Vijay Deverakonda Backs Skincare Brand Unhype

 మన స్కిన్ కేర్ కోసం 'Unhype' అనే మంచి స్కిన్ కేర్ బ్రాండ్ లాంఛ్ చేయడం హ్యాపీగా ఉంది. హీరో విజయ్ దేవరకొండ

సినిమా, బిజినెస్..ఈ రెండు రంగాల్లో సక్సెస్ ఫుల్ గా జర్నీ చేస్తున్నారు హీరో విజయ్ దేవరకొండ. ఇప్పటికే రౌడీ వేర్ ఫ్యాషన్ బ్రాండ్ తో యూత్ ను ఆకట్టుకున్న విజయ్..ఇప్పుడు 'Unhype' అనే స్కిన్ కేర్ బ్రాండ్ ను తను కో ఫౌండర్ గా, కో బిల్డర్ గా లాంఛ్ చేశారు. ఈ సందర్భంగా

హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ - మంచి స్కిన్ కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటూ గత కొన్నేళ్లుగా మీరు నన్ను సలహాలు, సూచనలు అడుగుతున్నారు. నా స్కిన్ కోసం నేను ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటానో చెప్పమనేవారు. మీ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం ఇస్తున్నా. గత తొమ్మిది నెలలుగా ఒక స్కిన్ కేర్ బ్రాండ్ గురించి వర్క్ చేస్తున్నా. మనందరి స్కిన్ కేర్ సొల్యూషన్ ను మీ ముందుకు తీసుకొస్తున్నా. అదే 'Unhype'. క్వాలిటీలో నాకు నచ్చే స్టాండర్డ్ ప్రాడక్ట్ చేయగలిగాం అని నమ్మేంత వరకు మీకు ఈ విషయాన్ని నేను చెప్పలేదు. నిజంగా మనకు ఉపయోగపడే ప్రాడక్ట్స్, సైన్స్ ఆధారంగా పనిచేసే ప్రాడక్ట్స్, వాటిలో ఉపయోగించే పదార్థాలు, వాటిని టెస్ట్ చేశాక వచ్చే ఫలితాలు..ఇలాంటి అన్ని విషయాల్లో నేను జాగ్రత్తలు తీసుకున్నాం. వాటి ధరలు కూడా అందరికీ అందుబాటులో ఉంచాం. మరోవైపు మార్కెట్ లో ఎన్నో కొత్త కొత్త స్కిన్ కేర్ ప్రాడక్ట్స్ వస్తున్నాయి. ఈ విపరీతమైన పోటీ ఏది కొనాలి అనే సందేహం మనలో కలుగుతుంటుంది. ఈ నేపథ్యంలో సొంత రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్, తయారీ చేయగల ఒక టీమ్ ను నేను కలిశాను. ఆ టీమ్ నేను ఈ ప్రాడక్ట్ ప్రచారం మాత్రమే కాదు వారితో కలిసి నిర్మించాలని కోరారు. మీకు ఏదైనా మంచి వస్తువు నేను ఇవ్వాలనుకుంటే ఇదే సరైనది అనిపించింది. 'Unhype' ప్రాడక్ట్స్ తయారు చేశాక 9 నెలలు వాటిని నేను వాడి చూశాను. ఫలితాలు సంతృప్తినిచ్చాకే మీ ముందుకు ఈ ప్రాడక్ట్ ను తీసుకొస్తున్నా. అన్నారు.

Post a Comment

Previous Post Next Post