Blockbuster Director Chandoo Mondeti receives Best Telugu Film Award for "Karthikeya 2"

 "కార్తికేయ 2" సినిమాకు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డ్ అందుకున్న దర్శకుడు చందూ మొండేటి




తెలుగు సినిమా గర్వంచే క్షణాలను చిత్ర పరిశ్రమకు అందించారు టాలెంటెడ్ డైరెక్టర్ చందూ మొండేటి. ఆయన రూపొందించిన కార్తికేయ 2 సినిమా ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ పురస్కారాన్ని గెలుచుకుంది. ఢిల్లీలో జరిగిన ఈ వేడుకలో రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా కార్తికేయ 2 చిత్రానికి ఉత్తమ తెలుగు చిత్రంగా నేషనల్ అవార్డ్ స్వీకరించారు దర్శకుడు చందూ మొండేటి మరియూ నిర్మాత అభిషేక్ అగర్వాల్.

ఈ సందర్భంగా టీమ్ కు సినీ పరిశ్రమలోని పలువురు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.


నిఖిల్ హీరోగా కృష్ణతత్వాన్ని, శ్రీకృష్ణుడి గొప్పదనం తెలియజేస్తూ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీగా కార్తికేయ 2 చిత్రాన్ని రూపొందించారు చందూ మొండేటి. త్వరలో ఈ సినిమాకు మరో సీక్వెల్ కార్తికేయ 3 కూడా అనౌన్స్ చేశారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా పాన్ ఇండియా మూవీ "తండేల్" రూపొందిస్తున్నారు చందూ మొండేటి. మరికొన్ని భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ కు సన్నాహాలు చేస్తున్నారీ టాలెంటెడ్ డైరెక్టర్. ఈ చిత్రాలతో చందూ మొండేటి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుందాం

Post a Comment

Previous Post Next Post