గగన్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘జంగా’ నుంచి స్పెషల్ పోస్టర్ విడుదల
ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ బ్యానర్ మీద శ్రీమతి వనిత కిలారీ సమర్పణలో రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారీ నిర్మిస్తున్న చిత్రం ‘జంగా’. త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు ప్రధాన పాత్రల్లో రాబోతోన్న ఈ మూవీకి కెవిన్ గడ్డం కథ, స్క్రీన్ ప్లే అందిస్తూ దర్శకత్వం వహిస్తున్నారు. త్రిగుణ్ పుట్టిన రోజు సందర్భంగా రీసెంట్‌గా వదిలిన మోషన్ పోస్టర్, ఫస్ట్ లుక్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. తాజాగా గగన్ బాబు బర్త్ డే సందర్భంగా స్పెషల్ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రివీల్ చేశారు.
ఈ చిత్రంలో గగన్ బాబు పోలీస్ ఆఫీసర్‌గా పవరు ఫుల్ లుక్‌లో కనిపిస్తున్నారు. సీఐ రోహిత్‌గా గగన్ బాబు ‘జంగా’లో అందరినీ అలరించబోతోన్నారు. సీరియల్ లుక్‌తో కనిపిస్తున్న గగన్ బాబు.. ఈ సినిమాలో ఇంటెన్స్ రోల్‌ను పోషిస్తున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చివరి దశలో ఉంది. మున్ముందు మరిన్ని అప్డేట్‌లతో అందరినీ మెప్పించనున్నారు.
ఈ సినిమాకి కృష్ణ సౌరభ్ సంగీతాన్ని అందిస్తుండగా.. వెంకట్ సి. దిలీప్ కెమెరామెన్‌గా పని చేస్తున్నారు. ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్ మాటలు రాయగా.. కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి పాటల్ని రాస్తున్నారు. ప్రవీణ్ పూడి ఎడిటర్‌గా వర్క్ చేస్తున్నారు.
నటీనటులు : త్రిగుణ్, వరలక్ష్మీ శరత్ కుమార్, గగన్ బాబు, మదు నందన్, శివ నందన్, నాగ మహేష్, నేహా పఠాన్, శ్రావణ్ రాఘవేంద్ర, భూపాల్ తదితరులు.
టెక్నికల్ టీం :
బ్యానర్ : ఆర్‌కె ఫిల్మ్ ఫ్యాక్టరీ
సమర్ఫణ :శ్రీమతి వనిత కిలారి
నిర్మాతలు :రమ్య కిలారి, జయచంద్ర నాయుడు కిలారి
కథ, కథనం, దర్శకత్వం :కెవిన్ గడ్డం
కెమెరామెన్ :వెంకట్ సి. దిలీప్
ఎడిటర్ : ప్రవీణ్ పూడి
సంగీతం : కృష్ణ సౌరభ్
లిరిక్స్ : కాసర్ల శ్యాం, పూర్ణాచారి, కళ్యాణ్ చక్రవర్తి
డైలాగ్స్ : ప్రసాద్ వర్మ, ప్రేమ్ రాజ్
ఆర్ట్ డైరెక్టర్ : రఘు కులకర్ణి
కాస్ట్యూమ్స్ : హర్ష, సంతోష్
ఫైట్స్ : కార్తిక్, వెంకట్
కో డైరెక్టర్స్ : సూర్య, మోడి రామజగన్నాథ్
ప్రొడక్షన్ మేనేజర్ :అంజి
పబ్లిసిటీ డిజైనర్స్ : అనిల్, భాను
పీఆర్వో :సాయి సతీష్


Post a Comment