Mowgli First Look Poster Unveiled Theatrical Release In Summer 2025

 రోషన్ కనకాల, సందీప్ రాజ్, TG విశ్వ ప్రసాద్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ మూవీ టైటిల్ మోగ్లీ – ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్, 2025 సమ్మర్ లో థియేట్రికల్ విడుదల



పీపుల్ మీడియా ఫ్యాక్టరీ విజనరీ ప్రొడ్యూసర్ టిజి విశ్వ ప్రసాద్ వినాయక చతుర్థి శుభ సందర్భంగా ఎక్సయిటింగ్ న్యూ ప్రాజెక్ట్‌ను అనౌన్స్ చేశారు. తన తొలి చిత్రం కలర్ ఫోటో తో జాతీయ అవార్డును గెలుచుకున్న దర్శకుడు సందీప్ రాజ్, ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో లవ్ స్టొరీ కోసం యంగ్ ట్యాలెంటెడ్ రోషన్ కనకాలతో కలిసి పని చేయబోతున్నారు.


యంగ్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సందీప్ రాజ్, ఈ సినిమా కోసం మరోక అద్భుతమైన కథను రెడీ చేశారు. రోషన్ కనకాల, తన పెర్ఫార్మెన్స్, డ్యాన్స్ లతో ప్రశంసలు అందుకున్నారు. మోగ్లీ పేరుతో రాబోతున్న ఈ చిత్రంలో యూనిక్ రోల్ లో కనిపించనున్నారు.


రోషన్ కనకాల వెస్ట్ ధరించి, సాలిడ్ ఫిజిక్, దట్టమైన అడవిలో గుర్రంతో పాటు చిరునవ్వుతో కనిపించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ అదిరిపోయింది. విజువల్ గా పోస్టర్ కట్టిపడేసింది.  

 

ఈ చిత్రానికి ప్రముఖ టెక్నిషియన్స్ పని చేస్తున్నారు, కలర్ ఫోటో కు సక్సెస్ఫుల్ ఆల్బమ్‌ అందించిన కాల భైరవ సంగీతం సందిస్తున్నారు. బాహుబలి1 & 2,RRR వంటి బ్లాక్‌బస్టర్ ప్రాజెక్ట్‌లకు చీఫ్ అసోసియేట్ సినిమాటోగ్రాఫర్ రామ మారుతి M, సినిమాటోగ్రఫీని నిర్వహిస్తారు. కలర్ ఫోటో, మేజర్,అప్ కమింగ్ గూఢచారి 2 హిట్ చిత్రాలకు ఎడిటర్ అయిన పవన్ కళ్యాణ్ ఈ చిత్రానికి ఎడిట్ చేయనున్నారు.


'మోగ్లీ'ని 2025 సమ్మర్ లో విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు. 


తారాగణం: రోషన్ కనకాల

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: సందీప్ రాజ్

నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్

బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

సంగీతం: కాల భైరవ

డీవోపీ: రామ మారుతి M

ఎడిటర్: పవన్ కళ్యాణ్

పీఆర్వో: వంశీ-శేఖర్


Post a Comment

Previous Post Next Post