Advance Birthday Wishes from Tokyo Fans to Rebel Star Prabhas

రెబెల్ స్టార్ ప్రభాస్ కు టోక్యో అభిమానుల అడ్వాన్స్ బర్త్ డే  విశెస్




రెబెల్ స్టార్ ప్రభాస్ ఎల్లలులేని ఛరిష్మాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారు. జపాన్ లో ప్రభాస్ ను ఇష్టపడే అభిమానుల సంఖ్య మరీ ఎక్కువ. ఈ నెల 23న ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ముందుగానే ఆయనకు బర్త్ డే విశెస్ చెబుతూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు జపాన్ లోని టోక్యో రెబెల్ స్టార్ ఫ్యాన్స్.


రాధే శ్యామ్ సినిమా ప్రత్యేక ప్రదర్శన చూసిన అనంతరం హ్యాపీ బర్త్ డే ప్రభాస్ అంటూ బ్యానర్స్ చూపిస్తూ ప్రభాస్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రభాస్ కు టోక్యో ఫ్యాన్స్ చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ వీడియోస్, ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు ప్రభాస్ పుట్టినరోజు సందడి ఆల్రెడీ మొదలైంది. అటు ఆయన సూపర్ హిట్ సినిమాల రీ రిలీజ్ లు, కొత్త సినిమాల అప్డేట్స్ సిద్ధమవుతున్నాయి. అభిమానులు ఈ స్పెషల్ డేను ఘనంగా సెలబ్రేట్ చేసుకోవడానికి సంతోషంగా సన్నద్ధమవుతున్నారు.

 

Post a Comment

Previous Post Next Post