Rebel star Prabhas Contributed 2 Crore Rupees to AP and Telangana for the relief of flood victims

 వరద బాధితుల సహాయార్థం ఏపీ, తెలంగాణకు 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించిన రెబెల్ స్టార్ ప్రభాస్



రెబెల్ స్టార్ ప్రభాస్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. భారీ వర్షాలు, వరదలతో ఇబ్బందులు పడుతున్న రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు అండగా నిలబడేందుకు ముందుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వరద బాధితుల సహాయార్థం ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ కు కోటి రూపాయలు, తెలంగాణకు కోటి రూపాయల చొప్పున ముఖ్యమంత్రి సహాయ నిధికి ప్రభాస్ డొనేషన్ ఇచ్చారు.


తెలుగు రాష్ట్రాలకే కాదు దేశంలో ఏర్పడే ప్రకృతి విపత్తుల పట్ల స్పందిస్తూ తన వంతు బాధ్యతగా భారీ విరాళాలు ఇస్తుంటారు ప్రభాస్. ఇటీవల కేరళ వయనాడ్ లో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో బాధితులను ఆదుకునేందుకు ప్రభాస్ 2 కోట్ల రూపాయల విరాళం ప్రకటించారు. ప్రభాస్ ప్రస్తుతం "ది రాజా సాబ్" మూవీతో పాటు హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ  భారీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నారు. మరికొన్ని క్రేజీ ప్రాజెక్ట్స్ ప్రభాస్ లైనప్ లో ఉన్నాయి.



Post a Comment

Previous Post Next Post