Hero Kiran Abbavaram kept his word, arranged four free shows for the Movie Love Reddy

 మాట నిలబెట్టుకున్న హీరో కిరణ్ అబ్బవరం, "లవ్ రెడ్డి" సినిమాకు నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో నాలుగు ఫ్రీ షోస్ ఏర్పాటు



రీసెంట్ గా "లవ్ రెడ్డి"  సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్ లో గెస్ట్ గా పాల్గొన్న హీరో కిరణ్ అబ్బవరం..ఈ సినిమాకు తనవంతు ఏదైనా సపోర్ట్ చేయాలని ఉంది, నైజాం, ఆంధ్రా, సీడెడ్ లో ఫ్రీ షోస్ వేయిస్తానని చెప్పారు. ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఈరోజు నాలుగు ఫ్రీ షోస్ ఏర్పాటు చేశారు. హైదరాబాద్ జీపీఆర్ మల్టిప్లెక్స్ లో ఈ సాయంత్రం 7.45 నిమిషాలకు, వైజాగ్ శ్రీరామా థియేటర్ లో సాయంత్రం 6.30 నిమిషాలకు, తిరుపతిలో కృష్ణ తేజ థియేటర్ లో సాయంత్రం 6.30 నిమిషాలకు అలాగే విజయవాడ స్వర్ణ మల్టిప్లెక్స్ లో సాయంత్రం 6.30 నిమిషాలకు కిరణ్ అబ్బవరం ఫ్రీ  షోస్ వేయిస్తున్నారు. ఈ సందర్భంగా "లవ్ రెడ్డి"  సినిమా టీమ్ హీరో కిరణ్ అబ్బవరంకు కృతజ్ఞతలు తెలిపింది. సోషల్ మీడియాలో కూడా కిరణ్ అబ్బవరంను ఒక మంచి సినిమాకు సపోర్ట్ గా నిలబడింనందుకు ప్రశంసలు తెలియజేస్తూ కామెంట్స్ వస్తున్నాయి.


గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్  బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన "లవ్ రెడ్డి" చిత్రంలో అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లు గా నటించారు. దర్శకుడు స్మరన్ రెడ్డి ఈ చిత్రాన్ని రూపొందించారు. ప్రొడ్యూసర్స్ సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి,  మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి "లవ్ రెడ్డి" చిత్రాన్ని నిర్మించారు. ఈ రోజు థియేటర్స్ లోకి వచ్చిన "లవ్ రెడ్డి"  సినిమా ఎమోషనల్ లవ్ స్టోరీగా ప్రేక్షకుల నుంచి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.


నటీనటులు - అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి, తదితరులు


టెక్నికల్ టీమ్


సంగీతం - ప్రిన్స్ హేన్రి

ఎడిటింగ్ - కోటగిరి వెంకటేశ్వరరావు

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - రవీంద్ర రెడ్డి

పీఆర్ఓ - జీఎస్ కే మీడియా(సురేష్ - శ్రీనివాస్)

సహా నిర్మాతలు - సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా

నిర్మాతలు- సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి

రచన, దర్శకత్వం: స్మరన్ రెడ్డి

Post a Comment

Previous Post Next Post