Supreme Hero Sai Durgha Tej Meets Telangana CM Revanth Reddy Generously donates Rs. 10 lakhs to Flood Relief Efforts

 వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేసిన సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్




తెలంగాణలో భారీ వర్షాలు, వరదలతో ఎంతోమంది ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వరదల వల్ల ఆస్తి, ప్రాణనష్టం సంభవించింది. వరద బాధిత ప్రజలను ఆదుకునేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషికి అండగా నిలబడ్డారు సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్. తన వంతు సహాయంగా 10 లక్షల రూపాయలు తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కోసం ప్రకటించారు. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని హైదరాబాద్ జుబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో కలిసి 10 లక్షల రూపాయల డొనేషన్ చెక్ అందించారు సాయి దుర్గతేజ్. ఈ సందర్భంగా వరద సహాయ చర్యలపై ముఖ్యమంత్రిని అడిగి తెలుసుకున్నారు సాయి దుర్గతేజ్. రేవంత్ రెడ్డి గారిని కలిసి మాట్లాడటం పట్ల తన సంతృప్తిని, సంతోషాన్ని వ్యక్తం చేశారు సాయి దుర్గతేజ్.


తెలంగాణతో పాటు ఏపీలోనూ వరద బాధితుల సహాయార్థం 10 లక్షల రూపాయల విరాళాన్ని ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు ప్రకటించి, ఆ మొత్తాన్ని మంత్రి లోకేష్ గారికి రీసెంట్ గా అందజేశారు సాయి దుర్గతేజ్. అలాగే విజయవాడలోని అమ్మ అనాథాశ్రమాన్ని స్వయంగా సందర్శిచి, వారి బాగోగులు తెలుసుకున్నారు. అమ్మ ఆశ్రమానికి 2 లక్షల రూపాయలు, ఇతర సేవా సంస్థలకు 3 లక్షల రూపాయల విరాళం అందించారు. సమాజం పట్ల, ఇబ్బందుల్లో ఉన్న ప్రజల పట్ల పెద్ద మనసుతో స్పందిస్తున్న సాయి దుర్గతేజ్ సేవా గుణానికి, మంచి మనసుకు ప్రతి ఒక్కరి ప్రశంసలు దక్కుతున్నాయి.

Post a Comment

Previous Post Next Post