Ramam Raghavam Premieres at Cherlapally Central Jail on Gandhi Jayanti

 చర్లపల్లి సెంట్రల్ జైలులో 'రామం రాఘవం' ప్రీమియర్స్ ప్రదర్శించిన టీమ్ 



అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా చర్లపల్లి సెంట్రల్ జైలులో రామం రాఘవం మూవీ ప్రీమియర్స్ ని ప్రదర్శించారు. దాదాపు 2500 ఖైదీల కోసం ఈ చిత్ర ప్రీమియర్ షోని జైలులోనే ప్రదర్శించడం విశేషం. తండ్రి కొడుకుల మధ్య ఎమోషనల్ డ్రామాగా మంచి సందేశంతో రామం రాఘవం చిత్రం తెరకెక్కింది. నటుడు, కమెడియన్ ధనరాజ్ డెబ్యూ దర్శకుడిగా ఈ చిత్రంతో పరిచయం అవుతున్నారు. 


సముద్రఖని తండ్రిగా, ధనరాజ్ కొడుకుగా ఈ చిత్రంలో నటించారు. ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారులు వీళ్ళిద్దరే. జైలులో ఒక చిత్ర ప్రీమియర్ షో ప్రదర్శించడం అనేది రేర్ ఎక్స్పీరియన్స్. ఈ అవకాశాన్ని ఇచ్చిన చర్లపల్లి జైలు అధికారులు, పోలీస్ డిపార్ట్మెంట్ కి రామం రాఘవం చిత్ర యూనిట్ కృతజ్ఞతలు తెలిపింది. రామం రాఘవం చిత్ర ప్రీమియర్ ప్రదర్శనకి సహకరించిన జైలు సిబ్బందికి, పోలీస్ శాఖకి రుణపడి ఉంటాం. ముఖ్యంగా జైలు సూపరింటెండ్ గౌరి రాంచంద్రం గారికి కృతజ్ఞతలు. 


ఈ చిత్రంలో ఉన్న సందేశాన్ని వీరంతా అర్థం చేసుకుని ఖైదీల కోసం ప్రీమియర్ ప్రదర్శనని అంగీకరించారు. ఖైదీలతో ఇలాంటి ఒక మంచి ఎక్స్పీరియన్స్ ని నేను పొందుతానని కలలో కూడా ఊహించలేదు అని ధనరాజ్ అన్నారు. ఈ సందర్భంగా ధనరాజ్ నిర్మాత పృథ్వీ పోలవరపు, సమర్పకులు ప్రభాకర్ అరిపాల లకు కూడా కృతఙ్ఞతలు తెలిపారు. 


ఈ చిత్రం చూసి ఖైదీలు ఎమోషనల్ అయ్యారు. అందరి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. పోలీస్ అధికారులు మమ్మల్ని అభినందించి ఎంకరేజ్ చేసినట్లు ధనరాజ్ తెలిపారు. రామం రాఘవం చిత్ర యూనిట్ కి ఇది మరచిపోలేని అనుభూతి. ఖైదీల హృదయాల్ని కదిలించిన రామం రాఘవం చిత్రం ప్రేక్షకులని కూడా మెప్పిస్తుందని చిత్ర యూనిట్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Post a Comment

Previous Post Next Post