Home » » PelliSandaD in Post Production works

PelliSandaD in Post Production works

 


పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో రాఘ‌వేంద్ర‌రావు ‘పెళ్లి సంద‌D’ ... సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల‌కు స‌న్నాహాలు

పాతికేళ్ల ముందుకు ద‌ర్శ‌కేంద్రుడు రాఘవేంద్ర‌రావు, కీర‌వాణి కాంబినేష‌న్‌లో వ‌చ్చిన మ్యూజిక‌ల్ మ్యాజిక్ ‘పెళ్లి సంద‌డి’. త‌క్కువ బ‌డ్జెట్‌తో రూపొందిన ఆ సినిమా అప్ప‌ట్లో సెన్సేష‌న‌ల్ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచిన సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు ఆర్కా మీడియా వ‌ర్క్స్‌, ఆర్‌.కె ఫిలిం అసోసియేట్స్ బ్యాన‌ర్స్‌పై కె.కృష్ణ మోహ‌న్ రావు స‌మ‌ర్ప‌ణ‌లో  ద‌ర్శ‌కేంద్రుడు కె. రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌లో రూపొందుతున్న‌ చిత్రం ‘పెళ్లి సంద‌D’తో మ‌రోసారి మ్యాజిక్‌ను రిపీట్ చేయ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఈ క్యూట్ అండ్ బ్యూటీఫుల్ ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌తో రాఘ‌వేంద్ర‌రావు శిష్యురాలు గౌరి రోణంకి ద‌ర్శ‌కురాలిగా ప‌రిచ‌యం అవుతున్నారు. మాధవి కోవెలమూడి, శోభు యార్లగడ్డ, ప్రసాద్‌ దేవినేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.   నాటి `పెళ్లిసంద‌డి`లో శ్రీ‌కాంత్ హీరో అయితే నేటి ‘పెళ్లిసంద‌D’లో శ్రీ‌కాంత్ త‌న‌యుడు రోష‌న్ హీరో అవ‌డం విశేషం. శ్రీలీల హీరోయిన్‌. ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ సంద‌ర్భంగా.. 


ద‌ర్శ‌కురాలు గౌరి రోణంకి మాట్లాడుతూ ‘‘అన్ని జోన‌ర్స్‌లో బ్లాక్ బ‌స్ట‌ర్స్ సినిమాలు తీసి ఎందరో స్టార్స్ రేంజ్‌ను పెంచిన సీనియ‌ర్‌ ద‌ర్శ‌కుడు, ఎంద‌రో హీరోయిన్స్‌ను స్టార్స్ హీరోయిన్స్‌గా మార్చిన గోల్డెన్ హ్యాండ్ మా గురువుగారు రాఘ‌వేంద్రరావు గైడెన్స్‌లో రూపొందుతోన్న‘పెళ్లి సంద‌D’ షూటింగ్ పూర్త‌య్యింది. అవుట్‌పుట్ చాలా బాగా వ‌చ్చింది. శ్రీకాంత్‌గారి అబ్బాయి రోష‌న్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రోష‌న్‌, శ్రీలీల జోడీ ఓ ఫ్రెష్ లుక్‌ను తీసుకొచ్చింది. ఇద్ద‌రూ ఎంతో చ‌క్క‌గా క్యూట్‌గా పాత్ర‌ల‌ను ఫెంటాస్టిక్‌గా క్యారీ చేశారు. హీరో హీరోయిన్ మ‌ధ్య ల‌వ్ ట్రాక్, ఎమోష‌న్స్‌, కామెడీ అన్ని అంశాల‌తో సినిమా అంద‌రినీ మెప్పించేలా ఉంటుంది. రాఘ‌వేంద్ర‌రావు, కీర‌వాణిగారి కాంబినేష‌న్ ఎంత పెద్ద హిట్టో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. మ‌రోసారి కీర‌వాణిగారు త‌న సంగీతంతో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేయ‌డం ఖాయం. ఇప్ప‌టికే విడుదలైన రెండు పాట‌ల‌కు వ‌చ్చిన ఆద‌ర‌ణే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్. మిగిలిన పాట‌ల‌ను, టీజ‌ర్‌, ట్రైల‌ర్‌ను త్వ‌ర‌లోనే ప్రేక్ష‌కుల ముందుకు తీసుకొస్తాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల్లో భాగంగా ఇప్పుడు రీ రికార్డింగ్ జ‌రుగుతోంది. అన్ని కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసి సినిమాను సెప్టెంబ‌ర్‌లో విడుద‌ల చేయ‌డానికి ప్లాన్ చేస్తున్నాం’’ అన్నారు. 



నటీనటులు:


రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌, త‌నికెళ్ల భ‌ర‌ణి, పోసాని కృష్ణ ముర‌ళి, వెన్నెల కిషోర్‌, స‌త్యంరాజేష్‌, రాజీవ్ క‌నకాల‌, శ్రీ‌నివాస్ రెడ్డి, శక‌లక శంక‌ర్‌, అన్న‌పూర్ణ‌, జాన్సి, ప్ర‌గ‌తి, హేమ‌, కౌముది, భ‌ద్రం, కిరీటి త‌దిత‌రులు.. 


సాంకేతిక వ‌ర్గం: 


సంగీతం: ఎం.ఎం.కీర‌వాణి

సాహిత్యం: శివ‌శ‌క్తి ద‌త్త‌, చంద్ర‌బోస్

సినిమాటోగ్ర‌ఫి: సునీల్ కుమార్ నామ

ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు

ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్ మ‌న్నె,

‌మాట‌లు: శ్రీ‌ధ‌ర్ సీపాన‌

ఫైట్స్‌: వెంక‌ట్

కొరియోగ్ర‌ఫి: శేఖ‌ర్ వీజే

ప్రొడ‌క్ష‌న్ ఎగ్జిక్యూటివ్‌: వి. మోహ‌న్ రావు,

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూస‌ర్‌: సాయిబాబా  కోవెల‌మూడి

స‌మ‌ర్ప‌ణ‌: కె. కృష్ణ‌మోహ‌న్ రావు‌

నిర్మాత‌లు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని

ద‌ర్శ‌క‌త్వ ప‌ర్య‌వేక్ష‌ణ‌: కె. రాఘ‌వేంద్ర‌రావు బి.ఎ

ద‌ర్శ‌క‌త్వం: గౌరీ రోణంకి.



Share this article :