#Karthi29 announced

 Karthi, Tamizh, Dream Warrior Pictures’ next magnum opus #Karthi29 announced


కార్తీ, 'తానక్కరన్' ఫేం తమిళ్‌, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మాగ్నమ్ ఓపస్ #కార్తీ29 అనౌన్స్ మెంట్


డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ధీరన్ అధిగారం ఒండ్రు, అరువి, ఖైదీ, ఒకే ఒక జీవితం, ఫర్హానా వంటి ప్రతిష్టాత్మక సినిమాలతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. అద్భుతమైన కథలతో, ఎక్స్ ట్రార్డినరీ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని అలరిస్తున్న హీరో కార్తి. ఇప్పుడు, కార్తీ, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ తమ నెక్స్ట్ ప్రాజెక్ట్ #కార్తీ 29కి డైరెక్టర్ చేయడానికి కి టాలెంటెడ్ డైరెక్టర్ తమిళ్‌ని ఎంచుకున్నారు. ఈ పీరియాడికల్ ఫిల్మ్ భారీ స్థాయిలో తెరకెక్కనుంది. విమర్శకుల ప్రశంసలు పొందిన తానాఅక్కరన్‌తో మూవీతో తమిళ్ అందరినీ ఆకట్టుకున్నారు.  


ఎస్ఆర్ ప్రకాష్‌బాబు, ఎస్ఆర్ ప్రభు నేతృత్వంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్, కార్తీ కలిసి తీరన్ అధిగారం ఒండ్రు, ఖైదీ, సుల్తాన్ వంటి క్లాసిక్ బ్లాక్‌బస్టర్‌లను అందించడంతో పాటు కాష్మోరా, జపాన్ వంటి ప్రయోగాత్మక చిత్రాలతో అలరించారు. ఇప్పుడు వీరి కాంబినేషన్ లో ఈ సినిమాపై భారీ అంచనాలు వున్నాయి.


మాగ్నమ్ ఓపస్  #కార్తీ29ని డ్రీమ్ వారియర్ పిక్చర్స్‌తో పాటు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా,  రాజా సుబ్రమణియన్ నేతృత్వంలోని ఐవీ ఎంటర్‌టైన్‌మెంట్, B4U మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తాయి.


ఈ సినిమాను 2025లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. #కార్తీ29  ఇతర తారాగణం, టెక్నికల్ టీం అప్‌డేట్‌లను ప్రొడక్షన్ హౌస్ త్వరలో తెలియజేస్తుంది.


తారాగణం: కార్తీ

సాంకేతిక సిబ్బంది:

రచన, దర్శకత్వం: తమిళ్

నిర్మాతలు: SR ప్రకాష్ బాబు, SR ప్రభు, ఇషాన్ సక్సేనా, సునీల్ షా , రాజా సుబ్రమణియన్

బ్యానర్లు: డ్రీమ్ వారియర్ పిక్చర్స్, ఐవీ ఎంటర్టైన్మెంట్, B4U మోషన్ పిక్చర్స్

పీఆర్వో: వంశీ-శేఖర్


Post a Comment

Previous Post Next Post