Super Star Mahesh babu Providing Telugu voice for ‘MUFASA

 డిస్నీ ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్- ట్రైలర్ రిలీజ్  



2019లో  లైవ్-యాక్షన్ ది లయన్ కింగ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని కొనసాగిస్తూ, విజువల్‌గా అద్భుతమైన లైవ్ యాక్షన్ ముఫాసా: ది లయన్ కింగ్ విడుదలకు సిద్ధంగా ఉంది. ‘ముఫాసా’కి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఇస్తున్నారు. ఆయనతో  ప్రముఖ నటులు బ్రహ్మానందం పుంబా, అలీ టిమోన్‌ పాత్రలు వాయిస్ ఇస్తున్నారు.


రాజుకి సంబంధించిన పురాణ గాథను రఫీకి వివరిస్తున్నట్లు ట్రైలర్‌లో ప్రజెంట్ చేశారు. ఈ కథ ముఫాసా అనే ఆర్ఫన్ కబ్ ని, రాజ వారసత్వం కలిగిన దయగల సింహం టాకాను పరిచయం చేస్తుంది. వారు ఒక అద్భుతమైన బ్యాండ్ ఆఫ్ మిస్‌ఫిట్‌లతో గొప్ప జర్నీ ని  ప్రారంభిస్తారు.


మహేష్ బాబు మ్యాజికల్ వాయిస్ ప్రత్యేక ఆకర్షణగా నిలవగా, బ్రహ్మానందం, అలీ స్వరాలు ప్లజెంట్ గా వున్నాయి.


దర్శకుడు బారీ జెంకిన్స్ డైరెక్షన్ లో వాల్ట్ డిస్నీ నిర్మించిన ముఫాసా: ది లయన్ కింగ్ డిసెంబర్ 20, 2024న  ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు భాషల్లో  ఇండియన్ థియేటర్లలో విడుదల కానుంది.


Post a Comment

Previous Post Next Post