Latest Post

Baahubali: Crown of Blood' trailer Released

‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ రిలీజ్, మే 17 నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానున్న యానిమేషన్ సిరీస్




ఇండియన్ బాక్సాఫీస్ వసూళ్లలో కొత్త చరిత్ర సృష్టించిన సినిమా బాహుబలి. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన బాహుబలి సిరీస్ లో వచ్చిన రెండు సినిమాలు వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇప్పుడు ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ పేరుతో ఈ కథలో కొత్త అధ్యాయం మొదలుకాబోతోంది. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ యానిమేషన్ సిరీస్ ను గ్రాఫిక్ ఇండియా, అర్క మీడియా బ్యానర్స్ పై దర్శకుడు S.S. రాజమౌళి, శరద్ దేవరాజన్, శోభు యార్లగడ్డ నిర్మించగా..జీవన్ జె. కాంగ్,  నవీన్ జాన్ దర్శకత్వం వహించారు. ‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ మే 17వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ కానుంది.


‘బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ట్రైలర్ ను ఈరోజు రిలీజ్ చేశారు. మాహిష్మతి రాజ్యాన్ని ప్రపంచపటం నుంచి తుడిచేయాలని యుద్ధానికి దిగిన రక్త్ దేవ్ ను బాహుబలి, భల్లాలదేవుడు కలిసి వీరోచితంగా ఎదుర్కోవడం ట్రైలర్ లో ఆకట్టుకుంది. ప్రతి పాత్ర ఎమోషన్, యాక్షన్ సీక్వెన్సులు సిల్వర్ స్క్రీన్ ఎక్సీపిరియన్స్ ఇచ్చేలా రూపొందించారు.


డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్ కంటెంట్ హెడ్  గౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ - బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్‌తో ఐకానిక్ ఫ్రాంచైజీని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం సంతోషంగా ఉంది. పిల్లలతో పాటు పెద్దలను కూడా ఈ సిరీస్ తో ఆకర్షించబోతున్నాం. ఈ సిరీస్ తో గ్రాఫిక్ ఇండియాతో హాట్ స్టార్ రిలేషన్ మరింత బలోపేతం కానుంది.’’ అన్నారు.


దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మాట్లాడుతూ -బాహుబలి ప్రపంచం చాలా విశాలమైంది.  ఈ ఫిల్మ్ ఫ్రాంచైజీ ఆ ప్రపంచాన్ని సరైన విధంగా పరిచయం చేస్తుంది. ఈ కథలో తెలుసుకునేందుకు చాలా విషయాలు ఉన్నాయి. ఈ కథ మొదటిసారిగా బాహుబలి, భల్లాలదేవ జీవితాలలో తెలియని అనేక మలుపులను తెలియజేస్తుంది. ఈ ఇద్దరు సోదరులు మాహిష్మతిని రక్షించడానికి చేసిన వీరోచిత పోరాటం ఈ సిరీస్ తో తెలుస్తుంది. బాహుబలి అభిమానులకు ఈ కొత్త అధ్యాయాన్ని పరిచయం చేస్తున్నందుకు, ఈ కథను యానిమేషన్ ఫార్మాట్‌లో తీసుకు రావడానికి మేం చాలా సంతోషిస్తున్నాం. అన్నారు.


హీరో రానా దగ్గుబాటి మాట్లాడుతూ - ఈ సిరీస్ తో బాహుబలి ఫిల్మ్ ఫ్రాంచైజీ తన స్క్రీన్ మ్యాజిక్ కొనసాగిస్తోంది. యానిమేషన్ లో బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్ రూపొందడం సంతోషాన్ని ఇస్తోంది. బాహుబలి, భల్లాలదేవ్ జీవితం యొక్క ఈ కొత్త అధ్యాయం బాహుబలి ప్రపంచంలోని మరెన్నో రహస్యాలను ప్రేక్షకులకు పరిచయం చేస్తుంది. అని అన్నారు.

King Nagarjuna Akkineni unleashes First look of Kubera

Watch: King Nagarjuna Akkineni unleashes intriguing first look from ‘Sekhar Kammula’s Kubera’ amid IPL 2024 broadcast



The highly anticipated social drama, ‘Sekhar Kammula’s Kubera’ by the acclaimed national award-winning filmmaker Sekhar Kammula, is being touted as one of the most awaited upcoming mythological pan-Indian films. Taking global television screens by storm tonight, King Nagarjuna Akkineni’s official first look from the film was unveiled exclusively on Star Sports, heightening anticipation for the magnum opus. 


Premiered during the Sunrisers Hyderabad vs. Rajasthan Royals IPL game, King Nagarjuna Akkineni’s first look showcases him in a powerful stance with an air of mystery. He is seen walking under an umbrella in heavy pouring rain, surrounded by trucks of liquid cash, symbolising the film’s title Kubera, which is known to be the god of wealth. Dressed sharply in a shirt, trousers and sporting glasses, the actor has immensely elevated expectations from the social drama.


Check out his first look here:





Meanwhile, earlier, the first look of actor Dhanush from 'Sekhar Kammula’s Kubera' was unveiled, earning a thrilling response from audiences nationwide.


‘Sekhar Kammula’s 'Kubera’ boasts an ensemble cast including Dhanush, King Nagarjuna Akkineni, Rashmika Mandanna, and Jim Sarbh. The film is jointly produced by Suniel Narang and Puskur Ram Mohan Rao under the Sri Venkateswara Cinemas LLP and Amigos Creations Pvt Ltd banner. ‘Sekhar Kammula's Kubera’ is a pan-India multilingual film, being shot simultaneously in Tamil, Telugu, and Hindi. 

Allu Arjun Creates All Time Record-Pushpa 2 The Rule First Single

 ALLU ARJUN CREATES ALL-TIME INDIA RECORD 



'Pushpa: The Rule', with its grand scale and pan-Indian appeal, is fronted by National Award-winning actor Allu Arjun. Director Sukumar is readying the project for a theatrical release on August 15. Mythri Movie Makers and Sukumar Writings are happy to announce that the First Single from the movie has a rare distinction. 


'Pushpa Pushpa' has become the country's most-viewed lyrical song in the first 24 hours across six languages in which it was released. The Devi Sri Prasad composition has amassed 40 million real-time views. Its updated views are 26.6 million in number. 


The song, which has the Icon Star delivering a hook step with utmost precision, has mounted 1.27 million likes. It continues to trend in 15 countries. 


Needless to say, this is an all-time record. Dance choreographers Vijay Polaki and Srashti Verma have worked under the aegis of Prem Rakshit on the song. Every single talent associated with the song deserves applause. 


Action directors Peter Hein, Kecha Kamphakdee, Dragon Prakash, and Nabakanta are associated with the project.

Sarpanch Movie Launched Grandly

ఫిలిం ఛాంబర్ లో లో నేడు ఘనంగా సర్పంచ్ మూవీ ప్రారంభోత్సవ వేడుకలు



జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ పై జట్టి రవికుమార్ M.A. దర్శకుడిగా వ్యవహరిస్తూ నిర్మిస్తున్న చిత్రం సర్పంచ్ ప్రారంభోత్సవ వేడుకలు నేడు ఫిలిం ఛాంబర్ లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బోయినపల్లి హనుమంతరావు గారు (జాతీయ స్వాతంత్ర సమరయోధుల కుటుంబాల జాతీయ అధ్యక్షుడు), సీతారామస్వామి ఉపాసకులు శ్రీశ్రీశ్రీ పెండ్యాల సత్యనారాయణ గారు, హైకోర్టు అడ్వకేట్ కుడికాల ఆంజనేయులు గారు,  బి. రమేష్, అంజనీ, జట్టి రజిత, అక్షర జ్ఞాన, అనోగ్న, జ్ఞాన సిద్ధార్థ, అంబేద్కర్ శాస్త్రి, బంటు ప్రవీణ్, పోతరాజు, ప్రశాంత్, సంపత్, బంటు ఆశ్రిత, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.


బోయినపల్లి హనుమంతరావు మాట్లాడుతూ : మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధుడు. కరీంనగర్ గాంధీగా ఆయనకు గుర్తింపు ఉంది. ఈ సినిమా రంగ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు జట్టి రవికుమార్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షక ఫిలిమ్స్ బ్యానర్ ద్వారా వస్తున్నాయి సినిమా మంచి విజయం సాధించాలని. ముందు ముందు ఈ బ్యానర్ ద్వారా ఇంకా మంచి సినిమాలు వచ్చి దిన దినాభివృద్ధి చెందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాత, దర్శకుడు జట్టి రవికుమార్ మాట్లాడుతూ : మనిషిని ముందుండి నడిపించేది జ్ఞానం అందుకని జ్ఞాన ఆర్ట్స్ అని అదేవిధంగా సినిమా సక్సెస్ కి కారణం ప్రేక్షకుడు అందుకని జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలింస్ అని పెట్టాం. ఈ సినిమాని జూన్ 20న మొదలు పెట్టి 2025 కి పూర్తి చేస్తాం. ప్రేక్షకులందరికీ ఆదరణ సపోర్ట్ మాపై ఈ సినిమాపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.


నిర్మాణం : జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్

నిర్మాత మరియు దర్శకుడు : జట్టి రవికుమార్

పి ఆర్ ఓ : మధు VR 

Kamakshi Bhaskarla wins Best Actress Award at the prestigious 14th Dada Saheb Phalke Film Festival

 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకున్న కామాక్షి భాస్కర్ల



ప్రతిష్టాత్మకంగా న్యూ ఢిల్లీలో జరిగిన 14వ దాదా సాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్ 2024లో ఉత్తమ నటి అవార్డును సొంతం చేసుకోవటంపై హీరోయిన్ డా.కామాక్షి భాస్కర్ల సంతోషంగా ఉన్నారు. గత ఏడాది విడుదలై ఘన విజయం సాధించిన ‘మా ఊరి పొలిమేర 2’లో లక్ష్మీ అనే పాత్రలో ఆమె చూపించిన ఇన్‌టెన్స్ నటనకుగానూ ఆమెకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్భంగా కామాక్షి భాస్కర్ల ఇంతటి విజయాన్ని అందించిన తెలుగు సినీ ప్రేక్షకులకు, అవకాశం ఇచ్చిన చిత్ర యూనిట్‌కు ధన్యవాదాలను తెలియజేశారు.  అలాగే అనిల్ విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ సినిమా ఈ ఫిల్మ్ ఫెస్టివల్ లో ఎంపిక కావటం విశేషం. 


‘‘మా ఊరి పొలిమేర 2’ సినిమాలో నటనకుగానూ నాకు ఉత్తమ నటిగా అవార్డు రావటం నాకు థ్రిల్లింగ్‌గా అనిపించింది. ఈ అవార్డుకు నన్ను ఎంపిక చేసిన జ్యూరీకి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవార్డు నటిగా నా బాధ్యతను మరింతగా పెంచింది. ఈ సందర్భంగా సమహార థియేటర్ లో నాకు నటనను నేర్పించిన నా గురువుగారు రత్న శేఖర్‌గారికి, నీజర్ కబిగారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నాపై ఇంత ప్రేమాభిమానాలు చూపించిన ప్రేక్షకులకు థాంక్స్. నాకు సపోర్ట్ చేసి, ఈ అవార్డు రావటానికి కారణమైన ప్రతీ ఒక్కరికీ దీన్ని అంకితమిస్తున్నాను’’ అని పేర్కొన్నారు కామాక్షి భాస్కర్ల. 


ఇదే సందర్భంలో ‘మా ఊరి పొలిమేర 2’లో తను చేసిన పాత్ర గురించి, సినిమా గురించి కామాక్షి మాట్లాడుతూ ‘‘సినిమా చాలా పెద్ద విజయాన్ని సాధిస్తుందనే నమ్మకం మాకుంది. అయితే అవార్డులు వస్తాయని మేం ఊహించలేదు. ఎంటైర్ టీమ్ ఇచ్చిన సపోర్ట్ తో సినిమా అవార్డులను సొంతం చేసుకుంది. ఓ టీమ్‌గా మేం ఇంత వరకు చేసిన ప్రయాణంతో పాటు ఇతర భాషా ప్రేమికులు సినిమా కంటెంట్‌ను ఎలా ఆదరిస్తున్నారో చూడటం ఆనందంగా ఉంది. 


‘‘‘మా ఊరి పొలిమేర 2’ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధించటమే కాకుండా ప్రేక్షకుల, విమర్శకుల నుంచి ప్రశంసలను అందుకుంది. అందుకనే ఈ ప్రతిష్టాత్మక అవార్డు నా మనసులోప్రత్యేకంగా నిలిచిపోతుంది’’ అని పేర్కొంది కామాక్షి భాస్కర్ల.

Polimera 2 wins big at prestigious 14th Dada Saheb Phalke Film Festival

ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసిన "మా ఊరి పొలిమేర 2".  ఈ సినిమాకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ గెల్చుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల




టాలీవుడ్ సక్సెస్ ఫుల్ హారర్ థ్రిల్లర్ "మా ఊరి పొలిమేర 2" ప్రతిష్టాత్మక 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్'లో మెరిసింది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించిన డాక్టర్ కామాక్షి భాస్కర్లకు ఉత్తమ నటిగా జ్యూరీ అవార్డ్ దక్కింది. ఆమె తరుపున దర్శకుడు అనిల్ విశ్వనాథ్, నిర్మాత గౌరు కృష్ణ, డిస్ట్రిబ్యూటర్, ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి అవార్డును స్వీకరించారు. ఈ అవార్డ్ తో పాటు "మా ఊరి పొలిమేర 2" దర్శక నిర్మాతలకు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' నిర్వాహకులు సర్టిఫికెట్ ఆఫ్ ఎక్స్ లెన్స్ ను అందించారు. మంగళవారం ఢిల్లీలో ఈ ఫిలిం ఫెస్టివల్ జరిగింది. తమ సినిమాకు ఈ ప్రతిష్టాత్మక అవార్డ్స్ లో దక్కిన గుర్తింపు సంతోషాన్నిస్తోందని, డాక్టర్ కామాక్షి భాస్కర్ల "మా ఊరి పొలిమేర 2" సినిమాలో అద్భుతంగా నటించిందని ప్రశంసించారు దర్శకుడు అనిల్ విశ్వనాథ్.


లాక్ డౌన్ టైమ్ లో "మా ఊరి పొలిమేర" డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో నేరుగా స్ట్రీమింగ్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ తో సీక్వెల్ "మా ఊరి పొలిమేర 2" రూపొందించారు. ఈ సినిమా 2023 నవంబర్ 3న  ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాను ప్రముఖ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ వంశీ నందిపాటి డిస్ట్రిబ్యూట్ చేశారు. మా ఊరి పొలిమేర 2 సినిమాను గౌరు గ‌ణ‌బాబు సమర్పణలో శ్రీ కృష్ణ క్రియేషన్స్ బ్యానర్‌పై గౌరు కృష్ణ నిర్మించారు. డాక్టర్‌ అనిల్ విశ్వనాథ్‌ దర్శకత్వం వహించారు. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల, గెటప్ శ్రీను, రవి వర్మ, రాకేందు మౌళి, చిత్రం శ్రీను, సాహిత్య దాసరి ప్రధాన పాత్రల్లో నటించారు. థియేటర్, ఓటీటీ లో ప్రేక్షకుల రివార్డ్ తో పాటు 'దాదా సాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్' లో అవార్డ్స్ దక్కడంపై "మా ఊరి పొలిమేర 2" మూవీ టీమ్ ఆనందాన్ని వ్యక్తం చేస్తోంది. 

Hero Suhas Interview About Prasanna Vadanam

 'ప్రసన్న వదనం' యూనిక్ కాన్సెప్ట్ తో సీట్ ఎడ్జ్ థ్రిల్ అనుభూతిని ఇస్తుంది. చాలా సీన్స్ షాకింగా వుంటాయి. ఆడియన్స్  ఖచ్చితంగా చాలా ఎంజాయ్ చేస్తారు: హీరో సుహాస్  

 


యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో హీరో సుహాస్ విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


సుహాస్ గారు ఈ కథలో మిమ్మల్ని ఆకర్షించిన అంశాలు ఏమిటి ?

-దర్శకుడు చెప్పిన ఫేస్ బ్లైండ్ నెస్ కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఆయన అనుకున్న స్క్రీన్ ప్లే, సర్వైవల్ డ్రామా, క్లైమాక్స్ అదిరిపోయాయి. కథ విన్న వెంటనే చేసేద్దామని ఫిక్స్ అయిపోయాను.    


ఇందులో మీ క్యారెక్టరైజేషన్ ఎలా వుండబోతుంది ?

-ఇందులో ఆర్జే గా పని చేస్తాను. మామూలు కుర్రాడి పాత్రే. అయితే తనకున్న పేస్ బ్లైండ్ నెస్ కారణంగా ఎలాంటి సమస్యల్లో ఇరుక్కుంటాడు? ఆ సమస్యలని ఎలా పరిష్కరించుకుంటాడనేది క్యారెక్టర్.  


-ఈ పాత్ర కోసం మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు?

ఈ పాత్ర కోసం పది రోజులు వర్క్ షాప్ చేశాం. దర్శకుడితో కూర్చుని పాత్ర ఎలా వుండాలి, ఎలా ప్రవర్తించాలి? ఆ పాత్ర బౌండరీలు ఏమిటి ? ఇవన్నీ వర్క్ షాప్ లో ప్రిపేర్ ఆయన తర్వాత షూట్ కి వెళ్లాం.


షూటింగ్ సమయంలో మీరు ఎదుర్కొన్న ఛాలెంజ్స్ ఏమిటి ?

-ఇందులో కొన్ని యాక్షన్ సీక్వెన్స్ లు వున్నాయి. అవి చేయడం కాస్త సవాల్ గా అనిపించింది. అలాగే నాది ఫేస్ బ్లైండ్ నెస్ వున్న పాత్ర. దానికి ఎలాంటి ఎక్స్ ప్రెస్షన్స్ ఇవ్వాలనేది ఛాలెంజింగా అనిపించింది. అయితే వాటిని అచీవ్ చేశాననే అనుకుంటున్నాను.


కొత్త దర్శకుడు అర్జున్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ? తన పనితీరు గురించి చెప్పండి ?

-అర్జున్ తో పని చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనకి దర్శకుడిగా ఇది తొలి సినిమానే కానీ సుకుమార్ గారితో ఆయన పెద్దపెద్ద సినిమాలకి పని చేశారు. తనకి చాలా అనుభవం వుంది. చాలా అనుభవం వున్న దర్శకుడిలానే ఈ సినిమాని అద్భుతంగా చేశారు.  


ఈ నిర్మాణ సంస్థలో పని చేయడం ఎలా అనిపించింది ?

-ఇది నాకు హోమ్ బ్యానర్ లాంటిదే. మణికంఠ కలర్ ఫోటో ఫ్యామిలీ డ్రామాకి సహా నిర్మాత గా చేశారు. అప్పటినుంచి నాకు మంచి ఫ్రెండ్ అయిపోయారు. ఎక్కడా రాజీపడకుండా సినిమాని నిర్మించారు. ఆయనతో మరిన్ని సినిమాలు చేయాలని వుంది.


ఇద్దరు హీరోయిన్స్ వున్నారు కదా... వాళ్ళ పాత్రలకు కథలో ఎలాంటి ప్రాధాన్యత వుంటుంది ?

-పాయల్ రాధాకృష్ణ నాకు జోడిగా కనిపిస్తారు. రాశి సింగ్ మరో కీలక పాత్ర చేస్తున్నారు. ఇందులో ఇద్దరికీ చాల ప్రాధాన్యత వుంటుంది. లాగే నితిన్, నందు, హర్ష పాత్రలు కూడా చాలా కీలకంగా వుంటాయి.  


ఫస్ట్ కాపీ చూసే వుంటారు. ఎలా అనిపించింది ?  

-ఫస్ట్ కాపీ అన్నపూర్ణలో ఒక్కడినే చూశాను. సినిమా పూర్తయిన తర్వాత చాలా ఎమోషనల్ గా అనిపించింది. ఆనందంతో దర్శకుడిని హత్తుకున్నాను.  సినిమా అద్భుతంగా వచ్చింది. ప్రేక్షకులకు ఖచ్చితంగా నచ్చుతుంది.  


మీ కథల ఎంపిక చాలా యూనిక్ వుంటుంది. ఒక కథని ఎంచుకున్నపుడు ఎలాంటి అంశాలు పరిగణలోకి తీసుకుంటారు?

-పర్టిక్యులర్ గా ఏమీ వుండదండీ. మామూలు ప్రేక్షకుడిలానే బ్లాంక్ మైండ్ తో కథ వింటాను. విన్నప్పుడు ఎక్సయిటింగ్, క్లాప్స్ కొట్టేలా అనిపిస్తే వెంటనే ఓకే చెప్పేస్తాను.  


ఇప్పటివరకూ మీరు చేసిన పాత్రల్లో... మీకు ఇష్టమైన మూడు పాత్రలు అంటే ఏం చెప్తారు?

-కలర్ ఫోటో లో క్యారెక్టర్ ఇష్టం. అలాగే ఫ్యామిలీ డ్రామా కూడా ఇష్టం. అందులోచాలా వేరియేషన్స్  వుంటాయి. అలాగే అంబాజీ పేటలో చేసిన పాత్ర. వీటితో పాటు నేను చేసిన అన్ని పాత్రలు ఇష్టపడే చేశాను.


భవిష్యత్ లో ఎలాంటి కథలు చేయడానికి ఇష్టపడతారు?

-పర్టిక్యులర్ గా ప్లాన్ అంటూ ఏమీ లేదు. వచ్చిన కథల్లో నచ్చిన కథలు చేసుకుంటూవెళ్తున్నాను.


మీ చేతిలో దాదాపు ఎనిమిది సినిమాలు వున్నాయని విన్నాం. ఇన్ని సినిమాలు బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. వర్క్ ని బ్యాలెన్స్ చేయడానికి వ్యక్తిగతంగా ఎలాంటి క్రమశిక్షణని పాటిస్తారు?

-అవునండీ, ఎనిమిది సినిమాలు వున్నాయి. ఎనిమిది సినిమాలు బ్యాలెన్స్ చేయాలంటే నిజంగానే కష్టం. అయితే మా మ్యానేజర్స్, నేను చర్చించుకొని చాలా సమన్వయంతో చేస్తున్నాం. క్రమశిక్షణ విషయానికి వస్తే షూటింగ్ పూర్తయిన వెంటనే ఇంటికి వచ్చేస్తాను. రాత్రి పదింటికి నిద్రపోతాను. మళ్ళీ ఉదయం ఐదింటికి షూటింగ్ కి వెళ్ళిపోతాను. గ్యాప్ వచ్చిన రోజు కథలు వింటాను.


మీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి ?

-దిల్ రాజు గారి నిర్మాణంలో జులైలో ఓ సినిమా విడుదల కానుంది. అది చాలా కొత్త కామెడీ ఎంటర్ టైనర్.  కేబుల్ రెడ్డి షూట్ జరుగుతోంది.  అమెజాన్ ప్రైమ్ లో కీర్తి సురేష్ గారితో చేస్తున్న ప్రాజెక్ట్ షూట్ స్టార్ట్ అవ్వాలి. కార్తిక్ సుబ్బరాజ్ గారితో ఒక సినిమా వుంది. అలాగే ఆనందరావు అడ్వంచర్స్ తో పాటు పాటు మరికొన్ని కథలు వున్నాయి.

 

ఫైనల్ గా ప్రసన్న వదనం గురించి ప్రేక్షకులు ఏం చెబుతారు. ఈ సినిమా ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇవ్వబోతోంది ?

-అందరినీ అలరించే సినిమా ఇది. చాలా మంది నా కథల ఎంపిక బావుందని మెచ్చుకుంటున్నారు. ఈ సినిమా చూసిన తర్వాత ఇంకా ఎక్కువ మెచ్చుకుంటారని అనుకుంటున్నాను. ఖచ్చితంగా థ్రిల్ ఫీలౌతారు. సీట్ ఎడ్జ్ లో కూర్చుని చూస్తారు. కొన్ని సీన్స్ కి షాక్ అవుతారు. చాలా మంచి ఎక్స్ పీరియన్స్ తో వెళ్తారు.


-ఆల్ ది బెస్ట్

థాంక్ యూ

Director Sundar C Interview About Baak

 ‘బాక్’ కంటెంట్ ఆడియన్స్ కు విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. తమన్నా, రాశిఖన్నా సర్ ప్రైజ్ చేస్తారు. చాలా గూస్ బంప్స్ మూమెంట్స్ వున్నాయి: హీరో, డైరెక్టర్ సుందర్ సి



అత్యంత విజయవంతమైన హార్రర్ కామెడీ సిరీస్ 'అరణ్మనై' నుంచి సుందర్ సి, తమన్నా భాటియా, రాశీ ఖన్నా నటించిన 'అరణ్మనై 4' థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తెలుగులో బాక్ అనే టైటిల్‌తో వస్తున్న ఈ చిత్రానికి సుందర్ సి దర్శకత్వం వహించారు. ఖుష్బు సుందర్, ACS అరుణ్ కుమార్‌లు Avni Cinemax P Ltd పతాకంపై నిర్మించారు.  ఇప్పటికే విడుదలై ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేయనుంది. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపధ్యంలో హీరో, దర్శకుడు సుందర్ సి విలేకరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


బాక్ సినిమా ఎలా ఉండబోతోంది ?

-అరణ్మనై సిరిస్ లో నాలుగో చిత్రమిది. మొదటి మూడు సినిమాలు తెలుగు, తమిళ్ లో చాలా పెద్ద విజయాన్ని సాధించాయి. ‘బాక్’ విషయానికి వస్తే ఈ కథ కోసం రీసెర్చ్ చేసే క్రమంలో చరిత్రతో ముడిపడిన ఓ ఆశ్చర్యకరమైన సంఘటన గురించి తెలిసింది. అస్సామీ జానపదంలో బాక్ అనే ఘోస్ట్ వుండేదని అక్కడి ప్రజల నమ్మకం. తమ ప్రాంతానంతా చేతబడి చేశారనేది వారి విశ్వాసం. ఇది నన్ను చాలా సర్ ప్రైజ్ చేసింది. అదే ఈ బాక్ కథకు బీజం వేసింది. అస్సామీ, బ్రహ్మపుత్ర ప్రాంతంలో వుండే బాక్ అనే దెయ్యం..సౌత్ కి వస్తే ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనే ఆలోచనతో అరణ్మనై 4' కథ రాయడం జరిగింది. ప్రేక్షకులని థ్రిల్, సర్ ప్రైజ్ చేసే సినిమా ఇది.


అరణ్మనై3 కి 4 కి ఎలాంటి తేడా వుంటుంది ?

-అరణ్మనై సిరిస్ లో వచ్చిన సినిమాలన్నీ వ్యక్తిగత పగ, ప్రతీకారం కేంద్ర బిందువుగా వుంటాయి. అరణ్మనై 4 ఇందుకు భిన్నంగా వుంటుంది. ఒక ఎక్స్ ట్రనల్ ఎలిమెంట్ కథలో భాగం అవుతుంది. అది చాలా కొత్తగా వుంటుంది. విజువల్స్, మ్యూజిక్, లొకేషన్స్ అన్నీ డిఫరెంట్ గా వుంటాయి.  


తమన్నా, రాశిఖన్నా లని ఎంపిక చేసుకోవడానికి కారణం?

-అరణ్మనై సిరిస్ లో వచ్చే అన్ని సినిమాలో స్త్రీ పాత్రలు బలంగా వుంటాయి. గత చిత్రాలలో త్రిష, హన్సిక ప్రధాన పాత్రల్లో కనిపించారు. ఈ సినిమాకి వస్తే అద్భుతమైన పెర్ఫార్మెన్స్ కావాలి. ఎమోషన్స్ ని చక్కగా పలికించాలి.  ఈ పాత్రల కోసం తమన్నా, రాశిఖన్నాలు యాప్ట్ ఛాయిస్. ఇందులో కొత్త తమన్నాని చూస్తారు. రాశిఖాన్నా పాత్ర కూడా అదిరిపోతుంది. వారి నటన చూసి చాలా సర్ ప్రైజ్ అయ్యాను.


ఈ సినిమా ప్రయాణంలో మీకు సవాల్ గా అనిపించిన అంశం?

-ఈ సినిమా సిజీ ఛాలెంజ్ గా అనిపించింది. ఏడాదిన్నర పాటు సిజీ వర్క్ చేశాం. క్లైమాక్స్ షూటింగ్ చాలా సవాల్ గా అనిపించింది. అది మీరు తెరపైనే చూడాలి. ఇందులో సిజీ వర్క్ విజువల్ వండర్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నాం. మూడు వారాల తర్వాత హిందీ విడుదలకు ప్లాన్ చేస్తున్నాం.


నటుడిగా, దర్శకుడి కొనసాగడం ఛాలెంజ్ గా అనిపించడం లేదా ?

నటుడిగా ఇది నా ఇరవై ఒకటో చిత్రం. దర్శకుడన్నప్పుడు బోలెడు భాద్యతలు వుంటాయి. నటుడికి కూడా చాలా బాధ్యతలు. నటుడిగా దర్శకుడిగా కొనసాగడం కష్టమైనపనే. అయితే నాకున్న ఇష్టం, నా టీం సపోర్ట్,  ప్రేక్షకుల ఆదరణతో రెండిని చేస్తున్నా. కానీ మొదట పాషన్ మాత్రం దర్శకత్వమే.


ఖుష్బూ గారితో కథలని పంచుకుంటారా?

 స్టొరీ ఐడియాని డెవలప్ చేయకముందు.. ఐడియా ఎలా వుందని అడుగుతాను. తనకి నచ్చకా ఇంక కథని డెవలప్ చేస్తాను. మళ్ళీ కథ చెప్పడం వుండదు. ఫైనల్ ప్రోడక్ట్ చూపిస్తాను.


హిప్‌హాప్ తమిళ మ్యూజిక్ గురించి ?

తను సెన్సేషనల్ కంపోజర్. ఈ సినిమా కోసం అద్భుతమైన పాటలు చేశారు. క్లైమాక్స్ సాంగ్ అదిరిపోతుంది. క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తుంది.

 

సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ మీ సినిమాని విడుదల చేయడం ఎలా అనిపించింది ?

-సురేష్ ప్రొడక్షన్, ఏసియన్ పిక్చర్స్ లాంటి ప్రముఖ సంస్థలు మా సినిమాని విడుదల చేయడం గౌరవంగా భావిస్తున్నాను. తెలుగులో చాలా గ్రాండ్ గా విడుదల చేయడం ఆనందాన్ని ఇస్తోంది. మా గత చిత్రాలకు ప్రేక్షకులు అందించిన ఆదరణే ఈ సినిమాకి అందిస్తారని ఆశిస్తున్నాను. తప్పకుండా ఈ సినిమా ప్రేక్షకులని గొప్పగా అలరిస్తుంది.


 'అరణ్మనై 'నుంచి ఇంకా ఎన్ని సినిమాలు ఆశించవచ్చు ?

-అది ఇప్పుడే చెప్పలేను. 'అరణ్మనై' విజయం రెండో భాగం తీయడానికి బలాన్ని ఇచ్చింది అలాగే 'అరణ్మనై 4' విజయం ఇందులో మరో సినిమా చేయడానికి ఎనర్జీ ఇస్తుందని భావిస్తున్నాను.


దర్శకుడిగా మీకు డ్రీమ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయా?

సంఘమిత్ర అనే పెద్ద ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేశాం. కొన్ని కారణాల వలన అది ఆగింది. అది మళ్ళీ మొదలుపెట్టె ప్లాన్స్ జరుగుతున్నాయి. అది దేశం గర్వించదగ్గ సినిమా అవుతుంది.


నేరుగా తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు?

తెలుగ పరిశ్రమ అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పటినుంచో నేరుగా తెలుగు సినిమా చేయాలని వుంది. అది తొందరలోనే జరుగుతుందని భావిస్తున్నాను.


ఆల్ ది బెస్ట్

-థాంక్ యు


Prasanth Varma Calls Out Talents To Join His PVCU

తన PVCUలో చేరడానికి ప్రతిభావంతులకు పిలుపునిచ్చిన క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ  



క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ 'హనుమాన్‌'తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసిన తర్వాత సీక్వెల్ 'జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులను ఉర్రూతలూగించారు. ప్రీక్వెల్ అన్ని భాషల్లో సంచలన విజయం సాధించడంతో, అతని నెక్స్ట్ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి, ప్రశాంత్ వర్మ తన తదుపరి ప్రణాళికలను రివిల్ చేశారు. తన నెక్స్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కోసం ప్రశాంత్ వర్మ, బిగ్ స్టార్‌తో కలిసి పని చేయనున్నారు. జై హనుమాన్ ఫ్లోర్ పైకి వెళ్లే ముందు ఇది ప్రారంభమవుతుంది.


తెలుగు సినిమా చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రతిభావంతులందరినీ తన పీవీసీయూలో చేరాల్సిందిగా ఆహ్వానించారు. యువకులు,  ఔత్సాహిక సాంకేతిక నిపుణులు తమ నైపుణ్యాలను ప్రదర్శించేందుకు ఇదొక పెద్ద అవకాశం.


దర్శకుడు ఒక నోట్ ని రాశారు  "కాలింగ్ ఆల్ ఆర్టిస్ట్, సూపర్ పవర్స్ మాట్లాడుకుందాం! మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెట్టే మీ ప్రత్యేక నైపుణ్యం ఏమిటి? కథలు రూపొందించే నేర్పు, ఎడిటింగ్, మంత్రముగ్ధులను చేసే నైపుణ్యం కలిగిన గ్రాఫిక్స్, మార్కెటింగ్ మేవెన్.. మీ కళాత్మక నైపుణ్యాలతో యూనివర్స్ లోకి ప్రవేశించాలా? మీ పోర్ట్‌ఫోలియోలను మాకు చేరవేయడానికి "talent@thepvcu.com"కి పంపండి!


ప్రశాంత్ వర్మ తన PVCU ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతిభావంతులకు అవకాశాలను అందించడం గురించి యూనివర్స్ బిగినింగ్ కి ముందే చెప్పారు . మునుపెన్నడూ లేని విధంగా వర్క్ ఫోర్స్ ని నిర్మించాలని ఆయన సంకల్పించారు.


PVCU నుండి నెక్స్ట్ సెన్సేషనల్ ప్రాజెక్ట్‌లకు సంబంధించి బ్యాక్-టు-బ్యాక్ అప్‌డేట్‌ల కోసం గెట్ రెడీ.


Aa Okkati Adakku Pre Release Event Held Grandly



'ఆ ఒక్కటీ అడక్కు' ప్రతి ఒక్కరూ తప్పకుండా చూడాల్సిన సినిమా. ఇందులో కామెడీ ఆర్గానిక్ గా వుంటుంది. ఎమోషన్ హత్తుకుంటుంది. ఇది ఈ వేసవిలో అందరూ హాయిగా ఎంజాయ్ చేసే సినిమా: గ్రాండ్ ప్రీరిలీజ్ ఈవెంట్ లో హీరో అల్లరి నరేష్


- మే3న అందరం 'ఆ ఒక్కటీ అడక్కు' థియేటర్స్ లో చూద్దాం. హాయిగా నవ్వుకుందాం: హీరో అడివి శేష్



కామెడీ కింగ్ అల్లరి నరేష్ ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'ఆ ఒక్కటీ అడక్కు' తో రాబోతున్నారు. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రాన్ని చిలక ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజీవ్ చిలక నిర్మిస్తున్నారు. ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టార్ రైటర్ అబ్బూరి రవి చిత్రానికి డైలాగ్స్ అందించారు. అల్లరి నరేష్ చాలా కాలం తర్వాత చేస్తున్న కామెడీ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమాపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. ఈ సినిమా టీజర్‌, ట్రైలర్‌ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి. మే 3న ఈ సినిమా గ్రాండ్ గా విడుదల కానున్న నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. హీరో అడివి శేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


ప్రీరిలీజ్ ఈవెంట్ హీరో అల్లరి నరేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నేను ఈ స్టేజ్ లో, ఇన్ని సంవత్సరాలు పరిశ్రమలో ఉన్నానంటే కారణం మా నాన్నగారు. ఆయన వున్నన్ని రోజులు నాతో సినిమాలు చేసి, హిట్లు ఇచ్చి, నన్ను సక్సెస్ ఫుల్ యాక్టర్ ని చేశారు. ఆయన లేనప్పుడు కూడా ఆయన టైటిల్ ఇచ్చి ఈ సినిమాతో బ్లెస్ చేస్తున్నారు. ఇది బరువుగా, భాద్యతగా ఫీలౌతున్నాను. తప్పకుండా ఆ మంచి పేరుని కాపాడతానని మాటిస్తున్నాను. ఈ వేడుకు వచ్చిన శేష్ గారికి, రవిగారికి, విజయ్ కనకమేడల, విజయ్ బిన్నీ, దేవాకట్టా గారికి పేరుపేరునా ధన్యవాదాలు. దర్శకుడిగా మల్లి అంకంకు ఇది మొదటి సినిమా. చాలా కాలంగా దర్శకుడు కావాలనే కలగని, ఎంతో హార్డ్ వర్క్ చేసి ఈ సినిమా చేశారు. చాలా మంది కొత్త దర్శకులతో పని చేశాను. దాదాపు 32 మంది కొత్త దర్శకులని పరిచయం చేశాను. 31 మంది రిలీజ్ కి ముందు టెన్షన్ పడ్డారు. ఒక్క మల్లి గారు మాత్రం చాలా కూల్ గా నవ్వుతూ వున్నారు( నవ్వుతూ). అసలు టెన్షన్ అనే మాటే ఆయన డిక్షనరీలో లేదు. నిజంగా అది గ్రేట్ గిఫ్ట్. ఈ సినిమాతో పరిశ్రమకి రాజీవ్ గారు లాంటి మంచి నిర్మాత పరిచయం అవుతున్నారు. ఇలాంటి నిర్మాతలు పరిశ్రమకు చాలా అవసరం. ఈ సినిమా పెద్ద విజయం సాధించి, ఆయన మరో పది చిత్రాలు నిర్మించి, మరో పదిమందికి పని ఇవ్వాలని కోరుకుంటున్నాను. గోపిసుందర్ గారు నాలుగు బ్యూటీఫుల్ సాంగ్స్ ఇచ్చారు. అబ్బూరి రవి గారు, చోటా ప్రసాద్ గారు దాదాపు ఐదారు సినిమాల నుంచి ఒక ఫ్యామిలీలా వర్క్ చేస్తున్నాం. ఈ సినిమాలో సాంగ్స్ చేసిన భాను మాస్టర్, రాజుసుందరం మాస్టర్, విజయ్ బిన్నీ మాస్టర్, రఘు మాస్టర్ అందరికీ థాంక్స్. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. ఫారియా వర్క్ చేయడం చాలా ఆనందంగా అనిపించింది. తనలో పెక్యులర్ కామెడీ టైమింగ్ వుంది. అది చాలా తక్కువ మందిలో వుంటుంది. ఈ సినిమా పెద్ద విజయం సాధించి మా జోడి మరో రెండు మూడు సినిమాలకు కొనసాగాలని కోరుకుంటున్నాను. జామి లివర్ యంగ్ వెర్షన్ అఫ్ కోవై సరళ లాంటి పాత్ర చేశారు. తన పాత్ర చాలా బావుటుంది. తనకి టాలీవుడ్ కి స్వాగతం. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. సినిమా మే3న విడుదల కాబోతుంది. ఈ మండు వేసవి మీ బాధలు మర్చిపోయి ఒక రెండు గంటలు హాయిగా ఈ సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి. ఈ సినిమా పెళ్లి కాని వాళ్ళు, పెళ్లి అయినవారు, పెళ్లి సంబంధాలు చూస్తున్నవారు, ప్రతిఒక్కరూ చూడాలి. కామెడీ సినిమా చేసిన, సీరియస్ సినిమా చేసినా కంటెంట్ వున్న సినిమా చేస్తాను. ఈ సినిమా ఆర్గానిక్ కామెడీ. ఇందులో పెళ్లిపేరుతో జరుగుతున్న మోసాలని అందరికీ తెలియజేయాలనే మంచి ఉద్దేశంతో ఈ సినిమా చేయడం జరిగింది. మే3న థియేటర్స్ రండి అందరూ సరదాగా నవ్వుకోండి. అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


హీరో అడివి శేష్ మాట్లాడుతూ.. నరేష్ గారితో నాకు చాలా గొప్ప అనుబంధం వుంది. నా ఫస్ట్ ఆడియో లాంచ్ కి నరేష్ గారు ముఖ్య అతిధిగా వచ్చారు. ఈ రోజు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకోవడానికి రావడం చాలా ఆనందంగా వుంది. నా మనసులో నరేష్ గారు అంటే ఇంట్లో మనిషి. ఆయన ఎప్పుడూ ఇతరుల ఆనందాన్ని కోరుకుంటారు. ఆయన్ని ఎప్పుడూ కలసి చాలా ఆత్మీయంగా వుంటుంది. అబ్బూరి రవి గారు నా కెరీర్ కి బ్యాక్ బోన్. కలసి ఏడు సినిమాలు చేశాం. రాజీవ్ గారు ఐకానిక్ యానిమేషన్ మూవీస్ పిల్లల్ని ఎలా ఇన్స్పైర్ చేశారో అలాంటి సినిమాలు తీయాలని కోరుకుంటున్నాను. ఫారియా ని ఫస్ట్ టైం కలిశాను. చాలా అమాయకంగా కనిపించారు. అదే ఇన్నోసెన్స్ కొనసాగిస్తే గర్వపడే స్థాయికి వెళ్తారు. మల్లికి నా బెస్ట్ విశేష్. మా అన్నయ్య టీంలో ఆయన పని చేశారు.మే3న అందరం థియేటర్స్ లో సినిమా చూద్దాం . హాయిగా నవ్వుకుందాం' అన్నారు.


హీరోయిన్ ఫారియా అబ్దుల్లా మాట్లాడుతూ.. నన్ను సపోర్ట్ చేస్తున్న అందరికీ బిగ్ థాంక్స్. నిర్మాత రాజీవ్ గారికి ధన్యవాదాలు. చాలా క్యాలిటీగా సినిమాని తీశారు. నరేష్ గారి ఎంత పెద్ద థాంక్స్ చెప్పినా తక్కువే. కో యాక్టర్ గా చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమాతో నరేష్ గారి రూపంలో ఒక మంచి ఫ్రెండ్ దొరికారు. ఈ విషయంలో చాలా ఆనందంగా వుంది. దర్శకుడు మల్లిగారి ధన్యవాదాలు. ఈ సినిమాకి పని చేసిన అందరికీ పేరుపేరు ధన్యవాదాలు. ఈ హోల్సమ్ ఎంటర్ టైనర్ ని తెరపై చూడటానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను'' అన్నారు.


సహా నిర్మాత భరత్ మాట్లాడుతూ.. నరేష్, ఫారియా తో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. రాజీవ్ తో కలసి అద్భుతమైన చిత్రాలు చేయడానికి ఎదరుచూస్తున్నాం. ఈ బ్యానర్ పరిశ్రమలో బలంగా నిలబడాలని కోరుకుంటున్నాను'అన్నారు.


దర్శకుడు మల్లి అంకం మాట్లాడుతూ.. ముందుగా ఈవీవీ సత్యనారాయణ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమా జర్నీలో అమ్మిరాజు గారి ద్వారా నరేష్ గారిని కలిశాను. ఈ సందర్భంగా అమ్మిరాజు గారికి ధన్యవాదాలు. భాను మాస్టర్ రఘు మాస్టర్ రాజు సుందరం మాస్టర్ పాటని అద్భుతంగా తీశారు. భాస్కర భట్ల, రామజోగయ్యశాస్త్రీ గారికి ధన్యవాదాలు. చాలా ప్రేమతో లిరిక్స్ రాశారు. ఆర్ట్ డైరెక్టర్, డీవోపీ సూర్య , ఎడిటర్ చోటాకే ప్రసాద్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, డైరెక్షన్ టీంకి ధన్యవాదాలు. అబ్బూరి రవి గారి నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. మాటలు అద్భుతంగా రాశారు. నటీనటులందరికీ థాంక్స్. ఇందులో జామి లివర్ పాత్ర అందరినీ ఆకట్టుకునేలా వుంటుంది. ఫారియా ఈ సినిమాకి రావడం వలన సిద్దిగా పాత్ర చాలా హైలెట్ అయ్యింది. అడివి శేష్ మా వేడుకకు రావడం చాలా ఆనందంగా వుంది. నా ఫస్ట్ లవర్ నరేష్ గారు. దర్శకుడిగా అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్ చేయాలి. కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడానికి చాలా ఆలోచిస్తుంటారు. కానీ నరేష్ గారు ఇప్పటికే ముఫ్ఫై కి పైగా దర్శకులని పరిచయం చేశారు. ఆయన ఇలానే చేస్తూ మా లాంటి వారికి అండగా వుండాలి. రాజీవ్ గారు చాలా క్యాలిటీతో ఈ సినిమాని తీశారు. అందరినీ అలరించే మంచి ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. తప్పకుండా ఆడియన్స్ ని అలరిస్తుంది' అన్నారు.


రచయిత దర్శకుడు బివిఎస్ రవి మాట్లాడుతూ.. అల్లరి నరేష్ ప్రతి తెలుగింట్లో కుర్రాడి లాంటి యాక్టర్. నరేష్ అభిమాని కాని ఇల్లు వుండదు. అంత ఇష్టం నరేష్ అంటే. ఎవరికి ఏ ఎమోషన్ వచ్చిన సరదాగా నవ్వుకోవడానికి నరేష్ సినిమాలు చూస్తుంటారు. ఫారియా తెలుగమ్మాయి. తన కామెడీ టైమింగ్ అద్భుతంగా వుంది. మల్లికి ఆల్ ది బెస్ట్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలి' అని కోరారు


చిత్ర నిర్మాత రాజీవ్ మాట్లాడుతూ.. నా ప్రయాణంలో నన్ను సపోర్ట్ చేసిన నా కుటుంబానికి ధన్యవాదాలు. మల్లిగారు కథ చెప్పినప్పుడు నా మైండ్ లో నరేష్ గారే వచ్చారు. ఈ సినిమా ఆయన చేయడం మా అదృష్టం. ఈ సినిమాని చేసే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అబ్బూరి రవిగారు రైటింగ్ తో పాటు ఎమోషనల్ గా చాలా సపోర్ట్ చేశారు. ఫారియా చాలా అద్భుతంగా నటించారు. వెన్నెల కిశోర్, హర్ష, జామి లివర్ ఇలా నటీనటులంతా చాలా చక్కని ప్రతిభ కనబరిచారు. ఈ సినిమాకి పని చేసిన టెక్నికల్ టీం అందరికీ ధన్యవాదాలు. ఇది మా మొదటి సినిమా. ఎక్కడా రాజీపడకుండా చాలా క్యాలిటీగా నిర్మించాం. కామెడీ లో నరేష్ గారిని మించి ఎవరూ లేరు. నరేష్ గారి చాలా ఐడియాలు సినిమాలో వున్నాయి. ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ కి ధన్యవాదాలు. ఈ వేడుకకు అతిధులుగా వచ్చిన అందరికీ ధన్యవాదాలు. సునీల్ నారంగ్ గారు, సురేష్ బాబు గారు చాలా సపోర్ట్ చేశారు. అందరినీ అలరించే సినిమా ఇది. తప్పకుండా థియేటర్స్ లో చూడండి' అని కోరారు


జామి లివర్ మాట్లాడుతూ.. అందరినీ నమస్కారం. ఒక తెలుగు సినిమా చేయాలనేది నా డ్రీం. ఆ కల ఈ సినిమాతో తీరినందుకు ఆనందంగా వుంది. ఇలాంటి మంచి కామెడీ ఎంటర్ టైనర్ తో తెలుగులో లాంచ్ కావడం సంతోషంగా వుంది. నరేష్ గారి ధన్యవాదాలు. మల్లి గారు, రాజీవ్ గారికి, టీం అందరికీ ధన్యవాదాలు' తెలిపారు.


డైరెక్టర్ విజయ్ కనకమేడల మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ తో క్యాలిటీగా ఈ సినిమా చేశారు. నరేష్ ఫారియా జోడి చూడటానికి చాలా బావుంది. విజువల్స్ చాలా బ్యూటీఫుల్ గా వున్నాయి. మల్లి క్యాలిటీ ఫిల్మ్ తీశాడు. నాంది సినిమాతో నరేష్ గారు నన్ను దర్శకుడిగా నిలబెట్టారు. ఈ వేడుకకు రావడం చాలా అనందంగా వుంది. ఈ సినిమాతో 'అల్లరి' నరేష్ గారు ఈజ్ బ్యాక్. టీం అందరికీ ఆల్ ది బెస్ట్. ఈ సినిమా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.  


డైరెక్టర్ విజయ్ బిన్నీ మాట్లాడుతూ.. రాజీవ్ గారు చాలా పాషన్ వున్న నిర్మాత. మల్లి గారు చాలా అద్భుతంగా ఈ సినిమా చేశారు. నరేష్ నాగు నా అంజి. నన్ను ఎంతగానో సపోర్ట్ చేశారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ ఇవ్వాలని కోరుకుంటున్నాను.  


డైరెక్టర్ దేవాకట్టా మాట్లాడుతూ.. నరేష్ నా మనసు చాలా దగ్గరైన స్నేహితుడు. నేను గౌరవించే విలక్షణ నటుడు నరేష్. తన ప్రయాణం ఇలానే వెర్సటైల్ గా సాగాలి. ఫారియా చాలా పెద్ద స్టార్ అవుతుంది. ఈ సినిమా సుడిగాడు లాంటి పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టీం అందరికీ ఆల్ ది బెస్ట్' తెలిపారు.  


రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ.. పెళ్లి అనేది పవిత్రమైనది. జీవితాన్ని ఆనందంగా వుంచేది. అలాంటి పెళ్లి చుట్టూ ఎన్ని మోసాలు జరుగుతున్నాయో చూపించే ప్రయత్నం ఈ సినిమా ద్వారా చేశాం. కొందరి కారణంగా పెళ్లి ఆనందానికి చిల్లు పడుతుంది. అసలు ఎక్కడ తప్పు జరుగుతుంది ? ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదని సరదా గా చెప్పే ప్రయత్నం ఈ సినిమా. నవ్వు ఎమోషన్ రెండూ ప్రేక్షకులు ఎక్స్ పీరియన్స్ చేస్తారు. అందరికీ నచ్చే సినిమా ఇది. కుర్రాళ్ళు తప్పకుండా చూడాల్సిన సినిమా' అన్నారు. చిత్ర యూనిట్ సభ్యులంతా పాల్గొన్న ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.


Krishnamma Pre Release Event Held Grandly

‘కృష్ణ‌మ్మ‌’ మూవీ స‌మ‌ర్ప‌కుడిగా కొర‌టాల శివ‌గారికి పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను : పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి



 మే 10న రిలీజ్ కాబోతున్న ‘కృష్ణ‌మ్మ‌’కు పెద్ద విజ‌యాన్ని అందించాల‌ని కోరుకుంటున్నాను: చిత్ర స‌మ‌ర్ప‌కుడు కొర‌టాల శివ‌


వెర్స‌టైల్ హీరో స‌త్య‌దేవ్ క‌థానాయ‌కుడిగా న‌టించిన చిత్రం ‘కృష్ణ‌మ్మ‌’. వి.వి.గోపాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రముఖ దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పతాకంపై కృష్ణ కొమ్మలపాటి ఈ మూవీని నిర్మించారు. ఎన్నో సక్సెస్‌ఫుల్ చిత్రాలను ప్రేక్షకులకు అందించిన ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్స్ సినిమాను మే 10న భారీ ఎత్తున‌ విడుదల చేస్తున్నాయి. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జరిగింది. ఈ కార్య‌క్ర‌మానికి పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి, స్టార్ డైరెక్ట‌ర్స్‌ కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేని ముఖ్య అతిథులుగా హాజ‌ర‌య్యారు. రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, అనీల్ రావిపూడి, గోపీచంద్ మ‌లినేని చేతుల మీదుగా ‘కృష్ణ‌మ్మ‌’ ట్రైల‌ర్ విడుద‌లైంది. ఈ సంద‌ర్భంగా....


మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ సినిమా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నాం. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ నుంచి నేను సినిమా చూస్తున్నాను. కొన్ని స‌న్నివేశాలైతే హాంట్ చేస్తూనే ఉన్నాయి. నేను ఎంజాయ్ చేసిన‌ట్లే ఈ సినిమాను అంద‌రూ ఎంజాయ్ చేస్తార‌నిపిస్తోంది. మే 10న మూవీ రిలీజ్ కానుంది. మా డైరెక్ట‌ర్ వి.వి.గోపాల‌కృష్ణ‌గారు గురించి చెప్పాలంటే ఆయ‌న‌కు విజ‌యవాడ‌తో మంచు అనుబంధం ఉంది. ‘కృష్ణ‌మ్మ‌’తో ప్రేక్ష‌కుల‌ను ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లారు. స‌త్య‌దేవ్‌గారు అద్భుతంగా న‌టించారు. ఆయ‌న‌కు నేను అభిమానిగా మారిపోయాను. మా టీమ్ అంద‌రికీ కంగ్రాట్స్‌. కొర‌టాల శివ‌గారు అందించిన స‌పోర్ట్‌కి థాంక్స్‌’’ అన్నారు. 


హీరోయిన్ అతీరా రాజ్‌ మాట్లాడుతూ ‘‘మా టీమ్‌ను స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన రాజ‌మౌళి, కొర‌టాల శివ‌, గోపీచంద్‌, అనీల్ రావిపూడిగారికి థాంక్స్‌. కృష్ణ‌మ్మ‌’ నా తొలి తెలుగు సినిమా. రిలీజ్ ఎప్పుడు అవుతుందా అని ఎగ్జ‌యిట్‌మెంట్‌తో వెయిట్ చేస్తున్నాను. నాకు అవ‌కాశం ఇచ్చిన గోపాల‌కృష్ణ‌గారికి, నిర్మాత కృష్ణ‌గారికి, కొర‌టాల శివ‌గారికి థాంక్స్‌. కాల భైర‌వ అద్భుత‌మైన మ్యూజిక్‌ను అందించారు. మా సినిమాను విడుద‌ల చేస్తున్న మైత్రీ మూవీ మేక‌ర్స్‌, ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి థాంక్స్‌. హీరో స‌త్య‌దేవ్‌గారు మాలాంటి న‌టీన‌టులకు ఇన్‌స్పిరేష‌న్‌. ఎంటైర్ టీమ్‌కు థాంక్స్‌’’ అన్నారు. 


హీరోయిన్ అర్చనా అయ్యర్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’కు స‌పోర్ట్ చేయ‌టానికి వ‌చ్చిన లెజెండ్రీ డైరెక్ట‌ర్స్‌కి థాంక్స్‌. గోపాల్ గారు లేక‌పోతే నా ప‌ద్మ అనే క్యారెక్ట‌ర్‌కి అర్థం ఉండేది. ఎంతో ఇష్ట‌ప‌డి క‌ష్ట‌ప‌డి చేసిన సినిమా. మే 10న రాబోతున్న మా సినిమాను ప్రేక్ష‌కులు చూసి ఆశీర్వ‌దించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


బి.వి.ఎస్‌.ర‌వి మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ సినిమా కథేంటో నాకు తెలుసు. నిజాయతీ ఉన్న క‌థ‌. నిజంగా జ‌రిగిందేమో అనిపించేలా ఉంటుంది. న‌టీన‌టుల కంటే పాత్ర‌లే మ‌న‌కు క‌నిపిస్తాయి. సినిమాలో ఓ చిన్న పెయిన్ ఉంటుంది. స‌త్య‌దేవ్ ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ప‌లికించే న‌టుడు. అరుణాచ‌ల క్రియేష‌న్స్ నాకెంతో ద‌గ్గ‌రైన సంస్థ‌. ఈ బ్యాన‌ర్‌లో నేను జవాన్ సినిమాను చేశాను. కృష్ణ‌గారు మంచి నిర్మాత‌. డైరెక్ట‌ర్ గోపాల కృష్ణ సినిమాను బాగా తెర‌కెక్కించార‌ని ట్రైల‌ర్ చూస్తుంటే తెలుస్తుంది. కాల‌భైర‌వ మంచి సంగీతాన్ని అందిస్తున్నారు. ఎంటైర్ టీమ్‌కు అభినంద‌న‌లు’’ అన్నారు. 


చిత్ర ద‌ర్శ‌కుడు వి.వి.గోపాల‌కృష్ణ మాట్లాడుతూ ‘‘కథలో ఓ నిజాయతీ ఉంది. అలాగే తెర‌కెక్కించేసెయ్ వెనుక నేనుంటాను. ఆయ‌న వ‌ల్లే సినిమా ఇక్క‌డి వ‌ర‌కు వ‌చ్చింది. మే 10 త‌ర్వాత సినిమా చూస్తే టైటిల్ ఏంటో అర్థ‌మ‌వుతుంది. సినిమా చూసి ఆశీర్వ‌దించండి’’ అన్నారు. 


మైత్రీ మూవీ మేక‌ర్స్ య‌ల‌మంచిలి ర‌వి శంక‌ర్ మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ టైటిల్ వినగానే బాగా కనెక్ట్ అయ్యింది. ట్రైలర్ చూస్తుంటే హత్తుకుంది. కొరటాల శివగారు కథను నిజాయతీగా చెబుతారు. ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో ఈ సినిమా వ‌స్తుండ‌టం ఆనందంగా ఉంది. పుష్ప‌లో అల్లు అర్జున్ న‌ట‌న‌ ఎంత ఇన్‌టెన్స్‌గా ఉంటుందో..‘కృష్ణ‌మ్మ‌’ సినిమాలో స‌త్య‌దేవ్‌గారి న‌ట‌న‌లో అంతే ఇన్‌టెన్సిటీ ఉంటుంది. డైరెక్ట‌ర్‌గారు సినిమాను బ్ర‌హ్మాండంగా తెర‌కెక్కించారు. మే 10న ‘కృష్ణ‌మ్మ‌’ను చూసి భ‌లే సినిమా చూశామ‌ని అంద‌రూ అనుకుంటారు.. నా మాట‌ల‌ను గుర్తుపెట్టుకోండి’’ అన్నారు. 


హీరో స‌త్య‌దేవ్ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారు, అనీల్ అన్న, గోపీ అన్న, శివగారు చూపించిన ప్రేమాభిమానాలు నాకు కొండంత ధైర్యాన్నిచ్చింది. రెండు వారాలుగా ఈ సినిమా ప‌రంగా అన్నీ పాజిటివ్ విషయాల‌నే వింటున్నాను. న‌న్ను ఎప్ప‌టిక‌ప్పుడు ఇన్‌స్పైర్ చేసేది నా అభిమానులు, సినీ ప్రేక్ష‌కులే. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా గురించి అంద‌రం మాట్లాడుకునేలా ఉంటుంది. కొర‌టాల‌గారు సినిమాను ఓకే చేయ‌గానే సినిమా స‌గం స‌క్సెస్ అనుకున్నాం. క‌థ న‌చ్చ‌గానే ఈ సినిమాకు ఆయ‌న స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించ‌టానికి రెడీ అయ్యారు. ఈ జ‌ర్నీలో ఆయ‌న స‌పోర్ట్ మ‌ర‌చిపోలేం. మా కృష్ణ‌గారు వెనుక‌డుగు వేయ‌కుండా సినిమాను నిర్మించారు. మా డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌గారు సినిమాను చ‌క్క‌గా తెర‌కెక్కించారు. క్రికెట్‌కు స‌చిన్ ఎలాగో మ‌న ఇండియ‌న్ సినిమాకు రాజ‌మౌళిగారు అలా. మ‌నం గొప్ప‌గా క‌ల‌లు క‌నొచ్చు అని ఆయ‌న రుజువు చేశారు. ఆయ‌న్ని చూసి మ‌నం గ‌ర్వంగా ఫీల్ అవుతున్నాం. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా విష‌యానికి వ‌స్తే.. మా డైరెక్ట‌ర్‌గారు సినిమాను రెండు గంట‌ల ప‌ది నిమిషాలుగా తెర‌కెక్కించారు. క‌థ విన‌గానే ఇది వంద కోట్ల్ కంటెంట్ ఉన్న సినిమా అని అనుకున్నాను. అదే ఆయ‌న‌కు చెప్పాను. ఈ సినిమాలో యాక్ట్ చేసిన ల‌క్ష్మ‌ణ్‌, కృష్ణ నా ఫ్రెండ్స్‌గా అద్భుతంగా న‌టించారు. అతీర, అర్చ‌న‌, నంద‌గోపాల్ ఇలా అంద‌రూ అద్భుతంగా న‌టించారు. కాల భైర‌వ మ్యూజిక్ అద‌ర‌గొట్టేశాడు. సినిమా రిలీజ్ త‌ర్వాత పాట‌లు ఇంకా పెద్ద హిట్ అవుతాయి. మా సినిమాటోగ్రాఫ‌ర్ స‌న్నీకి థాంక్స్‌. కృష్ణ‌న‌ది ఎన్ని మ‌లుపులు తిరిగి దాని గ‌మ్య‌స్థానం చేరుకుంటుందో మా క‌థ‌లోనూ అన్నీ మ‌లుపులుంటాయి. అలాంటి ర‌స్టిక్ పాత్ర‌లు, ఎమోష‌న్స్‌ను మా డైరెక్ట‌ర్‌గారు క్రియేట్ చేశారు. ఆయ‌న‌కు రుణ‌ప‌డి ఉంటాను. మా సినిమాను రిలీజ్ చేస్తున్నమైత్రీ మూవీ మేక‌ర్స్‌, ప్రైమ్ షోఎంట‌ర్‌టైన్‌మెంట్స్ వారికి థాంక్స్‌. మే 10న సినిమాను అంద‌రూ త‌ప్ప‌కుండా చూడండి’’ అన్నారు. 


డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాట్లాడుతూ ‘‘కొరటాల శివగారి సినిమాలు పద్ధతిగా, మంచి కంటెంట్‌తో ఉంటాయి. అలాగే ఆయ‌న స‌మ‌ర్ప‌ణ‌లో వ‌స్తున్న ‘కృష్ణ‌మ్మ‌’లో కూడా మంచి కంటెంట్ ఉంది. ఈ మూవీ నిర్మాత కృష్ణ‌గారితో మంచి అనుబంధం ఉండేది. సినిమా అంటే మంచి ప్యాష‌న్ ఉన్న వ్య‌క్తి. స‌త్య‌దేవ్ న‌ట‌న చాలా స‌హ‌జంగా ఉంది. ఇన్‌టెన్స్ యాక్టింగ్‌తో మెప్పిస్తారు. ట్రైల‌ర్ చూస్తుంటే ప్ర‌తీ క్యారెక్ట‌ర్‌లో రియలిస్టిక్ అప్రోచ్ క‌నిపిస్తుంది. నేను కాల‌భైర‌వ వాయిస్‌కి పెద్ద అభిమానిని. ఈ సినిమాకు త‌న మ్యూజిక్ ఇచ్చారు. పాట‌లే కాదు.. సాలిడ్ బ్యాగ్రౌండ్ స్కోర్ అందించారు. మే 10న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడి మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ ట్రైలర్ ఎక్స్‌ట్రార్డిన‌రీగా ఉంది. స‌త్య‌దేవ్, డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ‌, నిర్మాత కృష్ణ కొమ్మ‌ల‌పాటిగారు స‌హా ఎంటైర్ టీమ్‌కు కంగ్రాట్స్‌. కాల భైర‌వ మ్యూజిక్‌లో చాలా ఇంపాక్ట్ కనిపిస్తోంది. స‌త్య‌దేవ్‌కి సినిమా అంటే చాలా రెస్పెక్ట్. మంచి పాత్ర‌లు చేస్తూ హీరోగా త‌న‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. నిర్మాత కృష్ణ‌గారికి అభినంద‌న‌లు. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నాను. కొర‌టాల శివ‌గారు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్న‘కృష్ణ‌మ్మ‌’ సినిమా మ‌రిన్ని సినిమాల‌ను ముందుండి చేసేంత విజ‌యాన్ని సాధించాల‌ని కోరుకుంటున్నాను. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా మే 10న సినిమా రిలీజ్ అవుతుంది. చూసి అంద‌రూ ఆశీర్వదించాల‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


చిత్ర స‌మ‌ర్ప‌కుడు కొర‌టాల శివ మాట్లాడుతూ ‘‘రాజమౌళిగారికి స్పెషల్ థాంక్స్. గోపీ, అనీల్‌కి థాంక్స్‌. ‘కృష్ణ‌మ్మ‌’ సినిమా క‌థ విన‌మ‌ని నిర్మాత కృష్ణ చెప్ప‌గానే డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ వ‌చ్చి క‌థ చెప్పాడు. విన‌గానే ఈ సినిమాలో నేను భాగం అవుతాన‌ని చెప్పాను. అలా నేను ఈ సినిమాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రించాను. డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ సినిమాను చ‌క్క‌గా రాసుకున్నాడు. షూటింగ్ పూర్తి చేసి త‌నే సినిమా చూపించాడు. మంచి టీమ్‌.. మంచి ఎఫ‌ర్ట్‌తో సినిమా చేశారు. స‌త్య‌దేవ్‌.. నేను చూసిన మంచి న‌టుల్లో త‌నొక‌డు. ఎంత పెద్ద డైలాగ్ అయినా, సీన్ అయినా సుల‌భంగా చేసేయ‌గ‌ల‌డు. ‘కృష్ణ‌మ్మ‌’తో త‌ను మ‌రింత మంచి స్థానాన్ని చేరుకుంటాడ‌ని ఆశిస్తున్నాను. ఇత‌ర న‌టీన‌టులు, టెక్నీషియ‌న్స్‌కు అభినంద‌న‌లు. కాల భైర‌వ చాలా మంచి సంగీతాన్ని ఇచ్చాడు. ప్ర‌తి పాట సిట్యువేష‌న్‌ను బ‌ట్టి గొప్ప మ్యూజిక్ ఇచ్చాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. నిర్మాత కృష్ణ‌తో ఎప్ప‌టి నుంచో మంచి ప‌రిచ‌యం ఉంది. ఈ సినిమాతో త‌న‌కు మంచి విజ‌యం రావాల‌ని కోరుకుంటున్నాను. మే 10న రిలీజ్ కాబోతున్న ‘కృష్ణ‌మ్మ‌’కు పెద్ద విజ‌యాన్ని అందిస్తార‌ని కోరుకుంటున్నాను’’ అన్నారు. 


పాన్ ఇండియా డైరెక్ట‌ర్ ఎస్‌.ఎస్‌.రాజ‌మౌళి మాట్లాడుతూ ‘‘‘కృష్ణ‌మ్మ‌’ మూవీతో స‌మ‌ర్ప‌కుడిగా మారుతున్న కొర‌టాల శివ‌గారికి మ‌న‌స్ఫూర్తిగా అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను. ఆయ‌న ఈ సినిమాను ప్రెజెంట్ చేస్తున్నారంటే అంద‌రికీ స్పెష‌ల్ ఎట్రాక్ష‌న్ ఉంటుంది. శివ‌గారికి ఈ సినిమా పెద్ద స‌క్సెస్ కావాల‌ని కోరుకుంటున్నాను. డైరెక్ట‌ర్ గోపాల‌కృష్ణ టీజ‌ర్‌, ట్రైల‌ర్ల‌లో తక్కువ షాట్స్‌లోనే చాలా ఎట్రాక్టివ్‌గా, సినిమాను థియేట‌ర్స్ చూడాల‌నిపించేలా చేశాడు. త‌న‌కు ఆల్ ది బెస్ట్‌. స‌త్య‌దేవ్ న‌ట‌న‌లో ఏ ఎమోష‌న్‌ను అయినా ప‌ల‌కించ‌గ‌ల‌డు. అలాంటి వారు చాలా త‌క్కువ‌గా ఉంటారు. త‌న‌కు స‌రైన ఓ సినిమా ప‌డితే స్టార్‌గా ఎదుగుతారు. ‘కృష్ణ‌మ్మ‌’తో త‌ను స్టార్ అవుతాడ‌ని భావిస్తున్నాను. స‌త్య‌దేవ్ స‌హా టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌. కాల‌భైర‌వ క‌థ వినేట‌ప్పుడే క‌థ‌లోని మెయిన్ ఎమోష‌న్ ఏంటి.. నేనేం చేయాల‌ని ఆలోచిస్తాడు. త‌ను అలాగే ఇన్‌టెన్సిటీతో మ్యూజిక్ ఇస్తాడు. టీజ‌ర్‌, ట్రైల‌ర్‌కు త‌ను ఇచ్చిన మ్యూజిక్ వింటుంటే గ‌ర్వంగా అనిపించింది. ఎంటైర్ టీమ్‌కు ఆల్ ది బెస్ట్‌’’ అన్నారు.

Doctorate to kalasa At Youngest Age

 తెలుగు తేజం చిన్నారి కలశకు గౌరవ డాక్టరేట్ ప్రధానం మరియు ప్రపంచంలో అతి పిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలిగా గుర్తింపు



పుట్టగానే పరిమళించింది ఓ చిన్నారి గులాబీ...

వచ్చేటప్పుడు ఏమీ తీసుకురాము.... 

అనే నానుడిని అలవోకగా పక్కకు నెట్టేసింది. ఆనందాలతో పాటు సకల అవసరాలకు భరోసానిచ్చే కలశ ఫౌండేషన్ ని లోకానికి గిఫ్ట్ గా ఇచ్చింది.

ఇంతకీ ఆ చిన్నారి ఎవరు? పుట్టుకతో సాధించిన విజయాలు ఏమిటి? ప్రస్తుతం తను సాధించిన విజయాలు, సాధించబోతున్న విజయాలు ఏ దశలో ఉన్నాయో ఒకసారి పరికిద్దాం.

అది ఆగస్టు 13, 2013... తెలుగు నేల ను పులకింపజేస్తూ ఈ లోకంలో అడుగు పెట్టింది ఆ బంగారు తల్లి. పేరు కలశ... కలశ నాయుడు.. పసితనము నుండే పరుల కష్టాలకు స్పందించడం మొదలుపెట్టింది తనలాంటి పసిపిల్లలు, పనివాళ్ళుగా ఉండడం చూసి తట్టుకోలేకపోయింది ఆ చిన్నారి గుండె. తన వంతుగా, తన వయసుకు తెలిసినంతగా సాయం ప్రారంభించింది. పలకలు, బలపాలు, చాక్లెట్లు, ఆట బొమ్మలు... ఒకటేమిటి ఎవరికి ఏ అవసరం ఉన్నా అన్నీ ఇచ్చేస్తూ ఉండేది. ఆ చిన్నారి దాన గుణానికి, సేవా తత్వానికి మురిసిపోయిన ఆమె తల్లిదండ్రులు ఆమెకు కావాల్సినంత స్వేచ్ఛనిచ్చారు. చేయూతను అందించారు. దాని ఫలితమే కలశ  ఫౌండేషన్ సాధించిన ఘనవిజయాలు. వాటిలో మచ్చుకు కొన్ని తెలుసుకుందాం.  

‘అక్షర కలశం’ అనే జ్ఞాన జ్యోతిని వెలిగించి ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు పంచుతుంది. విభిన్న రంగాలలోని విశిష్ట సేవలు అందించిన మహిళా మూర్తులను గుర్తిస్తూ, వారిని గౌరవిస్తూ ‘మార్వలెస్ ఉమెన్’ పురస్కారాలతో సత్కరిస్తుంది. ‘గ్రీన్ రన్’ పేరిట పర్యావరణ పరిరక్షణకై ప్రజల్లో లోతైన అవగాహన కోసం పాటుపడుతుంది. ఇలా ఎన్నో సేవా కార్యక్రమాలు విజయవంతంగా కొనసాగిస్తుంది. చిన్నారి కలశ తన సేవలను దేశ సరిహద్దులు దాటి విస్తరించింది. ఎన్నో దేశాల అవార్డులు, రివార్డులు తనను వరించాయి. అవన్నీ ఒక ఎత్తు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ పీస్ కౌన్సిల్ అందించిన గౌరవ డాక్టరేట్ మరో ఎత్తు. సామాజిక సేవా రంగంలో ఆ చిన్నారి చేసిన సేవను గుర్తించి లండన్ పార్లమెంటు భవనంలో.. చిన్నారి కలశ నాయుడు ‘ప్రపంచవ్యాప్తంగా అతిచిన్న వయస్కురాలైన సమాజ సేవకురాలు’గా అరుదైన గుర్తింపు సొంతం చేసుకుంది. పలు దేశాలలో చిన్నారి కలశ అందించిన సేవా కార్యక్రమాలను గుర్తిస్తూ ఈ పురస్కారం మరియు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. 

బ్రిటిష్ పార్లమెంట్, గౌరవ పార్లమెంటు సభ్యులు, గ్రేట్ బ్రిటన్ లోని ఇండియన్ హైకమీషనర్ మరియు అనేకమంది ప్రముఖులను ఉద్దేశించి చిన్నారి కలశ రెండు నిమిషాల పాటు అద్భుతంగా ప్రసంగించడం జరిగింది. అంతేకాదు కలశ నాయుడు గురించి లండన్ పార్లమెంట్లో రెండు నిమిషాల నిడివి గలిగిన ఆడియో విజువల్ ప్లే చేయడం జరిగింది. అతి ముఖ్యమైన పార్లమెంటు క్వశ్చన్ అవర్ లో భాగం కావలసి వచ్చినందున గ్రేట్ బ్రిటన్ ప్రధాని శ్రీ రిషి సునక్, ఈ కార్యక్రమంలో భాగం కాలేకపోయినందుకు విచారం వ్యక్తం చేశారు. అంతేకాక చిన్నారి కలశ నాయుడు కఠోర శ్రమ మరియు నిబద్ధతను గుర్తించి, గౌరవించుకోవడం ఒక సదవకాశం అని, ఇంత చిన్న వయసులో తను అందిస్తున్న సేవలు ప్రశంసనీయం అని, ఈ పురస్కారం తనకు మేము అందించే గౌరవం, విశ్వ మానవ సేవలో ఈ చిన్నారి అత్యుత్తమ శిఖరాలు అందుకోవాలని ఆశిస్తున్నాను అని అన్నారు. చిన్నారి కలశ నాయుడిని తనతో కలిసి ఒక ప్రత్యేక హై-టీ పంచుకోవలసిందిగా ఆహ్వానం పలుకుతూ, తన అత్యద్భుత సేవలు మరియు ఈ వ్యక్తిగత విజయానికి ప్రతిగా ప్రతిష్టాత్మకమైన లండన్ పార్లమెంట్ సందర్శించవలసిందిగా వ్యక్తిగత ఆహ్వానం అందించడం జరిగింది.

Hari Hara Veera Mallu Part-1: Sword vs Spirit Teaser out now

పవన్ కళ్యాణ్ ప్రతిష్టాత్మక చిత్రం 'హరి హర వీర మల్లు' మొదటి భాగం టీజర్ విడుదల



భారతదేశంలో అత్యంత ప్రజాదరణ కలిగిన కథనాయకులలో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన నటించిన సినిమా వస్తుందంటే తెలుగు రాష్ట్రాల్లో ఉండే సందడే వేరు. పవన్ కళ్యాణ్ చిత్రానికి సంబంధించిన చిన్న వార్త కూడా పండుగ వాతారణాన్ని తలపిస్తుంది. అలాంటి పవన్ కళ్యాణ్ తన కెరీర్‌లో మొదటిసారిగా 'హరి హర వీర మల్లు' అనే పీరియాడికల్ యాక్షన్ అడ్వెంచర్‌ సినిమాలో నటిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రముఖ నిర్మాత ఏఎం రత్నం అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 17వ శతాబ్దంలో పేదల పక్షాన పోరాడిన ఒక యోధుడి కథగా రూపొందుతోన్న ఈ యాక్షన్‌ అడ్వెంచర్ చిత్రం కోసం, నిర్మాతలు ప్రత్యేకంగా చార్మినార్, ఎర్రకోట మరియు మచిలీపట్నం ఓడరేవు వంటి భారీ సెట్‌లను అంతర్జాతీయ స్థాయి నిర్మాణ విలువలతో ఎక్కడా రాజీ పడకుండా నిర్మించారు.


వీరమల్లుగా వెండితెరపై పవన్ కళ్యాణ్ సాహసాలను చూడటం కోసం అభిమానులు, సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులు ఫలించాయి. తాజాగా నిర్మాతలు ఓ తీపి కబురు చెప్పారు. ఈ చిత్రం రెండు భాగాలుగా రానుందని ప్రకటిస్తూ, మొదటి భాగం నుండి టీజర్‌ను విడుదల చేశారు. మొదటి భాగం "హరి హర వీర మల్లు పార్ట్-1: స్వార్డ్ వర్సెస్ స్పిరిట్" పేరుతో ప్రేక్షకుల ముందుకు రానుంది. "ధర్మం కోసం యుద్ధం" అనేది ఉపశీర్షిక.


పేదలు దోపిడీకి గురవుతూ, ధనవంతులు మరింత అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో.. న్యాయం కోసం యుద్ధం చేసే ఒంటరి యోధుడుగా పవన్ కళ్యాణ్ పోషిస్తున్న 'హరి హర వీర మల్లు' పాత్రను టీజర్ లో చూపించారు. హరి హర వీర మల్లు పాత్ర తీరుని తెలుపుతూ బలమైన సంభాషణలు, ఆ సంభాషణలకు తగ్గట్టుగా అద్భుతమైన దృశ్యాలతో టీజర్ ను రూపొందించిన తీరు కట్టిపడేసింది. కళ్ళు చెదిరే విజువల్స్, భారీ సెట్లు, ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి అద్భుతమైన నేపథ్య సంగీతంతో థియేటర్లలో ఒక గొప్ప అనుభూతిని అందించనున్నట్లు టీజర్ స్పష్టం చేసింది.


పేద, అణగారిన వర్గాలకు అండగా నిలబడే వీరుడిలా పవన్ కళ్యాణ్ కనిపిస్తుంటే, మొఘల్ చక్రవర్తిగా ప్రముఖ హిందీ నటుడు బాబీ డియోల్ కనిపిస్తున్నారు. ఆహార్యం పరంగా, అభినయం పరంగా ఇద్దరూ ఆయా పాత్రలకు వన్నె తెచ్చారని టీజర్ తోనే అర్థమవుతోంది. టీజర్ లో రోమాలు నిక్కబొడుచుకునేలా చేసే అంశాలు ఎన్నో ఉన్నాయి. చట్టవిరుద్ధంగా నైనా, న్యాయం కోసం పేదల పక్షాన చేస్తున్న ఆ యోధుడి పోరాటం స్ఫూర్తిని కలిగిస్తోంది.


దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఇప్పటికే "కంచె", "గౌతమిపుత్ర శాతకర్ణి", "మణికర్ణిక" వంటి చిరస్మరణీయ విజయవంతమైన చిత్రాలను అందించారు. అణచివేతదారులకు వ్యతిరేకంగా, తమ దేశ స్వాతంత్ర్యం కోసం విరోచితంగా పోరాడిన యోధులను ఆయా చిత్రాలలో చూపించారు. "హరి హర వీర మల్లు" కూడా అలాంటి యోధుడి కథే. అతడు సంపన్నులు, కుటిల పాలకుల నుండి దోచుకొని.. పేద ప్రజలకు న్యాయం చేయడానికి సహాయం చేస్తాడు. అందుకే అతను పేదల పాలిట దేవుడయ్యాడు.


టీజర్ విడుదల సందర్భంగా, నిర్మాతలు ఒక కీలక ప్రకటన చేశారు. "ఎనక్కు 20 ఉనక్కు 18", "నీ మనసు నాకు తెలుసు", "ఆక్సిజన్" వంటి చిత్రాలకు దర్శకత్వం వహించిన మరియు "నట్పుక్కాగ", "పడయప్ప" వంటి కల్ట్ బ్లాక్ బస్టర్ చిత్రాలకు రచయితగా పనిచేసిన రచయిత-దర్శకుడు జ్యోతి కృష్ణ, 'హరి హర వీర మల్లు' చిత్రం యొక్క మిగిలిన షూటింగ్ ను, పోస్ట్ ప్రొడక్షన్ పనులను క్రిష్ జాగర్లమూడి పర్యవేక్షణలో పూర్తి చేయబోతున్నారు.


ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్‌తో పాటు అందాల నటి నిధి అగర్వాల్, బాబీ డియోల్, సునీల్, నోరా ఫతేహి తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస ఛాయాగ్రాహకులుగా వ్యవహరిస్తున్నారు.


'హరి హర వీర మల్లు' చిత్రాన్ని 2024 చివర్లో విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.


నటీనటులు & సాంకేతిక నిపుణుల వివరాలు:


తారాగణం: పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, బాబీ డియోల్, ఎం. నాజర్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు, నోరా ఫతేహి తదితరులు


నిర్మాత: ఎ. దయాకర్ రావు

సంగీతం: ఎం. ఎం. కీరవాణి

ఛాయాగ్రహణం: జ్ఞానశేఖర్ వి.ఎస్, మనోజ్ పరమహంస

కూర్పు: ప్రవీణ్ కె.ఎల్

సాహిత్యం: సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్

విజువల్ ఎఫెక్ట్స్: హరి హర సుతన్, సోజో స్టూడియోస్, యూనిఫి మీడియా, మెటావిక్స్

కళా దర్శకుడు: తోట తరణి

నృత్య దర్శకులు: బృందా, గణేష్

స్టంట్స్: శామ్ కౌశల్, టోడర్ లాజరోవ్ జుజీ, రామ్-లక్ష్మణ్, దిలీప్ సుబ్బరాయన్, విజయ్ మాస్టర్

పి ఆర్ ఓ: లక్ష్మీవేణుగోపాల్

బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్ 

FNCC Committee Felicitated Fncc Employees on the Occasion of May Day

 మే డే సందర్భంగా ఎంప్లాయిస్ ని  ఘనంగా సత్కరించిన ఎఫ్ ఎన్ సి సి కమిటీ సభ్యులు



నేడు మే డే సందర్భంగా ఎఫ్ ఎన్ సి సి ఎంప్లాయిస్ వారి ఫ్యామిలీస్ అందర్నీ ఘనంగా సత్కరించిన కమిటీ సభ్యులు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, శ్రీ నారాయణ మూర్తి గారు, శ్రీ పరుచూరి గోపాలకృష్ణ గారు, హీరో శ్రీ శ్రీకాంత్ గారు, FNCC ఫార్మర్ ప్రెసిడెంట్ డాక్టర్ కే. ఎల్. నారాయణ గారు, నిర్మాత శ్రీ కె. ఎస్. రామారావు గారు, FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ టి. రంగారావు గారు, సెక్రటరీ శ్రీ ముళ్లపూడి మోహన్ గారు, జాయింట్ సెక్రటరీ శ్రీ వి. వి. ఎస్. ఎస్. పెద్దిరాజు గారు, ట్రెజరర్ శ్రీ బి. రాజశేఖర్ రెడ్డి గారు, కమిటీ మెంబర్స్ శ్రీ ఏడిద సతీష్ గారు, బాలరాజు గారు, మరియు కల్చరల్ కమిటీ చైర్మన్ తమ్మారెడ్డి భరద్వాజ్ గారు పాల్గొన్నారు.


ఈ సందర్భంగా FNCC ప్రెసిడెంట్ శ్రీ ఆదిశేషగిరిరావు గారు మాట్లాడుతూ : FNCC సంస్థ 1993 జూన్ లో స్థాపించడం జరిగింది. ఆ రోజు నుంచి ఈరోజు వరకు పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఉన్నారు. అదేవిధంగా మధ్యలో జాయిన్ అయ్యే నమ్మకంగా ఈరోజు వరకు ఎంప్లాయిస్ కూడా ఉన్నారు. ఈ రోజున FNCC లో ఇన్ని కార్యక్రమాలు జరిగి ఇంత సక్సెస్ఫుల్ అవ్వడానికి కారణం కష్టపడి పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయ్. కావున ఈరోజు మే డే సందర్భంగా ఎంప్లాయిస్ అందర్నీ సత్కరించుకోవాలని కమిటీ నిర్ణయించడం జరిగింది. అదేవిధంగా ఎంప్లాయిస్ నుంచి ఇదే సపోర్ట్ రానున్న సంవత్సరాల్లో కూడా ఇలానే ఉండాలని కోరుకుంటున్నాము అని అన్నారు.


సెక్రటరీ మోహన్ ముళ్ళపూడి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికుల దినోత్సవం. ఎప్పటినుంచో పనిచేస్తున్న ఎంప్లాయిస్ అందరిని సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది. మే డే అంటే హాలిడే ఇవ్వడమే కాకుండా ఎంప్లాయిస్ ని మరియు వాళ్ళ ఫ్యామిలీస్ ని పిలిచి మంచి హాస్పిటాలిటీ తో  సత్కరించాలని కమిటీ అనుకోవడం దానికి తగినట్టుగా అందరిని సత్కరించుకోవడం చాలా సంతోషంగా ఉంది. శ్రీ మురళీమోహన్ గారు, శ్రీ ఆర్.నారాయణమూర్తి గారు, మిమిక్రీ ఆర్టిస్ట్ శ్రీ శివారెడ్డి గారు ఆధ్వర్యంలో ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళందరూ సపోర్ట్ చేయడం చాలా మంచి విషయం. ఇలా ఫిలిం ఇండస్ట్రీలో ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం ఇదే మొదటిసారి. ఎంప్లాయిస్ అందరూ ఫ్యామిలీతో వచ్చి ఈవెంట్ ని సక్సెస్ చేసి చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఈ కార్యక్రమానికి పిలవగానే వచ్చిన ముఖ్య అతిథులు అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు. 


ఆర్.నారాయణమూర్తి గారు మాట్లాడుతూ : మే డే అంటే కార్మికులకు హాలిడే ఇవ్వడం కాకుండా ఒక మేనేజ్మెంట్ ఇలా నమ్మకంగా పనిచేస్తున్న ఎంప్లాయిస్ ఫ్యామిలీస్ ని పిలిచి సత్కరించడం ఇండస్ట్రీకి చాలా మంచి విషయం. మంచి భోజనం అలాగే సెలబ్రిటీతో సత్కరించుకోవడం ఇలా ఫ్యామిలీస్ కి ఊరట ఇవ్వడం శుభ సూచకంగా భావించవచ్చు. ఇంక ముందు ముందు కూడా ఇండస్ట్రీలో మిగతా ఆర్గనైజేషన్స్ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలని కోరుకుంటున్నాను. 1993లో స్థాపించిన ఈ ఈ కమిటీ నుంచి ఇలా ఎంప్లాయిస్ ని వారి ఫ్యామిలీస్ని సత్కరించుకోవడం అదేవిధంగా ఎన్నో ఆక్టివిటీస్ ని నిర్వహిస్తూ ముందుకెళ్లడం FNCC సక్సెస్ కి నిదర్శనం అని అన్నారు.


మురళీమోహన్ గారు మాట్లాడుతూ : FNCC కమిటీ ఇలా ఎంప్లాయిస్ ని సత్కరించుకోవడం వాళ్ళ ఫ్యామిలీస్ని పిలిచి ఈవెంట్ ఆర్గనైజ్ చేసి అంత గ్రాండ్ గా సెలబ్రేట్ చేయడం చాలా ఆనందంగా అనిపిస్తోంది. ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎన్నో కార్యక్రమాలు యాక్టివిటీస్ చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేసిన కమిటీ సభ్యులందరికీ అభినందనలు తెలుపుతున్నాను అన్నారు.


శివారెడ్డి గారు మాట్లాడుతూ : నా మిమిక్రీని ఇంతగా ఆదరించిన ఎంజాయ్ చేసిన ఫ్యామిలీస్ కి ధన్యవాదాలు. ఇలా ఈవెంట్ కి నన్ను పిలవడం, అందరితో కలిసి భోజనం చేయడం, అందరితో కలిసి ఈవెంట్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. ఇంకా FNCC ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్నారు.

My Dear Donga Success Meet

‘మై డియర్ దొంగ’కు వస్తున్న అద్భుతమైన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు కృతజ్ఞతలు: సక్సెస్ మీట్ లో హీరో అభినవ్ గోమటం



సక్సెస్‌ఫుల్ చిత్రాలతో అలరిస్తున్న అభినవ్ గోమటం టైటిల్ పాత్రలో నటించిన చిత్రం ‘మై డియర్ దొంగ’. శాలినీ కొండెపూడి, దివ్య శ్రీపాద, నిఖిల్ గాజుల, వంశీధర్ గౌడ్, శశాంక్ మండూరి కీలక పాత్రలు పోషించారు. బీఎస్ సర్వాంగ కుమార్ దర్శకత్వం వహించారు. క్యామ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై గోజల మహేశ్వర్‌రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ప్రముఖ తెలుగు ఓటీటీ మాధ్యమం‘ఆహా’లో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది. 


నిర్మాత మహేశ్వర్‌‌రెడ్డి మాట్లాడుతూ..‘‘మై డియర్ దొంగపై మొదటి నుంచి చాలా నమ్మకంగా వున్నాం. మా నమ్మకం నిజమైయింది. సినిమా చూసిన వారంతా గొప్ప అభినందిస్తున్నారు. చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ముఖ్యంగా అభినవ్ గోమటం నటనని ఆస్వాదిస్తున్నారు. పరిశ్రమ నుంచి కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా సినిమా చూడని ప్రేక్షకులు తప్పకుండా చూడండి. పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి' అని కోరారు 


యాక్టర్ నిఖిల్ మాట్లాడుతూ..‘‘ ఇది నా ఫస్ట్ రిలీజ్. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. అభినవ్, శాలిని తో వర్క్ చేయడం చాలా అనందంగా వుంది. ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది' అన్నారు. 

 

యాక్టర్ స్నేహల్ మాట్లాడుతూ..‘‘ఈ సినిమా కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమాని ఆదరించిన అందరికీ ధన్యవాదాలు' తెలిపారు. 


దర్శకుడు బీఎస్ సర్వాంగ కుమార్ మాట్లాడుతూ.. ఈ సినిమా మా అందరికీ గొప్ప అవకాశాలు తెచ్చిపెట్టింది. అభినవ్ గారు చాలా సపోర్ట్ చేశారు. ప్రొడక్షన్ డిజైన్ ఝాన్సీ గారు చాలా మంచి లుక్ తీసుకొచ్చారు. అజయ్ అర్సాడా మ్యూజిక్ తో సినిమాని ఎలివేట్ చేసుకుంటూ వచ్చారు. శాలిని మంచి రచయిత, నటి. వీరందరితో కలసి మళ్ళీ వర్క్ చేయాలని వుంది' అన్నారు. 


యాక్టర్ వంశీ మాట్లాడుతూ.. ఈ సినిమాకి ఇంత మంచి విజయాన్ని ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. నాకు ఈ పాత్ర ఇచ్చిన శాలినికి ధన్యవాదాలు. టీం అందరికీ అభినందనలు' తెలిపారు.  


ఆహా మార్కెటింగ్ హెడ్ రాజశేఖర్ మాట్లాడుతూ.. 'మై డియర్ దొంగ' కి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకుల మనసులో మంచి స్థానం సంపాయించుకుంది. ఇది బిగ్ స్మాల్ ఫిల్మ్. ఇప్పటివరకూ 25 లక్షల మంది చూశారు. ఈ సినిమాకి వచ్చిన రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. మై డియర్ దొంగ రిటర్న్స్ కోసం ఎదురుచుస్తున్నాం' అన్నారు. 


ఆహా టీం నుంచి శ్రావణి మాట్లాడుతూ.. ఆహా లో కంటెంట్ ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మైడియర్ దొంగ చాలా మంచి టీం వర్క్ తో పాషన్ తో చేయడం జరిగింది.  అభినవ్, శాలిని, టీం అంతా అద్భుతంగా చేశారు. మై డియర్ దొంగ విడుదలైనపటికీ నుంచి ఇప్పటివరకూ టాప్ ట్రెండింగ్ లో నడుస్తోంది. మీ అందరి సపోర్ట్ ఇలానే వుండాలి' అని కోరారు. 


హీరోయిన్, రైటర్ శాలినీ మాట్లాడుతూ..‘‘ ఈ సినిమాకి వచ్చిన రివ్యూస్, రెస్పాన్స్ చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత గొప్ప రెస్పాన్స్ ఊహించలేదు. ఆహ టీంకి ధన్యవాదాలు. ఇది బ్యూటీఫుల్ టీం వర్క్. పాషన్ తో ఒక కంటెంట్ ని హానెస్ట్ గా నమ్మి చేస్తే విజయం వస్తుందనిని చెప్పడాని ఇది ఉదహరణ. ఇంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులు ధన్యవాదాలు. దర్శకుడు కథని గొప్పగా అర్ధం చేసుకొని ఇంకా గొప్పగా ప్రజెంట్ చేశారు. ఈ సినిమా రాయడం నాలో గొప్ప ఆత్మ విశ్వాసాన్ని నింపింది. అభినవ్ కి ధన్యవాదాలు. దివ్యతో పాటు ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఈ సినిమా గురించి మరింత మందికి చెప్పాలని మీడియాని కోరుతున్నాను. అందరికీ రికమెండ్ చేసే చిత్రమిది. అందరూ ఎంజాయ్ చేస్తారు. మీ అందరి సపోర్ట్ మరింతగా వుండాలని కోరుకుంటున్నాను' అన్నారు.  

 

హీరో అభినవ్ గోమటం మాట్లాడుతూ..‘‘ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు. మా సినిమాని ఇంత చక్కగా ఆడియన్స్ ముందుకు తీసుకెలుతున్న మీడియాకి థాంక్స్. ప్రొడక్షన్, నటీనటులు, ఆహా.. ఈ మూడు టీములు మంచి సమన్వయంతో ఈ సినిమా చేయడం జరిగింది. తొలి సినిమాని ఇంత చక్కగా రాసిన శాలినికి అభినందనలు. తను ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. వంశీ, శర్వాతో పాటు టీం అందరికీ థాంక్స్. మనోజ్ చక్కని విజువల్స్ ఇచ్చారు. ఆహా టీం అందరికీ ధన్యవాదాలు. అల్లు అరవింద్ గారికి ఈ ప్రాజెక్ట్ నచ్చడం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఇంత మంచి సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా వుంది. అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు' తెలిపారు. 

Prasanna Vadanam Releasing with Unique Content

 'ప్రసన్న వదనం'యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ సినిమా. థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్ అవుతుంది: ప్రెస్ మీట్ లో హీరో సుహాస్ 



యంగ్ ట్యాలెంటెడ్ సుహాస్ హీరోగా రూపొందిన యూనిక్ సస్పెన్స్ థ్రిల్లర్’ ప్రసన్న వదనం'. స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద అసోసియేట్ గా పని చేసిన అర్జున్ వై కె దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని జెఎస్ మణికంఠ, టి ఆర్ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. పాయల్ రాధాకృష్ణ, రాశి సింగ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. ఇప్పటికే విడుదల ఈ సినిమా టీజర్, ట్రైలర్ సాంగ్స్ కి  ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.ఈ నేపధ్యంలో చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ నిర్వహించింది. 


ప్రెస్ మీట్ లో హీరో సుహాస్ మాట్లాడుతూ..ప్రసన్న వదనం మే3న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. నిన్ననే ఫస్ట్ కాపీ చూశాం. సినిమా థౌజండ్ పర్సెంట్ బ్లాక్ బస్టర్. ఇందులో డౌట్ లేదు. చాలా కాన్ఫిడెంట్ గా వున్నాం. నా సినిమాలు మౌత్ టాక్ వలన వెళ్తాయి కాబట్టి తొందరగా ఎవరికి కుదిరితే వారు సినిమా చూసి మిగతా వారికి చెప్పాలి. ఇంతకుముందు సినిమాల కంటే ఈ సినిమా చాలా బాగా రన్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షులకు చాలా తృప్తిని ఇచ్చే సినిమా ఇది. సీట్ ఎడ్జ్ లో కూర్చుని సినిమా చూస్తారు. అదిరిపోయిందని క్లాప్స్ కొడతారు' అన్నారు. 


దర్శకుడు అర్జున్ మాట్లాడుతూ.. ఇది దర్శకుడిగా నా మొదటి చిత్రం. సినిమా చాలా బావొచ్చింది. ఫస్ట్ కాపీ చూశాం. థియేటర్స్ లో చూడటానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నాం. ఇది యూనిక్ కాన్సెప్ట్ తో రియల్ కమర్షియల్ ఫిల్మ్. ఫన్, థ్రిల్ రోమాన్స్, ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ వుంటాయి. సుహాస్ అద్భుతంగా చేశారు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది. అందరూ వచ్చి థియేటర్స్ లో చూడాలి' అని కోరారు. 


రాశి సింగ్ మాట్లాడుతూ.. సినిమా ప్రమోషనల్ కంటెంట్ చాలా వైరల్ అయ్యింది. ఇందులో నా పాత్ర కొత్తగా వుంటుంది. సుహాస్ గారు చాలా నేచురల్ యాక్టర్. ఆయనతో పని చేయడం ఆనందంగా వుంది. ఈ సినిమాలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మే3న తప్పకుండా సినిమా చూడండి. మీ అందరినీ అలరిస్తుంది' అన్నారు 


పాయల్ రాధాకృ మాట్లాడుతూ.. ప్రసన్న వదనం యూనిక్ కాన్సెప్ట్ తో అందరినీ అలరించే చిత్రం. సుహాస్ గారితో వర్క్ చేయడం చాలా మంచి అనుభవం. ఇందులో పక్కంటి అమ్మాయిలా కనిపించే పాత్ర చేస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు ధన్యవాదాలు. సినిమా తప్పకుండా అందరినీ అలరిస్తుంది' అన్నారు  


నిర్మాత ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. టీజర్ ట్రైలర్ సాంగ్స్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. మే3న సినిమా విడుదల కాబోతుంది. ఈ సినిమా పర్ఫెక్ట్ సమ్మర్ ట్రీట్. అందరూ ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు' అన్నారు.


నిర్మాత జెఎస్ మణికంఠ మాట్లాడుతూ.. మే3న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అందరూ తప్పకుండా థియేటర్స్ లో చూడండి. వందకి వంద శాతం అలరిస్తుంది. అందరూ థియేటర్స్ కి వచ్చి మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నాం' అన్నారు.

Aarambham Movie Trailer Launch Grandly

ఘనంగా "ఆరంభం" సినిమా ట్రైలర్ లాంఛ్, మే 10న రిలీజ్ కు వస్తున్న మూవీ



మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్ కీలక పాత్రల్లో నటించిన సినిమా "ఆరంభం". ఈ సినిమాను ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై అభిషేక్ వీటీ నిర్మించారు. అజయ్ నాగ్ వి దర్శకత్వం వహించారు. ఎమోషనల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన "ఆరంభం" సినిమా మే 10న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఇవాళ ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో


లిరిసిస్ట్ శ్రీకాంత్ మాట్లాడుతూ - ఇలా ఒక మూవీ ప్రమోషన్ స్టేజీ మీద నిలబడి మాట్లాడుతానని ఊహించలేదు. నాకు ఈ అవకాశం ఇచ్చిన "ఆరంభం" టీమ్ మెంబర్స్ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో మంచి పాటలు రాసే అవకాశం దక్కింది. "ఆరంభం" సినిమా బాగుంటుందనే పాజిటివ్ వైబ్స్ ఇప్పటికే ఏర్పడుతున్నాయి. మా టీమ్ అందరికీ ఈ సినిమా ఒక మంచి బిగినింగ్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అన్నారు.


ఎడిటర్ ఆదిత్య తివారీ మాట్లాడుతూ - "ఆరంభం" సినిమాకు నేను ఎడిటర్ ను మాత్రమే కాదు అసిస్టెంట్ డైరెక్టర్ గా కూడా పనిచేశాను. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ దాకా అన్ని వర్క్స్ లో ఇన్వాల్వ్ అయ్యాను. ఈ సినిమా స్క్రిప్ట్ నుంచి ఫిల్మ్ మేకింగ్ వరకు జరిగిన ట్రాన్సఫర్మేషన్ ఒక మ్యాజిక్ అనుకోవాలి. మీరు చూసిన ప్రతి ఫ్రేమ్ ఇంత బాగా రావడానికి ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ 200 పర్సెంట్ కష్టపడ్డారు. "ఆరంభం" మంచి విజయం సాధిస్తుందని ఆశిస్తున్నా. అన్నారు.


ఎడిటర్ ప్రీతమ్ గాయత్రి మాట్లాడుతూ - "ఆరంభం" సినిమాకు పనిచేసిన మెయిన్ క్రూ అంతా ఒకే కాలేజ్ నుంచి వచ్చాం. అజయ్ ఈ స్క్రిప్ట్ చెప్పినప్పుడు కొంత కాంప్లికేటెడ్ గా అనిపించింది. కానీ మొత్తం షూటింగ్ అయ్యాక చూస్తే బాగా ఆకట్టుకుంది. మే 10 మీరంతా వచ్చి "ఆరంభం" సినిమా చూడండి. అన్నారు.


సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి మాట్లాడుతూ - దర్శకుడు అజయ్ నా లైఫ్ లోకి ఒక బ్లెస్సింగ్ లా వచ్చాడు. ఈ సినిమా చూశాక నేను ఈ మూవీకి మ్యూజిక్ చేయడం ఏంటి, నేను చేయగలనా అని భయపడ్డాను. అజయ్ సపోర్ట్ చేశాడు. మూవీ టీమ్ అంతా సపోర్ట్ చేసింది. ఈ సినిమా మ్యూజిక్ చేశానంటే అది డెస్టినీ అనుకుంటా. నా గదిలో అన్నీ ఎస్పీ బాలు ఫొటోసే ఉంటాయి. ఈ సినిమాలోని పాటను ఎస్పీ చరణ్ గారితో పాడించినప్పుడు బాలు గారు గుర్తొచ్చి కన్నీళ్లు వచ్చాయి. పాటలు, ఆర్ఆర్ అన్నీ ఒక ఫ్లోలో చేసుకుంటూ వెళ్లాం. "ఆరంభం" టీమ్ అందరికీ పేరు తెచ్చే సినిమా అవుతుంది. అన్నారు.


సినిమాటోగ్రాఫర్ దేవ్ దీప్ గాంధీ మాట్లాడుతూ - "ఆరంభం" సినిమాను కంప్లీట్ చేసి మీ ముందుకు తీసుకొస్తున్నాం. మే 10న థియేటర్స్ లోకి వెళ్లి చూడండి. ట్రైలర్ మీరు చూశారు. ఈ కథకు మేము పెట్టాల్సిన ఎఫర్ట్స్ అంతా పెట్టాం. ఇక ఈ సినిమా ఫలితం మీ చేతుల్లో ఉంది. ప్రేక్షకులంతా ఎంజాయ్ చేసేలా "ఆరంభం" మూవీ ఉంటుంది. అన్నారు.


నిర్మాత అభిషేక్ వీటీ మాట్లాడుతూ - "ఆరంభం" సినిమా చేసేందుకు ముఖ్య కారణం మా నాన్న. ఆయన డబ్బులు ఇచ్చి నా డ్రీమ్ అయిన సినిమా ప్రొడక్షన్ లోకి పంపించారు. అందుకు మా అమ్మా నాన్నకు థ్యాంక్స్ చెబుతున్నా. ఉజ్వల్ ఈ సినిమా కథను నా దగ్గరకు తీసుకొచ్చారు. ఆయన ద్వారా అజయ్ పరిచయం అయ్యారు. "ఆరంభం" సినిమా వెనక ఉన్న విజినరీ డైరెక్టర్ అజయ్. ఈ సినిమా ట్రైలర్ లో చెప్పినట్లు మనం చేసే ప్రయాణంలో మనతో ఉండే తోడు ఎవరేది చాలా ముఖ్యం. అలా నాకు ఈ సినిమా ప్రొడ్యూస్ చేసే ప్రయాణంలో టీమ్ మెంబర్స్ అంతా తోడుగా దొరికారు. "ఆరంభం" ట్రైలర్ చూశారు కదా. సినిమా మీకు తప్పకుండా నచ్చుతుంది. మా మూవీ టీజర్ ను హీరో నాగ చైతన్య గారు రిలీజ్ చేశారు. ఆయనకు థ్యాంక్స్ చెబుతున్నాం. ఈ సినిమా మేకింగ్ టైమ్ లో ఇది పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ లేని సినిమా అని తెలుసు. కానీ కథ విన్నప్పుడు చాలా ఇంప్రెస్ అయ్యాను. ఈ సినిమాతో ఒక ప్రయత్నం చేయాలి అనిపించింది. మంచి కంటెంట్ ఉన్న సినిమాలకు ఆదరణ దక్కుతున్న రోజులు ఇవి. అలా "ఆరంభం" సినిమా కూడా సక్సెస్ అవుతుందని నమ్ముతున్నాం. అన్నారు.


నటి సురభి ప్రభావతి మాట్లాడుతూ - ఈ సినిమాలో ఒక మంచి క్యారెక్టర్ చేసే అవకాశం ఇచ్చిన దర్శకుడు అజయ్ గారికి, ప్రొడ్యూసర్ అభిషేక్ గారికి థ్యాంక్స్. ఈ సినిమా టీమ్ లో జాయిన్ అయినప్పుడు అంతా కొత్త వాళ్లు ఎలా ఉంటుందో షూటింగ్ అనుకున్నా. కానీ ఫిలిం మేకింగ్ లో వాళ్ల పట్టుదల, ప్యాషన్ చూసి నేను హ్యాపీగా ఫీలయ్యా. మంచి సినిమా ఇది. ఈ సినిమాకు మీ ఆదరణ దక్కాలని కోరుకుంటున్నా. అన్నారు.


నటుడు అభిషేక్ బోడెపల్లి మాట్లాడుతూ - ఆరంభం సినిమాకు పనిచేసిన వాళ్లలో నా ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు. నా రూమ్ మేట్స్ ఉన్నారు. ఈ టీమ్ లో ఎవరూ ఏ ఒక్క పనికీ పరిమితం కాలేదు. అందరం అన్ని విభాగాల్లో పనిచేశాం. టీమ్ వర్క్ చేశాం. "ఆరంభం"లో నాకు రవీంద్ర విజయ్ గారితో ఎక్కువ సీన్స్ ఉన్నాయి. ఆయనతో కలిసి వర్క్ చేయడం ఎంతో హ్యాపీగా అనిపించింది. మీరంతా ఈ సినిమాను థియేటర్ లో చూడండి. సక్సెస్ చేయండి. అన్నారు.


భూషణ్ కళ్యాణ్ మాట్లాడుతూ - "ఆరంభం" సినిమా కోసం నన్ను ప్రొడ్యూసర్ అభిషేక్ అప్రోచ్ అయ్యాడు. సైంటిస్ట్ క్యారెక్ట్రర్ చేయాలని చెప్పాడు. నేను వెంటనే నో అని చెప్పా. ఒకసారి డైరెక్టర్ అజయ్ మిమ్మల్ని కలుస్తాడు అని అభిషేక్ చెప్పాడు. ఇక్కడే ఫిలింనగర్ లో ఓ కేఫ్ లో నెరేషన్ విన్నాను. అజయ్ చేసుకున్న స్క్రిప్ట్ బాగా నచ్చింది. ఈ మూవీ టీమ్ లో పనిచేసిన వారి యావరేజ్ ఏజ్ 24. వీళ్లతో కలిసి పనిచేశాక ఇదొక అద్భుతమైన టీమ్ అనిపించింది. ఏమాత్రం అనుభవం లేని వీళ్లు పశ్చమి కనుమల్లోని లొకేషన్స్ లో ఎవరికీ ఇబ్బంది కలగకుండా షూటింగ్ చేయడం గొప్ప విషయం. నా వయసు వీళ్లతో పోల్చి చూస్తే మూడు రెట్లు ఎక్కువ. ఈ టీమ్ తో వర్క్ చేసి నేను కూడా 24 ఏళ్ల వాడిలా మారిపోయా. రొటీన్ క్యారెక్టర్స్ నాకు చాలా వస్తుంటాయి. వాటిని వద్దనుకుంటున్నా. ఈ మూవీలో మాత్రం నటుడిగా సంతృప్తి దొరికింది. అన్నారు.


నటుడు రవీంద్ర విజయ్ మాట్లాడుతూ - నవలను బేస్ చేసుకుని రూపొందించిన సినిమా ఇది. స్క్రిప్ట్ మీద శ్రద్ధ పెట్టిన సినిమాలు తప్పకుండా బాగుంటాయి. "ఆరంభం" సినిమాకు మా డైరెక్టర్ అజయ్ కథా కథనాల మీద అలాంటి గుడ్ వర్క్ చేశాడు. ఈ మూవీలో నేను డిటెక్టివ్ క్యారెక్టర్ లో కనిపిస్తాను. ఈ మూవీలోని ప్రతి క్రాఫ్ట్ పనితనం ఆకట్టుకునేలా ఉంటుంది. ప్రేక్షకులకు కంప్లీట్ థియేట్రికల్ ఎక్సీపిరియన్స్ ఇచ్చే సినిమా ఇది. డ్రామా, సస్పెన్స్, హ్యూమన్ ఎమోషన్, సైన్స్ ఫిక్షన్ వంటి అంశాలు మెప్పిస్తాయి. మే 10న థియేటర్స్ కు వెళ్లి "ఆరంభం" మూవీని ఎంజాయ్ చేయండి. మనం లాక్ డౌన్ టైమ్ లో చిన్న సినిమాలన్నీ ఓటీటీకి వస్తాయి. పెద్ద సినిమాలు థియేటర్స్ లో చూడాలి అనుకున్నాం. కానీ ఈ ఏడాది మీరు గమనిస్తే చాలా చిన్న సినిమాలు కంటెంట్ బాగున్నవి థియేటర్ లో మంచి వసూళ్లు సాధించాయి. ఈ సినిమా కూడా ఆ లిస్టులో చేరుతుంది. అన్నారు.


దర్శకుడు అజయ్ నాగ్ మాట్లాడుతూ - కన్నడ నవల ఆధారంగా ఈ మూవీకి స్క్రిప్ట్ చేశాను. ఆ నవల రాసింది నా మిత్రుడే. లాక్ డౌన్ టైమ్ లో మా సొంతూరు వెళ్లి కథ సిద్దం చేసుకున్నా. ప్రొడ్యూసర్ గురించి చూస్తున్న టైమ్ లో నా కామన్ ఫ్రెండ్ ద్వారా అభిషేక్ పరిచయం అయ్యారు. అలా ఈ మూవీ బిగిన్ అయ్యింది. మేమంతా కొత్త వాళ్లం. షూటింగ్ ఎలా చేయాలో తెలుసు గానీ ఆర్టిస్టులను కంఫర్ట్ గా ఉంచడం ఎలాగో తెలియదు. వెస్ట్రన్ ఘాట్స్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా కొత్త టీమ్ తో ఇబ్బందులు ఉన్నా ఆర్టిస్టులు అంతా సపోర్ట్ చేశారు. ఆరంభం సినిమా కథను లైన్ గా చెప్పాలంటే ఇద్దరు ఖైదీలు జైలు నుంచి తప్పించుకుంటారు. వారి కేసు ఇన్వెస్టిగేషన్ కోసం ఇద్దరు డిటెక్టివ్ లు రంగంలోకి దిగుతారు. వారికి ఒక డైరీ దొరుకుతుంది. ఖైదీల గురించి ఆ డైరీలో ఏముంది. వాళ్లు దొరికారా లేదా అనే ఇంట్రెస్టింగ్ గా సాగే స్టోరీ. మెయిన్ గా సినిమాలో డ్రామా ఉంటుంది. ఒక జానర్ లో కాకుండా వివిధ జానర్స్ లో ఉండే మూవీ ఇది. కన్నడలో ఈ నవల పాపులర్ అందుకే కన్నడలో కాకుండా తెలుగులో ఈ సినిమా చేశాం. తెలుగులో రిలీజ్ తర్వాత ఇతర భాషల్లోకి సినిమాను తీసుకెళ్తాం. అన్నారు.


హీరో మోహన్ భగత్ మాట్లాడుతూ - కథను నమ్మి నేను ఈ మూవీ చేశాను. ఈ సినిమాలో నా క్రెడిట్ ఏం లేదు. మా డైరెక్టర్ సజెస్ట్ చేసినట్లు నటించాను. నా క్యారెక్టర్ లో అన్ని షేడ్స్ ఉంటాయి. ఈ మూవీలో నేను చేసింది ఇంటెన్స్ క్యారెక్టర్ కాదు. సరదాగా సాగుతుంది. హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా, సైన్స్ ఫిక్షన్ లాంటి అంశాలతో ఆకట్టుకునేలా సినిమా ఉంటుంది. ఇందులో మదర్ క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉంటుంది. అమ్మ మనతో ఉన్నప్పుడు ఆమెతో ఎక్కువగా టైమ్ స్పెండ్ చేయము. వాళ్లు వెళ్లిపోయిన తర్వాత బాధపడతాం. అలా నాది, మా మదర్ క్యారెక్టర్ ఉంటుంది. సినిమా చూశాక చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాము. మీ అందరికీ ఆరంభం మూవీ తప్పకుండా నచ్చుతుంది. ఇలాంటి టీమ్ తో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా. ఆరంభం సినిమా నా కెరీర్ కు మంచి ఆరంభం అవుతుందని ఆశిస్తున్నా. అన్నారు.


నటీనటులు - మోహన్ భగత్, సుప్రిత సత్యనారాయణ్, భూషణ్ కళ్యాణ్, రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, బోడెపల్లి అభిషేక్, సురభి ప్రభావతి తదితరులు


టెక్నికల్ టీమ్

ఎడిటర్ - ఆదిత్య తివారీ, ప్రీతమ్ గాయత్రి

సినిమాటోగ్రఫీ - దేవ్ దీప్ గాంధీ కుందు

మ్యూజిక్ - సింజిత్ యెర్రమిల్లి

డైలాగ్స్ - సందీప్ అంగిడి

సౌండ్ - మాణిక ప్రభు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వినయ్ రెడ్డి మామిడి

సీఈవో - ఉజ్వల్ బీఎం

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

బ్యానర్ - ఏవీటీ ఎంటర్ టైన్ మెంట్

ప్రొడ్యూసర్ - అభిషేక్ వీటీ

దర్శకత్వం - అజయ్ నాగ్ వీ 

Disney+ Hotstar to stream ‘Manjummel Boys’ from 5th May

 డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ లో ఈ నెల 5వ తేదీ నుంచి స్ట్రీమింగ్ కానున్న బాక్సాఫీస్ సెన్సేషన్ 'మంజుమ్మల్ బాయ్స్'




ఈ ఏడాది ఇండియన్ బాక్సాఫీస్ సెన్సేషన్ గా చెప్పుకునే సినిమా 'మంజుమ్మల్ బాయ్స్'. ఈ సినిమాను సర్వైవల్ థ్రిల్లర్ గా దర్శకుడు చిదంబరం ఎస్ పొదువల్ రూపొందించారు. పరవ ఫిలింస్ బ్యానర్‌పై బాబు షాహిర్, సౌబిన్ షాహిర్, షాన్ ఆంటోని నిర్మించారు. సౌబిన్ షాహిర్, గణపతి, ఖలీద్ రెహమాన్, శ్రీనాథ్ భాసి ప్రధాన పాత్రలు పోషించారు. వరల్డ్ వైడ్ 200 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిందీ సినిమా. తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ రిలీజ్ చేయగా....ఇక్కడా మంచి వసూళ్లు దక్కించుకుంది.


తాజాగా 'మంజుమ్మల్ బాయ్స్' సినిమా డిజిటల్ ప్రీమియర్ డేట్ కన్ఫర్మ్ చేసుకుంది. ఈ సినిమాను మే 5వ తేదీ నుంచి డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ స్ట్రీమింగ్ కు తీసుకొస్తోంది. హిందీతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 'మంజుమ్మల్ బాయ్స్' అందుబాటులో ఉండనుంది. 2006లో కొడైకెనాల్‌లోని గుణకేవ్‌లో చిక్కుకున్న తమ స్నేహితుడిని రక్షించిన ఎర్నాకులం మంజుమ్మెల్ యువకుల సాహసం ఆధారంగా సినిమా రూపొంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. 'మంజుమ్మల్ బాయ్స్' డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లోనూ సంచలనం సృష్టించబోతోంది.

Naveen Chandra Earns Him Best Actor at Dada Saheb Phalke Film Festival

హీరో నవీన్ చంద్రకు దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్ అవార్డు: ఒక గొప్ప గౌరవం



ఇంపాక్ట్ స్టార్ నవీన్ చంద్ర మరో అద్భుతమైన ఘనత సాధించారు. ఈ ఏడాది దాదాసాహెబ్ ఫాల్కే ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. "మంత్ ఆఫ్ మధు" సినిమాలోని ఆయన అద్భుతమైన నటనకు గాను ఈ ప్రతిష్టాత్మకమైన పురస్కారం లభించింది.  భారతీయ సినిమా చరిత్రలో దిగ్గజాలైన దాదాసాహెబ్ ఫాల్కే ఫిలిం ఫెస్టివల్  పేరిట ఇవ్వబడే ఈ అవార్డు అందుకోవడం నవీన్ చంద్ర సత్తా ఏంటో నిరూపించింది. ఈ మంత్ అఫ్ మధు అమెజాన్ ప్రైమ్ అలాగే ఆహలో స్ట్రీమింగ్ అవుతుంది.

 

ఇది కేవలం అవార్డు మాత్రమే కాదు, నవీన్ చంద్ర టాలెంట్‌కు, సినిమా పట్ల ఆయనకున్న అంకితభావానికి గుర్తింపు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో ఆల్రెడీ ఒక స్టార్ అయిన నవీన్ చంద్ర.. 2011లో "అందాల రాక్షసి" సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత కంటెంట్‌లో బలం ఉన్న కథలనే ఎంచుకుంటూ, తెలుగు సినిమా ఫీల్డ్‌ని ఏలారు. ప్రస్తుతం "గేమ్ ఛేంజర్" వంటి పాన్ ఇండియా సినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్నారు. అంతేకాకుండా అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన "ఇన్స్పెక్టర్ రుషి" వెబ్ సిరీస్‌తో డిజిటల్ వరల్డ్‌ని కూడా షేక్ చేస్తున్నారు


ఆయన ఇంకా ఎన్నో అద్భుతమైన పాత్రలతో, సినిమాలతో మనల్ని అలరించబోతున్నారు అందులో ఎటువంటి సందేహం లేదు. 

DNR Film Awards in Shilpa Kala Vedika on May 5th

దర్శకరత్న డి.ఎన్.ఆర్. ఫిల్మ్ అవార్డ్స్ 

వేడుకకు వేలాదిగా తరలి రండి!!!!



ఈనెల 5న శిల్పకళా వేదికలో

అతిరథమహారధుల సమక్షంలో

అంగరంగవైభవంగా అవార్డ్స్ ఫంక్షన్


-ప్రముఖ నటులు మురళి మోహన్

-ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ


నాలుగన్నర దశాబ్దాల తన సినీ ప్రయాణంలో దశ ముఖాలుగా ప్రతిభ కనబరిచి, తెలుగు చిత్ర పరిశ్రమకు పెద్ద దిక్కుగా భాసిల్లిన దాసరి నారాయణరావు 77వ జయంతి సందర్భంగా అంగరంగవైభవంగా జరుగుతున్న "దర్శకరత్న డి.ఎన్.ఆర్.ఫిల్మ్ అవార్డ్స్" వేడుకకు వేలాదిగా తరలి రావాలని ప్రముఖ నటులు మురళి మోహన్, ప్రముఖ దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ పిలుపునిచ్చారు!!


ఈనెల 5న శిల్పకళావేదికలో నిర్వహిస్తున్న ఈ వేడుక లోగోను ఈ సందర్భంగా వారు సంయుక్తంగా ఆవిష్కరించారు. దాసరికి ఘన నివాళి ఇవ్వడం, సినిమారంగంలో రాణించాలని ఉవ్విళ్లూరే నేటి తరంలో స్ఫూర్తిని నింపడం... ఈ వేడుక ముఖ్య ఉద్దేశ్యాలుగా వారు ఉద్ఘాటించారు. దశముఖాలుగా రాణించిన దాసరి స్మారకార్ధం దశ రంగాల్లో రాణిస్తున్న వారికి "దాసరి లెజండరి అవార్డ్స్" ప్రదానం చేయడంతోపాటు, 2023లో విడుదలైన చిత్రాల్లోని వివిధ విభాగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినవారికి అవార్డ్స్ అందజేయనున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు దిగ్గజాలు, లబ్ధప్రతిష్టులు ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నారు!!


ఈ సమావేశంలో కార్యక్రమ ముఖ్య నిర్వాహకుడు,ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, కార్యక్రమ సంధానకర్త - ప్రముఖ నటులు ప్రదీప్, జ్యురీ మెంబర్స్- ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ పాల్గొని, వేడుకను విజయవంతం చేయవలసిందిగా పరిశ్రమ పెద్దలకు, ప్రేక్షకులకు విజ్ఞప్తి చేశారు. తమ్మారెడ్డి భరద్వాజ చైర్మన్ గా ఉన్న జ్యురీ కమిటీలో ప్రముఖ దర్శకులు రేలంగి నరసింహారావు, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్, ప్రముఖ ఆడిటర్ బి.ఎస్.ఎన్. సూర్యనారాయణ, ప్రముఖ నటులు ప్రదీప్, ప్రముఖ ఫిల్మ్ జర్నలిస్ట్స్ ప్రభు, ధీరజ అప్పాజీ సభ్యులుగా ఉన్నారు!!