Nandamuri Mohanakrishna and Nandamuri Mohan Roopa today donated 25 lakhs to AP Chief Minister Shri Nara Chandrababu Naidu to help the flood victims of Andhra Pradesh

ఆంధ్ర ప్రదేశ్ వరద బాధితులకు తమ వంతు సహాయంగా నందమూరి మోహనకృష్ణ గారు, నందమూరి మోహన్ రూప గారు నేడు ఏపీ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి 25 లక్షల విరాళం అందజేశారు



ఆంధ్రప్రదేశ్ లో ఇటీవలే భారీ వర్షాల వల్ల వరదలు రావడం జరిగింది. ముఖ్యంగా విజయవాడలోని బుడమేరు పొంగడంతో భారీ నష్టం వాటిలల్లింది. అయితే ఈ వరద బాధితులకు ఇప్పటికే ఎందరో సినీ ప్రముఖులు అండగా నిలిచారు. నందమూరి మోహన్ కృష్ణ గారు ఫిలిమ్ ఇన్స్టిట్యూట్లో చదివే రోజుల్లో గోల్డ్ మెడలిస్ట్. అంతేకాక నందమూరి తారక రామారావు గారు నటించిన బ్రహ్మంగారి చరిత్ర, అనురాగ దేవత, చండశాసనుడు, నందమూరి బాలకృష్ణ గారు నటించిన పలు సినిమాలకు, విక్టరీ వెంకటేష్ గారు నటించిన శ్రీనివాస కళ్యాణం, అదే విధంగా తమిళ్ లో శివాని గణేషన్ గారు, ప్రభు గారు నటించిన చరిత్ర నాయగన్, హిందీ లో ఫరూక్ షేక్ గారు నటించిన గర్వాలి బాహర్వాలి సినిమాలకు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీ గా, పలు సినిమాలకు  నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా వ్యవహరించారు. నందమూరి మోహన కృష్ణ గారు మరియు ఆయన కుమార్తె నందమూరి మోహన రూప గారు తమ వంతు సహాయంగా వరద బాధితుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 25 లక్షలు విరాళంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని తామే స్వయంగా కలిసి తమ చేతులతో 25 లక్షల రూపాయల చెక్కును అందజేయడం జరిగింది.


గతంలో కూడా నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి మోహన్ రూప గారు ఇదే విధంగా ఎంతోమందికి సహాయం చేయడం జరిగింది. టిటిడి అన్నదాన ట్రస్ట్ కు విరాళాలు ఇచ్చారు. నందమూరి మోహన్ రూప గారు గత ఎన్నికలలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో తెలుగుదేశం పార్టీ తరఫున చాలా చురుకుగా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారు.


Post a Comment

Previous Post Next Post