Telugu Film Chamber of Commerce Press Note on choreographer Jani Master

 ప్రెస్ నోట్



తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్స్ అండ్ డాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ లో సభ్యులైన కొరియోగ్రాఫర్ లైంగిక వేధింపుల ఫిర్యాదును  తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ కి ఇవ్వడం జరిగింది మరియు దానిని తెలుగు ఫిలిం ఛాంబర్ అఫ్ కామర్స్ లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్  కు సిఫార్సు చేయడం జరిగింది. అంతర్గత ఫిర్యాదు కమిటీ సమావేశం అయ్యి POSH చట్టం 2013 మార్గదర్శకాల ప్రకారం విచారణ కొనసాగుతుంది. భాదిత పక్షం పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫిర్యాదు చేసి FIR  నమోదు చేసారని మాకు తెలిసినది.

భాదిత పార్టీల గోప్యతను కాపాడాలని మేము అన్ని మీడియా సంస్థలను, ప్రింట్ మీడియా/ డిజిటల్ మీడియా/ ఎలక్ట్రానిక్ మీడియాలను అభ్యర్ధిస్తున్నాము.

సుప్రీం కోర్ట్ మార్గదర్శకాల ప్రకారం ఈ సమస్య పరిష్కరించబడే వరకు సంబంధిత వ్యక్తుల యొక్క ముసుగులు లేని ఫొటోగ్రాఫ్ లను మరియు వీడియోలను ఉపయోగించవద్దు అని మరియు ఏదైనా ఉపయోగించినట్లైతే వాటిని వెంటనే తీసివేయమని మీ అందరిని మరొకసారి అభ్యర్ధిస్తున్నాము.



(కె.ఎల్. దామోదర్ ప్రసాద్)

       గౌరవ కార్యదర్శి

Post a Comment

Previous Post Next Post