Band Melam Trailer Launched by MegastarChiranjeevi

 మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా విడుద‌లైన ‘బ్యాండ్ మేళం’ ట్రైలర్.. మార్చి 26న మూవీ గ్రాండ్ రిలీజ్

మ్యాంగో మాస్ మీడియా సమర్పణలో కోన ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్ మీద కోన వెంకట్ రూపొందించిన‌ చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో హర్ష్ రోషన్, శ్రీదేవీ జంటగా నటించారు. కావ్య‌, శ్రావ్య నిర్మాత‌లు. మార్చి 26న రిలీజ్ అవుతోన్న ఈ సినిమా ట్రైల‌ర్‌ను మెగాస్టార్ చిరంజీవి విడుద‌ల చేసి చిత్ర యూనిట్‌కు అభినంద‌న‌లు తెలియ‌జేశారు. 

ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే.. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియెన్స్‌కు క‌నెక్ట్ అయ్యే ల‌వ్‌స్టోరీగా దీన్ని రూపొందించారు. హీరో హీరోయిన్ మ‌ధ్య ఉండే ప్రేమ‌, గిల్లిక‌జ్జాలను హ‌త్తుకునేలా రూపొందించారు. హీరో హ‌ర్ష్ రోష‌న్ త‌న మ‌ర‌ద‌లైన హీరోయిన్ ప్రేమ‌ను గెల‌వ‌టానికి ఏం చేశాడు? త‌న‌కు ఎదురైన ఇబ్బందులేంటి? వాటిని ఎలా అధిగ‌మించాడు? అనే అంశాల‌తో బ్యాండ్ మేళం సినిమా రూపొందిన‌ట్లు తెలుస్తోంది. 

బ్యాండ్ మేళం సినిమా నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు విడుద‌లైన టీజ‌ర్‌, సాంగ్స్‌, తాజాగా ట్రైల‌ర్‌తో సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. శివరాజు ప్రణవ్ ఈ చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరించారు. సాయికుమార్ కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్నారు. విజ‌య్ బుల్గానిన్ సంగీతం అందించిన ఈ సినిమాకు సతీష్ ముత్యాల సినిమాటోగ్ర‌ఫీ అందించారు. శివ ముప్ప‌రాజు స్క్రీన్ ప్లే, ఎడిటింగ్ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హించారు. మార్చి 26న సినిమాను గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. 


న‌టీన‌టులు:

 హర్ష్ రోషన్, శ్రీదేవి, సాయి కుమార్ తదితరులు.

సాంకేతిక వ‌ర్గం:

కోన వెంకట్ ప్రొడక్షన్

బ్యానర్: కోన ఫిల్మ్ కార్పొరేషన్

సమర్పణ :మ్యాంగో మాస్ మీడియా

నిర్మాతలు: కావ్య, శ్రావ్య

సహ నిర్మాత: శివరాజు ప్రణవ్

రచయిత, దర్శకుడు: సతీష్ జవ్వాజి

సంగీతం: విజయ్ బుల్గానిన్

స్క్రీన్‌ప్లే, ఎడిటింగ్: శివ ముప్పరాజు

సినిమాటోగ్రఫీ: సతీష్ ముత్యాల

గీతరచయిత: చద్రబోస్

ఆర్ట్ డైరెక్టర్: నార్ని శ్రీనివాస్

కాస్ట్యూమ్ డిజైనర్: నంధన గాయత్రి

పి.ఆర్‌.ఒ: వంశీ కాకా

Post a Comment

Previous Post Next Post