‘మిస్టర్ సెలెబ్రిటీ’ నుంచి ‘నీ జతగా’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేసిన మాచో స్టార్ గోపీచంద్
ప్రస్తుతం కొత్త తరం తీస్తున్న, నటిస్తున్న చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవుతున్నాయి. కొత్త కాన్సెప్ట్, కథలకే ఆడియెన్స్ మొగ్గు చూపుతున్నారు. ఈ క్రమంలో సుదర్శన్ పరుచూరి హీరోగా మిస్టర్ సెలెబ్రిటీ అనే సినిమా రాబోతోన్న సంగతి తెలిసిందే. ఆర్‌పి సినిమాస్ బ్యానర్ మీద చిన్న రెడ్డయ్య, ఎన్. పాండు రంగారావు నిర్మాతలుగా రాబోతోన్న ఈ మూవీకి చందిన రవి కిషోర్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు వంటి వారు ముఖ్య పాత్రలను పోషించారు. ఇది వరకు మిస్టర్ సెలెబ్రిటీ నుంచి రిలీజ్ చేసిన పోస్టర్, టీజర్, పాటలు ఇలా అన్నీ కూడా ఆడియెన్స్‌ను ఆకట్టుకున్నాయి.
తాజాగా మిస్టర్ సెలెబ్రిటీ నుంచి ఓ మెలోడీ పాటను మాచో స్టార్ గోపీచంద్ రిలీజ్ చేశారు. నీ జతగా అంటూ సాగే ఈ మెలోడీ పాటను గణేశా రచించగా.. జావెద్ అలీ ఆలపించారు. వినోద్ యాజమాన్య చక్కటి సోల్ ఫుల్ బాణీని అందించారు. ఇక ఈ పాటను రిలిజ్ చేసిన అనంతరం గోపీచంద్ మాట్లాడుతూ.. ‘పరుచూరి వెంకటేశ్వరరావు గారి మనవడు హీరోగా చేస్తున్నాడు. ఈ మూవీ టీజర్‌ను చూశాను. చాలా బాగుంది. ఇప్పుడు పాటను రిలీజ్ చేశాను. అది కూడా చాలా బాగుంది. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్. చిత్రం పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.
ఇక త్వరలోనే మిస్టర్ సెలెబ్రిటీ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఆడియెన్స్ ముందుకు రాబోతోంది.
తారాగణం: వరలక్ష్మి శరత్ కుమార్, సుదర్శన్ పరుచూరి, శ్రీ దీక్ష, నాజర్, రఘుబాబు తదితరులు
సాంకేతిక వర్గం
బ్యానర్ - RP సినిమాస్
నిర్మాత -చిన్న రెడ్డయ్య, ఎన్.పాండురంగారావు
రచయిత, దర్శకుడు - చందిన రవి కిషోర్
కెమెరామెన్ - శివ కుమార్ దేవరకొండ
సంగీతం - వినోద్ యజమాన్య
పాటలు - గణేష్, రాంబాబు గోసాల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - వెంకట్ రెడ్డి
ఎడిటర్ - శివ శర్వాణి
పీఆర్వో - సాయి సతీష్
Post a Comment