విక్టరీ వెంకటేష్ చేతుల మీదుగా "తిమ్మరాజుపల్లి టీవీ" మూవీ ట్రైలర్ లాంఛ్
టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల పర్ ఫార్మెన్స్ లు, అందమైన ఊరి వాతావారణం చూసేందుకు మా "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా చూడండి - ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో కిరణ్ అబ్బవరం
న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా "తిమ్మరాజుపల్లి టీవీ". తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. "తిమ్మరాజుపల్లి టీవీ" చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగే పీరియాడిక్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా ఈ నెల 17న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ రోజు హైదరాబాద్ లో "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో
నటుడు సాయికృష్ణ మాట్లాడుతూ - "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాలో నేను దక్షిణం అనే క్యారెక్టర్ లో నటించాను. ఈ సినిమా షూటింగ్ ను మూడు రాష్ట్రాల సరిహద్దుల్లో చేశాం. సెల్ ఫోన్స్ ఏవీ లేకుండా అక్కడి స్థానికులతో కలిసిపోయి చిత్రీకరణ జరిపాం. షూటింగ్ చేస్తున్న టైమ్ లో మా చిన్నప్పటి జ్ఞాపకాలు గుర్తుకువచ్చాయి. సినిమా చూస్తుంటే మీకు అదే ఫీల్ కలుగుతుంది. అన్నారు.
నటుడు బాల్ రాజ్ మాట్లాడుతూ - నేను చాలా చిత్రాల్లో నటించినా నన్ను ఇలా గుర్తించి ఎవరూ స్టేజీ మీదకు పిలవలేదు. కిరణ్ అన్న నాకు అలాంటి అవకాశం కల్పించారు. ఈ చిత్రంలో నేను ఉత్తరం అనే పాత్రలో నటిస్తున్నాను. నేను సాయికృష్ణ ఉత్తరం దక్షిణం పాత్రల్లో మిమ్మల్ని ఎంటర్ టైన్ చేస్తాం. అన్నారు.
నటుడు చిట్టి మాట్లాడుతూ - ఈ సినిమాలో హీరో స్నేహితుడి పాత్రలో నటించాను. మనదైన రూటెడ్ స్టోరీ ఇది. ఊరిలో జరిగే సంఘటనలను నేపథ్యంగా తీసుకుని ఈ సినిమాను మా దర్శకుడు మునిరాజు ఆసక్తికరంగా తెరకెక్కించారు. అన్నారు.
నటి కరిష్మ మాట్లాడుతూ - "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాలో గంగోజీ పాత్రలో నటించాను. ఇలాంటి మంచి రోల్ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా. మా మూవీ ఎలా ఉందో థియేటర్స్ లో చూసి మీ రెస్పాన్స్ తెలియజేయండి. అన్నారు.
నటి స్వాతి మాట్లాడుతూ - నేను నటించిన తొలి చిత్రమిది. అందుకే ఈ మూవీ నాకు ఎంతో ప్రత్యేకం. ఒక ఊరిలో ఒకే టీవీ ఉంటే, దాని చుట్టూ ఎలాంటి డ్రామా జరుగుతుంది అనేది మా మూవీలో ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలతో చూడబోతున్నారు. అన్నారు.
నటి రాజశ్రీ మాట్లాడుతూ - ఈ చిత్రంలో రోజా అనే పాత్రలో నటించాను. 90 దశకం నేపథ్యంగా మా మూవీ ఉంటుంది. అప్పట్లో లైఫ్ ఎంత సింపుల్ గా ఉండేదో మా సినిమాలో చూస్తారు. పేరెంట్స్ తో కలిసి చూసి ఆనందించగలిగే మూవీ ఇది. అన్నారు.
నటుడు అనిల్ మాట్లాడుతూ - మనకు అప్పట్లో తెలిసిన పెద్ద సెలబ్రిటీ టీవీనే. ఇప్పుడు మనం టీవీని మర్చిపోతున్నాం. పల్లెటూరి వాళ్లు సిటీకి వచ్చి ఆ పల్లె వాతావరణం మిస్ అవుతున్నారు. అందుకే ఇప్పుడు సిటీ వాళ్లు పల్లెటూరి వెకేషన్స్ కు వెళ్తున్నారు. మీరు కూడా ఈ వేసవికి వెకేషన్ కు వెళ్లాలంటే మా మూవీ చూసేందుకు థియేటర్స్ కు వచ్చేయండి. అన్నారు.
నటుడు లతీష్ మాట్లాడుతూ - ఈ చిత్రంలో లతీష్ అనే పాత్రలో నటించాను. ఈ సినిమా చూస్తుంటే మీరు మీ గతంలోకి వెళ్లిపోతారు. ఆ గతం చాలా అందంగా ఉంటుంది. ఈ సినిమా మొదలుపెట్టిన ఫస్ట్ డే ఎంత ఎగ్జైటింగ్ గా ఉన్నామో, ఈరోజు కూడా అంతే ఎగ్జైటింగ్ గా ఉన్నాం. అన్నారు.
నటుడు తేజ విహాన్ మాట్లాడుతూ - "తిమ్మరాజుపల్లి టీవీ" సినిమాలో నేను టీవీ కుమార్ అనే క్యారెక్టర్ లో నటించాను. ఏపీ, తమిళనాడు, కర్ణాటక బార్డర్ లో ఉండే ఊరిది. ఈ ఊరు నేపథ్యంగా ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీని మా డైరెక్టర్ తెరకెక్కించారు. మా మూవీని ఈ నెల 17న థియేటర్స్ లో చూడండి. అన్నారు.
నటుడు అమ్మ రమేష్ మాట్లాడుతూ - నా ఫొటో పోస్టర్ మీద చూడాలనేది మా అమ్మ కల. ఈ రోజు ఆ కల నెరవేరింది. నేను ఇండస్ట్రీకి వచ్చి 28 ఏళ్లవుతోంది. టీవీ మొదట్లో మనకు పరిచయం అయినప్పటినుంచి నాకు తెలుసు. టీవీ ఉన్న వారింటికి వెళ్లి కార్యక్రమాలు చూసేవాళ్లం. అలాంటి నేపథ్యంతో మా కిరణ్ గారు ఈ సినిమా నిర్మించారు. ఈ చిత్రం రిలీజైన మొదటి రోజునే ఒక మంచి చిత్రం చేశారనే పేరు మా కిరణ్ గారికి వస్తుంది. మా డైరెక్టర్ ముని గారు ఒక ఉపాధ్యాయుడిలా క్రమశిక్షణతో మా అందరితో నటింపజేశారు. అన్నారు.
నటుడు సత్యనారాయణ మాట్లాడుతూ - ఒకప్పుడు టీవీలు మన జీవితంలో భాగంగా ఉండేవి. అప్పుడు మనం ఎంత సంతోషంగా గడిపాం అనేది ఈతరం వారికి తెలియదు. వాళ్లు కూడా ఆ సంతోషం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే మా మూవీ చూసేందుకు వస్తే సరిపోతుంది. అన్నారు.
ఆర్ట్ డైరెక్టర్ సుధీర్ మాచర్ల మాట్లాడుతూ - నేను కిరణ్ గారితో కలిసి చేస్తున్న ఏడో చిత్రమిది. రాజావారు రాణిగారితో మా జర్నీ స్టార్ట్ అయ్యింది. మొదటి సినిమాకు ఎలాంటి అమాయకత్వం, ఒక హానెస్టీతో వర్క్ చేశామో ఇప్పుడు ఈ చిత్రానికి కూడా అలాగే వర్క్ చేశాం. మన ఇన్నోసెన్స్ నుంచే మ్యాజిక్ వర్కవుట్ అవుతుంది. అలాంటి బ్యూటిఫుల్ మేకింగ్ ను ఈ చిత్రంలో చూస్తారు. అన్నారు.
నటుడు ప్రదీప్ కొట్టె మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ ఎంత బాగుందో సినిమా కూడా అలాగే ఆకట్టుకుంటుంది. ఈ సినిమా 80, 90 దశకాల వారికే కాదు ఈ జెనరేషన్ వారికి కూడా బాగా నచ్చుతుంది. ఎందుకంటే మనందరి ఎమోషన్స్ ఒక్కటే. మొదటిసారి టీవీ కొన్నా, మొదటి సారి మొబైల్ కొన్నా ఒకే తరహా సంతోషాన్ని పొందుతాం. మా సినిమాలో కొత్తదనం చూస్తారు. అన్నారు.
డైరెక్టర్ వి.మునిరాజు మాట్లాడుతూ - అంతరించిపోయిన వస్తువులను మ్యూజియంలో పెడుతుంటారు. అలాంటి మ్యూజియం మీరు తెరపై చూడాలంటే మా సినిమాను ఈనెల 17న చూడండి. ఎందుకంటే మా సినిమా ఒక మ్యూజియంలా ఉంటుంది. అందులో అంతరించిపోతున్న మన కల్చర్, జ్ఞాపకాలు, టీవీ గురించి ఉండే ఎమోషన్స్ ను చూస్తారు. ఇది తిమ్మరాజుపల్లి స్టోరీ మాత్రమే కాదు మన రెండు తెలుగు రాష్ట్రాల వారి స్టోరీ. మొత్తం ఏపీ, తెలంగాణలో 40 ఫ్లస్ ఏజ్ ఉన్నవాళ్లు దాదాపు 5 కోట్ల మంది ఉంటారు. వారందరికీ ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుంది. అలాగే వారి ఫ్యామిలీతో కలిసి చూస్తూ సినిమాను ఎంజాయ్ చేస్తారు. అన్నారు.
హీరోయిన్ వేద జలంధర్ మాట్లాడుతూ - మా మూవీ నుంచి రిలీజ్ చేసిన మూడు సాంగ్స్ మీకు నచ్చాయి. ట్రైలర్ లో మీరు చూసిన కంటెంట్ ను మించి సినిమాలో చూస్తారు. ఈ ఫ్యూరిటీ, ఎమోషన్స్ సినిమాలో ఇంతకంటే ఎక్కువ ఇంపాక్ట్ ఫుల్ గా కనిపిస్తాయి. 35 రోజులు ఈ సినిమా కోసం షూటింగ్ చేశాం. చాలా మెమొరీస్ ఉన్నాయి. అవన్నీ ప్రీ రిలీజ్ లో చెబుతాను. మేమంతా డెడికేషన్ తో , సినిమా మీద ప్రేమతో, కిరణ్ గారు మా మీద పెట్టుకున్న నమ్మకం నిలబెట్టాలని కష్టపడ్డాం. ఈ నెల 17న మీ పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ తో మా సినిమా చూసేందుకు వెళ్లండి. అన్నారు.
హీరో సాయి తేజ్ మాట్లాడుతూ - మన లైఫ్ లో మొదటిసారి ఎక్సిపీరియన్స్ చేసేవన్నీ ఒక మంచి ఫీల్ ను ఇస్తాయి. మొదటిసారి తిన్న అమ్మచేతి ముద్ద ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అలా మన లైఫ్ లో చూసే స్వీట్ మెమొరీస్ ఈ చిత్రంలో ఉంటాయి. ఈ చిత్రంలో అవకాశం కల్పించిన కిరణ్ అన్నకు థ్యాంక్స్. ఈ నెల 17న థియేటర్స్ లోకి మా మూవీ రాబోతోంది. తప్పకుండా చూసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా. అన్నారు.
నిర్మాత కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ - మా మూవీ ట్రైలర్ ను రిలీజ్ చేసిన విక్టరీ వెంకటేష్ గారికి థ్యాంక్స్ చెబుతున్నాం. ఆయన సినిమా రిలీజ్ అయ్యిందంటే ఇంటిల్లిపాదీ థియేటర్స్ కు వెళ్లేవాళ్లం. మా చిన్నతనంలో టీవీలో కొత్త సినిమా వచ్చినా, వీసీడీల్లో కొత్త మూవీ చూసినా ఎంతో హ్యాపీగా ఉండేది. అలాంటి హ్యాపీనెస్ ఇప్పటితరం వారికి చూపించాలనే అప్పటి హీరో, హీరోయిన్స్ గెటప్స్ లో ఈ రోజు మీ ముందుకు వచ్చాం. చెన్నకేశవరెడ్డి, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు సినిమాలు నాకు బాగా ఇష్టం. అందుకే ఈ రోజు చెన్నకేశవరెడ్డి గెటప్ లో వచ్చాను. బాలకృష్ణ గారికి థ్యాంక్స్. అలాగే వింటేజ్ హీరోలందరికీ థ్యాంక్స్. మా చిత్రంలో పనిచేసిన వాళ్లందరి కల సినిమా. ఆ కల తీరేందుకు ఒక్కొక్కరికి ఒక్కో టైమ్ పట్టింది. వాళ్లు మా మూవీ కోసం రెండేళ్లు కష్టపడ్డారు. ఇంత ప్యాషనేట్ టీమ్ చేసిన సినిమాను నేను హీరోగా చేసిన సినిమాలాగే ప్రమోట్ చేస్తున్నా. మేము కష్టపడ్డామని సినిమా చూడమని చెప్పను. నేను ప్రేక్షకుల టైమ్, డబ్బుకు విలువఇస్తాను. మా మూవీ ట్రైలర్, సాంగ్స్ , కంటెంట్ చూడండి. మీకు నచ్చితేనే థియేటర్స్ కు వెళ్లి మా టీమ్ అందరినీ సపోర్ట్ చేయండి. టెక్నికల్ బ్రిలియన్స్, ఆర్టిస్టుల బ్రహ్మాండమైన పర్ ఫార్మెన్స్ లు, ఊరిలోని ఆహ్లాదకరమైన వాతావారణం.. ఈ మూడు చూసేందుకు మా మూవీకి వెళ్లండి. ఈ వేసవికి సమ్మర్ వెకేషన్ ఊరికి వెళ్లినట్లే. ఈ సారి మా తిమ్మరాజుపల్లికి రండి. మీ ఊరు గుర్తుస్తుంది, అప్పటి జ్ఞాపకాలు గుర్తుకువస్తాయి. ఇది నేను గ్యారెంటీ ఇస్తున్నా. 50 ఏళ్లు దాటిన వారికి మా సినిమా చాలా చాలా బాగా నచ్చుతుంది. టీవీ కొనేందుకు, టీవీ చూసేందుకు వాళ్లు ఎలాంటి స్ట్రగుల్స్ పడ్డారు, ఎలాంటి అనుభూతులకు లోనయ్యారు అనేది వాళ్లకు మరోసారి గుర్తుకువస్తుంది. 30, 40 ఇయర్స్ లో ఉన్న వారికి చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే వాళ్లు ఫస్ట్ టీవీ కొని ఇంట్లో చూశారు కాబట్టి..ఆ మెమొరీస్ గుర్తుకువస్తాయి. ఈతరం యూత్ కు టీవీ అంటే పెద్దగా ఎమోషన్ కాదు. కానీ ఇప్పటి యూత్ మీ పేరెంట్స్ ను టీవీ గురించి, టీవీ వెనక ఉన్న ఎమోషన్ గురించి అడగండి. మా మూవీ చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు
నటీనటులు - సాయి తేజ్, వేద జలంధర్, ప్రదీప్ కొట్టె, స్వాతి కరిమిరెడ్డి, అమ్మ రమేష్, సత్యనారాయణ, లతీష్, తదితరులు
టెక్నికల్ టీమ్
డిజైనర్ - విశాల్య
ఆర్ట్ డైరెక్టర్ - సుధీర్ మాచర్ల
బిజినెస్ హెడ్ అండ్ మార్కెటింగ్ - చౌహాన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్ - రితికేష్ గోరక్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - కేఎల్ మదన్
డీవోపీ - అక్షయ్ రామ్ పొదిశెట్టి
మ్యూజిక్ - వంశీకాంత్ రేఖన
సీఈవో - రహస్య కిరణ్
పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)
కో ప్రొడ్యూసర్ - తేజ వేల్పుచర్ల
ప్రొడ్యూసర్ - కిరణ్ అబ్బవరం
రచన, ఎడిటింగ్, దర్శకత్వం - వి. మునిరాజు


Post a Comment