Vinayaka Chavithi Special Event Jabardast Vs Sridevi Drama Company

 వినాయక చవితి స్పెషల్ ఈవెంట్.. జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ



బుల్లితెరపై స్పెషల్ ఈవెంట్లు చేయాలంటే అది ఈటీవీనే.. అందులోనూ మల్లెమాల సంస్థనే ముందుంటుంది. తాజాగా వినాయక చవితికి సంబంధించి జై జై గణేశా అనే ఈవెంట్‌ను చేశారు. వినాయక చవితి స్పెషల్‌గా ఈ కార్యక్రమాన్ని నేటి ఉదయం 9 గంటలకు ప్రసారం చేశారు. ఇక ఈ ఈవెంట్‌లో జబర్దస్త్ వర్సెస్ శ్రీదేవీ డ్రామా కంపెనీ అన్నట్టుగా సాగింది. ఈ ఈవెంట్‌లో ఇంద్రజ, కుష్బూలు సందడి చేశారు.


వినాయక చవితి ఈవెంట్లో స్పెషల్ అట్రాక్షన్‌గా హీరో, నటుడు శివాజీ మెరిశాడు. ఇకపై తాను షోకు జడ్జ్‌కు వస్తానని చెప్పాడు. జబర్దస్త్ షోకి జడ్జ్‌గా వస్తారా? శ్రీదేవీ డ్రామా కంపెనీకి జడ్జ్‌గా వస్తారా? అన్నది చెప్పకుండా కుష్బూ, ఇంద్రజలను ఆట పట్టించారు శివాజీ. ఇక ఈ కార్యక్రమంలో జబర్దస్త్ ఆర్టిస్టులు, శ్రీదేవీ డ్రామా కంపెనీ ఆర్టిస్టులు పోటాపోటీగా స్కిట్లు చేశారు. ఇరు టీం సభ్యులు తమ తమ స్కిట్లతో అందరినీ అలరించారు.


రాం ప్రసాద్, హైపర్ ఆది, బుల్లెట్ భాస్కర్‌ల స్కిట్లు అందరినీ నవ్వించాయి. మధ్యలో కుష్బూ, ఇంద్రజల పంచ్‌లు, శివాజీ సెటైర్లతో ఈవెంట్‌ ఆద్యంతం వినోదభరితంగా సాగింది. వినాయక చవితి స్పెషల్‌గా చేసిన ఈ ఈవెంట్ బుల్లితెర ఆడియెన్స్‌ను ఆకట్టుకుంది.

Post a Comment

Previous Post Next Post