Legendary Director K. Raghavendra Rao unveils Madhura Audio Originals song 'Palike Bangarama'

 దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు చేతుల మీదుగా మధుర ఆడియో ఒరిజినల్స్ 'పలికే బంగారమా..' సాంగ్ రిలీజ్



ఛాట్ బస్టర్ సాంగ్స్ కు కేరాఫ్ అడ్రస్ గా మారిన మధుర ఆడియో మ్యూజిక్ లవర్స్ ఫేవరేట్ ఆడియో లేబుల్ గా పేరు తెచ్చుకుంది. సంగీత ప్రియులను మరింతగా ఆకట్టుకునేందుకు మధుర ఆడియో ఒరిజినల్స్ సాంగ్స్ రూపొందిస్తోంది. ఈ క్రమంలో అరవింద్ కృష్ణ, శోభిత రానా జంటగా 'పలికే బంగారమా..' అనే సాంగ్ ను మన ముందుకు తీసుకొచ్చింది. ఈ పాటకు శ్వేత పీవీఎస్ డైరెక్షన్ చేశారు. టాలెంటెడ్ కంపోజర్ ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణియన్ స్వరపర్చగా..బాలవర్థన్ బ్యూటిఫుల్ లిరిక్స్ అందించారు. దినకర్ కల్వల ఆకట్టుకునేలా పాడారు.


పలికే బంగారమా పాటను దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు. పాట చాలా బాగుందని ప్రశంసించిన ఆయన సాంగ్ టీమ్ కు తన బ్లెస్సింగ్స్ అందజేశారు. పలికే బంగారమా..అని ప్రియుడు తనను పిలవాలని ప్రతి అమ్మాయి కోరుకుంటుంది. 'తరిమే ఆలోచన, ఉరిమే ఆలాపనా, ఒదిగే నా మనసున, గురుతై నిలిచే...కరిగే సమయంతో నువ్వే ఎదురై నిలబడితే నాలో మొదలవుతుందే కంగారే..ఉంటే నీ వెంటే ఏదీ గురుతే రాదంటా నాకే..ఏమవుతుందో నాకే..పలికే బంగారమా, కులుకే సింగరమా...' అంటూ గ్రేట్ లవ్ ఫీల్ తో సాగుతుందీ పాట.



నటీనటులు - అరవింద్ కృష్ణ, శోభిత రానా



టెక్నికల్ టీమ్


ఎడిటర్ - భరత్ బింగిమల

రైటర్ - మోహన్ కె రాజు

ఎగ్జిక్యూషన్ - లాడర్ గురు

సింగర్ - దినకర్ కల్వల

లిరిక్స్ - బాలవర్థన్

మ్యూజిక్ - ప్రియదర్శన్ బాలసుబ్రహ్మణియన్

డీవోపీ - బ్రహ్మతేజ మరిపూడి

ప్రొడక్షన్ హౌస్ - మధుర ఆడియో ఒరిజినల్స్

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా (సురేష్ - శ్రీనివాస్)

ప్రొడ్యూసర్ - విష్ణు రెడ్డి కోమల్ల

డైరెక్టర్ - శ్వేత పీవీఎస్





Post a Comment

Previous Post Next Post