Heroine Samyuktha Participates in Breast Cancer Awareness Program at Basavatharakam Hospital

బసవతారకం ఆస్పత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రామ్ లో పాల్గొన్న హీరోయిన్ సంయుక్త

వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో దూసుకెళ్తోన్న హీరోయిన్ సంయుక్త సేవా కార్యక్రమాల్లో ముందుంటూ అందరి మనసులు గెల్చుకున్నారు . బాలకృష్ణ ఆధ్వర్యంలోని బసవతారకం ఆస్పత్రి నిర్వహించిన బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ ప్రోగ్రాంలో సంయుక్త పాల్గొంది. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ కోసం ప్రచారం చేయడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సంయుక్త పేర్కొంది. ఈ కార్యక్రమంలో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా పాల్గొంది. పలువురు బసవతారకం ఆస్పత్రి వైద్యులతో కలిసి సంయుక్త బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ పై మాట్లాడింది. ఈ ఫొటోస్ ను తన సోషల్ మీడియా అక్కౌంట్స్ ద్వారా షేర్ చేశారు సంయుక్త.


ఈ కార్యక్రమం గురించి సంయుక్త స్పందిస్తూ - బసవతారకం ఆస్పత్రి బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ వాకథాన్ లో పాల్గొనడం సంతోషంగా ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ పై పోరాటంలో మనమంతా ముందుకురావాలి. ఈ ఏడాది బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్ నెస్ తీసుకురావాలని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పేర్కొంది. ముందుగానే బ్రెస్ట్ క్యాన్సర్ ను డిటెక్ట్ చేస్తే చికిత్సతో నయం చేయడానికి వీలు ఉంటుంది. మనమంతా ఈ అవేర్ నెస్ లో భాగమవుదాం. అని అన్నారు 

 


Post a Comment

أحدث أقدم