Home » » Singer Mangli Yogi Thathvam Song Released By Megastar Chiranjeevi

Singer Mangli Yogi Thathvam Song Released By Megastar Chiranjeevi



 గాయని మంగ్లీ "యోగితత్వం" ను రిలీజ్ చేసిన 'మెగాస్టార్' 


ప్రముఖ గాయని మంగ్లీ పాడిన 'యోగితత్వం' పాటను 'మెగాస్టార్' చిరంజీవి విడుదల చేశారు. 'యోగితత్వం' గీతాన్ని విడుదల చేసిన అనంతరం చిరంజీవి సాంగ్ యూనిట్ కు బెస్ట్ విశెస్ తెలిపారు. దాము రెడ్డి ఈ పాటకు దర్శకత్వం వహించారు. బాజి సంగీతాన్ని సమకూర్చగా..ఈ పాట మల్కిదాసు తత్వసంకీర్తన నుంచి సేకరించినది. అచలయోగి, సంకీర్తనాచార్యులు, తత్వవేత్త, రచయిత, హరికథ గాన సంపన్నుడైన మల్కిదాస్... 'నా గురుడు నన్నింకా యోగి గమ్మననె, యోగి గమ్మననె, రాజయోగి గమ్మననె.....' అంటూ సాగే ఈ పాటలో యోగితత్వాన్ని అద్భుతంగా వివరించారు. 


మంగ్లీ అఫీషియల్ యూట్యూబ్ ఛానెల్ లో 'యోగితత్వం' పాట అప్ లోడ్ అయ్యింది. మంగ్లీ పాటలను ఇష్టపడేవారు ఈ పాటకు హయ్యెస్ట్ వ్యూస్ ఇవ్వనున్నారు. శివాణి మాటూరి సమర్పణలో రూపొందిన ఈ పాటకు సినిమాటోగ్రఫీ - తిరుపతి, ఎడిటర్ - ఉదయ్ కంభం.


Share this article :