Director Sailesh Kolanu Launched First Look Of Mansion House Mallesh

హిట్ యూనివర్స్ డైరెక్టర్ శైలేష్ కొలను లాంచ్ చేసిన శ్రీనాథ్ మాగంటి, బాల సతీష్, రాజేష్ నటించిన కనకమేడల ప్రొడక్షన్స్ వారి 'మెన్షన్ హౌస్ మల్లేష్' సినిమా టైటిల్ పోస్టర్



శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలలో బాల సతీష్ దర్శకత్వం లో కనకమేడల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ నిర్మిస్తున్న సినిమాకి 'మెన్షన్ హౌస్ మల్లేష్' అనే ఇంట్రస్టింగ్ టైటిల్ పెట్టారు.  డైరెక్టర్ శైలేష్ కొలను ఈ సినిమా టైటిల్ పోస్టర్ ని లాంచ్ చేశారు.  


హీరో శ్రీనాథ్ మాగంటి వైట్ అండ్ వైట్ లో బ్లాక్ షేడ్స్ తో కింగ్ చైర్ లో కూర్చుని ఇంటెన్స్ గా చూస్తున్న టైటిల్ పోస్టర్ అదిరిపోయింది. పోస్టర్ లో గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి డైనమిక్ ఎక్స్ ప్రెషన్స్ తో కనిపించడం క్యురియాసిటీని పెంచింది.


ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు. సురేష్ బొబ్బిలి మ్యూజిక్ అందిస్తున్నారు. అమ్మముత్తు డీవోపీ కాగా, గ్యారీ BH ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు.


త్వరలోనే ఈ మూవీ థియేటర్స్ లోకి రానుంది.


తారాగణం : శ్రీనాథ్ మాగంటి, గాయత్రి రమణ, సాయి కామాక్షి భాస్కర్ల, రాజేష్, మురళీధర్ గౌడ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, సాయి ప్రసన్న, పద్మ నిమ్మనగోటి, హరి రెబెల్

రచన & దర్శకత్వం: బాల సతీష్

నిర్మాత: రాజేష్

బ్యానర్: కనకమేడల ప్రొడక్షన్స్

సంగీతం : సురేష్ బొబ్బిలి

డీవోపీ: అమ్మముత్తు

ఎడిటర్: గ్యారీ BH

సాహిత్యం: రామజోగయ్య శాస్త్రి, పూర్ణాచారి, అనిరుద్ శాండిల్య మారంరాజు, తరుణ్ సైదులు

పబ్లిసిటీ డిజైన్: ది బ్రాండ్ వాండ్

పీఆర్వో: వంశీ - శేఖర్

Post a Comment

Previous Post Next Post