Mohan Babu ,Vishnu Manchu and team Kannappa Visited 12 Jyotirlingas

 కన్నప్ప టీం ద్వాదశ జ్యోతిర్లింగాల సందర్శనం.. కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేశ్‌లో మోహన్ బాబు, విష్ణు మంచు



ప్రముఖ నటుడు మోహన్ బాబు,  విష్ణు మంచు, దర్శకుడు ముఖేష్ కుమార్, నటుడు అర్పిత్ రంకాతో కలిసి కేదార్‌నాథ్, బద్రీనాథ్ రిషికేశ్‌లో ఆధ్యాత్మిక తీర్థయాత్రకు బయలుదేరారు. ఈ బృందం దైవిక ఆశీర్వాదం కోసం ఈ పవిత్ర యాత్రను చేపట్టింది.  పన్నెండు జ్యోతిర్లింగాలలో ఒకటైన కేదార్‌నాథ్‌ను కన్నప్ప టీం సందర్శించింది. ఆపై బద్రీనాథ్‌లో ప్రార్థనలు కూడా చేశారు. రిషికేశ్ సందర్శనతో వారి ప్రయాణం ముగిసింది. 


 అనంతరం విష్ణు మంచు మాట్లాడుతూ..‘కేదార్‌నాథ్, బద్రీనాథ్, రిషికేష్‌కు రావడం ఆనందంగా ఉంది. పరమ శివుడి పరమ భక్తుడి కథగా కన్నప్ప చిత్రం విడుదలకు ముందే మొత్తం 12 జ్యోతిర్లింగాలను సందర్శించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. మా ఎపిక్ యాక్షన్ చిత్రం విడుదల కోసం మేము ఎదురుచూస్తున్నాము’ అని అన్నారు.


విష్ణు మంచు కన్నప్ప ఫస్ట్ లుక్, టీజర్ అభిమానులలో ఉత్సాహాన్ని నింపిన సంగతి తెలిసిందే. ది లార్డ్ ఆఫ్ ది రింగ్స్ వంటి ఇతిహాసాల స్ఫూర్తితో, ప్రముఖ హాలీవుడ్ సినిమాటోగ్రాఫర్ షెల్డన్ చౌ చే న్యూజిలాండ్‌లోని సుందరమైన ప్రకృతి దృశ్యాలలో చిత్రీకరించబడిన ఈ చిత్రం విజువల్ వండర్‌గా రాబోతోంది.  


ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్‌, శరత్ కుమార్ తో సహా భారీ తారాగణం ఉంది. కథానాయకుడిగా నటిస్తున్న విష్ణు మంచు ఈ చిత్రాన్ని.. భక్తి, శౌర్యం, ఆధ్యాత్మిక అన్వేషణతో కూడిన ప్రయాణంగా అభివర్ణించారు.

Post a Comment

Previous Post Next Post