Latest Post

Vijay Sethupathi-Jayaram's 'Radio Madhav' to release on April 23

 Vijay Sethupathi-Jayaram's 'Radio Madhav' to release on April 23


'Maarconi Mathaai', the Malayalam movie starring Vijay Sethupathi and Jayaram, is releasing in Telugu as 'Radio Madhav. Presented by Gundepudi Seenu', the film is brought to the Telugu audience by Lakshmi Chennakesava Films' owner and producer DV Krishnaswamy, who has previously produced Dulquer Salmaan-Sai Pallavi's 'Hey Pillagaada'. Bashya Sri, who has previously worked on 'Bicchagadu' and other movies, has penned its dialogues and lyrics. The makers have announced that 'Radio Madhav' is going to release in theatres on April 23. Today, an event was held at Prasad Labs in Hyderabad.

Producer DV Krishnaswamy said, "Our film has an ensemble cast. A feel-good entertainer, it says that nobody knows when and how love takes birth in an individual. Jayaram's character falls in love in the film. Due to his age, the distance in love grows. How Vijay Sethupathi's character brings the lovers together is the story. The visuals are rich. The songs have come out really well. Well-known singers have sung them. Bashya Sri has penned them amazingly. You won't see 'Radio Madhav' as a dubbing movie. The audience will get the feeling of watching a straight movie."

Jayaram, speaking via a video clip, said, "I have done 'Tenali' and 'Panchatantram' with Kamal Haasan more than 15 years ago. I recently did 'Bhaagamathi' with Anushka Shetty and 'Ala Vaikunthapurramuloo' with Allu Arjun-Trivikram duo in Telugu. I am happy that my Malayalam film 'Maarconi Mathaai' is releasing in Telugu as 'Radio Madhav'. It's a beautiful film."

Executive Producer S Srinivasa Murthy said, "I hope the audience will encourage our feel-good movie by watching it only in theatres."

Presenter Gundepudi Seenu said, "Love is a great feeling. It's very pure. This film shows that love knows no age."

Co-producer DV Chalam said, "My son is producing this movie. He has put in a lot of effort to make it look like a straight film. It feels like a Telugu film."

Bashya Sri said, "I have penned the film's dialogues and lyrics. Vijay Sethupathi garu said that he had separated lovers in 'Uppena'. In 'Radio Madhav', he is going to unite lovers. He is the film's hero, and has played his real-life character. His and Jayaram garu's characters have come out really well. Love knows no age. I was reminded of Venkatesh garu's movies watching it."

Cast:

Vijay Sethupathi, Jayaram, Athmiya Rajan, Purna, Naren, Aju Varghese and others are part of the cast.

Crew:

Presenter: Gundepudi Seenu. Dialogues-Lyrics: Bashya Sri. Editing: Shameer Muhammed. Cinematography: Sajan Kalathil. Music Director: M. Jayachandran. PRO: Naidu Surendrakumar-PHani Kandukuri (Beyond Media). Executive Producer: N Srinivasa Murthy. Co-Producer: DV Chalam. Producer: DV Krishnaswamy. Story-Director: Sanil Kalathil.

Sundeep Kishan Kona film Factory Gully Rowdy First Look Launched

 


సందీప్‌ కిషన్‌ 'గల్లీ రౌడీ' ఫస్ట్‌ లుక్‌ విడుదల చేసిన వి.వి.వినాయక్‌, నందినీ రెడ్డి


సందీప్‌ కిషన్‌, నేహా శెట్టి హీరో హీరోయిన్లుగా కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌, ఎంవీవీ సినిమా పతాకాలపై కోన వెంకట్‌ సమర్పణలో జి.నాగేశ్వరరెడ్డి దర్శకత్వంలో ఎం.వి.వి.సత్యనారాయణ నిర్మిస్తోన్న చిత్రం 'గల్లీ రౌడీ'. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదల కార్యక్రమం ఆదివారం హైదరాబాద్‌లో జరిగింది. డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌, డైరెక్టర్‌ నందినీ రెడ్డి 'గల్లీ రౌడీ' ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా.. 


చిత్ర సమర్పకుడు కోన వెంకట్‌ మాట్లాడుతూ - "'గల్లీ రౌడీ' చిత్రాన్ని కోవిడ్ సమయంలోనే స్టార్ట్‌ చేశాం. కోవిడ్‌ లాక్‌డౌన్‌ సమయంలో సార్‌ ఓ కథ ఉంది వినండి అని సందీప్‌ .. భాను, నందు అనే రైటర్స్‌ను రాసిన కథను నాగేశ్వరరెడ్డిగారి దగ్గరకు పంపితే, ఆయన నా దగ్గరకు పంపాడు. ఓ కథ మనుషులను కలుపుతుంది. వేల మందిని కదుపుతుంది. కొత్త స్నేహాలు, పరిచయాలు, బంధాలు కథ వల్ల ఏర్పడుతుంది. ఆ కథ విన్న వెంటనే సూపర్ హిట్ స్టోరి అని అర్థమవుతుంది. నవంబర్‌ 22న కథను వింటే, డిసెంబర్‌ 16నుంచి షూటింగ్‌ను వైజాగ్‌లో స్టార్ట్‌ చేశాం. మొత్తం షూటింగ్‌ పూర్తయిన తర్వాతే హైదరాబాద్‌కు వచ్చాం. సందీప్‌ జడ్జ్‌మెంట్‌ చాలా బావుంటుంది. తను ఈ కథకు హండ్రెడ్‌ పర్సెంట్‌ యాప్ట్‌ అయ్యాడు. కథకు ఉండే శక్తి వల్లనే రాజేంద్ర ప్రసాద్‌గారితో కలిసి పనిచేసే అదృష్టం కలిగింది.  ఈ సినిమాకు ఇద్దరు మ్యూజిక్‌ డైరెక్టర్స్‌ ఉన్నారు. ఒకరు రామ్‌ మిర్యాల.. తర్వాత సాయికార్తీక్‌ కూడా యాడ్‌ అయ్యాడు. ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌ టీమ్‌లో జాయిన్‌ అయ్యాడు. దేనికైనా రెఢీ తర్వాత నేను, నాగేశ్వర్‌ రెడ్డిగారు కలిసి పనిచేసిన చిత్రమిది. సందీప్‌కు జోడీగా నేహా శెట్టి కుదిరింది. నేహా అద్భుతమైన కామెడీ టైమింగ్‌ ఉన్న నటి.  బాబీ సింహ, వెన్నెల కిషోర్‌, పోసాని ఇలా మాయ జరిగినట్లు అందరినీ సినిమా కలిపేసింది. ఇదొక ఢీ లాంటి సినిమా అని చెప్పగలను. ఒక వైపు టెన్షన్‌ ఉంటూ మరో వైపు ఫన్‌.. రెండు పట్టాల్లాగా వెళ్లే సినిమా మా గల్లీ రౌడీ. ఏ కామెడీని నేను నమ్ముకుని నాకు పేరొచ్చిందో అలాంటి కామెడీతో పాటు మంచి ఎమోషన్‌ ఉండే సినిమా" అన్నారు.


సెన్సేషనల్‌ డైరెక్టర్‌ వి.వి.వినాయక్‌ మాట్లాడుతూ - "ఎంవీవీ సత్యనారాయణగారు మంచి వ్యక్తి. అలాగే కోన వెంకట్‌తో నాకున్న అనుబంధం తెలిసిందే. టాలెంట్‌ ఎక్కడున్నా, పట్టుకోవడంలో కోన స్పెషలిస్ట్‌. భానుకి ఈ సినిమాతో మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వర్‌ రెడ్డి మా సాగర్‌గారి దగ్గరే పనిచేశాడు. కామెడీ తీయడంలో ఆయనదొక కొత్త పంథా. మంచి మ్యూజిక్‌ సెన్స్‌ ఉన్న డైరెక్టర్‌. సందీప్‌, ఛోటాగారి మేనల్లుడు, అంటే నాకు మేనల్లుడితో సమానం. తను మంచి కథలను పిక్‌ చేసుకుంటూ సినిమాలు చేస్తూ వస్తున్నాడు. హీరోయిన్‌ నేహాకు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. రాజేంద్ర ప్రసాద్‌గారి గురించి తెలుగు వాళ్లు గర్వంగా చెప్పుకునే ఆర్టిస్ట్‌. ఇందులో ఆయన ఓ పిరికి కానిస్టేబుల్‌ పాత్రలో నటించాడు. ఇందులో వర్క్‌ చేసిన అందరికీ మంచి పేరు, డబ్బులు రావాలని కోరుకుంటున్నాను" అన్నారు.  


నందినీ రెడ్డి మాట్లాడుతూ - "ఈ సినిమాకు సంబంధించిన వారందరూ రౌడీలే. ఈ రౌడీలందరూ నాకు ఆప్తులే. ఎంవీవీగారు రాజకీయాల్లో ఉంటూ కూడా సినిమా ఇండస్ట్రీకి టైమ్‌ కేటాయించి మంచి సినిమాలను అందిస్తున్నారు. ఈ సినిమాకు ఆమెకు మంచి సక్సెస్‌ కావాలని కోరుకుంటున్నాను. కోనగారికి ఈ సినిమా మరో బ్లాక్‌ బస్టర్‌ కావాలని కోరుకుంటున్నాను. నాగేశ్వర్‌ రెడ్డిగారు కరోనా టెన్షన్‌ నుంచి ఈ సినిమాతో రిలీఫ్‌ ఇస్తారని భావిస్తున్నాను. సందీప్‌..నా ఫ్రెండ్ రౌడీ. తనకు సినిమాలంటే ఎంత ఫ్యాషనో నాకు తెలుసు. రాజేంద్ర ప్రసాద్‌గారు ఈ సినిమాలో ఏదో మేజిక్‌ చేస్తారని అనుకుంటున్నాను. ఆయనతో మే నెల నుంచి ఓ సినిమా చేయబోతున్నాను" అన్నారు. 


నటకిరిటీ డా.రాజేంద్ర ప్రసాద్‌ మాట్లాడుతూ "'గల్లీ రౌడీ'లో అందరూ హాయిగా నవ్వుకునే కామెడీ ఉంటుంది. సందీప్‌కి ఇది ట్రైలర్‌ మేడ్‌ క్యారెక్టర్‌ అని చెప్పొచ్చు. చాలా మంచి నటుడు. ఈ కథలో మా అందరి పాత్రలు చక్కగా లింకు అయ్యి ఉంటాయి. నాగేశ్వర్‌ రెడ్డిగారు మార్కు కామెడీతో సినిమా ఉంటుంది. అలాగే కోనతో తొలిసారి కలిసి పనిచేస్తున్నాను. లేడీస్‌ ట్రైలర్‌కు ఎంత మంచి అప్రిషియేషన్‌ వచ్చిందో ఈ సినిమాకు కూడా అంత మంచి అప్రిషియేషన్‌ వచ్చింది. హీరోయిన్‌ నేహాకు ఆల్‌ ది బెస్ట్‌. కరోనాలో హాయిని అందించే సినిమా మా గల్లీరౌడీ. మా ఎంవీవీ సత్యనారాయణ చాలా మంచి నిర్మాత. ఈ సినిమాతో ఆయనకు మరో సక్సెస్‌ రావాలని కోరుకుంటున్నాను" అన్నారు. 


నిర్మాత ఎం.వి.వి.సత్యనారాయణ మాట్లాడుతూ - "మా 'గల్లీ రౌడీ' మూవీ ఇది వరకు నేను, మా కోన వెంకట్‌ చేసిన గీతాంజలి కంటే చాలా పెద్ద హిట్ అవుతుందని నమ్ముతున్నాను. కథ విన్న పది రోజుల్లోనే షూటింగ్‌ను స్టార్ట్ చేశాం. మంచి కామెడీ చిత్రాలను అందించిన దర్శకుడు నాగేశ్వర్‌ రెడ్డిగారి డైరెక్షన్‌లో సినిమా రూపొందింది. ఎంటైర్‌ యూనిట్‌ మంచి సపోర్ట్‌ను అందించారు. అనుకున్న బడ్జెట్‌ను సినిమాను పూర్తి చేశాం. సినిమా బిజినెస్‌ కూడా పూర్తయ్యింది. సినిమా తప్పకుండా మంచి హిట్‌ అవుతుంది. ఈ సినిమా హిట్‌ కాకపోతే నా జడ్జ్‌మెంట్‌లో రాంగ్‌ ఉన్నట్లే. నేను సినిమాలు  చేయలేనెమో అన్నంతగా, నమ్మకంతో సినిమా సక్సెస్‌ గురించి చెబుతున్నాను. టెన్షన్‌, కామెడీ సమాంతరంగా నడుస్తుంటాయి" అన్నారు. 


డైరెక్టర్‌ జి.నాగేశ్వర్‌ రెడ్డి మాట్లాడుతూ - "నేను కథను వినేటప్పుడు టెక్నీషియన్ కంటే ఆడియెన్‌గానే వింటాను. నా టీమ్‌ అందరికీ థాంక్స్‌. సినిమాను అరవై రోజుల్లో పూర్తి చేశాం. కోన వెంకట్‌గారు, రాజేంద్ర ప్రసాద్‌గారు వ్యసనంలా మారిపోయారు. వారు లేకపోతే నెక్ట్స్‌ సినిమా చేయలేం అనేంత దగ్గరయ్యారు. ఎంటైర్‌ యూనిట్‌ సినిమాను ప్రేమించి చేశాం. ఎంవీవీ సత్యనారాయణగారు ఫుల్‌ కో ఆపరేషన్‌ను అందించారు. చాలా మంచి నిర్మాత. ఆయనతో కలిసి వర్క్‌ చేయడం హ్యాపీ. సందీప్‌కు లవ్‌ యు. నేహా శెట్టి..బ్యూటీఫుల్‌ ఆర్టిస్ట్‌. వినాయక్‌గారికి, నందినీగారికి థాంక్స్‌" అన్నారు. 


హీరో సందీప్‌ కిషన్‌ మాట్లాడుతూ - " ఓ బలంతో ఇక్కడ నిలబడుతున్నాను. అందుకు కారణం ప్రేక్షకులే. వారు ఏ1 ఎక్స్‌ప్రెస్‌కు అందించిన విజయంతోనే ఈ సినిమా చేయడానికి నమ్మకం వచ్చింది.  ఏ1 ఎక్స్‌ప్రెస్‌ సినిమా చేసేటప్పుడు ఓ చిన్న పాటి టెన్షన్‌ ఉండింది. ఆ సమయంలో ఓ హ్యాపీ మూవీ చేయాలనిపించింది. నాగేశ్వర్‌ రెడ్డిగారిని నేను బ్లైండ్‌గా నమ్ముతాను. ఆయన మాట వింటాను. ఆయన నిజాయతీగా ఉంటారు. ఆయన నన్ను నాకే కొత్తగా చూపిస్తారు. నాకు, కోనగారికి బ్యూటీఫుల్‌ రిలేషన్‌ షిప్‌ ఉంటుంది. ఆయనొక పని రాక్షసుడు. ఓ సినిమాకు ఆయన పనిచేసేటప్పుడు అందరి కంటే ముందుగా ఆరు గంటలకు అక్కడుంటాడు. మా సినిమాటోగ్రాఫర్‌ ఎలాంటి బ్రేక్‌ లేకుండా పని చేశాడు. సినిమా విషయానికి వస్తే.. అందరూ నవ్వుకునే సినిమా. నా క్యారెక్టర్‌ గురించి చెప్పాలంటే సినిమాలో మా తాత రౌడీ.. మా నాన్న రౌడీ. నాకు రౌడీ కావడం ఇష్టముండదు. స్కూల్‌ నుంచి లాక్కొచ్చి రౌడీని చేస్తారు. రాజేంద్ర ప్రసాద్‌గారు భయస్తుడైన కానిస్టేబుల్‌ రోల్‌లో నటించారు. ఆయన్ని చూస్తూ పెరిగాను. ఆయనతో కలిసి పనిచేయడం మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌. హీరోయిన్‌ నేహాలో మంచి కామెడీ టైమింగ్‌ ఉంటుంది. భాను, నందు, సాయిలకు థాంక్స్‌. చక్కటి కథను కుదిరింది. నెక్ట్స్‌ సినిమాకు కూడా వాళ్లే కథను అందిస్తున్నారు. నిర్మాతగారు ఎంవీవీ సత్యనారాయణగారు, ఎంత పెద్ద పోజిషన్‌లో ఉన్నా కూడా డౌన్‌ టు ఎర్త్‌ పర్సన్‌. ఆయనతో కలిసి పనిచేయడం హ్యాపీ. బాబీ సింహా ఈ సినిమాలో చాలా కీ రోల్‌లో నటించాడు. తనకు నాకు మంచి ఫ్రెండ్‌. అడగ్గానే నటించినందుకు తనకు థాంక్స్‌. వినాయక్‌గారికి, నందినీ రెడ్డిగారికి థాంక్స్‌. వినాయక్‌గారు నాకు పెద్ద దిక్కు. నందినీ రెడ్డి నాకు మంచి ఫ్రెండ్. సినిమాను థియేటర్‌లో బాగా ఎంజాయ్‌ చేస్తారు" అన్నారు. 


ఇంకా ఈ కార్యక్రమంలో ఎడిటర్‌ ఛోటా కె.ప్రసాద్‌, హీరోయిన్‌ నేహా శెట్టి, మ్యూజిక్‌ డైరెక్టర్‌ సాయి కార్తీక్‌, సినిమాటోగ్రాఫర్‌ సుజాత సిద్ధార్థ్‌, రైటర్స్‌ భాను నందు తదితరులు పాల్గొన్నారు.


Tremendous Response for Pushpa Prelude

 


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, క్రియెటివ్ డైర‌క్ట‌ర్ సుకుమార్‌, మైత్రిమూవీ మేక‌ర్స్ పాన్ ఇండియా మూవీ పుష్ప ప్రి లుక్  కి అనూహ్య స్పంద‌న‌ ..


అలావైకుఠ‌పురంలో లాంటి ఇండ‌స్ట్రి హిట్ త‌రువాత‌ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రంగస్థ‌లం‌ లాంటి ఇండ‌స్ట్రిహిట్ త‌రువాత క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం లో ఆర్య‌, ఆర్య‌ 2 చిత్రాల త‌రువాత హ్యాట్రిక్ చిత్రం గా తెర‌కెక్కుతున్న చిత్రం పుష్ప‌. ఈ చిత్రాన్ని వ‌రుస బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలతో ప‌వ‌ర్ ప్యాక్డ్  ప్రోడ‌క్ష‌న్ హౌస్ గా టాలీవుడ్ లో పేరుగాంచిన ‌ మైత్రీ మూవీ మేకర్స్ మ‌రో నిర్మాణ సంస్ధ‌ ముత్తంశెట్టి మీడియా తో క‌లిసి నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబందించిన ప్ర‌తి అప్‌డేట్ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవ‌టం విశేషం. టైటిల్, ఫ‌స్ట్ లుక్‌, షూటింగ్ అప్‌డేట్ లు కి వ‌చ్చిన క్రేజ్ వ‌రల్డ్ వైడ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ నే కాకుండా తెలుగు ప్రేక్ష‌కుల్ని కూడా విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఆగ‌స్ట్ 13న ప్ర‌పంచ‌ వ్యాప్తంగా విడుద‌ల కాబోతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్ డేట్స్ కోసం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రీల్యూడ్ విడుదల చేశారు దర్శక నిర్మాతలు. ఏప్రిల్ 7, సాయంత్రం 6.12 నిమిషాలకు పుష్ప రాజ్ ను ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ సినిమాలో ప్రతినాయకుడిగా జాతీయ అవార్డు గ్ర‌హిత, మ‌ళ‌యాలీ స్టార్ హీరో ఫహాద్ ఫాజిల్ పుష్ప‌లో ప్ర‌తినాయ‌కుడిగా న‌టిస్తున్నారు. ఫ‌హాద్ న‌టించిన ప‌లు మ‌ళ‌యాలీ చిత్రాలు తెలుగుతో పాటు పాన్ ఇండియా వైడ్ కూడా సినీ అభిమానులు ఆద‌ర‌ణ దక్కించుకున్నాయి. ఈ చిత్రంలో పుష్ప‌రాజ్ కి జోడిగా ర‌ష్మిక న‌టిస్తుంది. ర‌ష్మిక లుక్ కూడా చాలా నేచుర‌ల్ గా వుంటుంది. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్ర‌సాద్ అందించిన ఆడియో హైలెట్ గా నిలుస్తుంది. అల్లు అర్జున్‌, సుకుమార్ , దేవిశ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో ఆడియో కి ఒక క్రేజ్ వుంటుంది. అలాగే మైత్రిమూవీస్‌, దేవి శ్రీ ప్ర‌సాద్ కాంబినేష‌న్ లో వ‌చ్చే ఆడియో కి ఓ క్రేజ్ వుంటుంది. ఇప్ప‌డు వీరందరి కాంబినేష‌న్ లో వ‌స్తున్న ఈ పుష్ఫ ఆడియో కి క్రేజ్ వేరే లెవెల్ అనే చెప్పాలి. సినిమాటోగ్రాఫ‌ర్ మిరోస్లోవ్ కుబ బ్రోజెక్ విజువ‌ల్స్ అల్లు అర్జున్ అభిమానుల్ని, ప్రేక్ష‌కుల్ని ఆశ్చ‌ర్య‌ప‌రుస్తాయి. శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటున్న ఈ చిత్రాన్ని అన్ని కార్య‌క్ర‌మాలు పూర్త‌చేసి తెలుగు, త‌మిళ‌, మ‌ళ‌యాల‌, క‌న్న‌డ మ‌రియు హింది భాష‌ల్లో ఏక‌ కాలంలో విడుద‌ల అగ‌ష్టు 13న విడుద‌ల చేయ‌టానికి నిర్మాత‌లు నిర్ణ‌యించుకున్నారు. ఈ చిత్రం త‌ప్ప‌కుండా అన్ని త‌ర‌హ ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్ట‌కునేలా తెర‌కెక్కిస్తున్నారు.



నటీనటులు :

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (హీరో)

రష్మిక మందన్న (హీరోయిన్)


సాంకేతిక నిపుణులు : 

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్ 

సహ నిర్మాత - ముత్తంశెట్టి మీడియా

రచ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సుకుమార్

ప్రొడ్యూసర్స్: నవీన్ ఎర్నేని, రవి శంకర్.వై

కెమెరామెన్: మిరోస్లోవ్ కుబ బ్రోజెక్

మ్యూజిక్: దేవి శ్రీ ప్రసాద్

ఎడిటర్: కార్తిక్ శ్రీనివాస్

స్టైలింగ్ : దీపాలి నూర్

ఆర్ట్ డైరెక్టర్: ఎస్.రామకృష్ణ , మౌనిక

సి.ఈ. ఓ: చెర్రీ

లైన్ ప్రొడ్యూసర్: బాల సుబ్రమణ్యం కె.వి.వి

పి.ఆర్.ఓ: ఏలూరు శ్రీను - మ‌డూరి మధు


Mani Ratnam sir said making a movie is like composing a song” – says AR Rahman

 


Mani Ratnam sir said making a movie is like composing a song” – says AR Rahman

Movie production can seem like a sharp detour for two-time Academy Award-winning music composer AR Rahman. But look closely, and you realise that filmmaking isn’t really different from composing a melody. This was the lesson Rahman’s long-time collaborator Mani Ratnam taught him, egging him on to develop the script for 99 Songs.

“Mani sir once said to me that making a movie is like composing a song. You have the introduction, the song’s theme, the tune and then you do the background mixing. Then comes the antara, and with it, you have a journey that comes to an end beautifully. That’s when it struck me how [fulfilling] it is to create another art form in your own language,” says Rahman, crediting the auteur for pushing him towards filmmaking.

His debut production features debutant Ehan Bhat and Edilsy Vargas with musician-director Vishwesh Krishnamoorthy at the helm. The composer-producer knows that the Jio Studios endeavour — a passionate love story with music at its core — is far removed from mainstream offerings. “People’s experience of a movie truly depends on whether the story resonates with them or not. After the pandemic, our sensibilities have changed. 99 Songs is more of an experiential movie. The sound and visuals are an experience unto themselves.” 

99 Songs will release in Hindi, Tamil and Telugu on 16th April, 2021.  Presented by Jio Studios, the film is produced by A.R. Rahman’s production company YM Movies and co-produced by Ideal Entertainment. 

Kartikeya to play NIA officer

 Kartikeya to play NIA officer in an action entertainer helmed by Sree Saripalli




Young hero Kartikeya Gummakonda will be collaborating with Sree Saripalli for his next project, which will be produced by 88 Rama Reddy under Sree Chitra Movie Makers banner. T Adi Reddy will be presenting the film. Tanya Ravichandran plays the female lead in the action entertainer and it also stars Sudhakar Komakula in an special appearance. The unit is currently shooting a key schedule in Hyderabad. 




Speaking on the occasion, the director Sree Saripalli said, “We are working on a complete action entertainer and Kartikeya will be seen as an NIA officer in this film. His character will be full of energy. We will be introducing Tanya Ravichandran who paired with Vijay Sethupathi in Tamil film Karuppan to our Telugu audiences with this film. She is the granddaughter of senior actor Ravichandran and is also a well-versed classical dancer. Sudhakar Komakula is also playing a pivotal role. There are a total of 4 songs in our film and Prashanth R Vihari who shot to fame with Mental Madhilo, Dorasani, and Anthariksham will be composing the music. We will be announcing the title very soon.”




The producer 88 Rama Reddy said, “We are introducing Sree Saripalli a former associate of VV Vinayak with our film. Kartikeya‘a characterisation is one of the major highlights of the actioner. We have already wrapped up close to 50% of the shoot. We will be completing majority of the shoot with the ongoing schedule in Hyderabad and the remaining 10% will be shot in Maredumilli.”




Star cast:




Kartikeya Gummakonda


Tanya Ravichandran 


Sudhakar Komakula 


Sai Kumar


Thanikella Bharani


Pasupathi


Harshavardhan


Surya


Gemini Suresh


Jabardasth Naveen




Technical crew:




Cinematography: PC Mouli


Music: Prashanth R Vihari


Editor: Jaswin Prabhu 


Art director: Suresh Thimmiri, Sri Rup Menon


Fights: Subbu, Naba


Lyrics: Ramajogayya Sastry


VFX supervisor: Nikhil Koduru 


Presented by: Adi Reddy.T


Producer: 88 Rama Reddy 


Director: Sree Saripalli

Ramakrishna Look From Republic

 


సాయితేజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘రిపబ్లిక్’ .. . పవర్‌ఫుల్ పొలిటీషియన్ విశాఖ వాణి పాత్రలో మెప్పించనున్న విలక్షణ నటి రమ్యకృష్ణ


కెరీర్ ప్రారంభం వైవిధ్యమైన సినిమాల్లో నటిస్తూ ‘చిత్రల‌హ‌రి’, ‘ప్ర‌తిరోజూ పండ‌గే’. ‘సోలో బ్రతుకే సో బెటర్’ వంటి వ‌రుస విజయాల‌తో దూసుకెళ్తోన్న సుప్రీమ్ హీరో సాయితేజ్ నటిస్తోన్న మరో డిఫరెంట్ మూవీ ‘రిపబ్లిక్’. పొలిటికల్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందుతోన్న ఈ చిత్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులను ప్రశ్నిస్తూ ప్రజల సమస్యలపై పోరాటం చేసే ఓ ఇన్‌టెన్సిటీ ఉన్న పాత్రను సాయితేజ్ పోషిస్తున్నారు. 


డిఫరెంట్ కాన్సెప్ట్ చిత్రాలను తెరకెక్కించే దర్శకుడు దేవ్ కట్ట డైరెక్ష‌న్‌లో రూపొందుతోన్న పొలిటిక‌ల్ థ్రిల్లర్ రిపబ్లిక్ల్‌లో విలక్షణ నటి రమ్యకృష్ణ "తప్పూ ఒప్పులు లేవు, అధికారం మాత్రమే శాశ్వతం!” భావించి విశాఖ వాణి అనే  రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తోంది. ఇప్పటి వరకు ప్రేక్షకులు చూడని పవర్‌ఫుల్ పాత్రలో  రమ్యకృష్ణ తనదైన పవర్‌ఫుల్ ఫెర్ఫామెన్స్‌తో మెప్పించనుందని మేకర్స్ తెలియజేశారు. ఈ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 


జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్, జీ స్టూడియోస్ ప‌తాకాల‌పై ఈ చిత్రాన్నినిర్మాత‌లు జె.భగవాన్, జె.పుల్లారావు అన్ కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని వ‌ర‌ల్డ్‌వైడ్‌గా జూన్ 4న విడుదల చేస్తున్నారు. ఐశ్వ‌ర్యా రాజేశ్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో విలక్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు కీలక పాత్రలో న‌టిస్తున్నారు. మెలోడీ బ్ర‌హ్మ మ‌ణిశ‌ర్మ సంగీత సార‌థ్యం వ‌హిస్తోన్న ఈ చిత్రానికి ఎం.సుకుమార్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.   


న‌టీన‌టులు:

సాయితేజ్

ఐశ్వ‌ర్యా రాజేశ్‌

జ‌గ‌ప‌తిబాబు

ర‌మ్య‌కృష్ణ‌

సుబ్బ‌రాజు

రాహుల్ రామ‌కృష్ణ‌

బాక్స‌ర్ దిన 


సాంకేతిక వ‌ర్గం:

నిర్మాత‌లు: జె.భ‌గ‌వాన్‌, జె.పుల్లారావు, జీస్టూడియోస్‌, జె.బి.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్

క‌థ‌, మాట‌లు, ద‌ర్శ‌క‌త్వం:  దేవ్ క‌ట్టా

స్క్రీన్‌ప్లే:  దేవ క‌ట్ట‌, కిర‌ణ్ జ‌య్ కుమార్‌

సినిమాటోగ్ర‌ఫీ:  ఎం.సుకుమార్‌

మ్యూజిక్‌:  మ‌ణిశ‌ర్మ‌

ఎడిట‌ర్‌:  కె.ఎల్‌.ప్ర‌వీణ్


Saiee Manjrekar First Look from Major Movie Released

 


సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ 'మేజర్' చిత్రంలో సాయి మంజ్రేకర్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్‌.


మేజ‌ర్ చిత్రంలోని క్యారెక్టర్ పోస్టర్‌లో మేజ‌ర్ సందీప్ ఉన్ని కృష్ణ‌న్ మ‌రియు అడివి శేష్ ల మ‌ధ్య  సారూప్యతలతో ఈ చిత్రంపై భారీ అంచనాలు పెరిగాయి. ఈ రోజు ఈ మూవీలో కీల‌క పాత్ర‌లో న‌టిస్తోన్న న‌టి ‌సాయి మంజ్రేకర్ ఫ‌స్ట్ గ్లిమ్స్‌ని విడుద‌ల‌చేసిన చిత్ర యూనిట్‌. మేజ‌ర్ మూవీ టీజ‌ర్‌ను  ఏప్రిల్ 12న ఆవిష్క‌రించ‌నున్న‌ట్లు తెలిపారు మేకర్స్‌.


ఫ్రాంక్ ఆంథోనీ పబ్లిక్ స్కూల్ యూనిఫామ్‌లో సాయి మంజ్రేకర్ మరియు ఆడివి శేష్ ఉన్న ఈ పోస్ట‌ర్ ఆక‌ట్టుకుంటోంది. అలాగే డిఫెన్స్ అకాడమికి సెల‌క్ట్ అయినందుకు లెట‌ర్ ద్వారా శుభాకాంక్ష‌లు తెల‌ప‌డం ఈ పోస్ట‌ర్లో చూపించారు.


టీనేజ్ నుండి యుక్తవయసు వరకు వైవిధ్యమైన దశలలో  అడివి శేష్‌తో పాటు సాయి మంజ్రేకర్ పాత్ర మ‌న‌కి క‌నిపిస్తోంది. తొలి చిత్రం 'దబాంగ్ 3' తో ప్రేక్షకులను ఆకట్టుకున్న తరువాత సాయి మంజ్రేకర్ తెలుగులో న‌టిస్తోన్న మొద‌టి చిత్ర‌మిది.


26/11 ముంబై దాడుల్లో దేశం కోసం ప్రాణాలను అర్పించిన దివంగత ఆర్మీ ఆఫీసర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవిత కథ ఆధారంగా మేజర్ చిత్రం తెరకెక్కుతోంది.  శౌర్యం మరియు ధైర్యానికి పేరుగాంచిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ చనిపోయిన విధానం మాత్రమే కాకుండా, అతను జీవించిన విధానం యొక్క ఆత్మను సంగ్రహించి మేజర్ సందీప్ జీవితాన్నిసెల‌బ్రేట్ చేయ‌డ‌మే ఈ చిత్రం యెక్క ముఖ్య ఉద్దేశం.


తెలుగు, హిందీ భాషలలో రూపొందుతోన్న ఈ ప్యాన్ ఇండియా చిత్రానికి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహించారు. శోభితా ధూళిపాల, సాయి మంజ్రేకర్, ప్రకాష్ రాజ్, రేవతి, మురళి శర్మ ముఖ్య పాత్రల్లో నటించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు ఏప్ల‌స్ఎస్‌ మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా నిర్మించిన `మేజర్` చిత్రం జులై2 న ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌కాబోతుంది.

Wild Dog Grand success Meet

 


`వైల్డ్‌డాగ్` ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అంటుంటే చాలా హ్యాపీగా ఉంది - కింగ్ నాగార్జున



కింగ్‌ నాగార్జున హీరోగా అషిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘వైల్డ్‌డాగ్’. దియా మీర్జా, సయామీఖేర్‌, అలీ రెజా, మ‌యాంక్‌, ప్ర‌దీప్‌, ప్ర‌కాశ్ కీల‌క‌పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీని ‌మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ ప‌తాకంపై ప్రొడ‌క్ష‌న్ నెం.6గా నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి నిర్మించారు. ఏప్రిల్‌2న ప్రపంచ‌వ్యాప్తంగా విడుద‌లై స‌క్సెస్‌ఫుల్ టాక్‌తో మంచి క‌లెక్ష‌న్స్ సాధిస్తోంది. ఈ సంద‌ర్భంగా హైద‌రాబాద్‌లో ఏర్పాటుచేసిన విలేక‌రుల స‌మావేశంలో స‌క్సెస్ కేక్ క‌ట్ చేసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సంద‌ర్భంగా...‌


న‌టుడు మయాంక్‌ మాట్లాడుతూ–‘‘మా సినిమాను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నన్ను నమ్మి నాకు అవకాశం ఇచ్చిన నాగ్‌సర్‌ దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. మేమందరం ఓ కుటుంబంలా ఈ సినిమా చేశాం. ఈ సినిమా జర్నీ నాకు లైఫ్‌ టైమ్‌ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది’’ అన్నారు


న‌టుడు ప్రదీప్‌ మాట్లాడుతూ–‘‘ ఈ సినిమా సక్సెస్‌ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆడియన్స్‌ ప్రతి సీన్‌ను ఎంజాయ్‌ చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన దర్శకల నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు.


న‌టుడు ప్రకాష్‌ మాట్లాడుతూ – ‘‘మా సినిమాపై ప్రేమను చూపిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. ఈ సినిమాలో నా భాగస్వామ్యం ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది.నాగ్‌ సర్‌ లేకపోతే ఇది సాధ్యం అయ్యేది కాదు’’ అని అన్నారు


న‌టుడు అలీ రెజా మాట్లాడూతూ –‘‘ఈ సినిమా రిలీజ్‌ కోసం ఎంతగానో ఎదురుచూశాను. థియేటర్‌లో ఆడియన్స్‌తో కలిసి ఈ సినిమా చూశాను. ప్రతి సన్నివేశాన్ని ఎంజాయ్‌ చేస్తున్నారు. సినిమా చూడనివారు కచ్చితంగా చూడండి. వైల్డ్‌డాగ్‌ సినిమాను ప్రేక్షకులు తప్పక ఎంజాయ్‌ చేస్తారు’’ అన్నారు.


చిత్ర నిర్మాత అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ - ‘‘వైల్డ్‌డాగ్‌’ సినిమాను మంచి సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్. ముందు ముందు ఇంకా పెద్ద స‌క్సెస్ చేస్తార‌ని న‌మ్ముతున్నాను ‌’’ అన్నారు


చిత్ర నిర్మాత నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ  -  ``బాక్సాఫీస్‌ కోణంలో ఆలోచించి మేం ఈ సక్సెస్‌మీట్‌ పెట్టలేదు. సినిమా నిన్న‌నే రిలీజైంది. నాగార్జున‌గారు ముందు నుండి ఒక్క‌టే చెప్పారు. ఈ క‌థ‌ని మ‌నం హానెస్ట్‌గా చెబుతేనే ప్రేక్ష‌కులు క‌నెక్ట్ అవుతార‌ని. కాబ‌ట్టి  మేం ఎలాంటి సినిమా తీయాలని ఆశించామో అలాంటి సినిమా తీశాం. మా ప్రయత్నం సఫలమైనందుకు ఈ మీట్‌ ఏర్పాటు చేశాం. అయితే మార్నింగ్‌ షో నుండి సెకండ్‌ షోకు కలెక్షన్స్ మ‌రింత పెరిగాయి. సినిమా చూసినవారు అంద‌రూ బాగుందని చెబుతున్నారు. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వస్తుందని డిస్ట్రిబ్యూటర్స్, థియేటర్స్‌ ఓనర్స్‌ చెబుతుండటం హ్యాపీ. మా బ్యానర్‌లో మరో మంచి సినిమా వచ్చిందని మా స‌న్నిహితులు, స్నేహితులు అన‌డం సంతోషంగా ఉంది. ఇలాంటి ఓ కొత్తరకం సినిమా తీయడానికి నాగార్జునగారే కారణం. డైరెక్టర్‌ అహిషోర్‌కు నాగార్జునగారు ఫుల్‌ ఫ్రీడమ్‌ ఇచ్చారు. అందువ‌ల్లే ఇంత మంచి సినిమా తీయ‌గ‌లిగాం.  అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌నుండి యూనానిమ‌స్ రెస్పాన్స్ వ‌స్తోంది. ఈ విజ‌యానికి కార‌ణ‌మైన మా టీమ్ అంద‌రికీ, అలాగే మంచి రివ్యూస్ ఇచ్చి మాకు స‌పోర్ట్ చేసిన మీడియా వారికి ధ‌న్య‌వాదాలు`` అన్నారు.


దర్శకుడు అహిషోర్‌ మాట్లాడుతూ–‘‘ సినిమాను ఎంతగానో ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. నాపై నమ్మకం ఉంచిన నాగ్‌సర్, నిర్మాతలకు ధన్యవాదాలు. ఈ సినిమాకు ఆర్టిస్టులతో పాటుగా మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్, ఆర్ట్‌ డైరెక్టర్‌ మురళి, స్టంట్‌ కొరియోగ్రాఫర్స్‌ డెవిడ్, శ్యామ్‌..ఇలా టెక్నీషియన్స్‌ అందురూ ఎంతో కష్టపడ్డారు. వైల్డ్‌డాగ్‌ సక్సెస్ వెనకమా టీమ్‌ అందరి కష్టం దాగి ఉంది. వారంద‌రికి  నా కృత‌జ్ఞ‌త‌లు`` అన్నారు.


కింగ్ నాగార్జున మాట్లాడుతూ  –  ‘‘నేను ఓ కొత్త ప్రయత్నం, ఓ కొత్త సినిమా తీసిన ప్రతిసారి ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా వారికి ధన్యవాదాలు. కోవిడ్‌ కేసులు పెరుగుతున్న తరుణంలో సినిమా రిలీజ్‌ చేయాలా? ఆడియన్స్‌  వస్తారా? అనుకున్నాం. కానీ సినిమా బాగుంటే ప్రేక్షకుల సపోర్ట్ త‌ప్ప‌కుండా ఉంటుందని మరోసారి నిరూపితమైంది. కలెక్షన్స్‌ బాగున్నాయని నిర్మా త నిరంజ‌న్‌గారు చెప్పడం చాలా సంతోషంగా ఉంది. నన్ను ప్రొత్సహిస్తున్న అభిమానుల అండదండలతోనే నేను కొత్తరకం సినిమాలు చేయగలగుతున్నాను. వారికి  ఎప్ప‌టికీ ఋణ‌‌ప‌డి ఉంటాను. ప్ర‌తి భార‌తీయుడు చూడాల్సిన సినిమా అని చాలా మంది అన్నారు. అదే ఈ సినిమాకు నాకు వ‌చ్చిన బెస్ట్ అప్రిసియేష‌న్‌.  చాలా మంది ఈ ఏజ్‌లో రిస్కులు అవ‌స‌ర‌మా అన్నారు. నేను రిస్కులు చేయ‌బ‌ట్టే ఈ స్టాయికి రాగ‌లిగాను. రిస్క్ చేయ‌డం నాకు కొత్తేమి కాదు.. ప్రేమించే ప‌ని చేసిన‌ప్పుడు శ్ర‌మ ఎప్పుడు ఉండ‌దు.  ఇంత మంచి అప్లాజ్ వ‌స్తున్నందుకు ద‌ర్శ‌కుడు సాల్మ‌న్‌కి థ్యాంక్స్ చెబుతున్నాను. అలాగే మా టీమ్ మెంబ‌ర్స్ అంద‌రూ మంచి స‌పోర్ట్ చేశారు.  వారికి మంచి అప్రిసియేష‌న్ వ‌స్తున్నందుకు హ్యాపీ`` అన్నారు.

Bjp Tirupati Mp Contest Ratna Prabha



 రత్నప్రభ...

అభివృద్ధి సిరాచుక్క



రత్నం కాంతులీనుతుంది.

సానబట్టే కొద్దీ మెరుపు ఇనుమడిస్తుంది.

బంగారంలో పొదిగితే ఆభరణం అమూల్యమవుతుంది.

రత్నం వంటి బిడ్డను ఐఏఎస్‌ దిశగా నడిపించాడు ఆమె తండ్రి.

ఐఏఎస్‌ మకుటానికే కలికితురాయిగా మారిందామె.

జాతి నిర్మాణంలో తనదైన ముద్ర వేసింది.

జాతి గర్వించే ప్రభావవంతమైన రత్నంగా మారింది.


సినిమా తెర మీద దృశ్యం కనిపిస్తుంది... దర్శకులు కనిపించరు. అలాగే రత్నప్రభ కనిపించరు. ఆమె రూపకల్పన చేసిన పథకాలు సమాజాన్ని నడిపించాయి, నడిపిస్తున్నాయి. దేశంలో సామాన్యుని జీవితాన్ని అందమైన దృశ్యంగా మలచడం వెనుక ఉన్న స్క్రిప్టు ఆమె చేతిలో రూపుదిద్దకున్నదే. ఉదాహరణలు చెప్పుకోవాలంటే ఒకటి కాదు రెండు కాదు కోకొల్లలు.


ఆడబిడ్డ ప్రాణాలకు కాపాడాలి... ఆడబిడ్డను చదివించాలి... అనే ఆకాంక్షకు రూపం ‘బేటీ బచావో... బేటీ పఢావో’

ఆడబిడ్డను లైంగిక వేధింపులు అక్రమ రవాణా బారి నుంచి కాపాడడానికి ఒక ‘ఉజ్వల’

పారిశ్రామికంగా ఎదుగుతున్న మహిళల విజయగాథలకు వేదికగా ‘షీ ఫర్‌ హర్‌’

అబ్దుల్‌ కలామ్‌ స్ఫూర్తితో ‘థింక్‌ బిగ్‌’ అంటూ ఆసియా మహిళా పారిశ్రామిక వేత్తల సదస్సు

పారిశ్రామిక పెట్టుబడులతో కర్నాటకను మొదటి స్థానంలో నిలిపిన ‘ఇన్వెస్ట్‌ కర్నాటక 2016’

ఉత్తరాదిన సూరత్‌ కేంద్రంగా సాగుతున్న వజ్రాల పరిశ్రమను దక్షిణాదికి తెచ్చిన ఘనత

వేళాపాళాలేని ఐటీ రంగం ఉద్యోగినుల కోసం భద్రత, రవాణా సౌకర్యాల సాధన

బాధిత, పీడిత మహిళలను కడుపులో పెట్టుకుని కాపాడడానికి కన్నతల్లి వంటి షెల్టర్‌ హోమ్‌ ‘స్వాధర్‌’

కాఫీ తోటల్లో కూలికి వెళ్లే అట్టడుగు మహిళలకు కాఫీ తోటల పెంపకం హక్కుల కల్పన

ఒక్క సంతకంతో సమాజంలో వందల ఏళ్లుగా కరడుగట్టుకుని ఉన్న దేవదాసీ దుర్నీతికి అడ్డుకట్ట

... ఇలాంటి ఎన్నో నిర్ణయాలు... మరెన్నో కార్యాచరణలు... 39 ఏళ్ల ఉద్యోగయానంలో మైలురాళ్లు.

ఒక అక్షరాస్యత ఉద్యమం, బీసీ మహిళలకు ఇళ్ల నిర్మాణం, ఆటో రిక్షా నడుపుకుని ఉపాధి పొందే అవకాశం... 

ఇలా సమాజాభివృద్ధి స్టీరింగ్‌ని మహిళల చేతిలో పెట్టారు రత్నప్రభ.


మనసుతో పాలన

కలెక్టర్‌ హోదాలో ఒక నిర్ణయం తీసుకుంటే అది అమలయ్యి తీరుతుంది. సమస్య నివారణ అవుతుంది. అయితే ఆ సమస్య తిరిగి పురుడు పోసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలి? దేవదాసీ వ్యవస్థ నిర్మూలన నిర్ణయంతో సమస్యకు అడ్డుకట్ట మాత్రమే పడుతుంది. ఆ మహిళలకు సమాజంలో గౌరవం పెరగాలంటే ఏం చేయాలి? వారి కాళ్ల మీద వాళ్లు నిలబడే అవకాశం కల్పించాలి. అప్పుడే సమాజం వారిని వారికి నచ్చినట్లు బతకనిస్తుంది. అలాంటి అవకాశం లేకపోతే సమాజం ఆ మహిళలను తిరిగి దురాచారపు కత్తులబోనులోకి తోసేస్తుంది. అందుకే దేవదాసీ మహిళల పునరావాసం... బాలికల చదువు మీద దృష్టి పెట్టారు రత్నప్రభ. దేవదాసీ దురాచారం చట్రం నుంచి బయటపడిన మహిళల్లో చదువుకున్న వాళ్లకు, ఆ మహిళల పిల్లలకు ఉపాధి మార్గాల కోసం అన్వేషించారు. అంగన్‌వాడీ వర్కర్‌లుగా, ప్రభుత్వ కార్యాలయాల్లో అటెండర్‌లుగా ఉద్యోగం ఇప్పించి వారికి జీవితభద్రత కల్పించారు. పాలనలో మెదడు పెట్టి చేసిన నిర్ణయాలకు మనసు పెట్టి తీసుకున్న నిర్ణయాలకు మధ్య ఉన్న తేడా అది. 


శాంతిప్రభ

రత్నప్రభ బాధ్యతలు నిర్వర్తించిన ప్రదేశాలన్నీ అత్యంత సున్నితమైనవి, పూర్తిగా వెనుకబడినవి. ప్రతి చోటా ఆమె తన మార్కును ప్రదర్శించారు. పాలనలో తనదైన పాదముద్రలను వేయగలిగారు. బీదర్‌లో మత ఘర్షణలు ఉద్రిక్తతకు దారి తీసినప్పుడు ఆమె వ్యవహరించిన తీరు కలెక్టర్‌ అంటే ఎలా ఉండాలో తెలియచేస్తుంది. పదిమంది ప్రాణాలు కోల్పోవడం చిన్న విషయం కాదు. ప్రతిదాడులు జరగకుండా నివారించడం కత్తిమీద సాము వంటిదే. అలాంటి సమయంలో రత్నప్రభ గారు శాంతి కమిటీలతో అత్యంత చాకచక్యంగా పరిస్థితిని చక్కదిద్దారు. బీదర్‌తోపాటు గుల్బర్గా, చిక్‌మగుళూరు ప్రజలు ఇప్పటికీ రత్నప్రభను తలుచుకుంటారంటే అందుకు ఆమె పాలనతీరులో ఉన్న మేధోపరమైన సున్నితత్వమే కారణం. కర్నాటక రాష్ట్రం ఆమె గుర్తిస్తూ సత్కరించింది. జాతీయ స్థాయిలో ఆమె గౌరవ పురస్కారాన్ని అందుకున్నారు. ఆమె అవార్డులందుకోవడమే కాదు. తాను విధులు నిర్వర్తించిన రాష్ట్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును కూడా తెచ్చారు. మహిళాభ్యుదయం కోసం ఆమె రూపకల్పన చేసిన విశేషమైన పథకాలకు గాను కర్నాటక రాష్ట్రానికి ‘మోస్ట్‌ సపోర్టివ్‌ స్టేట్‌ ఫర్‌ ఉమెన్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌’ అవార్డు వచ్చింది. తనకు సమర్థంగా పని చేయడానికి అవకాశం కల్పించిన రాష్ట్రానికి ఆమె చెల్లించుకున్న ఉద్యోగ దక్షిణ అది.


డ్వాక్రా మహిళల దీపం

మహిళాభ్యుదయం కోసం, మహిళల ఆర్థిక స్వావలంబన కోసం జాతీయ స్థాయిలో అమలవుతున్న డ్వాక్రా పథకానికి వన్నె తెచ్చారు రత్నప్రభ. స్వయం సహాయక బృందాల మహిళల స్వయం స్వావలంబన కోసం అనేక రాష్ట్రాలు నామమాత్రపు పథకాలతో సరిపెడుతుంటే రత్నప్రభ డ్వాక్రా మహిళల గౌరవాన్ని జాతీయస్థాయిలో నిలిపారు. అరకొర ఉపాధి అవకాశాలతో సరిపుచ్చకుండా వారిని పారిశ్రామికవేత్తలను చేయడానికి ప్రయత్నించారామె. ఫర్నిచర్‌ తయారీ రంగం అంటే... దిగువ ఆదాయ వర్గాలకు చెందిన గ్రామీణ మహిళకు కనీసం ఊహకు కూడా అందదు. అలాంటి ఫర్నిచర్‌ పరిశ్రమను డ్వాక్రా మహిళల చేత పెట్టించారు. పౌల్ట్రీ రంగంలో దినసరి కూలీలుగా, నెలవారీ జీతానికి పని చేసే మహిళల చేత కోళ్ల ఫారాలు, కుందేళ్ల పెంపకం వంటి వ్యాపారాలు పెట్టించారు. దుప్పట్ల నేత, హస్తకళాకృతుల తయారీని ప్రోత్సహించి వారి ఆదాయ మార్గాలను పెంచారు. ఒక సమాజం సర్వతోముభాభివృద్ధి సాధించాలంటే... ఆ సమాజంలో మహిళ  ధైర్యంగా జీవించగలిగినప్పుడే అది సాధ్యమవుతుందని రత్నప్రభ విశ్వసించేవారు. ఆ విశ్వాసాన్ని కార్యాచరణ ద్వారా నిజం చేసి చూపించారు. స్థిరాస్తుల కొనుగోళ్లలో రిజిస్ట్రేషన్‌ మహిళల పేరు మీద జరిగితే స్టాంప్‌ డ్యూటీలో ఒక శాతం మినహాయింపు ఇవ్వాలన్న ఆలోచన నభూతో నభవిష్యతి. కుటుంబానికి ఎంత ఆస్థి ఉన్నప్పటికీ మహిళకు ఆ ఆస్థిపై హక్కులేని పితృస్వామ్య సమాజం మనది. ఈ నేపథ్యంలో మగవాళ్లే స్వచ్ఛందంగా తన భార్య లేదా తల్లి పేరుతో ఆస్థులను రిజిస్టర్‌ చేసేటట్లు ప్రోత్సహించే అద్భుతమైన ఆలోచన ఇది. ప్రభుత్వానికి ఒక శాతం స్టాంపు డ్యూటీ నష్టం రావచ్చు, కానీ ఈ నిర్ణయం మహిళలకు పెద్ద వరం. మహిళ ఆత్మవిశ్వాసంతో జీవించడానికి అద్భుతమైన మార్గం.


ఆధునిక జాతి నిర్మాణం

అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం రత్నప్రభ చేసిన మేధోమధనం ఒక ఎత్తయితే అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్‌ను దీటుగా నిలబెట్టడంలో కూడా ఆమె విశేషమైన ప్రతిభను కనబరిచారు. ప్రపంచం ఆధునికత వెంట పరుగులు పెడుతున్న సమయంలో ఆ పరుగులో భారత్‌ను ముందంజలో నిలపడంలోనూ రత్నప్రభ గణనీయమైన సేవలనే అందించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ చైర్‌పర్సన్‌గా ఆమె నిర్ణయాలు జాతి నిర్మాణంలో మార్గదర్శకాలయ్యాయి. మహిళా సాధికారత సాధనతోపాటు పరిశ్రమల స్థాపన, వాణిజ్యం, మౌలిక వసతులు, ఐటీ రంగం, సంక్షేమం అన్నింటిలోనూ రత్నప్రభ తన మార్కు పాలనను అందించారు. 


పుట్టిన నేల రుణం

రత్నప్రభ కర్నాటక కేడర్‌ ఐఏఎస్‌ అధికారి. అయితే జాతీయ స్థాయి రిక్రూట్‌మెంట్‌లో భాగంగా తెలుగు రాష్ట్రంలో పని చేసే అవకాశం వచ్చింది. తాను పుట్టిన తెలుగు నేలకు రుణం తీర్చుకున్నారామె. తెలుగు చలనచిత్ర రంగం మద్రాసు కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలుగు చిత్రసీమను హైదరాబాద్‌కు తీసుకురావడంలో విశేషమైన కృషి చేసిన నాయకుడిగా ఎన్టీఆర్‌ని చెప్పుకుంటాం. తెలుగు సెన్సార్‌ బోర్డును మద్రాసు నుంచి హైదరాబాద్‌కు తీసుకు వచ్చిన ఘనత రత్నప్రభగారిది. ప్రజా ప్రతినిధి తీసుకున్న నిర్ణయానికి మీడియా ప్రచారం కల్పిస్తుంది. ఐఏఎస్‌ అధికారి తీసుకున్న నిర్ణయాలు మౌనంగా ఆచరణలోకి వస్తాయి. ఇక్కడ అదే జరిగింది. ఆమె ఉద్యోగ జీవితాన్ని పరిశీలిస్తే ఒక ఐఏఎస్‌ అనుకుంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదనిపించకమానదు. ఇప్పుడు హైదరాబాద్‌లో అత్యాధునికమైన నగరంగా మనం చూస్తున్న సైబర్‌ సిటీ ఆవిష్కరణలో వైఎస్‌ఆర్‌ పేరు చెప్పుకుంటాం. వైఎస్‌ నిర్ణయాన్ని ఆచరణలోకి తీసుకురావడంలోనూ, సైబర్‌ సిటీకి విదేశీ కంపెనీలను తీసుకురావడంలోనూ నైపుణ్యం రత్నప్రభగారిదే. 


రెండు చక్రాలు

సమాజాన్ని నడిపించగలిగేది ప్రధానంగా ఇద్దరు. ఒకరు ప్రజాప్రతినిధి, మరొకరకు ఐఏఎస్‌ అధికారి. అధికారం అనే ఇరుసుకు రెండు వైపులా ఉండే చక్రాలివి. ఈ రెండు చక్రాల మీదనే సమాజ పురోభివృద్ధి ఆధారపడి ఉంటుంది. ఒకరి ఆకాంక్షకు మరొకరి కార్యదక్షత తోడయినప్పుడు ఆ సమాజం నిత్యనూతనంగా భాసిల్లుతుంది. ఆకాంక్షలు ఆకాశమం ఎత్తున ఉన్నప్పటికీ ఆచరణ పాతాళంలో ఉంటే ఫలితం ఉండదు. ప్రజాప్రతినిధికి ఆకాంక్ష ఉండి అవగాహన లోపించిన తరుణంలో తన మేధతో ప్రజాప్రతినిధికి దిశానిర్దేశం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఐఏఎస్‌ అధికారి. ప్రతినిధి ఆకాంక్షలకు ఐఏఎస్‌ చిత్తశుద్ధి తోడయితే అభివృద్ధి శరవేగంతో పరుగులు తీస్తుంది. క్షేత్రస్థాయిలో ఉన్న సమస్యల్ని గుర్తించడంలో ప్రజాప్రతినిధి తొలి అడుగు అయితే, వాటిని సమర్థంగా అమలు చేయడంలో ఐఏఎస్‌ మేధది తుది అడుగు అవుతుంది. అభివృద్ధిని పతాక స్థాయిలో నిలబెట్టడం ఐఏఎస్‌కి మాత్రమే సాధ్యమైన నైపుణ్యం. సమస్య పరిష్కారం కోసం, సమాజాభివృద్ధి కోసం ఒక నమూనాను తయారు చేయగలిగిన నైపుణ్యం ఐఏఎస్‌ అధికారికే ఉంటుంది. ఆ నమూనాను అంతే చిత్తశుద్ధితో అమలు చేయడం కూడా ఐఏఎస్‌ చేతిలోనే ఉంటుంది. అందుకు నిదర్శనం రత్నప్రభ ఐఏఎస్‌.

Government of India honored ‘Sangareddy Zilla Parishad’ of Telangana with highest award

 Government of India honored ‘Sangareddy Zilla Parishad’ of Telangana with highest award



The Government of India has honored the ‘Sangareddy Zilla Parishad’ of Telangana with the highest award. Sangareddy Zilla Parishad, For the development it gained under the guidance of Sangareddy Zilla Parishad Chairperson Smt. Patlolla Manjusri Jaipal Reddy, was honored with "Deen Dayal Upadhyay Sasakthikaran Puraskar", the highest award in Zilla Parishad department. After observing the development in the Zilla parishad, Government of India chose Sangareddy for this honorable award. For this achievement, Telangana Chief Minister Kalvakuntla Chandrasekhar honered Smt Patlolla Manjusri Jaipal Reddy in the presence of distinguished guests at Pragathi Bhavan. He expressed joy for this glorious feet and said, ‘‘Its not us who should to speak. But the work we did should speak for itself.’’ He appreciated Manjusri for utilizing all of the State schemes to develop the Zilla parishad. He hoped that the Sangareddy Zilla Parishad would receive more awards in the future.


Chief Secretary Someswar Kumar, Panchayat Raj Minister Yarravalli Dayakar, Panchayat Raj Comissioner Smitha Sabarwal, Zilla Parishad CAO Ellaiah and other important personalities were present during this ceremony. Patlolla Manjusri will receive 'Deen Dayal Sasakthikaran Puraskar' on April 24 by the hands of either Prime Minister Narendra Modi or Vice-President Venkaiah Naidu.

Singer Mangli Yogi Thathvam Song Released By Megastar Chiranjeevi



 గాయని మంగ్లీ "యోగితత్వం" ను రిలీజ్ చేసిన 'మెగాస్టార్' 


ప్రముఖ గాయని మంగ్లీ పాడిన 'యోగితత్వం' పాటను 'మెగాస్టార్' చిరంజీవి విడుదల చేశారు. 'యోగితత్వం' గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు. బాజి సంగీతాన్ని సమకూర్చగా..ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్... 'నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె.....' అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. 


మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో 'యోగితత్వం' పాట అప్ లోడ్ అయ్యింది. మంగ్లీ పాటలను ఇష్టపడేవారు ఈ పాటకు హయ్యెస్ట్ వ్యూస్ ఇవ్వనున్నారు. శివాణి మాటూరి సమర్పణలో రూపొందిన ఈ పాటకు సినిమాటోగ్రఫీ - తిరుపతి, ఎడిటర్ - ఉదయ్ కంభం.

Director Shekar kammula about "Saranga dariya" song 100 million mark



 'సారంగ దరియా' సూపర్ సక్సెస్ "లవ్ స్టోరి" పై మరింత అంచనాలు పెంచుతోంది - దర్శకుడు శేఖర్ కమ్ముల


"లవ్ స్టోరి" చిత్రంలోని 'సారంగ దరియా' పాట యూట్యూబ్ వ్యూస్ లో కొత్త చరిత్ర సృష్టించింది. కేవలం 32 రోజుల్లోనే 100 మిలియన్ వ్యూస్ సాధించింది. సౌతిండియాలో మరే లిరికల్ సాంగ్ ఇంత తక్కువ టైమ్ లో వంద మిలియన్ మార్క్ చేరుకోలేదు. సారంగ దరియా సాధించిన ఈ సక్సెస్ నేపథ్యంలో దర్శకుడు శేఖర్ కమ్ముల స్పందించారు. సారంగ దరియా విజయం ఊహించిందేనని, అయితే ఇంత భారీ రెస్పాన్స్ వస్తుందని అనుకోలేదని ఆయన అన్నారు. *శేఖర్ కమ్ముల మాట్లాడుతూ*....రెండు, మూడేళ్ల క్రితమే సారంగ దరియా పాట విన్నాను. అవకాశం వచ్చినప్పుడు ఈ పాటను సినిమాలో పెట్టుకోవాలి అనుకున్నాను. సందర్భం, సీన్ కుదరడం వల్ల "లవ్ స్టోరి" చిత్రంలో సారంగ దరియా పాటను తీసుకున్నాను. ఈ పాట విజయం ఊహించిందే, అయితే ఇంత భారీ రెస్పాన్స్ ఎక్స్ పెక్ట్ చేయలేదు. లిరికల్ వీడియోనే 100 మిలియన్ వ్యూస్ సాధిస్తుందని అనుకోలేదు. మా టీమ్ అంతా ఉద్వేగంగా ఉన్నాము. సినిమా ఎప్పుడు చూద్దామా, పాట ఎలా ఉంటుంది అనేది చూసేందుకు ఎదురుచూస్తున్నారు. నా టీమ్ అందరికీ థాంక్స్. మెయిన్ క్రెడిట్ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ గారికి ఇవ్వాలి. జానపద గీతాన్ని తీసుకుని తనదైన ముద్రతో అద్భుతంగా ఈ పాట రాశారు. ఇంత విజయానికి కారణం అయ్యారు. 'చురియా చురియా చురియా ఇది చిక్కీ చిక్కని చిడియా' లాంటి ఎన్నో కొత్త పద ప్రయోగాలు చేశారు. ఇది యూట్యూబ్ లో ఇప్పటికే ఉన్నా, ఇంతగా శ్రోతలకు నచ్చిందంటే మీ సాహిత్యం వల్లే సాధ్యమైంది. సంగీత దర్శకుడు పవన్ తనకు ఇది తొలి సినిమా అయినా, ఫోక్ ను అర్థం చేసుకుని, ట్యూన్ ను డెవలప్ చేసి పాట చేశారు. ఆయనకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. అన్ని పాటలు మ్యూజికల్ హిట్స్ చేసిన పవన్ కు థాంక్స్. గాయని మంగ్లీ తనదైన శైలిలో పాడి పాటకు ఆకర్షణ తీసుకొచ్చింది. సాయి పల్లవి డాన్స్ ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే. శేఖర్ మాస్టర్ అద్భుతంగా స్టెప్స్ చేయించారు. ఈ లిరికల్ వీడియోకు వచ్చిన దానికంటే పది రెట్లు సినిమాలో వీడియో సాంగ్ కు వస్తుందని ఎక్స్ పెక్ట్ చేస్తున్నాను. "ఫిదా" సినిమాలో 'వచ్చిండె...' పాట సినిమా రిలీజ్ అయ్యాక హిట్ అయింది. కానీ 'సారంగ దరియా' పాటకు లిరికల్ వీడియోకే ఇంత మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ పాట విజయం సినిమా మీద మరింత అంచనాలు పెంచింది. సినిమా ఎప్పుడు చూద్దామా అని ఆడియెన్స్ తో పాటు నేనూ వేచి చూస్తున్నాను. పాటలన్నీ హిట్ అయి ఈ సినిమా మ్యూజికల్ లవ్ స్టోరి అని నేను చెప్పిన మాటను నిజం చేశాయి.  *ఏప్రిల్ 16న లవ్ స్టోరి విడుదలవుతుంది.* మీ అంచనాలను అందుకుంటుందని ఆశిస్తున్నా. అన్నారు.

Akhil Most Eligible Bachelor Song Releasing on April 5th

 


ఏప్రిల్ 5న అఖిల్ అక్కినేని, బొమ్మరిల్లు భాస్కర్, జిఏ 2 పిక్చర్స్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ఏ జిందగీ పాట‌ విడుదల..


 అఖిల్ అక్కినేని "మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్"  "ఏ జింద‌గీ" సాంగ్ లుక్ పోస్టర్ విడుద‌ల‌ 


అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్. ఈ సినిమాను జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్‌పై నిర్మిస్తున్నారు. భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌, పిల్లా నువ్వులేని జీవితం, గీత గోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ సినిమాలతో  మోస్ట్ సక్సెస్ ఫుల్ నిర్మాతగా క్రేజ్ సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్‌‌గా నటిస్తుంది. ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ప్రకటించిన రోజు నుంచి కూడా ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో ఆసక్తి మొదలైంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్‌కు, అలానే  గోపీ సుంద‌ర్ సంగీత‌ సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు, ఆ తర్వాత విడుదల చేసిన టీజ‌ర్‌కు అటు సోషల్ మీడియాలో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్‌లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజాగా మరో సర్ ప్రైజింగ్ న్యూస్ చెప్పింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలోని ఏ జిందగీ పాట ఏప్రిల్ 5న విడుదల కానుంది. ఈ పాటకు సంబంధించిన లుక్ పోస్ట‌ర్ తాజాగా విడుద‌లైంది, పాట టైటిల్ కి త‌గ్గ‌ట్లుగా ఏ జింద‌గీ అంటూ సైకిల్ మీద అఖిల్ అక్కినేని, పూజా హెగ్దే వెళ్తున్న స్టిల్ తో ఈ పోస్ట‌ర్ ని రెడీ చేశారు ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్. ఈ సినిమాను జూన్ 19న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు యూనిట్. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్‌తో ల‌వ్ లీగా వుండేలా డిజైన్ చేస్తారు. ఇప్పుడు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాలో కూడా అఖిల్ అక్కినేని, పూజాల మధ్య కూడా అలాంటి కెమిస్ట్రి ఉండేలా డిజైన్ చేసారు. 


న‌టీ న‌టులు:

అఖిల్ అక్కినేని, పూజా హెగ్ఢే, ఆమ‌ని, ముర‌ళి శ‌ర్మ‌, జ‌య ప్ర‌కాశ్, ప్ర‌గ‌తి, సుడిగాలి సుధీర్, గెటెప్ శ్రీను, అభ‌య్, అమిత్ తదితరులు.. 


సాంకేతిక నిపుణులు:

బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్  

స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  

మ్యూజిక్ : గోపీ సుంద‌ర్

సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ

ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్

ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా

ఎక్స్ క్యూటివ్ ప్రొడ్యూస‌ర్ : స‌త్య గ‌మిడి

పీఆర్ఓ : ఏలూరు శ్రీను 

నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  

దర్శకుడు : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

V V Vinayak launched Jathiya Rahadari Movie theatrical Trailer

 


"జాతీయ రహదారి" థియేటర్ ట్రైలర్ ను విడుదల చేసిన ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్


భీమవరం టాకీస్ పతాకంపై*  మధుచిట్టి, సైగల్ పాటిల్,మమత,ఉమాభారతి,మాస్టర్ దక్షిత్ రెడ్డి, అభి, శ్రీనివాస్ పసునూరి నటీనటులుగా నరసింహనంది దర్శకత్వంలో తుమ్మలపల్లి రామసత్యనారాయణనిర్మిస్తున్న”జాతీయ రహదారి” చిత్రం థియేటర్ ట్రైలర్ ను  ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్  గారి చేతులమీదుగా  విడుదల చేయడం జరిగింది.ఈ సందర్భంగా*



 ప్రముఖ దర్శకుడు వి.వి వినాయక్ మాట్లాడుతూ. నరసింహ నంది అవార్డ్స్ సినిమాలు తీయటంలో దిట్ట మా రామ సత్యనారాయణ గారికి ఈ సినిమా తో ఆ అవార్డ్స్ కోరిక తీరుతుంది...ట్రైలర్ బాగా వచ్చింది సినిమా పెద్ద విజయం సాదించాలని కోరుకుంటూ టీం అందరికి అల్ ద బెస్ట్ అని అన్నారు..


 నిర్మాత రామ సత్యనారాయణ మాట్లాడుతూ.. నేను చేసే ప్రతి సినిమా వెనుక మా వినాయక్ గారి సపోర్ట్ ఉంటుంది..ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్ గురించి చెప్పినప్పుడు నాకు మంచి సపోర్ట్ చేసారు.. మా దర్శకుడి కోరిక ఈ ట్రైలర్ ని వినాయక్ గారు చేతులు మీదుగా చేయాలి అని వారి చేతుల మీదుగా విడుదల చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది.అల్ రెడి ఈ సినిమా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కి నామినేట్ ఐనది..68 వ జాతీయ అవార్డ్స్ కి కూడా అప్లై. చేయటం జరిగింది..ఇదీ మా విజయానికి పునాది అన్నారు..నరాసింహ నంది కి పూర్తి స్వేచ్ఛ మరియు  బాధ్యత ఇచ్చి నిర్మించిన చిత్రం  "జాతీయ రహదారి" ఈ సినిమా గొప్ప విజయం సాధించడమే కాక ఎన్నో అవార్డులు కూడా వస్తాయనే గట్టి నమ్మకం ఉందని అన్నారు..


 చిత్ర దర్శకుడు నరసింహ నంది మాట్లాడుతూ. నా మొదటి చిత్రం బెల్లంకొండ సురేష్ గారు విడుదల చేసినప్పుడు..శ్రీ వినాయక్ గారి సపోర్ట్ ఎంతో ఉంది...నేను పక్కా వినాయక్ గారి అభిమానిని. ఆయన మాలాంటి వాళ్ళని సపోర్ట్ చేయటం ఆయన గొప్పతన నికి నిదర్శనం..ఎప్పటికైనా ఆయన నిర్మాత గా ఒక  ఫిల్మ్ తీయాలి , దానికి నేనే దర్శకుడు గా ఉండాలి అని నా కోరిక. ఆయన మాస్ డైరెక్టర్ ఐన వారిలో కూడా కళాత్మక గుణం ఉంది..ఈ రోజు అయనాతో ట్రైలర్ రేలీజ్ చేయించుకోవాలి అనే నా కోరిక తీరింది..


ఇంకా ఈ కార్యక్రమంలో కెమెరామెన్,మురళి మోహన్ రెడ్డి, సంగీత దర్శకుడు సుక్కు,ఎడిటర్ నాగిరెడ్డి, మౌనశ్రీ..సమర్పకులు.. రవి కనగల ఫాల్గొన్నారు..



 నటీనటులు

మధు చిట్టి, సైగల్ పాటిల్, మమత, ఉమాభారతి, తెల్జేరు మల్లేశ్, గొట్టి మదన్, మాస్టర్ దక్షిత్ రెడ్డి, ఘర్షణ శ్రీనివాస్, అభి, నరసింహా రెడ్డి, గోవింద్ రాజు,



 సాంకేతిక నిపుణులు సమర్పకులు.. రవి కనగల

నిర్మాత :- తుమ్మలపల్లి రామసత్యనారాయణ

రైటర్, డైరెక్టర్ :- నరసింహ నంది

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- టి. ఆంజనేయులు

మ్యూజిక్ :- సుక్కు

డి.ఓ.పి :- మురళి మోహన్ రెడ్డి

ఎడిటింగ్ :- వి.నాగిరెడ్డి

లిరిక్స్ :- మౌనశ్రీ మల్లిక్

 పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్

Vaishnav Tej Svcc LLP Movie Launched

 




వైష్ణ‌వ్ తేజ్ పంజా హీరోగా ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పి బ్యాన‌ర్ కొత్త చిత్రం ప్రారంభం


2021లో ‘ఉప్పెన’ చిత్రంతో బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ సాధించి అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన సెన్సేషనల్ స్టార్ వైష్ణవ్ తేజ్ పంజా హీరోగా ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర సినీ చిత్ర ఎల్ఎల్‌పీ బ్యాన‌ర్‌పై బాపినీడు స‌మ‌ర్ప‌ణ‌లో... అర్జున్ రెడ్డి త‌మిళ వెర్ష‌న్‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్‌ గిరీశాయ ద‌ర్శ‌క‌త్వంలో సీనియ‌ర్ నిర్మాత బి.వి.ఎస్‌.ఎన్.ప్ర‌సాద్ నిర్మాత‌గా కొత్త‌ చిత్రం శుక్ర‌వారం హైద‌రాబాద్‌లో లాంఛ‌నంగా ప్రారంభ‌మైంది. ముహుర్త‌పు స‌న్నివేశానికి హీరో సాయితేజ్ క్లాప్‌కొట్ట‌గా, విజ‌య్ దుర్గ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్‌, బాపినీడు స్క్రిప్ట్‌ను ద‌ర్శ‌కుడు  గిరీశాయకు అందించారు. ఈ సంద‌ర్భంగా ..


 చిత్ర నిర్మాత బి.వి.ఎస్.ఎన్‌.ప్ర‌సాద్ మాట్లాడుతూ ‘‘వైష్ణవ్ తేజ్ హీరోగా ఉప్పెన వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మా బ్యానర్‌లో సినిమా చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ‘అర్జున్ రెడ్డి’ తమిళ వెర్షన్‌ను డైరెక్ట్ చేసి సక్సెస్ సాధించిన గిరీశాయ ఈ చిత్రంతో టాలీవుడ్‌లో దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నారు. ఉప్పెన‌తో యూత్‌కు ద‌గ్గ‌రైన వైష్ణ‌వ్ తేజ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌కు ద‌గ్గ‌ర చేసేంత మంచి క‌థ‌తో ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను రూపొందించ‌బోతున్నాం. కేతికా శ‌ర్మ హీరోయిన్‌గా నటిస్తుంది.   త్వ‌ర‌లోనే ఈ చిత్రంలో న‌టించ‌బోయే ఇత‌ర న‌టీన‌టులు, వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తాం’’ అన్నారు. 


న‌టీన‌టులు:


వైష్ణ‌వ్ తేజ్ పంజా, కేతికా శ‌ర్మ త‌దిత‌రులు


సాంకేతిక నిపుణులు:

బ్యాన‌ర్‌:  ఎస్‌.వి.సి.సి ఎల్ఎల్‌పీ

స‌మ‌ర్ప‌ణ‌:  బాపినీడు

పి.ఆర్.ఓ: వంశీ కాకా

నిర్మాత‌:  బి.వి.ఎస్‌.ఎన్‌.ప్ర‌సాద్

దర్శకత్వం: గిరీశాయ

'What A Man' song from 'Vivaha Bhojanambu' unveiled

 'What A Man' song from 'Vivaha Bhojanambu' unveiled!



'Vivaha Bhojanambu' marks the debut of comedy actor Satya as a male lead. Aarjavee is its female lead. Anandi Arts, Soldiers Factory and Venkatadri Talkies have come together to present the entertainer. KS Sinish and Sundeep Kishan are producing it. Directed by Ram Abbaraju, the film has Sundeep Kishan in a guest role as Nellore Prabha.


The second song from the movie, titled 'What A Man', was released on Friday. Composed by Anirudh Vijay (AniVee), the song is written by Samrat. Hot and happening singer Chowrasta Ram has rendered it. The hilarious song builds up the male protagonist's character in an entertaining way. "When 'ABCD', the first song from the movie was released, it received a very good response. The second song, too, is poised to make a mark. We will announce more details about the movie soon," the producers have said.


The film is inspired by some true incidents that took place during the lockdown. Pisinari Mahesh, played by Satya, is too stingy to even purchase a parking ticket. He has never given a birthday treat to his friends. Thanks to the coronavirus, his wedding event saw only 30 guests in attendance. But the actual story takes off only after his wedding. What all funny ordeals Mahesh went through with the extension of the lockdown will be quite interesting to watch. It's learned that Sundeep Kishan's guest role and Satya's rib-tickling performance will be key highlights.


Cast:


Satya, Aarjavee Raj, Sudarshan, Srikanth Iyengar, Subbaraya Sharma, TNR, Viva Harsha, Shivannarayana, Madhumani, Nithyasree, Kireeti, Daya, Kalpa Latha and others are part of the cast.


Crew:


Director: Ram Abbaraju‬, Story: Bhanu Bhogavarapu, DOP: Manikandhan , Editor: Chota K Prasad‬, Music: Anirudh Vijay‬, Lyricists: Kittu, Krishna Chaitanya, Dances: Satish, Vijay, Dialogues: Nandu RK, Art Direction: Brahma Kadali,  PRO: Naidu Surendra Kumar - Phani Kandukuri & Vamsi Shekar , Executive Producers:  Siva Sherry, Seetharam, Producers: KS Sinish, Sundeep Kishan, Presented by: Anandi Arts, Soldiers Factory, Venkatadri Talkies

Vishal 31 Announcement Rises Curiosity

 Not A Common Man... Vishal 31 Announcement Rises Curiosity



Action Hero Vishal was recently seen in Cyber Thriller 'Chakra'. He is currently shooting for Actioner 'Enemy' along with his friend Arya. His latest is with Director Thu.Pa. Saravanan who shot to fame with his short film, 'Ethu Thevayo Athuve Dharmam'. This Vishal 31 will be made as a Telugu - Tamil bilingual. Vishal is producing this film under his Vishal Film Factory banner. The official announcement regarding this film is out this evening. An interesting video is released which comprises of a huge crowd which later shapes up as Vishal's face. This also has a hashtag #NotACommonMan which rises curiosity among the audience. Young Maestro Yuvan Shankar Raja is composing the music while Balasubramaniem is handling the camera. SS Murthy is the art director and NB Srikanth is Editor. Other details of cast and crew will be revealed soon.


Pawan Kalyan Creative Works and People Media Factory LLP Collaborative Projects Announcement

This press note is to announce the ambitious collaboration between Pawan Kalyan Creative Works and People Media Factory LLP.



Pawan Kalyan creative works established by the actor, politician Mr. Pawan Kalyan garu with love for cinema and storytelling. He founded PKCW with a noble intention of encouraging new writers, story tellers and talent in making movies in multiple languages across different generes.


People Media Factory LLP was founded by the producer T.G. Vishwa Prasad garu, who has been producing movies in a factory model, with 10+ feature films in the production pipeline at the moment.  


This coming-together of Pawan Kalyan Creative Works and People Media Factory LLP aims at materializing projects as mentioned below, apart from the exciting possibility of Mr. Pawan Kalyan garu himself starring in a couple of them.


• 6 Small scale projects

• 6 medium scale projects

• 3 large scale projects


PKCW and PMF are joining hands to create a fulfilling platform for the incoming breed of young talent on which the latter can transform their fresh and original ideas into reality. The focus will be on working with aspiring storytellers, filmmakers, and people of all crafts of cinema making towards creating a sustainable ecosystem for the talent to thrive in.


Mr. Harish Pai will play a key role as executive producer in encouraging new talent that can leverage the collaboration to explore promising opportunities.


The representatives will announce further information in due course of time.

SITA ON THE ROAD' TO PREMIERE ON APRIL 3rd ON ZEE5

 SITA ON THE ROAD' TO PREMIERE ON APRIL 3rd ON ZEE5



 The film deals with the lives of five women


Hyderabad, April 1, 2021: ZEE5 has been promising when it comes to offering unlimited entertainment to its viewers. During the pandemic, it has premiered direct-to-digital releases, original web series, and various movies to keep the Telugu audience engaged. And now, it is all set to bring to its viewers ‘Sita on the road.’


Kalpika Ganesh, Khatera Hakimi, Gayatri Gupta, Nesa Farhadi and Uma Lingaiah star in 'Sita On The Road', which is directed by Praneeth Yaron. It streamed on ZeePlex in the first week of March. The film premiered on ZEE5 on April 3.


'Sita On The Road' is about five women and the testing times they face in their lives. The film, in telling their stories, talks about the issues faced by women in our society, how they face them, and beyond. How do the five female characters cross paths? What are their individual stories? This is narrated in an exciting way in the film.


The performances, the music and the background score of the film have been critically acclaimed. Praneeth Yaron, besides directing the movie, has also written its story, dialogues and screenplay.


ZEE5 has been streaming some of the best movies such as 'Jersey', which recently won the National Award in the Best Telugu Film category. 'Ninnila Ninnila' was its recently-released direct-to-digital release. It also premiered 'Solo Brathuke So Better'. 


Watch ‘Sita on the road’ on April 3rd only on ZEE5

Strangers Movie First Look Launched


The makers of Strangers released the first-look poster of the film through social media. Titled Strangers, 

Sai Ketan Rao and Insha Iqbal will be seen playing the lead. This upcoming romantic film is directed 

by Chaitanya Reddy Vaka, with major portions shot in Goa locations. It is Produced by Sravan Reddy 

and Chaitanya Reddy under the banner Va Va Entertainments. 

The film has music composed by Paul Prashanth while the cinematography is handled by Prem Adivi. 

On this Occasion the lead actor Sai Ketan Rao who is currently busy in the shooting of Mehndi Hai 

Rachne Waali told it was really a wonderful experience on working with this team and is eagerly waiting 

for the release. 

Chaitanya Reddy Vaka the director of the film told it’s an independent film and is definitely worth to 

invest your time to enjoy the journey of our strangers. And he also thanked team for their efforts in 

making the film. 

One of the Producers of the film Sravan Reddy revealed that, first look of the film is getting good 

response from the audience and are planning to release the audio and trailer shortly. The makers also 

planning to release the film in OTT in the month of April. 

Cast-

Sai Ketan Rao 

Insha Iqbal 

Technicians-

Written & Directed By- Chaitanya Reddy Vaka 

Music- Paul Prashanth 

DOP- Prem Adivi 

Editing- Manoj & Prem Adivi 

DI-Bhanu Vishwanadhula 

Arts- Cherishma Reddy 

Singers- Manisha Eerabathini, Yazin Nizar 

Styling-Pranathi Reddy 

Executive Producers-Raja Shekar Reddy & Kalyan Kumar Reddy 

PRO- Madhu VR 

Manager- Sandeep P

 Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేసిన చిత్ర బృందం


 va va ఎంటర్ టైన్మెంట్స్ పతాకంపై శ్రావణ్ రెడ్డి మరియు డాక్టర్ చైతన్య రెడ్డి సమర్పణలో డాక్టర్ చైతన్య రెడ్డి దర్శకత్వంలో సాయి కేతన్ రావు కథానాయకుడుగా నిర్మించిన Strangers(స్ట్రేంజర్స్) సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేశారు.


 ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు డాక్టర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ .. ప్రేక్షకులు ఈ సినిమాని చూస్తూ మంచి అనుభూతిని పొందుతారు. త్వరలో ఈ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ ని రిలీజ్ చేస్తామని తెలిపారు. ఈ చిత్ర పోస్టర్ విడుదల సందర్భంగా చిత్ర బృందానికి తన కృతజ్ఞతలు తెలియజేశారు 


 చిత్ర కథానాయకుడు సాయి కేతన్ రావు మాట్లాడుతూ... ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని ప్రేక్షకులు ఆదరించి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాను అని తెలిపారు. 


 చిత్ర నిర్మాతల్లో ఒకరైన శ్రావణ్ రెడ్డి మాట్లాడుతూ..ఈ సినిమా ట్రైలర్ ని మరియు సాంగ్స్ ని త్వరలో రిలీజ్ చేస్తామని, పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చిందని తెలిపారు.


ఈ సినిమాని త్వరలో  ఓ.టి.టి ప్లాట్ ఫారంలో ఏప్రిల్ నెలలో విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపారు. 


 నటీనటులు

సాయి కేతన్ రావు,

ఇన్షా ఇక్బాల్ 


 సాంకేతిక నిపుణులు

బ్యానర్ :- va va ఎంటర్ టైన్మెంట్

సమర్పణ :- చైతన్య రెడ్డి

కథ, దర్శకత్వం :- చైతన్య రెడ్డి వాక 

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ :- రాజశేఖర్ రెడ్డి, కళ్యాణ్ కుమార్ రెడ్డి, 

లైన్ ప్రొడ్యూసర్ :- ఫణి కుమార్ అవసరాల

మ్యూజిక్ :- పాల్ ప్రశాంత్ 

డి.ఓ.పి :-ప్రేమ్ అడివి 

ఎడిటింగ్ :- మనోజ్ , ప్రేమ్ అడివి 

డి.ఐ :-భాను విశ్వనాధుల 

ఆర్ట్స్ :-చరిష్మా రెడ్డి 

సింగర్స్ :- మనీషా ఎరాబతిని, యాజిన్ నిజార్ 

స్టైలింగ్ :- ప్రణతి రెడ్డి 

పి.ఆర్.ఓ :- మధు వి.ఆర్ 

మేనేజర్ :- సందీప్.పి