‘Aaruguru Pativrathalu’ Set for Re-Release on December 11

డిసెంబర్ 11న రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ‘ఆరుగురు పతివ్రతలు’!



దీపావళి పండుగ సందర్భంగా ‘ఆరుగురు పతివ్రతలు’ చిత్ర బృందం ప్రేక్షకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ సందర్భంగా సినిమా రీ-రిలీజ్ తేదీని కూడా అధికారికంగా ప్రకటించింది. డిసెంబర్ 11న ఈ చిత్రం గ్రాండ్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

E.V.V. సత్యనారాయణ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి కమలాకర్, జనార్ధన్, మహర్షి, నాగిరెడ్డి కీలక బాధ్యతలు నిర్వహించారు. పోచమ్మ ఫిల్మ్స్ రిలీజ్ ద్వారా ఈ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేయనుంది.

బోల్డ్ కామెడీ కంటెంట్‌తో అప్పట్లో ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రంలో అమృత, లహరి, చలపతి రావు, ఎల్.బి. శ్రీరామ్, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. భార్యాభర్తల మధ్య అనుబంధం, వివాహేతర సంబంధాలు, లైంగిక సమస్యలు, బలవంతపు పెళ్లిళ్లు, సైకో మనస్తత్వం కలిగిన భర్తల ప్రవర్తన వంటి విభిన్న అంశాలతో పాటు ప్రేమ, భావోద్వేగాలు, హాస్యాన్ని మేళవిస్తూ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.

దీపావళి సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ సినిమాపై మరోసారి ఆసక్తిని పెంచుతోంది. డిసెంబర్ 11న థియేటర్లలో రీ-రిలీజ్ కానున్న ‘ఆరుగురు పతివ్రతలు’ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి!

Post a Comment

Previous Post Next Post