Latest Post

Hero Satya Dev Interview About Timmarusu

 నా కంఫర్ట్ జోన‌ర్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి డిఫ‌రెంట్‌గా నేను చేసిన సినిమా `తిమ్మ‌రుసు` - హీరో స‌త్య‌దేవ్‌




స‌త్య‌దేవ్‌... ప్ర‌తి సినిమా ఓ డిఫ‌రెంట్‌గా చేస్తూ విల‌క్ష‌ణ‌మైన పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుంటోన్న క‌థానాయ‌కుడు. పాత్ర ఏదైనా అందులో ఒదిగి పోయే నేటి త‌రం అతి కొద్ది మంది న‌టుల్లో స‌త్య‌దేవ్ ఒక‌రు. బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌లో మోసాలు చేసేవాడిగా, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌లో విలేజ్ కుర్రాడిగా మెప్పించిన స‌త్య‌దేవ్ ఇప్పుడు అన్యాయాల‌ను ప్ర‌శ్నించే లాయ‌ర్ ‘తిమ్మరుసు’గా కనిపించబోతున్నారు. జూలై 30న విడుదల కాబోతున్న ఈ సినిమా గురించి ఆయ‌న మాట్లాడుతూ ...



- `ఉమామహేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య‌` సినిమా అనేది న్యూ ఏజ్ మూవీ కోరుకునే ప్రేక్ష‌కులు చూసేలా చేశాం. ఆ  సినిమా త‌ర్వాత నేను నా కంఫ‌ర్ట్ జోన్ నుంచి(అంటే సాధార‌ణంగా నేను ఫైట్స్‌లాంటివి చేయ‌ను) బ‌య‌ట‌కు వ‌చ్చి, చిన్న మేకోవ‌ర్‌తో ఓ సినిమా చేయాల‌నుకున్నాను. నాకు కూడా డిఫ‌రెంట్‌గా ఉంటుంది క‌దా అని అనిపించింది. అదే స‌మ‌యంలో నిర్మాత‌ల్లో ఒక‌రైన సృజ‌న్ ఎర‌బోలు ట‌చ్‌లోకి వ‌చ్చాడు. త‌ర్వాత శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, నేను.. ప్రాప‌ర్ ఎగ్జిక్యూష‌న్ కోసం మ‌హేశ్ కోనేరు కూడా యాడ్ కావ‌డం.. ఇలా అంద‌రం క‌లిసి ఓ టీమ్ ఏర్పాటైంది. కోవిడ్ టైమ్‌లో శ‌ర‌ణ్ 39 రోజుల్లో పూర్తి చేశారు. సింగిల్ షెడ్యూల్లో సినిమాను పూర్తి చేయ‌డానికి న‌టీన‌టులు, ఇత‌ర టీమ్‌, శ‌రణ్ అండ్ టీమ్ ఎంత క‌ష్ట‌ప‌డిందో, అంతే క‌ష్టాన్ని ప్రొడ‌క్ష‌న్ టీమ్ కూడా ఫేస్ చేసింది. ఇంత త‌క్కువ టైమ్‌లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో సినిమాను పూర్తి చేసిన మ‌హేశ్ కోనేరు, సృజ‌న్‌ల‌కు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. అలా ఓ చిన్న ఐడియాతో స్టార్ట్ అయిన ఈ సినిమా జూలై 30న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. 


- సాధార‌ణంగా థ్రిల్ల‌ర్ యాక్ష‌న్ సినిమా అంటే పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో ఎక్కువ‌గా ఉంటాయి. లాయ‌ర్ కోణం నుంచి సాగే థ్రిల్ల‌రే ఈ చిత్రం. ఉన్న డ‌బ్బుని కూడా ఖ‌ర్చు పెట్టి న్యాయం వైపు నిల‌బ‌డే లాయ‌ర్ సినిమా ఇది. ఇందులో కోర్ట్ రూమ్ డ్రామా ఉంటుంది. దీంతో పాటు యాక్ష‌న్ పార్ట్ కూడా ఎక్కువ‌గా ఉంటుంది. ఈ మ‌ధ్య కాలంలో వ‌కీల్‌సాబ్‌, నాంది వంటి కోర్ట్ రూమ్ డ్రామా చిత్రాలు బాగా ఆడాయి.. కాబ‌ట్టి మేం కూడా చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. 


- నా పాత్ర `అభిలాష‌`లో చిరంజీవిగారిలా ఉంటుంది. ఆ క‌థ‌కు దీనికి చాలా డిఫ‌రెన్స్ ఉంటుంది. అభిలాష చిత్రంలో చిరంజీవిగారు ఉరిశిక్ష ర‌ద్దు కోసం పోరాడితే, ఇందులో నా పాత్ర, యావ‌జ్జీవ కారాశిక్ష అనే పాయింట్‌పై ఫైట్ చేస్తుంది. న్యాయం కోసం ఎందాకైనా పోరాడే ఓ లాయ‌ర్ ఓ కేసులో చివ‌రి వ‌ర‌కు ఎలా నిల‌బ‌డ్డాడు. దానిలో ట్విస్టులు, ట‌ర్న్స్ ఏంటి? అనేదే తిమ్మ‌రుసు సినిమా. సినిమా ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో టేకాఫ్ అవుతుంది. క్ర‌మంగా సీరియ‌స్ మోడ్‌లోకి క‌థ ర‌న్ అవుతుంది. అన్ని ఎలిమెంట్స్  సినిమాలో ఉంటాయి. 


- ఓ ప‌ర్టికుల‌ర్ కోర్ట్ సెక్ష‌న్ వ‌ల్ల సామాన్యుడు అందులో ఇరుక్కుంటాడు. సామాన్యుడికి న్యాయం జ‌ర‌గాల‌నుకునే ఓ లాయ‌ర్ దాన్ని టేక‌ప్ చేసి దాన్నెలా ప‌రిష్క‌రించాడు. ఆ క్ర‌మంలో త‌నెలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొన్నాడ‌నేదే సినిమా. 


-  ఈ పాండమిక్ టైమ్‌లో ఓ సినిమా డైరెక్ట్ ఓటీటీ రిలీజ్‌, మ‌రో సినిమా థియేట‌ర్స్‌లో రిలీజ్ అవుతున్న హీరో నేను. అయితే ప‌రిస్థితుల‌ను ముందుగా ఊహించింది మాత్రం కాదు. ఓటీటీల హ‌వా 2023, థియేట‌ర్స్‌తో పాటు స్టార్ట్ అవుతుంద‌ని అనుకున్నాను. అయితే కోవిడ్ వ‌ల్ల ఓటీటీ వేల్యూ పెరిగిపోయింది. నిర్మాత‌లు నా ఉమామ‌హేశ్వ‌ర ఉగ్రరూప‌స్య స‌హా కొన్ని సినిమాలు ఓటీటీలో విడుద‌ల‌య్యాయి. ఒక‌ట్రెండు రోజులు సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల కాలేద‌నే బాధ ఉండింది. అయితే దాని వ‌ల్ల నిర్మాత‌లు లాభ‌ప‌డ్డారు. వాళ్లు హ్యాపీగా ఉన్నారు. ఇప్పుడు ప‌రిస్థితులు చూస్తే, కోవిడ్ ప్ర‌భావం త‌గ్గింది. తొలి వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన తెలుగు సినిమాల‌న్నీ పెద్ద హిట్స్ సాధించాయి. ప్ర‌పంచంలో మ‌రో సినీ ప‌రిశ్ర‌మ‌లో ఇది జ‌ర‌గ‌లేదు. అదే కాన్ఫిడెన్స్‌తో, మ‌న తెలుగు ప్రేక్ష‌కులు ఎంక‌రేజ్ చేస్తార‌నే ఉద్దేశంతో వెయిట్ చేసి సినిమాను థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాం. 


- కోవిడ్ స‌మ‌యంలో మాస్కులు పెట్టుకోవ‌డం, సామాజిక దూరం పాటించ‌డం వంటి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఐదు సినిమాల‌ను కంప్లీట్ చేశాను. అంటే రెండు వంద‌ల రోజులు ప‌ని చేశాను. ఇలాంటి పరిస్థితుల్లో సినిమాల్లో యాక్ట్ చేయాలా వ‌ద్దా.. అనే ఆప్ష‌న్ నాకే ఉంది క‌దా. నేను చేయ‌గ‌లిగాను. థియేట‌ర్స్ కూడా అంతే. నాని అన్న చెప్పిన‌ట్లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటే సేఫ్‌గానే ఉంటాయి. అయితే థియేట‌ర్స్‌కు రావాలా, వ‌ద్దా? అనే ఆప్ష‌న్‌ను ఆడియెన్‌కు వ‌దిలేద్దాం. పెద్ద సినిమాలు థియేట‌ర్స్ విడుద‌ల‌కు వెయిట్ చేస్తుంటే మేం ఎందుకు ముందుకొస్తున్నామ‌ని అడిగితే లాజిక్స్ లేవు. ఇప్పుడు మాకు స్పేస్ దొరికింది. మా బ‌డ్జెట్ లెక్క‌ల్లో ఇది వ‌ర్క‌వుట్ అయిపోతుంది. కొందరికీ ఇంకా ఎక్కువ స్పేస్ కావాల్సి ఉండొచ్చు. 


- ఈ జ‌ర్నీని చూసుకుంటే బాగానే ఉంది. సినిమాపై ఉన్న పిచ్చి ప్రేమ ఎప్పుడూ త‌గ్గ‌లేదు. అది నాలో ఉన్నంత కాలం సినిమాలు చేస్తుంటాను. ఎక్కడా మ్యాప్ వేసుకుని రాలేదు. ఇప్పుడే జ‌ర్నీ స్టార్ట్ అయ్యింది. గుర్తుందా శీతాకాలం కంప్లీట్ ల‌వ్‌స్టోరి, స్కైలాబ్ మూవీ ఓ పీరియ‌డ్ మూవీ. గాడ్స్‌..మ‌రో డిఫ‌రెంట్ మూవీ. బాలీవుడ్‌లో చేస్తున్న‌ రామ్‌సేతు, కృష్ణ‌గారు, కొర‌టాలగారు నిర్మిస్తోన్న మ‌రో సినిమా రా మూవీ.. ఇలా ప్ర‌తిదీ డిఫ‌రెంట్‌గా ఉంటుంది. ముందుగా షెడ్యూల్ ప్లాన్ చేసుకోవ‌డం వ‌ల్ల ఎక్క‌డా క్లాష్ లేదు. 


- రీమేక్స్ సినిమాలు చేయాల‌నేం ప్లాన్ చేసుకోలేదు. క‌థ‌లు బావున్నాయ‌ని చేసుకుంటూ వ‌చ్చాను. అయితే, అలా కంటిన్యూగా కుదిరాయి. అయితే మ‌ధ్య‌లో స్కైలాబ్‌, గాడ్స్‌, కొర‌టాల‌గారి సినిమాలున్నాయి. ఇప్పుడు రీమేక్స్ చేయకూడ‌ద‌ని అనుకుంటున్నాను.   


- డైరెక్ట‌ర్‌ శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, సింపుల్‌గా ఉంటాను. ఆలోచ‌న‌ను క్లారిటీతో ఎగ్జిక్యూట్ చేస్తాడు. ప్రియాంక జ‌వాల్క‌ర్ మంచి కోస్టార్‌. అలాగే బ్ర‌హ్మాజీగారి గురించి నేను ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. చాలా పాజిటివ్ ప‌ర్సన్‌. ఆయ‌న‌తో క‌లిసి సినిమాను ఎంజాయ్ చేస్తూ కంప్లీట్ చేశాం. 


- బాలీవుడ్ మూవీ రామ్‌సేతు సినిమా షూటింగ్ ప్రారంభ‌మైంది. ఆ సినిమా గురించి ఇప్పుడే చెప్ప‌లేను.

'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13

 



'Vision Cinemaas' Production 'Kirathaka' Regular Shoot Starts From August 13


Aadi SaiKumar & Payal Rajput starrer Kirathaka is being made as a big budgeted flick helmed by Director M. Veerabhadram. This Biggie will be made as a different crime thriller in 'Vision Cinemaas' banner as 'Production No:3'. Popular Industrialist Dr. Nagam Tirupathi Reddy is Producing this film. Heroine Poorna is playing the role of a powerful police officer while Dasari Arunkumar and Dev Gill will be seen in crucial roles. The title 'Kirathaka' and First Look Posters have garnered tremendous response from all quarters. Pre Production works has been completed and regular shoot of the film will kick-start from August 13th. On this occasion..

Producer Dr. Nagam Tirupathi Reddy said, " We are Producing 'Kirathaka' in our Vision Cinemas banner as Production No:3. We are making this film in the Hit combination of our Hero Aadi and Director Veerabhadram garu as a perfect crime thriller with an uncompromised approach in making with high technical standards. Regular shoot will commence from August 13. We firmly believe that 'Kirathaka' will score a big commercial success. "

Director M. Veerabhadram said, " Pre Production works have been completed. 'Kirathaka' Title and Aadi Saikumar - Payal Rajput's combination received superb response. The chemistry between them will be highly impressive.  Along with Poorna, Dasari Arunkumar and Dev Gill many famous actors are doing roles in this film. We will announce their details very soon."

Casting involves Aadi Sai Kumar & Payal Rajput as lead pair along with Poorna, Dasari Arunkumar, Dev Gill, Aravind, Mahesh, ArunBabu, Govardhan, Tarzan in other roles.

Cinematographer: Raam Reddy
Music: Suresh Bobbili
Executive Producer: Thirmal Reddy Yalla
Producer: Dr. Nagam Tirupathi Reddy
Story, Screenplay, Direction: M. Veerabhadram

2nd song "Bagundi Ee Kaalame" from ''Dear Megha'' is released

 ''డియర్ మేఘ'' చిత్రంలో సిధ్ శ్రీరామ్ పాడిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్

సాంగ్ రిలీజ్




మ్యూజికల్ హిట్ దిశగా ''డియర్ మేఘ'' అడుగులు వేస్తోంది. ఈ చిత్రంలోని

పాటలు ఒక్కొక్కటి రిలీజ్ అవుతూ ఛాట్ బస్టర్స్ అవుతున్నాయి. ఇటీవల విడుదల

'ఆమని ఉంటే పక్కన' పాట 2 మిలియన్ వ్యూస్ కు పైగా క్రాస్ చేయగా...తాజాగా

సిధ్ శ్రీరామ్ ఆలపించిన 'బాగుంది ఈ కాలమే' లిరికల్ సాంగ్ ను రిలీజ్

చేశారు. గురువారం ఉదయం 10 గంటలకు ఈ పాట లాంఛ్ అయ్యింది. గత కొన్నేళ్లుగా

సూపర్ హిట్ పాటలకు కేరాఫ్ అడ్రస్ అయ్యారు సిధ్ శ్రీరామ్. ఆయన పాడితే

మిలియన్ల వ్యూస్ గ్యారంటీ అనేంత పేరొచ్చిందీ యువ గాయకుడికి. 'బాగుంది ఈ

కాలమే' పాటను కూడా అద్భుతంగా పాడారు సిధ్ శ్రీరామ్.


ఊరికే ఇంత కాలం ఉంటున్నా...ఊపిరే ఇప్పుడొచ్చి చేరేనా..వెన్నెలే ఒంటి మీద

వాలేనా..తారలేమో కంటిలోన ఈదేనా...ఒక్కటై, చేరగా..దిక్కులే మారెనా..దూరమే

పోయెనా, వేదనే తీరెనా...బాగుంది ఈ కాలమే, బంధించి దాచెయనా..అంటూ అమేజింగ్

లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట. లిరిసిస్ట్ కృష్ణ కాంత్ ఈ పాటను

రాయగా..మ్యూజిక్ డైరెక్టర్ హరి గౌర మంచి లవ్ ఫీల్ ఉన్న ట్యూన్ చేశారు.


''డియర్ మేఘ'' చిత్రంలో మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో

హీరోయిన్స్ గా నటించారు. మనసును తాకే ప్రేమ కథగా ఈ  సినిమాను

రూపొందించారు దర్శకుడు సుశాంత్ రెడ్డి. వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్'

పతాకంపై అర్జున్ దాస్యన్ నిర్మించిన ''డియర్ మేఘ'' చిత్రం అతి త్వరలో

థియేటర్ లలో విడుదలయ్యేందుకు సిద్ధమవుతోంది.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ -

ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - పీఎస్ వర్మ, ప్రొడక్షన్ కంట్రోలర్ - నాగ

మధు, పీఆర్వో - జీఎస్కే మీడియా. నిర్మాత - అర్జున్ దాస్యన్, రచన,

దర్శకత్వం : సుశాంత్ రెడ్డి


Bhagath Singh Nagar Teaser Launched by Prakash Raj

 


*ప్రకాష్ రాజ్ చేతుల మీదుగా  విడుదలైన* 

 *"భగత్ సింగ్ నగర్" టీజర్* 

 *తనపై వేసిన ఏ.వి లో నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించినందుకు "భగత్ సింగ్ నగర్" చిత్ర  దర్శకుడిపై అసహనం వ్యక్తం చేసిన... నటుడు ప్రకాష్ రాజ్* 


 *గ్రేట్ ఇండియా మీడియా హౌస్ పతాకం పై  విదార్థ్ , ధృవిక హీరో,హీరోయిన్లుగా వాలాజా క్రాంతి దర్శకత్వంలో  వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు లు నిర్మిస్తున్న చిత్రం "భగత్ సింగ్ నగర్" . తెలుగు మరియు తమిళ  బాషలో ఏక కాలంలో చిత్రీకరించి విడుదల చేస్తున్న ఈ సినిమా టీజర్ ను హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్ లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన నటుడు ప్రకాష్ రాజ్ చిత్ర టీజర్ ను విడుదల చేశారు.ఇంకా ఈ కార్యక్రమంలో,దర్శకుడు వీరభద్రం , దర్శకుడు చిన్ని కృష్ణ, దర్శకుడు చంద్ర మహేష్ , దర్శకుడు బాబ్జి ,నువ్వు తోపురా నిర్మాత శ్రీకాంత్, బట్టల రామస్వామి నిర్మాత సతీష్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెలిదొండ వెంకటేష్ ,యూసుఫ్ గూడ ఎక్స్ కార్పొరేటర్ సంతోష్,  చిత్ర యూనిట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.* 


 *ముఖ్య అతిధిగా వచ్చిన  నటుడు ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ..* .నా 30 ఏళ్ల సినీజీవితంలో ఎంతో మంది దర్శకులు తో పని చేశాను.వీరంతా  నాలోని నటనను చెక్కి దిద్ది నాలోని ప్రతిభను బయటికి తీసుకువచ్చారు కాబట్టే నేను ఈ రోజు ఇక్కడున్నాను . వారందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. నాపై నేను చేసిన సినిమాల గురించి వేసిన ఏ.వి లో బావుంది. కానీ  నా పర్మిషన్ లేకుండా "మా అసోసియేషన్" కు పోటీ చేస్తున్న క్లిప్పింగ్ ను ప్రదర్శించడం తప్పు. సినిమాను సినిమాగానే చూద్దాం. నేను మీరు చేసే మంచి ప్రయత్నానికి సపోర్ట్ చేయడానికి వచ్చాను.అవసరమైతే మీడియా వారు ఆ వీడియో క్లిప్పింగ్ ను తీసివేయమని కోరుతున్నానను.  నాకు భగతసింగ్ అంటే  నాకు ఎంతో ఇష్టం.ఆయన పోరాట పటిమ నాకిష్టం. ఈ దేశమే భగతసింగ్ దేశం అయితే ఎంత బాగుండేదో అనుకునేవాన్ని . ఆయన ఉంటే ఈ దేశం ఇప్పుడు ఎక్కడ ఉండేదో.భగతసింగ్ ఉంటే చెగువేరా అంతటి మనిసయ్యేవారు.చెగువేరా క్యూబా లో పోరాటం చేసి గెలిచిన తరువాత ఇప్పుడు నేను కాలీగా ఉన్నానే  ప్రపంచంలో ఎక్కడైనా పోరాటం జరుగుతుంటే అక్కడికెళ్తాను వారికి నా అవసరం ఉంటుంది అనేటటువంటి గొప్ప వ్యక్తి ఆయన.దేశంతో పని లేకుండా సాటి మనిషి ఏమైనా జరిగితే స్పందించే వ్యక్తిత్వం ఉండాలి. అలాంటి మంచి ఆలోచనతో సినిమా తీస్తున్నారని తెలియగానే పిలిచి మాట్లాడాను. దర్శకుడు క్రాంతి  మంచి కథను సెలెక్ట్ చేసుకొన్నాడు.ఎంతోమంది గురువులు వున్నా నాకంటూ ఒక గుర్తింపు రావాలి, మన అలోచలను మన చుట్టూ వున్న కథల్ని మన భగతసింగ్ లాంటి వారిని మళ్లీ పరిచయం చేయాలనే గొప్ప ఆలోచనతో  వస్తున్న ఇలాంటి  యువకుల ఆలోచనలను,ఇలాంటి ప్రయత్నం చేస్తున్న దర్శకులకు మనమంతా సపోర్ట్ చేస్తే సమాజం మెరుగుపడే చిత్రాలు వస్తాయి కనుక మనమంతా సపోర్ట్ గా నిలిచి ఎంకరేజ్ చెయ్యాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాను. ఇలాంటి మంచి సినిమాను నిర్మిస్తున్న నిర్మాతలను చూసి నేను గర్వపడుతున్నాను అని అన్నారు. 


 *దర్శకుడు బాబ్జి  మాట్లాడుతూ* .. ఇది క్రాంతి కల కాదు ఇది వారి తండ్రి మునిచంద్ర కల, ఒక తండ్రి కల,ఒక తల్లి కలను తనయులు తీరుస్తున్నారు.ఇది ఈ సినిమా గొప్పతనం మనమందరికీ పండుగలు తెలుసు ఏదైనా పండుగ వస్తే వారు భక్తికి కోసం ఉపవాసాలు ఉంటారు కొందరు ఆరోగ్య సమస్యలు బాగవ్వాలని ఉపవాసాలు ఉంటారు కొందరు. కానీ దేశం కోసం, స్వాతంత్ర్యం కోసం పోరాడిన ధీరుడు భగత్ సింగ్. ఎక్కడో పుట్టి ,ఎక్కడో పెరిగి ముందు గులాముల్లా  వంగి సలాంలు కొట్టుకుంటూ  ఈ దేశంలో అడుగుపెట్టి బ్రిటీష్ సామ్రాజ్యాన్ని స్థాపించాలని కలలు కన్న  బ్రిటీష్ సామ్రాజ్యాన్ని మన దేశ పొలిమేరల వరకు తరిమి కొట్టి చిరు ప్రాయంలోనే చిరునవ్వుతో ఉరికొయ్యను ముద్దాడి చనిపోయిన గొప్ప వ్యక్తి భగతసింగ్. తను చనిపోయిన మార్చి 23వ ఈ కుటుంబమంతా ఉపవాసం ఉంటుంది.ఇంత గొప్ప దేశభక్తి ఉన్న గ్రేట్ ఫ్యామిలీ. ఇలాంటి గొప్ప ఆలోచనలతో ఈ కుటుంబం నుండి "భగత్ సింగ్" ఆలోచనలతో వచ్చిన దర్శకుడే క్రాంతి. మా ముందు పెరిగిన క్రాంతి ఇలాంటి మంచి ప్రయత్నం తో ఈ సినిమా తీశాడు అంటే మా కెంతో గర్వంగా ఉంది.మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్నాడు. ఇందులో హీరోగా వారి తమ్ముడు విదార్థ్ హీరోగా నటిస్తున్నాడు, వారి తల్లి,తండ్రులు ఈ సినిమాకు నిర్మాతలు.ఎక్కడో నెల్లూరు జిల్లాలో ఉన్న తను ప్రజానాట్యమండలి లో నాటకాలు వేసుకొంటూ పాటలు పాడి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకొని ఏ రోజు కైనా  సినిమాలలోకి వెళ్ళాలి, సినీ పరిశ్రమలో తన జెండా ఎగరవేయాలని కల గనే మునిచంద్ర గారు కలను ,   నెరవేర్చుకోవడం కోసం తన తనయులుతో పాటు వారి కుటుంబమంతా కలసి చేస్తున్న సినిమానే "భగత్ సింగ్ నగర్".ఒక తండ్రికి ఇంతకంటే ఇంకేమి కావాలి.వారు చేసిన ఈ ప్రయత్నాన్ని చూసి నేను ఎంతో గర్వ పడుతున్నాను. ఇలాంటి మంచి టైటిల్ తో, మంచి సందేశంతో వస్తున్న దర్శక, నిర్మాతలకు మనమంతా సపోర్ట్ గా నిలవాలని మనస్ఫూర్తిగా వేడుకొంటున్నానని అన్నారు.



 *భగత్ సింగ్ నగర్ దర్శకుడు వాలాజా క్రాంతి మాట్లాడుతూ..* ..ఈ రోజు నేను లెజండరీ ప్రకాష్ రాజ్ గారితో స్టేజ్ షేర్ చేసుకొంటానాని ఊహించలేదు.బెనర్జీ గారి హెల్ప్ తో ప్రకాష్ రాజ్ సర్ ను కలసి మా ఫంక్షన్ ఇన్వైట్ చేయడం జరిగింది. మా చిత్రం టీజర్ ను ప్రకాష్ రాజ్ గారు విడుదల చేయడం చాలా సంతోషంగా ఉంది.  "భగత్ సింగ్" గారు రాసిన ఒక లైన్ ను ఆదర్శంగా తీసుకొని ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న కొన్ని యదార్థ సంఘటనలతో సినిమాకు కావలసిన అన్ని కమర్షియల్ హంగులతో రియాలిటీకి దగ్గరగా వినూత్న స్క్రీన్ ప్లే తో తెరకెక్కించడం జరిగింది. భగత్ సింగ్ నగర్ లో జరిగే ఒక సంఘటన ఆధారంగా తీసిన అందమైన ప్రేమకథ. ఈ చిత్రం ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతుంది. కొత్త దర్శకులను ఇబ్బంది పెట్టకుండా సీనియర్ ఆర్టిస్ట్స్ సపోర్ట్ చేయాలని మనవి చేసుకొను చున్నాను.ఎందుకంటే మా నాన్న వెంట, నావెంట పడి సినిమాలో ఒక చిన్న పాత్ర ఇవ్వమని వెంటపడితే నేను సినిమాలో ఆయన క్యారెక్టర్ ను డిజైన్ చేసుకొని  పాత్ర ఇస్తే నాకు నరకం చూయించాడు.నువ్వు చెపితే నేను వినేది ఏమని నేను చెపితే నువ్వు వినమని. క్యారెక్టర్ గా షూటింగ్ చేసే సమయంలో వన్ మోర్ అంటే చేయకుండా నాకు చుక్కలు చూపించాడు. ఇండస్ట్రీ కు వచ్చే మా లాంటి కొత్త దర్శకులను సపోర్ట్ చెయ్యాలని సినీ పెద్దలను వేడుకొంటున్నాను. మాకు సపోర్ట్ చేసిన బెనర్జీ కు ధన్యవాదాలు,అలాగే మా టీజర్ ను బ్లెస్స్ చేయడానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. మంచి కంటెంట్ తో వస్తున్న మా చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చుతుంది. అందరూ మా చిత్రాన్ని చూసి ఆదరించాలని కోరుకుంటున్నాము అని అన్నారు. .


 *సంగీత దర్శకుడు ప్రభాకర్ దమ్ముగారి మాట్లాడుతూ* ... ప్రకాశ్ రాజ్ గారి చేతుల మీదుగా నా పాటలు విడుదల కావడం చాలా సంతోషంగా ఉంది.నా టీం సపోర్ట్ తో నేను మంచి పాటలు అందించారు.నాకే అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


 *హీరో విదార్ధ్ మాట్లాడుతూ* ....మా నాన్న గారి సపోర్ట్ చేయడం వలనే నేను ఈరోజు నేనీ స్టేజ్ మీదున్నాను. దర్శకుడు మా అన్న క్రాంతి మంచి కంటెంట్ తో కొత్త కాన్సెప్ట్ ను రెడి చేసుకొని తీసిన ఈ సినిమా బాగా వచ్చింది. అందరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది. ప్రేక్షకులందరూ మా సినిమాను చూసి బ్లెస్స్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకొంటున్నానని అన్నారు.


 *హీరోయిన్ దృవీక మాట్లాడుతూ...* మలయాళం లో నేను నటించాను. తెలుగులో నాకిది మొదటి చిత్రం.నాకీ సినిమాలో  మంచి పాత్ర ఇచ్చిన దర్శక,నిర్మాతలకు నా కృతజ్ఞతలు అని అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరూ దర్శక,నిర్మాతలు చేసే గొప్ప ప్రయయత్నాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి సినిమా గొప్ప విజయం సాధించేలా చేయాలని అన్నారు


 *నటీనటులు* : 

విదార్థ్, ధృవీక, బెనర్జీ, రవి ప్రకాష్, మునిచంద్ర, మాస్టర్ పాంచజన్య, అజయ్ గోష్, ప్రభావతి, సంధ్య, జయకుమార్, హరిబాబు, జయచంద్ర, మహేష్, ఒమర్, శంకర్, వెంకటేష్.  


 *సాంకేతిక నిపుణులు :* 

ఛాయాగ్రహణం : రాజేష్ పీటర్, కళ్యాణ్ సమి, 

ఎడిటింగ్ : జియాన్ శ్రీకాంత్, 

స్టిల్స్ : మునిచంద్ర, 

నృత్యం : ప్రేమ్-గోపి, 

నేపధ్య సంగీతం: ప్రభాకర్ దమ్ముగారి, 

ప్రొడ్యూసర్స్ : వాలాజా గౌరి, రమేష్ ఉడత్తు,

కథ-కథనం-దర్శకత్వం : వాలాజా క్రాంతి.

పి ఆర్ వో : మధు వి ఆర్, తేజు సజ్జా.

Mehaboob Dilse’s Guntur Mirchi Trailer Promises A Mass Feast

 


The teaser of Guntur Mirchi, a web series starring Megaboob Dilse was unveiled a little while ago and it promises that the series will offer a mass feast.


The lead characters in the series are compared to the iconic characters in Ramayan and Maha Bharatha. The characterisations look very authentic.


Guntur Mirchi could very well be the first and also the only out-and-out massy web series in Telugu web space and it has a great potential to attract large section of the audiences.


Mehaboob looks sharp in the trailer and so do the other lead and support cast. The series is directed by Anil Viswanath and produced by Infinitum Network Solution. Shravan Bharadwaj composes the music and Dinesh Paruchuri cranks the cinematography.


Prasadz Multiplex readied with a modern look

 


Prasadz Multiplex has been one of the major attractions for Hyderabadis. The residents of the beloved city have made watching movies at the Multiplex, followed by revelry at the Tank Bund and the Necklace Road, a part of their culture. Every weekend, this is what they have done for years. No wonder that Prasadz Multiplex has emerged as one of the major tourist attractions as well. And now, the Multiplex has heralded a new chapter in its existence. It has been revamped with a modern look. Right from July 30, its patrons will be treated to a whole new experience. After the second wave-induced lockdown, this Friday will be the first day when Prasadz Multiplex will be opened to the audience.



Speaking on the occasion, Prasadz Multiplex's Head Ramesh Prasad said, "The renovation works at our multiplex have been completed. Starting this Friday, the audience will enjoy movies on new screens and an enhanced theatrical experience. We have always strived to give the best sort of experience and ambience. Because of the pandemic, the film industry and the public at large have faced a lot of hardships. We, therefore, have kept the health of our patrons in mind while carrying out the renovation. Right from the time we set up the multiplex, a number of changes and improvements have been effected. Prasadz Multiplex has always been at the forefront of embracing new technology. The latest renovation has meant a huge amount of expenditure, but we took it up because we want to give a new experience to the audience. We are going to bring the IMAX feature, too, soon. My father, LV Prasad garu, had made cinema his life. And he emerged as one of the biggest producers in the country. As his sons, we will continue to serve the film industry to the best of our abilities. I am very proud to be a part of the Indian film industry." 


Paka -River of Blood from Mallesham Makers

The producers of acclaimed Telugu film Mallesham are back with another interesting feature film titled Paka – The River of Blood. Paka is a Malayalam language feature film directed by Nithin Lukose, who was the sound


designer for Mallesham.

Produced by Anurag Kashyap and Raj Rachakonda, PAKA is a tale of a river that swells with the blood of two feuding families and a young couple that tries to overcome this hatred with their love.

The film set in Wayanad of North Kerala, features an ensemble cast including, Basil Paulose (Johnny), Vinitha Koshy (Anna), Jose Kizhakkan (Kochappan), Athul John (Paachi), Nithin George (Joey), Joseph Manickal (Varkey) and is shot by Srikanth Kabothu, edited by Arunima Shankar, music by Faizal Ahamed and Venkat Siddareddy is the Creative Producer of the film

The film won the best WIP project in the Work-in-Progress Lab of  NFDC Film Bazaar 2020 and is produced by Studio 99 Films in association with Alif Talkies Productions.

This film is Nithin Lukose's debut feature as a director and is to have its World Premiere at the 46th edition of the Toronto International Film Festival (TIFF), held from September 9-18 2021.

The film is selected to be in the Discovery section, which showcases the first or second feature films of directors worldwide. TIFF will be held in a hybrid way, with both in-person and digital screenings.

Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st

 Superstar Mahesh Babu’s Sarkaru Vaari Paata First Notice On July 31st



Superstar Mahesh Babu is the first hero to join Sankranthi 2022 race with his latest flick Sarkaru Vaari Paata being directed by Parasuram Petla and produced by Mythri Movie Makers, GMB Entertainment and 14 Reels Plus banners. The film’s shooting is currently underway in Hyderabad.


The film has been making huge noise ever since it was announced. The title Sarkaru Vaari Paata and Mahesh Babu’s look in the poster grabbed everyone’s attention. The makers of the film have now decided to surprise movie buffs with an update. Witness Mahesh Babu in never seen before avatar, as the film’s First Notice will be out on July 31st, much to the delight of fans.


The poster sees Mahesh Babu walking and holding a bag in his hand. We can also see several cars, bikes and few goons on the ground. Apparently, this poster is from an action sequence.


Star heroine Keerthy Suresh is roped in to play Mahesh Babu’s love interest in the film being produced jointly by Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta.


Thaman SS who delivered innumerable chartbuster albums in last couple of years is tuning music for the film that has cinematography handled by R Madhi. Marthand K Venkatesh is the editor, while AS Prakash is art director.


Cast: Mahesh Babu, Keerthy Suresh, Vennela Kishore, Subbaraju and others.


Technical Crew:


Written and directed by: Parasuram Petla

Producers: Naveen Yerneni, Y. Ravi Shankar, Ram Achanta and Gopichand Achanta

Banners: Mythri Movie Makers, GMB Entertainment, 14 Reels Plus

Music Director: Thaman SS

Cinematography: R Madhi

Editor: Marthand K Venkatesh

Art Director: AS Prakash

Fights: Ram - Laxman

Line Producer: Raj Kumar

Co-Director: Vijaya Ram Prasad

CEO: Cherry

Sharat Marar To launch Ksheera Sagara Madhanam Trailer

 


స్టార్ ప్రొడ్యూసర్ శరత్ మరార్

విడుదల చేయనున్న

 *క్షీరసాగర మథనం* ట్రైలర్

ఆగస్టు 6 న థియేటర్లలో విడుదల


    ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన పలు సాఫ్ట్ వేర్ కంపెనీల్లో ఉన్నత స్థానాల్లో పని చేసే మెరికల్లాంటి కొందరు సాఫ్ట్ వేర్ ఇంజినీర్స్ సంయుక్తంగా తెరకెక్కించిన చిత్రం "క్షీరసాగర మథనం". సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అనిల్ పంగులూరి దర్శకత్వంలో అత్యంత ఆహ్లాదకరంగ రూపొందిన 'క్షీర సాగర మథనం' అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 6... థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. 

     ఈ చిత్రం ట్రైలర్ ను ప్రముఖ నిర్మాత శరత్ మరార్ రిలీజ్ చేయనున్నారు. మానవ సంబంధాల నేపథ్యంలో ఏడు పాత్రల తాలూకు భావోద్వేగాలను తెరకెక్కిస్తూ రూపొందుతున్న ఈ చిత్రంలో మానస్ నాగులపల్లి, ప్రముఖ నటుడు బ్రహ్మాజీ తనయుడు సంజయ్ కుమార్ హీరోలుగా నటించారు. అక్షత సోనావని హీరోయిన్ కాగా ప్రదీప్ రుద్ర  ప్రతినాయకుడు. శ్రీ వెంకటేశ పిక్చర్స్ తో కలిసి ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. 

    చిత్ర దర్శకుడు అనిల్ పంగులూరి మాట్లాడుతూ.. మా చిత్రానికి మోరల్ గా ఎంతో సపోర్ట్ చేస్తున్న శరత్ మరార్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన చేతుల మీదుగా మా "క్షీర సాగర మథనం" ట్రైలర్ రిలీజ్ అవుతుండడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఆగస్టు 6న థియేటర్లలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం" అన్నారు.

     చరిష్మా శ్రీకర్, గౌతమ్ శెట్టి, ప్రియాంత్, మహేష్, అదిరే అభి, శశిధర్, ఇందు తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ వినూత్న కథాచిత్రానికి ప్రచార రూపకల్పన: డిజైన్ ఐ.డి, పోరాటాలు: వింగ్ చున్ అంజి, పాటలు: శ్రీమణి-వశిష్ఠ శర్మ-వి.ఎన్.వి.రమేష్ కుమార్, సంగీతం: అజయ్ అరసాడ, ఛాయాగ్రహణం: సంతోష శానమోని, కూర్పు: వంశీ అట్లూరి, సహ-దర్శకుడు: కిషోర్ కృష్ణ, పీఆర్వో: ధీరజ అప్పాజీ, సహనిర్మాత: మురళీకృష్ణ దబ్బుగుడి, నిర్మాణం: ఆర్ట్ అండ్ హార్ట్ క్రియేషన్స్, రచన-దర్శకత్వం: అనిల్ పంగులూరి!!

Alludu Bangaram Shooting Started

 


ఘనంగా ‘అల్లుడు బంగారం’ షూటింగ్ ప్రారంభం

శ్రీ వెంకట లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై అజయ్ కుమార్, శ్రీ లక్ష్మీ హీరోహీరోయిన్లుగా.. వెంకట నరసింహ రాజ్ దర్శకత్వంలో లావణ్య చంద్రశేఖర్ నిర్మిస్తున్న ‘అల్లుడు బంగారం’ చిత్రం పూజా కార్యక్రమం హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన నటుడు సుమన్ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి  క్లాప్ కొట్టగా. కమెడియన్ పృథ్వి కెమెరా స్విచ్చాన్ చేశారు. దర్శకుడు సముద్ర తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు.


పూజా కార్యక్రమాల అనంతరం నటుడు సుమన్ మాట్లాడుతూ.. అల్లుడు బంగారం మూవీ ఇది ఒక ఫ్యామిలీ సబ్జెక్ట్.. కరోనా స్టార్ట్ కాకముందు అంటే రెండు సంవత్సరాల క్రితమే దర్శక,నిర్మాతలు నాకు ఈ కథ చెప్పారు. వీరు చెప్పిన కథ మాకు ఎంతో నచ్చింది. రియల్ లైఫ్ లో ఫ్రెండ్స్ గా ఉన్న నేను, పృథ్వీ గారు రీల్ లైఫ్ లో కూడా ఫ్రెండ్స్ గా నటిస్తున్నాము. ఒక విలేజ్‌లో ఉంటున్న వారి మెంటాలిటీ, ఆట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది. ప్రభుత్వం గురించి వారు ఏం మాట్లాడుకుంటారు. మంచి ఫ్రెండ్స్ గా ఉన్న మా మధ్య ఎందుకు డిస్టెన్స్ వస్తుంది అనే కథాంశంతో.. యూత్ & ఫ్యామిలీ ఎంట‌ర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న చిత్రమే ‘అల్లుడు బంగారం’. దర్శకుడు నారాయణమూర్తి దగ్గర కో డైరెక్టర్ గా వర్క్ చేసిన అనుభవంతో నరసింహ మంచి కథను తయారు చేసుకున్నాడు. మంచి ఫ్యాషన్‌తో వర్క్ చేస్తున్న ఈ టీంను ప్రేక్షకులు ఆశీర్వదిస్తే ఇంకా ఈ ప్రొడక్షన్ లో అనేక సినిమాలు వస్తాయనే నమ్మకం ఉందని అన్నారు.


నటుడు పృథ్వీ మాట్లాడుతూ.. దర్శకుడు వెంకట నరసింహారాజ్ అన్నాచెల్లెళ్ళ అనుబంధాన్ని తీసుకొని ఒక అద్భుతమైన కథను తయారు చేసుకొన్నాడు. రైతులు మీద, నకిలీ విత్తనాలతో రైతులు ఎలాంటి ఇబ్బందులు గురి అవుతున్నారని తెలుపుతూ పొలిటికల్ టచ్ తో దర్శకుడు ఈ కథను అద్భుతంగా తయారు చేశాడు. దర్శక, నిర్మాతలకు ఈ సినిమా మంచి పేరు తీసుకువస్తుందని అన్నారు.


దర్శకుడు వెంకటనరసింహా రాజ్ మాట్లాడుతూ... ‘‘గత 20 సంవత్సరాలుగా 24 శాఖలలో పని చేశాను. నారాయణమూర్తిగారి దగ్గర రెండు సంవత్సరాలు కో డైరెక్టర్‌గా పని చేశాను. ఆ అనుభవంతో స్వచ్ఛమైన పల్లెటూరి కథ రాసుకొని సుమన్ గారికి చెప్పడం జరిగింది. నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ గారు ఇంతకుముందు ‘చాటింగ్’ సినిమాను నిర్మించారు. మంచి టీంను సెలెక్ట్ చేసుకొని నిర్మాతకు నేనీ కథ చెప్పడం జరిగింది. లవ్, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటులంతా నా గురువులే. అందరి సలహాలు సూచనలతో ఈ కథను తయారు చేసుకున్నాను. హైదరాబాద్, రాజమండ్రి, కాకినాడ, వైజాగ్, అమలాపురం తదితర ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటుంది. నేను చెప్పిన ఈ కథను నమ్మి నాకీ అవకాశం కల్పించిన నిర్మాతకు నా కృతజ్ఞతలు..’’ అన్నారు.


నిర్మాత లావణ్య చంద్ర శేఖర్ మాట్లాడుతూ.. దర్శకుడు నాకు చెప్పిన కథ నచ్చడంతో ఈ సినిమా చేస్తున్నాను. ఈ మూవీలో ఫాదర్ - డాటర్ సెంటిమెంట్, బ్రదర్- సిస్టర్ సెంటిమెంట్, బావ- మరదల సెంటిమెంట్ ఇలా చిన్న పిల్లల దగ్గర నుండి పెద్దల వరకు అందరూ చూసే విధంగా ఈ సినిమా ఉంటుంది. ఈ చిత్రం మా బ్యానర్‌కే కాకుండా ఇందులో నటించిన నటీనటులకు, సాంకేతిక నిపుణులకు మంచి పేరు తీసుకువస్తుందని ఆశిస్తున్నాను. ప్రారంభోత్సవానికి వచ్చి ఆశీర్వదించి, అభినందనలు తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు..’’ అన్నారు.


హీరో,హీరోయిన్స్ మాట్లాడుతూ... మాకు ఈ సినిమాలో నటించే అవకాశం కల్పించిన దర్శక,నిర్మాతలకు ధన్యవాదాలు అని అన్నారు.


అజయ్ కుమార్, శ్రీలక్ష్మి, సుమన్, పృథ్వీరాజ్, గౌతంరాజ్, విజయరంగరాజ్, జబర్ధస్త్ షేకింగ్ శేషు, జబర్థస్త్ అప్పారావు, ఫిష్ వెంకట్, శ్రీనివాస్, కోట శంకరరావు, సుధ, సతీష్ చౌదరి, గబ్బర్‌సింగ్ బ్యాచ్ తదితరులు నటించిన ఈ చిత్రానికి

కెమెరా: పిఆర్ చందర్‌రావు,

పాటలు: కాసర్ల శ్యామ్,

సంగీతం: షారుక్ షేక్,

పీఆర్వో: బి. వీరబాబు,

నిర్మాత: లావణ్య చంద్రశేఖర్

కథ-స్ర్కీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: వెంకటనరహింహ రాజ్.

Raja Raja Chora Lyrical Song Released

 


శ్రీవిష్ణు ‘రాజ రాజ చోర’ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే లిరికల్ సాంగ్ విడుదల.


యంగ్‌ అండ్‌ ప్రామిసింగ్‌ హీరో శ్రీ విష్ణు నటిస్తున్న తాజా ఎంటర్‌టైనర్‌ మూవీ ‘రాజ రాజ చోర’. ఇప్పటికే విడుదలైన టీజర్  ఫ్రెష్‌ కంటెంట్‌తో హిలేరియస్‌గా ఉండడంతో  ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి. ఇక టీజర్‌లో శ్రీవిష్ణు చెప్పిన డైలాగ్స్,

హిట్‌ ఇస్తున్న కామెడీ, బాడీ లాంగ్వేజ్, కంటెంట్‌ను బట్టి ‘రాజ రాజ చోర’ హాండ్రెండ్‌ పర్సెంట్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉండనుందని తెలుస్తుంది.

ఈ చిత్రం నుండి రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే సాంగ్ ను ఈ రోజు విడుదల చేసింది చిత్ర యూనిట్.

దొరలని మీకు మీరు దొరులుతు తిరిగారు.. చొరబడి చెడిపోతే చతికిల పడతారు..రాజా రాజు వచ్చే లోకాలు మెచ్చే అంటూ సాగే ఈ పాటకు వివేక్ సాగర్ క్యాచీ ట్యూన్స్ ఇచ్చారు. హసిత్ గోలి సాహిత్యం అందించిన ఈ పాటను మోహన భోగరాజు ఆలపించారు. ఈ పాటకు సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది.


పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్‌ అగర్వాల్‌ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి హసిత్‌ గోలి దర్శకత్వం వహిస్తున్నారు. వివేక్‌ సాగర్‌ సంగీతం సమకూర్చుతున్న ఈ చిత్రానికి వేదరామన్‌ కెమెరామ్యాన్‌గా బాధ్యతలు స్వీకరించారు.


తారాగణం: శ్రీ విష్ణు, మేఘా ఆకాష్, సునైన, తనికెళ్ళభరణి, గంగవ్వ, అజయ్‌ ఘోష్‌


సాంకేతిక విభాగం

రైటర్, డైరెక్టర్‌: హసిత్‌ గోలి

ప్రొడ్యూసర్స్‌: టీవీ విశ్వప్రసాద్, అభిషేక్‌ అగర్వాల్‌

క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌: కీర్తీ చౌదరి

కో ప్రొడ్యూసర్‌: వివేక్‌ కూచిభొట్ల

మ్యూజిక్‌: వివేక్‌ సాగర్‌

సినిమాటోగ్రఫీ: వేదరామన్‌

ఎడిటింగ్‌: విప్లవ్‌

ఆర్ట్‌: కృష్ణకుమార్‌ మన్నే

స్టైలింగ్‌: శ్రుతి కొర్రపాటి

Good Response for True





  "ట్రు" లాంటి డిఫరెంట్ ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకువస్తే తెలుగు ప్రేక్షకులు ఎప్పుడూ ఆదరిస్తారు.. దర్శకుడు శ్యామ్ మండల




 *గుణశేఖర్, సురేందర్ రెడ్డి , వై వి ఎస్ చౌదరి వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్ గా పని చేసిన శ్యామ్ మండలని దర్శకునిగా పరిచయం చేస్తూ గ్రీన్ లీఫ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై కె.ఆర్ గారు నిర్మించిన చిత్రం  ‘ట్రు` .



 థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ సినిమాలో ‘బైలంపుడి’ మూవీ ఫేమ్ హరీష్ వినయ్, ‘ఉండిపోరాదే ‘ ఫేమ్ లావణ్యలు హీరో, హీరోయిన్ లుగా నటించారు .








ఈ సినిమాలో మెయిన్ విలన్ మధుసూదన్ తో పాటు ‘బాహుబలి ‘ కల్పలత, మణికంఠ, ఐ డ్రీమ్ టి ఎన్ ఆర్‌, డి ఎస్ రావ్‌, మహేంద్రనాథ్ HM,బ్రహ్మానందరెడ్డి, రూపాలక్ష్మి, గని, ఉన్నికృష్ణన్ మరియు శుభోదయం సుబ్బారావు లు నటించారు. బేబీ అక్షిత, కుందన సంయుక్తంగా సమర్పించిన ఈ చిత్రం విడుద‌లై విమర్శకుల ప్రశంసలు అందుకొని "అమెజాన్ ప్రైమ్ " లో టాప్ place లో స్ట్రీమ్ అవుతున్న సందర్భంగా దర్శకుడు శ్యామ్ మండల చిత్రం గురించి మాట్లాడుతూ....* 






తెలుగు సినీ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్స్ దగ్గర పెద్ద పెద్ద బడ్జెట్ సినిమాలకు సహాయ దర్శకునిగా పని చేసిన నాకు   ప్రూవ్ చేసుకోవడానికి వచ్చిన అవకాశం చిన్నదైనా దాన్ని సద్వినియోగం చేసుకుని "ట్రు " అనే సినిమాని తెరకెక్కించాను. నిర్మాతకు చెప్పిన బడ్జెట్ లొనే మంచి అవుట్ ఫుట్ ఇచ్చాను .


నటీనటుల, చిత్ర యూనిట్ సహకారంతో  కేవలం 15 రోజుల్లోనే షూటింగ్ ని పూర్తి చేయగలిగాను. నన్ను నేను నిరూపించుకోవడానికి నిర్మాత కె.ఆర్  గారు నాకు ఒక అవకాశం  కల్పించారు.ఆయనకు నా జీవితాంతం రుణపడి ఉంటాను. అలాగే నిర్మాతని పరిచయం చేసిన ఎడిటర్  జానకిరామారావు గారికి మరియు కెమరామెన్ శివారెడ్డి లకు  నా ప్రత్యేక ధన్యవాదాలు.


హీరో, హీరోయిన్స్ ఇందులో చాలా చక్కగా నటించారు.


ఈ సినిమా తరువాత వారికి మరిన్ని అవకాశాలు తప్పక వస్తాయి.


ఇంతవరకు తెలుగులో ఎవరూ టచ్ చేయని ఒక ఇన్నోవేటివ్ కాన్సెప్ట్ ని తీసుకుని ఓ డిఫరెంట్ స్టోరీ టెల్లింగ్ తో ఒక్క క్షణం కూడా మైండ్ ని డైవర్ట్ అవనివ్వకుండా చేసి ఆధ్యంతం ఎంతో ఇంట్రెస్టింగ్ గా " ట్రు " సినిమాని తెరకెక్కించాను.


ఈ సినిమాని చూసిన ఇండస్ట్రీ లో చాలామంది పెద్దలు " డైరెక్టర్ శ్యామ్ మండల " కు పెద్ద డైరెక్టర్ అయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇలాంటి నూతన క్రియేటివ్ దర్శకులని ప్రోత్సహిస్తే డెఫినెట్ గా డిఫరెంట్ చిత్రలొస్తాయనేది మాత్రం వాస్తవం"అని వాళ్లన్న మాటలు ఎప్పటికీ గుర్తుంటాయి.


వాళ్ళు చేప్పినట్లే నాకు మరిన్ని అవకాశాలు వస్తే ఈ సినిమాలాగే డీఫ్రెంట్ కథలను ప్రేక్షకులకు అందిస్తాను.


త్వరలో నేను చేయబోయే ప్రాజెక్ట్స్ విషయాలు తెలియజేస్తాను.


కేవలం మౌత్ పబ్లిసిటీ తో అమెజాన్ ప్రైమ్ (Amazon prime) లో స్ట్రీమ్  అవుతూ 11 వ ప్లేస్ నుండి టాప్ పొజిషన్ కి చేరి ట్రెండ్ అవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.


మా చిత్రాన్ని ప్రేక్షకులందరూ ఆదరించి ఇంకా పెద్ద విజయాన్ని అందించాలని ప్రేక్షక దేవుళ్లను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు..




మంచి సక్సెస్ ని అందుకున్న ఈ చిత్రానికి మ్యూజిక్: mgk ప్రవీణ్, ఎడిటింగ్ : JP, DOP : శివా రెడ్డి శవనం,  ఫైట్స్ : శంకర్,  డాన్స్: కపిల్, ఆర్ట్ : pv రాజు, VFX : చందు, SFX : వెంకట్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : జానకిరామారావు పామరాజు, ప్రొడ్యూసర్ : KR,  స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ & డైరెక్షన్ : శ్యామ్ మండల.

Dulquer Salman, Hanu Raghavapudi Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled

 Dulquer Salman, Hanu Raghavapudi, Swapna Cinema, Vyjayanthi Movies- Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled



Versatile actor Dulquer Salmaan needs no special introduction for Telugu audiences. Made his smashing Telugu debut with Mahanati, the actor is doing his second Telugu film under the same production house of Swapna Cinema. Plays the role of 'Lieutenant' RAM, the yet to be titled film is directed by sensible maker Hanu Raghavapudi and produced by Ashwini Dutt, while Vyjayanthi Movies presents it.


The makers have released a special video as a token of love for the actor.


“He shines...Here's the glimpse of our 'Lieutenant' RAM, @dulQuer 🪖 #declassifiessoon #HBDDearestDULQUER ,” tweeted the makers.


He truly shines! Dulquer looks incredible and the film promises a lot of excitement.


The charming actor himself has tweeted that this is his best birthday gift! It truly makes for one.


The exotic locations of Kashmir and the period sequences are captured beautifully, credit goes to cinematographer PS Vinod. And Vishal Chandrasekhar’s background score complements the visuals.


Known for making heart-touching romantic entertainers, Hanu seems to have picked yet another intriguing subject for Production No 7 of Swapna Cinema.


Coming to the poster, Dulquer is all smiles as he holds a letter in his hands, while he sits backwards on bicycle.


The big-budget film is being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.


The makers have wrapped up an extensive shooting schedule in Kashmir.


Cast: Dulquer Salmaan


Technical Crew:

Director: Hanu Raghavapudi

Producer: Priyanka Dutt

Banner: Swapna Cinema

Presents: Vyjayanthi Movies

DOP: PS Vinod

Music Director: Vishal Chandrasekhar

Editor: Kotagiri Venkateswara Rao

Production Design: Sunil Babu

Art Director: Vaishnavi Reddy

Costume Designer: Sheetal Sharma

PRO: Vamsi-Shekar

Timmarusu Pre Release Event Held Grandly

 



జూలై 30న విడుద‌ల‌వుతున్న `తిమ్మ‌రుసు` పెద్ద స‌క్సెస్‌ను సాధించి, త‌ర్వాత రాబోయే సినిమాల‌కు ఆక్సిజ‌న్‌లా మారి బూస్ట‌ప్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని


‘బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `తిమ్మ‌రుసు`.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్,  ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ ఎర‌బోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి ద‌ర్శ‌కుడు. జూలై 30న సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని పాల్గొన్నారు. బిగ్ సీడీ, లిఫ్ట్ ప్రోమో, దేవి థియేట‌ర్ 70 ఎం.ఎం.బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. విజ‌య‌వాడ‌లోని శైల‌జా థియేట‌ర్ బిగ్ టికెట్‌ను నిర్మాత మ‌హేశ్ కోనేరు తండ్రి సాంబ‌శివ‌రావు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ``స‌త్య‌దేవ్ అంటే చాలా ఇష్టం. త‌న‌పై ఉన్న అభిమానంతో ఈ ఈవెంట్‌కు వ‌చ్చాను. స‌త్య‌దేవ్ ఎంత మంచి యాక్ట‌రో మ‌న‌కు తెలుసు. ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాలో ఆత్మ‌ను ఓ న‌టుడిగా రీ క్రియేట్ చేయ‌డం త‌న‌కే సాధ్య‌మైంది. అప్పుడు కోవిడ్ రాకుండా ఉండి, ఆ సినిమా థియేట‌ర్స్‌లో రిలీజ్ అయ్యుంటే, త‌ను స్టార్‌గా కూడా జ‌ర్నీ స్టార్ట్ చేసేసి ఉండేవాడు. అయితే అది తిమ్మ‌రుసుకి రాసి పెట్టి ఉండొచ్చు. వేరే దేశాల్లో వీకెండ్స్ వ‌స్తే అమ్మ‌, నాన్న‌ల‌ను చూడ‌టానికి వెళ‌తారు. కానీ మ‌నం అమ్మ‌, నాన్న‌ల‌తో సినిమాకెళ‌తాం. అలాగే వేరే దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాం. కానీ మ‌నం ఫ్రెండ్స్‌తో పాటు సినిమా కెళ‌తాం.. బోర్ కెడితే బార్ కెళ్లి అటు నుంచి థియేట‌ర్ కెళ‌తాం.  థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌టం అనేది మ‌న సంస్కృతి. సాధార‌ణంగా కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేట‌ర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్‌, ప‌బ్స్‌లో మాస్కులు తీసేసి పెద్ద‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటితో పోల్చితే థియేట‌ర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ‌నం సినిమాను ఓ వైపుకే మాట్లాడ‌కుండా చూస్తాం. అలాగ‌ని థియేట‌ర్స్‌ను ముందుగానే ఓపెన్‌చేయాల‌ని నేను చెప్ప‌డం లేదు.. కానీ అన్నింటితో పాటు ఓపెన్ చేయ‌వ‌చ్చు కదా, అని అంటున్నాను. ఇది నానిగా నేను మాట్లాడటం లేదు. ప్రేక్ష‌కుడిగా మాట్లాడుతున్నాను. థియేట‌ర్ అనేది మ‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఇంటి త‌ర్వాత ఎక్కువ‌గా థియేట‌ర్స్‌లోనే గ‌డిపి ఉంటాం. జాగ్ర‌త్తలు తీసుకుని వెళితే, థియేట‌ర్స్ చాలా సేఫ్ ప్లేస్‌. ఫిజిక‌ల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంట‌ల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్‌. మెంట‌ల్ హెల్త్‌కు మూల కార‌ణాలైన ఆర్ట్‌ఫామ్స్ ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉన్నాయో, ఆ దేశాల్లో ప్ర‌శాంత‌త ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న దేశంలో సినిమాకు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు. థియేట‌ర్స్ అనేది పెద్ద ఇండ‌స్ట్రీ. దానిపై ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది కుటుంబాలున్నాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, థియేట‌ర్స్‌లో ప‌నిచేసే వాళ్లున్నారు. అలా చాలా మంది లైఫ్‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఎంటైర్ ఇండియాలో ఇదే స‌మ‌స్య ఉంది. త్వ‌ర‌లోనే ఇది మారుతుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌న్నీ పెరిగిపోతున్నాయి. కానీ సినిమా ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌చ్చేస‌రికి బోల్డెన్ని ప‌రిమితులుంటున్నాయి. చాలా చిన్న స‌మ‌స్య‌గా అనుకుంటున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉండేవాళ్ల కోసం అది చిన్న స‌మ‌స్య అయ్యుండవ‌చ్చునేమో కానీ.. చాలా కుటుంబాల‌కు అది చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ప‌రిస్థితులు వ‌ల్ల ఓ ఎకో సిస్ట‌మ్ పాడైతే మ‌న భ‌విష్య‌త్ త‌రాల వాళ్ల‌కి ఇబ్బంది. ఓ చీక‌టి ప్రాంతంలో కొంద‌రితో క‌లిసి సినిమా చూడ‌ట‌మ‌నేది ఓ మ్యాజిక‌ల్ ఫీలింగ్‌. నెక్ట్స్ జ‌నరేష‌న్ దాన్ని మిస్ అవుతుంది. దాని కోసం ప్ర‌భుత్వాలు, మ‌నం క‌లిసి పూనుకోవాలో ఏమో తెలియ‌డం లేదు. కానీ.. మ‌న‌సులో చిన్న భ‌యం, బాధ ఉంది. ఇది త్వ‌ర‌గా ప‌రిష్కార‌మైపోవాలి. థ‌ర్డ్ వేవ్‌.. తొక్కా తోలు రాకుండా, మ‌ళ్లీ మ‌నం సినిమాలు చూడాలి. తిమ్మ‌రుసుతో మొద‌లెట్టాలి. అన్ని సినిమాలు ట‌క్ జ‌గ‌దీష్‌, ల‌వ్‌స్టోరి, రిప‌బ్లిక్‌, ఆచార్య‌, రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్‌.. అన్నీ సినిమాల‌ను మ‌నం థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాం. తిమ్మ‌రుసు విష‌యానికి వ‌స్తే. ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన వాళ్లు నాకు చాలా బాగా తెలుసు. శ్రీచ‌ర‌ణ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అంకిత్ చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. బ్ర‌హ్మాజీగారికి థాంక్స్‌. ప్రియాంక చ‌క్క‌టి న‌టి. నా కెరీర్ ప్రారంభం నుంచి మ‌హేశ్ నాకు బాగా తెలుసు. ఈ సినిమా త‌న‌కు పెద్ద హిట్ కావాలి. ఈ 30 త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌న్నింటికీ తిమ్మ‌రుసు అనేది ఆక్సిజ‌న్ ఇవ్వాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్ప‌డ‌మే కాదు.. జూలై 30 నా కుటుంబంతో క‌లిసి తిమ్మ‌రుసు సినిమా చూస్తాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు`` అన్నారు. 


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ``ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అనేది ఓపెన్ యూనివ‌ర్సిటీ. ఇక్క‌డ క్వాలిఫికేష‌న్స్‌, ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌, మార్కులు ఏమీ ఉండ‌వు. ప్యాష‌న్ అనే క్వాలిఫికేష‌న్‌తో రావాలి. 99 మంది మ‌న‌కు ఇండ‌స్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒక‌రు మాత్ర‌మే ఏం కాదు.. ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒక‌రెవ‌రో కాదు.. మ‌న‌కు మ‌న‌మే. అలా ఎంతో ధృడ‌మైన న‌మ్మ‌కంతో, ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కున్న వ్య‌క్తుల్లో మైడియ‌రెస్ట్ నాని అన్న ఒక‌రు. త‌ను ఇక్క‌డ‌కు రావ‌డం వ‌ల్ల‌, మాలాంటి వాళ్ల‌కు ఎంతో ధైర్యం వ‌స్తుంది. నాని అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ‌స్ట్ అఫిషియ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. చాలా సంతోషంగా ఉంది. ఎంటైర్ వ‌రల్డ్‌లో .. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్ కావ‌డం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలోనే సాధ్య‌మైంది. తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ త‌ర్వాత మొద‌ట‌గా వ‌స్తున్న సినిమా మా `తిమ్మ‌రుసు`. నిర్మాత సృజ‌న్‌, మ‌హేశ్ కాంబినేష‌న్‌లో సినిమా ముంద‌డుగు వేసింది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, ఎప్పుడూ చాలా కూల్‌గానే క‌న‌ప‌డ‌తాడు. త‌ను తిమ్మ‌రుసును అద్భుతంగా చేశాడు. త‌న‌కి థాంక్స్‌. శ్రీచ‌ర‌ణ్ పాకాల.. ఫాస్టెస్‌, సిన్సియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకు చాలా చ‌క్క‌గా మ్యూజిక్ అందించాడు. బ్ర‌హ్మాజీగారు మోస్ట్ పాజిటివ్ ప‌ర్స‌న్‌. న‌వ్విస్తూ..న‌వ్వుతూ ఉండ‌ట‌మే ఆయ‌నలో గ్లోకి కార‌ణం. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అప్పూ ప్ర‌భాక‌ర్ ఈ సినిమాకు వ‌ర్క్ చేశాడు. కంఫ‌ర్ట్ జోన్ దాటి ఈ సినిమాలో ఫైట్స్ చేశాను. ప్రియాంక మంచి న‌టి, వండ‌ర్‌ఫుల్ హ్యుమ‌న్ బీయింగ్‌. 39 రోజుల్లో సినిమా పూర్త‌య్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వ‌స్తోన్న ఈ సినిమాను ఆద‌రించి స‌పోర్ట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుకుంటున్నాను`` అన్నారు.  


నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ ``ఈ సినిమాను చేసేట‌ప్పుడు ఎంతో ఎఫ‌ర్ట్‌తో చేశాం. అలాగే సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాం. ప్రాజెక్ట్ ఇంత బాగా రావ‌డానికి కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. స‌క్సెస్ త‌ర్వాత ఇంకా మాట్లాడుతాను. జూలై 30న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ``కోవిడ్ స‌మ‌యంలో అంద‌రి ప‌రిస్థితులు అనుకున్నంత‌గా లేవ‌నే చెప్పాలి. నేను ఇంట్లో ఉన్న‌ప్పుడు ఓ రోజు ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన సృజ‌న్ ఫోన్ చేసి స‌త్య‌దేవ్‌తో సినిమా చేస్తావా? అన్నాడు. అప్ప‌టికే స‌త్య‌దేవ్ బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య సినిమాల‌తో మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. కోవిడ్ అంద‌రికీ బ్యాడ్ టైమ్‌ను తెచ్చింది కానీ.. నాకు గుడ్ టైమ్ వ‌చ్చింద‌ని అప్పుడ‌నిపించింది. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన త‌ర్వాత మ‌హేశ్‌గారు మ‌రో నిర్మాత‌గా యాడ్ కాగానే ప్రాజెక్ట్‌కు వెయిటేజ్ పెరిగింది. స‌త్య‌దేవ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా కంటే ముందు నుంచే త‌న‌తో హాయ్ అని అనుకునే ప‌రిచ‌యం ఉంది. త‌ను రిజ‌ర్వ్‌డ్ అని అనుకున్నాను. కానీ త‌నేంత స‌ర‌దాగా ఉంటాడో ఇప్పుడే తెలిసింది. కోవిడ్ టైమ్‌లో రిస్ట్రిస్ట్ర‌క్ష‌న్స్ ఉన్నా స‌రే! స‌త్య‌దేవ్‌తో పాటు ప్రియాంక జ‌వాల్క‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఝాన్సీ, అజ‌య్‌, వైవా హ‌ర్ష అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అప్పూ ప్ర‌భాక‌ర్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. శ్రీచ‌ర‌ణ పాకాల రాక్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. అంద‌రం క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాం. సెకండ్ లాక్డౌన్ త‌ర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా అంద‌రూ జాగ్ర‌త్త‌గా థియేట‌ర్స్‌లో చూడాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ ``చాలా క‌ఠిన ప‌రిస్థితుల్లో షూటింగ్ చేసిన సినిమా ఇది. రిస్క్ అయినా యూనిట్ చాలా కష్ట‌ప‌డ్డారు. 39 రోజుల్లో సినిమాను షూటింగ్ పూర్తి చేశారు. స‌త్య‌దేవ్‌తో చాలా కాలం నుంచి ప‌రిచ‌యం ఉంది. త‌న సినిమాకు ఎప్పుడు మ్యూజిక్ చేద్దామా? అని ఆలోచించేవాడిని. ఇప్ప‌టికీ కుదిరింది. సృజ‌న్‌, మ‌హేశ్‌గారికి, డైరెక్ట‌ర్ శ‌రణ్‌కి థాంక్స్‌. అప్పూ ప్ర‌భాక‌ర్ చాలా మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. సినిమాపై  చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం`` అన్నారు. 


న‌టుడు బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ``తిమ్మ‌రుసులో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. కొన్ని క్యారెక్ట‌ర్స్ చేసేట‌ప్పుడు మ‌న ప‌క్క‌నున్న వారిని చూసి నేర్చుకునే విష‌యాలు చాలా ఉంటాయి. అలా నేర్చుకునే న‌టుల్లో నానిగారు ఒక‌రు. అదే విధంగా స‌త్య‌దేవ్ కూడా. త‌న డైలాగ్ డెలివ‌రీ చాలా ఇష్టం. నాని, స‌త్య‌దేవ్ నేచుర‌ల్ యాక్ట‌ర్స్. ఇద్ద‌రూ భ‌విష్య‌త్తులో మంచి స్టార్‌ పోజిష‌న్స్‌కు వెళ‌తారు. అంకిత్‌, వైవా హ‌ర్ష‌, భూపాల్, అజ‌య్ అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్‌.. మంచి స్నేహితుడు. ప్రేమ‌మ్ సినిమా నుంచి ప‌రిచ‌యం. త‌న ఫ‌స్ట్ సినిమాలోనూ యాక్ట్ చేశాను. ఈ సినిమాలోనూ మంచి పాత్ర ఇచ్చాడు శ‌ర‌ణ్‌. అన్ని ఎలిమెంట్స్‌ను ఉన్న ఈ తిమ్మ‌రుసు సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ ``ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌...39 రోజుల్లోనే పూర్తి చేశాం. అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డి చేశారు కాబ‌ట్టి అలా చేయ‌గ‌లిగాం. నాకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌లాగా ఉండి.. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయ‌డానికి కార‌ణ‌మైన వంశీ కాక‌కు థాంక్స్‌. అప్పూ ప్ర‌భాక‌ర్ సినిమాలో న‌న్నుఅందంగా చూపించారు. శ‌ర‌ణ్‌.. వెరీ కూల్ ప‌ర్స‌న్‌. నాపై న‌మ్మ‌కంతో మంచి పాత్ర‌ను ఇవ్వ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌లో న‌న్ను ఇన్‌వాల్వ్ చేయించ‌డంలో కీ రోల్ పోషించాడు. స‌త్య‌దేవ్‌తో వ‌ర్క్ చేసిన త‌ర్వాత యాక్టింగ్ ఈజీగా, ప్యాష‌నేట్‌గా ఉండాలో అర్థ‌మైంది. త‌న యాక్టింగ్‌ను చూసిన‌ప్పుడు నేనేం నేర్చుకోవాలో తెలిసింది. అలాగే బ్ర‌హ్మాజీ స‌హా ఇత‌ర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్స్ రాహుల్ సంక్రిత్యాన్‌, వెంక‌ట్ మ‌హా, ఝాన్సీ, జ‌య‌శ్రీ జ‌య‌పాల్‌, వైవా హ‌ర్ష‌, న‌వీన్‌, అంకిత్‌, మ్యాంగో రామ్ తదిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 


నటీనటులు:

సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు


సాంకేతిక వర్గం:

దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి

నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌

సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల 

సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌

ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె

యాక్షన్‌:  రియల్‌ సతీశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీకాక


aha presents the global Telugu premiere of the critically acclaimed film Super Deluxe on August 6

 


aha presents the global Telugu premiere of the critically acclaimed film Super Deluxe on August 6


100% Telugu OTT platform aha, to the delight of movie lovers, is keeping its promise of streaming one blockbuster after the other week after week. One of the platform's most anticipated films, Super Deluxe, is gearing up for a worldwide Telugu premiere on August 6. The critically acclaimed anthology is a genre-bender starring Vijay Sethupathi, Ramya Krishna, Samantha, Fahadh Faasil and Mysskin in the lead, directed by Thiagarajan Kumararaja.



The film is best remembered for the pathbreaking performance of Vijay Sethupathi, who plays Shilpa (originally Manickam), a transgender woman who returns home after many years, much to the shock of his wife and young son. In what's certainly a masterclass in the representation of the LGBTQIA community on screen, the actor remains sincere to the portrayal of Shilpa sans any exaggeration and even won a National Award for Best Supporting Actor for the same.



Samantha and Fahadh Faasil play an on-screen couple, leading a loveless marriage, who move from pillar to post to cover up an accidental death. Despite essaying roles that are essentially flawed, the performances of the stellar actors make you empathise and root for them throughout the movie. The same works for Leela, a character brought to life by Ramya Krishna, where she's trying to lead a life of dignity after a shady past.



Bagavathi Perumal, Gayathrie Shankar, and filmmaker Mysskin are cast in brief yet crucial roles that drive the essence of the film's theme - oneness. The four stories narrated in Super Deluxe throws light on humans from various walks of life stuck in complicated situations and manage to come out of it miraculously. aha is a one-stop entertainment destination that's home to several blockbuster films and web originals including Krack, Khaidi, Sulthan, Naandhi, Zombie Reddy, In the Name of God, Chaavu Kaburu Challaga, Kudi Yedamaithe, Sam Jam and 11th Hour to name a few.


SR Kalyanamandapam Est1975 Trailer Launched Grandly

 


కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్ విడుద‌ల, అనూహ్య స్పంద‌న‌


రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార, సిగ్గేంద‌కు రా మావ‌ వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో తాజాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్‌ విడుద‌లైంది.  హైద‌రాబాద్ ఏ ఎమ్ బి మ‌ల్టీప్లేక్స్ థియేట‌ర్ లో SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందంతో పాటు ప్ర‌ముఖ న‌టులు సాయికుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా


డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు మాట్లాడుతూ


నా సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి.  వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్ప‌టి వ‌రుకు పోషించిన పాత్ర‌లు నా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకొస్తే నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్ష‌కుల మా ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు


హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మాట్లాడుతూ


కుటంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా మా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి నేను ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. నేను థియేట‌ర్ల‌లో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప న‌టులు ప‌క్క‌న నేను న‌టించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను న‌మ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్ వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. నేనే క‌థ చెప్ప‌గానే న‌న్ను న‌మ్మిన ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేతలు ప్ర‌మోద్, రాజుల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. వారి ప్రోత్సాహం లేక‌పోతే ఈ సినిమా ఇలా వ‌చ్చేది కాదు. అలానే ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ఆగ‌స్ట్ 6న థియేట‌ర్ల‌కి వ‌చ్చి ప్రేక్ష‌కులు ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు


తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ - శంక‌ర్ పిక్చ‌ర్స్

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే

సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్

కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్

ఆర్ట్ - సుధీర్

డిఐ - సురేశ్ ర‌వి

ఫైట‌ర్ - శంక‌ర్

Prakash Raj Launched Naa Venta Paduthunna Chinnadevadamma First Look

 



విలక్షణ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ చేతులమీదుగా 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్


 *ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను భారత జాతి గర్వించదగ్గ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా* 


 *ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ* .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు. 


 *దర్శకుడు వెంకట్  వందెల మాట్లాడుతూ..* ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 


 *నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ...* మేము నిర్మించిన చిత్రం ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడి మనసుకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంతో ఇంకో ప్రత్యేకత చెబుతూ 'దర్శకుడిని, హీరోని, హీరోయిన్ ను తొలి పరిచయం మా సంస్థ నుండి చేయడం సంతోషంగా ఉందన్నారు.


 *నటీనటులు* 

“హుషారు” ఫెమ్ గని కృష్ణతేజ్ , అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా, జోగిబ్రదర్, అనంత్,బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్, కల్పన రెడ్డి , జేజస్విని, రేణుక, బాలు , మురళి, పవన్, తదితరులు నటించారు


 *సాంకేతిక నిపుణులు* 

నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు, 

కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం : వెంకట్ వందెల, 

సినిమాటోగ్రఫీ : పి, వంశీ ప్రకాష్, సంగీతం : సందీప్ కుమార్, 

స్క్రీన్ ప్లే పాటలు: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి, 

ఎడిటర్ : నందమూరి హరి, ఎన్టీఆర్,

ఫైట్స్ ' రామకృష్ణ, 

కొరియోగ్రాఫర్స్ : గణేష్ స్వామి, నండిపు రమేష్, 

చీఫ్ కో డైరెక్టర్ : ఎల్ రామకృష్ణం రాజు, 

పి.ఆర్.ఓ : మధు వి ఆర్

Cinegoers Association Golden Jubilee Film Awards Logo Launched

 "సినీగోయర్స్ 52వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్" లోగో మరియు ప్రోమో విడుదల 



1970 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సినీగోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన "సినీగోయర్స్ అవార్డు"తో గౌరవించి సత్కరిస్తున్నారు. తాజాగా 2019 - 20 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు  సినీ గోయర్స్ అవార్డుతో నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరించాలని సన్నాహాలను చేస్తున్నారు. ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 51 వసంతాలు పూర్తిచేసుకుని 52వ గోల్డెన్ జూబిలీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వేవహరిస్తున్న బి.రామకృష్ణ గారు ఈ 52వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  


ఈ సందర్బంగా సినీ గోర్లు జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ "మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు. ఇప్పడు గోల్డెన్ జూబ్లీలోకి అడుగు పెడుతున్నాం. ఈ 52వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతాం. తెలుగు చలన చిత్ర సీమ వున్నంతకాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం. తెలుగులో  52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్  నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాం. అవార్డు క్యాటగిరీ మరియు నామినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరుస్తాం. ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం" అని తెలిపారు. 


డాక్టర్ పి శ్రీధర్ గారు మాట్లాడుతూ "ఇంతా ప్రతిష్టాకరమైన సినీ గోయర్స్ అవార్డ్స్ సంస్థ కి నన్ను ప్రెసెడెంట్ గా ఎన్నుకోవటం చాలా సంతోషంగా ఉంది. రేనోవా హాస్పిటల్స్ టైటిల్ స్పాన్సర్స్ గా ఉండటం చాలా గర్వంగా ఉంది. సినీ గోయర్స్ వారి  ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతగా ఉంటుంది. సెప్టెంబర్ లో జరగబోయే మెయిన్ ఈవెంట్ మంచి విజయవంతం అవాలి" అని కోరుకున్నారు.  



జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ "రామకృష్ణ గారి నాన్న గారు స్థాపించిన సినీ గోయర్స్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. సినిమాలు చుస్తే మంచి రిలీఫ్ ఉంటుంది, అందులో పనిచేసే నటీనటులకు టెక్నిషి యన్స్ ని సినీ గోయర్స్ అవార్డు తో సత్కరించడం చాలా గొప్ప విషయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన 52వ  సినీగోయర్స్ అవార్డ్స్ లోగోని విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది" అని తెలిపారు. 


సినీ గోయర్స్ జాయింట్ సెక్రటరీ రాజేష్ పొన్నాడ  మాట్లాడుతూ "సెప్టెంబర్ లో 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నాం. రేనోవా హాస్పిటల్స్ వారు మా కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నారు. 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ని భారీగా ప్లాన్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ చేయాలి" అని కోరుకున్నారు. 


తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ " సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40సంవత్సరాల అనుబంధం ఉంది. కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. మన తెలుగుచలనచిత్ర పరిశ్రమలో 52 సంత్స రాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్. రామకృష్ణని మరియు ఈ సినీ గోయర్స్ ని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి" అని కోరుకున్నారు. 


సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ "నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు వేడుకలకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉంది. 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి " అని కోరుకున్నారు.

Aakash Puri's Smashing First Look from Chor Bazaar

Aakash Puri's Smashing First Look & Motion Poster from Chor Bazaar out on his Birthday!!



Dashing Director Puri Jagannadh's Son, emerging Actor Aakash Puri's next Titled as 'Chor Bazaar'.


Starring Gehna Sippy as female lead, V.S.Raju is debuting into production under IV Productions banner.


Known to be a New-Age Love Action entertainer, George Reddy fame Jeevan Reddy is directing it.


However, a Powerful First Look & Motion Poster of Aakash Puri as 'Bachan Saab' from Chor Bazaar unveiled today on his Birthday.


Featuring Aakash in a never before role, his dashing look from the First Look registered a Mass response from all-over. Suresh Bobbili's Background Score was apt to the vibrance in motion poster.


As of now, Chor Bazaar shoot is commencing in a special set at the outskirts of Hyderabad.


Technicians:

Cinematography - Jagadeesh Chekati

Music - Suresh Bobbili

Editing - Anwar Ali

Art - Gandhi Nadikudikar

Costume Designer - Prasanna Dantuluri

Fights - Pruthvi Sekhar

Choreography - Bhanu

Publicity Designer - Anil Bhanu

Stills - Vikas Seegu

PRO - GSK Media

Make-up - Shiva

Costume Chief - Lokesh

Digital Media - Talk Scoop

Co-Producer - Alluri Suresh Varma

Banner - I.V Productions

Producer - V. S. Raju

Writer & Director - B. Jeevan Reddy

DJS SONG Launched



 అద్భుతమైన కాశ్మీర్ అందాలను చూపిస్తూ యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన  ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం  


 *మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి  నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్  ద్వారా విడుదల* *చేస్తున్న సందర్భంగా* 


 *చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ…* కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ''మందార కన్నె మందార' పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడారు. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. త్వరలో సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి  ఆగస్టు మొదటి వారంలో  5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నట్టి కరుణ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది.    బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.  నేను దర్శకత్వం వహించే ఈ  ‘DSJ‘(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం  ఉందని అన్నారు. 


 *చిత్ర నిర్మాతలు నట్టి క్రాంతి, అనురాగ్ కంచర్లలు  మాట్లాడుతూ…* లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది.  చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో  సుపూర్ణ మాలకర్ నటించారు. అలాగే కోటి గారి అబ్బాయి రాజీవ్  కూడా ఇందులో నటించాడు. కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..


 *నటీనటులు:* 

నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,

హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.


 *సాంకేతిక నిపుణులు:* 

బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ : అనురాగ్ కంచర్ల

డైరెక్టర్: నట్టి కుమార్

నిర్మాత: నట్టి క్రాంతి

కెమెరామెన్: కోటేశ్వర రావు

సంగీతం: రవిశంకర్

ఎడిటింగ్: గౌతంరాజు

ఆర్ట్: కెవి.రమణ

ఫైట్స్: కె.అంజిబాబు

లిరిక్ రైటర్ : రాంబాబు కోసాన

పి ఆర్.ఒ: మధు.విఆర్