Latest Post

Tammareddy Bharadwaja Pressmeet About CCT

 చిరంజీవి గారి సంకల్పం వల్లే కార్మికులకు వాక్సిన్ అందింది : తమ్మారెడ్డి భరద్వాజ   

( సీసీసీ ఆధ్వర్యంలో వాక్సిన్ సెకండ్ డ్రైవ్ )



కరోనా క్రైసిస్ ఛారిటిని మొదలెట్టి గత ఏడాది కరోనా సమయంలో సినిమా కార్మికులకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన విషయం తెలిసిందే. ఈ సారి కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో ఇప్పుడు సినిమా కార్మికులకు వాక్సిన్ వేయించే కార్యక్రమం ఇటీవలే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో 24 క్రాఫ్ట్స్ కు సంబందించిన సినీ కార్మికులకు వాక్సిన్ ఇస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం సక్సెస్ కావడంతో పాటు రెండో డోస్ వ్యాక్సినేషన్ కూడా జరుగుతుంది. ఇప్పటికే సినిమా రంగంలో ఉన్న కార్మికులు, నటీనటులు ఎందరో ఈ వ్యాక్సినేషన్ డ్రైవ్ లో పాల్గొని వాక్సిన్ వేసుకున్నారు. తాజాగా రెండో విడత వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా విజయవంతగా జరుగుతున్న నేపథ్యంలో గురువారం సి సి సి కమిటీ బ్లడ్ బ్యాంకు లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సందర్శించారు. 


ఈ సందర్బంగా ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. ప్రపంచం అంతా సంవత్సరం న్నర నుండి అతలాకుతలం అయిపోతుంది. సినిమా పరిశ్రమ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటుంది.  అలాంటి సమయంలో చిరంజీవి గారు స్పందించి కరోనా సమయంలో సినిమా కార్మికులను ఆదుకునేందుకు సిద్ధమయ్యారు. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది.  అలాగే కరోనా నుండి ప్రజలను కాపాడడానికి ఆక్సిజన్ ప్లాంట్స్ కూడా ఏర్పాటు చేసారు. ఆ తరువాత సినిమా కార్మికులకు వ్యాక్సినేషన్ కూడా వేయిస్తున్నారు. ఇప్పటివరకు 4000 మందికి పైగా వాక్సిన్ వేసుకున్నారు. ఈ రోజు వరకు ఈ సెకండ్ డోస్ కార్యక్రమం అందరు తీసుకుంటున్నారు. ప్రస్తుతం సినిమా వాళ్ళందరూ వాక్సిన్  తీసుకుంటున్నారు. ప్రస్తుతం రోజు షూటింగ్స్ బిజీగా జరుగుతున్నాయి. ఇప్పటికే ఎక్కడ, ఎవరు ఖాళి లేని పరిస్థితి.  ఇలాంటి సమయంలో తప్పకుండా అందరు వాక్సిన్ వేసుకుంటే ఇంకా మంచిది. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సీసీసీ కమిటీ చేపట్టిన ఈ వాక్సిన్ డ్రైవ్ సక్సెస్ అవ్వడమే కాదు అందరు స్వతహాగా వాక్సిన్ వేయించుకునేందుకు ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ సందర్బంగా చారిటబుల్ ట్రస్ట్ వారికీ, సీసీసీ టీం, అపోలో వారందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు. 


దర్శకుడు ఎన్ శంకర్ మాట్లాడుతూ ..  కరోనా క్రైసిస్ చారిటి ఆధ్వర్యంలో సినిమా వర్కర్స్ 24 క్రాఫ్ట్స్ వారికీ ఉచిత వాక్సినేషన్ డ్రైవ్ కార్యక్రమం చిరంజీవి గారి చేతుల మీదుగా  ప్రారంభమైన సంగతి తెలిసిందే. చిరంజీవి ఆధ్వర్యంలో , ఛాంబర్ ఆధ్వర్యంలో, 24 క్రాఫ్ట్స్ ఆధ్వర్యంలో మొదలైన సీసీసీ కమిటీ ఆధ్వర్యంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా సాగుతుంది. ఇప్పటివరకు 5000 మందికి పైగా వాక్సిన్ తీసుకున్నారు. మొదటి డోస్ సక్సెస్ ఫుల్ గా నడిచింది.. ఇప్పుడు రెండో డోస్ కూడా ఇస్తున్నారు.. కాబట్టి  సినిమా కార్మికులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సినిమా రంగానికి సంబందం ఉన్న అందరూ దయచేసి వాక్సిన్ తీసుకోవడనికి ముందుకు రావాలి. ఈ వాక్సిన్ కార్యక్రమం వినాయక చవితి రోజు హాలిడే ఉంటుంది.. ఆ తరువాత శని, ఆదివారాల్లో వాక్సిన్ డ్రైవ్ కొనసాగుతుంది. ఆదివారం తో ఈ డ్రైవ్ ముగుస్తుంది కాబట్టి.. సీసీసీ ఆధ్వర్యంలో మొదటి డోస్ వేసుకున్న వారంతా సెకండ్ డోస్ వేసుకోవాలని కోరుకుంటున్నాను.  అలాగే ఈ కార్యక్రమం నిర్వహణకు సహకరించిన ప్రతి ఒక్కరికీ నా ధన్యవాదాలు అన్నారు.


చిత్రపురి కాలనీ ప్రెసిడెంట్ .. వల్లభనేని అనిల్ మాట్లాడుతూ .. కరోనా ఎఫెక్ట్ తో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేసి ఎంతోమంది ప్రాణాలను కాపాడిన విషయం తెలిసిందే. ఇటీవలే టాలీవుడ్ లో ఏర్పాటు చేసిన సి సి సి (కరోనా క్రైసిస్ ఛారిటీ) ద్వారా సినీ కార్మికులకు వాక్సిన్ వేయించిన సంగతి తెలిసిందే.  చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి దాని ద్వారా ఎంతోమంది ప్రజలకు, అభిమానులకు, సినిమా కార్మికులకు సేవ చేస్తున్న విషయం మరచిపోలేనిది. కరోనా మహమ్మారి ప్రారంభ దశలోనే 2020 ఏప్రిల్లో సినిమా షూటింగ్స్ నిలిచిపోయి, లాక్ డౌన్ లో ఏ కార్మికులు బయటకు వెళ్లలేని పరిస్థితుల్లో సి సి సి నీ మనకోసం ఏర్పాటు చేసి, దానికి కమిటీని నియమించి, సినిమా రంగంలోని పెద్దలందరిని భాగస్వాములను చేసి, వేలాదిమంది సినీ కార్మికుల ఆకలి తీర్చే సంకల్పంతో మూడు దఫాలుగా నిత్యావసర వస్తువులు ఇంటింటికీ పంచి ఆదుకున్న విషయం తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది. కరోనా రెండవదశలో ప్రతి సినీ కార్మికుడికి ఆరోగ్య భద్రత కల్పించాలని సత్సంకల్పంతో మీరు వాక్సినేషన్ వేయిస్తున్నారు. ఇప్పుడిప్పుడే పరిశ్రమ కోలుకుంటుంది అనుకున్న సమయంలో మళ్ళీ లాక్ డౌన్ పడడంతో .. సినిమా కార్మికులకు ఎలాగైనా వాక్సిన్ వేయిచాలని నిర్ణయించి, వాక్సిన్ దొరకని పరిస్థితుల్లో కూడా అపోలో 24/7 సౌజన్యంతో మీరు ముందుకు వచ్చి అందరి సినీ కార్మికులకు వాక్సినేశన్ వేయించి, వారి ఆరోగ్యానికి భద్రత కల్పించిన మీకు ప్రత్యేక దన్యవాదాలు తెలుపుతున్నాను. 


దర్శకుడు మెహర్ రమేష్ మాట్లాడుతూ .. సీసీసీ అనేది చిరంజీవి గారి మనసులోంచి వచ్చిన ఆలోచన. దానికి మమ్మల్ని అందరిని కలిపి టీం గా ఫార్మ్ చేసి అందరికి సహాయం చేయడానికి అవకాశం అందించారు. చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతమందికి బ్లడ్ అందించాం . ఎవరికి ఎప్పుడు అవసరమైన సరే బ్లడ్ బ్యాంకు నుండి సహాయం అందుతుంది. లాస్ట్ ఇయర్ కరోనా సమయంలో సీసీసీ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువులు అందించారు.. గత ఏడాది వినాయక చవితి ముందు సరుకులతో పాటు బెల్లం, సేమియా కూడా అందించమని చెప్పారు.. అంటే అందరు కూడా పండగ చేసుకోవాలని ఆలోచన ఆయనది. నిజంగా అయన ముందు చూపు అంత గొప్పది. కరోనా వాక్సిన్ కోసం అయన ప్రభుత్వం, ప్రయివేట్ వారితో ఎంతగా మాట్లాడారో నాకు తెలుసు.. చిరంజీవి గారి సంకల్పం వల్లే ఈ రోజు కార్మికులకు వాక్సిన్ అందింది. చారిటబుల్ ట్రస్ట్ నుండి ఈ మద్యే ఆక్సిజన్ కూడా అందించారు.. ఇలా ఎంతోమందికి ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అందిస్తున్నారు అన్నారు.

Producer VV Vamana Rao Interview About Honey Trap

 


హనీ ట్రాప్ సినిమా నేటి యువతను చైతన్యవంతులను చేస్తుంది - నిర్మాత వి వి వామన రావు 

హనీ ట్రాప్ అనే రుగ్మత వాళ్ళ సర్వం కోలుపోతున్నారు. చాలా మంది పొలిటిషన్స్, డాక్టర్స్, వ్యాపారవేత్తలు ఇంకా మరి ఎందరో వి ఐ పి వ్యక్తులు ఈ హనీ ట్రాప్ లో పడి వాళ్ళ జీవితాలను బలి తీసుకుంటున్నారు. ఇలాంటి సందర్భాలు మనం ప్రతిరోజూ పత్రికల్లో చదువుతూనే ఉన్నాం. మరి ఇలాంటి హనీ ట్రాప్ లో పడకుండా నేటి యువతను చైతన్యవంతుల్ని చేయాలి అని ఈ సినిమా ని నిర్మించాము అని చిత్ర నిర్మాత వి వి  వామన రావు గారు తెలియజేశారు.


రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ఈ చిత్రం ఈ నెల 17న రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదల అవుతుంది.


ఈ సందర్భంగా నటుడు, రచయిత, నిర్మాత వి వి వామన రావు మాట్లాడుతూ "1979 నుంచి రచయిత గా చాలా నాటకాలు రాసాను. నా కథ కి నంది అవార్డు కూడా వచ్చింది. తర్వాత సీరియల్స్ రాసాను, నిర్మించాను. కథలు చాలా రాసాను, 8 ఏళ్ళ క్రితం ఒక పాకిస్తాన్ అమ్మాయి భారతదేశం నేవీ ఆఫీసర్ ని ట్రాప్ చేసి మన దేశం రహస్య సమాచారాన్ని దోచుకుంది. అప్పుడు పుట్టిన కథ ఇది. తర్వాత ఈ మధ్య కాలంలో ఈ హనీ ట్రాప్ లాంటి చాలా వార్తలు పత్రికల్లో చదివాను. ఇది మంచి సమయం అని ఈ కథ ని సినిమా గా చిత్రరించాము.


సునీల్ కుమార్ రెడ్డి గారు గతం లో రొమాంటిక్ క్రిమినల్స్ లాంటి సినిమాలు నిర్మించి కమర్షియల్  సక్సెస్ సాధించారు. అయితే నా కథ కి సునీల్ కుమార్ రెడ్డి గారు బాగా సరిపోతారు అని తనతో ప్రయాణం మొదలు పెట్టాను. నేను ఊహించుకున్న కథ కన్నా సునీల్ కుమార్ రెడ్డి గారు అద్భుతంగా దర్శకత్వం వహించారు. సినిమా చాలా బాగా వచ్చింది. నా తర్వాత సినిమా కూడా సునీల్ గారితోనే. 


నేను చాలా నాటకాల్లో సీరియల్స్ లో నటించాను. ఈ చిత్రం లో కూడా నటించే అవకాశం వచ్చింది. ఒక పొలిటికల్ మినిస్టర్ కి పి ఎ గా నటించాను. మంచి క్యారెక్టర్ వచ్చింది.


మా చిత్రం యూత్ కి బాగా నచ్చుతుంది . సమకాలీన అంశాలతో మా చిత్రాన్ని నిర్మించాము. ఖచ్చితంగా ప్రేక్షకులకి నచ్చుతుంది.


మా సినిమా సెన్సార్ కి వెళ్ళినప్పుడు నేను చాలా సన్నివేశాలను కట్ చేస్తారు అని అనుకున్న కానీ సెన్సార్ వాళ్ళు ఎటువంటి కటింగ్ లేకుండా మాకు ఎ సర్టిఫికెట్ ఇచ్చారు. సీన్ లు కట్ చేస్తే సినిమా పట్టు పోతుంది. అందుకే ఎటువంటి కట్స్ లేకుండా  ఎ సర్టిఫికెట్ ఇస్తున్నాము అని చెప్పారు.


ఈ కరోనా లాక్ డౌన్ లో నిర్మాతకి ఇబ్బంది గానే ఉంది. తెలంగాణ లో అని అనుకూలంగానే ఉన్నాయి కానీ ఆంధ్రాలో 3 షోలకు మాత్రమే అనుమతి ఉంది. మా చిత్రాన్ని ఈ నెల 17న విడుదల చేయడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము. సినిమా మంచి విజయం సాధిస్తుంది అని తెలియజేస్తున్నారు.

GST Movie Review


Check out the Review of  The movie "GST" (God Satan Technology) is being produced by Komari Janaiah Naidu under the banner of " Tholu Bommala chitralu"  Starring Anand Krishna, Ashok, Venkat and Nandu as the heroes, Swatimandal, Anchor Indu, Pooja Suhasini and Vani as the heroines.

Story 

GST is the story based on Science and Ghosts 

Now coming to story After completion of Education  A group of students plans a long tour 

The person who is working as navy officer  falls in love with a girl he wants to settle his life with lot of money  in this process he will find one item which is being produced by shark sprem which is used in perfumes what happened after that ?

How ghost enters in this story? Forms the rest of the story 



 Performances: 

Performances are good each and everyone has given their best even though all are new actors they did decent job in the first half their performance is main highlight 

 the chemistry between the two Lovers are good 

actress who asked as Ghost did her best , the ghost character is another plus point for this film


Technical Aspects 

Coming to Technical Aspects we must appreciate director  Janaki Ram he has done good research his research on gods  temples and on all religions is good Even on science elements his work is good .Productions values are rich Yadagiri's cinematography is very good The music provided by music director UV Niranjan is a plus point for the film. 


On whole Gst is a decent Attempt 

Rating: 3.25 / 5

Tanish Maro Prasthanam Releasing Shortly

 



రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే.. అదే తనీష్ "మరో ప్రస్థానం" సినిమా స్పెషాలిటీ



ఇప్పుడు ట్రెండ్ మారింది. కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ బాగా పెరిగింది. ఇది తనీష్ హీరోగా నటించిన "మరో ప్రస్థానం" సినిమాకి ఓ వరం అని చెప్పచ్చు. తనీష్‌, ముస్కాన్ సేథీ జంటగా నటించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ మూవీని హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించింది. ఈ నెలాఖరుకు "మరో ప్రస్థానం" చిత్రాన్ని విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. 


"మరో ప్రస్థానం" సినిమా విషయానికి వస్తే...రియల్ టైమ్, రీల్ టైమ్ ఒకటే ఉండటం ఈ సినిమా ప్రత్యేకత. సినిమాలో కథ ఎంత టైమ్ లో జరిగితే, సరిగ్గా అదే టైమ్ కు సినిమా కంప్లీట్ అవుతుంది. సింగిల్ షాట్ ప్యాటర్న్ లో ఎలాంటి కట్స్, జర్క్స్, రివైండ్ షాట్స్ లేకుండా స్ట్రైట్ స్క్రీన్ ప్లే తో "మరో ప్రస్థానం" చిత్రాన్ని రూపొందించారు దర్శకుడు జాని. ఇలా రెగ్యులర్ గా వచ్చే సినిమాలకు పూర్తి భిన్నంగా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఓ ఎమోషనల్ కిల్లర్ జర్నీ అని చెప్పచ్చు. కథ, కథనం సరికొత్తగా ఉంటుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు తర్వాత సీన్ లో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో చూసేలా డిఫరెంట్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాను డైరెక్టర్ జాని తెరకెక్కించారట.. సినిమా సక్సస్ పై టీమ్ మెంబర్స్ అందరూ గట్టి నమ్మకంతో ఉన్నారు. దీనికి కారణం... ఇటీవల కాలంలో వచ్చిన కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలకు ఆదరణ లభించడమే అని చెప్పచ్చు.  


వరుడు ఫేమ్ భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర కీలక పాత్రలు పోషించారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనేది ప్రకటించనున్నారు. ఈ చిత్రానికి మాటలు - వసంత కిరణ్, యానాల శివ, పాటలు - ప్రణవం.., సంగీతం - సునీల్ కశ్యప్, సినిమాటోగ్రఫీ - ఎంఎన్ బాల్ రెడ్డి, ఎడిటర్ - క్రాంతి (ఆర్కే), ఎస్ఎఫ్ఎక్స్ - జి. పురుషోత్తమ్ రాజు, కొరియోగ్రఫీ - కపిల్, ఫైట్స్ - శివ, దర్శకత్వం - జాని.

"Badmashgallaku Bumper offer" first look launched by Dir Surendar Reddy

 "బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫ్ ర్" ఫస్ట్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ చేసిన

స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి




ఇంద్రసేన, సంతోష్ రాజ్, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా

నటిస్తున్న సినిమా "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్". యాక్షన్ థ్రిల్లర్

కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్

ఫిల్మ్ అకాడెమీ పతాకంపై నిర్మాత అతీంద్ర అవినాష్ నిర్మిస్తున్నారు.

"బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" చిత్రానికి రాఘవేంద్ర రెడ్డి సమర్పకులుగా

వ్యవహరిస్తున్నారు. హీరో ఇంద్రసేన పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్

లుక్ టైటిల్ లోగో ను దర్శకుడు సురేందర్ రెడ్డి లాంఛ్ చేశారు. మూవీ యూనిట్

కు బెస్ట్ విశెస్ తెలిపారు. ఈ సందర్భంగా


హీరో సంతోష్ రాజ్ మాట్లాడుతూ..."బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" సినిమా ఈ

పాండమిక్ లో మీకు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. సురేందర్ రెడ్డి గారి

చేతుల మీదుగా పాస్ లుక్ టైటిల్ లోగో లాంఛ్ అవడం గుడ్ బిగినింగ్

అనుకుంటున్నాము. అన్నారు.


దర్శకుడు రవి చావలి మాట్లాడుతూ..."బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్" సినిమా

టైటిల్ లోగో విడుదల చేసిన సురేందర్ రెడ్డి గారికి థాంక్స్. ఇదొక యాక్షన్

థ్రిల్లర్ మూవీ. ప్రతి పది నిమిషాలకు ఒక ట్విస్ట్ ఉంటుంది. సినిమా

షూటింగ్ కంప్లీట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి.

యాక్షన్ తో పాటు మంచి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది. అన్నారు.


చిత్ర సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి మాట్లాడుతూ....ఇవాళ టైటిల్ లోగోను

డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారు విడుదల చేయడం సంతోషంగా ఉంది. దర్శకుడు

రవి చావలి గారు చాలా ఫాస్ట్ గా 30 రోజుల్లోనే ఈ మూవీని షూట్ చేశారు.

ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ స్టార్ట్ చేయబోతున్నాం. మంచి

టెక్నికల్ టీమ్ "బద్మాష్ గాళ్లకు బంపర్ ఆఫ్ ర్"సినిమాకు పనిచేస్తున్నారు.

అన్నారు.


హీరో ఇంద్రసేన మాట్లాడుతూ... రవి చావలి లాంటి గొప్ప దర్శకుడితో పనిచేసే

అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా నా కెరీర్ లో

గుర్తుండిపోయే సినిమా అవుతుంది. సమర్పకులు రాఘవేంద్ర రెడ్డి గారి బ్యానర్

లో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అన్నారు.


నవీన రెడ్డి, సత్య ప్రకాష్,‌ శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర పాత్రల్లో

నటించిన ఈ చిత్రానికి ఎడిటింగ్ - మార్తాండ్ కె వెంకటేష్, సినిమాటోగ్రఫీ -

విజయ్ సి కుమార్, సంగీతం - బాంబే భోలే, పీఆర్వో - జీఎస్కే మీడియా,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - శేఖర్ అలవలపాటి, నిర్మాత - అతీంద్ర అవినాష్,

సమర్పణ - రాఘవేంద్ర రెడ్డి, దర్శకత్వం - రవి చావలి.


Love story Releasing on September 24th

 సెప్టెంబర్ 24న థియేటర్ లలో విడుదలకు కాబోతున్న "లవ్ స్టోరి"



నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా ఫీల్ గుడ్ సినిమాల దర్శకుడు శేఖర్ కమ్ముల

రూపొందించిన సినిమా "లవ్ స్టోరి". ఈ సినిమా సెప్టెంబర్ 24న థియేటర్ లలో

ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. పాండమిక్ సెకండ్ వేవ్ తర్వాత

థియేటర్ లలో విడుదలవుతున్న ప్రెస్టీజియస్ మూవీ "లవ్ స్టోరి" కావడం

విశేషం. రేవంత్, మౌనికల ప్రేమ కథను తెరపై చూసేందుకు ఆడియెన్స్ చాలా

రోజులుగా వేచి చూస్తున్నారు. సెప్టెంబర్ 24న "లవ్ స్టోరి" థియేటర్ రిలీజ్

కు అటు ఎగ్జిబిషన్ సెక్టార్ లోనూ ఉత్సాహం నింపబోతోంది. ఈ సందర్భంగా


దర్శకుడు శేఖర్ కమ్ముల మాట్లాడుతూ... తప్పనిసరి పరిస్థితుల వల్ల

ఇన్నాళ్లూ మా "లవ్ స్టోరి" చిత్రాన్ని వాయిదా వేస్తూ వచ్చాం. మా సినిమాను

మీకు ఎప్పుడు చూపించాలి అనే ఆత్రుతగా సరైన సమయం కోసం వేచి చూశాం. ఆ గుడ్

టైమ్ రానే వచ్చింది. ఈ నెల 24న "లవ్ స్టోరి" చిత్రాన్ని థియేటర్లలో

ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నామని చెప్పడానికి చాలా

సంతోషిస్తున్నాము. థియేటర్లలో కలుసుకుందాం. వినాయక చవితి శుభాకాంక్షలు.

అన్నారు.


"లవ్ స్టోరి" సినిమాలో పాటలు అనూహ్య ఆదరణ పొందాయి. యూట్యూబ్ వ్యూస్ లో

'సారంగదరియా' ఆల్ టైమ్ రికార్డులు తిరగరాసింది. 'హే పిల్లా', 'నీ చిత్రం

చూసి..' పాటలు కూడా మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. మిలియన్ల

కొద్దీ వ్యూస్ సంపాదించాయి. "లవ్ స్టోరి" మ్యూజికల్ గా హిట్ అవడం సినిమా

మీద మరిన్ని అంచనాలు పెంచాయి. దర్శకుడు శేఖర్ కమ్ముల చూపించబోయే

ప్లెజంట్, ఎమోషనల్ ప్రేమ కథకు ఈ పాటలు అదనపు ఆకర్షణ కానున్నాయి.


ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్ పీ, అమిగోస్ క్రియేషన్స్

సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. కె నారాయణదాస్ నారంగ్, పి. రామ్మోహన్

రావు నిర్మాతలు. ''లవ్ స్టోరి'' చిత్రంలో రాజీవ్ కనకాల, ఈశ్వరీ రావు,

దేవయాని ఇతర కీలక పాత్రల్లో నటించారు.


సాంకేతిక నిపుణులు: సినిమాటోగ్రఫీ: విజయ్ సి.కుమార్, ఎడిటర్ : మార్తాండ్

కె.వెంకటేష్, మ్యూజిక్ : పవన్ సి.హెచ్, సహా నిర్మాత :భాస్కర్ కటకంశెట్టి,

పిఆర్ఓ : జి.ఎస్.కె. మీడియా , ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : ఐర్ల నాగేశ్వర

రావు, నిర్మాతలు : నారాయణ్ దాస్ కె నారంగ్,పి.రామ్మోహన్ రావు,

రచన,దర్శకత్వం: శేఖర్ కమ్ముల.

18Pages Anupama Parameshwaran Look Poster Launched

 ‘18 పేజెస్’ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పాత్రను పరిచయం చేస్తూ విడుదలైన మోషన్ పోస్టర్ కు అనూహ్య స్పందన.. 



వరస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటిస్తున్న సినిమా 18 పెజెస్. గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్‌పై ఈ సినిమాను బన్నీ వాస్, సుకుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమా వస్తుంది. కుమారి 21 ఎఫ్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమా తర్వాత పల్నాటి సూర్య ప్రతాప్ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. ప్రముఖ దర్శకుడు సుకుమార్ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించడం విశేషం. తాజాగా ఈ సినిమా నుంచి అనుపమ పరమేశ్వరన్ పోషిస్తున్న నందిని పాత్ర పరిచయం చేశారు దర్శక నిర్మాతలు.

ఒక అందమైన అడవి.. పచ్చని చెట్లు.. ప్రశాంతమైన వాతావరణం.. అందులో నుంచి ఒక సీతాకోకచిలుక ఎగురుకుంటూ వచ్చి.. అనుపమ పరమేశ్వరన్ చేతిపై వాలుతుంది. అలా ఆమె నందిని పాత్రను పరిచయం చేస్తూ మోషన్ పోస్టర్ విడుదల చేశారు మేకర్స్. కొత్తగా ఉన్న ఈ మోషన్ పోస్టర్ ఆకట్టుకుంటుంది. ఏ వసంత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ సినిమాకు గోపీ సుందర్ సంగీతం అందిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్. డిసెంబర్ లో థియేటర్స్ లో సినిమా విడుదల కానుంది. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే చిత్రయూనిట్ ప్రకటించనున్నారు.


నటీనటులు: నిఖిల్ సిద్ధార్థ్, అనుపమ పరమేశ్వరన్ తదితరులు


టెక్నికల్ టీం:

దర్శకుడు: పల్నాటి సూర్య ప్రతాప్

కథ, స్క్రీన్ ప్లే: సుకుమార్

నిర్మాతలు: బన్నీ వాసు, సుకుమార్

సమర్పణ: అల్లు అరవింద్

నిర్మాణ సంస్థలు: గీతా ఆర్ట్స్ 2, సుకుమార్ రైటింగ్స్

సినిమాటోగ్రఫర్: ఏ వసంత్

ఎడిటర్: నవీన్ నూలి

సంగీతం: గోపీ సుందర్

పిఆర్ఓ: ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్, మ‌ఢూరి మ‌ధు

MEB singer Chinmayi Birthday Special Poster

 ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో సింగర్ చిన్మయి బర్త్ డే పోస్టర్ విడుదల..




అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్, పాటలు, పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. తాజాగా ఈ సినిమాలో సింగర్ చిన్మయి ఈ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ ఆర్టిస్ట్, గాయకురాలిగా తనదైన గుర్తింపు సంపాదించుకున్న చిన్మయి.. అఖిల్ సినిమాలో తొలిసారి స్క్రీన్ పై కనిపిస్తున్నారు. ఈమె పుట్టినరోజు సందర్భంగా పోస్టర్ విడుదల చేసారు మేకర్స్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ చెప్పిన కథ నచ్చడంతో చిన్మయి తెర ముందుకు వస్తున్నారు. త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు దర్శకుడు భాస్కర్. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అన్ని పాత్రలను అలాగే డిజైన్ చేస్తున్నారు.


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు..


సాంకేతిక నిపుణులు:


దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

పీఆర్ఓ : ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్



“IDHE MAA KATH” LOCKS IT’S THEATRICAL RELEASE ON SEPT 24th

 “IDHE MAA KATH” LOCKS IT’S THEATRICAL RELEASE ON SEPT 24th




It’s well known fact that  Sumanth Ashwin, Srikanth, Bhumika Chawla and Tanya Hope are teaming up for a film which is completely based on bikers life and their love for riding titled ''Idhe Maa Katha''which is first of its kind in India, directed by Guru Pawan an former associate of RGV, Puri Jagannadh, Harish Shankar, Nagesh Kukunoor etc., and produced under Gurappa Parameswara Productions, the film is billed to be a coming-of-age road trip movie, The teaser of the film that got released had created a buzz for its super rich visuals not only among enthusiastic bike riders but also among common audience as well..



The team has already released 2 lyrical songs “Priya Priya” and “Kala La Kadha” from the film which has created huge buzz & grabbed everyone's hearts and eye balls with its soul touching music and visual beauty, shot in the picturesque locations of Leh Ladakh and Manali. Seeing the visuals in these songs one can easily say that it’s a big budget quality movie for sure.



On the eve of “Vinayaka Chavithi” the makers have today released their 3rd single Lyrical song ‘Just Go For It” and also have revealed the theatrical release date of the film to be on September 24th.



The technical crew of Idhe Maa Katha comprises cinematographer Ram Prasad and editor Junaid Siddiqui. This project is being back-rolled by G. Mahesh, under 'Gurappa Parameswara Productions' and L. Chiranjeevi is the executive producer for this film. Well known and reputed distribution houses are handling "Idhe Maa Katha" distribution in Ap & TG.



Here is the link for the lyrical song. 


https://www.youtube.com/watch?v=3vxdLoBS_jk

Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Production No 7 Titled Macherla Niyojakavargam

 Nithiin, MS Raja Shekhar Reddy, Sreshth Movies Production No 7 Titled Macherla Niyojakavargam



Versatile actor Nithiin who was seen in completely class and soft roles in his last few films will be playing an action-packed role in his next film under the direction of MS Raja Shekhar Reddy. The film to be produced by Sudhakar Reddy and Nikitha Reddy on Sreshth Movies banner was launched today and as promised the makers have revealed its title through a motion poster.


Few hooligans are seen coming to attack Nithiin, while the protagonist is ready to take on them. There’s fire all over. And the title is announced as Macherla Niyojakavargam. It’s a massy title and the title as well as the motion poster indicate the film is going to be a pucca mass and commercial entertainer with high action elements. Mahathi Swara Sagar has provided wonderful BGM for the motion poster.


Director MS Raja Shekhar Reddy has prepared a powerful script to present Nithiin in a never seen before action role and he has succeeded to convey the same through the motion poster. The title- Macherla Niyojakavargam makes strong impact. Needless to say, the motion poster raises expectations on the film, much before it goes on floors.


The most sought-after actress Krithi Shetty plays the female lead of the project to be mounted on large scale. The movie also boasts of stellar cast and will have leading craftsmen working for it.


It’s third film for music director Mahathi Swara Sagar with Nithiin, after Bheeshma and Maestro. Prasad Murella will crank the camera, while Mamidala Thirupathi provides dialogues and Sahi Suresh is the art director. Kotagiri Venkateswara Rao will handle editing.


The film’s regular shooting commences from next month. Other details will be revealed soon.


Cast: Nithiin, Krithi Shetty and others


Technical Crew:

Written & Directed by: MS Raja Shekhar Reddy

Producers: Sudhakar Reddy, Nikitha Reddy

Banner: Sreshth Movies

Music: Mahathi Swara Sagar

DOP: Prasad Murella

Editor: Kotagiri Venkateswara Rao

Line Producer: G Hari

Dialogues: Mamidala Thirupathi

Art Director: Sahi Suresh

PRO: Vamsi-Shekar

Gangster Gangaraju Movie Emo Elaaga Lyrical video Out

 గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా నుంచి 'ఏమో ఇలాగా' అనే పాట విడుదల..!!



వరుస విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకులలో నటుడిగా మంచి పేరు సంపాదించుకున్న హీరో ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ. 'వలయం' వంటి సస్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమా తో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ఈ హీరో ప్రస్తుతం మరో వైవిధ్య భరితమైన సినిమా చేస్తున్నాడు. `గ్యాంగ్‌స్ట‌ర్ గంగ‌రాజు` అనే వెరైటీ సినిమా తో మరొకసారి ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమయ్యాడు. ఇటీవలే ఈ చిత్రానికి సంభందించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా ప్రేక్షకులను ఈ లుక్ ఎంతగానో ఆకట్టుకుంది. ఈ లుక్ ఎంతో డిఫరెంట్ గా ఉండడంతో పాటు ఆసక్తికరంగా ఉందని ప్రేక్షకులు తెలియజేశారు. 


మంచి అభిరుచి గల దర్శకుడు ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్  పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సేషన్  సాయి కార్తీక్ సంగీతం అందిస్తుండగా వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా ఈ సినిమా కి సంభందించిన తొలి పాటను విడుదల చేసింది చిత్ర బృందం. 'ఏమో ఇలాగా' అంటూ మొదలయిన ఈ పాట ను హేమచంద్ర ఆలపించగా, భాస్కర భట్ల రచించారు. అనీష్ మాస్టర్ కోరియోగ్రఫీ లో ఈ పాట చిత్రీకరణ కాగా ప్రముఖ ఆడియో సంస్థ మ్యాంగో మ్యూజిక్ ద్వారా ఈ పాట విడుదల అయ్యింది. ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ హీరోగా నటించిన వలయం సినిమాలోని నిన్ను చూశాకే అనే పాట 12 మిలియన్స్ కు చేరుకోవడం విశేషం. 


న‌టీనటులు:


ల‌క్ష్ చ‌ద‌ల‌వాడ‌, వేదిక ద‌త్త‌, వెన్నెల కిషోర్‌, చ‌ర‌ణ్ దీప్‌, శ్రీకాంత్ అయ్యంగార్, గోప‌రాజు ర‌మ‌ణ‌, నిహార్ క‌పూర్‌, రాజేశ్వ‌రి నాయ‌ర్‌, స‌త్య‌కృష్ణ‌, ర‌వితేజ‌, న‌న్నిమాల‌, స‌మ్మెట గాంధీ, రాజేంద్ర‌, అను మాన‌స‌, లావ‌ణ్య రెడ్డి, అన్న‌పూర్ణ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం:


ద‌ర్శ‌క‌త్వం:  ఇషాన్ సూర్య‌

నిర్మాత‌:  చ‌ద‌ల‌వాడ ప‌ద్మావ‌తి

బ్యాన‌ర్‌: శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్

సినిమాటోగ్ర‌ఫీ:  క‌ణ్ణ పి.సి.

సంగీతం:  సాయి కార్తీక్‌

ఎడిట‌ర్‌:  అనుగోజు రేణుకా బాబు

ఫైట్స్‌:  డ్రాగ‌న్ ప్ర‌కాశ్‌

కొరియోగ్రాఫ‌ర్స్‌:  భాను, అనీష్‌

పి.ఆర్‌.ఓ:  సాయి స‌తీశ్‌, ప‌ర్వ‌త‌నేని రాంబాబు

Devudutho Sahajeevanam in Post Production works

 పోస్ట్ ప్రొడక్షన్‌లో ‘దేవుడితో సహజీవనం’



సురేష్ నీలి ప్రొడక్షన్‌లో కాంట్రవర్శియల్ డైరెక్టర్ సాయిరామ్ దాసరి అందిస్తున్న మరో చిత్రం ‘దేవుడితో సహజీవనం’. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ మరియు గ్లింప్స్‌ను ఇటీవల విడుదల చేశారు. ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు చాలా మంచి స్పందన వచ్చిందని, ఆదరించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు అని తెలిపింది చిత్రయూనిట్. హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. డిసెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.


ఈ సందర్భంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ.. ‘‘దేవుడితో సహజీవనం చిత్ర ఫస్ట్ లుక్, గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఆదరించిన ప్రేక్షకులకు చిత్రయూనిట్ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ చిత్రానికి సురేష్ నీలి మరో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఆర్టిస్టులందరూ అద్భుతంగా సపోర్ట్ చేశారు. హిట్ ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా మంచి సినిమాలను నాకు నచ్చిన సినిమాలను ప్రేక్షకులకు అందజేయాలనేదే నా ఉద్దేశ్యం. అందుకే ఇది నా పదవ సినిమాగా మీ ముందుకు రానుంది. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం..’’ అని తెలిపారు.


హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్‌ తదితరులు నటించిన ఈ చిత్రానికి

మ్యూజిక్: డేవిడ్, 

డిఓపి: తరుణ్ కె సోను, 


ఎడిటర్: ప్రవీణ్, 

పీఆర్వో: బి. వీరబాబు, 

నిర్మాతలు: సాయిరామ్ దాసరి, సురేష్ నీలి, వంశీధర్ రెడ్డి,

కథ- మాటలు- దర్శకత్వం: సాయిరామ్ దాసరి.

Amazing Response for Ksheera Saagara Madhanam in Prime



 బిగ్ బాస్ పార్టిసిపెంట్ 

*మానస్ నాగులపల్లి* నటించిన

"క్షీరసాగర మథనం" చిత్రానికి

అమెజాన్ లో అమేజింగ్ రెస్పాన్స్!!


     ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచిన పలు సాఫ్ట్వేర్ సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్న ఓ ఇరవై మంది మిత్రుల ప్రోత్సాహంతో... యువ ప్రతిభాశాలి 'అనిల్ పంగులూరి' తెరకెక్కించిన "క్షీర సాగర మథనం" చిత్రానికి అమెజాన్ లో అసాధారణ స్పందన లభిస్తోంది. అమెజాన్ ప్రైమ్ లో 499 వ తెలుగు చిత్రంగా విడుదలైన "క్షీరసాగర మథనం" నాలుగు రోజుల స్వల్ప వ్యవధిలోనే "టాప్ 25"లో చోటు సంపాదించుకుని... మరింత మెరుగైన స్థానం కోసం పోటీ పడుతోంది.  శేఖర్ కమ్ముల 'హ్యాపీ డేస్'కి సీక్వెల్ లాంటి ఈ చిత్రం ఆగస్టు 6న థియేటర్స్ లో విడుదలై సాఫ్ట్వేర్ వాళ్లనే కాకుండా... సెన్సిబిలిటీస్ ఉన్న ప్రతి ఒక్కరినీ మెప్పించింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గల తెలుగు ప్రేక్షకులను అమెజాన్ ప్రైమ్ లో అలరిస్తోంది. 

     "బిగ్ బాస్" ఫేమ్ మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించిన ఈ చిత్రంలో అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ్వర పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది.

తమ చిత్రానికి అమెజాన్ ప్రైమ్ లో లభిస్తున్న అపూర్వ స్పందన తమను ఆనందంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోందని దర్శకుడు అనిల్ పంగులూరి అంటున్నారు. ఈ విజయోత్సాహంతో ఆయన తన తదుపరి చిత్రం కోసం సన్నాహాలు చేసుకుంటున్నారు. అతి త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది!!

Producer Tummalapalli Rama Satyanarayana Birthday Special

 ఈ 'బర్త్ డే'కి నాకొక భారీ గిఫ్ట్!!

              -తుమ్మలపల్లి



       "నిర్మాతగా నా వందో చిత్రం... వంద రోజుల సినిమాలు తీయడంలో సిద్ధహస్తులైన- "వంద సినిమాల దర్శకశిఖరం" రూపొందించనున్నారు. నిర్మాతగా నా స్థాయిని వంద రెట్లు పెంచే సదరు వందో చిత్రం అధికారిక ప్రకటన... వంద చిత్రాల దర్శకుడు అధికారికంగా అతి త్వరలో ప్రకటించనున్నారు. ఈ పుట్టినరోజుకు నేనందుకుంటున్న అతి పెద్ద కానుక ఇది. అంతేకాదు... నిర్మాతగా నాకిది "లైఫ్ టైమ్ అచీవ్మెంట్" లాంటిది" అంటున్నారు ప్రముఖ నిర్మాత - భీమవరం టాకీస్ అధినేత తుమ్మలపల్లి రామసత్యనారాయణ. సెప్టెంబర్ 10... తన 64వ పుట్టినరోజును పునస్కరించుకుని ఆయన మీడియాతో ముచ్చటించారు.

     "2021 నాకు చాలా ప్రత్యేకమైన సంవత్సరం.  "జాతీయ రహదారి" 10 న విడుదలవుతోంది. ఈ సినిమా కచ్చితంగా అవార్డుల పంట పండిస్తుంది. నా పేవరెట్ డైరెక్టర్ ఆర్జీవి దర్శకత్వంలో ప్రముఖ రచయిత యండమూరి అందించిన కథతో 'తులసి తీర్ధం' తెరకెక్కిస్తున్నాను. యండమూరి దర్శకత్వం వహిస్తున్న "నల్లంచు తెల్లచీర, అతడు-ఆమె-ప్రియుడు" చిత్రాలు పోస్ట్ ప్రొడక్షన్ లో ఉన్నాయి. ప్రముఖ దర్శకుడు "దండుపాళ్యం" ఫేమ్ శ్రీనివాసరాజు దర్శకత్వంలో ఒక థ్రిల్లర్ మూవీ ప్లాన్ చేస్తున్నాం. ఇవి కాకుండా మరికొన్ని సినిమాలు కూడా చర్చల దశలో ఉన్నాయి. 2004లో నేను ఇండస్ట్రీకి వచ్చాను. సి.కళ్యాణ్, వి.వి.వినాయక్, విజయేంద్రప్రసాద్, యండమూరి, ఆర్జీవి వంటి గొప్ప వ్యక్తుల మనసుల్లో స్థానం సంపాదించుకోగలగడం నిజంగా నా అదృష్టం. అలాగే సినిమారంగంలో నాకు గల అనుభవాన్ని, అనుబంధాన్ని గుర్తించి... నన్ను "ఊర్వశి ఓటిటి" సిఇవోను చేసిన రవి కనగాల, శ్యామ్ గార్లకు నా ప్రత్యేక కృతజ్ఞతలు" అన్నారు!!

Seetimaarr Pre Release Event

 



‘సీటీమార్‌’ థియేట‌ర్స్‌లో చూసే సినిమా.. త‌ప్ప‌కుండా ఎంజాయ్ చేస్తారు: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో హీరో గోపీచంద్‌


ఎగ్రెసివ్ స్టార్ గోపీచంద్, మాస్ డైరెక్టర్ సంప‌త్ నంది కాంబినేష‌న్‌లో మాస్ గేమ్ అయిన క‌బ‌డ్డీ నేప‌థ్యంలో తెర‌కెక్కిన భారీ స్పోర్ట్స్ క‌మ‌ర్షియ‌ల్ యాక్షన్ డ్రామా‌ ‘సీటీమార్‌’. గోపిచంద్ కెరీర్‌లోనే  భారీ బ‌డ్జెట్‌, హై టెక్నిక‌ల్ వాల్యూస్‌తో పవన్‌ కుమార్ స‌మ‌ర్పణ‌లో శ్రీనివాసా సిల్వర్‌ స్క్రీన్‌ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మించారు.మిల్కీబ్యూటీ తమన్నా హీరోయిన్‌గా న‌టించింది. ఈ చిత్రాన్ని వినాయ‌క చ‌వితి సంద‌ర్భంగా సెప్టెంబ‌ర్‌ 10న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా...


ఎగ్రెసివ్ స్టార్‌ గోపీచంద్ మాట్లాడుతూ ‘‘మా సినిమా ట్రైలర్ చూసి యూనిట్‌కు విషెష్ చెప్పిన మెగాస్టార్ గారికి థాంక్స్‌. అలాగే నా స్నేహితుడు ప్ర‌భాస్ కూడా ట్రైల‌ర్ చూసి స్పెష‌ల్‌గా ఫోన్ చేసి మాట్లాడాడు. త‌న‌కు కూడా థాంక్స్‌. సినిమా విష‌యానికి వ‌స్తే.. 2019 డిసెంబ‌ర్‌లో సీటీమార్‌ను షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. యాబై శాతం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత కోవిడ్ ఎఫెక్ట్‌తో లాక్‌డౌన్ పెట్టారు. దాదాపు తొమ్మిది నెల‌లు షూటింగ్‌ను ఆపేశాం. త‌ర్వాత న‌వంబ‌ర్‌, డిసెంబ‌ర్‌లో షూటింగ్‌ను స్టార్ట్ చేసి పూర్తి చేశాం, రిలీజ్‌కు చేద్దాం అనుకుంటున్న త‌రుణంలో మ‌రోసారి కోవిడ్ ఎఫెక్ట్‌తో సినిమా ఆగింది. ఆ స‌మ‌యంలో నిర్మాత‌లను చూసి బాధేసింది. నా నిర్మాత‌ల‌నే కాదు, ఏ నిర్మాత అయినా ఎంతో క‌ష్ట‌ప‌డి, డ‌బ్బులు పెట్టి సినిమా తీస్తాడు. ప్ర‌తి ఒక ఆర్టిస్ట్‌, టెక్నీషియ‌న్ సినిమాపైనే ఆధార‌ప‌డి ఉంటారు. ఇలాంటి ప‌రిస్థితి వ‌స్తే చాలా ఇబ్బందే. గ‌త నెల‌న్న‌ర‌గా ప‌రిస్థితులు బెట‌ర్ అవుతున్నాయి. అంద‌రూ బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. సినిమాలు విడుద‌ల‌వుతున్నాయి. ఇప్పుడు సీటీమార్ వంటి ప‌క్కా మాస్ క‌మ‌ర్షియ‌ల్ సినిమా వ‌స్తుంది. ప్రేక్ష‌కుల‌ను ఇంటి నుంచి థియేట‌ర్స్‌కు తీసుకొచ్చే సత్తా ఉన్న సినిమా అనే న‌మ్మ‌కం ఉంది. ఈ సినిమాను ఆద‌రిస్తే, మిమ్మ‌ల్ని అల‌రించ‌డానికి చాలా చాలా సినిమాలు రెడీగా ఉన్నాయి. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి అండ్ టీమ్ ఎక్కువ బ‌డ్జెట్ అవుతుంద‌ని నేను చెబితే, క‌థ న‌చ్చిందండి చెప్పి సినిమా స్టార్ట్ చేశారు. ఆరోజు నుంచి ఎక్క‌డా కాంప్ర‌మైజ్ కాకుండా సినిమాను చాలా గొప్ప‌గా తెర‌కెక్కించిన నిర్మాత‌లు శ్రీనుగారు, ప‌వ‌న్‌గారికి థాంక్స్‌. సంప‌త్ నందితో గౌత‌మ్ నంద సినిమా చేశారు. ఇది రెండో సినిమా. సంప‌త్ హండ్రెడ్ ప‌ర్సెంట్ మ‌న‌సు పెట్టి ఈ సినిమా చేశాడు. డెఫ‌నెట్‌గా మేం ఏద‌యితే అనుకున్నామో దాన్ని రీచ్ అవుతామ‌ని అనుకుంటున్నాం. ఇంత మంచి సినిమా చేసిన సంప‌త్‌కు థాంక్స్‌. సినిమాటోగ్రాఫ‌ర్ సౌంద‌ర్‌.. బ్యాక్‌బోన్‌లా నిలిచాడు. మ‌ణిశ‌ర్మ‌గారు అందించిన సాంగ్స్ ఇప్ప‌టికే హిట్. ఇక ఆయ‌న బ్యాగ్రౌండ్ స్కోర్ అందించ‌డంలో కింగ్‌. ఆయ‌న‌కు థాంక్స్‌. త‌మ‌న్నాకు, నాతో క‌లిసి న‌టించిన ప్ర‌తి ఒక్క‌రికీ థాంక్స్‌. ఇది థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేసే సినిమా.. త‌ప్ప‌కుండా థియేట‌ర్స్‌కు వ‌చ్చి సినిమా చూడండి. ఎంజాయ్ చేసి ఇంటికెళ‌తారు. అందులో డౌట్ లేదు’’ అన్నారు.


రాజ‌మండ్రి లోక్‌స‌భ ఎం.పి భ‌ర‌త్ మాట్లాడుతూ ‘‘చిట్టూరి శ్రీనివాస్‌గారు, ప‌వ‌న్‌గారు క‌లిసి అంద‌రితో గోల పెట్టించ‌డానికి సీటీమార్ అనే సినిమాను తీసుకొస్తున్నారు. ట్రైల‌ర్‌, సాంగ్స్ చూస్తుంటే సినిమా ఎలా ఉంటుందో అర్థ‌మ‌వుతుంది. సినిమా గోపీచంద్‌గారి కెరీర్‌లో మైల్‌స్టోన్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ సంప‌త్ నందిగారికి, ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు. సీటీమార్‌ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న క‌మ‌ర్షియ‌ల్ మూవీ అని తెలుసు. ఒలింపిక్స్‌లో మ‌న‌కు ఏడు మెడ‌ల్స్ వ‌చ్చాయి. జ‌నాభాలో మ‌నం ప్ర‌పంచంలోనే రెండో స్థానంలో ఉన్నాం. అయినా మ‌నం టాప్ త్రీలో ఎందుకు ఉండ‌లేక‌పోతున్నాం. దీనిపై నేను పార్ల‌మెంట్‌లో కూడా మాట్లాడాను. మ‌న నేష‌న‌ల్ స్పోర్ట్స్ బ‌డ్జెట్ కేవ‌లం రెండు వేల కోట్లు మాత్ర‌మే. అమెరికా, ర‌ష్యా వంటి దేశాల్లో మ‌న కంటే యాబై, వంద రెట్ల బ‌డ్జెట్ ఎక్కువ‌గా ఉంటుంది. ఇప్పుడు యూత్ మ‌న రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నారు. భ‌విష్య‌త్తుల్లో స్పోర్ట్స్‌ను ఎంక‌రేజ్ చేసి మ‌రిన్ని మెడ‌ల్స్ వ‌చ్చేలా చూస్తామ‌ని ఈ సంద‌ర్భంగా తెలియ‌జేసుకుంటున్నాను. సెకండ్ వేవ్ త‌ర్వాత భారీగా వ‌స్తున్న ఈ సినిమాను చూసి ప్రేక్ష‌కులు ఓ పాత్ సెట్ చేయాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ సంప‌త్ నంది మాట్లాడుతూ ‘‘మా గోపీగారు సహా నిర్మాతలు, ఇత‌ర ఆర్టిస్టులు, టెక్నీషియ‌న్స్ గురించి ఫ్యూచ‌ర్‌లో మాట్లాడుతాను. సినిమాపై చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాను. మ‌న‌కు స్వాతంత్య్రం రాక ముందే మ‌న జీవితాల్లోకి సినిమా వ‌చ్చింది. మూకీగా, టాకీ మొద‌లైన సినిమా త‌ర్వాత బ్లాక్ అండ్ వైట్‌.. క‌ల‌ర్ సినిమాగా మారింది. నేల టిక్కెట్టు నుంచి బ్లాక్ టిక్కెట్టు వ‌ర‌కు సినిమా మారింది. చైనా త‌ర్వాత ఎక్కువ థియేట‌ర్స్ ఉన్న దేశ‌మేదంటే మ‌న‌దే. మ‌న తెలుగు రాష్ట్రాల్లోనే 2800 నుంచి 3000 వ‌ర‌కు థియేట‌ర్స్ ఉన్నాయి. మ‌న దేశంలో క్రికెట్ త‌ర్వాత ప్రేక్ష‌కులు కోరుకునే ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఏదైనా ఉందంటే అది సినిమానే. అలాంటి సినిమా మ‌న‌కు ఫ్రైడే పండ‌గ‌ను తీసుకొస్తుంది. సండే వ‌చ్చిందంటే మ‌న‌కు స‌ర‌దాకి సినిమా కెళ్లాలి. అన్నీ మ‌తాల‌వాళ్లు వెళ్లే ఒకే ఒక గుడి థియేట‌ర్. మ‌న ద‌ర్గా అదే.. మ‌న దుర్గ‌మ్మ గుడి అదే.. మ‌న మెద‌క్ చ‌ర్చి అదే. అలాంటి థియేట‌ర్ ఈరోజు క‌ష్టాల్లో ఉంది. ఏడాదిన్న‌ర‌గా మ‌న‌కు పాలాభిషేకాలు లేవు, క‌టౌట్స్ లేవు, పేప‌ర్స్ చించుకోవడాలు లేవు, టిక్కెట్స్ కోసం క్యూ నిలుచుని కొట్టుకోవ‌డాలు లేవు. మ‌ళ్లీ సినిమాలు థియేట‌ర్స్‌లో విజృంభించాలి. అది క‌చ్చితంగా జ‌రుగుతుంది. ఈ విష‌యాన్ని న‌మ్మే మా నిర్మాత‌లు శ్రీనుగారు, ప‌వ‌న్‌గారు ఎన్ని ఓటీటీ ఆఫ‌ర్స్ వ‌చ్చినా మా సీటీమార్‌ను థియేట‌ర్స్‌లోనే విడుద‌ల చేయాల‌ని ఐదు నెల‌లుగా ప్రాణాలు ఉగ్గ‌బ‌ట్టుకున్న‌ట్లు సినిమాను ఉగ్గ‌బ‌ట్టుకుని వెయిట్ చేశారు. సెప్టెంబ‌ర్ 10న ఈ సినిమా మ‌న ముందుకు వ‌స్తుంది. మ‌న‌కు, మ‌న సినిమా ఇండ‌స్ట్రీ వ‌చ్చిన విఘ్నాల‌న్నీ తొలిగి అంద‌రికీ శుభం జ‌ర‌గాల‌ని, జ‌రుగుతుంద‌ని భావిస్తున్నాం. ఈ సినిమాను చూస్తే మ‌మ్మ‌ల్నే కాదు, ఎంటైర్ సినిమా ఇండ‌స్ట్రీనే ఆశీర్వ‌దించిన‌ట్లే. త‌ప్ప‌కుండా మీ అంచనాల‌ను అందుకునే సినిమా చేశాం. త‌ప్ప‌కుండా అంద‌రూ మెచ్చుకునే సినిమా చేశాన‌ని అనుకుంటున్నాను. ఇది దంగ‌ల్‌, చ‌క్ దే ఇండియా త‌ర‌హాలో సీటీమార్‌ కేవ‌లం స్పోర్ట్స్ సినిమా కాదు.. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో వ‌స్తున్న మాస్ క‌మ‌ర్షియ‌ల్‌ మూవీ. సేవ్ సినిమా’’ అన్నారు. 

 


బోయ‌పాటి శ్రీను మాట్లాడుతూ ‘‘‘సీటీమార్’ సినిమా గ్యారంటీ హిట్‌. చిట్టూరి శ్రీను, నేను ఒకేసారి ఇండ‌స్ట్రీలోకి అడుగుపెట్టాం. ఒకేసారి వ‌చ్చాం, ఒకే సినిమాతో మొద‌లయ్యాం. చిట్టూరి శ్రీను ఒక్కొక్క క్రాఫ్ట్‌లో ప‌నిచేసుకుంటూ ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ వ‌చ్చి యూ ట‌ర్న్ వంటి మంచి సినిమాతో నిర్మాత‌గా మారారు. వెంట‌నే నిర్మాత‌గా తొంద‌ర ప‌డ‌కుండా సీటీమార్ అనే మ‌రో మంచి సినిమాతో మ‌న ముందుకు రాబోతున్నారు. టైటిల్ వింటుంటేనే మ‌ణిశ‌ర్మ‌గారిని గుర్తుకు తెచ్చుకోవాలి. సౌండ్ వింటుంటే లోలోప‌ల స్టెప్ వేసుకునేలా ఉంది. శ్రీను ఈ సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గానే, లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో రామ్ పోతినేనితో మ‌రో సినిమాను స్టార్ట్ చేశాడు. ఆయ‌న అలాగే ముందుకు రావాలి. ఇలాంటి మంచి సినిమాలు తీస్తే ఇండ‌స్ట్రీ బావుంటుంది. ఇండ‌స్ట్రీ బావుంటే అంద‌రం బాగుంటారు. రీసెంట్‌గా జ‌రిగిన ఒలింపిక్స్‌లో సింధు ద‌గ్గ‌ర నుంచి చాలా మంది అమ్మాయిలు మ‌న దేశం పేరు నిల‌బెట్టారు. అమ్మాయిలు ఎందులో త‌క్కువ కాదు... అధికులు కూడా. వాళ్లు సాధిస్తారు కూడా. అలాంటి అమ్మాయిల‌పై స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో సినిమా చేసిన శ్రీనుని, డైరెక్ట‌ర్ సంప‌త్‌ని, హీరో గోపీచంద్‌ను అభినందించాలి. గోపీచంద్ పుట్టిన‌ప్ప‌టి నుంచి ఫైట‌రే. ఎందుకంటే.. ఆయ‌న టి.కృష్ణ అనే మ‌హానుభావుడి కొడుకు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసే స‌త్తా ఉన్న కూడా, నాకు సామాజిక స్పృహ ఉంది. సోసైటీపై నాకొక బాధ్య‌త ఉంది. ప్ర‌జ‌ల‌ను నిద్ర లేపాల్సిన అవ‌స‌రం ఉంది. అనే సిద్ధాంతాన్ని విడిచి పెట్ట‌కుండా దాన్ని ఫాలో అవుతూ, సినిమాలు చేశారు.  అంత గొప్ప మ‌నిషి కొడుకే మ‌న గోపీచంద్‌. అంతా ఉన్నా కూడా గోపీచంద్ ఇండ‌స్ట్రీలో అడుగుపెట్టిన ద‌గ్గ‌ర్నుంచి అన్నీ ఒడిదొడుకులే. కానీ గోపీచంద్‌కి మ‌ళ్లీ లేస్తాన‌నే న‌మ్మ‌కం ఉంది. కాబ‌ట్టి ఎక్క‌డా డిసప్పాయింట్ కాకుండా ముందుకు క‌దిలాడు. గోపీచంద్ హీరోలా, విల‌న్‌గా చేసి ఆల్‌రౌండ‌ర్ అనిపించుకున్నాడు. సీటీ కొట్టి.. సీటీమార్‌తో హిట్ కొడ‌తాడు. సినిమా స‌క్సెస్ కావాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. 


డైరెక్టర్ లింగుస్వామి మాట్లాడుతూ ‘‘ఈ సినిమా గురించి నిర్మాత‌గారితో మాట్లాడుతున్నాను. ఆయ‌న సినిమా మెయిన్ కాన్సెప్ట్ ఏంట‌నే దాని గురించి రెండు లైన్స్‌లో చెప్పారు. విన‌గానే చాలా బావుంద‌నిపించింది. అదే విష‌యం ఆయ‌న‌కు చెప్పాను. ట్రైల‌ర్ చూసినప్పుడు నా న‌మ్మ‌కం నిజ‌మ‌వుతుంద‌నిపించింది. సినిమాలో పాజిటివ్ మోడ్ ఉంది. టి.కృష్ణ‌గారు చేసిన ప్ర‌తిఘ‌ట‌న త‌మిళంలో అనువాద‌మై విడుద‌లైన‌ప్పుడు నేను చ‌దువుకునేవాడిని. ఆ సినిమా చూశాను. కృష్ణ‌గారు ఎంతో గొప్ప రైట‌ర్‌, డైరెక్ట‌ర్‌. ఆయ‌న వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన గోపీచంద్ ఎన్నో విజ‌యాల‌ను సాధించాలి. సంప‌త్ నంది మేకింగ్ బావుంది. త‌మ‌న్నాకు, సౌంద‌ర్ రాజ‌న్‌గారు స‌హా అంద‌రికీ ఆల్ ది బెస్ట్‌. నిర్మాత శ్రీనివాస్ చిట్టూరిగారితో రామ్ హీరోగా సినిమా చేస్తున్నాను. ఇప్ప‌టికే ముప్పై రోజులు షూటింగ్ పూర్తయ్యింది. ఎన్నో రోజుల నుంచి తెలుగులో స్ట్ర‌యిట్ సినిమా చేయాల‌ని అనుకుంటున్నాను. ఇప్ప‌టికీ కుదిరింది. మంచి ప్రొడ‌క్ష‌న్స్ హౌస్‌తో జ‌ర్నీ చేస్తున్నాను. అంద‌రికీ థాంక్స్‌’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ శ్రీవాస్ మాట్లాడుతూ ‘‘జ‌నాలు ఇప్పుడు ధైర్యంగా బ‌య‌ట తిరుగుతున్నారు. అలాగే ఈ సినిమాను చూడ‌టానికి థియేట‌ర్స్‌కు వ‌స్తార‌ని ఆశిస్తున్నాం. నిర్మాత‌లు చాలా ఎఫ‌ర్ట్స్ పెట్టి చేశారు. గోపీచంద్‌గారు నాలాంటి డైరెక్టర్స్‌ను ఎంతో మందిని ఇండ‌స్ట్రీకి ఇచ్చాడు. ల‌క్ష్యం సినిమాతో న‌న్ను డైరెక్ట్ చేసిన గోపీచంద్‌గారు నాకెప్పుడూ స్పెష‌లే. రుణం తీర్చుకునే సంద‌ర్భాలు చాలా త‌క్కువ‌గానే వ‌స్తాయి. ఆయ‌న‌తో ప‌నిచేసిన లౌక్యం కూడా పెద్ద హిట్ అయ్యింది. ఆ రెండు సినిమాల‌ను మించిన పెద్ద క‌థ రెడీ అయ్యింది. చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. సంప‌త్ నంది నాకు చాలా మంచి స్నేహితుడు. క‌ష్ట‌ప‌డి సినిమా తీయ‌డ‌మే కాదు, క‌మ‌ర్షియ‌ల్ యాంగిల్లో సినిమాను తీస్తుంటాడు. క‌మ‌ర్షియ‌ల్ సినిమాను తీయ‌డం చాలా క‌ష్టం. సీటీమార్‌లో క‌బ‌డ్డీ నేప‌థ్యం కోసం అమ్మాయిల‌ను ఎంపిక చేసుకుని చేయ‌డం ఎంత క‌ష్ట‌మో నాకు తెలుసు. వినాయ‌క చ‌వితికి వ‌స్తున్న ఈ సినిమా అన్ని విఘ్నాల‌ను తొల‌గించుకుని ముందుకెళ్లాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ మారుతి మాట్లాడుతూ ‘‘ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్‌లాంటి సినిమా సీటీమార్‌. సంప‌త్ నంది, చిట్టూరి శ్రీను మంచి ఫ్రెండ్స్‌. ఆడియెన్స్‌కు, థియేట‌ర్స్‌కు మంచి ఎన‌ర్జీ ఇచ్చే సినిమా ఒక‌టి రావాల‌ని ఎదురుచూస్తున్నాం. ఈ త‌రుణంలో సీటీమార్‌ను పండ‌గ‌రోజున ముందుకు తెస్తున్నారు. ఓ పాజిటివ్ వైబ్స్ క‌నిపిస్తోంది. గోపీచందన్నతో ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్‌ సినిమా చేస్తున్నాను. అలాంటి వ్య‌క్తితో ప‌నిచేయడం నా అదృష్టం. సీటీమార్ ఎన‌ర్జిటిక్ మూవీ. గోపీచంద్‌గారిని ఒక‌లా చూశాం. ఇక‌పై మ‌రోలా ఉంటుంది. అంద‌రూ గ‌ర్వ‌ప‌డేలా సినిమాల‌ను లైన్‌లో పెట్టుకున్నారు’’ అన్నారు. 


నిర్మాత కె.కె.రాధామోహ‌న్ మాట్లాడుతూ ‘‘గోపీచంద్, సంపత్ నంది, శ్రీనివాస్.. వీరందరూ కలిసి చేసిన సీటీమార్ మా సినిమాగానే ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే వీరంద‌రూ నాకు ఎప్ప‌టి నుంచో ప‌రిచ‌యం ఉన్న‌వాళ్లే. సంప‌త్ నంది చాలా కాన్ఫిడెంట్‌గా సినిమాను తీశాడు. ఇక గోపీచంద్‌గారి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటూ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు. 


రైట‌ర్ కోన వెంక‌ట్ మాట్లాడుతూ  ‘‘గోపీచంద్‌గారి ఈవెంట్స్‌కు నేను వెళితే, ఆ సినిమా బ్లాక్‌బ‌స్ట‌ర్  అవుతుంద‌నే సెంటిమెంట్‌తో ఇక్క‌డ‌కు వ‌చ్చాను. గోపీచంద్‌లో ఓ హానెస్ట్ ఉంటుంది. అదే ఆయ‌న్ని ఇంత పెద్ద స్టార్‌ని చేసింది. మా చిత్తూరు శీను చేసిన సినిమా ఇది. త‌న‌తో, సంప‌త్‌నందితో ఉన్న ఫ్రెండ్ షిప్ కోసం ఈ వేడుక‌కి వ‌చ్చాను. ఈ పాండమిక్ త‌ర్వాత వ‌స్తున్న ఈ సినిమాతో థియేట‌ర్స్ ఫుల్ అవుతుంద‌ని, కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ వ‌ర్మ‌, హీరోయిన్ అప్స‌ర రాణి, మంగ్లీ త‌దిత‌రులు పాల్గొని ‘సీటీమార్’ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని యూనిట్‌కు అభినంద‌న‌లు తెలిపారు.


Natural Star Nani interview About Tuck Jagadish

 



ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఉండే సినిమా ‘టక్ జగదీష్’ - నేచురల్ స్టార్ నాని


నేచురల్ స్టార్ నాని  హీరోగా నటించిన 'టక్ జగదీష్' చిత్రాన్ని  షైన్ స్క్రీన్స్ బ్యాన‌ర్‌పై సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 'నిన్నుకోరి' వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ త‌ర్వాత నాని, శివ నిర్వాణ కాంబినేష‌న్‌లో అన్ని ర‌కాల  క‌మ‌ర్షియ‌ల్ ఎలిమెంట్స్‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఈ చిత్రం రూపొందు‌తోంది. నాని స‌ర‌స‌న రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ హీరోయిన్లుగా న‌టిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం సెప్టెంబర్ 10న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల కాబోతోంది. ఈ మేరకు తాజాగా నాని మీడియాతో ముచ్చటించారు.


థియేటర్లో నన్ను నేను చూసుకోవడం కూడా మిస్ అవుతున్నాను. గత ఏడాది V సినిమాతో వచ్చాను. ఈ సారి టక్ జగదీష్ చిత్రంతో వస్తున్నాను. అయితే పరిస్థితులు అనుకూలించకపోవడంతే ఇలా రావాల్సి వచ్చింది. ఎప్పుడైతే అంతా సెట్ అవుతుందో థియేటర్‌లోకి వచ్చేందుకు రెడీగా చాలా సినిమాలు ఉన్నాయి.


నేను ఏదో సినిమా డబ్బింగ్ పనుల్లో ఉన్నప్పుడు శివ ఫోన్ చేశారు. ఓ కథను చెప్పాలని అన్నారు. అప్పటికే మజిలీ సూపర్ హిట్ అయి ఉంది. మళ్లీ అలాంటి కథే చెబుతారేమో అనుకున్నాను. ఆ జానర్ అయితే వద్దని చెబుదామని అనుకున్నాను. ఇలా ఫోన్‌లో నో చెప్పడం ఎందుకు.. నేరుగా చెబుదామని అనుకున్నాను. అప్పటికీ కథ అంతా కూడా పూర్తి కాలేదు. కానీ ఓపెనింగ్ లైన్ చెప్పాడు. భూదేవీపురం, భూమి తగాదాలు అని చెప్పారు.  నాజర్ లాంటి పెద్ద మనిషి వాయిస్ వినిపిస్తుంది.. అరేయ్ జగదీ.. మగవాడు ఏడవకూడదు.. అమ్మాయిలను ఏడిపించకూడదు అని చెబుతాడు. అలా చెప్పడంతోనే కనెక్ట్ అయిపోయాను. ఇంత వరకు సంబంధం లేని జానర్‌ను టచ్ చేయబోతోన్నాడని తెలిసింది. శివ నిర్వాణ ఎమోషన్‌ను బాగా హ్యాండిల్ చేయగలరు. అలాంటి వారు ఫ్యామిలీ సినిమాలను ఇంకా బాగా చేయగలరు. ఇలాంటి సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. దానికి శివ నిర్వాణ దర్శకుడు అవ్వడం ఇంకా హ్యాపీ.


ఈ సినిమా అనుకున్నప్పుడు టైటిల్ టక్ జగదీష్ కాదు. అది క్యారెక్టర్ పేరు. ఇందులో ప్రతీ ఒక్క పాత్రకు మంచి మంచి క్యారెక్టర్ పేర్లు ఇచ్చారు. శివ నిర్వాణలో నాకు అదే నచ్చుతుంది. ఆయన చూసిన, తెలిసిన ఫ్యామిలీ మెంబర్ల పేర్లు పెడతాడు.  అందుకే అవి రియలిస్టిక్‌గా ఉంటాయి. అదే పెద్ద బలం. అలా నాకు జగదీష్ అని పెట్టారు. అయితే  దానికి టక్ అని ముందు పెట్టారు. అతను టక్ ఎందుకు వేసుకుంటాడు అనేది ద్వితీయార్థంలో రివీల్ చేస్తారు. అది శివ ఎంతో అద్బుతంగా రాశారు. ఆ సీన్‌కు ఎంతో మంది కనెక్ట్ అవుతారు.


ఫ్యామిలీ డ్రామాలో ఉన్న కాంప్లెక్సిటీని ముందు శివ నిర్వాణ చెప్పారు. నేను దాన్ని ట్విస్ట్‌గా అనుకోవడం లేదు. మర్డర్ మిస్టరీలో ఉండే ట్విస్టులు కావు. మనం ఓ వ్యక్తిని ఒకలా అనుకుంటాం. కానీ అతను అలాంటివాడు కాదని తెలుస్తుంది. దాన్ని కథలో అందంగా తీసుకొచ్చారు శివ నిర్వాణ.


రీతూ వర్మ ఏమో లవ్ ఇంట్రెస్ట్. ఫ్యామిలీ ఎమోషన్స్‌తో ఉన్న సినిమాలో రీతూ వర్మ ఓ రిలాక్స్‌లా అనిపిస్తుంది. ఈ కథ, డ్రామాకు ఆయువుపట్టు ఐశ్వర్య రాజ్ పాత్ర. చంద్రమ్మ పాత్రలో ఐశ్వర్య కనిపిస్తారు. చంద్రమ్మ కోసం టక్ ఎంత దూరం వెళ్తాడన్నదే కథ.


ఫ్యామిలీలో ఉండే అన్ని ఎమోషన్స్ ఇందులో ఉంటాయి. కానీ ఈసినిమాకు ముందుండే రెండు ఎమోషనల్ క్యారెక్టర్స్ అన్నదమ్ములు. బోసు,  జగదీష్ మధ్య ఉండే సంఘర్షణను శివ నిర్వాణ ఎంతో అద్భుతంగా హ్యాండిల్ చేసేశారు. హీరో ఎంత తపన పడతాడో అనే యాంగిల్‌లోనే తెలుగు సినిమాలుంటాయి. కానీ హీరో నాన్న యాంగిల్‌లోంచి చూడరు. కానీ శివ నిర్వాణ సినిమాలో ప్రతీ క్యారెక్టర్‌లోకి వెళ్తారు. అందువల్లే ప్రతీ పాత్ర హైలెట్ అవుతుంది.


ఎంటర్టైన్మెంట్ అంటే మనల్ని ఎంగేజ్ చేయడం. అంతే కానీ కేవలం కామెడీనే కాదు. రెండున్నర గంటలు మీరు సినిమాను చూసి.. దాంట్లోనే ఇన్వాల్వ్ అయి బయటకు వచ్చారనుకోండి. అది ఎంటర్టైన్మెంట్. నటుడిగా అన్ని రకాల సినిమాలు, పాత్రలు చేయాలి. నటుడు అంటే ఏంట్రా.. వాళ్లు ఏడిస్తే మనం ఏడవాలి..వాళ్లు నవ్వితే  మనం నవ్వాలి అనే మాటలు చిన్నతనంలో విన్నాను. అది అలా నాటుకుపోయింది. పిల్ల జమీందార్, భలే భలే మగాడివోయ్ వంటి సినిమాల్లో ఎప్పుడూ మిస్ అవ్వలేదు. అంటే సుందరానికీ అనే సినిమాలో సీటులో ఎవ్వరూ కూర్చుండలేరు. వస్తే అలాంటి సినిమాతో రావాలి. నవ్వించిన సినిమాలు, ఏడిపించిన సినిమాలున్నాయి. కంప్లీట్ యాక్టర్ అన్న ఫీలింగ్ వస్తుంది. అన్ని రకాల సినిమాలు చేయాలి.. నన్ను నేను పరీక్షించుకోవాలి. చాలెంజింగ్ ఉన్న పాత్ర ఇస్తేనే నాకు కథకు ఓకే చెప్పాలనిపిస్తుంది. శ్యాం సింఘరాయ్ అద్భుతంగా ఉండబోతోంది. ఇకపై కొత్త నానిని చూస్తారు. అంటే సుందరానికీ ఫస్ట్ లుక్ చూస్తేనే షాక్ అవుతారు.


హిట్లు, సక్సెస్ వెంటపడుతూ.. మంచి మార్కెట్ ఉన్న హీరోగా ఉండాలా? మంచి నటుడిగా ఉండాలా? అనే దాన్ని బట్టి కథల ఎంపిక ఉంటుంది. అందుకే ఒకే రకమైన పాత్రలను చేయాలని అనుకోలేదు. వీ, టక్ జగదీష్ వంటి సినిమాలు చేశాను. కాబట్టి అందుకే అంటే సుందరానికి అనే ప్రేమ కథను చేస్తున్నాను.


సూపర్ సక్సెస్ అవుతుందని తెలిసి కూడా వదిలేసిన సినిమాలున్నాయి. అందులో రాజా రాణి ఒకటి. నేను అట్లీని ఇంట్రడ్యూస్ చేయాల్సింది. కానీ అప్పుడు నేను పైసా, ఎటో వెళ్లిపోయింది మనసు చేస్తున్నాను. నాకోసం ఏడాది ఆగడం మంచిది కాదు అని నిర్మాతలకు చెప్పాను. ఈ సినిమా సూపర్ సక్సెస్ అవుతుందని, పెద్ద దర్శకుడు అవుతాడని కూడా చెప్పాను. అలానే అయింది. ఇక ఎఫ్ 2 కథ సైతం విన్న వెంటనే బ్లాక్ బస్టర్ అని చెప్పాను. నా కోసం అనిల్, దిల్ రాజు గారు నాతో అనుకున్నారు.  కానీ అది నా స్పేస్ కాదని అనుకున్నాను.


ఎంసీఏ లాంటి సినిమాలకు రివ్యూలు, మౌత్ టాక్ బాగా లేవు. కానీ కలెక్షన్లు మాత్రం బాగున్నాయి. అది సూపర్ హిట్ అంటున్నారు. కానీ V సినిమాకు మంచి రివ్యూలు రాలేదు. కానీ అమెజాన్ వారు మాత్రం మంచి రియాక్షన్ ఇచ్చారు. అమ్మిన రాజు గారు హ్యాపీగా ఉన్నారు. కొన్న అమెజాన్ వారు హ్యాపీగా ఉన్నారు. V సినిమాను మించిన ఆఫర్ ఈ సినిమాకు ఇచ్చారు. అంటే ఆ సినిమా హిట్టు అయినట్టే కదా? ఆ విషయం చెప్పడానికి  నా దగ్గర సరైన వివరణ గానీ, కలెక్షన్ల లెక్కలు కానీ లేవు.


నాకు రీమేక్స్ సరిపోవు. రీమేక్స్ చేయాలనే ఉద్దేశ్యం నాకు లేదు. కెరీర్ ప్రారంభంలో  చేశాను. భీమిలి కబడ్డీ జట్టు, ఆహా కళ్యాణం చేశాను. ఇప్పటికీ భీమిలీ కబడ్డీ జట్టు సినిమాకు అభిమానులున్నారు. కానీ ఆహా కళ్యాణం అంతగా ఆడలేదు. రీమేక్స్ చేయకూడదని ఫిక్స్ అయ్యాను. నాలో ఉందని నాకే తెలియందని, మీకు కొత్తగా చూపించాలనే ఆలోచనలకు రీమేక్ సరిపోవు. మనం సినిమాలు చేద్దాం. మన సినిమాలను వాళ్లు రీమేక్ చేసేలా చేద్దాం. ఇప్పుడు నా ఆరు సినిమాలో ఇతర భాషల్లో రీమేక్ అవుతున్నాయి.


టక్ జగదీష్ సినిమా తెలుగు ప్రేక్షకుల కథ. తెలుగు కుటుంబాలకు సంబంధించిన కథ. ఇది రీమేక్ అయ్యే చాన్స్ లేదు. ఇది తెలుగు సినిమా మాత్రమే. అమెజాన్‌లో ఈ  సినిమాను సబ్ టైటిల్స్‌లో ఇతర భాషల వారు చూసి.. బాగుందని అంటే చాలు.


సబ్ టైటిల్స్ చూసి సినిమాలను చూసేస్తున్నారు. నాక్కూడా అది అలవాటు అయింది. ఇప్పుడు మనీ హీస్ట్ సిరీస్ ఉంది. దాన్ని వేరే భాషలో తీశారు. కానీ ఇంగ్లీష్‌లోకి డబ్ చేశారు. నాకు సబ్ టైటిల్స్ అలవాటు అయ్యాక.. ఇంగ్లీష్‌లో  చూడాలనిపించడం లేదు. స్పానిష్‌లోనే చూస్తున్నాను. ఇప్పుడు దేశంలో అందరికీ సబ్ టైటిల్స్‌తో సినిమాను చూడటం అలవాటు చేసుకుంటున్నారు. అందుకే ఇంకొన్ని రోజుల్లో ఒరిజినల్ లాంగ్వేజ్‌లోనే సబ్ టైటిల్స్‌తో సినిమాలు చూడటానికే ఇష్టపడతారు. అందుకే మంచి సినిమాను చేస్తే.. సబ్ టైటిల్స్‌తో అందరూ చూస్తారు. అందుకే  నేను ప్యాన్ ఇండియా అనే దాన్ని అంతగా నమ్మను.


నాని ఫాస్ట్‌గా సినిమాలు రెడీ చేస్తున్నాడు. ఫస్ట్ వేవ్‌లో ఒకటి, సెకండ్ వేవ్‌లో మరొకటి వచ్చాయి. మిగతా వాళ్ల సినిమాలు రెడీగా లేవు. అందుకు ఎగ్జిబిటర్లు అలా అన్నప్పుడు బాధేసింది. థియేటర్లు సెట్ అయితే.. నేను మూడు సినిమాలు ఇచ్చేందుకు రెడీగా ఉన్నాను. టక్ జగదీష్ వెళ్లిపోతోందని వారు బాధపడుతున్నారు. కానీ మీరు రెడీ అంటే.. రెండు మూడు సినిమాలు ఇచ్చేందుకు నేను కూడా రెడీగా ఉన్నాను.  పరిస్థితులు బాగా లేకపోయినా కూడా ప్యాండమిక్ సమయంలోనూ ఎంతో కష్టపడ్డాం. ఇలాంటి సమయంలోనూ ఫ్యామిలీ అంతా ఇంట్లోనే కూర్చుని చూసే మంచి సినిమా ఇస్తున్నాను. ఇక ఈ ప్యాండిమక్ సమయంలో నా సినిమాల వల్ల ఎంతో మందికి పని దొరికింది. రేపు థియేటర్లు రెడీ అవ్వగానే శ్యాం సింఘరాయ్ కూడా ఉంది. ఇంతకంటే ఏం కావాలి. ఎలా చెప్పాలి.


 ఓటీటీ అనేది ఆడియెన్స్‌ను ఎడ్యుకేట్ చేస్తుంది. తద్వారా ఇండస్ట్రీ కూడా అప్‌గ్రేడ్ అవుతుంది. సినిమాలకు మరో ఫ్లాట్ ఫాంలా ఉంటుంది. అన్ని  రకాలుగా మంచిదే. అయితే థియేటర్లు అనేది ఎప్పటికీ ఉంటుంది. థియేటర్లు మూతపడతాయి అని అనుకునేవాళ్లకు వాటి గొప్పదనం తెలియదన్నట్టే. థియేటర్లను కొట్టే  ఆప్షన్ ప్రపంచంలో లేదు.


ఇంటర్వెల్ కార్డ్ పడటం లేదని చాలా బాధపడ్డాను. అమెజాన్ వాళ్లు అలా వేయరు అని తెలుసు. అయితే ట్విట్టర్‌లో షేర్ చేస్తాను. ఆ ఫ్రేమ్ ఇంటర్వెల్ అని చెప్పేందుకు పోస్ట్ చేస్తాను. అమెజాన్ వారు ఇంటర్వెల్ ఇవ్వకపోయినా నేను ఇస్తాను.


HIT సీక్వెల్ అద్భుతంగా ఉండబోతోంది. మొదటి పార్ట్ కంటే సూపర్‌గా ఉంటుంది. అడివి శేష్‌తో చేస్తున్నాం. దాదాపుగా డెబ్బై శాతం షూటింగ్ అయింది. ఇక మూడో  పార్ట్ అంతకు మించి అనేలా ఉంటుంది. మీట్ క్యూట్ కూడా స్పెషల్‌గా ఉండబోతుంది.  దానికి మా అక్క దర్శకురాలు. చిన్నప్పటి నుంచి తిరిగిన, చూసిన మా అక్కలో ఇంత టాలెంట్ ఉందా? అని షాక్ అయ్యాను. మీట్ క్యూట్‌తో అక్క నన్ను మరిచిపోయేలా చేస్తుంది.


అంటే సుందరానీకి సినిమా ఇచ్చే సౌండ్ మామూలుగా ఉండదు. పరిస్థితులు చక్కబడితే శ్యాం సింఘరాయ్‌ను రెడీ చేస్తాను.


 సీటీమార్, తలైవి అద్భుతంగా విజయం సాధించాలి. అందరూ అన్ని జాగ్రత్తలు తీసుకుని థియేటర్లకు వెళ్లి సినిమాలు చూడండి. అలాగే టక్ జగదీష్ చిత్రాన్ని కూడా చూడండి.



Arun Vijay, Hari, Drumsticks Productions Enugu First Look Out

 Arun Vijay, Hari, Drumsticks Productions Enugu First Look Out



Director Hari of Singham fame who is known for making mass and racy commercial entertainers has collaborated with Arun Vijay for the first time for a Tamil-Telugu bilingual film titled Enugu. Produced by Vedikkaaranpatti S Sakthivel under Drumsticks Productions, the film stars Priya Bhavani Shankar playing female lead opposite Arun Vijay.


Billed to be a racy action entertainer, the first look poster of Enugu is unveiled, on the auspicious occasion of Vinayaka Chaturthi. The title and first look poster of the movie is unleashed by 33 celebrities, making it a very special occasion.


The poster sees Arun Vijay in white shirt carrying Ganesh idol. However, he looks intense and manly here, as he gazes seriously. He sports handlebar mustache. Known as a fitness freak, Arun Vijay will be playing an action-packed role in the movie. A perfect Vinayaka Chaturthi poster indeed it is from the makers of Enugu.


Currently, shooting of Enugu is underway. The film also boasts a stellar cast - Yogi Babu, Samuthirakani, Radika Sarathkumar, Rajesh, KGF Ramachandra Raju, Ammu Abirami, Bose Venkat, Sanjeev, Thalaivasal Vijay, Imaan Annachi, Adukalam Jayabalan, Gangai Amaran, Aishwarya and Rama.


The film will also have some popular technicians handling different crafts. GV Prakash Kumar renders soundtracks, while Gopinath is the cinematographer and Anthony is the editor.


Cast: Arun Vijay, Priya Bhavani Shankar, Yogi Babu, Samuthirakani, Radika Sarathkumar, Rajesh, KGF Ramachandra Raju, Ammu Abirami, Bose Venkat, Sanjeev, Thalaivasal Vijay, Imaan Annachi, Adukalam Jayabalan, Gangai Amaran, Aishwarya and Rama.


Technical Crew:

Director: Hari

Producer: Vedikkaaranpatti S Sakthivel

Banner: Drumsticks Productions

CEO: G.Arunkumar

Music: GV Prakash Kumar

DOP: Gopinath

Editor: Anthony

Production Executive 1: MS Murugaraj

Production Executive 2: Chinna R Rajendran

Lyrics: Snehan

PRO: Vamsi-Shekar

Street Light Releasing in Telugu and Hindi languages

 *తెలుగు, హిందీ  భాషల్లో  థియేటర్స్ లలో  విడుదలకు సన్నాహాలు చేసుకొంటున్న  "స్ట్రీట్ లైట్".* 



మూవీ మాక్స్ బ్యానర్ పై తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, కావ్య రెడ్డి, సీనియర్ హీరో వినోద్ కుమార్ నటీనటులుగా విశ్వ దర్శకత్వంలో ప్రముఖ నిర్మాత & డిస్ట్రిబ్యూటర్ శ్రీ మామిడాల శ్రీనివాస్ నిర్మించిన చిత్రం "స్ట్రీట్ లైట్". అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఈ నెల మూడవ వారంలో చిత్రం విడుదల సన్నాహాలు చేసుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో  ప్రి రిలీజ్ ఈవెంట్ ను సినీ ప్రముఖులు సమక్షంలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా వచ్చిన


 *నటుడు వినోద్ కుమార్ మాట్లాడుతూ..* నేను చేసిన మొదటి చిత్రం మౌన పోరాటంలో నేనే హీరో,నేనే విలన్ ఇన్ని రోజుల తరువాత మళ్ళి ఇప్పుడు అటువంటి మంచి షెడ్ ఉన్న క్యారెక్టర్ ఈ సినిమాతో లభించింది. స్ట్రీట్ లైట్ సినిమా చాలా హాట్ థ్రిల్లర్ గా తెరకెక్కింది.క్రైమ్, లవ్, రొమాన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎమోషన్స్ తో తెరకేక్కించిన మెసెజ్ ఓరియెంటెడ్ సినిమా ఇది. పగలంతా ఎంతో పెద్దమనుషులుగా చలామణి అయ్యే చాలా మంది రాత్రి అయ్యేసరికి .. క్రిమినల్ థాట్స్, సెక్సువల్ పర్వర్షన్ ఎలా మారతాయి.వారు  ఏ విధంగా తమ క్రైమ్ లైఫ్ ని ఎంజాయ్ చేస్తూ అమాయకుల జీవితాలతో ఆటలాడు కుంటున్నారో అందులో ఒక యువతికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడం ‘రివెంజ్ డ్రామా’ ను ఆద్యంతం సస్పెన్స్ సడలకుండా ఒకే ప్లేస్ లో ఒకే స్ట్రీట్ లైట్ కింద ఎం జరిగింది అనేది దర్శకుడు చాలా చక్కగా తీశాడు

తీర్చి దిద్దారు దర్శకుడు.గత 35 సంవత్సరాలుగా నేను మౌన పోరాటం నుండీ ఇప్పటివరకూ నేను 150 సినిమాలలో నటించడం జరిగింది. మళ్ళి ఇప్పుడు బుల్లెట్ సత్యం సినిమాతో మళ్ళి సినిమాలు చేస్తున్నాను. చాలా రోజుల తరువాత నేను చేస్తున్న మంచి సినిమా ఇది.ఇలాంటి మంచి సినిమాలో నటించె ఆ అవకాశం కల్పించిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు అన్నారు. 


 *చిత్ర నిర్మాత మామిడాల శ్రీనివాస్ మాట్లాడుతూ..* సినిమా చాలా బాగా వచ్చింది. మాకు ఓటిటి నుండి చాలా ఆఫర్స్ వచ్చాయి.సేవ్ థియేటర్స్ అనే కాన్సెప్ట్ తో థియేటర్స్ సేవ్ చేయాలని ఓటిటి లో కాకుండా థియేటర్స్ లో ఈ నెల విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము. తెలుగు, హిందీ రెండు బాషల్లో విడుదల చేస్తున్నాము.హిందీ లో స్ట్రెయిట్ సినిమా గా సెన్సార్ వచ్చింది. సెన్సార్ వారు ఈ సినిమా చూసి ఇది చాలా గ్లామర్  సినిమా అని మెచ్చుకొని ఒక్క కట్ కూడా చేయకుండా సెన్సార్ ఇచ్చారు.ఇది మా సక్సెస్ కు మొదటి మెట్టు..ఈ సినిమా స్ట్రీట్ లైట్ కింద చీకట్లో జరిగే సంఘటనలతో దర్శకుడు ఈ సినిమా అద్భుతంగా తెర కెక్కించారు.అందరూ ఈ సినిమా బూతు సినిమా అనుకుంటున్నారు. కానీ ఈ సినిమా లో ఆన్ని రకాల షేడ్స్ కలిగిన ఈ సినిమా ద్వారా మంచి మెసేజ్ ఉన్న ఈ సినిమాను ఫ్యామిలీ అందరూ కలసి చూడవలసిన సినిమా ఇది. ప్రేక్షకులందరూ మా సినిమాను ఆదరించాలని అన్నారు.


 *నిర్మాత ప్రసన్న కుమార్ . మాట్లాడుతూ* ..డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ఎన్నో సినిమాలు తీసిన మామిడాల శ్రీనివాస్ నితిన్ తో "మారో" అనే సినిమా చేశాడు. అలాగే డిజిటల్ రంగంలో అందరికి మేలు జరిగేలా మంచి పనుల చేశాడు. దర్శకుడు ఈ సినిమాను చాలా కాంపాక్ట్ గా తీశాడు. సత్యజిత్ రే ఇనిస్టిట్యూట్ నుండి వచ్చిన రవి కుమార్ గారు ఈ సినిమాకు అద్భుతమైన డి.ఒ.పీ ఇచ్చాడు..ఇందులో అందరూ కూడా  డెడికేటెడ్ గా వర్క్ చేశారు. అన్ని ఎమోషన్స్ తో కూడుకున్న "స్ట్రీట్ లైట్" సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ఆడియన్స్ ఎం కావాలో తెలిసిన తను అన్ని భాషలకు పనికొచ్చే విధంగా తీసిన ఈ స్ట్రీట్ లైట్ సినిమా  మామిడాల కు గొప్ప విజయం సాధించాలని అన్నారు.. 


 *ప్రముఖ నిర్మాత బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ..* వినోద్ కుమార్ గారికీ  కొడి రామకృష్ణ గారు అనేక హిట్ సినిమాలు ఇచ్చాడు. మళ్ళి ఈ సినిమాతో వినోద్ గారు రీ ఎంట్రీ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు ఆయన ఎన్నో హిట్ సినిమాలు చేశాడు.ఈ సినిమా ట్రైలర్ చాలా బాగుంది. నిర్మాత మామిడాల శ్రీనివాస్ డిస్ట్రిబ్యూటర్ గా ఎగ్జిబ్యూటర్ గా నిర్మాతగా ప్రేక్షకులకు ఎం కావాలో అన్ని తెలిసిన వ్యక్తి తను కాబట్టి అన్ని ఎమోషన్స్ కలిపి తీసిన. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అవ్వాలి అని కోరుకొంటున్నానని అన్నారు. 


 *చిత్ర దర్శకుడు విశ్వప్రసాద్ మాట్లాడుతూ* ..నిర్మాతకు స్ట్రీట్ లైట్ కాన్సెప్ట్ చెప్పినపుడు మేమంతా స్ట్రీట్ లైట్ కింద ఉన్న చిన్న ప్లేస్ లో 2 గంటల సినిమాను కాంపాక్ట్ గా ఎలా తీయాలి అని డిస్కషన్ చేసుకుని స్టార్ట్ చేశాము.ఆ స్ట్రీట్ లైట్ కు రెండు కళ్ళు వినోద్ కుమార్,తాన్యా దేశాయ్ అయితే.ఆ కళ్ళ ను తెరిపించిన వారు డిఒపీ రవికుమార్ గారు ఈ కళ్ళు మరియు సినిమా అంతటినీ మ్యానేజ్ చేసి ఒకే ఒక వ్యక్తి మామిడాల శ్రీనివాస్ గారు . వీరందరి సహాయంతో రెండు గంటల సినిమాను 100 మీటర్ల  స్థలం లో తీయగలిగి సక్సెస్ చేయడంలో భాగంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న మా స్ట్రీట్ లైట్ సినిమాను మీరందరూ ఆదరించాలి. ముందు ఈ సినిమాను ఓటిటి కు విడుదల చేయాలి అనుకున్నాం కానీ థియేటర్స్ బాగుండాలనే ఉద్దేశ్యంతో థియేటర్స్ లో విడుదల చేస్తున్నాము అన్నారు.


 *నిర్మాత రామసత్యనారాయణ మాట్లాడుతూ..* మా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ తీస్తున్న స్ట్రీట్ లైట్ సినిమా గొప్ప విజయం సాధించాలని అన్నారు.


 *బాలాజీ నాగలింగం మాట్లాడుతూ..* సీతారత్నం గారి అబ్బాయి తో సూపర్ డూపర్ ఇచ్చినపుడు ఆయానతో  జర్నీ చెశాను.నా మిత్రుడు మామిడాల శ్రీనివాస్ మంచి కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న స్ట్రీట్ లైట్  సినిమా బిగ్ హిట్ అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


 **హీరోయిన్ తాన్యా దేషాయ్ మాట్లాడుతూ* .. ఇది నా మొదటి సినిమా అందరూ చాలా కో ఆపరేట్ చేశారు.నాకు ఇలాంటి మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన దర్శక,నిర్మాత లకు ధన్యవాదాలు..



ఇంకా ఈ కార్యక్రమంలో డిఒపి రవికుమార్ తదితరులు చిత్రం గొప్ప విజయం సాదించాలని అన్నారు


 *నటీనటులు** :

తాన్య దేశాయ్, అంకిత్ రాజ్, సీనియర్ హీరో వినోద్ కుమార్ , చిత్రం శ్రీను, ధన్రాజ్, షకలక శంకర్, ఈశ్వర్, కావ్య రెడ్డి, వైభవ్, కొండా బాబు, సాయి కీర్తన , Dr. పరమహంస, పవిత్ర బాలాజీ నాగలింగం తదితరులు నటించారు. 


*సాంకేతిక నిపుణులు* 

దర్శకత్వం : విశ్వ

నిర్మాత: మామిడాల శ్రీనివాస్

సినిమాటోగ్రఫీ : రవి కుమార్,

మ్యూజిక్ : విరించి,

ఎడిటర్ : శివ,

ఆర్ట్ : ఎస్ శ్రీనివాస్,

ఫైట్స్ : నిఖిల్,

కొరియోగ్రాఫి : పాల్ మాస్టర్,

స్టూడియో : యుఅండ్ఐ.

పిఆర్ ఓ : మధు వి.ఆర్

Pawan Kalyan - Harish Shankar - Mythri Movie Makers project titled as 'Bhavadeeyudu Bhagat Singh'.

 



Bhavadeeyudu Bhagat Singh"

The blockbuster combination of Pawan Kalyan and Harish Shankar reunites. 

 A prestigious project by Mythri Movie Makers.

 "Bhavadeeyudu Bhagat Singh" - an indelible signature on the silver screen.


Pawan Kalyan - Harish Shankar - Mythri Movie Makers project titled as 'Bhavadeeyudu Bhagat Singh'. 


The expectations are always sky high when a successful combo of an actor and director reunite for a project. 'Bhavadeeyudu Bhagat Singh' will exactly meet those expectations with leading actor Pawan Kalyan joining hands with blockbuster young director Harish Shankar under the production of the popular Mythri Movie Makers. The makers have officially announced the title today at 9:45 AM with a striking poster.


A closer look at the poster of 'Bhavadeeyudu Bhagat Singh' and you would see hero Pawan Kalyan in jeans and jerkin stylishly seated on a fancy vehicle with a tea glass in one hand and a speaker in the other. While "Bhavadeeyudu" hints about humility and humbleness, "Bhagat Singh" inspires by being a personification of revolution. What are the intentions of the director by uniting both these worlds? If this movie is a letter and the sign-off is "Bhavadeeyudu Bhagat Singh", what the letter holds and what it intends to tell is a topic of intrigue. Is it certain that the movie will mention about socially relevant issues? It totally seems the film is packed with great script, screenplay, conflicts and some brilliant dialogues. All said and done, "Bhavadeeyudu Bhagat Singh" will surely be an indelible signature on the silver screen.


These apart, popular music director Devi Sri Prasad's music is sure to win the hearts of fans and audience alike. The movie is packed with not just these but many more attractions. The makers would reveal these when the occasion seems fit. With a dynamite like title for a dynamite like actor, the makers have increased the expectations multifolds. The line on the posters - "This time it's not just entertainment" will to be well and truly justified in "Bhavadeeyudu Bhagat Singh". Producers Naveen Yerneni and Y. Ravishankar have clarified that this movie is a prestigious project for their banner and would start it's shoot soon. 


The other crew handpicked for this project are Ayananka Bose as the cinematographer, Anand Sai as the art director, Chota K Prasad as the editor and Ram-Laxman as the action choreographers.

Chaitanya Vamsi Hemanth’s Multi-Lingual Film Range Launched

 Gemini Presents, Yashwitha Entertainments, Chaitanya Vamsi, Hemanth’s Multi-Lingual Film Range Launched



Gemini Production is planning to make some engaging and content-based films with an intention of encouraging young talent and also to offer new content to cine goers. They have announced their new production and will soon announce bunch of their future ventures.


Young hero Chaitanya Vamsi plays the lead role in the different action entertainer Range which is being made as a multi-lingual project in Telugu, Tamil, Malayalam and Kannada languages.


While Gemini presents the film, Gudala Naveen will produce it on Yashwitha Entertainments banner. Debutant Hemanth will direct the movie which has been launched today with a formal pooja ceremony. Gemini CEO Pvr Moorthy has sounded the clapboard for the muhurtham shot.


The makers have also released first look poster of Range. Bloodied Chaitanya Vamsi appears in an action avatar with a chain saw in his hand in a forest and the tress are burnt to ashes. While the title Range sounds interesting, the poster assures it is going to be a high-intense action entertainer.


Shakthikanth Karthick scores music for the film, while Lakshmikanth Kanike B.FA handles the cinematography. Goutham Raju is the editor. The film’s shoot commences from November end. It will feature some noted actors in vital roles.


Cast: Chaitanya Vamsi


Technical Crew:

Director: Hemanth

Presents: Gemini

Banner: Yashwitha Entertainments

Producer: Gudala Naveen

Music: Shakthikanth Karthick

Dop: Lakshmikanth Kanike B.FA

Executive producer: Ramesh mahankudo

Line producer: Vikram vilasagaram

Editor: Goutham raju

Pro: Vamsi-Shekar