Producer Suresh Kondeti Confident About My Baby’s Success

 మై బేబి" సినిమా "ప్రేమిస్తే", "జర్నీ" లాంటి గొప్ప సక్సెస్ సాధిస్తుందని నమ్ముతున్నాం - నిర్మాత సురేష్ కొండేటి

నిమిషా సాజయాన్ హీరో హీరోయిన్లు గా నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వంలో నటించిన తమిళ సూపర్ హిట్ మూవీ "డీఎన్ఏ"ను "మై బేబి" పేరుతో తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు ప్రముఖ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ సురేష్ కొండేటి. ఆయన యష్ ఫిలిం ఫ్యాక్టరీ బ్యానర్ తో కలిసి తన ఎస్ కే పిక్చర్స్ పై "మై బేబి" చిత్రాన్ని ఈ నెల 18న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సురేష్ కొండేటి నిర్మాతగా, దుప్పాడిగట్టు సారిక రెడ్డి, పి.సాయిచరణ్ తేజ కో ప్రొడ్యూసర్స్ గా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను ప్రముఖ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా హైదరాబాద్ రామానాయుడు స్టూడియోలో లాంఛ్ చేశారు. ఈ కార్యక్రమంలో

నిర్మాత సురేష్ కొండేటి మాట్లాడుతూ - "మై బేబి" సినిమా తమిళ వెర్షన్ డీఎన్ఏ చూశాక ఈ సినిమాను ఎలాగైనా తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలి అనిపించింది. వాళ్లు చాలా ఎక్కువ రేట్ చెప్పారు. నేను గతంలో చేసిన సినిమాల గురించి వాటి సక్సెస్ గురించి చెప్పాను. అప్పుడు నా మీద నమ్మకంతో వాళ్లు ఈ సినిమా రైట్స్ మా సంస్థకు ఇచ్చారు. ఈ చిత్రానికి నాతో పాటు యష్ ఫిలిం ఫ్యాక్టరీ నుంచి సాయిచరణ్ గారు తోడయ్యారు. నిన్న ప్రీమియర్ షో వేశాం. మురళీ మోహన్ లాంటి సీనియర్ నటులు చూసి కంటతడి పెట్టుకున్నారు. అప్పుడే ఈ మూవీ ఎంత పెద్ద సక్సెస్ అవుతుంది అనేది అర్థమైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాల నుంచి క్రేజీగా బిజినెస్ జరిగింది. నేను ప్రొడ్యూస్ చేసిన చిత్రాల్లో అన్నింటికన్నా ఎక్కువ థియేటర్స్ లో "మై బేబి" రిలీజ్ కాబోతోంది. దాదాపు 350 స్క్రీన్స్ లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా విడుదలకు వస్తోంది. నైజాంలో 130కి పైగా స్క్రీన్స్ పడుతున్నాయి. ఇన్ని థియేటర్స్ లో నా సినిమా రావడం హ్యాపీగా ఉంది. ఈ నెంబర్స్ ఇంకా పెరుగుతాయి. మంచి మదర్ సెంటిమెంట్ ఉండి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రమిది. ఐదు అద్భుతమైన ఫైట్స్ ఉంటాయి. డీఎన్ఏ అనే టైటిల్ మనకు రీచ్ కాదని, మై బేబి అనే టైటిల్ పెట్టాం. ఈ టైటిల్ గురించి చెబితే ఒరిజినల్ మూవీ ప్రొడ్యూసర్స్ కూడా ఈ టైటిల్ మేము పెడితే మా మూవీ ఇంకా పెద్ద సక్సెస్ అయ్యేది అన్నారు. "మై బేబి" సినిమా ట్రైలర్ లాంఛ్ కు వచ్చిన భరద్వాజ గారికి థ్యాంక్స్. ఆయన ఎంతో బిజీగా ఉన్నా మా కోసం వచ్చారు. "మై బేబి" సినిమాను థియేటర్స్ లో చూసి ఆదరించాలని కోరుతున్నా. అన్నారు.

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ - సురేష్ కొండేటి ఎన్నో మంచి చిత్రాలను మనకు అందించాడు. అప్పట్లో ఓటీటీలు లేవు కాబట్టి మరో భాషలోని సినిమా మనం చూడాలంటే డబ్బింగ్ లోనే చూడాలి. అలా సురేష్ కొండేటి చేసిన చిత్రాలన్నీ మంచి సక్సెస్ అందుకున్నాయి. "మై బేబి" సినిమా కూడా ప్రీమియర్ షోస్ నుంచి అద్భుతమైన టాక్ తెచ్చుకుంటోంది. ట్రైలర్ చూస్తే స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న చిత్రమిదని తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకుల ఆదరణ పొందాలి, సురేష్ కు మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నా. అన్నారు.

కో ప్రొడ్యూసర్ సాయిచరణ్ తేజ మాట్లాడుతూ - మంచి మూవీస్ ప్రొడ్యూస్ చేయాలని ప్రయత్నిస్తున్న క్రమంలో సురేష్ కొండేటి గారు పరిచయమయ్యారు. ఆయన జడ్జిమెంట్ ను మేము నమ్ముతున్నాం. "మై బేబి" సినిమా పెద్ద విజయం సాధిస్తుందనే ఆశిస్తున్నాం. ఇకపై కూడా సురేష్ గారితో కలిసి సినిమాలు చేయాలని ప్లాన్ చేస్తున్నాం. "మై బేబి" మా సంస్థకు తొలి సినిమా. ఈ ప్రయత్నంలో విజయం సాధించేలా మీరంతా సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. అన్నారు.


Post a Comment

Previous Post Next Post