Mega Producer Allu Aravind Appreciated Astrid Team

       "ఆస్ట్రిడ్ " కు అల్లు అరవింద్  అభినందనలు  



     డెర్మటాలజీ అండ్ కాస్మటాలజీ పట్ల అవగాహన పెరుగుతున్న తరుణంలో అందుకు అవసరమైన అత్యాధునిక వసతులతో క్లినిక్స్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2 లో కె.బి.ఆర్. పార్క్ రోడ్డులో "ఆస్ట్రిడ్    డెర్మటాలజీ అండ్ కాస్మోటాలజీ క్లినిక్"  పేరుతో ఒక అల్ట్రా మోడ్రన్ క్లినిక్ ప్రారంభమైంది. ఈ క్లినిక్ లో మూడు అత్యాధునిక  పరికరాలను సుప్రసిద్ధ నిర్మాత గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ రిబ్బన్ కట్ చేసి  ఆవిష్కరించారు.  ప్రాక్టీసింగ్ డెర్మటాలజిస్ట్ గా  పది సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగిన "డాక్టర్ అలేఖ్య రాళ్లపల్లి " నిర్వహిస్తున్న ఈ క్లినిక్ లో  పిగ్మెంటేషన్ కోసం'క్యూ స్విచ్ ', ఏజింగ్ ట్రీట్మెంట్ కోసం' హై వ్యూ '..స్కార్ ట్రీట్మెంట్ కోసం ఎం.ఎన్.ఆర్. ఎఫ్ .అనే మూడు అధునాతనమైన ఎక్విప్మెంట్స్ ను అల్లు అరవింద్ ప్రారంభించారు.       


ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ " డెర్మటాలజీ కాస్మటాలజీ ట్రీట్మెంట్ లో పదేళ్ల అనుభవం కలిగిన డాక్టర్ అలేఖ్య నాకు సొంత బిడ్డ లాంటిది. ఆమె మామగారు సీనియర్ యాక్టర్ అయిన భాస్కర్ రావు గారు నాకు చిరకాల మిత్రులు .                  ఆ కుటుంబంతో ఉన్న అనుబంధాన్ని పురస్కరించుకొని నేను ఇక్కడికి రావడం జరిగింది . బంజారాహిల్స్ లాంటి ప్రైమ్ ఏరియాలో ఇలాంటి వెల్ ఎక్విప్డ్  క్లినిక్ ను ప్రారంభించిన డాక్టర్ అలేఖ్యను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యంగా హెల్త్ అండ్ కాస్మటాలజీ అవేర్నెస్ కలిగిన మా సినిమా వాళ్లకు ఈ క్లినిక్  చాలా ఉపయోగకరంగా  ఉంటుంది. వయసు మీద పడే కొద్దీ ముఖంలో ముడతలు కనిపించకూడదు అనుకునే నాలాంటి వాళ్లకు ఇక్కడ మంచి ఏజింగ్ ట్రీట్మెంట్ లభిస్తుంది " అని చమత్కరించారు .    


 ఈ సందర్భంగా డాక్టర్ అలేఖ్య మాట్లాడుతూ "చిత్ర పరిశ్రమలో ఒక గొప్ప నిర్మాతగా, పరిశ్రమ ప్రముఖునిగా వెలుగొందుతున్న అల్లు అరవింద్ గారి లాంటి గొప్ప వ్యక్తి చేతులమీదుగా ఈ ఆవిష్కరణ జరగటం చాలా ఆనందంగా ఉంది. వారికి మా కుటుంబ సభ్యులందరి పక్షాన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను" అన్నారు.


Post a Comment

Previous Post Next Post