Ukku Satyagraham Is Releasing in 200+ Screens on November 29

 200కి పైగా థియేటర్లలో నవంబర్ 29 న విడుదల కానున్న 'ఉక్కు సత్యాగ్రహం'



దివంగత ప్రజా గాయకుడు గద్దర్ కీలక పాత్రలో నటించిన ఆఖరి చిత్రం ఉక్కు సత్యాగ్రహం. "విశాఖ ఉక్కు తెలుగు వారి హక్కు" అనే నినాదంతో తెరకెక్కిన ఈ సినిమా నవంబర్ 29 న ప్రేక్షకుల ముందుకు రానుంది. పి సత్యారెడ్డి దర్శక నిర్మాణంలో రానున్న ఈ సినిమా లో అతనే హీరోగా నటించగా, పల్సర్ బైక్ ఫేమ్, విశాఖ కండక్టర్ ఝాన్సీ కీలక పాత్ర చేశారు.


కొన్ని సందేశాత్మక సన్నివేశాల్లో నటించడమే కాకుండా గద్దర్ ఈ చిత్రం లో మూడు పాటలు కూడా పాడారు. ఈ చిత్రానికి సంబందించిన రిలీజ్ డేట్ ప్రకటిస్తూ,


ఉక్కు సత్యాగ్రహం విడుదల తేదీ ప్రకటించిన సందర్బంగా దర్శక నిర్మాత, హీరో పి సత్యారెడ్డి మాట్లాడుతూ... ''విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, అక్కడ భూ నిర్వసితులకు న్యాయం జరగాలని మూడేళ్లు కష్టపడి తెరకెక్కించిన సినిమా 'ఉక్కు సత్యాగ్రహం'. స్టీల్ ప్లాంట్ యూనియన్ నాయకులు, ఉద్యోగులు, ఎంతో మంది మేధావులు, భూనిర్వాసితులు, కవులు కళాకారుల, రచయితలు నటించిన ఈ సినిమా ని 200కు పైగా థియేటర్లలో విడుదల చేయనున్నాం'' అని చెప్పారు.


తారాగణం: గద్దర్, సత్యా రెడ్డి, 'పల్సర్ బైక్' ఝాన్సీ, ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంవీవీ సత్యనారాయణ, ప్రసన్నకుమార్, వెన్నెల తదితరులు

సంగీతం: శ్రీ కోటి

కూర్పు: మేనగ శ్రీను

కథ - కథనం - నిర్మాణం - దర్శకత్వం: పి. సత్యా రెడ్డి

పీఆర్: మధు వి ఆర్

డిజిటల్ మీడియా: డిజిటల్ దుకాణం 

Post a Comment

Previous Post Next Post