Action King Arjun Sarja’s Next Directorial Seetha Payanam Announced

 యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా  దర్శకత్వం లో ‘సీతా పయనం’ 



భారత సినీ పరిశ్రమలో "యాక్షన్ కింగ్" గా ప్రఖ్యాతి పొందిన నటుడు, దర్శకుడు అర్జున్ సర్జా, తన తదుపరి ప్రాజెక్ట్ ‘సీతా పయనం’ తో మరోసారి దర్శకుడిగా రాబోతున్నారు.  బహుముఖ ప్రతిభతో ప్రసిద్ధి పొందిన అర్జున్ సర్జా, ‘జై హింద్’ మరియు ‘అభిమన్యు’ వంటి చిత్రాలతో తన దర్శకత్వ ప్రతిభను ఇప్పటికే నిరూపించారు. ఇప్పుడు, హృదయాలను కట్టిపడేసే తాజా కథా నేపథ్యంతో రాబోతున్నారు .

‘సీతా పయనం’ శీర్షిక సూచించినట్లుగా, ఈ చిత్రం కుటుంబం అంతా ఆస్వాదించే గొప్ప డ్రామాగా ఉండే అవకాశం ఉందని సమాచారం .


సీతా పయనం మూడు భాషల్లో - తెలుగు, తమిళం, కన్నడలో రూపొందించబడింది.


స్వంత సంస్థ శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ లో అర్జున్ సర్జా స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రం యొక్క ఫస్ట్ లుక్ మరియు నటీనటులు, సాంకేతిక బృందంపై మరింత సమాచారం త్వరలో ప్రకటించనున్నారు.


సాంకేతిక బృందం:

కథ - దర్శకుడు - నిర్మాత: అర్జున్ సర్జా  

బ్యానర్: శ్రీ రామ్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్

Post a Comment

Previous Post Next Post