Telugu Film Industry Employees Federation General Secretary Kanumilli Ammiraju Swearing Ceremony Event Held Grandly

 తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి పదవీ ప్రమాణ స్వీకార మహోత్సవం



తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ కొత్త ప్రధాన కార్యదర్శిగా అమ్మిరాజు కానుమిల్లి ఎన్నికయ్యారు. ఆదివారం జరిగిన ఎన్నికలో అమీరాజు 35 ఓట్ల తేడాతో నిర్ణయాత్మక విజయం సాధించారు. అతని విజయం ఫెడరేషన్ నాయకత్వంలో గణనీయమైన మార్పును సూచిస్తుంది. గతంలో, దొరై జనరల్ సెక్రటరీ పదవిని నిర్వహించారు కానీ ఇటీవలి మేనేజర్ ఎన్నికలలో ఎదురుదెబ్బలు ఎదుర్కొన్నారు, ఇది పాత్ర నుండి అనర్హతకు దారితీసింది. ఫెడరేషన్ నిబంధనల ప్రకారం దొరై అనర్హత కారణంగా జనరల్ సెక్రటరీ స్థానానికి కొత్త ఎన్నిక అవసరం. దీంతో అభ్యర్థుల మధ్య పోటీ లో అమ్మి రాజు కానుమిల్లి  విజయం సాధించారు ...



బుధవారం  తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫీస్ లో అధ్యక్షులు  వల్లభనేని  అనిల్  కుమార్ అధర్వం లో అమ్మిరాజు కానుమిల్లి పదవీ ప్రమాణ స్వీకార కార్యాక్రమం ఘనంగా జరిగింది ...  

 అమ్మిరాజు  కానుమిల్లి  మాట్లాడుతూ ...

నన్ను అత్యధిక  మెజారిటీతో గెలిపించిన గౌరవ  జనరల్ కౌన్సిల్ సభ్యులకు నా నమస్సుమాంజలి తెలియజేస్తూ , కార్మికుల హక్కుల కోసం ఐక్యత కోసం పోరాడతానని నన్ను నమ్మి నాకు అప్పగించిన ఈ బాధ్యతను మీ అందరి సహకారంతో నిర్వర్తిస్తానని  అమ్మిరాజు కానుమిల్లి  అన్నారు..

 ఈ కార్యకరం లో  అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్, కోశాధికారి సురేష్ ,  డైరెక్టర్ న, శంకర్  హీరో అల్లరి నరేష్ , కామిడీయన్ హైపర్ ఆది , హరినాథ్ ,సాంభశివరావు , మల్లెల సీతారామ రాజు ,బాదారు బాబీ  తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

Previous Post Next Post