Home » » ZEE5's Original "Love, Sitara" Trailer Out

ZEE5's Original "Love, Sitara" Trailer Out

 ZEE5లో శోభితా ధూళిపాళ, రాజీవ్ సిద్ధార్థ్ న‌టించిన ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ ట్రైలర్‌ను విడుదల  



- RSVP నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వం వహించిన ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి ZEE5లో స్ట్రీమింగ్


- ‘లవ్, సితార’ కీలక పాత్రల్లో నటించిన  సోనాలి కులకర్ణి, జయశ్రీ, వర్జీనియా రోడ్రిగ్జ్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రాయ్ తదితరులు


భారతదేశంలోని అతిపెద్ద స్వదేశీ వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ZEE5.  దీని నుంచి రాబోతున్న ఒరిజినల్ ఫిల్మ్ ‘లవ్, సితార’ సెప్టెంబర్ 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ ట్రైల‌ర్‌ను మేక‌ర్స్ విడుద‌ల చేశారు. అనేక భావోద్వేగాల క‌ల‌యిక‌గా ఈ ఫ్యామిలీ డ్రామా తెర‌కెక్కింది. ఓ కుటుంబంలోని స‌భ్యుల మ‌ధ్య ఉండే వివిధ ర‌కాలైన స‌మ‌స్య‌ల‌ను, ఎమోష‌న్స్‌ను చ‌క్క‌గా ఎలివేట్ చేసే సినిమా ఇదని ట్రైల‌ర్‌ను చూస్తుంటే అర్థ‌మ‌వుతుంది. రోనీ స్క్రూవాలా RSVP మూవీస్ నిర్మాణంలో వందనా కటారియా దర్శకత్వంలో ఈ మూవీ తెర‌కెక్కింది.


Trailer Link -  



ట్రైల‌ర్‌ను గ‌మ‌నిస్తే... ప్ర‌కృతి అందాల‌తో ఆక‌ట్టుకునే కేరళ పచ్చటి అందాల న‌డుము తెర‌కెక్కిన క‌థే ల‌వ్ సితార‌. తార‌ (శోభితా ధూళిపాళ) ఓ స్వతంత్ర్య భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్‌. అంత‌ర్జాతీయంగా మంచి పేరున్న చెఫ్ అర్జున్ (రాజీవ్ సిద్ధార్థ)తో ప్రేమ‌లో పడుతుంది. వారిద్ద‌రూ పెళ్లికి ముందు తార ఇంటికి వెళ‌తారు. అక్క‌డ పెళ్లి జ‌రగ‌టానికి ముందు కుటుంబాల్లోని విబేదాలు, తెలియ‌కుండా దాగిన నిజాలు బ‌య‌ట‌ప‌డ‌తాయి. చివ‌ర‌కు ఈ జంట ప్ర‌యాణం ఎటువైపు సాగింద‌నేదే సినిమా.  సోనాలి కులకర్ణి, బి.జయశ్రీ, రోడ్రిగ్స్, సంజయ్ భూటియాని, తమరా డిసౌజా, రిజుల్ రే  త‌దిత‌రులు ఇత‌ర పాత్ర‌ల్లో న‌టించారు. లవ్, సితార సెప్టెంబర్ 27న ZEE5లో ప్రీమియర్‌గా ప్ర‌ద‌ర్శితం కానుంది.ఈ సంద‌ర్భంగా..


శోభితా దూళిపాల‌ మాట్లాడుతూ,‘‘సితారలో నటిచడం  చక్కటి అనుభూతినిచ్చింది. నేను పోషించిన పాత్రలో అనేక షేడ్స్ ఉన్నాయి. వైవిధ్య‌మైన పాత్ర‌. స్వ‌తంత్య్ర భావాలున్న ఇంటీరియ‌ర్ డిజైన‌ర్ పాత్ర‌లో న‌టించాను. నిజాయ‌తీగా ఉండే ఓ అమ్మాయి త‌న జీవితంలో ఎదురైన స‌వాళ్ల‌ను ధైర్యంగా ఎలా ఎదుర్కొంద‌నేదే క‌థ‌. చ‌క్క‌టి ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఆక‌ట్టుకుంటాయి”అని అన్నారు.


రాజీవ్ సిద్ధార్థ స్పందిస్తూ,‘‘లవ్, సితార’ ట్రైలర్ అందరినీ ఆక‌ట్టుకోవ‌టం చాలా సంతోషంగా ఉంది. అందులో అర్జున్ అనే పాత్ర‌లో న‌టించాను. నేను ప్రేమించి అమ్మాయిని పెళ్లి చేసుకునే క్ర‌మంలో ఎలాంటి మ‌లుపు తీసుకుంది. నా చుట్టు ఉన్న పాత్ర‌ల్లో ఉన్న సంక్లిష్ట‌త వాస్త‌విక‌త‌ను ఎంత ద‌గ్గ‌ర‌గా ఉంటాయ‌నేది ఆసక్తిని రేపే విష‌యం. శోభిత‌గారితో క‌లిసి న‌టించటం మంచి ఎక్స్‌పీరియెన్స్‌. జీ 5 ప్రేక్ష‌కుల‌ను ఈ ఒరిజ‌ల్ ఫిల్మ్ మెప్పిస్తుంద‌నే న‌మ్మ‌కం ఉందిరియు 'లవ్, సితార' ప్రతి ZEE5 వీక్షకుడికి నచ్చుతుందని నేను నమ్ముతున్నాను”అని అన్నారు.


డైరెక్ట‌ర్  వందన కటారియా మాట్లాడుతూ “ ల‌వ్ సితార‌’ అనేది ప్రేక్ష‌కుల‌కు ఓ ఆహ్లాద‌కరమైన ప్రయాణం. చ‌క్క‌టి ఫ్యామిలీ డ్రామా. RSVPతో కలిసి పని చేయ‌టం, అలాగే ఈ ప్రయాణంలో  ZEE5 నుంచి దొరికిన మ‌ద్ధ‌తు చూసి థ్రిల్ ఫీల్ అవుతున్నాను. ఎంట‌ర్‌టైన్‌మెంట్‌తో పాటు ప్రేమ‌, కుటుంబంలో వ్య‌క్తుల మ‌ధ్య ఉండే భావోద్వేగాల‌ను ఇందులో చ‌క్క‌గా చూపించాం’’ అన్నారు.


సెప్టెంబరు 27న ఫ్యామిలీ అండ్ లవ్ ఎమోషనల్ జర్నీ ‘లవ్, సితార’ ప్రీమియర్‌ల కోసం ZEE5ను ట్యూన్ చేయండి


ZEE5 గురించి...

జీ5 భార‌త‌దేశ‌పు యంగ‌స్ట్ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్. మల్టీలింగ్వుల్ స్టోరీటెల్ల‌ర్‌గా ప్ర‌సిద్ధి పొందింది. మిలియ‌న్ల కొద్దీ అభిమానుల‌ను సంపాదించుకుంది. గ్లోబ‌ల్ కంటెంట్ ప‌వ‌ర్ హౌస్ జీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ ఎంట‌ర్‌ప్రైజెస్ లిమిటెడ్ (జీఎల్‌) నుంచి శాఖ‌గా మొద‌లైంది జీ5. అత్య‌ద్భుత‌మైన వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫార్మ్ గా పేరు తెచ్చుకుంది. 3,500 సినిమాల లైబ్ర‌రీ ఉన్న ప్లాట్‌ఫార్మ్ ఇది. 1,750 టీవీ షోలు, 700 ఒరిజిన‌ల్స్, 5 ల‌క్ష‌ల‌కు పైగా ఆన్ డిమాండ్ కంటెంట్ ఈ సంస్థ సొంతం. 12 భాష‌ల్లో (హిందీ, ఇంగ్లిష్‌, బెంగాలీ, మ‌ల‌యాళం, తెలుగు, త‌మిళ్‌, మ‌రాఠీ, ఒరియా, భోజ్‌పురి, గుజ‌రాతీ, పంజాబీ)లో అందుబాటులో ఉంది. బెస్ట్ ఒరిజిన‌ల్స్, ఇంట‌ర్నేష‌న‌ల్ మూవీస్‌, టీవీ షోస్‌, మ్యూజిక్‌, కిడ్స్ షోస్‌, ఎడ్‌టెక్‌, సినీ ప్లేస్‌, న్యూస్‌, లైవ్ టీవీ, హెల్త్, లైఫ్‌స్టైల్ విభాగాల్లో ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తోంది. ఇంత గొప్ప డీప్ టెక్ స్టాక్ నుంచి ఎదిగిన ప్లాట్‌పార్మ్ కావ‌డంతో జీ5 12 భాష‌ల్లో అత్య‌ద్భుత‌మైన కంటెంట్‌ని ప్రేక్ష‌కుల‌కు అందించ‌గ‌లుగుతోంది.


Share this article :