Latest Post

Dulquer Salman, Hanu Raghavapudi Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled

 Dulquer Salman, Hanu Raghavapudi, Swapna Cinema, Vyjayanthi Movies- Birthday Glimpse Of 'Lieutenant' RAM Unveiled



Versatile actor Dulquer Salmaan needs no special introduction for Telugu audiences. Made his smashing Telugu debut with Mahanati, the actor is doing his second Telugu film under the same production house of Swapna Cinema. Plays the role of 'Lieutenant' RAM, the yet to be titled film is directed by sensible maker Hanu Raghavapudi and produced by Ashwini Dutt, while Vyjayanthi Movies presents it.


The makers have released a special video as a token of love for the actor.


“He shines...Here's the glimpse of our 'Lieutenant' RAM, @dulQuer 🪖 #declassifiessoon #HBDDearestDULQUER ,” tweeted the makers.


He truly shines! Dulquer looks incredible and the film promises a lot of excitement.


The charming actor himself has tweeted that this is his best birthday gift! It truly makes for one.


The exotic locations of Kashmir and the period sequences are captured beautifully, credit goes to cinematographer PS Vinod. And Vishal Chandrasekhar’s background score complements the visuals.


Known for making heart-touching romantic entertainers, Hanu seems to have picked yet another intriguing subject for Production No 7 of Swapna Cinema.


Coming to the poster, Dulquer is all smiles as he holds a letter in his hands, while he sits backwards on bicycle.


The big-budget film is being made simultaneously in Telugu, Tamil and Malayalam languages.


The makers have wrapped up an extensive shooting schedule in Kashmir.


Cast: Dulquer Salmaan


Technical Crew:

Director: Hanu Raghavapudi

Producer: Priyanka Dutt

Banner: Swapna Cinema

Presents: Vyjayanthi Movies

DOP: PS Vinod

Music Director: Vishal Chandrasekhar

Editor: Kotagiri Venkateswara Rao

Production Design: Sunil Babu

Art Director: Vaishnavi Reddy

Costume Designer: Sheetal Sharma

PRO: Vamsi-Shekar

Timmarusu Pre Release Event Held Grandly

 



జూలై 30న విడుద‌ల‌వుతున్న `తిమ్మ‌రుసు` పెద్ద స‌క్సెస్‌ను సాధించి, త‌ర్వాత రాబోయే సినిమాల‌కు ఆక్సిజ‌న్‌లా మారి బూస్ట‌ప్ ఇస్తుంద‌నే న‌మ్మ‌కం ఉంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నేచుర‌ల్ స్టార్ నాని


‘బ్లఫ్‌ మాస్టర్‌ , ఉమామ‌హేశ్వరాయ ఉగ్రరూప‌స్య’ వంటి వైవిధ్యమైన చిత్రాల్లో తనదైన నటనతో ఆక‌ట్టుకున్న స‌త్య‌దేవ్ టైటిల్ పాత్ర‌లో న‌టించిన చిత్రం `తిమ్మ‌రుసు`.  ఈస్ట్‌కోస్ట్‌ ప్రొడక్షన్స్,  ఎస్‌ ఒరిజినల్స్‌ బ్యానర్స్‌పై మ‌హేశ్ కోనేరు, సృజ‌న్ ఎర‌బోలు ఈ చిత్రాన్ని నిర్మించారు. శ‌ర‌ణ్ కొప్పి శెట్టి ద‌ర్శ‌కుడు. జూలై 30న సినిమా థియేట‌ర్స్‌లో విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ముఖ్య అతిథిగా నేచుర‌ల్ స్టార్ నాని పాల్గొన్నారు. బిగ్ సీడీ, లిఫ్ట్ ప్రోమో, దేవి థియేట‌ర్ 70 ఎం.ఎం.బిగ్ టికెట్‌ను ఆవిష్క‌రించారు. విజ‌య‌వాడ‌లోని శైల‌జా థియేట‌ర్ బిగ్ టికెట్‌ను నిర్మాత మ‌హేశ్ కోనేరు తండ్రి సాంబ‌శివ‌రావు ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా...


నేచుర‌ల్ స్టార్ నాని మాట్లాడుతూ ``స‌త్య‌దేవ్ అంటే చాలా ఇష్టం. త‌న‌పై ఉన్న అభిమానంతో ఈ ఈవెంట్‌కు వ‌చ్చాను. స‌త్య‌దేవ్ ఎంత మంచి యాక్ట‌రో మ‌న‌కు తెలుసు. ఉమామ‌హేశ్వ‌ర ఉగ్ర‌రూప‌స్య సినిమాలో ఆత్మ‌ను ఓ న‌టుడిగా రీ క్రియేట్ చేయ‌డం త‌న‌కే సాధ్య‌మైంది. అప్పుడు కోవిడ్ రాకుండా ఉండి, ఆ సినిమా థియేట‌ర్స్‌లో రిలీజ్ అయ్యుంటే, త‌ను స్టార్‌గా కూడా జ‌ర్నీ స్టార్ట్ చేసేసి ఉండేవాడు. అయితే అది తిమ్మ‌రుసుకి రాసి పెట్టి ఉండొచ్చు. వేరే దేశాల్లో వీకెండ్స్ వ‌స్తే అమ్మ‌, నాన్న‌ల‌ను చూడ‌టానికి వెళ‌తారు. కానీ మ‌నం అమ్మ‌, నాన్న‌ల‌తో సినిమాకెళ‌తాం. అలాగే వేరే దేశాల్లో వీకెండ్స్‌లో ఫ్రెండ్స్‌ను క‌ల‌వ‌డానికి వెళ‌తాం. కానీ మ‌నం ఫ్రెండ్స్‌తో పాటు సినిమా కెళ‌తాం.. బోర్ కెడితే బార్ కెళ్లి అటు నుంచి థియేట‌ర్ కెళ‌తాం.  థియేట‌ర్స్‌లో సినిమా చూడ‌టం అనేది మ‌న సంస్కృతి. సాధార‌ణంగా కోవిడ్ టైమ్‌లో ముందుగా థియేట‌ర్స్ క్లోజ్ చేసేసి, లాస్ట్‌లో థియేట‌ర్స్‌ను ఓపెన్ చేస్తున్నారు. బార్స్‌, ప‌బ్స్‌లో మాస్కులు తీసేసి పెద్ద‌గా మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి వాటితో పోల్చితే థియేట‌ర్స్ సేఫ్ ప్లేస్ అని అనుకుంటున్నాను. ఎందుకంటే మ‌నం సినిమాను ఓ వైపుకే మాట్లాడ‌కుండా చూస్తాం. అలాగ‌ని థియేట‌ర్స్‌ను ముందుగానే ఓపెన్‌చేయాల‌ని నేను చెప్ప‌డం లేదు.. కానీ అన్నింటితో పాటు ఓపెన్ చేయ‌వ‌చ్చు కదా, అని అంటున్నాను. ఇది నానిగా నేను మాట్లాడటం లేదు. ప్రేక్ష‌కుడిగా మాట్లాడుతున్నాను. థియేట‌ర్ అనేది మ‌న జీవితంలో ఓ భాగ‌మైపోయింది. ఇంటి త‌ర్వాత ఎక్కువ‌గా థియేట‌ర్స్‌లోనే గ‌డిపి ఉంటాం. జాగ్ర‌త్తలు తీసుకుని వెళితే, థియేట‌ర్స్ చాలా సేఫ్ ప్లేస్‌. ఫిజిక‌ల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో, మెంట‌ల్ హెల్త్ కూడా అంతే ఇంపార్టెంట్‌. మెంట‌ల్ హెల్త్‌కు మూల కార‌ణాలైన ఆర్ట్‌ఫామ్స్ ఎక్క‌డైతే ఎక్కువ‌గా ఉన్నాయో, ఆ దేశాల్లో ప్ర‌శాంత‌త ఎక్కువ‌గా ఉంటుంది. మ‌న దేశంలో సినిమాకు మించిన ఎంట‌ర్‌టైన్‌మెంట్ లేదు. థియేట‌ర్స్ అనేది పెద్ద ఇండ‌స్ట్రీ. దానిపై ఆధార‌ప‌డి ల‌క్ష‌లాది కుటుంబాలున్నాయి. డిస్ట్రిబ్యూట‌ర్స్‌, ఎగ్జిబిట‌ర్స్‌, థియేట‌ర్స్‌లో ప‌నిచేసే వాళ్లున్నారు. అలా చాలా మంది లైఫ్‌లు ఆధార‌ప‌డి ఉన్నాయి. ఎంటైర్ ఇండియాలో ఇదే స‌మ‌స్య ఉంది. త్వ‌ర‌లోనే ఇది మారుతుంద‌ని భావిస్తున్నాను. ప్ర‌జ‌ల‌కు నిత్యావ‌స‌ర వ‌స్తువుల‌న్నీ పెరిగిపోతున్నాయి. కానీ సినిమా ప‌రిశ్ర‌మ విష‌యానికి వ‌చ్చేస‌రికి బోల్డెన్ని ప‌రిమితులుంటున్నాయి. చాలా చిన్న స‌మ‌స్య‌గా అనుకుంటున్నారు. ఫిల్మ్‌న‌గ‌ర్‌లో ఉండేవాళ్ల కోసం అది చిన్న స‌మ‌స్య అయ్యుండవ‌చ్చునేమో కానీ.. చాలా కుటుంబాల‌కు అది చాలా పెద్ద స‌మ‌స్య‌గా మారింది. ప‌రిస్థితులు వ‌ల్ల ఓ ఎకో సిస్ట‌మ్ పాడైతే మ‌న భ‌విష్య‌త్ త‌రాల వాళ్ల‌కి ఇబ్బంది. ఓ చీక‌టి ప్రాంతంలో కొంద‌రితో క‌లిసి సినిమా చూడ‌ట‌మ‌నేది ఓ మ్యాజిక‌ల్ ఫీలింగ్‌. నెక్ట్స్ జ‌నరేష‌న్ దాన్ని మిస్ అవుతుంది. దాని కోసం ప్ర‌భుత్వాలు, మ‌నం క‌లిసి పూనుకోవాలో ఏమో తెలియ‌డం లేదు. కానీ.. మ‌న‌సులో చిన్న భ‌యం, బాధ ఉంది. ఇది త్వ‌ర‌గా ప‌రిష్కార‌మైపోవాలి. థ‌ర్డ్ వేవ్‌.. తొక్కా తోలు రాకుండా, మ‌ళ్లీ మ‌నం సినిమాలు చూడాలి. తిమ్మ‌రుసుతో మొద‌లెట్టాలి. అన్ని సినిమాలు ట‌క్ జ‌గ‌దీష్‌, ల‌వ్‌స్టోరి, రిప‌బ్లిక్‌, ఆచార్య‌, రాధేశ్యామ్‌, ఆర్ఆర్ఆర్‌.. అన్నీ సినిమాల‌ను మ‌నం థియేట‌ర్స్‌లో ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాం. తిమ్మ‌రుసు విష‌యానికి వ‌స్తే. ఈ సినిమాలో వ‌ర్క్ చేసిన వాళ్లు నాకు చాలా బాగా తెలుసు. శ్రీచ‌ర‌ణ్ అద్భుత‌మైన సంగీతాన్ని అందించారు. అంకిత్ చ‌క్క‌గా యాక్ట్ చేశాడు. బ్ర‌హ్మాజీగారికి థాంక్స్‌. ప్రియాంక చ‌క్క‌టి న‌టి. నా కెరీర్ ప్రారంభం నుంచి మ‌హేశ్ నాకు బాగా తెలుసు. ఈ సినిమా త‌న‌కు పెద్ద హిట్ కావాలి. ఈ 30 త‌ర్వాత వ‌చ్చే సినిమాల‌న్నింటికీ తిమ్మ‌రుసు అనేది ఆక్సిజ‌న్ ఇవ్వాలని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను చెప్ప‌డ‌మే కాదు.. జూలై 30 నా కుటుంబంతో క‌లిసి తిమ్మ‌రుసు సినిమా చూస్తాను. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు`` అన్నారు. 


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ``ఫిల్మ్ ఇండ‌స్ట్రీ అనేది ఓపెన్ యూనివ‌ర్సిటీ. ఇక్క‌డ క్వాలిఫికేష‌న్స్‌, ఎంట్ర‌న్స్ ఎగ్జామ్స్‌, మార్కులు ఏమీ ఉండ‌వు. ప్యాష‌న్ అనే క్వాలిఫికేష‌న్‌తో రావాలి. 99 మంది మ‌న‌కు ఇండ‌స్ట్రీ గురించి ఎన్నో చెబుతారు. కానీ ఒక‌రు మాత్ర‌మే ఏం కాదు.. ముందుకెళ్లు అని చెబుతాడు. ఆ ఒక‌రెవ‌రో కాదు.. మ‌న‌కు మ‌న‌మే. అలా ఎంతో ధృడ‌మైన న‌మ్మ‌కంతో, ఈ ఇండ‌స్ట్రీలో నిల‌దొక్కున్న వ్య‌క్తుల్లో మైడియ‌రెస్ట్ నాని అన్న ఒక‌రు. త‌ను ఇక్క‌డ‌కు రావ‌డం వ‌ల్ల‌, మాలాంటి వాళ్ల‌కు ఎంతో ధైర్యం వ‌స్తుంది. నాని అన్నంటే నాకు చాలా చాలా ఇష్టం. నా ఫ‌స్ట్ అఫిషియ‌ల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇది. చాలా సంతోషంగా ఉంది. ఎంటైర్ వ‌రల్డ్‌లో .. కోవిడ్ ఫ‌స్ట్ వేవ్ త‌ర్వాత థియేట‌ర్స్‌లో వ‌చ్చిన సినిమాల‌న్నీ హిట్ కావ‌డం మ‌న తెలుగు ఇండ‌స్ట్రీలోనే సాధ్య‌మైంది. తెలుగు ప్రేక్ష‌కులు మంచి సినిమాను ఎంక‌రేజ్ చేయ‌డంలో ఎప్పుడూ ముందుంటారు. అది చాలా సార్లు ప్రూవ్ అయ్యింది. ఇప్పుడు సెకండ్ వేవ్ త‌ర్వాత మొద‌ట‌గా వ‌స్తున్న సినిమా మా `తిమ్మ‌రుసు`. నిర్మాత సృజ‌న్‌, మ‌హేశ్ కాంబినేష‌న్‌లో సినిమా ముంద‌డుగు వేసింది. శ‌ర‌ణ్ కొప్పిశెట్టి, ఎప్పుడూ చాలా కూల్‌గానే క‌న‌ప‌డ‌తాడు. త‌ను తిమ్మ‌రుసును అద్భుతంగా చేశాడు. త‌న‌కి థాంక్స్‌. శ్రీచ‌ర‌ణ్ పాకాల.. ఫాస్టెస్‌, సిన్సియ‌ర్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. ఈ సినిమాకు చాలా చ‌క్క‌గా మ్యూజిక్ అందించాడు. బ్ర‌హ్మాజీగారు మోస్ట్ పాజిటివ్ ప‌ర్స‌న్‌. న‌వ్విస్తూ..న‌వ్వుతూ ఉండ‌ట‌మే ఆయ‌నలో గ్లోకి కార‌ణం. నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ అప్పూ ప్ర‌భాక‌ర్ ఈ సినిమాకు వ‌ర్క్ చేశాడు. కంఫ‌ర్ట్ జోన్ దాటి ఈ సినిమాలో ఫైట్స్ చేశాను. ప్రియాంక మంచి న‌టి, వండ‌ర్‌ఫుల్ హ్యుమ‌న్ బీయింగ్‌. 39 రోజుల్లో సినిమా పూర్త‌య్యింది. సెకండ్ వేవ్‌లో ముందుగా వ‌స్తోన్న ఈ సినిమాను ఆద‌రించి స‌పోర్ట్ చేయాల‌ని ప్రేక్ష‌కుల‌కు కోరుకుంటున్నాను`` అన్నారు.  


నిర్మాత మ‌హేశ్ కోనేరు మాట్లాడుతూ ``ఈ సినిమాను చేసేట‌ప్పుడు ఎంతో ఎఫ‌ర్ట్‌తో చేశాం. అలాగే సినిమాను ఎంజాయ్ చేస్తూ చేశాం. ప్రాజెక్ట్ ఇంత బాగా రావ‌డానికి కార‌ణ‌మైన అంద‌రికీ థాంక్స్‌. సినిమా చాలా బాగా వ‌చ్చింది. త‌ప్ప‌కుండా సినిమా మంచి స‌క్సెస్‌ను సాధిస్తుంది. స‌క్సెస్ త‌ర్వాత ఇంకా మాట్లాడుతాను. జూలై 30న విడుద‌ల‌వుతున్న ఈ సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


ద‌ర్శ‌కుడు శ‌ర‌ణ్ కొప్పిశెట్టి మాట్లాడుతూ ``కోవిడ్ స‌మ‌యంలో అంద‌రి ప‌రిస్థితులు అనుకున్నంత‌గా లేవ‌నే చెప్పాలి. నేను ఇంట్లో ఉన్న‌ప్పుడు ఓ రోజు ఈ సినిమా నిర్మాత‌ల్లో ఒక‌రైన సృజ‌న్ ఫోన్ చేసి స‌త్య‌దేవ్‌తో సినిమా చేస్తావా? అన్నాడు. అప్ప‌టికే స‌త్య‌దేవ్ బ్ల‌ఫ్ మాస్ట‌ర్‌, ఉమామ‌హేశ్వ‌రాయ ఉగ్ర‌రూప‌స్య సినిమాల‌తో మంచి క్రేజ్ ద‌క్కించుకున్నాడు. కోవిడ్ అంద‌రికీ బ్యాడ్ టైమ్‌ను తెచ్చింది కానీ.. నాకు గుడ్ టైమ్ వ‌చ్చింద‌ని అప్పుడ‌నిపించింది. అలా ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన త‌ర్వాత మ‌హేశ్‌గారు మ‌రో నిర్మాత‌గా యాడ్ కాగానే ప్రాజెక్ట్‌కు వెయిటేజ్ పెరిగింది. స‌త్య‌దేవ్ గురించి చెప్పాలంటే, ఈ సినిమా కంటే ముందు నుంచే త‌న‌తో హాయ్ అని అనుకునే ప‌రిచ‌యం ఉంది. త‌ను రిజ‌ర్వ్‌డ్ అని అనుకున్నాను. కానీ త‌నేంత స‌ర‌దాగా ఉంటాడో ఇప్పుడే తెలిసింది. కోవిడ్ టైమ్‌లో రిస్ట్రిస్ట్ర‌క్ష‌న్స్ ఉన్నా స‌రే! స‌త్య‌దేవ్‌తో పాటు ప్రియాంక జ‌వాల్క‌ర్‌, బ్ర‌హ్మాజీ, ఝాన్సీ, అజ‌య్‌, వైవా హ‌ర్ష అంద‌రూ ఎంత‌గానో స‌పోర్ట్ చేశారు. అప్పూ ప్ర‌భాక‌ర్ మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. శ్రీచ‌ర‌ణ పాకాల రాక్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే నాకు స‌పోర్ట్ చేసిన అంద‌రికీ థాంక్స్‌. అంద‌రం క‌ష్ట‌ప‌డి ఇష్ట‌ప‌డి సినిమా చేశాం. సెకండ్ లాక్డౌన్ త‌ర్వాత రిలీజ్ అవుతున్న ఈ సినిమా అంద‌రూ జాగ్ర‌త్త‌గా థియేట‌ర్స్‌లో చూడాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


మ్యూజిక్ డైరెక్ట‌ర్ శ్రీచ‌ర‌ణ్ పాకాల మాట్లాడుతూ ``చాలా క‌ఠిన ప‌రిస్థితుల్లో షూటింగ్ చేసిన సినిమా ఇది. రిస్క్ అయినా యూనిట్ చాలా కష్ట‌ప‌డ్డారు. 39 రోజుల్లో సినిమాను షూటింగ్ పూర్తి చేశారు. స‌త్య‌దేవ్‌తో చాలా కాలం నుంచి ప‌రిచ‌యం ఉంది. త‌న సినిమాకు ఎప్పుడు మ్యూజిక్ చేద్దామా? అని ఆలోచించేవాడిని. ఇప్ప‌టికీ కుదిరింది. సృజ‌న్‌, మ‌హేశ్‌గారికి, డైరెక్ట‌ర్ శ‌రణ్‌కి థాంక్స్‌. అప్పూ ప్ర‌భాక‌ర్ చాలా మంచి విజువ‌ల్స్ ఇచ్చాడు. ఇత‌ర న‌టీన‌టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌. సినిమాపై  చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం`` అన్నారు. 


న‌టుడు బ్ర‌హ్మాజీ మాట్లాడుతూ ``తిమ్మ‌రుసులో చాలా మంచి క్యారెక్ట‌ర్ చేశాను. కొన్ని క్యారెక్ట‌ర్స్ చేసేట‌ప్పుడు మ‌న ప‌క్క‌నున్న వారిని చూసి నేర్చుకునే విష‌యాలు చాలా ఉంటాయి. అలా నేర్చుకునే న‌టుల్లో నానిగారు ఒక‌రు. అదే విధంగా స‌త్య‌దేవ్ కూడా. త‌న డైలాగ్ డెలివ‌రీ చాలా ఇష్టం. నాని, స‌త్య‌దేవ్ నేచుర‌ల్ యాక్ట‌ర్స్. ఇద్ద‌రూ భ‌విష్య‌త్తులో మంచి స్టార్‌ పోజిష‌న్స్‌కు వెళ‌తారు. అంకిత్‌, వైవా హ‌ర్ష‌, భూపాల్, అజ‌య్ అంద‌రూ చ‌క్క‌గా న‌టించారు. మంచి కంటెంట్ ఉన్న సినిమా. డైరెక్ట‌ర్ శ‌ర‌ణ్‌.. మంచి స్నేహితుడు. ప్రేమ‌మ్ సినిమా నుంచి ప‌రిచ‌యం. త‌న ఫ‌స్ట్ సినిమాలోనూ యాక్ట్ చేశాను. ఈ సినిమాలోనూ మంచి పాత్ర ఇచ్చాడు శ‌ర‌ణ్‌. అన్ని ఎలిమెంట్స్‌ను ఉన్న ఈ తిమ్మ‌రుసు సినిమాను అంద‌రూ థియేట‌ర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాల‌ని కోరుకుంటున్నాను`` అన్నారు. 


హీరోయిన్ ప్రియాంక జ‌వాల్క‌ర్ మాట్లాడుతూ ``ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్‌...39 రోజుల్లోనే పూర్తి చేశాం. అంద‌రూ ఎంతో ఇష్ట‌ప‌డి చేశారు కాబ‌ట్టి అలా చేయ‌గ‌లిగాం. నాకు క‌ర్త‌, క‌ర్మ‌, క్రియ‌లాగా ఉండి.. ఈ సినిమాలో నేను యాక్ట్ చేయ‌డానికి కార‌ణ‌మైన వంశీ కాక‌కు థాంక్స్‌. అప్పూ ప్ర‌భాక‌ర్ సినిమాలో న‌న్నుఅందంగా చూపించారు. శ‌ర‌ణ్‌.. వెరీ కూల్ ప‌ర్స‌న్‌. నాపై న‌మ్మ‌కంతో మంచి పాత్ర‌ను ఇవ్వ‌డ‌మే కాదు.. ఆ పాత్ర‌లో న‌న్ను ఇన్‌వాల్వ్ చేయించ‌డంలో కీ రోల్ పోషించాడు. స‌త్య‌దేవ్‌తో వ‌ర్క్ చేసిన త‌ర్వాత యాక్టింగ్ ఈజీగా, ప్యాష‌నేట్‌గా ఉండాలో అర్థ‌మైంది. త‌న యాక్టింగ్‌ను చూసిన‌ప్పుడు నేనేం నేర్చుకోవాలో తెలిసింది. అలాగే బ్ర‌హ్మాజీ స‌హా ఇత‌ర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణుల‌కు థాంక్స్‌`` అన్నారు. 


ఇంకా ఈ కార్య‌క్ర‌మంలో డైరెక్ట‌ర్స్ రాహుల్ సంక్రిత్యాన్‌, వెంక‌ట్ మ‌హా, ఝాన్సీ, జ‌య‌శ్రీ జ‌య‌పాల్‌, వైవా హ‌ర్ష‌, న‌వీన్‌, అంకిత్‌, మ్యాంగో రామ్ తదిత‌రులు పాల్గొని చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 


నటీనటులు:

సత్యదేవ్‌,  ప్రియాంక జ‌వాల్కర్‌, బ్రహ్మాజీ, అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, ఝాన్సీ, వైవా హర్ష, సంధ్యా జనక్‌ తదితరులు


సాంకేతిక వర్గం:

దర్శకత్వం: శరణ్‌ కొప్పిశెట్టి

నిర్మాతలు: మహేశ్‌ కోనేరు, సృజన్‌

సంగీతం:  శ్రీచరణ్‌ పాకాల 

సినిమాటోగ్రఫీ:  అప్పూ ప్రభాకర్‌

ఆర్ట్‌:  కిరణ్‌ కుమార్‌ మన్నె

యాక్షన్‌:  రియల్‌ సతీశ్‌

పి.ఆర్‌.ఒ:  వంశీకాక


aha presents the global Telugu premiere of the critically acclaimed film Super Deluxe on August 6

 


aha presents the global Telugu premiere of the critically acclaimed film Super Deluxe on August 6


100% Telugu OTT platform aha, to the delight of movie lovers, is keeping its promise of streaming one blockbuster after the other week after week. One of the platform's most anticipated films, Super Deluxe, is gearing up for a worldwide Telugu premiere on August 6. The critically acclaimed anthology is a genre-bender starring Vijay Sethupathi, Ramya Krishna, Samantha, Fahadh Faasil and Mysskin in the lead, directed by Thiagarajan Kumararaja.



The film is best remembered for the pathbreaking performance of Vijay Sethupathi, who plays Shilpa (originally Manickam), a transgender woman who returns home after many years, much to the shock of his wife and young son. In what's certainly a masterclass in the representation of the LGBTQIA community on screen, the actor remains sincere to the portrayal of Shilpa sans any exaggeration and even won a National Award for Best Supporting Actor for the same.



Samantha and Fahadh Faasil play an on-screen couple, leading a loveless marriage, who move from pillar to post to cover up an accidental death. Despite essaying roles that are essentially flawed, the performances of the stellar actors make you empathise and root for them throughout the movie. The same works for Leela, a character brought to life by Ramya Krishna, where she's trying to lead a life of dignity after a shady past.



Bagavathi Perumal, Gayathrie Shankar, and filmmaker Mysskin are cast in brief yet crucial roles that drive the essence of the film's theme - oneness. The four stories narrated in Super Deluxe throws light on humans from various walks of life stuck in complicated situations and manage to come out of it miraculously. aha is a one-stop entertainment destination that's home to several blockbuster films and web originals including Krack, Khaidi, Sulthan, Naandhi, Zombie Reddy, In the Name of God, Chaavu Kaburu Challaga, Kudi Yedamaithe, Sam Jam and 11th Hour to name a few.


SR Kalyanamandapam Est1975 Trailer Launched Grandly

 


కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్ SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్ విడుద‌ల, అనూహ్య స్పంద‌న‌


రాజావారు రాణిగారు ఫేమ్ యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, టాక్సీవాలా ఫేమ్ ప్రియాంక జ‌వాల్క‌ర్ జంట‌గా ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ ప‌తాకం పై ప్ర‌మోద్ - రాజు నిర్మాత‌లుగా, నూత‌న దర్శ‌కుడు శ్రీధ‌ర్ గాదే తెరకెక్కించిన సినిమా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమా టైటిల్ ఎనౌన్స‌మెంట్ ద‌గ్గ‌ర నుంచి అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్లో ఓ అస‌క్తిని క్రియేట్ చేసుకుంది. ఆ ఉత్కంఠ‌ని మ‌రింత పెంచుతూ ఆ త‌రువాత విడుద‌ల చేసిన చుక్క‌ల చున్ని, చూసాలే క‌ళ్లార, సిగ్గేంద‌కు రా మావ‌ వంటి పాట‌లు యూట్యూబ్ లో మిల‌య‌న్స్ కొద్దీ వ్యూస్ తెచ్చుకోవ‌డ‌మే కాకుండా సోష‌ల్ మీడియాలో సైతం ట్రెండ్ అవుతున్నాయి. వీటితో పాటే విడుద‌ల చేసిన టీజ‌ర్ కి సైతం అంతటా అనూహ్య స్పంద‌న ల‌భించ‌డ‌మే కాకుండా, టాలీవుడ్ ట్రేడ్ వ‌ర్గాల్లో SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రం హాట్ టాపిక్ గా మారడం విశేషం. ఇటీవ‌లే SR క‌ళ్యాణమండంపం EST 1975 చిత్రాన్ని ఆగ‌స్ట్ 6న‌ థియేట‌ర్ లో విడుద‌ల చేస్తున్నామంటూ అధికారికంగా ప్ర‌క‌టించ‌డ‌మే కాకుండా అందుకు త‌గ్గ‌ట్లుగా నిర్మాత‌లు ప్ర‌మోద్ - రాజులు సన్నాహాలు చేస్తున్నారు. శంక‌ర్ పిక్చ‌ర్స్ వారు ఈ చిత్రానికి సంబంధించిన వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ ను ఫ్యాన్సీ రేటుకి ద‌క్కించుకున్నారు.  ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చేత‌న్ భ‌ర‌ద్వాజ్ ఈ సినిమాకు సంగీత ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే, ఈ నేప‌థ్యంలో తాజాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్‌ విడుద‌లైంది.  హైద‌రాబాద్ ఏ ఎమ్ బి మ‌ల్టీప్లేక్స్ థియేట‌ర్ లో SR క‌ళ్యాణమండంపం EST 1975 ట్రైల‌ర్ లాంఛ్ ఈవెంట్ అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది, ఈ కార్య‌క్ర‌మానికి చిత్ర బృందంతో పాటు ప్ర‌ముఖ న‌టులు సాయికుమార్ గారు ముఖ్య అతిధిగా విచ్చేశారు. ఈ సంద‌ర్భంగా


డైలాగ్ కింగ్ సాయికుమార్ గారు మాట్లాడుతూ


నా సినీ జీవితాన్ని మ‌లుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి.  వాటిలో పోలీస్ స్టోరీ, ప్ర‌స్థానం చిత్రాలు నాకు ఓ ప్ర‌త్యేక‌మైన గుర్తింపును ఇచ్చాయి. నా యాభై ఏళ్ల సినీ జీవితంలో నేను ఇప్ప‌టి వ‌రుకు పోషించిన పాత్ర‌లు నా ఫ‌స్ట్ ఇన్నింగ్స్ కి వైభ‌వాన్ని తీసుకొస్తే నా సెకండ్ ఇన్నింగ్స్ కి అద్భుత‌మైన గుర్తింపును తీసుకొచ్చే సినిమాగా SR క‌ళ్యాణమండంపం EST 1975 అవ్వ‌డం ఖాయం. హీరో కిర‌ణ్ అబ్బ‌వరం చాలా ఫోక‌స్ డ్ గా ప‌నిచేస్తూ ఉంటాడు, ఈ సినిమాతో కిరణ్ మంచి పేరు, గుర్తింపు రావాల‌ని కోరుకుంటున్నాను, అలానే ప్రేక్ష‌కుల మా ఈ చిత్రాన్ని థియేట‌ర్స్ లో చూసి ప్రోత్స‌హించాల‌ని ప్రార్థిస్తున్నాను అని అన్నారు


హీరో కిర‌ణ్ అబ్బ‌వరం మాట్లాడుతూ


కుటంబ స‌మేతంగా చూడ‌ద‌గ్గ సినిమా మా SR క‌ళ్యాణమండంపం EST 1975. ఈ సినిమాకు ప‌నిచేసిన ప్ర‌తిఒక్క‌రికి నేను ప్ర‌త్యేకంగా కృతజ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నాను. నేను థియేట‌ర్ల‌లో, టీవీల్లో చూసిన సాయికుమార్ వంటి గొప్ప న‌టులు ప‌క్క‌న నేను న‌టించ‌డం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాను న‌మ్మి ఈ చిత్రానికి సంబంధించిన రైట్స్ తీసుకున్న శంక‌ర్ పిక్చ‌ర్స్ వారికి ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. నేనే క‌థ చెప్ప‌గానే న‌న్ను న‌మ్మిన ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ అధినేతలు ప్ర‌మోద్, రాజుల‌కు ఎల్ల‌ప్పుడూ రుణ‌ప‌డి ఉంటాను. వారి ప్రోత్సాహం లేక‌పోతే ఈ సినిమా ఇలా వ‌చ్చేది కాదు. అలానే ద‌ర్శ‌కుడు శ్రీధ‌ర్ ఈ సినిమా ఆద్యంతం అల‌రించే రీతిన తీర్చిదిద్దారు. మేమంతా చేసిన ఈ ప్ర‌య‌త్నాన్ని ఆగ‌స్ట్ 6న థియేట‌ర్ల‌కి వ‌చ్చి ప్రేక్ష‌కులు ప్రోత్స‌హిస్తార‌ని కోరుకుంటున్నాను అని అన్నారు


తారాగ‌ణం - కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ప్రియాంక జ‌వాల్క‌ర్, సాయికుమార్ త‌దిత‌రులు


సాంకేతిక వ‌ర్గం


బ్యానర్ - ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్

వ‌ర‌ల్డ్ వైడ్ రైట్స్ - శంక‌ర్ పిక్చ‌ర్స్

నిర్మాత‌లు - ప్ర‌మోద్, రాజు

క‌థ‌, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - కిర‌ణ్ అబ్బ‌వరం

ద‌ర్శ‌కుడు - శ్రీధ‌ర్ గాదే

సంగీతం - చేత‌న్ భ‌ర‌ద్వాజ్

కెమెరా - విశ్వాస్ డేనియ‌ల్

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ - భ‌ర‌త్

లిరిక్స్ - భాస్క‌రభ‌ట్ల, క్రిష్ణ కాంత్

పీఆర్ఓ - ఏలూరుశ్రీను, మేఘ‌శ్యామ్

ఆర్ట్ - సుధీర్

డిఐ - సురేశ్ ర‌వి

ఫైట‌ర్ - శంక‌ర్

Prakash Raj Launched Naa Venta Paduthunna Chinnadevadamma First Look

 



విలక్షణ నటుడు శ్రీ ప్రకాష్ రాజ్ చేతులమీదుగా 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ లాంచ్


 *ముల్లేటి నాగేశ్వరరావు నిర్మాణ సారథ్యంలో జి.వి.ఆర్ ఫిలిం మేకర్స్ సమర్పణలో రాజధాని ఆర్ట్స్ మూవీస్ బ్యానర్ లో నిర్మించిన 'నా వెంట పడుతున్న చిన్నాడెవడమ్మా' చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను భారత జాతి గర్వించదగ్గ ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ గారి చేతుల మీదుగా విడుదల చేశారు. ఈ సందర్భంగా* 


 *ప్రకాష్ రాజ్ మాట్లాడుతూ* .. ఈ చిత్రం టైటిల్ తన మనసుకు చాలా నచ్చిందని ప్రశంసించారు. ఈ చిత్రంతో నూతన పరిచయం అవుతున్న వాళ్లందరికీ బంగారు భవిష్యత్తు ఉంటుందని కొనియాడారు. ఇలాంటి మంచి చిత్రంకు నా ఫుల్ సపోర్ట్ ఉంటుందని చెప్పారు. ఇలాంటి మంచి చిత్రాన్ని తీసినందుకు దర్శకుడు వెంకట్ వందెలను ఆశీర్వదిస్తూ.. అభినందించారు. 


 *దర్శకుడు వెంకట్  వందెల మాట్లాడుతూ..* ప్రకాష్ రాజ్ లాంటి జాతీయ నటుడి చేతులమీదుగా నా మొదటి చిత్రం ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ ను విడుదల చేయడంతో ఆనందాన్ని వ్యక్తం చేస్తూ తనను నమ్మి దర్శకుడిగా అవకాశమిచ్చిన నిర్మాతలకు కృతజ్ఞతలు తెలిపారు. 


 *నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరరావులు మాట్లాడుతూ...* మేము నిర్మించిన చిత్రం ప్రకాష్ రాజ్ లాంటి గొప్ప నటుడి మనసుకు నచ్చడం ఆనందంగా ఉందన్నారు. ఈ చిత్రంతో ఇంకో ప్రత్యేకత చెబుతూ 'దర్శకుడిని, హీరోని, హీరోయిన్ ను తొలి పరిచయం మా సంస్థ నుండి చేయడం సంతోషంగా ఉందన్నారు.


 *నటీనటులు* 

“హుషారు” ఫెమ్ గని కృష్ణతేజ్ , అఖిల ఆకర్షణ, తనికెళ్ళ భరణి, జీవా, జోగిబ్రదర్, అనంత్,బస్టాప్ కోటేశ్వరరావు, డాక్టర్ ప్రసాద్, మాధవి ప్రసాద్, సునీత మనోహర్, కల్పన రెడ్డి , జేజస్విని, రేణుక, బాలు , మురళి, పవన్, తదితరులు నటించారు


 *సాంకేతిక నిపుణులు* 

నిర్మాతలు ముల్లేటి కమలాక్షి, గుబ్బల వెంకటేశ్వరవు, 

కథ స్క్రీన్ ప్లే మాటలు దర్శకత్వం : వెంకట్ వందెల, 

సినిమాటోగ్రఫీ : పి, వంశీ ప్రకాష్, సంగీతం : సందీప్ కుమార్, 

స్క్రీన్ ప్లే పాటలు: డాక్టర్ భవ్య దీప్తి రెడ్డి, 

ఎడిటర్ : నందమూరి హరి, ఎన్టీఆర్,

ఫైట్స్ ' రామకృష్ణ, 

కొరియోగ్రాఫర్స్ : గణేష్ స్వామి, నండిపు రమేష్, 

చీఫ్ కో డైరెక్టర్ : ఎల్ రామకృష్ణం రాజు, 

పి.ఆర్.ఓ : మధు వి ఆర్

Cinegoers Association Golden Jubilee Film Awards Logo Launched

 "సినీగోయర్స్ 52వ గోల్డెన్ జూబ్లీ అవార్డ్స్" లోగో మరియు ప్రోమో విడుదల 



1970 నుంచి తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎంతోమంది గొప్ప నటీనటులకు, సాంకేతిక నిపుణులకు సినీగోయర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకరమైన "సినీగోయర్స్ అవార్డు"తో గౌరవించి సత్కరిస్తున్నారు. తాజాగా 2019 - 20 సంవత్సరంలో విడుదలైన సినిమాలకు  సినీ గోయర్స్ అవార్డుతో నటీనటులను, సాంకేతిక నిపుణులను సత్కరించాలని సన్నాహాలను చేస్తున్నారు. ఆ వివరాలనే తెలియజేయటానికి హైదరాబాద్ లోని తాజ్ బంజారా హోటల్ లో మీడియా సమక్షంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. 51 వసంతాలు పూర్తిచేసుకుని 52వ గోల్డెన్ జూబిలీ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న తరుణంలో జనరల్ సెక్రటరీ గా వేవహరిస్తున్న బి.రామకృష్ణ గారు ఈ 52వ అవార్డు కార్యక్రమం నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అని తెలిపారు. ఈ ప్రెస్ మీట్ కి తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మరియు జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత గార్లు ముఖ్య అతిధులుగా విచ్చేసారు. అలాగే తెలుగు సినిమా దర్శకులు త్రినాథ రావు నక్కిన, ఆంధ్ర ప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ మొండిటొక అరుణ్ కుమార్ మరియు కె ఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఏం వి శాస్త్రి తదితరులు పాల్గొన్నారు.  


ఈ సందర్బంగా సినీ గోర్లు జనరల్ సెక్రటరీ బి రామకృష్ణ గారు మాట్లాడుతూ "మా నాన్న గారు ఎంతో కష్టపడి సినీ గోయర్స్ లాంటి ప్రతిష్టాత్మకమైన అవార్డు ను స్థాపించారు. ఇప్పడు గోల్డెన్ జూబ్లీలోకి అడుగు పెడుతున్నాం. ఈ 52వ అవార్డు ఫంక్షన్ ను చాలా గొప్పగా నెక్స్ట్ లెవెల్ లో నిర్వహించాలని అనుకుంటున్నాము. ప్రతి సంవత్సరం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ జరుపుతాం. తెలుగు చలన చిత్ర సీమ వున్నంతకాలం సినీ గోయర్స్ అవార్డ్స్ ఫంక్షన్ నిర్వహిస్తాం. తెలుగులో  52 సంవత్సరాలుగా అవార్డ్స్ ఫంక్షన్  నిర్వహిస్తున్న ఏకైక సంస్థ మా సినీ గోయర్స్ అవార్డ్స్. మాకు ఎంతో సహాయసహకారాలు అందిస్తున్న మెగాస్టార్ చిరంజీవి గారికి నా ధన్యవాదాలు. సెప్టెంబర్ లో 52 వ అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తాం. అవార్డు క్యాటగిరీ మరియు నామినీ లిస్ట్ ను ఆన్ లైన్ లో పొందుపరుస్తాం. ఆన్ లైన్ ద్వారానే ఓటింగ్ ఉంటుంది. త్వరలో ఆ వివరాలు తెలియజేస్తాం" అని తెలిపారు. 


డాక్టర్ పి శ్రీధర్ గారు మాట్లాడుతూ "ఇంతా ప్రతిష్టాకరమైన సినీ గోయర్స్ అవార్డ్స్ సంస్థ కి నన్ను ప్రెసెడెంట్ గా ఎన్నుకోవటం చాలా సంతోషంగా ఉంది. రేనోవా హాస్పిటల్స్ టైటిల్ స్పాన్సర్స్ గా ఉండటం చాలా గర్వంగా ఉంది. సినీ గోయర్స్ వారి  ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతగా ఉంటుంది. సెప్టెంబర్ లో జరగబోయే మెయిన్ ఈవెంట్ మంచి విజయవంతం అవాలి" అని కోరుకున్నారు.  



జి హెహ్ ఎమ్ సి  డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత మాట్లాడుతూ "రామకృష్ణ గారి నాన్న గారు స్థాపించిన సినీ గోయర్స్ ని ఎంతో గొప్పగా నిర్వహిస్తున్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. సినిమాలు చుస్తే మంచి రిలీఫ్ ఉంటుంది, అందులో పనిచేసే నటీనటులకు టెక్నిషి యన్స్ ని సినీ గోయర్స్ అవార్డు తో సత్కరించడం చాలా గొప్ప విషయం. ఎంతో ప్రతిష్టాత్మకమైన 52వ  సినీగోయర్స్ అవార్డ్స్ లోగోని విడుదల చేయటం చాలా సంతోషం గా ఉంది" అని తెలిపారు. 


సినీ గోయర్స్ జాయింట్ సెక్రటరీ రాజేష్ పొన్నాడ  మాట్లాడుతూ "సెప్టెంబర్ లో 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ను నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నాం. రేనోవా హాస్పిటల్స్ వారు మా కార్యక్రమానికి మెయిన్ స్పాన్సర్స్ గా ఉన్నారు. 52వ గోల్డెన్ జూబిలీ సినీ గోయర్స్ అవార్డు ఫంక్షన్ ని భారీగా ప్లాన్ చేస్తున్నాం. అందరు సపోర్ట్ చేయాలి" అని కోరుకున్నారు. 


తెలంగాణ గవర్నమెంట్ సలహాదారుడు  డాక్టర్ కె వి రమణ గారు మాట్లాడుతూ " సినీ గోయర్స్ అవార్డ్స్ తో నాకు 40సంవత్సరాల అనుబంధం ఉంది. కిషన్ గారు ఎలా అయితే అవార్డు ఫంక్షన్ కి కృషి చేసారో అలాగే వాళ్ళ అబ్బాయి రామకృష్ణ గారు కూడా కృషి చేస్తున్నారు. మన తెలుగుచలనచిత్ర పరిశ్రమలో 52 సంత్స రాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహిస్తున్న ఏకైక సంస్థ సినీ గోయర్స్. రామకృష్ణని మరియు ఈ సినీ గోయర్స్ ని ఇంకా ఎంతో ఎత్తుకు ఎదగాలి అని కోరుకుంటున్నాను. సెప్టెంబర్ లో జరిగే ఫంక్షన్ అద్భుతంగా జరగాలి" అని కోరుకున్నారు. 


సినిమా దర్శకుడు త్రినాథ రావు నక్కిన మాట్లాడుతూ "నేను చిన్నపుడు ఒక ఆడియన్స్ గా సినీ గోయర్స్ అవార్డు వేడుకలకి వెళ్ళేవాడిని. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ లో మాట్లాడం చాలా ఆనందంగా ఉంది. 52 సంవత్సరాలుగా అవార్డు ఫంక్షన్ నిర్వహించడం అంటే చాలా కృషి కావాలి, మరి అంత కృషి ఉన్న రామకృష్ణ గారికి నా ధన్యవాదాలు. ఈ అవార్డు ఫంక్షన్ మంచి సక్సెస్ అవ్వాలి " అని కోరుకున్నారు.

Aakash Puri's Smashing First Look from Chor Bazaar

Aakash Puri's Smashing First Look & Motion Poster from Chor Bazaar out on his Birthday!!



Dashing Director Puri Jagannadh's Son, emerging Actor Aakash Puri's next Titled as 'Chor Bazaar'.


Starring Gehna Sippy as female lead, V.S.Raju is debuting into production under IV Productions banner.


Known to be a New-Age Love Action entertainer, George Reddy fame Jeevan Reddy is directing it.


However, a Powerful First Look & Motion Poster of Aakash Puri as 'Bachan Saab' from Chor Bazaar unveiled today on his Birthday.


Featuring Aakash in a never before role, his dashing look from the First Look registered a Mass response from all-over. Suresh Bobbili's Background Score was apt to the vibrance in motion poster.


As of now, Chor Bazaar shoot is commencing in a special set at the outskirts of Hyderabad.


Technicians:

Cinematography - Jagadeesh Chekati

Music - Suresh Bobbili

Editing - Anwar Ali

Art - Gandhi Nadikudikar

Costume Designer - Prasanna Dantuluri

Fights - Pruthvi Sekhar

Choreography - Bhanu

Publicity Designer - Anil Bhanu

Stills - Vikas Seegu

PRO - GSK Media

Make-up - Shiva

Costume Chief - Lokesh

Digital Media - Talk Scoop

Co-Producer - Alluri Suresh Varma

Banner - I.V Productions

Producer - V. S. Raju

Writer & Director - B. Jeevan Reddy

DJS SONG Launched



 అద్భుతమైన కాశ్మీర్ అందాలను చూపిస్తూ యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేసిన  ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం) చిత్రం టీం  


 *మంచి నాలెడ్జ్ తో బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు గతంలో చేసిన ఎన్నో మోసాలు గురించి తెలుసుకుని వారిపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అన్న కథాంశంమే ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) అనురాగ్ కంచర్ల సమర్పణలో నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై  ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ కుమార్తె నట్టి కరుణ  లేడీ ఓరియెంటెడ్ గా ప్రముఖ పాత్రలో నటిస్తుంది. నిర్మాత నట్టికుమార్ దర్శకత్వంలో నట్టి క్రాంతి  నిర్మిస్తున్న చిత్రం ‘DSJ‘(దెయ్యంతో సహజీవనం…) ఈ చిత్రం విజయవంతంగా షూటింగ్  పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్టు మొదటి వారంలో 5 భాషల్లో విడుదల చేయడాన్ని చిత్ర నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. అలాగే  ఈ సినిమాలో యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడిన 'మందార కన్నె మందార' అనే అద్భుతమైన పాటను ఈ రోజు మ్యాంగో మ్యూజిక్  ద్వారా విడుదల* *చేస్తున్న సందర్భంగా* 


 *చిత్ర దర్శకుడు నట్టికుమార్ మాట్లాడుతూ…* కాశ్మీర్ లోని  అద్భుతమైన అందాలతో 5 రోజులు షూట్ చేసిన ''మందార కన్నె మందార' పాటను యాసిన్ నిజర్, రమ్య బెహ్రా పాడారు. ఈ పాటను మ్యాంగో మ్యూజిక్ ద్వారా విడుదల చేస్తున్నాం. సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. త్వరలో సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి  ఆగస్టు మొదటి వారంలో  5 భాషలలో ఒకేసారి మా చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. నట్టి కరుణ ప్రధాన పాత్రలో అద్భుతంగా నటించింది.    బాగా చదువుకొని గోల్డ్ మెడల్ సాధించిన ఒక మంచి అమ్మాయిని నలుగురు అబ్బాయిలు ఎలా మోసం చేశారు. వారు చేసిన మోసాల గురించి తెలుసుకుని ఆ నలుగురు అబ్బాయిలపై ఆ అమ్మాయి ఎలాంటి రివెంజ్ తీర్చుకుంది అనే కథాంశంతో ఈ చిత్రం నడుస్తుంది. లేడీ ఓరియెంటెడ్ గా వస్తున్న ఈ సినిమా అందరికీ తప్పకుండా నచ్చుతుంది.  నేను దర్శకత్వం వహించే ఈ  ‘DSJ‘(దెయ్యంతో సహ జీవనం) చిత్రానికి నిర్మాతగా నా కుమారుడు నట్టి క్రాంతి, కూతురు నట్టి కరుణ హీరోయిన్ గా నటిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది.కరోనాటైంలో కూడా నటీనటులందరు భయపడకుండా మాకు సహరించడం వలన మేము ఈ సినిమా పూర్తి చేయగలిగాము. త్వరలో పోస్ట్ ప్రొడక్షన్ కి వెళ్తున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టు కుంటుందనే నమ్మకం  ఉందని అన్నారు. 


 *చిత్ర నిర్మాతలు నట్టి క్రాంతి, అనురాగ్ కంచర్లలు  మాట్లాడుతూ…* లేడీ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా వచ్చాయి అవన్నీ కూడా మంచి విజయం సాధించాయి. ఇప్పుడు వస్తున్న ఈ సినిమా కూడా గొప్ప సాధిస్తుందనే నమ్మకం ఉంది. ఈ సినిమాలో నట్టి కరుణ అద్భుతమైన పాత్ర పోషించింది. మొదటి నుండి కూడా ఆ అమ్మాయి చాలా బాగా నటించింది.  చిత్రంలోని నటీనటులందరూ చాలబాగా నటించారు.ఈ సినిమాలో ప్రధాన పాత్రలో నటించిన నట్టి కరుణ నటన సినిమాకే హైలెట్ గా నిలిస్తుంది. సెకెండ్ లీడ్ లో  సుపూర్ణ మాలకర్ నటించారు. అలాగే కోటి గారి అబ్బాయి రాజీవ్  కూడా ఇందులో నటించాడు. కరోనా టైం లో కూడా ఏంతో ధైర్యంగా కశ్మీర్ లోని అందమైన లోకేషన్స్ లలో చిత్రీకరణ జరుపుకుని షూటింగ్ పూర్తి చేసుకుని వచ్చాము. అందరూ బాగా సహకరించడం వలన సినిమాను త్వరగా పూర్తి చేయగలిగాము. 'DSJ‘ (దెయ్యంతో సహజీవనం) సినిమా ప్రమోషన్ టీజర్ విడుదల చేసి ఆగస్టు మొదటి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాం. మంచి కంటెంట్ తో వస్తున్న ఈ చిత్రం అందరికి తప్పక నచ్చుతుందని అన్నారు..


 *నటీనటులు:* 

నట్టి కరుణ, సుపూర్ణ మాలకర్,రాజీవ్ ,

హరీష్ చంద్ర, బాబు మోహన్, హేమంత్, స్నిగ్ధ, తదితరులు.


 *సాంకేతిక నిపుణులు:* 

బ్యానర్ : నట్టిస్ ఎంటర్టైన్మెంట్స్ 

సమర్పణ : అనురాగ్ కంచర్ల

డైరెక్టర్: నట్టి కుమార్

నిర్మాత: నట్టి క్రాంతి

కెమెరామెన్: కోటేశ్వర రావు

సంగీతం: రవిశంకర్

ఎడిటింగ్: గౌతంరాజు

ఆర్ట్: కెవి.రమణ

ఫైట్స్: కె.అంజిబాబు

లిరిక్ రైటర్ : రాంబాబు కోసాన

పి ఆర్.ఒ: మధు.విఆర్

Samantha Launched Andaru Bagundali Andulo Nenundali

 



Bathuku Busstand Trailer Garners A Positive Reception

 Bathuku Busstand Trailer Garners A Positive Reception



The theatrical trailer of Viran Muttamsetty’s debut film, Bathuku Busstand was unveiled by star director Parasuram today.


The trailer shows that Bathuku Busstand is a peculiar action thriller with an intriguing plot. Viran looks sharp in a challenging role. His dialogue delivery and body language are bang on point.


The trailer has garnered a positive reception from all quarters and it is going viral on social media now.


The suspense elements and the technical finesse show in the trailer have stuck a chord with digitised audiences.


Bathuku Busstand is directed by IN Reddy and produced by I Kavitha Reddy K Madhavi under Ilavala Films banner. The makers will be announcing the release date very soon.


Title song of Katha Kanchiki Manam Intiki gets a good response

 



Young actor Adith Arun has carved a named for himself by starring in content oriented films. His is pairing with Pujitha Ponnada for his next, which will be bankrolled by MP Arts banner. Monish Pattipati is producing this film which has been titled Katha Kanchiki Manam Intiki. The title song of this film was unveiled recently and it is receiving a great response from all quarters now. It is going viral on social media now.


Speaking on the occasion, the producer Monish Pattipati said the film has a very good storyline. The film shaped up better than what we had anticipated. Bheem’s music will keep the viewers entertained. Adith’s acting in the climax will leave everyone in tears.

Eminent Director M.S. Raju’s 7 Days 6 Nights to be a Trendy Entertainer!

 


Eminent Director M.S. Raju’s 7 Days 6 Nights to be a Trendy Entertainer!

Popular Producer M.S.Raju known for his phenomenal Industry hits has garnered a Superhit success with Dirty Hari as a director, last year.

As of now, he’s coming up with a breezy entertainer titled ‘7 Days 6 Nights’ presented by Sumanth Art Productions under Wild Honey Productions banner. M. Sumanth Ashwin and S. Rajinikanth are producing it with in association of Vintage Pictures & ABG Creations.

A classy poster revealing the leads Sumanth Ashwin & Mehar Chawal (debutant) with Title out today.

Speaking on the occasion, Hero/Producer Sumanth Ashwin says “We began our shoot on June 21st in Hyderabad & had a non-stop schedule of 22 days. Leaving for an outdoor schedule by the end of the month, we’ll shoot in Bangalore, Udipi, Gokarna & Goa continuously for 20 days from July 28th. As the content is very much youthful, there’s a great scope for many engaging elements. Following the success of Dirty Hari, my father M.S. Raju garu is filming it very confidently.”

Co-Producer J. Srinivasa raju says, “I’m extremely happy to see prestigious banner Sumanth Arts Productions bouncing back in form after taking a break in production. Our movie is going to match the freshness & entertainment audience experienced from this banner earlier with Super Hits like Shatruvu, Devi, Manasantha Nuvve, Okkadu, Varsham, Nuvvosthanante Nenoddantana, Aata & Maska”

Director M.S. Raju says, “People expect me to do another flick in the same genre after the success of Dirty Hari, but our ‘7 Days 6 Nights’ has a completely new treatment. Its pleasant visuals will take you on a joyful trip with your entire family. Story, screenplay, dialogues, visuals & music are core strengths for this movie. Every role & character is too relatable in real life & everyone’s giving their best. Our banner gave a break to many budding fine artists and this film will definitely introduce new stars to the industry. We’ve wrapped up 60% of our work & pacing up for the next schedules soon”

Along with Sumanth Ashwin & Mehar Chawal, Rohan & Kritika Shetty are also playing the leads in this movie while Sushma, Rishika Baali are playing crucial roles. ‘Middle Class Melodies’ fame Goparaju Ramana is playing the guest role.

Music: Samarth Gollapudi, Cinematography : Nani Chamidisetty, Editor: Junaid Siddiqui, Production Designer : Bhaskar Mudavath , Stills : M. Rishitha Devi , Pro: Pulagam Chinnarayana, Digital PR: Sudheer Telaprolu, Publicity Designer : Eshwar Ande, Executive Producer, Co-Diretor: UV Sushma, Co-Producer: J.Srinivasa raju, Manthena Ramu, Producers: Sumanth Ashwin, Rajnikant S, Writer - Director: M.S.Raju


Satyadev Kancharana returns for season two

 aha's blockbuster show Locked starring Satyadev Kancharana returns for season two



100% Telugu streaming platform aha's blockbuster survival thriller series Locked is returning for a second season. Satyadev Kancharana will step into the shoes of Dr Anand, a famous neurosurgeon adept at solving the most complex of medical cases, who hides a dark secret from the world that could destroy his reputation. Pradeep Deva Kumar, director of the first season, will also wield the megaphone for the second instalment as well. Locked 2 will offer bigger, better thrills for audiences. The show is set to go on floors shortly.


Locked, in its first season, unfolds over a mysterious night where three small-time burglars enter Dr Anand's residence and discover the murky side to his life. Many people enter the house over time and the night only gets deadlier by the minute with a series of murders. The show starring Satyadev, Samyuktha Hegde, Keshav Deepak, Sri Lakshmi and Bindu Chandramouli left the viewers gasping for breath with several twists and turns. In terms of scale, vision and concept, Locked 2 is expected to be a spine-chilling season that'll redefine storytelling standards in the Telugu digital space.


Tremendous Response for Family Drama Trailer



 సీరియ‌ల్ కిల్ల‌ర్ గా ఫెంటాస్టిక్ పెర్‌ఫార్మెన్స్ తో ఆక‌ట్ట‌కున్న క‌ల‌ర్ ఫోటో ఫేం సుహ‌స్ ,

ఫ్యామిలి డ్రామా ట్రైల‌ర్ కి ట్రెమండ‌స్ రెస్సాన్స్‌


మ‌జిలి, ఏజేంట్ శ్రీనివాస్ ఆత్రేయ లాంటి చిత్రాల్లో త‌న మార్క్ న‌ట‌న‌తో ఆక‌ట్టుకుని క‌ల‌ర్‌ఫోటో లాంటి గ్రేట్ ల‌వ్ స్టోరి లో త‌న న‌ట‌న‌తో న‌వ్వించి కంట త‌డి పెట్టించిన సుహాస్ హీరోగా మెహె‌ర్ తేజ్ ద‌ర్శ‌కుడుగా ప‌రిచ‌యమ‌వుతున్నారు.  ఇటీవలే ఏక్ మిని క‌థ లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ ఫిల్మ్ ని ప్రోడ్యూస్ చేసిన  మ్యాంగో మాస్ మీడియా స‌మ‌ర్ప‌ణ‌లో ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి  ఈ చిత్రాన్ని నిర్మించారు. సైకొ థ్రిల్ల‌ర్ క్రైమ్ డ్రామా గా తెర‌కెక్కుతున్న ఈ  సినిమాకి స్టోరి, స్క్రీన్ ‌ప్లే ని మెహె‌ర్ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్ లు అందిస్తున్నారు. కంచె, గౌత‌మి పుత్ర శాత‌క‌ర్ణ లాంటి చిత్రాల‌కి ఎడిట‌ర్ గా ప‌నిచేసిన రామ‌కృష్ణ ఆర్రామ్ ఈ ఫ్యామిలి డ్రామా కి ఎడిటింగ్ చేస్తున్నారు. అజ‌య్ అండ్ సంజ‌య్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం లొ హీరోయిన్స్ గా పూజా కిర‌ణ్‌, అనూషా నూతుల న‌టిస్తున్నారు.


ఇప్ప‌టికే విడుద‌ల చేసిన ఫ్యామిలీ డ్రామా ఫ‌స్ట్ లుక్ విశేష స్పంద‌న రావ‌డంతో పాటు వినూత్నంగా ఉంద‌నే ప్ర‌శంస‌లు వ‌స్తున్నాయి, ఈ నేప‌థ్యంలోనే తాజాగా విడుద‌లైన ట్రైల‌ర్ కి హ్యూజ్ రెస్పాన్స్ రావ‌డమే కాదు ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుండ‌టం విశేషం. అన్ని క‌మ‌ర్షియ‌ల్ అంశాల‌తో ఈ  ఫ్యామిలీ డ్రామా రెడీ అయిన‌ట్లుగా ఈ సినిమా ట్రైల‌ర్ చూస్తే అర్ధం అవుతుంది, మెహెర్ తేజ్ డైరెక్ష‌న్ స్కిల్స్, సుహాస్ పెర్ఫార్మెన్స్ వెర‌సి ఫ్యామిలీ డ్రామాతో ఆడియెన్స్ కి ఎడ్జ్‌ ఆఫ్ ద సీట్‌ ఎక్స్ పీరియెన్స్ గ్యారంటీ అని నిర్మాత‌లు ఫుల్ కాన్ఫెడెంట్ గా చెబుతున్నారు. ముఖ్యంగా క‌ల‌ర్ ఫోటో చిత్రం త‌రువాత సుహ‌స్ చేసిన చిత్రం గా ఫ్యామిలి డ్రామా రావ‌టం.. టోటల్ కాంట్రాస్ట్ గా క్యార‌క్ట‌ర్ వుండ‌టం, ఆడియ‌న్స్ ని విప‌రీతం గా ఆక‌ట్ట‌కుంటుంది. సుహ‌స్ గెట‌ప్ కూడా కొత్త‌గా వుండ‌టంతో సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ గా వుంది. ఆద్యంతం ఆశ‌క్తి రేపుతున్న ఈ చిత్రానికి  సంబందించిన‌ మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లో తెలియ‌జేస్తారు. 


కుటుంబ స‌బ్యులు..

.

సుహ‌స్ (క‌ల‌ర్‌ఫోటో ఫేం)

తేజ కాస‌ర‌పు (నూత‌న ప‌రిచ‌యం)

పూజా కిర‌ణ్ (నూత‌న ప‌రిచ‌యం)

అనుషా నూతుల (నూత‌న ప‌రిచ‌యం)

శృతి మెహ‌ర్ (నూత‌న ప‌రిచ‌యం)

సంజ‌య్ రథా (నూత‌న ప‌రిచ‌యం)


బంధువులు..


స‌మ‌ర్ప‌ణ ‌.. మ్యాంగో మాస్ మీడియా 

ద‌ర్శ‌కుడు.. మెహె‌ర్ తేజ్‌

స్టోరి, స్క్రీన్ ప్లే ..   మెహె‌ర్‌ తేజ్ మ‌రియు ష‌ణ్ముఖ ప్ర‌సాంత్

నిర్మాత‌లు .. మెహె‌ర్ తేజ్‌, తేజా కాస‌ర‌పు

సంగీతం .. అజ‌య్ అండ్ సంజ‌య్‌

బ్యాన‌ర్.. ఛ‌ష్మా ఫిలింస్ మ‌రియు నూత‌న భార‌తి ఫిల్మ్స్ ఎల్ ఎల్ పి

కెమెరా.. వెంక‌ట్ ఆర్ శాఖ‌మూరి

ప్రోడ‌క్ష‌న్ డిజైన‌ర్ ‌.. ఎల్ల‌య్య. ఎస్‌

పిఆర్ఓ .. ఏలూరు శ్రీను, మేఘ శ్యామ్‌, సునిల్ కొడూరి

KS Film Works Covid-19 Relief Aid

 


కె ఎస్ ఫిలిం వర్క్స్ సంస్థ లాక్ డౌన్ వల్ల ఉపాధి కోల్పోయిన సుమారు 1000 కుటుంబాలకు చేదోడుగా నిలిచింది. షూటింగ్ మొత్తం ఊటీ లో జరగడం వలన ఆ పరిసర ప్రాంతాలైన కళ్ళట్టి, మసన గుడి వంటి గ్రామాలను ఎంచుకొని అవసరం ఉన్న వారికి బియ్యం మొదలు ఉప్పు వరకు ఇది లేదు అనిపించుకోకుండా ప్రతిదీ సమకూర్చి అందించారు .ఈ సంస్థ నుండి రాబోయే చిత్రం ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకొని "రిచి గాడి పెళ్లి" అనే టైటిల్ తో విడుదలకు సిద్ధంగా ఉంది ఆ చిత్ర విశేషాలు పంచుకుంటూ


దర్శకుడు హేమరాజ్ కె.ఎస్  ... "రిచిగాడి పెళ్లి" అనేది మానవ సంబంధాలకు అద్దంపట్టే కథ. ప్రతి పాత్రలో వేరియేషన్ ఉండేలా డిజైన్ చేశాం. ముఖ్యంగా మా డిఓపి విజయ్ ఉలగనాథ్ గారు చేసిన వర్క్ చిత్రానికి హైలైట్ గా నిలుస్తుంది ఆయనకు మా ప్రత్యేక కృతజ్ఞతలు. అలానే చిత్రానికి పనిచేసిన బృందం మొదలు తారాగణం వరకు అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అంతా సజావుగా జరుగుతున్న తరుణంలో అనుకోని పరిణామం  కరోనా.. దేశం మొత్తం లాక్ డౌన్ తో స్తంభించి పోయింది. చాలామంది ఉపాధి కోల్పోవడం గమనించాం. వారందరికీ ఏదోటి చెయ్యాలని సాధ్యమైన రీతిలో నిత్యావసర సరుకులు అందించాం ..

Dear Megha Teaser Launched

 


సందడిగా సాగిన ''డియర్ మేఘ'' టీజర్ రిలీజ్ కార్యక్రమం

ఎన్నో ప్రేమ కథలు తెరపైకి వస్తుంటాయి. కానీ కొన్నే మనసును తాకి ఎప్పటికీ గుర్తుండిపోతాయి. అలాంటి ప్రేమ కథ ''డియర్ మేఘ'' అంటున్నారు చిత్ర దర్శకుడు సుశాంత్ రెడ్డి. మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజులు హీరో హీరోయిన్స్ గా వేదాన్ష్ క్రియేటివ్ వర్క్స్' సంస్థ ''డియర్ మేఘ'' సినిమాను నిర్మించింది. అర్జున్ దాస్యన్ నిర్మాత. ''డియర్ మేఘ'' టీజర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొని సందడి చేశారు. మేఘా ఆకాష్ టీజర్ ను రిలీజ్ చేశారు. ''డియర్ మేఘ'' ఒక బ్యూటిఫుల్ ఫీల్ గుడ్ ప్రేమ కథ అని టీజర్ తో తెలిసిపోయింది.


*ఈ సందర్భంగా నిర్మాత అర్జున్ దాస్యన్ మాట్లాడుతూ*...మీడియా మిత్రులను ఈ టీజర్ రిలీజ్ కార్యక్రమం ద్వారా కలుసుకోవడం సంతోషంగా ఉంది. టాలెంటెడ్ పెయిర్ మేఘా ఆకాష్, అరుణ్ ఆదిత్ మా సినిమాలో నటించారు. ఈ చిత్రంతో అర్జున్ సోమయాజులు అనే మరో యంగ్ టాలెంట్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. ''డియర్ మేఘ'' కు టెక్నీషియన్స్ వర్క్ అస్సెట్ అవుతుంది. సినిమాటోగ్రాఫర్ ఐ ఆండ్రూ బ్యూటిఫుల్ విజువల్స్ ఇచ్చారు. అలాగే హరి గౌర హిట్ మ్యూజిక్ అందించారు. రీసెంట్ గా ఆమని ఉంటే పక్కన అనే పాటను మా సినిమా నుంచి విడుదల చేశాం. ఆ పాటకు వన్ మిలియన్ పైగా వ్యూస్ వచ్చాయి. దర్శకుడు సుశాంత్, నేను ఒక సినిమా చేద్దామనుకున్నప్పుడు హార్డ్ హిట్టింగ్ కంటెంట్ కోసం కథలు విన్నాం. వాటిలో ''డియర్ మేఘ'' కథ బాగా నచ్చి మూవీ చేశాం. మా చిత్రాన్ని త్వరలో థియేటర్లలో విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నాం. తొందర్లనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తాం. థియేటర్ లు తెరిచేందుకు అనుమతి ఇచ్చి సినిమా ఇండస్ట్రీని ఎంకరేజ్ చేస్తున్న రెండు తెలుగు రాష్ట్రాల సీఎం లకు కృతజ్ఞతలు చెబుతున్నా. అన్నారు.


*సంగీత దర్శకుడు హరి గౌర మాట్లాడుతూ*...''డియర్ మేఘ'' లో మంచి సాంగ్స్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు సుశాంత్, నిర్మాత అర్జున్ గారికి థాంక్స్. ఆమని ఉంటే పక్కన పాట వన్ మిలియన్ వ్యూస్ క్రాస్ అవడం సంతోషంగా ఉంది. నా టెక్నీషియన్స్ అందరి సహకారం వల్లే ఇంత మంచి పాటలు చేయగలిగా. అన్నారు.


*దర్శకుడు సుశాంత్ రెడ్డి మాట్లాడుతూ*....కొన్ని ప్రేమ కథల్ని మనం థియేటర్లో చూసి బయటకు రాగానే మర్చిపోతాం. మరికొన్ని లవ్ స్టోరిలు మాత్రం మన మనసులో నాటుకుపోతాయి. హృదయంలో అలాగే నిలిచి ఉంటాయి. అలాంటి సినిమానే ''డియర్ మేఘ''. హండ్రెడ్ పర్సెంట్ ఈ సినిమా మీ హార్ట్ ను టచ్ చేస్తుంది. ఆ ఫీల్ తోనే సినిమా చూసి ఇంటికెళ్తారు. మేఘా ఆకాష్ డిడికేషన్ ఉన్న నటి. సినిమా కోసం చాలా కష్టపడింది. ఆమెతో వర్క్ చేయడం సంతోషంగా ఉంది. అరుణ్ పదేళ్లుగా నాకు ఫ్రెండ్. తను ఈ సినిమాను ఎంతో ప్రేమించి నటించాడు. అని అన్నారు.


*హీరోయిన్ మేఘా ఆకాష్ మాట్లాడుతూ*..''డియర్ మేఘ'' సినిమా నాకు ఎంతో స్పెషల్. ఎందుకంటే నా పేరుతో వస్తున్న సినిమా కాబట్టి. కొంత గ్యాప్ తర్వాత నేను ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను. డైరెక్టర్ సుశాంత్, హీరో అరుణ్ నాపై నమ్మకం ఉంచి, నేను ఈ క్యారెక్టర్ చేయగలను అని ఆఫర్ చేశారు. వాళ్లకు థాంక్స్. నాకు తెలుగు సినిమాలు చేయడం ఇష్టం కానీ చాలా కారణాలతో ఇక్కడ ఎక్కువగా చిత్రాలు చేయలేకపోతున్నాను. ''డియర్ మేఘ'' టీమ్ తో పనిచేయడం సంతోషంగా ఉంది. వీళ్లతో కుదిరితే మరో సినిమా చేయాలని ఉంది. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని నమ్ముతున్నా. అన్నారు.


*హీరో అరుణ్ ఆదిత్ మాట్లాడుతూ*...వెబ్ సిరీస్ లు వచ్చాక బోల్డ్ కంటెంట్ చూపిస్తున్నారు, బ్యాడ్ వర్డ్స్ డైలాగ్స్ చెబుతున్నారు. ఇవన్నీ ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఇలాంటి టైమ్ లో ఓ బ్యూటిఫుల్  లవ్ స్టోరిని ''డియర్ మేఘ'' తో చూపించే ప్రయత్నం చేస్తున్నాం. నా కాలేజ్ డేస్ లో తరుణ్, ఉదయ్ కిరణ్, సిద్ధార్థ్ మంచి లవ్ స్టోరి సినిమాలు చేసేవారు. అవి మా మనసులో ఉండిపోయాయి. అలాంటి ఒక ప్యూర్ ప్రేమ కథను ''డియర్ మేఘ'' లో చూపించబోతున్నాం. ఇప్పుడంతా ఫాస్ట్ ట్రెండ్ అయిపోయింది. వాట్సాప్  లో ఛాట్ చేసుకోవడం నచ్చకుంటే గుడ్ బై చెప్పడం..కానీ ఇప్పుడు కూడా ప్యూర్ లవ్ ఉంది అని చెప్పడమే మా సినిమా ఉద్దేశం. తుంగభద్ర నుంచి హరి గౌరతో పనిచేస్తున్నాను. ఈ సినిమాకు బ్యూటిఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. ఆమని ఉంటే పక్కన పాట నా మొత్తం కెరీర్ లో బెస్ట్ సాంగ్. థియేటర్లు తెరవాలని కోరుకున్న చాలా మందిలో నేనూ  ఒకర్ని. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్స్ ఓపెన్ అవుతున్నాయి. త్వరలో థియేటర్ రిలీజ్ కు వస్తున్నాం. ''డియర్ మేఘ'' మిమ్మల్ని ఆకట్టుకునే ప్రేమ కథ అవుతుంది. అన్నారు.


ఈ చిత్రానికి సంగీతం - హరి గౌర, సినిమాటోగ్రాఫర్ - ఐ ఆండ్రూ, ఎడిటర్ - ప్రవీణ్ పూడి, ఆర్ట్ డైరెక్టర్ - కె.వి రమణ, ప్రొడక్షన్ కంట్రోలర్ - నాగ మధు, పీఆర్వో - జీఎస్కే మీడియా. నిర్మాత - అర్జున్ దాస్యన్, రచన, దర్శకత్వం : సుశాంత్ రెడ్డి

PelliSandaD in Post Production works

 


పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో రాఘ‌వేంద్ర‌రావు ‘పెళ్లి సంద‌D’ ... సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు

పాతికేళ్ల ముందుకు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావు, కీర‌వాణి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ్యూజిక‌ల్ మ్యాజిక్ ‘పెళ్లి సంద‌డి’. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా.. 


ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ ‘‘అన్ని జోన‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాలు తీసి ఎందరో స్టార్స్ రేంజ్‌ను పెంచిన సీనియ‌ర్‌ ద‌ర్శ‌కుడు, ఎంద‌రో హీరోయిన్స్‌ను స్టార్స్ హీరోయిన్స్‌గా మార్చిన గోల్డెన్ హ్యాండ్ మా గురువుగారు రాఘ‌వేంద్రరావు గైడెన్స్‌లో రూపొందుతోన్న‘పెళ్లి సంద‌D’ షూటింగ్ పూర్త‌య్యింది. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. శ్రీకాంత్‌గారి అబ్బాయి రోష‌న్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోష‌న్‌, శ్రీలీల జోడీ ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇద్ద‌రూ ఎంతో చ‌క్క‌గా క్యూట్‌గా పాత్ర‌ల‌ను ఫెంటాస్టిక్‌గా క్యారీ చేశారు. హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్, ఎమోష‌న్స్‌, కామెడీ అన్ని అంశాల‌తో సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిగారి కాంబినేష‌న్ ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రోసారి కీర‌వాణిగారు త‌న సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయం. ఇప్ప‌టికే విడుదలైన రెండు పాట‌ల‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మిగిలిన పాట‌ల‌ను, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఇప్పుడు రీ రికార్డింగ్ జ‌రుగుతోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 



నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.


aha premieres two critically acclaimed films Needa and Hero this weekend




aha premieres two critically acclaimed films Needa and Hero this weekend

100% Telugu platform aha promises a blockbuster weekend for viewers with the global premiere of two critically acclaimed films Needa and Hero. Needa (Nizhal in Malayalam) is an edge of the seat thriller starring Nayanthara and Kunchacko Boban in pivotal roles, marking the directorial debut of noted editor Appu N. Bhattathiri. The film releases on aha this July 23. Audiences will also be treated to a laughter dose with a black comedy, Hero, on July 24, that features Rishab Shetty (who is also the producer), Ganavi Laxman, Pramod Shetty and Ugram Manju in pivotal roles. Hero is helmed by M Bharath Raj.

Needa makes for a nail-biting viewing experience with a unique premise surrounding a series of murders in a metropolis. The film tells the story through the lens of a school-going boy Nitin who narrates several murder stories that leaves the people around him baffled, including a magistrate John Baby. It doesn't take long for John to realise the key links between the stories and a flurry of real incidents. How does he go about unearthing key clues in these cases? The film is a riveting rollercoaster ride of emotions and thrills, without a single dull moment.

Hero is a fine mix of action and comedy, revolving around the life of a barber who accidentally meets his ex-lover at the house of a dangerous gangster. The film keeps you entertained as the barber and his ex try to flee their house and confront the henchmen of the gangster. What does fate have in store for the two? The film comes with abundant doses of humour and is guaranteed to liven up your weekend.

If you plan to make your weekend even more special, don't forget to add the sci-fi crime thriller Kudi Yedamaithe to your streaming playlist. Directed by U Turn filmmaker Pawan Kumar, the show lends a unique spin to the crime thriller genre with a time-loop dimension. Amala Paul and Rahul Vijay play the lead roles in Kudi Yedamaithe, which has opened to rave reviews and applause from audiences. Other major releases from aha this year include Krack, Naandhi, Zombie Reddy, Chaavu Kaburu Challaga, 11th Hour and In the Name of God.



hero cast & crew: Rishab shetty Hero/Producer


Ganavi Laxman
Heroine


Ugram Manju
Actor


Pramod Shetty
Villain

Good Response for Charitha Kamakshi First Look

 


రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా చ‌రిత కామాక్షి ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌, అనూహ్య స్పంద‌న‌

ఫైర్ ఫ్లై ఆర్ట్స్ బ్యాన‌‌ర్ పై ర‌జ‌నీ రెడ్డి నిర్మాణంలో నూత‌న ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కిస్తున్న చిత్రం చ‌రిత కామాక్షి. రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామా గా ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్న ఈ సినిమాలో న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద లీడ్ రోల్స్ చేస్తున్నారు. చ‌రిత కామాక్షి అనే టైటిల్ తోనే అంద‌రి దృష్టిని ఆక‌ర్షించ‌డంతో పాటు రొమాంటిక్ ఇంటెన్స్ డ్రామాగా రాబోతుంద‌ని ప్ర‌క‌టించ‌డంతో ఇండ‌స్ట్రీ ట్రేడ్ వ‌ర్గాల్లో ఈ సినిమా పై ఆస‌క్తి పెరిగింది. ఈ నేప‌థ్యంలోనే చ‌రిత కామాక్షి ఫ‌స్ట్ లుక్ తాజాగా విడుద‌లై ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాలో లీడ్ పాత్ర‌లు పోషించిన న‌వీన్ బేతిగంటి, దివ్య శ్రీపాద‌లు స్టిల్స్ తో పొయెటిక్ ఫీల్ వ‌చ్చేలా ఈ ఫ‌స్ట్ లుక్ ని డిజైన్ చేశారు ద‌ర్శ‌కులు స్త్రీ లంక చందు సాయి. యూత్ ఫుల్ ఆడియెన్స్ తో పాటు అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని సంపూర్ణంగా ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమాను ద‌ర్శ‌కుడు స్త్రీ లంక చందు సాయి తెర‌కెక్కించార‌ని నిర్మాత ర‌జ‌నీరెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే అధికారికంగా విడుద‌ల కానున్నాయి


తారాగణం


దివ్య శ్రీపద

నవీన్ బేతిగంటి

పృథ్వీ రాజ్

మణికంఠ వారణాశి

సునితా మనోహర్

సతీష్ సారిపల్లి

అంజి మామా


సాంకేతిక వర్గం


నిర్మాణం: ఫైర్ ఫ్లై ఆర్ట్స్ (FireFly Arts)

నిర్మాత: రజిని రెడ్డి

సినిమాటోగ్రాఫర్: రాకీ వనమాలి

సంగీతం: అబు

ఎడిటింగ్: కోదాటి పవన్ కళ్యాణ్

రచన: జ్ఞానేశ్వర్ దేవరపాగ, శివ శంకర్ చింతకింది

పాటలు: కూచి శంకర్, మనోహర్ పాలిసెట్టి, వాసు వలబోజు, జ్ఞానేశ్వర్ దేవరపాగ

ఆర్ట్ డైరెక్టర్: రమేష్

కాస్ట్యూమ్స్: దేవి, భవాని నీరటి

సౌండ్ డిసైన్: షఫీ fx

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూసర్: శివ MSK

ప్రొడక్షన్ మేనేజర్: స్వర్ణ

పోస్టర్ డిజైనర్: ఓంకార్ కడియం

పీఆర్ఓ - ఏలూరు శ్రీను, మేఘ‌శ్యామ్

డైరెక్టర్: స్త్రీలంక చందు సాయి

Honey Trap Audio Released



 "హనీ ట్రాప్" మూవీ ఆడియో విడుదల

సందేశాత్మక అంశాలను కమర్షియల్ యాంగిల్  లో తెరకెక్కించే దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి. తన పంథాలో ఆయన రూపొందిస్తున్న తాజా చిత్రం హనీ ట్రాప్. రిషి, శిల్ప నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.  భరద్వాజ్ సినీ క్రియేషన్స్ పతాకంపై వివి వామన రావు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వివి వామనరావు ఈ చిత్రానికి నిర్మాతగానే కాకుండా కథా స్క్రీన్ ప్లే అందించి ఓ కీలక పాత్రలో నటించడం విశేషం. ప్రవీణ్ ఇమ్మడి సంగీతాన్ని అందించిన హనీ ట్రాప్ మూవీ ఆడియో విడుదల కార్యక్రమం హైదరాబాద్ ఫిలిం ఛాంబర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకులు ఆర్పీ పట్నాయక్, రఘు కుంచె అతిథులుగా పాల్గొని చిత్ర బృందానికి బెస్ట్ విశెస్ తెలిపారు.


ఈ సందర్భంగా సంగీత దర్శకుడు ఆర్పీ మాట్లాడుతూ...సొసైటీకి అవసరం అయ్యే పాయింట్ తో కమర్షియల్ గా సినిమాలు చేయడం సునీల్ కుమార్ రెడ్డి గారి ప్రత్యేకత. ఒక కమిట్ మెంట్ తో సినిమాలు చేసే ఆయనంటే నాకు గౌరవం. సినిమా ఊరికే వినోదాన్ని అందించేది కాదు దానికో పర్పస్ ఉంటుందని నమ్మే దర్శకులు సునీల్ కుమార్ రెడ్డి. హనీ ట్రాప్ అనేది మన రియల్ లైఫ్ లో వింటుంటాం. గొప్ప పేరున్న వ్యక్తులు వ్యక్తులు ఇలాంటి హనీ ట్రాప్ లో పడి తమ పేరు పాడు చేసుకుంటారు. ఈ మూవీని సునీల్ కుమార్ గారు ఎంత బాగా తీసుంటారో ఊహించగలను. టీమ్ అందరికీ ఆల్ ద బెస్ట్ చెబుతున్నా. అన్నారు.


సంగీత దర్శకుడు రఘు కుంచె మాట్లాడుతూ...ఇలా ఓ సినిమా ఆడియో సీడీ పట్టుకుని చాలా రోజులవుతోంది. అంతా డిజిటల్ అయ్యాక, ఆడియో సీడీలు కనిపించడం లేదు. మల్లీ హనీ ట్రాప్ ఆడియోతో మాకు ఇలాంటి అవకాశం కల్పించారు.  సునీల్ కుమార్ రెడ్డి గారి చిత్రాల్లో నాకు గల్ఫ్ సినిమా బాగా ఇష్టం. ఆ సినిమాలో గల్ఫ్ దేశాల్లో ఉపాధి కోసం వెళ్లి మన వాళ్లు పడే ఇబ్బందులు ఎంతో సహజంగా చూపించారు. నాకు సునీల్ గారి సినిమా లో నటించే అవకాశం వచ్చింది. మంచి సినిమా తో త్వరలో మీ ముందుకు వస్తాము. హనీ వెనుక ట్రాప్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు. ఈ సినిమా కూడా మంచి విజయం సాదించాలి అని అన్నారు.


సాహిత్యాన్ని అందించిన యెక్కలి రవీంద్ర బాబు మాట్లాడుతూ...హనీ ట్రాప్ మూవీకి మా వామనరావు  గారు మంచి కథా స్క్రీన్ ప్లే అందించారు. ఆ కథా స్క్రీన్ ప్లేను సునీల్ కుమార్ రెడ్డి గారు ఆసక్తికరంగా తెరకెక్కించారు. నాకు ఈ సినిమాలో పాటల రాసే అవకాశం కలిగింది. పాటలు బాగా వచ్చాయి. అన్నారు.


నటుడు శివ కార్తీక్ మాట్లాడుతూ...సునీల్ కుమార్ రెడ్డి గారు మాకు గురువు లాంటి వారు. ఆయన గతంలో గల్ఫ్ అనే సినిమాలో నాకు క్యారెక్టర్ ఇచ్చారు. ఆయనతో ఇది నాకు రెండో సినిమా. హనీ ట్రాప్ లో మంచి క్యారెక్టర్ లో నటించే అవకాశం కల్పించారు. మా సినిమాను విష్ చేసేందుకు వచ్చిన ఆర్పీ పట్నాయక్ గారికి, రఘు కుంచె గారికి థాంక్స్. అన్నారు.


నిర్మాత వివి వామనరావు మాట్లాడుతూ...నేను కథా  రచయితగా ఎలా సినిమాను ఊహించుకున్నానో, అంతకన్నా బాగా సునీల్ కుమార్ రెడ్డి గారు తెరకెక్కించారు. నేను రాసిన స్క్రీన్ ప్లే బాగుందంటూ ఆయన ఎంకరేజ్ చేశారు. ఫ్యూచర్ లోనూ మా జర్నీ ఇలాగే కొనసాగుతుంది. హనీ ట్రాప్ సినిమా ప్రివ్యూ చూసిన వాళ్లంతా చాలా బాగుందని చెప్పారు.


 శ్రీలక్ష్మీ ఫిలింస్ బాపిరాజు గారు హనీ ట్రాప్ సినిమా డిస్ట్రిబ్యూషన్ చేయబోతున్నారు. గతంలో ఒక రొమాంటిక్  క్రైమ్ కథ, రొమాంటిక్ క్రిమినల్స్ చిత్రాలు మంచి విజయవంతం అయ్యియి, ఇప్పుడు ఈ హనీ ట్రాప్ సినిమా కూడా అంతే విజయం సాధిస్తుంది అనే నమ్మకం ఉంది.  ఈ వర్షాకాలంలో వేడి పుట్టించే సినిమా అవుతుంది. మా కాంబినేషన్ లో మరో రెండు సినిమాలు ప్లానింగ్ లో ఉన్నాయి. అన్నారు.


దర్శకుడు పి. సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ...నా టీమ్ మెంబర్స్ అంతా ఫ్యామిలీ మెంబర్స్ లా ఉంటారు. మా అసోసియేషన్ కూడా అలాగే కంటిన్యూ అవుతుంటుంది. సంగీత దర్శకుడు ప్రవీణ్ ఇమ్మడి నాతో గంగపుత్రులు సినిమా నుంచి 12 ఏళ్లుగా ట్రావెల్ చేస్తున్నారు. వర్క్ బిజీలో ఈ కార్యక్రమానికి ఆయన రాలేకపోయారు. రఘు కుంచె గారు మా టీమ్ లో మెంబర్ అయినందుకు సంతోషం. ఆర్పీ పట్నాయక్ గారు మమ్మల్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ ఉంటారు. వామనరావు గారు నిర్మాతే కాదు రాజకీయ పరిజ్ఞానం ఉన్నవారు, ఎంతో మంది జీవితాలను దగ్గర నుంచి చూశారు. ఆయన రాసిన నాటకాలకు నంది ఆవార్డులు వచ్చాయి, సీరియల్స్ జనాదరణ పొందాయి. అలాంటి ప్రతిభాశాలితో కలిసి పనిచేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నాను. నా కెరీర్ లో బెస్ట్ డైలాగ్స్ కు నంది ఆవార్డ్స్ తీసుకున్నాను. వామనరావు గారు హనీ ట్రాప్ అనే కథను చెప్పగానే ఈ కథలో కమర్షియల్ మూవీకి కావాల్సిన విషయం ఉందనిపించి, దీనిపై వర్కవుట్ చేయడం ప్రారంభించాం. వేసుకున్న బడ్జెట్ కు ఒక్క రూపాయి పెరగకుండా జాగ్రత్త పడుతూ సినిమా షూటింగ్ చేశాం. ఆడియెన్స్ కు ఏం కావాలో చూసుకుంటూ, మా సెన్సిబిలిటీస్ కు తగినట్లు రూపొందించిన సినిమా హనీ ట్రాప్. మా గత హిట్ చిత్రాల్లాగే హనీ ట్రాప్ తప్పకుండా మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. అన్నారు.


రిషి, శిల్పా నాయక్, తేజు అనుపోజు, శివ కార్తీక్, వామనరావు, ప్రసన్న కుమార్, సన, శశిధర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ - ఎస్ వి శివరామ్, సంగీతం - ప్రవీణ్ ఇమ్మడి, ఎడిటర్ - నరేష్ కుమార్ మేడికి, సాహిత్యం - యెక్కలి రవీంద్రబాబు, దాకుపాటి రవిప్రకాష్, గాయకులు - ధనుంజయ్, పెండ్యాల శ్రీ ప్రసన్న, కథా స్క్రీన్ ప్లే, నిర్మాత - వి వి వామనరావు, మాటలు, దర్శకత్వం - పి సునీల్ కుమార్ రెడ్డి.