'Thank You Subbarao' to Stream on Aha from June 18

జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కానున్న ‘థాంక్యూ సుబ్బారావు’



‘ఓ.. పిట్టకథ’, ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’, ‘రేపు ఉదయం పది గంటలకు’ వంటి చిత్రాలతో దర్శకుడిగా చెందు ముద్దు సంపాదించుకున్న క్రేజ్, మంచి పేరు గురించి అందరికీ తెలిసిందే. ఆయన దర్శకత్వంలో రానున్న సరికొత్త సినిమా ‘థాంక్యూ సుబ్బారావు. ఈ మూవీని కె రాఘవేంద్ర రెడ్డి సమర్పణలో కుర్ర పొడక్షన్స్ బ్యానర్ మీద దినేష్ కుర్ర నిర్మించారు. ఈ సినిమాలో చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ముఖ్య పాత్రల్ని పోషించారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్‌తో పాటుగా టీజర్‌ను రిలీజ్ చేయగా మంచి హైప్ ఏర్పడింది.

కామెడీ, యాక్షన్, లవ్, సస్పెన్స్, థ్రిల్ ఇలా అన్ని అంశాల్ని జోడించి ‘థాంక్యూ సుబ్బారావు’ని తెరకెక్కించారని అర్థం అవుతోంది. హీరో, హీరోయిన్ ట్రాక్ రీఫ్రెషింగ్‌గా అనిపిస్తే.. ట్రైన్‌లో తెలియని ఓ అమ్మాయి.. ఊరు, పేరు, మొహం కూడా తెలియని ఓ అమ్మాయి చుట్టూ తిరిగే ఈ క్రైమ్ స్టోరీని ఉత్కంఠ భరితంగా తెరకెక్కించారని ట్రైలర్ లో తెలుస్తోంది. సస్పెన్స్, థ్రిల్లింగ్, ఫీల్ గుడ్ ఎమోషన్, కామెడీ, లవ్ ఎలిమెంట్స్‌తో ఈ సినిమాని తెరకెక్కించారు. ఇలాంటి ఓ డిఫరెంట్ సబ్జెక్ట్, కంటెంట్ మూవీ జూన్ 18 నుంచి ఆహాలో స్ట్రీమింగ్ కాబోతోంది.

ఈ చిత్రానికి ప్రిన్స్ హెన్రీ సంగీత దర్శకుడిగా, పంకజ్ తొట్టాడ కెమెరామెన్‌గా పని చేశారు. డి. వెంకట్ ప్రభు ఎడిటర్‌గా వర్క్ చేశారు. 

తారాగణం : చంద్రహాస్ కోట్ల, లావణ్య సాహుకార, రోహిత్ రెడ్డి యర్రంరెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు

సాంకేతిక బృందం: 

బ్యానర్: కుర్ర ప్రొడక్షన్స్ 

నిర్మాత: దినేష్ కుర్ర 

సమర్పణ: కె రాఘవేంద్రరెడ్డి 

దర్శకత్వం: చెందు ముద్దు 

ఎడిటర్: డి వెంకట ప్రభు 

సంగీతం: ప్రిన్స్ హెన్రీ 

DOP: పంకజ్ తొట్టాడ 

సాహిత్యం: శ్రీనివాస మౌళి 

PRO : సాయి సతీష్ 

పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే

Post a Comment

Previous Post Next Post