Rohan Roy and Arun on Summer Holidays

 ఫన్, ఎమోషన్ తో "సమ్మర్ హాలిడేస్" సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది - యాక్టర్స్ రోహన్ రాయ్, అరుణ్

కథా బలమున్న చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా, డిస్ట్రిబ్యూటర్ గా పేరు తెచ్చుకున్నారు ధీరజ్ మొగిలినేని. ఆయన తన ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై "సమ్మర్ హాలిడేస్" అనే చిల్డ్రన్ మూవీని నిర్మిస్తున్నారు. "సమ్మర్ హాలిడేస్" సినిమాను మన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసే ఒక అందమైన కథతో దర్శకుడు శ్రీకర్ రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో మాస్టర్ రోహన్, మాస్టర్ అరుణ్, బేబి ఖుషి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ నెల 6న "సమ్మర్ హాలిడేస్" సినిమా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తోంది. ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో మూవీ హైలైట్స్ తెలిపారు రోహన్, అరుణ్.

అరుణ్ మాట్లాడుతూ

 నేను 8 క్లాస్ చదువుతున్నా. నేను నటించే మూవీస్ స్క్రిప్ట్స్ అమ్మ వింటుంది. ఈ సినిమాలో ఆర్.వి. అనే రోల్ చేశాను. ఈ పాత్ర చాలా కామ్ గా ఉంటుంది. తనకు లైఫ్ లో ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ అతని లైఫ్ లో సంతోషం ఉండదు. అలా కామ్ గా ఉండే అబ్బాయిలో కె.వి.తో పరిచయం అయ్యాక ఎలాంటి మార్పులు వచ్చాయి అనేది సినిమాలో చూస్తారు. మాది వైజాగ్. ప్రతి సమ్మర్ కు అమ్మమ్మ వాళ్ల ఇంటికి వెళ్తుండేవాడిని.

- జయసుధ గారి లాంటి పెద్ద నటితో నటించడం గౌరవంగా భావిస్తున్నా. ఆమె నాకు ఎన్నో సజెషన్స్ ఇచ్చేవారు. ఆమెతో కలిసి నటిస్తున్నప్పుడు నిజంగా మా అమ్మమ్మతో ఉన్నట్లే అనిపించేది. ఫ్యూచర్ లో మంచి జాబ్ వస్తే చేస్తా. సినిమాల్లో అవకాశాలు ఉంటే ఇదే కెరీర్ కొనసాగించాలని అనుకుంటున్నా.

- నేను నటుడిగా స్టేట్, నేషనల్ అవార్డ్స్ పొందానంటే కారణం మా అమ్మ. నేను సినిమాలు చేసే క్రమంలో ఎక్కడైనా నిరాశపడితే అమ్మే ఎంతో ధైర్యం నింపేది. ఆమె మాటలు నాకు ఎంతో స్ఫూర్తినిస్తాయి. ఒక్కోసారి అమ్మకు ఆరోగ్యం బాగా లేకున్నా నాకు తోడుగా ఉండేది. అనారోగ్యంతో ఉన్నా షూటింగ్స్ కోసం హైదరాబాద్ వచ్చేవారు. తనకు బాగా లేదనే విషయం నాకు తెలియకుండా దాచేది. అమ్మ నాకోసం పడిన కష్టం వల్లే ఈ రోజు నేషనల్ అవార్డ్ పొందగలిగాను. నేను షూటింగ్స్ వల్ల 8వ తరగతిలో ఎక్కువగా స్కూల్ కు వెళ్లలేకపోయాను. స్కూల్ సాంగ్ చేసేప్పుడు చాలా ఎంజాయ్ చేశాం. సింజిత్ మంచి మ్యూజిక్ ఇచ్చారు. క్రష్ సాంగ్ రోహన్ కు ఉంటుంది.

రోహన్ మాట్లాడుతూ

- నేను ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నా. నా దగ్గరకు వచ్చే స్క్రిప్ట్స్ నేను, అమ్మ వింటాం. అమ్మ డెసిషన్ తీసుకుంటుంది. నాకు ఏదైనా స్క్రిప్ట్ బాగా నచ్చితే తప్పకుండా ఆ మూవీ చేస్తానని అమ్మకు చెబుతాను. సమ్మర్ హాలిడేస్ సినిమాలో నా క్యారెక్టర్ పేరు కె. వి. అతనికి లైఫ్ లో ఎన్నో అవమానాలు ఎదురైనా అందరితో నవ్వుతూ మాట్లాడుతుంటాడు. తన కుటుంబం కోసం, అమ్మ కోసం కష్టపడుతుంటాడు. నా క్యారెక్టర్ ఎనర్జిటిక్ గా ఉంటుంది. మాది చీరాల. మేము ఉండేది హైదరాబాద్ లోనే. పండుగల టైమ్ లో సొంతూరుకు వెళ్తుంటా. నా ఫస్ట్ ప్రయారిటీ చదువు. మా ఇంట్లో వాళ్లు కూడా బాగా చదువుకోమని ఎంకరేజ్ చేస్తుంటారు. చదువుకు ప్రాధాన్యత ఇస్తూనే, క్లాస్ లు మిస్ కాకుండా చూసుకుంటా షూటింగ్స్ ప్లాన్ చేసుకుంటా. పరీక్షల్లో నాకు 80 నుంచి 90 శాతం మార్కులు వస్తుంటాయి.  

- నేను చేసిన చిత్రాల్లో చదువు అబ్బని పాత్రలే ఎక్కువ ఉన్నాయి. 90's లో నా క్యారెక్టర్ కు చదువు రాదు. ఈ సినిమాలో స్కూల్ కు వెళ్తాడు కానీ చదువుల మీద శ్రద్ధ ఉండదు. నటుడిగా కెరీర్ చూస్తే వైవిధ్యమైన స్లాంగ్స్ లో నటించే అవకాశాలు వస్తున్నాయి. 90's తెలంగాణ యాస అయితే ఈ సినిమాలో గోదావరి స్లాంగ్ లో మాట్లాడుతాను. 90's, ప్రీ వెడ్డింగ్ షో, సమ్మర్ హాలిడేస్ ఈ మూడు సినిమాల్లో మంచి ఫన్ అందించే రోల్స్ నాకు దక్కడం సంతోషంగా ఉంది.

- నాకు కామెడీ కంటే ఎమోషన్ పండించడం ఇష్టం. 90'sలో నేను ఎమోషనల్ సీన్స్ చేసినా వాటిని నా కామెడీ సీన్స్ డామినేట్ చేశాయి. సమ్మర్ హాలిడేస్ లో మాత్రం కామెడీతో పాటు సమానంగా ఎమోషన్ సీన్స్ చేసే అవకాశం దక్కింది. ఇంటర్వెల్, సెకండాఫ్ లో నా క్యారెక్టర్ కు మంచి ఎమోషనల్ సీన్స్ ఉంటాయి. ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టుకుంటారు. నాకు పెద్ద సపోర్ట్ అంటే మా అమ్మ. షూటింగ్ టైమ్ లో నాతోనే ఉండి చూసుకునేది. మా డైరెక్టర్ శ్రీకర్ కన్విక్షన్ తో సినిమా చేశారు. ధీరజ్ గారు చాలా ప్యాషనేట్ ప్రొడ్యూసర్.



Post a Comment

Previous Post Next Post