Brahmanandam Received IIFA award From MegaStar Chiranjeevi

 మెగాస్టార్ చిరంజీవి చేతుల మీదుగా బ్రహ్మానందం కు ఐఫా అవార్డ్ !!!



క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రాజ్యశ్యామల ఎంటర్ట్సైన్మెంట్స్ & హౌస్ ఫుల్ మూవీస్ బ్యానర్ పై గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం రంగమార్తాండ. విమర్శకుల ప్రసంశలు పొందిన ఈ చిత్రంలో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం పోటీపడి నటించారు. దర్శకుడు కృష్ణవంశీ ఈ సినిమాను తీర్చి దిద్దిన తీరు అద్భుతం.


ఇళయరాజా సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి సాహిత్యం ఇలా సినిమాకు ప్రతీది ఒక హైలెట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్ హాస్పిటల్ ఎపిసోడ్ సినిమా చూసిన పతి ఒక్కరిని కంటతడి పెట్టించాయి. అలా చక్రపాణి, రాఘవరావు పాత్రలు కొంతకాలం ప్రేక్షకుల మనసులో చారగని ముద్ర వేసుకున్నాయి.


తాజాగా దుబాయ్ లో జరిగిన ఐఫా అవార్డ్స్ కార్యక్రమంలో లెజండరీ నటుడు బ్రహ్మానందం కు ఉత్తమ సపోర్టింగ్ కేటగిరీలో అవార్డ్ రావడం విశేషం. ఈ అవార్డ్ ను మెగాస్టార్ చిరంజీవి చేతులమీదుగా బ్రహ్మానందం అందుకున్నారు. "ఈ అవార్డ్ రావడం తనకు సంతోషాన్ని ఇచ్చిందని, ఈ క్రెడిట్ మొత్తం డైరెక్టర్ కృష్ణవంశీకి చెందుతుందని, రంగమార్తాండ చిత్ర యూనిట్ సభ్యులు అందరికి అభినందనలు, మంచి సినిమాలో మంచి పాత్రతో ఆడియన్స్ ను రంజింపచే అవకాశం రావడం మర్చిపోలేని అనుభూతి" అని బ్రహ్మానందం తెలిపారు.

Post a Comment

Previous Post Next Post