తానే ఈ సాంగ్ అద్భుతంగా రాసాడు. ఈ పాటకు మంగ్లీ అయితేనే న్యాయం చేస్తుందని అనిపించి ఆమెతో పాడించాం. మంగ్లీ గొంతులో నుండి వచ్చిన ఈ సాంగ్ మరో రేంజ్ కి వెళ్ళింది. తప్పకుండా నేషనల్ అవార్డు వస్తుంది అన్నారు.


హీరో మోహన్ మాట్లాడుతూ.. ‘‘ ఈ సినిమా విషయంలో చాలా మందికి థాంక్స్ చెప్పుకోవాలి. ముందుగా రాజా రవీంద్ర గారికి, ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసినందుకు, అలాగే శ్రీకాంత్ అయ్యంగార్ గారికి, హీరో విశ్వక్ సేన్ గారికి, అలాగే దర్శకుడు వర్మ గారికి, అలాగే ప్రముఖ నటులు  ప్రకాష్ రాజ్ గారికి .. వారితో పాటు  కోటిగారికి థాంక్స్ చెప్పాలి. నా ప్రతి విషయంలో ఆయన సపోర్ట్ అందించారు. ఆయన లేనిదే నేను ఏ పని చేయలేదు. ఈ సినిమా అనుకున్నప్పుడు ముందు కోటిగారికే కథ చెప్పాను. ఆయన బాగుంది ప్రొసీడ్ అన్నారు. అలాగే మీరు ఇందులో ఓ పాత్ర చేయాలని చెప్పడంతో ఒప్పుకున్నారు. అలాగే నవీన్ చంద్ర, బెనర్జీ, రవి ప్రకాష్ ఇలా అందరూ సపోర్ట్ చేశారు.  ఈ సినిమా విషయంలో షూటింగ్ మొత్తం పూర్తయ్యాక కరోనా లాక్ డౌన్ సమయంలో ఇందులో ఓ సాంగ్ పెడితే బాగుంటుందని ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన రాగానే ముందు కోటి గారికి చెప్పాను.  సరే అనడంతో ఈ సాంగ్ ని నేనే రాసాను ఈ పాట విన్న కోటి గారు ఈ పాటను మంగ్లీ తో పాడించాలనిచెప్పడంతో ఆమెతో పాడించాం .. పాట చాలా బాగా వచ్చింది. ప్రతి  కదిలించే సాంగ్ ఇది. తప్పకుండా వ్యూస్ తో సంచలనం క్రియేట్ చేస్తుంది. అయితే ఈ సాంగ్ ని పెట్టించేందుకు మళ్ళీ షూటింగ్ చేయకుండా షూట్ చేసిన సన్నివేశాలే వాడాము. పాటకు ఆ సీన్స్ బాగా సింక్ అయ్యాయి. ఈ పాటను మంగ్లీ పాడడంతో ఈ సాంగ్ రేంజ్ పెరిగింది. ఈ సినిమా విషయంలో సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి నా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు.  


T-Series Dil Raju Productions' 'HIT - The First Case' begins with a Mahurat Pooja

 T-Series & Dil Raju Productions' 'HIT - The First Case' begins with a Mahurat Pooja!



The much anticipated Hindi remake of HIT which stars Rajkummar Rao and Sanya Malhotra has begun the film's journey with a mahurat pooja ceremony.


Present at this auspicious occasion were actor Rajkummar Rao, producers Dil Raju, Bhushan Kumar, Kuldeep Rathore, and director Dr. Sailesh Kolanu.


'HIT - The First Case' tells the story of a cop who is on the trail of a missing woman.


Produced by Bhushan Kumar, Dil Raju, Krishan Kumar, and Kuldeep Rathore, the film is directed by Dr. Sailesh Kolanu.

Director Sampath Nandi Interview About Seetimaarr

 హీరో గోపీచంద్‌, ఆయ‌న అభిమానులు సంతోషపడేలా ‘సీటీమార్’  సినిమా తీసినందుకు ద‌ర్శ‌కుడిగా ప్రౌడ్‌గా, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను:  డైరెక్ట‌ర్ సంప‌త్ నంది



ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రం వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌లై విజ‌య‌వంత‌మైంది. ఈ సంద‌ర్భంగా ద‌ర్శ‌కుడు సంప‌త్ నంది ఇంట‌ర్వ్యూ విశేషాలు...

* యూనానిమస్ రెస్పాన్స్ వ‌స్తోంది. తెలుగు రాష్ట్రాలే కాదు.. చెన్నై, నార్త్ ఇండియాలోనూ షోలు ప‌డ్డాయి. అన్నిచోట్ల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వ‌చ్చింది. 
* బాలీవుడ్‌లోని సినిమాల‌తో క‌లిపి పోల్చి చూసి ఎక్కువ క‌లెక్ష‌న్స్ సాధించిన సినిమా అని అంద‌రూ అప్రిషియేట్ చేస్తున్నారు. అవి నిర్మాత‌లు తెలియ‌జేస్తారు.
* ముందు నుంచి మాస్ సినిమాలు చేస్తూ వ‌స్తున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ క‌థ అనుకున్న త‌ర్వాత దాన్ని క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్‌లో చేద్దామ‌ని అనుకున్నాను. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో ఓ యాక్ష‌న్ సినిమా చేశాన‌ని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లోనూ చెప్పాను. యాక్ష‌న్ మూవీ చేయ‌డానిక‌నే ఆ బ్యాక్‌డ్రాప్ ఎంచుకున్నాను. దానికి ఉమెన్ ఎంప‌వ‌ర్‌మెంట్‌, వాళ్లు ఓ ఉద్దేశం కోసం పోరాడ‌టం.. వంటి ఎమోష‌న్స్‌కు అంద‌రూ క‌నెక్ట్ అయ్యారు. ప్రీతి అస్రాని చేసిన విన్నింగ్ షాట్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. క్లైమాక్స్ గురించి, అందులోని యాక్ష‌న్ గురించి అంద‌రూ మాట్లాడుకుంటున్నారు. 
*గౌత‌మ్ నంద త‌ర్వాత విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లోనో, రివేంజ్ ఫార్మేట్‌లోనో సినిమా చేయాల‌నుకున్నాను. అలాంటి స‌మ‌యంలో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్  కాన్సెప్ట్ ఐడియాకు వ‌చ్చింది.  క‌బ‌డ్డీ ఇండియాలో పెద్ద మాస్ గేమ్‌. అలాంటి మాస్ గేమ్‌కు మాస్ ఎలిమెంట్స్ జోడిస్తే బావుంటుంద‌నిపించింది. అందుకే ఈ బ్యాక్‌డ్రాప్ ఎంచుకుకున్నాను. 
* బెంగాల్ టైగ‌ర్ త‌ర్వాత అంత మంచి డైలాగ్స్ ఈ సినిమాకు కుదిరాయని అంటున్నారు. 
* నాకు కూడా గ‌త ప‌దేళ్ల‌లో ఇంత పెద్ద హిట్ రాలేదు. ఈ సినిమా ఆయ‌న ఫ్యాన్స్ దాహం తీర్చింది. ఏ డైరెక్ట‌ర్‌కు అయినా ఓ హీరో , ఫ్యాన్స్‌ ఫీల‌య్యే సినిమా చేస్తే దాన్ని క‌న్నా గర్వంగా ఫీల‌య్యే క్ష‌ణ‌మే ఉండ‌దు. నేను ఇప్పుడు అలాంటి హ్యాపీ మోడ్‌లో ఉన్నాను
* ఒక క‌ష్టం వ‌చ్చిన‌ప్పుడు మ‌నం అంద‌రం క‌లిసిపోతుంటాం. ఇక్క‌డ గొడ‌వ‌లు ప‌డే మ‌నం అమెరికా వెళ్ల‌గానే ఇండియ‌న్స్ అనే భావ‌న వ‌స్తుంది. అలాగే ఉత్త‌రాదికి వెళ్లిన‌ప్పుడు తెలుగువాళ్ల‌మ‌నే ఫీలింగ్‌తో క‌లిసిపోతాం. 
* నేను డైలాగ్స్ రాసుకునే స‌మ‌యంలోనే ఎవ‌రినీ నొప్పించ‌కుండా అంద‌రినీ క‌లుపుకుపోవాల‌నేదే నా ఉద్దేశం. అందుకే ముందు ఒక‌లా చూపించినా, క్లైమాక్స్‌లో అంద‌రూ క‌లుసుకుని క‌ప్ కొట్టుకొచ్చేలా చూపించాను. 
* ఈ సినిమా క్లైమాక్స్ ఎడిట్‌ చేయ‌డానికి ఇర‌వై రోజులు తీసుకున్నాను. క్లైమాక్స్‌ను రెండు భాగాలుగా తీశాను. దాన్ని మిక్స్ చేసి ప్రేక్ష‌కులు మెప్పించేలా ఎడిట్ చేయ‌డానికి చాలా క‌ష్ట‌ప‌డ్డాం. ఇప్పుడొస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే హ్యాపీగా అనిపిస్తుంది. 
* ఇండియా, పాకిస్థాన్ వ‌ర‌ల్డ్ క‌ప్ ఫైన‌ల్‌కు చేరుకున్న‌ప్పుడు, చివ‌రి వ‌ర‌కు మ‌నం గెలుస్తామా లేదా? అనిపించిన‌ప్పుడు ఎలాంటి ఫీలింగ్ ఉంటుందో అలాగే ఫీల్ అయ్యాను. సినిమా రిలీజ్‌కు మూడు రోజులు ఉన్న‌ప్పుడు అర‌గంట కంటే ఎక్కువసేపు నిద్ర‌పోలేదు. 
* ఈ సినిమాకు చాలా ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. అయితే నిర్మాత‌లు మాకు స‌పోర్ట్‌గా నిలిచారు. క‌మ‌ర్షియ‌ల్ సినిమా అంద‌రికీ క‌నెక్ట్ అవుతుంద‌నే న‌మ్మ‌క‌మైతే ఉండింది. కానీ తెలియ‌ని భ‌య‌మొక‌టి లోలోప‌ల ర‌న్ అవుతుండింది. వినాయ‌కుడు మా భ‌యాల‌ను ప‌టాపంచ‌లు చేసేశాడు. 
* ఇది హండ్రెడ్ ప‌ర్సెంట్ తెలుగు ప్రేక్ష‌కుల విజ‌యంగా భావిస్తున్నాను. థియేట‌ర్‌కు ప్రేక్ష‌కులు రావాల‌ని అనుకోవ‌డంతో ఈ స‌క్సెస్ ద‌క్కింది. 
* త‌మ‌న్నాగారితో హ్యాట్రిక్ విజ‌యం సాధించడం హ్యాపీ. అలా కుదిరిపోయింది. 
* ఓటీటీ అనేది మంచి ఫ్లాట్‌ఫామ్ అన‌డంలో సందేహం లేదు. సినిమా చేసేట‌ప్పుడు అది థియేట‌ర్ మూవీనా, ఓటీటీ మూవీనా అని ప్లాన్ చేసుకుని చేస్తే బావుంటుంది. 
* నెక్ట్స్ సినిమాకు సంబంధించిన చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆ వివ‌రాల‌ను ప్ర‌క‌టిస్తాను.

Priyuraalu in Sony Liv on September 17th

 సెప్టెంబర్ 17న సోని లివ్ లో "ప్రియురాలు" సినిమా స్ట్రీమింగ్




పృథ్వీ మేడవరం, కౌషిక్ రెడ్డి, కల్పాల మౌనిక, కామాక్షి భాస్కర్ల హీరో హీరోయిన్లుగా నటించిన సినిమా "ప్రియురాలు". రామరాజు సినిమా పతాకంపై రామరాజు, అజయ్ కర్లపూడి ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ బాధ్యతలు వహిస్తూనే "ప్రియురాలు" చిత్రానికి దర్శకత్వం వహించారు రామారాజు.


"ప్రియురాలు" చిత్ర ట్రైలర్ శనివారం విడుదలైంది. లవ్ ఈజ్ రొమాన్స్, లవ్ ఈజ్ హానెస్ట్, లవ్ ఈజ్ డైలెమా అంటూ ప్రేమ వివిధ స్వభావాలను ట్రైలర్ లో పేర్కొంటూ బ్యూటిఫుల్ రొమాంటిక్, లవ్ మేకింగ్ విజువల్స్ చూపించారు. ఎక్స్టా మారిటర్ అఫైర్స్, ఎక్స్ట్రా మారిటల్ లవ్ అని చెబుతూ ట్రైలర్ ముగించారు. రెండు జంటల మధ్య సాగే సరికొత్త ప్రేమ బంధాన్ని ప్రియురాలు మూవీలో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. తెలుగులోకి వచ్చిన కొత్త ఓటీటీ సోని లివ్ లో ప్రియురాలు సినిమా ఈ నెల 17న స్ట్రీమింగ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది.


శ్రావ్య దువ్వూరి, వర్ష, కృష్ణంరాజు, జోగి నాయుడు తదితరులు ఇతర పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సాహిత్యం - రామజోగయ్య శాస్త్రి, శ్రీవల్లి, పూర్ణాచారి, సిరాశీ, సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - మహి పి రెడ్డి, ఎడిటర్ - సాయి రేవంత్, కథ - శ్రీ సౌమ్య, సహ నిర్మాతలు - గంగరాజు, కృష్ణ భట్, విశ్వనాథ్ రాజు, నిర్మాతలు - రామరాజు, అజయ్ కర్లపూడి, దర్శకత్వం - రామరాజు

Akhil Akkineni Most Eligible Bachelor Leharaayi Lyrical video on September 15th

 సెప్టెంబర్ 15న అఖిల్ అక్కినేని ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ లెహరాయి లిరికల్ సాంగ్..



అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. తాజాగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ చిత్రం నుంచి లెహరాయి లిరికల్ సాంగ్ అప్డేట్ వచ్చింది. సెప్టెంబర్ 15న ఈ రొమాంటిక్ సాంగ్ విడుదల కానుంది. ఈ మేరకు అఖిల్, పూజ హెగ్డే రొమాంటిక్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ఆడియో ఆదిత్య మ్యూజిక్ ద్వారా మార్కెట్లోకి విడుదల కానుంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: సత్య గమడి

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్

Tammareddy Bharadwaja Pressmeet About CCT

 చిరంజీవి గారి సంకల్పం వల్లే కార్మికులకు వాక్సిన్ అందింది : తమ్మారెడ్డి భరద్వాజ   

( సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ సెకండ్ డ్రైవ్ )



కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం సి సి సి కమిటీ బ్లడ్ బ్యాంకు లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు. 


ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ప్రపంచం అంతా సంవత్సరం న్నర నుండి అతలాకుతలం అయిపోతుంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అలాంటి సమయంలో చిరంజీవి గారు స్పందించి కరోనా సమయంలో సినిమా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది.  అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసారు. ఆ తరువాత సినిమా కార్మికులకు వ్యాక్సినేషన్ కూడా వేయిస్తున్నారు. ఇప్పటివరకు 4000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ఈ రోజు వరకు ఈ సెకండ్ డోస్ కార్యక్రమం అందరు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్ళందరూ వాక్సిన్  తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజు షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరు ఖాళి లేని పరిస్థితి.  ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీసీసీ కమిటీ చేపట్టిన ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవ్వడమే కాదు అందరు స్వతహాగా వాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీం, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. 


దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ ..  కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో , ఛాంబర్ ఆధ్వర్యంలో, 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన సీసీసీ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 5000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోస్ సక్సెస్ ఫుల్ గా నడిచింది.. ఇప్పుడు రెండో డోస్ కూడా ఇస్తున్నారు.. కాబట్టి  సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. ఈ వాక్సిన్ కార్యక్రమం వినాయక చవితి రోజు హాలిడే ఉంటుంది.. ఆ తరువాత శని, ఆదివారాల్లో వాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఆదివారం తో ఈ డ్రైవ్ ముగుస్తుంది కాబట్టి.. సీసీసీ ఆధ్వర్యంలో మొదటి డోస్ వేసుకున్న వారంతా సెకండ్ డోస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను.  అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.


చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ .. వల్లభనేని అనిల్ మాట్లాడుతూ .. కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే.  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసి, వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో మీరు వాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ లాక్ డౌన్ పడడంతో .. సినిమా కార్మికులకు ఎలాగైనా వాక్సిన్ వేయిచాలని నిర్ణయించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నాను. 


దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ .. సీసీసీ అనేది చిరంజీవి గారి మనసులోంచి వచ్చిన ఆలోచన. దానికి మమ్మల్ని అందరిని కలిపి టీం గా ఫార్మ్ చేసి అందరికి సహాయం చేయడానికి అవకాశం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి బ్లడ్ అందించాం . ఎవరికి ఎప్పుడు అవసరమైన సరే బ్లడ్ బ్యాంకు నుండి సహాయం అందుతుంది. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు.. గత ఏడాది వినాయక చవితి ముందు సరుకులతో పాటు బెల్లం, సేమియా కూడా అందించమని చెప్పారు.. అంటే అందరు కూడా పండగ చేసుకోవాలని ఆలోచన ఆయనది. నిజంగా అయన ముందు చూపు అంత గొప్పది. కరోనా వాక్సిన్ కోసం అయన ప్రభుత్వం, ప్రయివేట్ వారితో ఎంతగా మాట్లాడారో నాకు తెలుసు.. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ మద్యే ఆక్సిజన్ కూడా అందించారు.. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అన్నారు.

Producer VV Vamana Rao Interview About Honey Trap

 


హనీ ట్రాప్ సినిమా నేటి యువతను చైతన్యవంతులను చేస్తుంది - నిర్మాత వి వి వామన రావు 

హనీ ట్రాప్ అనే రుగ్మత వాళ్ళ సర్వం కోలుపోతున్నారు. చాలా మంది పొలిటిషన్స్, డాక్టర్స్, వ్యాపారవేత్తలు ఇంకా మరి ఎందరో వి ఐ పి వ్యక్తులు ఈ హనీ ట్రాప్ లో పడి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు మనం ప్రతిరోజూ పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇలాంటి హనీ ట్రాప్ లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలి అని ఈ సినిమా ని నిర్మించాము అని చిత్ర నిర్మాత వి వి  వామన రావు గారు తెలియజేశారు.


రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది.


ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ "1979 నుంచి రచయిత గా చాలా నాటకాలు రాసాను. నా కథ కి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సీరియల్స్ రాసాను, నిర్మించాను. కథలు చాలా రాసాను, 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్ ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడు పుట్టిన కథ ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. ఇది మంచి సమయం అని ఈ కథ ని సినిమా గా చిత్రరించాము.


సునీల్ కుమార్ రెడ్డి గారు గతం లో రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్  సక్సెస్ సాధించారు. అయితే నా కథ కి సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా సరిపోతారు అని తనతో ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే. 


నేను చాలా నాటకాల్లో సీరియల్స్ లో నటించాను. ఈ చిత్రం లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక పొలిటికల్ మినిస్టర్ కి పి ఎ గా నటించాను. మంచి క్యారెక్టర్ వచ్చింది.


మా చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది . సమకాలీన అంశాలతో మా చిత్రాన్ని నిర్మించాము. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది.


మా సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సన్నివేశాలను కట్ చేస్తారు అని అనుకున్న కానీ సెన్సార్ వాళ్ళు ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సీన్ లు కట్ చేస్తే సినిమా పట్టు పోతుంది. అందుకే ఎటువంటి కట్స్ లేకుండా  ఎ సర్టిఫికెట్ ఇస్తున్నాము అని చెప్పారు.


ఈ కరోనా లాక్ డౌన్ లో నిర్మాతకి ఇబ్బంది గానే ఉంది. తెలంగాణ లో అని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. మా చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నారు.

GST Movie Review


Check out the Review of  The movie "GST" (God Satan Technology) is being produced by Komari Janaiah Naidu under the banner of " Tholu Bommala chitralu"  Starring Anand Krishna, Ashok, Venkat and Nandu as the heroes, Swatimandal, Anchor Indu, Pooja Suhasini and Vani as the heroines.

Story 

GST is the story based on Science and Ghosts 

Now coming to story After completion of Education  A group of students plans a long tour 

The person who is working as navy officer  falls in love with a girl he wants to settle his life with lot of money  in this process he will find one item which is being produced by shark sprem which is used in perfumes what happened after that ?

How ghost enters in this story? Forms the rest of the story 



 Performances: 

Performances are good each and everyone has given their best even though all are new actors they did decent job in the first half their performance is main highlight 

 the chemistry between the two Lovers are good 

actress who asked as Ghost did her best , the ghost character is another plus point for this film


Technical Aspects 

Coming to Technical Aspects we must appreciate director  Janaki Ram he has done good research his research on gods  temples and on all religions is good Even on science elements his work is good .Productions values are rich Yadagiri's cinematography is very good The music provided by music director UV Niranjan is a plus point for the film. 


On whole Gst is a decent Attempt 

Rating: 3.25 / 5

Tanish Maro Prasthanam Releasing Shortly

 



రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే.. అదే తనీష్ "మరో ప్రస్థానం" సినిమా స్పెషాలిటీ



ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇది తనీష్ హీరోగా నటించిన "మరో ప్రస్థానం" సినిమాకి ఓ వరం అని చెప్పచ్చు. తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు "మరో ప్రస్థానం" చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


"మరో ప్రస్థానం" సినిమా విషయానికి వస్తే...రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో "మరో ప్రస్థానం" చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు జాని. ఇలా రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని చెప్పచ్చు. కథ, కథనం సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను డైరెక్టర్ జాని తెరకెక్కించారట.. సినిమా సక్సస్ పై టీమ్ మెంబర్స్ అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. దీనికి కారణం... ఇటీవల కాలంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ లభించడమే అని చెప్పచ్చు.  


వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ, దర్శకత్వం - జాని.

"Badmashgallaku Bumper offer" first look launched by Dir Surendar Reddy

 "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్" ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి




ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా

నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్". యాక్షన్ థ్రిల్లర్

కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్

ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాత అతీంద్ర అవినాష్ నిర్మిస్తున్నారు.

"బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా

వ్యవహరిస్తున్నారు. హీరో ఇంద్రసేన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్

లుక్ టైటిల్ లోగో ను దర్శకుడు సురేందర్ రెడ్డి లాంఛ్ చేశారు. మూవీ యూనిట్

కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా


హీరో సంతోష్ రాజ్ మాట్లాడుతూ..."బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" సినిమా ఈ

పాండమిక్ లో మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. సురేందర్ రెడ్డి గారి

చేతుల మీదుగా పాస్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ అవడం గుడ్ బిగినింగ్

అనుకుంటున్నాము. అన్నారు.


దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ..."బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" సినిమా

టైటిల్ లోగో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి థాంక్స్. ఇదొక యాక్షన్

థ్రిల్లర్ మూవీ. ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమా

షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

యాక్షన్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. అన్నారు.


చిత్ర సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ....ఇవాళ టైటిల్ లోగోను

డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు

రవి చావలి గారు చాలా ఫాస్ట్ గా 30 రోజుల్లోనే ఈ మూవీని షూట్ చేశారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. మంచి

టెక్నికల్ టీమ్ "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్"సినిమాకు పనిచేస్తున్నారు.

అన్నారు.


హీరో ఇంద్రసేన మాట్లాడుతూ... రవి చావలి లాంటి గొప్ప దర్శకుడితో పనిచేసే

అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో

గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి గారి బ్యానర్

లో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.


నవీన రెడ్డి, సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో

నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ -

విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ అలవలపాటి, నిర్మాత - అతీంద్ర అవినాష్,

సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి.


Love story Releasing on September 24th

 సెప్టెంబర్ 24న థియేటర్ లలో విడుదలకు కాబోతున్న "లవ్ స్టోరి"



నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల

రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో

ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత

థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం

విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా

రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ రిలీజ్

కు అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది. ఈ సందర్భంగా


దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... తప్పనిసరి పరిస్థితుల వల్ల

ఇన్నాళ్లూ మా "లవ్ స్టోరి" చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాను

మీకు ఎప్పుడు చూపించాలి అనే ఆత్రుతగా సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ గుడ్

టైమ్ రానే వచ్చింది. ఈ నెల 24న "లవ్ స్టోరి" చిత్రాన్ని థియేటర్లలో

ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా

సంతోషిస్తున్నాము. థియేటర్లలో కలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు.

అన్నారు.


"లవ్ స్టోరి" సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో

'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం

చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల

కొద్దీ వ్యూస్ సంపాదించాయి. "లవ్ స్టోరి" మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా

మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే

ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్

సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్

రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు,

దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్

కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,

పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర

రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

18Pages Anupama Parameshwaran Look Poster Launched

 ‘18 పేజెస్’ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన.. 



వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పోషిస్తున్న నందిని పాత్ర పరిచయం చేశారు దర్శక నిర్మాతలు.

ఒక అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందులో నుంచి ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి.. అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా ఆమె నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కొత్తగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. డిసెంబర్ లో థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్

కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్

నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫర్: ఏ వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: గోపీ సుందర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, మ‌ఢూరి మ‌ధు

MEB singer Chinmayi Birthday Special Poster

 ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో సింగర్ చిన్మయి బర్త్ డే పోస్టర్ విడుదల..




అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తాజాగా ఈ సినిమాలో సింగర్ చిన్మయి ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై కనిపిస్తున్నారు. ఈమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన కథ నచ్చడంతో చిన్మయి తెర ముందుకు వస్తున్నారు. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్



“IDHE MAA KATH” LOCKS IT’S THEATRICAL RELEASE ON SEPT 24th

 “IDHE MAA KATH” LOCKS IT’S THEATRICAL RELEASE ON SEPT 24th




It’s well known fact that  Sumanth Ashwin, Srikanth, Bhumika Chawla and Tanya Hope are teaming up for a film which is completely based on bikers life and their love for riding titled ''Idhe Maa Katha''which is first of its kind in India, directed by Guru Pawan an former associate of RGV, Puri Jagannadh, Harish Shankar, Nagesh Kukunoor etc., and produced under Gurappa Parameswara Productions, the film is billed to be a coming-of-age road trip movie, The teaser of the film that got released had created a buzz for its super rich visuals not only among enthusiastic bike riders but also among common audience as well..



The team has already released 2 lyrical songs “Priya Priya” and “Kala La Kadha” from the film which has created huge buzz & grabbed everyone's hearts and eye balls with its soul touching music and visual beauty, shot in the picturesque locations of Leh Ladakh and Manali. Seeing the visuals in these songs one can easily say that it’s a big budget quality movie for sure.



On the eve of “Vinayaka Chavithi” the makers have today released their 3rd single Lyrical song ‘Just Go For It” and also have revealed the theatrical release date of the film to be on September 24th.



The technical crew of Idhe Maa Katha comprises cinematographer Ram Prasad and editor Junaid Siddiqui. This project is being back-rolled by G. Mahesh, under 'Gurappa Parameswara Productions' and L. Chiranjeevi is the executive producer for this film. Well known and reputed distribution houses are handling "Idhe Maa Katha" distribution in Ap & TG.



Here is the link for the lyrical song. 


https://www.youtube.com/watch?v=3vxdLoBS_jk