హీరో కిరణ్ అబ్బవరం నటించిన భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమా "క". ఈ సినిమాలో నయన్ సారిక, తన్వీ రామ్ హీరోయిన్స్ గా నటించారు . శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు దర్శక ద్వయం సుజీత్, సందీప్ విలేజ్ బ్యాక్ డ్రాప్ లో "క" సినిమాను తెరకెక్కించారు .ఈ చిత్రం ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది
క సినిమా కథ గురించి చెప్పాలంటే ఈ కథ వాసుదేవ్ అనే పోస్ట్ మాన్ కథ అతను ఒక అనాథ అతని జీవితం లో జరిగిన సంఘటన వలన అతను వేరేవాళ్ల ఉత్తరాలు చదవడం మొదలు పెడతారు ఈ అలవాటు వల్ల అతని లైఫ్ ఎలాంటి టర్న్ తీసుకుంది అనేది కథ
#KA సినిమా గురించి చెప్పాలి అంటే కథ చెప్పే విధానం చాలా బాగుంది అక్కడ అక్కడ కొంత స్లో అనిపించిన ఫస్ట్ హాఫ్ ముగిసే సమయానికి ఆడియన్ సినిమా కి కనెక్ట్ అవుతారు
సెకండ్ హాఫ్ మొత్తం చాలా బాగా కనెక్ట్ అవుతుంది
ట్విస్ట్ లు చాలా బాగున్నాయి
కిరణ్ అబ్బవరం కెరీర్ లో ఈ సినిమా ఒక మైల్ స్టోన్ గా నిలుస్తుంది తన నటన తో అందరినీ మెప్పించే ప్రయత్నం చేసాడు ఈ సినిమా కి సంగీతం పెద్ద ఎసెట్ కెమెరా వర్క్ అద్భుతంగా వుంది . నిర్మాత ఎక్కడా రాజీ పడకుండా నిర్మించిన తీరు మనకు స్క్రీన్ పైన కనపడుతున్నది దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ లు అద్భుతంగా ప్రేక్షకులను కట్టి పడేశారు
ప్లస్ పాయింట్ లు
నటన
ట్విస్టులు
విజువల్స్
దర్శకత్వం
సంగీతం
మైనస్ పాయింట్
అక్కడ అక్కడ కొంత సాగదీత కనిపించింది
ఫైనల్ గా ఒక పాయింట్ లో చెప్పాలి అంటే కిరణ్ అబ్బవరం నమ్మకం నిజమైంది. కిరణ్ ని నమ్మిన నిర్మాతలు డిస్ట్రిబ్యూటర్ నమ్మకం కూడా వృధా గా పోలేదు వెరసి ఈ చిత్రం సక్సెస్ ఫుల్ గా హిట్ అయింది అని చెప్పాలి
Rating 3.25/5
Post a Comment