సుహాస్, దిల్‌రాజు ప్రొడక్షన్స్ ‘జనక అయితే గనక’ నుంచి లిరికల్ సాంగ్ ‘నువ్వే నాకు లోకం...’ రిలీజ్
‘ఓసారైనా చూడవే ఉండిపోవే ఉండిపోవే..
వింటావా నా మాటనే ఉండిపోవే ఉండిపోవే..
మనసే ఇరుకై నలిగా నేనే
గదిలో నువ్వు లేక
నిదుర కుదురు చెదిరిపోయే
నువ్విలా వదిలాక’
అంటూ దూరమైన భార్యపై తన ప్రేమను వ్యక్తం చేస్తున్న భర్త మనసులోని బాధ, ప్రేమ ఏంటో తెలుసుకోవాలంటే ‘జనక అయితే గనక..’ సినిమా చూడాల్సిందేనంటున్నారు మేకర్స్.
వెర్సటైల్ యాక్టర్ సుహాస్, సంగీర్తన హీరో హీరోయిన్లుగా రూపొందిన చిత్రం ‘జనక అయితే గనక’. శిరీష్ సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ పతాకంపై హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి నిర్మించారు. సందీప్ రెడ్డి బండ్ల డైరక్ట్ చేశారు. ఈ సినిమాను దసరా సందర్భంగా అక్టోబర్ 12న విడుదల చేస్తున్నారు.
బలగం వంటి ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను అందించిన దిల్ రాజు ప్రొడక్షన్స్ నుంచి మరోసారి అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా ‘జనక అయితే గనక’ విడుదలవుతుంది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, సాంగ్స్‌కు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం నుంచి ‘నువ్వే నాకు లోకం...’ అనే లిరికల్ సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. విజయ్ బుల్గానిన్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రంలోని ఈ పాటను కృష్ణకాంత్ రాయగా.. కార్తీక్ పాడారు.