ETV Getting Ready to Entertain Audiences with Diwali Event

 దీపావళి ఈవెంట్.. ఊహించని గెస్టులతో సందడే సందడి



ప్రతీ పండుగను ఆడియెన్స్‌కు ఈటీవీ ఎంతో ప్రత్యేకంగా మార్చేస్తుందన్న సంగతి తెలిసిందే. బుల్లితెర ఆర్టిస్టులు, తారల సందడితో పండుగ ఈవెంట్‌లను గ్రాండ్‌గా నిర్వహిస్తుంటారు. ఈ దీపావళి పండుగకు ఈటీవీలో అదిరిపోయే ఈవెంట్‌ను ప్లాన్ చేశారు. ఈ దీపావళికి మోత మోగిపోద్ది అంటూ ఇప్పటికే ప్రోమోలతో సందడి చేస్తున్నారు. అసలు బుల్లితెరపై పండుగ ఈవెంట్లు అంటే ఈటీవీనే అని, అందులోనూ మల్లెమాల ప్రొడక్షన్‌లోనే అదిరిపోతుంది.


ఈ దీపావళి ఈవెంట్‌కు అనసూయ, మంచు లక్ష్మి ముఖ్య అతిధులుగా వచ్చారు. యూట్యూబ్ స్టార్స్ సోనియా, సిద్దు, షణ్ముఖ్ జస్వంత్,ప్రసాద్ బెహరా, టీవీ ఆర్టిస్టులు పండు, ఆది, రామ్ ప్రసాద్, ఇమ్మాన్యుయేల్, నరేష్,మానస్, తనూజ, ఐశ్వర్య, సౌందర్య, కీర్తి బట్ వంటి వారి పర్ఫామెన్స్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నాయి. ఇక ఈ ఈవెంట్‌లో కామెడీ, డ్యాన్సులు, ఆటలు, పాటలు ఇలా అన్ని రకాల ఎమోషన్స్ నిండి ఉన్నాయి. పండుగ సందడి అంతా కూడా ఈటీవీలోనే అన్నట్టుగా ఈ దీపావళి ఈవెంట్‌ను ప్లాన్ చేశారు.

Post a Comment

Previous Post Next Post